తెనాలిరూరల్: జనసేన పార్టీ తరఫున తెనాలి అభ్యర్థిగా నామినేషన్ వేసిన నాదెండ్ల మనోహర్ తన ఆస్తి రూ 22.89 కోట్లుగా ప్రకటించారు. 2019 కన్నా రూ. 12 కోట్లు పెరిగినట్టు అఫిడడవిట్‌లో పేర్కొ న్నారు. తనపేరిట రూ. 1,48, 03,300 విలువ చేసే చరాస్తులు ఉండగా తన భార్య పేర రూ. 2,49,33,338, కుమారుడి పేర రూ. 3,63,966 చరాస్తులు ఉన్న ట్టు చూపారు.
తన పేర రూ, 1.95 కోట్ల విలువ చేసే 6.32 ఎకరాల వ్యవసాయ భూమి, తన భార్య పేరిట ద్వారకా తిరుమల, కర్ణాటకలలో రూ. 8.75 కోట్ల విలువ చేసే 8.54 ఎకరాల వ్యవసాయ భూమి, శేరిలింగంపల్లిలో రూ. 2,99,15,000 విలువ చేసే ఫ్లాట్, జూబ్లి హిల్స్‌లో రూ. 4,59,40. 000 విలువ చేసే ప్లాట్ ఉన్నట్టు చూపారు. తన పేరిట రూ. 43,96,641 వాహన రుణం ఉండగా తన భార్యకు రూ. నాలుగు కోట్లు రుణం ఉందని చూపారు. ఇక తనపై ఎటువంటి కేసులు లేవని స్పష్టం చేశారు. కాగా 2019లో తన ఆస్తి రూ. 10,68,78,117గా మనోహర్ చూపారు.
తెనాలిలో మనోహర్ నామినేషన్
తెనాలిరూరల్: నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రపసాద్, బీజేపీ నేతలు, జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలతో ఐతాన గర్ లింగారావు సెంటరు నుండి భారీ ర్యాలీగా గాం«దీచౌక్, శివాజీచౌక్‌ల మీదుగా సబ్‌కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. తన భార్య మనోహరం, ఆలపాటి రాజా తదితరులతో కలసి రిటరి్నంగ్ అధికారి ప్రఖర్ జైన్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment