అజిత్ సినిమా కోసం నాగ చైతన్య, విజయ్‌ దేవరకొండ, జాన్వీ కపూర్‌ | Valimai Posters Launched Naga Chaitanya Vijay Devarakonda Jahnvi Arjun | Sakshi
Sakshi News home page

Valimai Movie: అజిత్‌ 'వలిమై' తెలుగు, హిందీ పోస్టర్లు విడుదల.. ఆవిష్కరించిన హీరోలు

Published Wed, Jan 5 2022 8:07 PM | Last Updated on Wed, Jan 5 2022 8:09 PM

Valimai Posters Launched Naga Chaitanya Vijay Devarakonda Jahnvi Arjun - Sakshi

Valimai Posters Launched Naga Chaitanya Vijay Devarakonda Jhanvi Arjun: తమిళ స్టార్ హీరో అజిత్‌ తెలుగులోనూ అనేక అభిమానులను సంపాదించుకున్నాడు. ఆయన నటన, యాక్షన్‌ సీన్స్‌, ముఖ్యంగా బైక్‌ రైడింగ్‌లో అజిత్‌ను చూస్తే సగటు అభిమానికి పూనకం రాకుండా ఉండదు. అజిత్‌ తాజా చిత్రం 'వలిమై'లో బైక్‌ చేజింగ్ సీన్స్‌తో తన అభిమానులకు మళ్లీ పూనకాలు తెప్పించే  ప్రయత్నం చేస్తున్నాడు ఈ హీరో. హెచ్‌ వినోద్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో జనవరి 13న రిలీజ్‌ కానుంది. అయితే ఇప్పటివరకూ తమిళ పోస్టర్‌, ట్రైలర్‌ను మాత్రమే విడుదల చేసింది ఈ  చిత్ర బృందం.

ఇదీ చదవండి: ఆకట్టుకుంటున్న అజిత్‌ కుమార్‌ ‘వాలిమై’ మూవీ ట్రైలర్‌

తాజాగా బుధవారం (జనవరి 5) తెలుగు టైటిల్‌తో కూడిన విడుదల తేది పోస్టర్‌ రిలీజ్ చేశారు మేకర్స్‌. ఈ పోస్టర్‌ను టాలీవుడ్‌ గుడ్‌బాయ్‌ నాగచైతన్య, రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. 'నేను అజిత్‌ సర్‌కి పెద్ద అభిమానిని. ఆయన సినిమా పోస్టర్‌ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది' అని రాసుకొచ్చాడు చై. 'అజిత్‌ గారు, మై బ్రదర్‌ కార్తికేయ, చిత్ర బృందం అందరికీ ఆల్‌ ది వెరీ బెస్ట్‌' అని విజయ్ ట్వీట్‌ చేశాడు. అలాగే వలిమై హిందీ పోస్టర్‌లను బాలీవుడ్ నటులు అర్జున్‌ కపూర్‌, జాన్వీ కపూర్‌ విడుదల చేశారు. సినిమా మంచి విజయం అందుకోవాలని వారంతా ఆకాంక్షించారు. 
 


ఈ పోస్టర్‌లలో అజిత్‌ తుపాకీ పట్టుకుని సీరియస్‌ కనిపించాడు. యాక్షన్‌ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌ సంస్థతో కలిసి బోనీ కపూర్‌ నిర్మించారు. ఇందులో విలన్‌గా కార్తికేయ నటించగా.. బాలీవుడ్‌ నటి హ్యూమా ఖురేషి హీరోయిన్ అని తెలుస్తోంది. 
 

ఇదీ చదవండి: దీపికా బర్త్‌డే.. ప్రభాస్‌, సమంతల స్వీటెస్ట్‌ విషెస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement