సాక్షి, అమరావతి: 175 అసెంబ్లీ స్థానలకు 175 గెలవాలనే లక్ష్యంతో పనిచేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినట్లు తాడేపల్లి మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. సీఎం చాలా సానుకూల ధృక్పథంతో ఉన్నారని, మరింత ప్రజలకు చేరువ కావాలని సూచించారని చెప్పారు. ‘మొన్న మంత్రి పదవి తీసేస్తారని ప్రచారం చేశారు. ఈరోజు ఎమ్మెల్యేగా పీకేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారు. పలాస ఎప్పటికీ వైఎస్సార్‌సీపీ అడ్డానే. సాఫ్ట్ టార్గెట్‌తో మరింత ఉత్సాహంగా పనిచేస్తా. పలాసలో ఏం జరిగినా అప్పలరాజే కారణమని టీడీపీ ప్రచారం చేస్తోంది’ అని విమర్శించారు.
ఆగస్టు నాటికి గడపగడపకు కార్యక్రమం పూర్తి చేయాలని సీఎం జగన్ చెప్పారని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి గడప గడపకు వెళ్లాలని సీఎం సూచించారని తెలిపారు. ఏప్రిల్ 7 నుంచి 21 వరకు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ఉంటుందని, దీనిపై సీఎం దిశానిర్ధేశం చేశారన్నారు. ప్రతిపక్షాలు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని సీఎం స్పష్టం చేశారని చెప్పారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని వైఎస్ జగన్ ఆదేశించారన్నారు.
రామోజీరావు ధృతరాష్టుడిగా మారిపోయాడు
పేదల కోసం చంద్రబాబు, రామోజీ ఆలోచించారా అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రశ్నించారు. పేదల రక్తమాంసాలతో వ్యాపారం చేసిన వ్యక్తులు చంద్రబాబు, రామోజీరావు అంటూ ధ్వజమెత్తారు. తమకు ఓటేసినా.. వేయకపోయినా ఇంటింటికీ వెళ్లి పథకాలు అందిస్తున్నామని తెలిపారు. రామోజీరావు ధృతరాష్టుడిగా మారిపోయి, గాంధారిలా కళ్లకు గంతలు కట్టుకున్నాడని విమర్శించారు. చంద్రబాబు రూపొందించిన బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారానే ఈరోజుకీ తెలుగు రాష్ట్రాల్లో మద్యం సేల్స్ జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఈ విషయం రామోజీరావుకి తెలియదా అని నిలదీశారు.
‘మద్యపానం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు, రామోజీరావుకి లేదు. పేదల రక్తం తాగి ఈరోజు రామోజీరావు వార్తలు రాస్తున్నాడు. ఏ రోజైనా పేదల గురించి రామోజీరావు, రాధాకృష్ణ వార్తలు రాశారా. పచ్చళ్లు, ఊరగాయలు అమ్ముకునే రామోజీరావు ఈరోజు వేల కోట్లకు ఎలా అధిపతి అయ్యాడు. మార్గదర్శి అక్రమాలపై ఈడీ విచారణకు పిలిచింది. మార్గదర్శి అక్రమాలపై పేపర్లో రాశాడా. స్కిల్స్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు దొరికినా ఏనాడైనా రాశాడా. ఈనాడులో రాసేవన్నీ పచ్చి అబద్ధాలు’ అని నారాయణ స్వామి దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment