Jansena party
-
నిజంగా పవన్‌కు ఆ ధైర్యం ఉందా?
తిక్కలోళ్లు తీర్ధానికి వెళితే.. ఎక్కా, దిగా సరిపోయిందని ఓ సామెత. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు చేస్తున్న పనులు, అంటున్న మాటలు గమనిస్తుంటే ఈ సామెత గుర్తుకు వస్తుంది. తోచి, తోయనమ్మ తోడికొడలు పుట్టింటికి వెళ్లినట్లుగా.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏపీలో సమస్యలు ఏవీ లేనట్లు మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు చెందిన సరస్వతి పవర్ కంపెనీకి చెందిన ప్రైవేటు భూములలోకి వెళ్లి గొడవ చేసి వచ్చారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ప్రసంగిస్తూ ప్రభుత్వాన్ని ప్రజలు బూతులు తిడుతున్నారని చెప్పడం ద్వారా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పరువు తీశారు. దీనిపై చంద్రబాబులో అసంతృప్తి ఉన్నా, పవన్ కళ్యాణ్‌ను ఏమీ నేరుగా అనలేకపోయారు. అయినా ఆయన అసహనం ఏదో రకంగా పవన్‌కు తెలిసి ఉంటుంది. దాంతో పవన్ ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు సడన్‌గా పల్నాడులోని సరస్వతి పవర్‌కు చెందిన భూలముల సందర్శనకు వెళ్లి ఉండవచ్చన్న అభిప్రాయం ఉంది. లేదంటే.. డైవర్షన్ రాజకీయాలలో భాగంగా ఇద్దరు కలిసి ఈ యాక్టివిటి సృష్టించారని కొందరు భావిస్తున్నారు. అయితే చంద్రబాబు తనదైన స్టైల్లో ఎమ్.ఆర్.పి.ఎస్ నేత మంద కృష్ణతో పవన్ కల్యాణ్‌కు వార్నింగ్ మెస్సేజ్ ఇప్పించినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబును కలిశాకే మందకృష్ణ ఈ అంశం గురించి మాట్లాడారు. మామూలుగా అయితే ఇలా ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినేలా, ప్రత్యేకించి తనకు డామేజీ అయ్యేలా ఏ టీడీపీ మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా మాట్లాడితే. వెంటనే టీడీపీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివాటిలో ఒక లీక్ వచ్చేది. చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని, చర్య తీసుకుంటామని హెచ్చరించారని ప్రచారం జరిగేది. కానీ పవన్ అంతగా ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించినా చంద్రబాబు స్పందించలేకపోయారు. హోం మంత్రి అనిత నిస్సహాయంగా మిగిలిపోయారు. మరో మంత్రి వాసంశెట్టి సుభాష్‌పై ఏదో తేడా వస్తే.. చంద్రబాబు పోన్ చేసి క్లాస్ తీసుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ పవన్ విషయంలో అలా చేయడానికి చంద్రబాబు సాహసించలేకపోయారు. అయినా.. పరోక్షంగా మంద కృష్ణతో క్లాస్ పీకించారు. పవన్ కల్యాణ్, ప్రైవేటు సంస్థ భూములలోకి వెళ్లడం ఏ రకమైన అధికారమో తెలియదు. నిజంగా ఆ భూముల విషయంలో ఏదైనా తేడా ఉండి ఉంటే చంద్రబాబు ప్రభుత్వం ఊరికే వదిలేసేదా? ఆ సంస్థకు నీరు ఇవ్వడం కూడా తప్పే అన్నట్లు పవన్ ప్రసంగించారు. వెయ్యి ఎకరాలలో ఇరవైనాలుగు ఎకరాలు ఏదో తేడా ఉందని ఈయన కనిపెట్టారు. అధికారులు అంతకుముందు పరిశీలనకు వచ్చి అక్కడ ప్రభుత్వ భూమి లేదని చెబితే.. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఈయన వచ్చి 24 ఎకరాల అస్సైన్డ్ భూమి, కుంటలు, చెరువులు ఉన్నాయని చెప్పారు. కేవలం స్థానికులను రెచ్చగొట్టి, అక్కడ పరిశ్రమ రాకుండా చేయాలన్న దురుద్దేశంతో పవన్ వెళ్లినట్లు ఉంది తప్ప, రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా చేసినట్లు కనిపించదు. అంటే ఇంకెవరైనా పరిశ్రమలు పెడితే ఫర్వాలేదా? జగన్ మాత్రం పెట్టకూడదా?. ఇక్కడకు సమీపంలోనే ప్రభుత్వం అదానీ, మహా సంస్థలకు భూములు కేటాయించింది. అక్కడకు ఈయన వెళ్లలేదు. ఇలాంటి వాళ్లు అధికారంలో ఉంటే పరిశ్రమలు కొత్తగా పెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తారా? నాకు తెలిసి ఒక ప్రైవేటు కంపెనీ భూమిలోకి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వెళ్లి ఇలా అరాచకం చేయడం ఇదే మొదటిసారి కావచ్చు.ఒకవైపు లోకేష్ రెడ్ బుక్ అంటూ కొత్త పారిశ్రామికవేత్తలకు భయానక వాతావరణం సృష్టిస్తుంటే, పవన్ తాను వెనుకబడిపోతానేమో అన్నట్లుగా స్వయంగా రంగంలో దిగి పారిశ్రామిక వాతావరణాన్ని చెడగొట్టే పనిలో ఉన్నారు. ఏపిలో జరుగుతున్న ఘాతుకాలు, సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోవడంపైనే కాదు.. ఇలా పవన్ అడ్డగోలుగా ప్రవర్తిస్తే కూడా జనం తిడతారన్న సంగతి గుర్తుంచుకోవాలి. పర్యావరణ మంత్రిని అని చెబుతూ ఖాళీగా ఉన్న భూమలులోకి వెళ్లిన పవన్‌కు కర్నూలు జిల్లా దేవనకొండ వద్ద వేలాది మంది ప్రజలు యూరేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళన కనిపించడం లేదు. రాజధాని పేరుతో 33 వేల ఎకరాల పంట భూమిని బీడుగా మార్చినా,అక్కడ పర్యవరణానికి ఇబ్బంది లేదని ఆయన భావిస్తున్నట్లుగా ఉంది. వందల ఎకరాల అస్సైన్డ్ భూమిని టీడీపీ పెద్దలు కొట్టేసినా, అక్కడ పవన్‌కు సంతోషంగానే ఉందని అనుకోవాలా? కృష్ణా నది ఒడ్డున అక్రమ భవనాలు ఉన్నాయి కదా! వాటిలో ఒకదానిలో ముఖ్యమంత్రి కూడా ఉంటున్నారు కదా! వాటిని ఖాళీ చేయించి పర్యావరణాన్ని కాపాడానని పవన్ చెప్పగలిగితే అంతా శభాష్ అంటారు. నిజంగా పవన్‌కు ఆ ధైర్యం ఉందా?.హోం మంత్రి అనిత ను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయి. ప్రతిపక్షం వారు విమర్శలు చేశారంటే అదొక పద్దతి. కాని ఉప ముఖ్యమంత్రి హోదా లో ఉండి అనితను అవమానించిన తీరు బాగోలేదు. నిజానికి ఉప ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఆయనకు ప్రత్యేకంగా కొమ్ములేమీ ఉండవు. ఆయన కూడా మంత్రులతో సమానమే. తనకు తాను హోం శాఖ ను తీసుకునే పరిస్థితి ఉండదు. ముఖ్యమంత్రి పరిధిలో ఉండే అధికారమది. ఆ విషయం పవన్ కు తెలియదేమో! కాకపోతే భాగస్వామి పార్టీగా తనకు హోం శాఖ కావాలని అడిగి తీసుకోవచ్చు. అంతేకాదు.హోం శాఖ ఒక్కటే చేతిలో ఉంటే అన్ని పవర్లు ఉండవు. లా అండ్ ఆర్డర్ అనేది ప్రత్యేక విభాగం. అది ఎప్పుడూ ముఖ్యమంత్రే ఉంచుకుంటారు.శాంతి భద్రతలు విఫలమైతే అందుకు ప్రధానంగా ముఖ్యమంత్రి, ఆ తర్వాత మంత్రులంతా బాధ్యత వహించాలి. ఒక పక్క రెడ్ బుక్ అమలు చేయాలని ,టీడీపీ వారు అరాచకాలు చేసినా చర్య తీసుకోరాదని పోలీసులపై ఒత్తిడి తెచ్చేది వారే. ఇంకో పక్క లా అండ్ఆర్డర్ విఫలం అయిందని చెప్పేది వారే. ఇదంతా నాటకీయంగా ఉంది తప్ప ఇంకొకటి కాదు. కేవలం అనితనే బాధ్యురాలిని చేయకుండా చంద్రబాబు ను కూడా తప్పు పట్టి ఉంటే అప్పుడు పవన్ కల్యాణ్ చిత్తశుద్దితో ఉన్నారని అనుకోవచ్చు. మూడేళ్ల చిన్నారిపై అఘాయిత్యం జరిగితే ఎవరో పోలీసు అధికారి చర్య తీసుకోవడం లేదట. దానికి కులం అడ్డం వస్తోందని చెప్పారట. అది నిజమే అయితే వెంటనే ఆ అధికారిని సస్పెండ్ చేయాలి కదా? ఒకరకంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం ఎంత అధ్వాన్నంగా పనిచేస్తున్నదో ఈ ఉదాహరణ తెలియచేస్తుంది.పవన్ కల్యాణ్ తెలిసి చెప్పారో,లేక తెలియకుండా చెప్పారో కాని ఒక్క నిజం మాత్రం వెల్లడించారు.అదేమిటంటే కూటమి ప్రభుత్వాన్ని జనం బూతులు తిడుతున్నారని. వంద అబద్దాలను కవర్ చేసుకోవడానికి పవన్ ఈ ఒక్క నిజం చెప్పారా!అన్న సందేహం కలుగుతుంది.ఇంకో మాట కూడా అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో తన ప్రాధాన్యతతగ్గుతోందని, ఆ నేపధ్యంలో ఆయన చంద్రబాబును బెదిరించడానికి ఈ రకంగా మాట్లాడి ఉండవచ్చని అంటున్నారు. కాని వవన్ వ్యాఖ్యలతో పరువు పోయిందన్న భావంతో ఉన్న చంద్రబాబు కు కోపం వచ్చిన సంగతి గమనించి,వెంటనే ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి పల్నాడు టూర్ పెట్టుకుని ఇష్యూని డైవర్ట్ చేసే యత్నం చేసి ఉండవచ్చు. కేవలం ఏపీలో జరుగుతున్న నేరాలు-ఘోరాల గురించే కాదు.ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తున్నందుకు కూడా జనం తిడుతున్నారు. ఆ విషయాన్ని కప్పిపుచ్చడానికి పవన్ యత్నించారు. తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకు పదిహేనువేలు, మహిళా శక్తి కింద ప్రతిఇ స్త్రీకి నెలకు 1500 రూపాయలు ఇస్తామని,నిరుద్యోగ భృతి 1500 ఇస్తామని ..ఇలా అనేక హామీలు ఇచ్చారు కదా..విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పారు కదా..కానీ ఇప్పుడు దారుణంగా పెంచుతున్నారే. అగ్గిపెట్టెలు,కొవ్వొత్తులకే 23 కోట్లు వ్యయం చేసిన ప్రభుత్వంగా ఇది రికార్డు పొందింది కదా! తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు కలిసిన నెయ్యి వాడారని తప్పుడు ప్రచారం చేసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ దేవుడికే అపచారం చేశారే! వీటన్నిటిపైన జనం మండిపడుతున్నారు.గతంలో చంద్రబాబు పాలన ఇంత అధ్వాన్నంగా లేదని, ఇప్పుడే మరీ దరిద్రంగా తయారైందని సామాన్యులు వ్యాఖ్యానిస్తున్నారు.వీటితో తనకు సంబంధం లేదన్నట్లుగా పవన్ కళ్యాణ్ మాట్లాడినా జనం నమ్మరు.ఒక రోజేమో చంద్రబాబు అనుభవం, పాలన అధ్బుతం అని ,మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసి, ఇంకో రోజు తమ పాలన తీరుపై జనం బూతులు తిడుతున్నారని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు కాబట్టి తింగరోళ్లు తీర్ధానికి వెళితే ఎక్కా,దిగా సరిపోయిందన్న సామెత చెప్పవలసి వచ్చింది.::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నారావారి వంచన.. ‘ఆరు’ నూరైనా అమలు చేయాలంటున్న జనం
నేను మారిన మనిషిని. ప్రజల మనిషినంటూ నరం లేని నాలుకలా వరాలు గుప్పించడం.. అందలమెక్కాక అబ్బే సాధ్యం కాదంటూ మాట మార్చేయడం చంద్రబాబుకు బాగా అలవాటైన విద్య.ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అంటూ కొండంత రాగం తీసిన చంద్రబాబు, పవన్ .. అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ కొట్టలేం.. డకౌట్ అయిపోతామంటూ చేతులెత్తేస్తున్నారు.ఎండమావులు దప్పిక తీర్చవు.. చంద్రబాబు మాటలేవీ వాస్తవాలు కావన్నది రాష్ట్రంలోని ఐదుకోట్ల మందికీ తెలుసు. కానీ.. సూపర్‌సిక్స్ పేరుతో ‘మాయ’ఫెస్టో తీసుకొచ్చి.. ఒక ఎత్తు కాకపోతే.. మరో ఎత్తు.. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం అన్నట్లుగా.. హామీల వర్షం కురిపించేసి జనంతో ఓట్లు వేయించుకున్నారు. అధికారంలోకి వచ్చి 100 రోజులు కావస్తున్నా.. హామీలు అమలు చేయకుండా మెల్లగా జారుకుంటున్నారు. సాక్షి, విశాఖపట్నం: అధికారంలోకి రాకముందు ఒక మాట.. వచ్చిన తర్వాత మరో మాట.. ఇదీ చంద్రబాబు నైజం. నోటికొచ్చిన హామీలిచ్చి.. వాటిని తుంగలో తొక్కడం.. లేదంటే.. నిబంధనల చట్రంలో బందీలుగా మార్చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. సూపర్ సిక్స్‌తో విప్లవాత్మక మార్పులు వస్తాయంటూ ఊదరగొట్టి.. ఇప్పుడు అమ్మో భయమేస్తోంది.. సిక్స్ కొట్టడం సాధ్యం కాదు.. ప్రజలంతా గమనించాలంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తున్నారు. తల్లులందరికీ వందనమంటూ వంగి వంగి నమస్కారాలు పెట్టిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఈ ఏడాది కాదు.. వచ్చే ఏడాదంటూ తెగేసి చెప్పేశారు. ఇంటికో ఉద్యోగమంటూ ప్రతి చోటా ఊకదంపుడు ఉపన్యాసమిచ్చిన బాబు.. ఇప్పుడు ఇంటికో అబద్ధమనే పథకాన్ని ప్రారంభించారు. నిరుద్యోగులకు భృతి అంటూ మరోసారి బూటకపు మాటలతో బురిడీ కొట్టించి.. యువత ఆశలపై నీళ్లు చల్లారు. ప్రతి మహిళకూ ఆర్థిక ఆసరా కల్పిస్తామంటూ ఇచ్చిన హామీ అమలుకు అతివలు ఆశగా ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎప్పుడొస్తాయా అంటూ ఏజెన్సీల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. బస్సెక్కిన ప్రతిసారీ ఫ్రీ ఎప్పుడని మహిళలంతా అడుగుతున్నారు.నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనంవైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో సంక్షేమం ఇంటింటి తలుపు తట్టింది. ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ క్యాలెండర్ ఏర్పాటు చేసి హామీలు అమలు చేశారు. అమ్మ ఒడి, రైతు భరోసా, చేయూత, ఆసరా.. ఇలా ఒకటా రెండా.. ఇచ్చిన ప్రతి హామీ అమలైంది. ఇంటింటాసంక్షేమం వెల్లివిరిసింది. ఉచిత బస్సు వస్తుందా? ఎన్నికల్లో చంద్రబాబు మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అని హామీ ఇచ్చారు. కూటమి నాయకులు దీనిపై విస్తృతంగా ప్రచారం చేశారు. పక్క రాష్ట్రాల్లో ఏ విధంగా అమలు చేస్తున్నారో చూస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కావస్తోంది. ఇప్పటికీ ఉచిత బస్సు ప్రయాణం అమలు కాలేదు. అసలు ఉచిత బస్సు ప్రయాణం ఉన్నట్టా? లేనట్టా? – మరడాన మంగ, మహారాణిపేటఇంకా సిలిండర్ రాలేదు నిత్యావసర ధరలు పెరగడంతో కుటుంబ పోషణ తలకు మించిన భారం అవుతోంది. ఈ సమయంలో ప్రతీ ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇవ్వడంతో చాలా సంతోషించాం. మా వరకు ఏడాదికి 11 వరకు గ్యాస్ సిలిండర్లు అవసరమవుతాయి. గ్యాస్ సిలిండర్లు అందిస్తే ఉపశమనంగా ఉంటుంది. ప్రభుత్వం స్పందించాలి. – వియ్యపు నాగమణి, త్రినాథపురం అమ్మ ఒడితో అండగా నిలిచారు నాకు ఇద్దరు పిల్లలు. కుమారుడు ఇంటర్, కుమార్తె 8వ తరగతి చదువుతోంది. తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున ఇస్తామని చెప్పారు. పాఠశాలలు ప్రారంభమై దాదాపు నాలుగు నెలలవుతోంది. తల్లికి వందనం పథకం ద్వారా రూ.30 వేలు వస్తుందని ఆశపడ్డా. ఇంత వరకు ఈ పథకం ఊసే లేదు. గత ప్రభుత్వంలో అమ్మ ఒడి పథకాన్ని నిరీ్ణత సమయానికి అమలు చేసి అండగా నిలిచారు. – కూండ్రపు అరుణ, మంగప్పయ్యగారివూరు, పరవాడ మండలంమే లోనే సాయం అందించారుజగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఐదేళ్లూ క్రమం తప్పకుండా అమలు చేశారు. ముఖ్యంగా రైతులను అన్ని విధాలా ఆదుకున్నారు. పెట్టుబడి సాయం, ఈ క్రాప్ నమోదు, రైతు భరోసా కేంద్రాలు, పంటల బీమా, పంట గిట్టుబాటు ధర, పంటల కొనుగోలుతో అండగా నిలిచారు. ఖరీఫ్ పంట కాలానికి సంబంధించి మేలోనే మొదటి విడతగా రైతులకు పెట్టుబడి సాయం అందించేవారు. ఏడాదికి రూ.13,500 సాయం రైతులకు అందేది. దీంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగు చేసుకునేవాళ్లం.– చిల్ల వెంకటరమణ, చిప్పాడ‘తల్లికి వందనం’ ఊసేలేదు? నాకు ఇద్దరు పిల్లలు. పాప నాలుగో తరగతి, బాబు 8వ తరగతి చదువుతున్నాడు. కూటమి అధికారంలోకి వస్తే తల్లికి వందనం ద్వారా ఒక్కొక్కరికి రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇంతవరకు తల్లికి వందనం పథకానికి సంబంధించి ఉలుకూ.. పలుకూ లేదు. ఫీజులు కట్టాలని పాఠశాల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నా యి. తల్లికి వందనం డబ్బులు ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి ద్వారా ఎంతో ప్రయోజనం పొందాను. – టి.వరలక్ష్మి, పాతకొవ్వాడరూ.1,500 ఎప్పుడిస్తారు? మాకు ఇద్దరు అబ్బాయిలు. ఇంటర్ చదువుతున్నారు. నా భర్త ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అద్దె ఇంట్లో ఉంటున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 19 నుంచి 59 ఏళ్ల మధ్య గల ప్రతీ మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామన్నారు. ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తారనే కూటమికి ఓటు వేశాం. ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందే.– మీసాల జయలక్షి్మ, సత్యానగర్భృతి అందేదెప్పుడో? నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. గతంలో ప్రైవేట్ జాబ్ చేసేవాడిని. ఎన్నికల్లో గెలిస్తే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు/నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు, లోకేష్ హామీ ఇవ్వడంతో.. పోటీ పరీక్షలపై దృష్టి సారించాను. ప్రభుత్వం నిరుద్యోగభృతిపై ఊసే ఎత్తడం లేదు. కోచింగ్ సెంటర్, స్టడీ మెటీరియల్‌కు ఎంతో ఖర్చు అవుతోంది. ఇదంతా కుటుంబానికి ఆర్థికంగా భారం. వెంటనే నిరుద్యోగ భృతి అందజేయాలి.– కందుల సంతోష్ 62వ వార్డురైతుకు సాయం దక్కదా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాత సుఖీభవ పేరిట రైతులకు రూ.20 వేలు ఇస్తామన్న హామీ ఇంకా అమలుకు నోచుకోలేదు. మేము వరి, కొబ్బరి, మొక్కజొన్న, అరటి సాగుచేస్తున్నాం. ఈ ఏడాది ప్రభుత్వ సాయం అందకపోవడంతో అప్పులు చేయాల్సి వచ్చింది. వెంటనే ప్రభుత్వం పెట్టుబడి సాయం అందజేయాలి. – నగిరెడ్ల రాంబాబు, వలందపేట -
ప్రజలను ఏమార్చి చంద్రబాబు గెలిచారు: నారాయణ స్వామి
సాక్షి, తిరుపతి: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై దాడులు చేస్తుంటే దీన్ని ప్రజాస్వామ్యం అంటారా అని మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం నేడు ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తోందని మండిపడ్డారు. సూపర్ సిక్స్ అమలు చేయలేనని చంద్రబాబు అనడం అవమానకరని అన్నారు. తిరుపతితో గురువారం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడారు. ‘‘గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజలకు పప్పు, బెల్లంలా సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చేస్తున్నారని ఏడ్చారు. పేదవారికి ఆశ చూపి అధికారంలోకి వచ్చి సూపర్ సిక్స్‌ను చూస్తే భయంగా ఉందని చంద్రబాబు అంటున్నాడు. దళితులు అన్ని రంగాల్లో రాణించాలని అంబేద్కర్ ఆశయం. చంద్రబాబు అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చే విధంగా చూడాలి. విద్య, వైద్యం జోలికి వెళ్లొద్దని చంద్రబాబుకి, రెడ్ బుక్ లోకేష్, పవన్ కళ్యాన్‌లకు విజ్ఞప్తి చేస్తున్నా. వైఎస్ జగన్ నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అని ఎన్నికల ప్రచారం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు కమ్యూనిటీలను నమ్ముకుని ముందుకెళ్ళి అధికారం చేపట్టారు. ..మద్యం పాలసీలో ఎటువంటి అవినీతికి పాల్పడలేదు. మద్యంలో కొత్త బ్రాండ్ లన్ని చంద్రబాబు తీసుకొచ్చిందే. తప్పు చేస్తే ఎటువంటి శిక్షకైనా రెడీ. ప్రస్తుతం టీడీపీ తరుపున పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే, ఎంపీకి కనీసం ఒక గ్రామంలో కూడా సరిగ్గా తెలీదు. చంద్రబాబు ప్రజలను ఏమార్చి గెలిచారు. వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు అమ్మ ఒడి, కార్పోరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను ధీటుగా రెన్యువేషన్ చేయడం, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ విద్య అందించడం, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయడం తప్పా. దళితులు చదువుకోవాలని, వారు సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.పేదలపై పడి దాడులు చేయొద్దు, ఎమ్మెల్యేలుగా ఉన్న మాపై మీ ప్రతాపం చూపండి’’ అని అన్నారు. -
చంద్రబాబు నాయుడు అండ్ కో కుట్రలతో జత కట్టారన్న జగన్
-
సొంత పార్టీ అభ్యర్ధులపై టీడీపీలోనే వ్యతిరేకత
టీడీపీ, జనసేన అభ్యర్థుల తొలిజాబితా ప్రకటించిన తర్వాత అన్ని స్థానాల్లోనూ ఏదో ఒకరకంగా రచ్చ జరుగుతోంది. అభ్యర్థులను ప్రకటించని ఏరియాల్లో సైతం గొడవలు మొదలయ్యాయి. స్థానికులను విస్మరించి బయటి ప్రాంతాల నుంచి అభ్యర్థులను దిగుమతి చేస్తే సహించేదిలేదంటూ గోదావరి జిల్లాల్లోని టీడీపీ నేతలు ఓపెన్‌గా ప్రకటిస్తున్నారు. కొన్ని చోట్ల స్థానికులను కూడా వివిధ కారణాలతో అక్కడి క్యాడర్ వ్యతిరేకిస్తోంది. ఇంతకీ తూర్పు గోదావరి జిల్లా టీడీపీలో ఏం జరుగుతోందో చూద్దాం. జనసేనతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించిన వెంటనే డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సొంత పార్టీ అభ్యర్ధులపై టీడీపీలోనే వ్యతిరేకత ఒక్కసారిగా పెల్లుబికింది. పి.గన్నవరం అభ్యర్ధిగా మహాసేన రాజేష్ పేరును ప్రకటించడంతో.. స్థానిక నేతలు పార్టీ కార్యాలయానికి తాళాలు వేసి, తమ పదవులకు రాజీనామాలు చేసేందుకు సిద్ధమయ్యారు. మహాసేన రాజేష్‌ను తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమంటూ బహిరంగంగానే ప్రకటించేశారు. ఆ తర్వాత జరిగిన టీడీపీ సమన్వయకమటీ సమావేశానికి వచ్చిన జనసేన కార్యకర్తలు టీడీపీ పార్లమెంటరీ ఇంఛార్జి హరీష్ మాథుర్ కారును ధ్వంసం చేశారు. రాజేష్ కు పి.గన్నవరం టిక్కెట్ ఇస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. పార్టీలో తనపట్ల తీవ్రస్థాయిలో పెల్లుబుకుతున్న వ్యతిరేకతను చూసిన రాజేష్ పోటీ నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఇదే జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గంలోని పరిస్థితి మరింత భిన్నంగా ఉంది. టీడీపీ సీనియర్ నేత రెడ్డి సుబ్రమణ్యం ఇక్కడ ఇంఛార్జిగా ఉన్నా, ఆయనను ఏ మాత్రం పట్టించుకోకుండా తనకే సీటు దక్కతుందనే ఆలోచనతో అమలాపురానికి చెందిన వాసంశెట్టి సుభాష్ నియోజకవర్గంలో సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తుండటాన్ని రెడ్డి సుబ్రమణ్యం తప్పుపడుతున్నారు. పార్టీ నాయకత్వం అసలు అభ్యర్ధినే ప్రకటించకుండా...సుభాష్ తానే అభ్యర్ధిలా వ్యవహరించడంపట్ల సుబ్రహ్మణ్యం మండిపడుతున్నారు. రౌడీ షీటర్ సుభాష్ మాకొద్దంటూ టీడీపీ కార్యకర్తలు ప్ల కార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతోపాటు ప్లెక్సీలు, బ్యానర్లు మంటల్లో వేసి దగ్ధం చేశారు. మరోవైపు అధికారికంగా అభ్యర్ధిని ప్రకటించకుండానే రామచంద్రాపురం నియోజకవర్గానికి రెడ్డి సుబ్రమణ్యం సతీమణి పేరు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ సమన్వయకమిటీ సమావేశంలో కూడా దీనిపై తీవ్ర స్థాయిలో రగడ చెలరేగింది. చివరకు ఈ విషయం తనకు తెలియదని, పార్టీ ఎవరి పేరు ప్రకటిస్తే వారే అభ్యర్థిగా ఉంటారని రామచంద్రాపురం ఇంఛార్జి రెడ్డి సుబ్రమణ్యం స్పష్టం చేశాకే జనసేన వర్గాలు శాంతించాయి. -
పవన్‌కు మంత్రి అంబటి స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, గుంటూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు సీరియస్ అయ్యారు. భీమవరంలో పవన్ కల్యాణ్ రౌడీలా మాట్లాడాడు. పవన్ పిచ్చికుక్కలా స్వైరవిహారం చేశాడంటూ కామెంట్స్ చేశారు. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి పవన్ కల్యాణ్ అంటూ కౌంటర్ ఇచ్చారు. కాగా, మంత్రి అంబటి రాంబాబు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. నా కొడకల్లారా అనే పదాన్ని ఉపయోగించిన పవన్.. రాజకీయాల్లో చీడపురుగు. పవన్ మాట్లాడే బూతులు అన్నీ పాలసీనా. ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ ఎవరి జెండా ఎగరేస్తారో చెప్పాలి. పవన్ కల్యాణ్ కులాలను రెచ్చగొడుతున్నారు. కాపులందరినీ బాబు చంక ఎక్కించాలనే పవన్ చూస్తున్నాడు. చంద్రబాబు రావాలనేది పవన్ లక్ష్యం. పెత్తందార్ల పల్లకిని మోస్తున్న వ్యక్తి పవన్. విజయం లేని, రాని రాజకీయ పార్టీ జనసేన. జనసేన వారాహి విజయ యాత్ర పేరులో మాత్రమే విజయం ఉంది. ఉభయ గోదావరి జిల్లాల్లో పోటీ చేసే అధికారంలోకి వస్తారా? అని ప్రశ్నించారు. కేవలం డబ్బు కోసమే పవన్ ఆడే నాటకమని జనసైనికులు తెలుసుకోవాలి అని హితవు పలికారు. ఇది కూడా చదవండి: మహనీయుల పేర్లు ఉచ్చరించే అర్హత పవన్‌కు ఉందా?: గ్రంధి శ్రీనివాస్ ఫైర్ -
చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం గుర్తురాదు
-
పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన సీక్రెట్ ఇదే.. అక్కడ ఏం జరిగింది?
పవన్ కల్యాణ్ ప్రకటన చాలా ఆశ్చర్యంగా, విచిత్రంగా ఉంది.. పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లింది.. బీజేపీ బలపడాలని వారికే చెప్పడానికా..? అసలు పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ఎవరి కోసం..? ఎందుకోసం..? ఆయన సాధించిందేంటీ..?. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ.. దేశంలోనే అత్యంత బలమైన రాజకీయ పార్టీ బీజేపీ. ఏపీలో బలహీనంగా ఉండొచ్చు.. కానీ పవన్ కల్యాణ్ లాంటి బలహీనుడి దగ్గర సలహాలు అయితే తీసుకోదు కదా..! జనసేన స్థాపించి పదేళ్లైనా.. టీడీపీ జెండాలు మోయడానికి, చంద్రబాబు మౌత్ పీస్‌గానే పని చేస్తుందని ప్రజలకు తెలియనిది కాదు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జెండా ఉన్నా.. అద్దెకివ్వడానికే.. అజెండాలేని.. సిద్దాంతాలు ఏమాత్రం లేని పార్టీ జనసేన. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై చంద్రబాబు లైన్‌ను వినిపించడానికి బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ కోసం పవన్ కల్యాణ్ 48 గంటలు వేచి చూడాల్సి వచ్చింది. నడ్డాతో భేటీ తరువాత పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ బాడీ లాంగ్వేజ్ చూస్తే విశాఖపట్నంలో ప్రధాని మోదీ క్లాస్ పీకినట్లు కనిపించిన లాంగ్వేజ్‌నే కనిపించింది. నడ్డా కూడా పవన్ కల్యాణ్‌కు క్లాస్ పీకి ఉంటాడని పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ బాడీ లాంగ్వేజ్‌నే చెబుతోంది. ఏపీలో ఏమాత్రం బలంలేని జనసేన. బలపడాలని బీజేపీకి సూచించానని.. పవన్ చెప్పడం నమ్మశక్యంగా లేదు. చదవండి: యెల్లో బ్యాచ్ డ్రామాకు సీఎం జగన్ చెక్ టీడీపీతో పొత్తు ప్రసక్తేలేదని నడ్డా.. పవన్ ముఖం మీద చెప్పడం వల్లనే.. పొత్తుల గురించి చర్చించలేదని.. పవన్ కల్యాణ్ మీడియా ముందు అబద్ధం చెప్పినట్లు అర్థం చేసుకోవచ్చు. పవన్ కల్యాణ్ అజెండా క్లియర్.. టీడీపీ - జనసేన పొత్తులోకి బీజేపీని లాగి.. 2014లా 2024లో పోటీ చేయాలనేది పవన్ ఉబలాటం. కానీ...చంద్రబాబును బీజేపీ అధిష్టానం నమ్మే పరిస్థితి లేదు. అందుకే.. హెచ్చరికలతోపాటు.. హితోపదేశం బీజేపీ పెద్దలు చేస్తున్నా.. పవర్ లెస్ స్టార్ చెవికెక్కడం లేదు. చంద్రబాబు లైన్లో ఢిల్లీ వెళ్లిన పవన్.. చివరకు మీడియాతో అబద్ధాలు చెప్పి.. బయటపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
టీడీపీ, జనసేనలు ఎప్పుడూ కలిసే ఉన్నాయి: సజ్జల రామకృష్ణా రెడ్డి
-
లోకేష్, పవన్‌పై మంత్రి రోజా సెటైరికల్ కామెంట్స్
సాక్షి, గుంటూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ నేత నారా లోకేష్‌పై మంత్రి రోజా పొలిటికల్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. పవన్ కార్లపై కూర్చుని హంగామా చేశారని వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి రోజా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇప్పటంలో పవన్ రౌడీలా ఊగిపోయాడు. కార్లపై కూర్చుని హంగామా చేశారు. ఇప్పటం విషయంలో ఈనాడు తప్పుడు వార్తలు రాసింది. చివరకు 14 మందకి కోర్టు జరిమానా విధించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏది చేసినా ప్రజల కోసమేనని మరసారి రుజువైంది. రుషికొండలో టూరిజం అభివృద్ధి పనులే జరుగుతున్నాయి. కోర్టు డైరెక్షన్లోనే రుషికొండపై ముందుకెళ్తున్నాము. అమరావతి పాదయాత్రలో పాల్గొన్న వారంతా పెయిడ్ ఆర్టిస్టులే. మంగళగిరిలో గెలవలేని లోకేష్.. సీఎం జగన్‌కు సవాల్ విసురుతున్నాడు. తండ్రి సీఎంగా ఉన్నప్పుడే గెలవలేని లోకేష్.. సవాల్ విసరడం విడ్డూరంగా ఉంది. లోకేష్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. పవన్ కల్యాన్ ఇప్పటం, విశాఖపట్నం రావడం వల్ల మాకు మంచే జరిగింది. గత ఎన్నికల్లో పవన్‌ను ప్రజలు రెండు చోట్లా ఓడించారు. కానీ, భవిష్యత్తులో పవన్ పార్టీని కనిపించకుండా తరిమికొడతారు’ అని అన్నారు. -
ఏపీ పాలిటిక్స్‌లో ‘మూడు ముక్కలాట’
రాజకీయ సిద్ధాంతాలు వేరైనా రహస్య ఎజెండా ఒకటిగా పెట్టుకొని విపక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయి. బీజేపీ ఛీ కొడుతున్నా.. టీడీపీ అంతర్గతంగా సహకరిస్తూ లోపాయికారి రాజకీయం చేస్తోంది. బద్వేల్, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఈ తెర చాటు రాజకీయం తెరపైకి వచ్చింది. పదవిలో ఉండి కాలం చేసిన ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు పోటీచేస్తే టీడీపీ పోటీ చేయదని అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటిస్తారు. ఎన్నికల్లో ఆ పార్టీ శ్రేణులు పోటీ చేసిన బీజేపీకి చురుగ్గా సహకరిస్తాయి. కుట్ర రాజకీయాలు చేయడంలో టీడీపీకి వెన్నతో పెట్టిన విద్యగా పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో మూడు ముక్కలాట తెరపై కనిపిచింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గం తొలుత కాంగ్రెస్‌కు, ఆ తర్వాత వైఎస్సార్సీసీకి కంచుకోటగా నిలుస్తోంది. ప్రజామద్దతు చూరగొని రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిచి మంత్రి అయిన మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. పార్టీ సిద్ధాంతం ప్రకారం ఉప ఎన్నికల్లో ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు పోటీచేస్తే టీడీపీ పోటీ చేయదంటూ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. బద్వేల్లో దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధా పోటీ చేసింది. ఆత్మకూరులో మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి పోటీ చేశారు. రెండు చోట్ల టీడీపీ అభ్యర్థిని బరిలో దింపలేదు. అయితే బీజేపీకి పోలింగ్ ఏజెంట్లుగా టీడీపీ కార్యకర్తలు, నేతలు పని చేయడం చూస్తే రెండు పారీ్టల రహస్య ఎజెండా అర్థమవుతోంది. బీజేపీకి.. జనసేన, టీడీపీ ప్రత్యక్ష సహకారం 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన మద్దతుతో అధికారంలోకి వచ్చిన టీడీపీ అరాచక పాలన సాగించింది. దీంతో 2019 ఎన్నికల్లో టీడీపీని బీజేపీ ఛీత్కరించింది. ఈ ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు ప్రజా మద్దతును కూడగట్టుకోవడంలో విఫలమయ్యాయి. ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షోభాలు ఎదురైనా.. చిత్తశుద్ధితో పేదలకు సంక్షేమ పాలన అందిస్తుండడంతో వైఎస్సార్సీపీ అపార ప్రజామద్దతు పెంచుకుంది. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్సీపీని నిలువరించడం కష్ట సాధ్యమని తెలుసుకున్న విపక్షాలు అంతర్గతంగా చేతులు కలుపుతున్నాయి. టీడీపీ బహిర్గతంగా బీజేపీ ఛీ కొట్టింది. అయినా అంతర్గతంగా బీజేపీకి లోపాయకారి మద్దతు ఇస్తూ టీడీపీ రహస్య ఎజెండాను అమలు చేస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ఉప ఎన్నికల పోలింగ్‌లో తెర వెనుక రాజకీయాలకు తెర తీసిన టీడీపీ.. ఆఖరి క్షణంలో తెరపైకి ప్రత్యక్షమైయ్యారు. పోలింగ్ ఏజెంట్లుగా టీడీపీ వర్గీయులు అవతరించారు. జనసేన నేతలు సైతం అదే ధోరణి ప్రదర్శించారు. బీజేపీకి అండగా ప్రచార పర్వం నుంచి పోలింగ్ దాకా సహకారమందించారు. 2019 సాధారణ ఎన్నికల్లో 2,314 ఓట్లతో 1.33 శాతానికి పరిమితమైన బీజేపీ, 2022 ఉప ఎన్నికల్లో ఆ రెండు పార్టీల సహకారంతో 19,353 ఓట్లతో 14.1 శాతం ఓటు షేర్ దక్కిందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. బీజేపీకి రెండు పార్టీల నేతలు సహకరించినా ఓటింగ్ శాతం ఈ స్థాయికి పరిమితం కావడంతో చూస్తే.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేసినా.. ఒంటరిగా పోటీ చేసినా.. ఆ పారీ్టలకు డిపాజిట్లు కూడా దక్కే అవకాశం ఉందని రాజకీయ పండితులు విశ్లేసిస్తున్నారు. మేకపాటి మంచితనానికి ఆత్మకూరు ప్రజల జేజేలు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 74.47 శాతం ఓట్లు దక్కాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలన, అర్హులందరికీ చిత్తశుద్ధితో ప్రభుత్వ పథకాలు అందిస్తున్న తీరు, మేకపాటి గౌతమ్‌రెడ్డి మంచి తనం ఉప ఎన్నికల్లో ఫలితాల్లో స్పష్టంగా కనిపించిందని పరిశీలకులు చెబుతున్నారు. 2014లో అత్యధిక మెజార్టీ రికార్డు మేకపాటి గౌతమ్‌రెడ్డికి దక్కగా, ఆ జాబితాలో తొలి స్థానాన్ని మేకపాటి విక్రమ్‌రెడ్డి తిరగరాశారు. 82,888 ఓట్లు మెజార్టీ సాధించి భారీ రికార్డును మేకపాటి విక్రమ్‌రెడ్డి వశ పర్చుకుని, తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, సోదరడు దివంగత మేకపాటి గౌతమ్‌రెడ్డి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించనున్నారు. ఇది కూడా చదవండి: వైఎస్సార్సీపీ తిరుగులేని ఆధిక్యం -
జనసేనలో లుకలుకలు.. నేతల డిష్యుం డిష్యుం!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: జనసేన పార్టీలో నేతల మధ్య మాటామాటా పెరిగి కొట్టుకునే వరకు వెళ్లినట్టు తెలుస్తోంది. పార్టీ పీఏసీ సభ్యుడు నాగబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖపట్నంలో శుక్రవారం నిర్వహించిన సమావేశం సందర్భంగా పార్టీ నేతల మధ్య విభేదాలు పొడచూపినట్టు సమాచారం. విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఉదయం విశాఖ అర్బన్, మధ్యాహ్నం విశాఖ రూరల్ నియోజకవర్గాల సమావేశాలను నాగబాబు నిర్వహించారు. కాగా, మధ్యాహ్నం సమావేశం ముగిసిన తర్వాత జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్‌పై ఆ పార్టీ యలమంచిలి నియోజకవర్గ ఇన్చార్జి సుందరపు విజయ్‌కుమార్ ఏకంగా చేయి చేసుకున్నట్టు పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. యలమంచిలిలో పార్టీ ఇన్చార్జి అయిన తనను కాదని.. ఏడాదిక్రితం పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కట్టెంపుడు సతీష్‌ను ప్రోత్సహిస్తున్నారని మండిపడుతూ శివశంకర్‌తో సుందరపు విజయ్‌కుమార్ మొదట వాగ్వాదానికి దిగారు. ఇరువురి మధ్య మాటామాటా పెరగడంతో విజయ్‌కుమార్ ఏకంగా శివశంకర్‌పై చేయిచేసుకోవడమే కాకుండా గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ఉదయం జరిగిన అర్బన్ సమావేశంలోనూ తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణపై జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ భీశెట్టి వెంకటలక్ష్మి, ఆమె భర్త గోపీకృష్ణ మండిపడినట్టు తెలుస్తోంది. పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. మొత్తంగా సమావేశం ముగించుకుని నాగబాబు వెళ్లిన వెంటనే పార్టీ కార్యాలయం సాక్షిగా జరిగిన ఈ ఘటనలు జనసేన పార్టీలో నేతల మధ్య ఉన్న విభేదాలను బయటపెట్టాయి. ఇది కూడా చదవండి: చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు -
కలకలం రేపుతున్న నాదెండ్ల వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల వేడి రాజుకుంటున్న తరుణంలో జనసేన నేత నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాజకీయాల్లో పవన్‌కు తోడుగా నిలుస్తానని చిరంజీవి గతంలోనే హామీ ఇచ్చారని వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. నాదెండ్ల ప్రకనటతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా వేడెక్కింది. బుధవారం విజయవాడలో జనసేన కార్యకర్తలో భేటీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేనాని పవన్ కళ్యాణ్‌ను మళ్లీ సినిమాలు చేసేలా ఒప్పించింది కూడా చిరంజీవేనని పేర్కొన్నారు. రాజకీయాల్లో పవన్‌కు తన పూర్తి సహకారం ఉంటుందని అంతర్గత భేటీలో చిరుతో తనతో చెప్పారని మనోహర్ వెల్లడించారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న మనోహర్ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, చిరంజీవి గతంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, ఫలితాలు వెలువడ్డ తరువాత కాంగ్రెస్‌లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. -
నరసాపురం బరి..ఉద్దండుల గురి..
సాక్షి, భీమవరం: ఎంతో మంది ఉద్దండులను అందించిన నరసాపురం లోక్‌సభా స్థానానికి రాష్ట్రంలో ప్రత్యేకస్థానముంది. ఇక్కడి నుంచి ఎంతోమంది ప్రముఖులు పోటీపడ్డారు. దేశరాజకీయాల దిశనూ మార్చారు. 15సార్లు ఎన్నికలు ఈ లోక్సభాస్థానానికి 1957 నుంచి ఇప్పటి వరకు 15 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. 8 సార్లు కాంగ్రెస్, 4సార్లు టీడీపీ, 2సార్లు బీజేపీ, ఒకసారి సీపీఐ అభ్యర్థులు గెలిచారు. ఈ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. భీమవరం, ఉండి, పాలకొల్లు, నరసాపురం, తణుకు, ఆచంట, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలు ఉండగా ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన మధ్యే ప్రధాన పోటీ. పీవీ ప్రభుత్వాన్ని నిలబెట్టింది నరసాపురమే 1991లో ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థి భూపతిరాజు విజయకుమార్‌రాజు గెలిచారు. ఆ సమయంలో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రభుత్వం సంక్షోభంలో పడటంతో విజయకుమార్‌రాజు నేతృత్వంలో ఐదుగురు టీడీపీ ఎంపీలు కేంద్రంలోని కాంగ్రెస్‌కు మద్దతిచ్చి పీవీ ప్రభుత్వాన్ని నిలబెట్టారు. అప్పట్లో నరసాపురం పేరు మార్మోగింది. ఆ రెండు సామాజిక వర్గాలదే హవా ఈ లోక్సభాస్థానంలో క్షత్రియ, కాపు సామాజికవర్గాలదే ఆధిపత్యం. ఇక్కడ ఆ రెండు వర్గాలకు చెందిన వారే ఎంపీగా ఎన్నికవుతున్నారు. తొలిసారి 1957లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా ఉద్దరాజు రామం లోక్‌సభలో అడుగు పెట్టారు. 1962 నుంచి 71 వరకూ రెండుసార్లు కాంగ్రెస్ తరఫున దాట్ల బలరామరాజు గెలిచారు. 1971లో కాంగ్రెస్ తరఫున ఎం.టి.రాజు ఎన్నికయ్యారు. 1977–84 వరకూ కాంగ్రెస్ నుంచి రెండు పర్యాయాలు అల్లూరి సుభాష్‌చంద్రబోస్ లోక్‌సభకు వెళ్లారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్, టీడీపీ మధ్యే ప్రధాన పోటీ జరిగింది. 1984లో టీడీపీ నుంచి భూపతిరాజు విజయ్‌కుమార్‌రాజు గెలుపొందారు. ఆ తర్వాత 1989లో టీడీపీ అభ్యర్థిగా విజయ్‌కుమార్‌రాజు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాచు శేషగిరిరావు పోటీపడ్డారు. అప్పటి వరకు క్షత్రియ వర్గమే ఎంపీ పీఠాన్ని దక్కించుకోవడంతో అత్యధిక ఓట్లు కాపు సామాజిక వర్గానికి చెందిన శేషగిరిరాజు పోటీ పడడంతో నాచు గెలుపు నల్లేరుపై నడకేనని భావించారు. అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ విజయ్‌కుమార్‌రాజు 13,802 ఓట్ల ఆధిక్యంతో గెలుపొదడంతో ఓటర్లు కుల ప్రమేయం లేని తీర్పునిచ్చారని రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది. 1991 ఎన్నికల్లో టీడీపీ నుంచి విజయ్‌కుమార్‌రాజు, కాంగ్రెస్ నుంచి సినీనటుడు యూవీ కృష్ణంరాజు బరిలో నిలవగా విజయ్‌కుమార్‌రాజు గెలిచారు. ఈ సమయంలోనే కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రధానమంత్రి పీవీ నర్సింహరావు పీఠాన్ని నిలబెట్టేందుకు తెలుగు ఆత్మగౌరవం పేరుతో విజయకుమార్‌రాజు మరో నలుగురు టీడీపీ ఎంపీలతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1996లో టీడీపీ నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడు గెలుపొందారు. 1998లో కాంగ్రెస్ నుంచి కనుమూరి బాపిరాజు గెలిచారు. 1999లో యునైటెడ్ ఫ్రంట్ పార్టీల పొత్తుతో టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్థి సినీనటుడు యూవీ కృష్ణంరాజు విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చేగొండి వెంకట హరరామజోగయ్య (హరిబాబు), బీజేపీ నుంచి యూవీ కృష్ణంరాజు పోటీ పడగా హరి బాబును విజయం వరించింది. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించడంతో టీడీపీ, కాంగ్రెస్, పీఆర్పీ మధ్య త్రిముఖ పోటీ ఏర్పడింది. టీడీపీ అభ్యర్థిగా తోట సీతారామలక్ష్మి, కాంగ్రెస్ నుంచి కనుమూరి బాపిరాజు, పీఆర్పీ నుంచి గుబ్బల తమ్మయ్య పోటీపడ్డారు. బాపిరాజు 1,14,690 ఓట్ల భారీ మెజార్టీతో విజయ కేతనం ఎగురవేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కుదరడంతో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా వంకా రవీంద్రనాథ్, బీజేపీ అభ్యర్థిగా గోకరాజు గంగరాజు, కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా కనుమూరి బాపిరాజు పోటీచేశారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో బీజేపీ గెలిచింది. ఎంపీలంతా కేంద్రాన్ని శాసించిన వారే.... నరసాపురం నుంచి ఎంపీగా ఎన్నికైన నాయకులంతా దాదాపుగా కేంద్రాన్ని శాసించిన నాయకులే. తొలిసారి సీపీఐ నుంచి ఎన్నికైన ఉద్దరాజు రామం ఆ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత దాట్ల బలరామరాజు, ఎంటీ రాజులు కాంగ్రెస్‌లో చురుకైన పాత్ర పోషించారు. అల్లూరి సుభాష్‌చంద్రబోస్ రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లోనూ తన హవాను నడిపారు. బోస్ ఇందిరాగాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితునిగా మెలిగి అసెంబ్లీ ఎన్నికలకు జిల్లాలో అభ్యర్థుల ఎంపికలో కీలకపాత్ర పోషించారు. శాసనసభ్యునిగా రెండు సార్లు ఎన్నికయ్యారు. టీడీపీలో గెలుపొందిన విజయ్‌కుమార్ రాజు ఆ పార్టీలో రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా పాల్గొనడంతోపాటు పార్టీ అధినేత దివంగత ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచారు. బీజేపీలో ఎంపీగా ఉన్న కృష్ణంరాజు కేంద్ర మంత్రివర్గంలో పనిచేశారు. కాంగ్రెస్ నుంచి ఎన్నికైన బాపిరాజు ఆ పార్టీని భుజాన వేసుకుని నడిచారు. ప్రస్తుత ఆర్ఎస్ఎస్లో జాతీయ స్థాయిలో బాధ్యతలు నిర్వర్తిస్తూ ఎంపీగా ఎన్నికైన గోకరాజు గంగరాజుది బీజేపీలో కీలకపాత్రే. ప్రధాన సమస్యలు పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధికి సహజవనరులు పుష్కలంగా ఉన్నా పారిశ్రామికంగా ఎటువంటి అభివృద్ధికీ నోచుకోలేదు. ఎంతోకాలంగా నరసాపురం వద్ద వశిష్టగోదావరిపై వంతెన కలగానే మిగిలింది. ఆక్వారంగం అభివృద్ది చెందుతున్నా ప్రభుత్వపరంగా మౌలిక సదుపాయాల కల్పన, ప్రోత్సాహం కరువైంది. గోదావరి ఏటిగట్టు పటిష్టం చేయడానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఏటిగట్లు పనులు నేటికీ పూర్తి చేయనేలేదు. జాతీయ రహదారులు 216, 216 ఏ అభివృద్ది పనులు నత్తనడకన సాగుతున్నాయి. గోదావరి చెంతనే ఉన్నా కాలుష్యం వల్ల తాగునీటి ఎద్దడి నెలకొంది. భీమవరం, ఉండి, పాలకొల్లు నియోజకవర్గాల్లో రైల్వే ఫ్లైఓవర్ల నిర్మాణం కొలిక్కిరాలేదు. అభ్యర్థి దొరక్క టీడీపీ విలవిల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈ లోక్‌సభా స్థానాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న టీడీపీ ప్రస్తుత ఎన్నికల్లో అభ్యర్థి దొరకక విలవిల్లాడింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇక్కడ 4 సార్లు టీడీపీ, రెండుసార్లు టీడీపీ మద్దతుతో బీజేపీ, మూడుసార్లు కాంగ్రెస్ గెలిచాయి. ఈసారి ఇక్కడ ఆ పార్టీ తరఫున పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో ఉండి ఎమ్మెల్యే వేటుకూరి వెంకటశివరామరాజును బలవంతంగా పోటీలోకి దించారు. అలాగే జనసేన నుంచి ఆ పార్టీ అధినేత సోదరుడు నాగేంద్రబాబు బరిలోకి దిగారు. వైఎస్సార్ సీపీ హవా ఈ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ వైఎస్సార్సీపీ గాలి వీస్తోంది. ఆ పార్టీ తరఫున పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామకృష్ణంరాజు పోటీ చేస్తున్నారు. ఆయన సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుండడంతో ప్రజల్లో ఆదరణ వెల్లువెత్తుతోంది. ప్రస్తుతం విజయావకాశాలు ఆయనకే ఎక్కువగా ఉన్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్లు ఇలా.. నియోజకవర్గం మొత్తం ఓటర్లు పురుషులు మహిళలు ఇతరులు తాడేపల్లిగూడెం 1,96,980 97,078 99,883 19 భీమవరం 2,29,334 1,12,836 1,16392 106 నరసాపురం 1,59,144 79,727 79,416 01 పాలకొల్లు 1,80,965 89,491 91,435 39 ఆచంట 1,66,421 82,547 83,866 08 ఉండి 2,11,647 1,04,925 1,06,707 15 తణుకు 2,18,163 1,06,804 1,11,353 06 -
పవన్.. విద్వేషాలు రెచ్చగొడతావా?
►ఇదేనా పవనిజం.. తమ్మారెడ్డి సూటి ప్రశ్న ►ప్రశ్నిస్తానంటూ వచ్చి ద్వేషాలు ఉసిగొల్పుతావా ►తెలుగు ఆత్మగౌరవాన్ని బాబు మోడీకి తాకట్టు పెట్టారు ►సీమాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి గరికిపాటి ఉమాకాంత్: ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చాను.. జనసేన పార్టీ పెట్టానంటూ సరిగ్గా ఎన్నికల సమయంలో హడావుడి చేస్తున్న సినీనటుడు పవన్‌కల్యాణ్, తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, సీమాంధ్రలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యంగా విమర్శలు చేసి రాజకీయాల్లో విద్వేషాలను ఉసిగొల్పారని.. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో పవన్ తీరు బాధ్యతారహితమని ఆయన విమర్శించారు. ఇటీవల ఆయన వర్తమాన రాజకీయాలపై యూట్యూబ్‌లో తన అభిప్రాయాన్ని వినిపించారు. దీనిపై టీడీపీ, పవన్ అభిమానుల నుంచి తీవ్రమైన విమర్శలు వస్తున్న నేపథ్యంలో మంగళవారం ‘సాక్షి’ ప్రతినిధితో తమ్మారెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. పవన్ ఈ ఎన్నికల ప్రచారంలో కేవలం ఇద్దర్నే టార్గెట్ చేసుకుని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఒకరు కేసీఆర్.. మరొకరు జగన్... ఇప్పుడు రాష్ట్రం ముక్కలైంది.. కొత్త రాష్ట్రాలను ఎలా అభివృద్ధి చేసుకోవాలో మాట్లాడాలి కానీ ఇక్కడ కేసీఆర్‌ను.. అక్కడ జగన్‌ను విమర్శిస్తే ఏమొస్తుంది? తెలంగాణ అభివృద్ధికి నీ వద్ద ఉన్న ఆలోచనలేంటి.. నువ్విచ్చే సలహాలేంటి.. ఇవేమీ చెప్పకుండా ఊరికే కేసీఆర్‌ను తిడితే ఏం ప్రయోజనం? విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప! అక్కడ జగన్మోహన్రెడ్డిని.. ఆయన వాళ్ల నాన్న తరహా మంచి పాలన అందిస్తామని చెబుతుంటే నీకు నచ్చకుంటే సద్వివిమర్శలు చేయాలి గానీ అదేపనిగా తిట్టడమేంటి? నువ్వు ఏం చెప్పి రాజకీయాల్లోకి వచ్చావు? ఏనాడైనా ప్రజల సమస్యలపై మాట్లాడావా? సమాజానికి మేలు చేసే విషయాలు ప్రజలతో చర్చించావా? పోనీ నీవు సపోర్ట్ చేస్తున్న నరేంద్ర మోడీతో ఎప్పుడైనా ప్రజల ఇబ్బందులు గురించి మాట్లాడావా... వేటి గురించి చర్చించకుండా తిట్టు.. తిట్టు.. తిట్టు... ఇదే నా నీ రాజకీయం? సింగపూర్‌లో నీళ్లు కొనుక్కుంటున్నారు.. ఎన్టీఆర్ తెలుగోడి సత్తాను విశ్వవ్యాప్తం చేస్తే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నరేంద్రమోడీ కాళ్ల వద్ద తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. ఇది నిజంగా మనం సిగ్గుపడాల్సిన విషయం. మాట్లాడితే బాబు కొత్త రాష్ట్రాన్ని సింగపూర్‌లా చేస్తానని అంటున్నారు. అసలు సింగపూర్‌లో తాగేందుకు మంచినీళ్లు దొరక్క ప్రతి ఒక్కరూ కొనుక్కోవాల్సిన పరిస్థితులున్నాయి. అలాంటి పరిస్థితులనే ఇక్కడ తీసుకొస్తారా? ఇక మోడీతో దేశంలోని చాలా రాష్ట్రాల్లో వివిధ పార్టీల నేతలు పొత్తు పెట్టుకున్నారు.. కానీ ఎవ్వరూ బాబులా ఆయన ముందు సాగిలపడలేదు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు టీడీపీ మద్దతు కోసం జాతీయస్థాయి నేతలు తహతహలాడేవారు. అంతెందుకు బీజేపీ నేత అద్వానీ కూడా ఎన్టీఆర్ వద్దకు వచ్చే వారు... అలాంటి టీడీపీని బాబు ఇలా దిగజార్చారు. బాబు, పవన్‌ల వ్యవహార శైలిపై ప్రజలు సరిగ్గా ఆలోచించి స్పందించాలి.