
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల వేడి రాజుకుంటున్న తరుణంలో జనసేన నేత నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాజకీయాల్లో పవన్‌కు తోడుగా నిలుస్తానని చిరంజీవి గతంలోనే హామీ ఇచ్చారని వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. నాదెండ్ల ప్రకనటతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా వేడెక్కింది. బుధవారం విజయవాడలో జనసేన కార్యకర్తలో భేటీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేనాని పవన్ కళ్యాణ్‌ను మళ్లీ సినిమాలు చేసేలా ఒప్పించింది కూడా చిరంజీవేనని పేర్కొన్నారు.
రాజకీయాల్లో పవన్‌కు తన పూర్తి సహకారం ఉంటుందని అంతర్గత భేటీలో చిరుతో తనతో చెప్పారని మనోహర్ వెల్లడించారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న మనోహర్ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, చిరంజీవి గతంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, ఫలితాలు వెలువడ్డ తరువాత కాంగ్రెస్‌లో విలీనం చేసిన సంగతి తెలిసిందే.