అర్జున్ రెడ్డి సినిమాతో దశ తిరిగిన హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగారు. ఈ సినిమా సక్సెస్‌తో పెద్ద నిర్మాణ సంస్థల్లో అవకాశాలు వరుస కట్టాయి. గీతా ఆర్ట్స్‌లో రెండు, మైత్రీ మూవీస్‌లో ఒకటి, తెలుగు తమిళ భాషల్లో మరో సినిమాను పట్టాలెక్కించారు.
విజయ్ సినిమాల్లో ప్రస్తుతం ట్యాక్సీవాలా విడుదలకు రెడీగా ఉంది. గీతా గోవిందం సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇవి రెండు గీతా ఆర్ట్స్ సంస్థలో తెరకెక్కుతున్నాయి. ఇక మైత్రీ మూవీ బ్యానర్‌లో డియర్ కామ్రెడ్ అనే సినిమాను చేయబోతున్నారు. రేపు ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. రేపు (జూలై 2) ఉదయం పది గంటలకు ఈ కార్యక్రమం మొదలుకానుంది. ఈ సినిమాకు భరత్ కమ్మ దర్శకత్వం వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment