గ్రామీణ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘భీమదేవరపల్లి బ్రాంచి’. డా. బత్తిని కీర్తిలతా గౌడ్, రాజా నరేందర్ చెట్లపెల్లి నిర్మించిన ఈ చిత్రంలో ‘బలగం’ ఫేమ్ సుధాకర్ రెడ్డి, అంజి వల్గమాన్, సాయి ప్రసన్న, అభి, రూప ప్రధాన పాత్రల్లో నటించారు. రమేష్ చెప్పాల రచన–దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మైత్రీ మూవీస్ ద్వారా ఈ నెల 23న రిలీజ్ కానుంది.
‘‘ఒక మారుమూల గ్రామంలో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం అయింది. ఆ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. సహజమైన పాత్రలతో నవ్విస్తూనే భావోద్వేగానికి గురి చేసేలా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా కంటెంట్ నచ్చి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చింది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment