సాక్షి, తిరుపతి: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై దాడులు చేస్తుంటే దీన్ని ప్రజాస్వామ్యం అంటారా అని మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం నేడు ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తోందని మండిపడ్డారు. సూపర్ సిక్స్ అమలు చేయలేనని చంద్రబాబు అనడం అవమానకరని అన్నారు. తిరుపతితో గురువారం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడారు.
‘‘గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజలకు పప్పు, బెల్లంలా సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చేస్తున్నారని ఏడ్చారు. పేదవారికి ఆశ చూపి అధికారంలోకి వచ్చి సూపర్ సిక్స్‌ను చూస్తే భయంగా ఉందని చంద్రబాబు అంటున్నాడు. దళితులు అన్ని రంగాల్లో రాణించాలని అంబేద్కర్ ఆశయం. చంద్రబాబు అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చే విధంగా చూడాలి. విద్య, వైద్యం జోలికి వెళ్లొద్దని చంద్రబాబుకి, రెడ్ బుక్ లోకేష్, పవన్ కళ్యాన్‌లకు విజ్ఞప్తి చేస్తున్నా. వైఎస్ జగన్ నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అని ఎన్నికల ప్రచారం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు కమ్యూనిటీలను నమ్ముకుని ముందుకెళ్ళి అధికారం చేపట్టారు.
..మద్యం పాలసీలో ఎటువంటి అవినీతికి పాల్పడలేదు. మద్యంలో కొత్త బ్రాండ్ లన్ని చంద్రబాబు తీసుకొచ్చిందే. తప్పు చేస్తే ఎటువంటి శిక్షకైనా రెడీ. ప్రస్తుతం టీడీపీ తరుపున పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే, ఎంపీకి కనీసం ఒక గ్రామంలో కూడా సరిగ్గా తెలీదు. చంద్రబాబు ప్రజలను ఏమార్చి గెలిచారు. వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు అమ్మ ఒడి, కార్పోరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను ధీటుగా రెన్యువేషన్ చేయడం, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ విద్య అందించడం, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయడం తప్పా. దళితులు చదువుకోవాలని, వారు సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.పేదలపై పడి దాడులు చేయొద్దు, ఎమ్మెల్యేలుగా ఉన్న మాపై మీ ప్రతాపం చూపండి’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment