Nadendla Manoher
-
మనోహర్ ఆస్తి పెరిగింది!
తెనాలిరూరల్: జనసేన పార్టీ తరఫున తెనాలి అభ్యర్థిగా నామినేషన్ వేసిన నాదెండ్ల మనోహర్ తన ఆస్తి రూ 22.89 కోట్లుగా ప్రకటించారు. 2019 కన్నా రూ. 12 కోట్లు పెరిగినట్టు అఫిడడవిట్‌లో పేర్కొ న్నారు. తనపేరిట రూ. 1,48, 03,300 విలువ చేసే చరాస్తులు ఉండగా తన భార్య పేర రూ. 2,49,33,338, కుమారుడి పేర రూ. 3,63,966 చరాస్తులు ఉన్న ట్టు చూపారు.తన పేర రూ, 1.95 కోట్ల విలువ చేసే 6.32 ఎకరాల వ్యవసాయ భూమి, తన భార్య పేరిట ద్వారకా తిరుమల, కర్ణాటకలలో రూ. 8.75 కోట్ల విలువ చేసే 8.54 ఎకరాల వ్యవసాయ భూమి, శేరిలింగంపల్లిలో రూ. 2,99,15,000 విలువ చేసే ఫ్లాట్, జూబ్లి హిల్స్‌లో రూ. 4,59,40. 000 విలువ చేసే ప్లాట్ ఉన్నట్టు చూపారు. తన పేరిట రూ. 43,96,641 వాహన రుణం ఉండగా తన భార్యకు రూ. నాలుగు కోట్లు రుణం ఉందని చూపారు. ఇక తనపై ఎటువంటి కేసులు లేవని స్పష్టం చేశారు. కాగా 2019లో తన ఆస్తి రూ. 10,68,78,117గా మనోహర్ చూపారు. తెనాలిలో మనోహర్ నామినేషన్ తెనాలిరూరల్: నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రపసాద్, బీజేపీ నేతలు, జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలతో ఐతాన గర్ లింగారావు సెంటరు నుండి భారీ ర్యాలీగా గాం«దీచౌక్, శివాజీచౌక్‌ల మీదుగా సబ్‌కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. తన భార్య మనోహరం, ఆలపాటి రాజా తదితరులతో కలసి రిటరి్నంగ్ అధికారి ప్రఖర్ జైన్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు. -
నాదెండ్ల బుకాయింపు.. రామోజీ దరువు!
సాక్షి, అమరావతి: బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నాడట! చంద్రబాబుతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ నోటికొచ్చిన అబద్ధాలు వల్లిస్తే రాజగురువు రామోజీ తాటికాయంత అక్షరాలతో ముద్రించి మురిసిపోయారు! సలహాదారుల పేరుతో 89 మందిని నియమించారని.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.680 కోట్లు వ్యయం చేసిందని.. ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డికే రూ.140 కోట్లు చెల్లించారంటూ నాదెండ్ల గాలి కబుర్లు చెప్పారు.అసలు ప్రభుత్వం నియమించిందే 46 మంది సలహాదారులైతే మిగతావారంతా ఎక్కడి నుంచి వచ్చినట్లు? నాదెండ్ల ఆరోపణల్లో నిజం లేదని ఇక్కడే తేలిపోతోంది. నెలకు రూ.లక్షన్నర లోపే జీతభత్యాల రూపంలో చెల్లిస్తుండగా ఏకంగా రూ.వందల కోట్లు ఇస్తున్నారంటూ నిస్సిగ్గుగా అబద్ధాలను ప్రచురించారు.రాష్ట్ర ప్రభుత్వం ఏ హోదాలో సలహాదారులను నియమిస్తోంది? వారికి వేతనాలు, భత్యాల రూపంలో ఎంత చెల్లిస్తున్నారు? అనే వివరాలు జీవోల రూపంలో పారదర్శకంగానే ఉన్నా గోప్యంగా దాచిపెడుతున్నట్లు ఎల్లో మీడియా దుష్ప్రచారానికి తెగబడుతోంది. 2023–24లో మంత్రులు, చైర్మన్లు, సలహాదారుల కోసం బడ్జెట్ కేటాయింపులే రూ.29.61 కోట్లు అయినప్పుడు ఒక్క సలహాదారులకే రూ.వందల కోట్లు చెల్లించడం ఎలా సాధ్యమవుతుందని అధికార యంత్రాంగం విస్మయం వ్యక్తం చేస్తోంది. ♦ రాష్ట్రప్రభుత్వం ఐదు కేటగిరీలుగా సలహాదారులను నియమిస్తోంది. కేటగిరీ ‘ఎస్’ కింద నియమితులైన వారికి క్యాబినెట్ ర్యాంక్ ప్రోటోకాల్ మాత్రమే ఉంటుంది. వారికి సిబ్బంది కానీ జీతభత్యాలు కానీ ఉండవు. క్యాబినెట్ ర్యాంక్ ఉన్న సలహాదారులకు క్యాబినెట్ మంత్రులతో సమానంగా వసతులు క ల్పిస్తారు. ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ఎలాంటి గౌరవ వేతనాలు లేకుండా సలహాదారులుగా వ్యవహరిస్తున్నారు. ♦చంద్రబాబు అధికారంలో ఉండగా రాజధాని డిజైన్ల పేరుతో ప్రచార ఆర్భాటం కోసం కన్సల్టెన్సీలు, సలహాదారులకు రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని గుమ్మరించారు. నార్మన్ ఫోస్టర్, సుర్బానా జురాంగ్ తదితర కన్సల్టెన్సీ సంస్థలు ఈ జాబితాలోనే ఉన్నాయి.పోలవరం సందర్శన పేరుతో చంద్రన్నకు జయము జయము అంటూ సొంత ప్రచారం కోసం బస్సుల్లో జనాన్ని తరలించేందుకు డబ్బులను నీళ్లలా ఖర్చు చేశారు. గోదావరి, కృష్ణా పుష్కరాల సమయంలో షూటింగ్‌లను తలపిస్తూ సినీ దర్శకుడితో డ్రోన్లతో చిత్రీకరణకు విచ్చలవిడిగా ఖర్చు చేయడంతోపాటు అమాయకులను పొట్టనబెట్టుకున్నారు. ఇప్పుడు గుండెలు బాదుకుంటున్న రామోజీగానీ నాదెండ్లగానీ అప్పుడు నోరెత్తితే ఒట్టు!.ఫేక్ ప్రచారంఎల్లో మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్న టీడీపీకి ఈసారి కూడా ప్రజలు దిమ్మతిరిగే తీర్పు ఇవ్వడం ఖాయమని, శాశ్వత సమాధి తప్పదని వైఎస్సార్సీపీ శుక్రవారం ట్విట్టర్లో పేర్కొంది. సలహాదారులకు రూ.వందల కోట్లు చెల్లిస్తున్నారంటూ నిస్సిగ్గుగా అబద్ధాలను వల్లిస్తున్నారని మండిపడింది. -
కలకలం రేపుతున్న నాదెండ్ల వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల వేడి రాజుకుంటున్న తరుణంలో జనసేన నేత నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాజకీయాల్లో పవన్‌కు తోడుగా నిలుస్తానని చిరంజీవి గతంలోనే హామీ ఇచ్చారని వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. నాదెండ్ల ప్రకనటతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా వేడెక్కింది. బుధవారం విజయవాడలో జనసేన కార్యకర్తలో భేటీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేనాని పవన్ కళ్యాణ్‌ను మళ్లీ సినిమాలు చేసేలా ఒప్పించింది కూడా చిరంజీవేనని పేర్కొన్నారు. రాజకీయాల్లో పవన్‌కు తన పూర్తి సహకారం ఉంటుందని అంతర్గత భేటీలో చిరుతో తనతో చెప్పారని మనోహర్ వెల్లడించారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న మనోహర్ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, చిరంజీవి గతంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, ఫలితాలు వెలువడ్డ తరువాత కాంగ్రెస్‌లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. -
రెండేళ్లలో రూ.80 వేల కోట్ల అప్పులా?
తెనాలి: అప్పులు చేసి పప్పుబెల్లాలు తింటున్న చందంగా ప్రభుత్వం అనవసర కార్యక్రమాలకు విచ్చలవిడి వ్యయం చేస్తూ వేలాది కోట్ల రూపాయల అప్పుల భారాన్ని ప్రజానీకంపై మోపుతోందని పీసీసీ ఉపాధ్యక్షుడు, శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆందోళన వ్యక్తంచేశారు. రెండేళ్ల పదవీ కాలంలో మూడు బడ్జెట్లను ప్రవేశపెట్టిన ప్రభుత్వం, అందులోని మొత్తాన్ని ఖర్చుపెట్టామని చెబుతూనే రూ.80 వేల కోట్ల అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చినట్టు అమిత్‌షా ప్రకటించిన రూ.1.40 లక్షల కోట్ల డబ్బు ఏమైందనే ప్రశ్నలను తేటతెల్లం చేయాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రభుత్వం చేసిన ఆదాయ వ్యయాలపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెనాలిలోని స్వగృహంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మనోహర్ మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పులు రూ.1.78 లక్షల కోట్లు కాగా, విభజన సమయంలో మన వాటా రూ.1,04,189 కోట్లుగా తేల్చినట్టు గుర్తుచేశారు. రెండేళ్లలో ఆ అప్పులు రూ.1,90,513 కోట్లకు పెరిగాయంటే రూ.80 వేల కోట్ల అప్పులు చేసినట్టు స్పష్టమవుతోందన్నారు. వడ్డీ కిందనే రూ.11 వేల కోట్లను వెచ్చించాల్సి ఉందన్నారు. రుణమాఫీ అన్నారు...రైతులకు అన్యాయం చేశారంటూ, మాఫీ పేరుతో పొదుపు సంఘాల మహిళలను వంచించారని, కొత్తగా అర్జీలు పెట్టుకున్న ఏ ఒక్క పేదవాడి కోసం ఇల్లు నిర్మించిన పాపాన పోలేదన్నారు. భాగస్వామ్య ఒప్పంద సదస్సు, ఎంఓయూలతో వేలాది కోట్ల పెట్టుబడులు వస్తాయన్న ఆర్భాటాల్లోనూ పస లేదని వెల్లడైందన్నారు. అప్పులు తెచ్చిన అనవసర కార్యక్రమాలకు వెచ్చిస్తూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం కనీసం ప్రత్యేకహోదా కోసం ప్రయత్నం చేయటం లేదని ఆరోపించారు. సమావేశంలో పార్టీ నేతలు తోటకూర వెంకట రమణారావు, ఎం.దశర«థరామిరెడ్డి, షేక్ రహిమాన్, దొడ్డక ఆదినారాయణ, నల్లగొర్ల నాగేశ్వరరావు. పిల్లి సుధాకర్ పాల్గొన్నారు. శ్వేతపత్రం విడుదల చేయండి పీసీసీ ఉపాధ్యక్షుడు, శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ -
రెండేళ్లలో రూ.80 వేల కోట్ల అప్పులా?
శ్వేతపత్రం విడుదల చేయండి పీసీసీ ఉపాధ్యక్షుడు, శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెనాలి: అప్పులు చేసి పప్పుబెల్లాలు తింటున్న చందంగా ప్రభుత్వం అనవసర కార్యక్రమాలకు విచ్చలవిడి వ్యయం చేస్తూ వేలాది కోట్ల రూపాయల అప్పుల భారాన్ని ప్రజానీకంపై మోపుతోందని పీసీసీ ఉపాధ్యక్షుడు, శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆందోళన వ్యక్తంచేశారు. రెండేళ్ల పదవీ కాలంలో మూడు బడ్జెట్లను ప్రవేశపెట్టిన ప్రభుత్వం, అందులోని మొత్తాన్ని ఖర్చుపెట్టామని చెబుతూనే రూ.80 వేల కోట్ల అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చినట్టు అమిత్‌షా ప్రకటించిన రూ.1.40 లక్షల కోట్ల డబ్బు ఏమైందనే ప్రశ్నలను తేటతెల్లం చేయాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రభుత్వం చేసిన ఆదాయ వ్యయాలపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెనాలిలోని స్వగృహంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మనోహర్ మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పులు రూ.1.78 లక్షల కోట్లు కాగా, విభజన సమయంలో మన వాటా రూ.1,04,189 కోట్లుగా తేల్చినట్టు గుర్తుచేశారు. రెండేళ్లలో ఆ అప్పులు రూ.1,90,513 కోట్లకు పెరిగాయంటే రూ.80 వేల కోట్ల అప్పులు చేసినట్టు స్పష్టమవుతోందన్నారు. వడ్డీ కిందనే రూ.11 వేల కోట్లను వెచ్చించాల్సి ఉందన్నారు. రుణమాఫీ అన్నారు...రైతులకు అన్యాయం చేశారంటూ, మాఫీ పేరుతో పొదుపు సంఘాల మహిళలను వంచించారని, కొత్తగా అర్జీలు పెట్టుకున్న ఏ ఒక్క పేదవాడి కోసం ఇల్లు నిర్మించిన పాపాన పోలేదన్నారు. భాగస్వామ్య ఒప్పంద సదస్సు, ఎంఓయూలతో వేలాది కోట్ల పెట్టుబడులు వస్తాయన్న ఆర్భాటాల్లోనూ పస లేదని వెల్లడైందన్నారు. అప్పులు తెచ్చిన అనవసర కార్యక్రమాలకు వెచ్చిస్తూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం కనీసం ప్రత్యేకహోదా కోసం ప్రయత్నం చేయటం లేదని ఆరోపించారు. సమావేశంలో పార్టీ నేతలు తోటకూర వెంకట రమణారావు, ఎం.దశర«థరామిరెడ్డి, షేక్ రహిమాన్, దొడ్డక ఆదినారాయణ, నల్లగొర్ల నాగేశ్వరరావు. పిల్లి సుధాకర్ పాల్గొన్నారు.