gadapa gadapaku ysrcp
-
పలాస ఎప్పటికీ వైఎస్సార్సీపీ అడ్డానే: మంత్రి సీదిరి అప్పలరాజు
సాక్షి, అమరావతి: 175 అసెంబ్లీ స్థానలకు 175 గెలవాలనే లక్ష్యంతో పనిచేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెప్పినట్లు తాడేపల్లి మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. సీఎం చాలా సానుకూల ధృక్పథంతో ఉన్నారని, మరింత ప్రజలకు చేరువ కావాలని సూచించారని చెప్పారు. ‘మొన్న మంత్రి పదవి తీసేస్తారని ప్రచారం చేశారు. ఈరోజు ఎమ్మెల్యేగా పీకేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారు. పలాస ఎప్పటికీ వైఎస్సార్సీపీ అడ్డానే. సాఫ్ట్ టార్గెట్‌తో మరింత ఉత్సాహంగా పనిచేస్తా. పలాసలో ఏం జరిగినా అప్పలరాజే కారణమని టీడీపీ ప్రచారం చేస్తోంది’ అని విమర్శించారు. ఆగస్టు నాటికి గడపగడపకు కార్యక్రమం పూర్తి చేయాలని సీఎం జగన్ చెప్పారని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి గడప గడపకు వెళ్లాలని సీఎం సూచించారని తెలిపారు. ఏప్రిల్ 7 నుంచి 21 వరకు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ఉంటుందని, దీనిపై సీఎం దిశానిర్ధేశం చేశారన్నారు. ప్రతిపక్షాలు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని సీఎం స్పష్టం చేశారని చెప్పారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని వైఎస్ జగన్ ఆదేశించారన్నారు. రామోజీరావు ధృతరాష్టుడిగా మారిపోయాడు పేదల కోసం చంద్రబాబు, రామోజీ ఆలోచించారా అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రశ్నించారు. పేదల రక్తమాంసాలతో వ్యాపారం చేసిన వ్యక్తులు చంద్రబాబు, రామోజీరావు అంటూ ధ్వజమెత్తారు. తమకు ఓటేసినా.. వేయకపోయినా ఇంటింటికీ వెళ్లి పథకాలు అందిస్తున్నామని తెలిపారు. రామోజీరావు ధృతరాష్టుడిగా మారిపోయి, గాంధారిలా కళ్లకు గంతలు కట్టుకున్నాడని విమర్శించారు. చంద్రబాబు రూపొందించిన బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారానే ఈరోజుకీ తెలుగు రాష్ట్రాల్లో మద్యం సేల్స్ జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఈ విషయం రామోజీరావుకి తెలియదా అని నిలదీశారు. ‘మద్యపానం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు, రామోజీరావుకి లేదు. పేదల రక్తం తాగి ఈరోజు రామోజీరావు వార్తలు రాస్తున్నాడు. ఏ రోజైనా పేదల గురించి రామోజీరావు, రాధాకృష్ణ వార్తలు రాశారా. పచ్చళ్లు, ఊరగాయలు అమ్ముకునే రామోజీరావు ఈరోజు వేల కోట్లకు ఎలా అధిపతి అయ్యాడు. మార్గదర్శి అక్రమాలపై ఈడీ విచారణకు పిలిచింది. మార్గదర్శి అక్రమాలపై పేపర్లో రాశాడా. స్కిల్స్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు దొరికినా ఏనాడైనా రాశాడా. ఈనాడులో రాసేవన్నీ పచ్చి అబద్ధాలు’ అని నారాయణ స్వామి దుయ్యబట్టారు. -
Seediri Appalaraju: కన్నీరు తుడిచి.. కష్టాన్ని తొలగించి
కాశీబుగ్గ(శ్రీకాకుళం జిల్లా): పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ 19వ వార్డు సూదికొండ ప్రాంతంలో సోమవారం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగింది. రెల్లివీధికి చెందిన పద్మ అనే ఇల్లు లేని ఓ మహిళ మంత్రి ముందు కన్నీరుమున్నీరై తన వేదన తెలుపుకున్నారు. తనకు ఇల్లు లేదని, కర్రలపై పరదాలు కప్పుకుని తల దాచుకుంటున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్నిసార్లు ఇంటి కోసం దర ఖాస్తు చేసినా రిజెక్ట్ అవుతోందని చెప్పారు. దీంతో మంత్రి ఆ గుడిసెలోనే కూర్చుని ఆమెను ఓదార్చి అధికారులతో మాట్లాడారు. అన్ని పథకాలపై ఆమె ఇంటి పేరుకు బదులు లబ్ధిదారు(హోల్టర్) అని తప్పుగా ముద్రితమవ్వడంతో పథకాలు అందకుండాపోతున్నాయని గుర్తించారు. ఇలాంటి చిన్న తప్పులు కూడా కనిపెట్టలేకపోతున్నారని మంత్రి సచివాలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సూదికొండలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని మండిపడ్డారు. వెంటనే తప్పిదాన్ని సరిచేసి ఈమెకు ఇంటిని మంజూరు చేయాలని కమిషనర్ రాజగోపాలరావును ఆదేశించారు. (క్లిక్ చేయండి: గ్రామస్థాయికి భూముల సర్వే సేవలు) -
గడప గడపకు అందుతున్న సంక్షేమ పథకాలు
-
ఏపీలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’.. టీమ్‌లో ఎవరెవరు అంటే..?
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కారు మూడేళ్ల పాలన సందర్భంగా బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ప్రధానంగా గత మూడేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అంశాల్లో 95 శాతం అమలుచేసి చూపించింది. అంతేకాక.. ప్రభుత్వ పథకాలను కులం, ప్రాంతం, మతం, రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ సంతృప్త స్థాయిలో అమలుచేసింది. సామాజిక తనిఖీల ద్వారా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపికచేసి వారికి ఆయా పథకాలను అందించింది. అలాగే, మునుపెన్నడూ లేనివిధంగా పెద్దఎత్తున సంక్షేమ పథకాలను అమలుచేసింది. ఈ నేపథ్యంలో.. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను గడప గడపకు పంపించి ప్రజల నుంచి సలహాలను, సూచనలను తీసుకోవాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగానే బుధవారం నుంచి నియోజకవర్గాల్లోని అన్ని ఇళ్ల సందర్శనను ఎమ్మెల్యేలు పూర్తిచేసే వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా రాష్ట్ర ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయకుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వంపై పెరిగిన విశ్వాసం ఇక గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా అవినీతికి ఆస్కారం లేకుండా జవాబుదారీతనంతో పారదర్శకంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే పథకాలను చేరవేస్తుండడంతో ప్రజల్లో ప్రభుత్వంపట్ల మరింత విశ్వాసం పెరిగింది. ఇక ప్రభుత్వం ప్రకటించిన నవరత్నాల వార్షిక క్యాలెండర్ ప్రకారం.. లబ్ధిదారులకు గత మూడేళ్లుగా నేరుగా నగదు బదిలీని అమలుచేసింది. ఈ నేపథ్యంలో.. ఈ పథకాల అమలులో మరింత సామర్థ్యాన్ని పెంచేందుకు వీలుగా ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించడమే లక్ష్యంగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ నిర్వహిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే, ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాల పట్ల ప్రజల్లో మరింత అవగాహన, చైతన్యం కల్పిస్తారు. చివరి లబ్ధిదారునికి కూడా పథకాలు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని వారి నుంచే తెలుసుకుంటారు. గడప గడపకు.. టీమ్‌లో ఎవరెవరు అంటే.. ♦ఆయా నియోజకవర్గాల్లోని గ్రామ, వార్డు సచివాలయాలను మండల, మున్సిపాలిటీలతోపాటు గ్రామ, వార్డు సచివాలయాల ప్రతినిధులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యేలు తమ పరిధిలోని ప్రతీ ఇంటికి వెళ్లాలి. ♦ఈ మహాయజ్ఞం పటిష్టంగా, పక్కాగా జరిగేలా ఆయా జిల్లాల కలెక్టర్లు షెడ్యూల్‌ను రూపొందించాలి. ♦గ్రామ, వార్డు సచివాలయాల వారీగా లబ్ధిదారుల జాబితాలను ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంచాలి. ♦గడప గడపకు వెళ్లినప్పుడు లబ్ధిదారుల సంతృప్త స్థాయిని తెలుసుకుంటారు. ♦ నెలలో 10 గ్రామ, వార్డు సచివాలయాలను ఎమ్మెల్యేలు సందర్శించేలా షెడ్యూల్‌ను రూపొందించుకోవాలి. -
గడప గడపకు YSRCPకి విశేష స్పందన
-
రాష్ట్ర వ్యాప్తంగా గడపగడపకూ YSR
-
కర్నూలులో గడప గడపకు వైఎస్ఆర్సీపీ
-
కుప్పంలో గడపగడపకూ వైఎస్సార్సీపీ
కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పం మండలం గంగిచీనేపల్లి గ్రామంలో గురువారం ఉదయం గడపగడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమం ప్రారంభమైంది. నియోజకవర్గ ఇన్చార్జ్ చంద్రమౌళి ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పార్టీ కార్యక్రమాలను వివరించడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేస్తున్నారు. ప్రజలు అధిక సంఖ్యలో ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారి సమస్యలను నేతల ముందు ఏకరువుపెడుతున్నారు. -
నిరుద్యోగులతో వెట్టిచాకిరీ చేయిస్తున్న బాబు సర్కార్
- ప్రభుత్వ మోసంపై తక్షణం విచారణ జరపాలి - వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున కొల్లూరు (గుంటూరు): బాబు వస్తే జాబు ఇస్తామని మోసపూరిత హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు యువతను ఉద్యోగాల పేరుతో మోసం చేసి వెట్టిచాకిరీ చేయించడం దారుణమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున అన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా కొల్లూరు మండలం ఈపూరులో గడప గడపకూ వైఎస్ఆర్సీపీ కార్యక్రమం నిర్వహిస్తుండగా.. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువకులతో ప్రభుత్వం ఆడిన చెలగాటాన్ని స్థానిక యువకులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సోలార్ ప్లేట్లు బిగించడం, సాంకేతిక పరిజ్ఞానంలో రేపల్లెలో నెల రోజులు శిక్షణ ఇచ్చి, ఇక్కడ నుంచి చెన్నై తీసుకువెళ్ళి శిక్షణ ఇచ్చిన ఉద్యోగం కాకుండా బేల్దారి, ప్లంబింగ్, సెంట్రింగ్ వంటి పనులు జీతం సైతం చెల్లించకుండా చేయించారని యువకులు ఆయన ముందు వాపోయారు. ఇటువంటి పనులు చదువు లేకుండా అయినా చేసుకుంటామని, ఉద్యోగాలిస్తామని ఈ పనులు చేయించడమేంటని ప్రశ్నించగా మూడు నెలలు ఈ పనులు చేస్తేనే కాంట్రాక్టు బేసిక్‌లో ఉద్యోగాలు చూపుతామని తెలుపడంతో జరుగుతున్న మోసాన్ని గమనించి అక్కడ నుంచి తిరిగి వచ్చామని ఆయన ముందు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తమను అక్కడకు పంపింది సోషల్ వెల్ఫేర్ మంత్రి రావెల కిషోర్‌బాబు, ఎస్సీ కమీషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌లు అని ఆయనకు వివరించారు. స్పందించిన మేరుగ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు యువతకు ఇస్తామన్న ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను అక్రమ పద్ధతిలో వెట్టి చాకిరీకి తరలించడం చట్టరీత్యా నేరమన్నారు. ప్రభుత్వం చేస్తున్న అకృత్యాలపై వెంటనే విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగాలను ఆశగా చూపి దళిత యువతకు శిక్షణ ఇచ్చి నాటకీయ పరిణామాల మధ్య తమిళనాడు తీసుకువెళ్ళి కూలి పనుల్లో దింపడం టీడీపీ ప్రభుత్వ అకృత్యాలకు నిదర్శనమన్నారు. దళిత, పేద, నిరుద్యోగ యువతను సోషల్ వెల్ఫేర్ మంత్రి రావెల కిషోర్‌బాబు, ఎస్సీ కమీషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌లు ఇటువంటి కూలి పనులకు తరలించడం వెనుక ముఖ్యమంత్రి హస్తం కచ్చితంగా ఉందని ఆయన ఆరోపించారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని యువతను మభ్య పెడుతున్న ప్రభుత్వం యువతకు ఇచ్చే ఉద్యోగాలు ఇవేనా అని ప్రశ్నించారు. చంద్రన్న చేయూత పేరుతో జరుగుతున్న యువకుల అక్రమ తరలింపుపై వెంటనే విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తక్షణం ప్రభుత్వం బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు చూపించాలని, లేని పక్షంలో జీతాలు సైతం ఇవ్వకుండా ఇతర రాష్ట్రాలలో రాష్ట్రంలోని నిరుద్యోగులతో చేయిస్తున్న వెట్టి చాకిరీపై యువత తిరగబడి ప్రభుత్వాన్ని రోడ్డుకు ఈడ్చే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. -
నేతలకు సమస్యల నివేదన
– టీడీపీ సర్కారుపై ప్రజాగ్రహం – గడప గడపకు వైఎస్సార్ సీపీకి ఆదరణ – పార్టీ నేతలకు సమస్యలు విన్నవిస్తున్న పేదలు – ఆదుకుంటామని అభయమిస్తున్న నాయకులు సాక్షి ప్రతినిధి, ఒంగోలు : అర్హత ఉన్నా పింఛన్లు అందక వృద్ధులు.. మాఫీ అవుతాయనుకున్న రుణాలు చెల్లించలేక రైతులు.. పూరి గుడెసెలో నివాసం ఉంటున్నాం పక్కా ఇళ్లు మంజూరు కాలేదని పేదలు.. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. గడప గడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమంలో భాగంగా తమ ఇళ్లకు వచ్చిన ఆ పార్టీ నాయకులకు ప్రజలు తమ సమస్యలు ఏకరువు పెడుతున్నారు. కనికరం లేని టీడీపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను ఆదుకోవాలని కోరుతున్న అభాగ్యులకు నాయకులు ధైర్యం చెబుతూ ముందుకు సాగుతున్నారు. 12 రోజు కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లాలోని ఆయా నియోజకవర్గాలకు చెందిన పార్టీ శాసనసభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్తలు ప్రజల వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలుకరించారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు ప్రతి ఒక్కరూ మద్దతు పలికి చంద్రబాబు అరాచక పాలనకు చరమ గీతం పాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్ జగ¯Œæమోహ¯Œæరెడ్డిని సీఎం చేయడం ద్వారా రాజన్న పాలన తిరిగి తెచ్చుకుందామని చెప్పారు. మార్కాపురం మండలంలోని తిప్పాయిపాలెంలో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి పర్యటించగా.. వేటపాలెం మండలం దేశాయిపేటలో చీరాల నియోజకవర్గ సమన్వయకర్త యడం బాలాజీ, బాపట్ల పార్లమెంట్ ఇన్చార్జి వరికూటి అమృతపాణిలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకొల్లు మండలం కొణికిలో పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి భరత్, మర్రిపూడి మండలం వల్లాయిపాలెం గ్రామంలో నిర్వహించిన గడప గడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమంలో కొండపి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు పాల్గొన్నారు. కంభం మండలం రావిపాడులో గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త ఐ.వి.రెడ్డి పర్యటించారు. -
గడపగడపలో సమస్యలు
-
పదో రోజు గడప గడపకు వైఎస్సార్సీపీ
పెద్ద ఎత్తున ప్రజల స్వాగతం సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో పదో రోజు గడప గడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్సీపీ శాసనసభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. నేతలకు పార్టీ శ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో గడప గడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ప్రజాసమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. టీడీపీ ప్రభుత్వం అర్హులకు పింఛన్లు, రేషన్ కార్డులు, సంక్షేమ పథకాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. మార్కాపురం మండలం శివరాంపురం, అమ్మవారిపల్లె గ్రామాల్లో ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు గడపగడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమం నిర్వహించారు. చీరాల నియోజకవర్గంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త యడం బాలాజీ, బాపట్ల పార్లమెంట్ ఇన్చార్జి వరికూటి అమృతపాణి వేటపాలెం మండలం జీవరక్షనగర్‌లో గడప గడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొండపి నియోజకవర్గంలో నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు మర్రిపూడి మండలం యామవరం గ్రామంలో గడప గడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
ఎన్నికల హామీలను నెరవేర్చాలి : కోటంరెడ్డి
నెల్లూరు: ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. కొత్తవెల్లంటి, పాతవెల్లంటి, కం దమూరు, ఉప్పుటూరు, తదితర గ్రామాల్లో గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమాన్ని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటుతున్నా, హామీలను నెరవేర్చడంలో విఫలమైందని మండిపడ్డారు. హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నామని వివరించారు. హామీలను ప్రభుత్వం నెరవేర్చిందా, లేదా అనే అంశంపై ప్రజలే తీర్పునివ్వాలని చెప్పారు. అనంతరం విజయకుమార్‌రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు, ప్రభుత్వ పాలనపై ప్రజాబ్యాలెట్‌ను పార్టీ నిర్వహిస్తోందని చెప్పారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి అన్ని విధాలుగా అండగా ఉండి, ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. అనంతరం ప్రజాబ్యాలెట్ పత్రాలను అందజేశారు. పార్టీ నాయకుడు చేవూరి ప్రభాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
బాబుది రోజుకో మాట..పూటకో అబద్ధం
కోటంబేడు: సీఎం చంద్రబాబు నాయుడు రోజుకో మాట, పూటకో అబద్ధం చెబుతూ ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చకుండా రెండేళ్లుగా కాలయాపన చేస్తున్నారని వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్, జెడ్పీచైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కోటంబేడులో శుక్రవారం ఆయన గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు వ్యవసాయ, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తాననే హామీతో అధికారంలోకి వచ్చిన బాబు పూర్తిస్థాయిలో మాఫీ చేయకుండా మోసం చేశాడని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తానన్న బాబు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించిన ఘనత దక్కించుకున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సింగంశెట్టి భాస్కర్‌రావు, జిల్లా రైతు ప్రధానకార్యదర్శి గూడూరు భాస్కర్‌రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ, మండల కో-ఆప్షన్ సభ్యుడు హఫీజ్, పార్టీ మండలాధ్యక్షుడు మురళీ మోహన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ప.గో.జిల్లాలో గడప గడపకువైఎస్సార్సీపీ
-
'చంద్రబాబుకు నూటికి సున్నా మార్కులు'
విజయవాడ: గడప గడపకు వైఎస్ఆర్ సీపీ కార్యక్రమంలో భాగంగా ఏ ఇంటికి వెళ్లినా చంద్రబాబు నాయుడు మోసాలనే చెబుతున్నారని వైఎస్ఆర్ సీపీ నేత పార్థసారధి అన్నారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రజలు చంద్రబాబు పాలనకు నూటికి సున్నా మార్కులు వేస్తున్నారన్నారు. టీడీపీ కార్యకర్తలు కూడా రుణమాఫీ జరగలేదని ఫిర్యాదు చేస్తున్నారని పార్థసారధి తెలిపారు. పెన్షన్ల కోతతో వికలాంగులు, వృద్ధులు అవస్థలు పడుతున్నారన్నారు. గ్రీన్ జోన్-3 పేరుతో కృష్ణాజిల్లా రైతులకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్నారు. ఇప్పుడు మచిలీపట్నం డీప్ వాటర్ పోర్టు పేరుతో భూములు లాక్కోవాలని చూస్తున్నారని విమర్శించారు. అవినీతికి వ్యతిరేకంగా టీడీపీలో మరో వర్గం తయారవుతోందని, ఎన్టీఆర్ అభిమానులు అంతా చంద్రబాబు పేరు చెబితే ఛీ కొడుతున్నారన్నారు. -
ఇంటికో విమానం ఇస్తామని చెబుతాడు
పులివెందుల: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండేళ్ల పాలనలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఇడుపులపాయ గ్రామంలో గడప గడపకు వైఎస్ఆర్ సీపీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని, మొత్తం లక్షా 45 వేల కోట్ల రూపాయల అవినీతికి శ్రీకారం చుట్టారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలిచ్చిన చంద్రబాబు ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేదని వైఎస్ జగన్ చెప్పారు. హామీలపై చంద్రబాబును నిలదీయాలని, అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుందని అన్నారు. లేకుంటే వచ్చే ఎన్నికల్లో ఇంటికో కారు లేదంటే ఏకంగా విమానమే ఇస్తామని చంద్రబాబు చెబుతారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మోసాలను ఎండగట్టేందుకు ప్రజలకే బ్యాలెట్ ఇస్తున్నామని, వంద మార్కులకు ఎన్ని మార్కులు వేస్తారో చెప్పాలని కోరుతామని తెలిపారు. గత ఎన్నికల సమయంలో రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పారని, ఇప్పటివరకు ఎవరికీ రుణాలు మాఫీ చేయలేదని వైఎస్ జగన్ విమర్శించారు. మోసం చేసేవారిని ఎక్కడికక్కడ నిలదీస్తేనే మార్పు వస్తుందని అన్నారు. గడప గడపకు వైఎస్ఆర్ సీపీ కార్యక్రమంలో ప్రతిచోటా తాను పాల్గొంటానని చెప్పారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పులివెందులలో ప్రతి ఇంటికీ ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తారని వైఎస్ జగన్ తెలిపారు. -
రేపట్నుంచి గడప గడపకు వైఎస్ఆర్ సీపీ: బొత్స
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిన వైనాన్ని రేపటి నుంచి 'గడప గడపకు వైఎస్ఆర్ సీపీ' నినాదంతో ప్రజల్లోకి తీసుకు వెళతామని ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా రేపటి నుంచి గడప గడపకు వైఎస్ఆర్ సీపీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి చంద్రబాబు వైఫల్యాలతో పాటు అవినీతిని వివరిస్తామని బొత్స వెల్లడించారు. శుక్రవారం వైఎస్ఆర్ జయంతి ఘనంగా నిర్వహించుకుని, ఆయన ఆశయ సాధనకు పాటుపడతామని బొత్స తెలిపారు. -
'గడప గడపకూ వైఎస్సార్సీపీ' పోస్టర్ల ఆవిష్కరణ
కడప: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున రాష్ట్రంలో చేపట్టనున్న ‘గడప గడపకూ వైఎస్సార్సీపీ’ కార్యక్రమం పోస్టర్లను జిల్లా పార్టీ కార్యాలయంలో నేతలు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, ఎమ్మెల్యే ఆంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబు, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. గడప గడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమంలోచంద్రబాబు రెండేళ్ల పాలనపై వంద ప్రశ్నలతో ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. -
'నూరు ప్రశ్నలతో ప్రజా బ్యాలెట్'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తప్పుడు వాగ్దానాలను ప్రజల ముందుకు తీసుకెళతామని వైఎస్సార్ సీపీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. రెండేళ్ల పాలనలో చంద్రబాబు చేసింది ఏమీ లేదని అన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8న తలపెట్టనున్న గడప గడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సోమవారం మధ్యాహ్నం పార్టీ ప్రధాన కార్యాలయంలో పెద్దిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో చంద్రబాబు చాలా వాగ్దానాలు చేశారని గుర్తు చేశారు. ఎన్నికలయిన తర్వాత ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయలేదన్నారు. చంద్రబాబు పాలనపై నూరు ప్రశ్నలతో ప్రజా బ్యాటెల్ తయారు చేశామని, దీన్ని గడప గడపకు అందిస్తామని చెప్పారు. దీని ద్వారా చంద్రబాబు పాలన బాగుందా, లేదా అనేది కనుక్కుంటామన్నారు. ప్రజా బ్యాలెట్ ప్రశ్నలకు అవును, కాదు అని సమాధానాలు ఇస్తే సరిపోతుందని తెలిపారు. చంద్రబాబు పాలనపై మార్కులు వేయాలని ప్రజలను కోరతామన్నారు. ప్రజా బ్యాలెట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్ లకు అప్పగించామని, 5 నెలల్లో ఈ కార్యక్రమం పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంపై ప్రతిరోజు జిల్లా, రాష్ట్రస్థాయిలో పర్యవేక్షిస్తామని చెప్పారు. ఈ రెండేళ్లలో తమ పార్టీ చేసిన ప్రజాపోరాటాల గురించి కూడా ప్రజలకు చెబుతామన్నారు. జూలై 8న దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఆ రోజున వైఎస్సార్ విగ్రహాలకు నివాళులర్పించి, జెండాలు ఆవిష్కరించాలని పార్టీ నాయకులకు సూచించారు. -
'చంద్రబాబు మాయలమరాఠి, మోసగాడు'
హామీలు అమలు చేశానని అబద్ధాలు చెబుతున్నారు రైతుల కళ్లల్లో వెలుగుందని బొంకుతున్నారు హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ మాయల మరాఠీ అని, వీధి మంత్రగాళ్లను మించిన మాయగాడని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీ అయిన రైతుల రుణ మాఫీని అమలు చేయకుండానే చేసేశామని బుధవారం ఒంగోలు సభలో చంద్రబాబు చెప్పారని విమర్శించారు. చంద్రబాబు రుణ మాఫీపై హామీ ఇచ్చినపుడు ఉన్న రుణాల మొత్తం రూ. 87,000 కోట్లు అయితే ఈరోజు ఆ మొత్తం రూ. లక్ష కోట్లకు పైగా పెరిగిందన్నారు. మాఫీ చేసి ఉంటే ఇంత ఎలా పెరిగిందని భూమన ప్రశ్నించారు. ఇప్పటికి రూ.7500 కోట్లు ఒకసారి, రూ.3500 కోట్లు మరోసారి మొత్తం రూ.11000 కోట్లు రుణ మాఫీ చేశానని, మిగతా రూ.13000 కోట్లు వచ్చే మూడేళ్లలో చేస్తానని చంద్రబాబే స్వయంగా చెప్పారని అలాంటపుడు రైతుల రుణాలన్నీ ఎలా మాఫీ అయ్యాయని ఆయన అన్నారు. ఇంత పెద్ద అబద్ధాన్ని చెప్పింది చాలక మళ్లీ రైతులు తన పాలనపై సంతృప్తిగా ఉన్నారని వారి కళ్లల్లో వెలుగు కనిపిస్తోందని చంద్రబాబు చెప్పడం మోసపూరితమేనన్నారు. రెండేళ్లలోనే 90 శాతం హామీలు నెరవేర్చేసినట్లు చంద్రబాబు చెప్పడం మరో మాయ అనీ, పైగా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయాల్సిందిగా టీడీపీ ప్రజా ప్రతినిధులందరినీ కోరడం విడ్డూరమని ఆయన మండిపడ్డారు. ఆయన ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటి కాక ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, తొలి ఐదు సంతకాల అమలు కూడా అంతా డొల్లేనని పేర్కొన్నారు. ఇది చాలదన్నట్లు ప్రతి రోజూ ఏదో ఒక సమావేశంలో చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలు చేసి మభ్య పెట్టే యత్నం చేస్తున్నారన్నారు. అందుకే తాము జూలై 8 నుంచి ‘గడప గడపకూ వైఎస్సార్ సీపీ’ పేరుతో ప్రతి ఇంటికీ వెళ్లి చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు ఏ మేరకు జరిగిందో తెలుసుకుంటామన్నారు. డ్వాక్రా మహిళల రుణాలను కూడా మాఫీ చేయలేదని ఆయన విమర్శించారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తానన్న హామీని నెరవేర్చక పోగా ఉద్యమించిన ముద్రగడ పద్మనాభాన్ని, ఆయన కుటుంబీకులను ఎంత క్షోభపెట్టారో ప్రజలంతా చూశారని ఆయన అన్నారు. గిట్టుబాటు ధర అడిగితే వెటకారమా? ఒంగోలులో ఓ రైతు లేచి గిట్టుబాటు ధర ఇప్పించండి అని అడిగితే చంద్రబాబు ఎంత వెటకారంగా మాట్లాడారో అందరూ చూశారని ఆయన అన్నారు. ప్రతిపక్షమే లేకుండా చేయాలని, ప్రశ్నించిన వారిని అంతం చేయాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారని ఇది చాలా దారుణమని ఆయన అన్నారు. చంద్రబాబు మోసపూరిత మాటలు నమ్మి 2014లో ప్రజలు ఓట్లేశారు కనుక మళ్లీ మాయ మాటలు చెప్పి మోసగించాలని చూస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు అబద్ధాలను ప్రజలు ఒకసారి నమ్మొచ్చు గానీ మళ్లీ మళ్లీ నమ్మే పరిస్థితి ఉండదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు, అక్కడున్న ఎమ్మెల్యేలు అందరూ అసంతృప్తితో ఉన్నారని, వెళ్లిన వారు తప్పు చేశామనే భావనతో ఉన్నారని భూమన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నిబంధనలకు మించి ఎక్కువగా ఎన్నికల వ్యయం చేసి స్పీకర్ కోడెల శివప్రసాదరావు తన పదవికి రాజీనామా చేయాలని లేదా ఎన్నికల కమిషన్, కోర్టులు జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
'చంద్రబాబును చూసి భయపడుతున్నారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో ప్రజావ్యతిరేక పాలన సాగుతోందని వైఎస్సార్ సీపీ నాయకుడు భూమన కరుణాకర రెడ్డి విమర్శించారు. ఎన్నికల హామీలను సీఎం చంద్రబాబు తొంగలో తొక్కారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం భూమన విలేకరులతో మాట్లాడారు. అన్నివర్గాలను మోసం చేసి మాయల మరాఠిలనే చంద్రబాబు మించి పోయారని అన్నారు. ఆయనను చూసి ప్రజలు భయపడుతున్నారని అన్నారు. చంద్రబాబును మోసాలను ప్రజల మధ్యకు వెళ్లి ఎండగడతామన్నారు. ప్రజావ్యతిరేక పాలన ఎల్లకాలం సాగదన్నారు. ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ఎన్నికలకు ముందు ఓట్లు రైతులకు వెతలను తీరుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు మీ కన్నీళ్లను తుడుస్తానని, బ్యాంకుల్లో బంగారం విడిపిస్తానన్నారు డ్వాక్రా మహిళల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని వాగ్దానం చేశారు అప్పుడు 88 వేల కోట్ల రూపాయలుగా ఉన్న అప్పు, ఇప్పుడు లక్షా 10 వేల కోట్లుగా మారింది మొదటి విడతలో కేవలం రూ. 11 వేల కోట్ల మాఫీ చేశారు మరో రూ. 13 వేల కోట్లు వచ్చే మూడేళ్లలో మాఫీ చేస్తామంటున్నారు. దీనిబట్టే చంద్రబాబు ఎంతగా అబద్ధాలు చెబుతున్నారో తెలుస్తోంది వీధుల్లో తిరిగే మోసగాళ్లు కూడా ఇంతగా అబద్ధాలు చెప్పరు మాయల మరాఠీలను, మంత్రగాళ్లను మించిన మాయగాడు చంద్రబాబు ఎన్నికల్లో 600కు పైగా వాగ్దానాలు చేశారు ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదు సీఎం అయ్యాక చేసిన ఐదు సంతకాల్లో కూడా ఒక్కటి కూడా అమలు కాలేదు చంద్రబాబు ఊక దంపుడు ఉపన్యానాలు వినలేక జనం భయపడుతున్నారు బుచాణ్ని చూస్తే ఎలా భయపడతారో అలాంటి పరిస్థితి వచ్చింది దోపిడీ చేయడంలో అగ్రగామిగా ఆయన నిలిచిపోతాడు ప్రజల జ్ఞాపక శక్తి తక్కువని, ఎన్ని అబద్దాలు చెప్పినా నడచిపోతుందనుకుంటున్నాడు జులై 8న నుంచి గడప గడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళుతున్నాం ఇంటింటికి వెళ్లి చంద్రబాబు చేసిన హామీలు అమలు గురించి అడుగుతాం దగాకోరు వంచనపై ప్రజలను స్వయంగా అడిగి తెలుసుకుంటాం ఎవరు నిజమో, ఎవరు అబద్ధమో ప్రజలే తేలుస్తారు చంద్రబాబు వ్యవసాయ వ్యతిరేక విధానాలతో కోనసీమలోని అల్లవరం మండల గ్రామాలు క్రాప్ హాలీడే ప్రకటించాయి రైతు బాంధవుడని చెప్పుకుంటున్న చంద్రబాబు గత చరిత్ర అంతా రైతు వ్యతిరేకమే ప్రజల పట్ల చులకన భావంతో చంద్రబాబు వంచన కౌశలం వంద రెట్లు పెరిగింది చంద్రబాబుది ప్రజాకంటక పాలన, ఏ ఒక్కరికీ మేలు చేయలేదు తన పాలన పట్ల అభిప్రాయభేదాలు వ్యక్తం చేసిన వారిపై ఇనుప పాదాలు మోపుతున్నారు ప్రజాద్రోహులుగా ముద్ర వేసి ప్రతీకార చర్యలు తీసుకుంటూ రాజకీయ రాక్షసుడిగా మారారు బీసీల్లో చేరుస్తామని కాపులను వంచిండడం లోకమంతా చూసింది ముద్రగడ కుటుంబం పట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరు అమానుషం ప్రజావ్యతిరేక పాలన ఎంతో కాలం కొనసాగదు చంద్రబాబుపై ప్రజలు తిరబడేరోజు దగ్గరలోనే ఉంది -
రైతులను మభ్యపెట్టేందుకే ఏరువాక
► ఒట్టి దుబారా కార్యక్రమం ► జిల్లాకు 29 సార్లు వచ్చిన సీఎం ఏంచేశారు ► చంద్రబాబు మోసాలను గడపగడపకూ వివరిస్తాం ► మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు నరసాపురం: రైతుల కోసం ఏమీ చేయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారిని మభ్యపెట్టేందుకే ఏరువాక కార్యక్రమం చేపట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ముదునూరి ప్రసాదరాజు ధ్వజమెత్తారు. ఆదివారం తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రైతులు సంతోషంగా ఉంటే పండగ చేసుకుంటారని, చంద్రబాబు రెండేళ్ల పాలనలో వారికి ఏం మేలు జరిగిందని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్ ముందుకు కదలడం లేదని, కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చడంకోసం పనుల వ్యయాన్ని మాత్రం ప్రభుత్వం రెట్టింపు చేస్తోందని విమర్శించారు. జిల్లాలో శివారు ప్రాతాలకు ఎక్కడా సాగునీరు అందే పరిస్థితి లేదని, కాలువలను ఈనెల 10న విడుదల చేసినా, ఇంకా 80శాతం ప్రాంతాల్లో చిన్న కాలువలకు నీరు చేరలేదని, నీటిని కూడా అందించలేని ప్రభుత్వం సిగ్గుపడటం మాని, ఏరువాక అంటూ రూ.కోట్లు దండగ చేయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇది ఒట్టి దుబారా కార్యక్రమమని అభివర్ణించారు. రెండేళ్లలో ఒరిగిందేమిటీ? చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రైతులకు ఒరిగిందేమీ లేదని, ఈ కాలంలో మూడు తుపాన్లు వచ్చాయని, రైతులు దారుణంగా నష్టపోయారని, అయినా వారికి పరిహారంగానీ, సాయం గానీ అందించలేదని విమర్శించారు. రుణమాఫీ విషయంలో అన్నదాతలను బాబు దగా చేశారని మండిపడ్డారు. డెల్టా ఆధునికీకరణ పనులు సాగక, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఏరువాక పండగ అంటూ ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని ప్రశ్నించారు. అసలు వ్యవసాయం దండగ అన్న బాబు, ఇప్పుడు రైతులకు రిక్తహస్తం చూపి పండగ అనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 30వ సారి జిల్లాకు వస్తున్న సీఎం, అసలు ఈ జిల్లాకు ఈ రెండేళ్లలో ఏం మేలు చేశారో చెప్పాలని ముదునూరి డిమాండ్ చేశారు. చంద్రబాబు మోసాలను రాష్ట్రంలోని ప్రతి గడపగడపకూ తిరిగి వివరిస్తామని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని చంద్రబాబును ప్రజలు బహిరంగంగా నిలదీసే రోజును వైఎస్సార్ సీపీ తీసుకొస్తుందని స్పష్టం చేశారు. -
విజయారెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకు వైసీపీ
-
విజయవంతంగా గడప గడపకు వైఎస్సాఆర్ పార్టీ