
ఈజీ మనీ కోసం బెట్టింగ్ యాప్స్ (Betting App Case) ప్రమోట్ చేసినవారిపై పోలీసులు వరుస కేసులు నమోదు చేస్తున్నారు. ఈ జాబితాలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, నటీనటులు ఉన్నారు. ఈ క్రమంలోనే నటి సురేఖావాణి కూతురు సుప్రీత (Supritha), టేస్టీ తేజ, రీతూ చౌదరి వంటివారు తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశామని లెంపకాయలు వేసుకున్నారు. ఇకపై దాని జోలికి వెళ్లమని.. ఎవరూ బెట్టింగ్ యాప్స్‌ను నమ్మొద్దని వీడియోలు రిలీజ్ చేశారు.
అడిగారు.. చేశాం.. అంతే!
ఇదిలా ఉంటే బెట్టింగ్ యాప్స్ వ్యవహారం గురించి ప్రశ్నించిన యాంకర్‌తో నటి సురేఖావాణి (Surekha Vani) దురుసుగా మాట్లాడింది. అందుకు సంబంధించిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయమని ఎవరు అప్రోచ్ అయ్యారు? అని యాంకర్ అడిగింది. అందుకు సురేఖ.. మేము బెట్టింగ్ యాప్స్‌ను పెద్దగా ప్రమోట్ చేయలేదమ్మా.. వాళ్ల పోస్టులను రీపోస్ట్ చేయమంటే చేశామంతే! అని బదులిచ్చింది.
తెలీక చేశాం.. సారీ చెప్పాం
బెట్టింగ్ యాప్స్ గురించి తెలియనప్పుడు అలా పోస్టులు చేసి మళ్లీ ఇప్పుడెందుకు సారీ చెప్తున్నారు? అని యాంకర్ ప్రశ్నించింది. తెలియకుండా చేశాం కాబట్టే సారీ చెప్పాం.. అయినా తెలియకుండా ఎందుకు చేశారు? అంటున్నారు.. తెలీదు కాబట్టే చేశాం కదా.. మళ్లీ ఇదేం ప్రశ్న? అని సీరియస్ అయింది. పోస్టులో ఏముందో తెలుసుకోకుండా రీపోస్ట్ చేయొద్దు కదా? అని యాంకర్ అంటుంటే అందుకే కదా సారీ చెప్పింది అని సురేఖ విసుక్కుంది.
మాకింకా తెల్లారలేదు.. విసుక్కున్న సురేఖ
అంటే తెలియకుండానే ఆ యాప్స్ ప్రమోట్ చేశారంటారు.. అని యాంకర్ అడుగుతుంటే.. మీకు తెల్లారిందేమో.. కానీ మాకింకా తెల్లారలేదమ్మా.. నేను తర్వాత మాట్లాడతా.. అని ఫోన్ కట్ చేసింది. ఇకపోతే బెట్టింగ్ యాప్స్ కేసులో బుల్లితెర స్టార్స్‌తో పాటు విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, రానా, నిధి అగర్వాల్ వంటి టాలీవుడ్ స్టార్స్ సైతం ఉన్నారు.
చదవండి: బెట్టింగ్ యాప్స్ కేసు: విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మిపై కేసు!
Comments
Please login to add a commentAdd a comment