కడప: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున రాష్ట్రంలో చేపట్టనున్న ‘గడప గడపకూ వైఎస్సార్సీపీ’ కార్యక్రమం పోస్టర్లను జిల్లా పార్టీ కార్యాలయంలో నేతలు మంగళవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, ఎమ్మెల్యే ఆంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబు, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. గడప గడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమంలోచంద్రబాబు రెండేళ్ల పాలనపై వంద ప్రశ్నలతో ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
'గడప గడపకూ వైఎస్సార్సీపీ' పోస్టర్ల ఆవిష్కరణ
Published Tue, Jul 5 2016 12:01 PM | Last Updated on Mon, Sep 4 2017 4:11 AM
Advertisement
Advertisement