posters released
-
Yatra 2 Update: ఒక్కటి గుర్తు పెట్టుకోండి!
‘నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు.. కానీ, ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని’ అంటూ ‘యాత్ర 2’ సినిమా పోస్టర్ని విడుదల చేసింది చిత్రయూనిట్. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్‌గా డైరెక్టర్ మహీ వి. రాఘవ్ తెరకెక్కించిన ‘యాత్ర’ (2019) సినిమా మంచి విజయం అందుకుంది. ‘యాత్ర’ కి సీక్వెల్‌గా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బయోపిక్‌తో ‘యాత్ర 2’ ఉంటుందని మహీ వి.రాఘవ్ గతంలోనే ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నెల 8న వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ‘యాత్ర 2’ అప్డేట్ ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే వారం ముందే అప్డేట్ ఇచ్చి సర్ప్రైజ్ చేసింది చిత్రయూనిట్. మహీ వి.రాఘవ్ దర్శకత్వంలో వి.సెల్యులాయిడ్‌పై శివ మేక నిర్మించనున్న ఈ సినిమాని 2024 ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నట్లు ఓ పోస్టర్ని విడుదల చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో 2009 నుంచి 2019 వరకు జరిగిన ఘటనల నేపథ్యంలో ‘యాత్ర 2’ కథ సాగుతుంది. ఇందులో జగన్ పాత్రలో ‘రంగం’ మూవీ ఫేమ్ జీవా నటించనున్నారు. ఆగస్టు 3 నుంచి ‘యాత్ర 2’ షూటింగ్ మొదలవుతుంది. -
పోస్టర్ చూద్దాం.. ఉగాది సందర్భంగా బోలెడన్ని కొత్త పోస్టర్లు రిలీజ్
పండగ చేద్దాం.. పోస్టర్ చూద్దాం అన్నట్లు ఉగాది సందర్భంగా బోలెడన్ని కొత్త పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. వాటిలో కొన్ని పోస్టర్లను చూద్దాం. ♦ వెంకటేశ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెడికల్ మాఫియా నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోందనే టాక్ వినిపిస్తోంది. ♦ పల్లకి మోస్తున్నారు గోపీచంద్. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘రామబాణం’. ఈ చిత్రంలో డింపుల్ హయతి హీరోయిన్. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ సినిమా మే 5న విడుదల కానుంది. ♦ నాగచైతన్య పోలీస్‌గా నటిస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘కస్టడీ’. కృతీ శెట్టి హీరోయిన్. వెంకట్ ప్రభు దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 12న రిలీజవుతుంది. ♦ కల్యాణ్ రామ్ టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘డెవిల్: ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’. నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ సినిమాను అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ♦ ‘మామా మశ్చింద్ర’ చిత్రంలో ట్రిపుల్ క్యారెక్టర్స్ చేస్తున్నారు సుదీర్‌బాబు. దర్శక–నటుడు హర్షవర్థన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో దుర్గ, పరశురామ్, డీజే పాత్రల్లో కనిపిస్తారు సుధీర్‌బాబు. సునీల్ నారంగ్, పుసూ్కర్ రామ్మోహన్రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ♦ సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న మిస్టిక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 21న విడుదల కానుంది. ♦ వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘అర్జునదారి గాండీవ’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ♦ కార్తికేయ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బెదురులంక 2012’. 2012 యుగాంతం కాన్సెప్ట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు క్లాక్స్ దర్శకత్వం వహించారు. నేహా శెట్టి హీరోయిన్గా నటించారు. ఈ చిత్రానికి ముప్పానేని రవీంద్ర బెనర్జీ నిర్మాత. ♦ పోలీసాఫీసర్‌గా కిరణ్ అబ్బవరం నటించిన చిత్రం ‘మీటర్’. అతుల్యా రవి హీరోయిన్గా నటించారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ల సమర్పణలో చెర్రీ (చిరంజీవి), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 7న విడుదల కానుంది. ♦ దగ్గుబాటి అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు తేజ తెరకెక్కించిన చిత్రం ‘అహింస’. గీతికా తివారి ఈ చిత్రంలో హీరోయిన్గా నటించారు. పి. కిరణ్ నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదల కానుంది. ♦ ‘రౌడీబాయ్స్’ ఫేమ్ ఆశిష్ హీరోగా రూపొందుతున్న ద్వితీయ చిత్రం ‘సెల్ఫీష్ ’. ఈ చిత్రానికి విశాల్ కాశి దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్, సుకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్ బండ్రెడ్డి సహనిర్మాతలు. ♦ రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘జనతా బార్’. రమణ మొగిలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. వచ్చే నెలలో విడుదల కానున్న ఈ సినిమాను రమణ మొగిలి, తిరుపతిరెడ్డి బీరం నిర్మించారు. ‘‘స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకున్న మహిళలపై ఆ స్పోర్ట్స్ ఉన్నతాధికారులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్న సెక్సువల్ హెరాస్‌మెంట్‌కు చరమగీతం పాడటానికి పోరాడిన ఓ మహిళ కథ ఇది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
రహదారి భద్రత పోస్టర్లు విడుదల చేసిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సోమవారం జరిగిన రాష్ట్ర రహదారి భద్రతా మండలి సమావేశంలో ‘ది ఎబిలిటీ పీపుల్’ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ దిలీప్ పాత్రో పాల్గొన్నారు. ప్రమాద బాధితులను ఆదుకోవడానికి, ప్రజల్లో చైతన్యం కలిగించడానికి తాను చేపడుతున్న కార్యక్రమాలను దిలీప్ పాత్రో ఈ సందర్భంగా సీఎం జగన్‌కు వివరించారు. అనంతరం దీనికి సంబంధించిన పోస్టర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేశారు. చదవండి: (పార్టీ కార్యకర్త వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్) -
అజిత్ సినిమా కోసం నాగ చైతన్య, విజయ్ దేవరకొండ, జాన్వీ కపూర్
Valimai Posters Launched Naga Chaitanya Vijay Devarakonda Jhanvi Arjun: తమిళ స్టార్ హీరో అజిత్ తెలుగులోనూ అనేక అభిమానులను సంపాదించుకున్నాడు. ఆయన నటన, యాక్షన్ సీన్స్, ముఖ్యంగా బైక్ రైడింగ్‌లో అజిత్‌ను చూస్తే సగటు అభిమానికి పూనకం రాకుండా ఉండదు. అజిత్ తాజా చిత్రం 'వలిమై'లో బైక్ చేజింగ్ సీన్స్‌తో తన అభిమానులకు మళ్లీ పూనకాలు తెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు ఈ హీరో. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో జనవరి 13న రిలీజ్ కానుంది. అయితే ఇప్పటివరకూ తమిళ పోస్టర్, ట్రైలర్‌ను మాత్రమే విడుదల చేసింది ఈ చిత్ర బృందం. ఇదీ చదవండి: ఆకట్టుకుంటున్న అజిత్ కుమార్ ‘వాలిమై’ మూవీ ట్రైలర్ తాజాగా బుధవారం (జనవరి 5) తెలుగు టైటిల్‌తో కూడిన విడుదల తేది పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌ను టాలీవుడ్ గుడ్‌బాయ్ నాగచైతన్య, రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. 'నేను అజిత్ సర్కి పెద్ద అభిమానిని. ఆయన సినిమా పోస్టర్‌ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది' అని రాసుకొచ్చాడు చై. 'అజిత్ గారు, మై బ్రదర్ కార్తికేయ, చిత్ర బృందం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్' అని విజయ్ ట్వీట్ చేశాడు. అలాగే వలిమై హిందీ పోస్టర్లను బాలీవుడ్ నటులు అర్జున్ కపూర్, జాన్వీ కపూర్ విడుదల చేశారు. సినిమా మంచి విజయం అందుకోవాలని వారంతా ఆకాంక్షించారు. My absolute pleasure to launch the Telugu poster of #AjithKumar sir’s #Valimai being a huge fan myself! wishing the team all the very best @BoneyKapoor #HVinoth @thisisysr @BayViewProjOffl @ZeeStudios_ @sureshchandraa @ActorKartikeya #NiravShah @humasqureshi #ValimaiFromPongal pic.twitter.com/pDUsz6d2oM — chaitanya akkineni (@chay_akkineni) January 4, 2022 Wishing #AjithKumar garu, my Brother @ActorKartikeya and the entire team all the very best! @BoneyKapoor #HVinoth @thisisysr @BayViewProjOffl @ZeeStudios_ @sureshchandraa #NiravShah #Valimai in Telugu, Tamil and Hindi. #ValimaiFromJan13 pic.twitter.com/6YHfx5Ycjh — Vijay Deverakonda (@TheDeverakonda) January 4, 2022 ఈ పోస్టర్లలో అజిత్ తుపాకీ పట్టుకుని సీరియస్ కనిపించాడు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సంస్థతో కలిసి బోనీ కపూర్ నిర్మించారు. ఇందులో విలన్‌గా కార్తికేయ నటించగా.. బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి హీరోయిన్ అని తెలుస్తోంది. View this post on Instagram A post shared by Arjun Kapoor (@arjunkapoor) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) ఇదీ చదవండి: దీపికా బర్త్‌డే.. ప్రభాస్, సమంతల స్వీటెస్ట్ విషెస్ -
ప్రేక్షకులకు పండగ కానుక.. కొత్త కళలు
సన్ ఆఫ్ ఇండియా సింగిల్‌గా వచ్చాడు.. నారప్ప ఫ్యామిలీతో ఎంట్రీ ఇచ్చాడు.. ప్రేమికుడు విక్రమాదిత్య ప్రేమలోకంలో విహరిస్తున్నట్లు కనిపించాడు.. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జనాల్లోంచి గాల్లో పైకి లేచారు.. టక్ జగదీష్ కుటుంబ సభ్యుల మధ్య నవ్వులు చిందించాడు... ఇలా ఉగాది సందర్భంగా నిర్మాణంలో ఉన్న చిత్రాల ఫస్ట్ లుక్స్, కొత్త పోస్టర్లు విడుదలై, పండగ కళ తెచ్చాయి. ఆ విశేషాలు డా. మోహన్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. టైటిల్‌ని బట్టి దేశం మీద ప్రేమ ఉన్న వ్యక్తిగా న్యాయం కోసం పోరాడే పాత్రలో మోహన్‌బాబు కనిపిస్తారని ఊహించవచ్చు. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని విష్ణు మంచు నిర్మిస్తున్నారు. నారప్పగా వెంకటేశ్ గెటప్ ఎలా ఉంటుందో ఇప్పటికే మనం చూశాం. పండగకి తన భార్య సుందరమ్మతో కలిసి వచ్చారు నారప్ప. సుందరమ్మ పాత్రను ప్రియమణి చేశారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను నిర్మించిన చిత్రం ‘నారప్ప’. షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత హీరో బాలకృష్ణ–దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రానికి ‘అఖండ’ అనే టైటిల్ ప్రకటించి, లుక్‌తో పాటు టీజర్‌ను విడుదల చేశారు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 28న విడుదల కానుంది. స్వాతంత్య్ర సమర యోధులు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం.. రణం.. రుధిరం) . రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, చరణ్ జనాల మధ్యలోంచి గాల్లోకి ఎగురుతున్న కొత్త పోస్టర్ పండగకి వచ్చింది. అక్టోబర్ 13న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమకథతో రూపొందుతున్న చిత్రం ‘రాధేశ్యామ్’. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మిస్తున్నారు. ప్రేయసి ఏం చెప్పిందో ఏమో నవ్వుతూ కనిపించారు విక్రమాదిత్య (ప్రభాస్ పాత్ర పేరు). జులై 30న ఈ చిత్రం విడుదల కానుంది. సిద్ధ, నీలాంబరి ఒకరి కళ్లల్లోకి మరొకరు చూస్తూ ప్రపంచాన్ని మరచిపోయారు. వీరి ప్రేమకథను ‘ఆచార్య’లో చూడొచ్చు. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సిద్ద పాత్రలో రామ్‌చరణ్, అతని సరసన నీలాంబరి పాత్రలో పూజా హెగ్డే నటిస్తున్నారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేయాలనుకుంటున్నారు. అనుకున్నట్లు జరిగితే నాని ‘టక్ జగదీష్’ ఈ నెల 23న విడుదలయ్యుండేది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నందున వాయిదా వేశారు. కుటుంబ సమేతంగా జగదీష్ (నాని పాత్ర) తాజా పోస్టర్‌ను విడుదల చేశారు. శివ నిర్వాణ దర్శకత్వంలో సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుకున్నట్లు జరిగితే నాగచైతన్య, సాయి పల్లవితో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లవ్‌స్టోరీ’ని కూడా ఈ నెలే థియేటర్లలో చూసేవాళ్లం. కరోనా ప్రభావం వల్ల వాయిదా వేశారు నిర్మాతలు కె. నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘గని’. సయీ మంజ్రేకర్ హీరోయిన్. అల్లు బాబీ, సిద్ధు నిర్మిస్తున్న ఈ సినిమా కొత్త పోస్టర్ రిలీజైంది. బస్సులో ప్రేయసిని ఆరాధనగా చూస్తున్నాడు ‘గల్లీ రౌడీ’. సందీప్ కిషన్ హీరోగా కోన వెంకట్ సమర్పణలో జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘గల్లీ రౌడీ’. ఇందులో నేహా శెట్టి హీరోయిన్. షూటింగ్ జరుగుతోంది. పండగ వేళ నవ్వులు చిందించింది వెన్నెల. రానా హీరోగా వేణు ఉడుగుల దర్శకత్వంలో డి. సురేశ్‌బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. ఇందులో వెన్నెల పాత్రలో కనిపిస్తారు సాయి పల్లవి. ఈ 30న సినిమాని విడుదల చేయాలనుకున్నారు కానీ వాయిదా పడే అవకాశం ఉంది. అబ్బాయి, అమ్మాయి చెరోవైపు చూస్తూ నిలబడ్డారు. కథ ఏంటనేది ‘వరుడు కావలెను’ సినిమాలో చూడాలి. నాగశౌర్య, రీతూ వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అద్దంలో బట్టతలతో, విడిగా చక్కని హెయిర్ స్టయిల్‌తో ప్రత్యక్షమయ్యాడు ‘101 జిల్లాల అందగాడు’. అవసరాల శ్రీనివాస్ హీరోగా రాచకొండ విద్యాసాగర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్’ రాజు, క్రిష్ సమర్పణలో శిరీష్, వై. రాజీవ్‌రెడ్డి, వై. సాయిబాబు నిర్మిస్తున్నారు. జీబీ కృష్ణ దర్శకత్వంలో ఆది సాయికుమార్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్న ‘బ్లాక్’ లుక్ వచ్చింది. మహంకాళి దివాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నటుడు అలీ కీలక పాత్ర చేస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’. శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో అలీ బాబ, కొణతాల మోహన్, శ్రీచరణ్. ఆర్ నిర్మిస్తున్నారు. రంజాన్, ఉగాది శుభాకాంక్షలతో ఈ సినిమా కొత్త పోస్టర్ని రిలీజ్ చేశారు. విశ్వక్ సేన్ హీరోగా ‘దిల్’ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న చిత్రం ‘పాగల్’. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కొత్త పోస్టర్ వచ్చింది. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘తిమ్మరుసు’. మహేశ్ కోనేరు, సృజన్ ఎరబోలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి దర్శకుడు. మే 21న ఈ చిత్రం విడుదల కానుంది. -
విజయదశమి.. కొత్త సినిమాలు గురూ
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్‌తో నిలిచిపోయిన షూటింగ్‌లు ఒక్కొక్కటి తిరిగి ట్రాక్ ఎక్కుతున్నాయి. పలు సినిమాలు చివరి షెడ్యూల్‌ను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు విజయదశమి పురస్కరించుకొని ఆయా చిత్ర యూనిట్లు... తమ సినిమాల ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ల విడుదల చేస్తున్నాయి. దీంతో సినీ అభిమానుల్లో దసరా పండుగ సంబరం రెట్టింపు అవుతోంది. ఆదివారం రిలీజ్ అయిన టీజర్లు, మూవీ పోస్టర్లు, ట్రైలర్లపై ఓ లుక్కేయండి.. ఆకట్టుకుంటున్న అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మూవీ టీజర్ వర్మ 'ఆర్జీవీ మిస్సింగ్' ట్రైలర్ విడుదల -
బీసీలను ప్రభుత్వం మోసం చేస్తోంది
అనంతపురం న్యూటౌన్ : సామాజికంగా బలంగా ఉన్న వర్గాన్ని బీసీ జాబితాలో చేరుస్తామంటూ ప్రభుత్వం అణగారిన బీసీలను దారుణంగా మోసం చేస్తోందని ఏపీ బీసీ జేఏసీ కన్వీనర్ అన్నా రామచంద్రయ్య అన్నారు. శనివారం స్థానిక సాయినగర్‌లోని బీసీ జనసభ కార్యాలయంలో ‘ప్రభుత్వంపై బీసీల పోరుబాట’ పోస్టర్లను విడుదల చేశారు. బీసీ జనసభ జిల్లా అధ్యక్షుడు సుధాకరయాదవ్ నేతత్వంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర స్థాయి నేతలు అన్నా రామచంద్రయ్య, యానాదయ్య తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడారు. అనంత నుంచే తమ పోరుబాటను ప్రారంభించామని,త్వరలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతామన్నారు. కాపులను బీసీలుగా మార్చే ప్రయత్నంలో భాగంగా ఏర్పాటు చేసిన జస్టిస్ మంజునాథ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ కాపులతో సన్మానాలందుకోవడం అన్యాయమన్నారు. బీసీల అభిప్రాయాన్ని మన్నించకుండా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణలకు బీసీలనే బాధ్యులు చేస్తూ నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయడంలో ప్రభుత్వ కుట్ర ఉందని విమర్శించారు. ఈనెల 17న మంజునాథ్ కమిషన్‌ను కలవడానికి స్థానిక ఆర్ట్స్ కళాశాల నుంచి పెద్ద ఎత్తున బీసీ సంఘాల వారు లలితకళాపరిషత్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నామని, అందరూ కలసిరావాలని వారు కోరారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ నేతలు పవన్‌కుమార్, రజక లింగమయ్య, హరీష్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
'గడప గడపకూ వైఎస్సార్సీపీ' పోస్టర్ల ఆవిష్కరణ
కడప: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున రాష్ట్రంలో చేపట్టనున్న ‘గడప గడపకూ వైఎస్సార్సీపీ’ కార్యక్రమం పోస్టర్లను జిల్లా పార్టీ కార్యాలయంలో నేతలు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, ఎమ్మెల్యే ఆంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబు, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. గడప గడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమంలోచంద్రబాబు రెండేళ్ల పాలనపై వంద ప్రశ్నలతో ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. -
బాహుబలి, రుద్రమదేవి పోస్టర్ల విడుదల
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తూ ప్రతిష్ఠాత్మకంగా తీస్తున్న బాహుబలి, గుణశేఖర్ దర్శకత్వంలో భారీస్థాయిలో రూపొందుతున్న రుద్రమదేవి.. రెండు సినిమాల పోస్టర్లు విడుదలయ్యాయి. గోన గన్నారెడ్డిగా తెలుగుజాతి పౌరుషాన్ని తన ఖడ్గంతో చూపిస్తున్న అల్లు అర్జున్.. ఆ వెనకాల జలపాతాలతో రుద్రమదేవి పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ఆర్కామీడియా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న బాహుబలి పోస్టర్లో ప్రభాస్ ఒకచేత్తో గండ్రగొడ్డలి, మరోచేత్తో కత్తి పట్టుకుని యుద్ధం బ్యాక్‌డ్రాప్‌లో కనిపించేలా బాహుబలి పోస్టర్ ఉంది. ఈ పోస్టర్ మీద ఆర్కా మీడియా లోగో, బాహుబలి టైటిల్, 2015 అన్న పదాల తప్ప మరేమీ లేవు. రుద్రమదేవి పోస్టర్ మీద మాత్రం, సినిమాకు సంబంధించిన అందరి పేర్లు వేశారు. చారిత్రక నేపథ్యాలతో రూపొందిస్తున్న ఈ రెండు సినిమాల పోస్టర్లు ఒకే సమయంలో విడుదల కావడం యాదృచ్ఛికం.