nomination filed
-
చీపురుతో తుడిచేస్తా.. కేజీవాల్ నామినేషన్
-
పెద్దిరెడ్డి నామినేషన్ టైంలో హైడ్రామా.. బొత్స ఆగ్రహం
సాక్షి, అమరావతి: పీఏసీ చైర్మన్ పదవికి మాజీ మంత్రి, పుంగనూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్ స్వీకరణకు ముందు అసెంబ్లీలో పెద్ద హైడ్రామానే నడిచింది. పెద్దిరెడ్డిని, ఆయనతో ఉన్న వైఎస్సార్సీపీ నేతలను అధికారులు 2 గంటలపాటు ఎదురుచూసేలా చేశారు. ఈ పరిణామంపై బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీ చైర్మన్ నామినేషన్ దాఖలు కోసం గడువు మధ్యాహ్నం 1 గంటతోనే ముగియాల్సి ఉంది. దీంతో నామినేషన్ పత్రాలతో వైఎస్సార్సీపీ నేతలు 11గం.కే అసెంబ్లీ కార్యదర్శి ఛాంబర్ వద్దకు చేరారు. అయితే అధికారులు లేకపోవడంతో ఎదురు చూడసాగారు. సుమారు 2 గంటలపాటు అధికారుల రాక కోసం వాళ్లంతా పడిగాపులు కాశారు. నామినేషన్ ముగింపు గడువు దగ్గర పడుతుండడంతో.. విషయం తెలిసి బొత్స అక్కడికి వచ్చారు. ‘‘సమయం పెట్టి కూడా నామినేషన్ తీసుకోరా? ఇంత సేపు ఎమ్మెల్యేలను ఎదురు చూసేలా చేస్తారా?’’ అంటూ అంటూ అసెంబ్లీ కార్యదర్శి ప్రసన్న కుమార్‌పై మండిపడ్డారు. అదే సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు.. అటువైపు రావడం బొత్స గమనించారు. అచ్చెన్నను ఆపి అధికారుల తీరు గురించి ప్రస్తావించారు. దీనిపై స్పందించిన మంత్రి అచ్చెన్న.. అధికారులతో తాను మాట్లాడతానని చెప్పి వెళ్లిపోయారు.కాసేపటికే అధికారులు వచ్చి.. పెద్దిరెడ్డి నామినేషన్ స్వీకరించారు. ఈ నామినేషన్‌ను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ బలపరిచారు. -
రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కేంద్ర మంత్రి
భోపాల్: కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ రాజ్యసభ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా జార్జ్ కురియన్ను భోపాల్‌లో నామినేషన్ వేశారు. జ్యోతిరాదిత్య సింధియా లోక్‌సభకు ఎన్నికవ్వడంతో.. ఖాళీ అయిన మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానానికి కురియన్ను తమ అభ్యర్థిగా బీజేపీ మంగళవారం సాయంత్రం ప్రకటించింది.ప్రస్తుతం జార్జ్ కురియన్ మోదీ 3.0 కేబినెట్లో ఫిషరీస్, పశుసంవర్ధక పాడి పరిశ్రమ, మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. బుధవారం ఉదయం భోపాల్ చేరుకున్న కురియన్‌కు అక్కడ రాష్ట్ర బీజేపీ చీఫ్ వీడీ శర్మ ఆయనకు స్వాగతం పలికారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి మోహన్‌యాదవ్‌ను ఆయన నివాసంలో కలిశారు. అనంతరం రాష్ట్ర అసెంబ్లీ కాంప్లెక్స్‌లో సీఎం యాదవ్, ఉప ముఖ్యమంత్రులు రాజేంద్ర శుక్లా, జగదీష్ దేవదా, రాష్ట్ర బీజేపీ చీఫ్ శర్మ సమక్షంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారని పార్టీ అధికార ప్రతినిధి ఆశిష్ అగర్వాల్ తెలిపారు.ఇక పలు రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికలకు బీజేపీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. సెప్టెంబర్ 3వ తేదీన జరగనున్న ఈ ఎన్నికలకు కేంద్రమంత్రులు రణ్‌వీత్‌సింగ్ బిట్టూ (రాజస్థాన్ నుంచి), జార్జి కురియన్ (మధ్యప్రదేశ్ నుంచి)ను అభ్యర్థులగా బరిలో దించింది. బిజూ జనతాదళ్ మాజీ నేత మమత మొహంతను ఒడిశా నుంచి తమ అభ్యర్థిగా ప్రకటించిన కమలం పార్టీ.. బార్ కౌన్సిల్ ఛైర్మన్, సీనియర్ అడ్వకేట్ మనన్ కుమార్ మిశ్రాను బిహార్ నుంచి పోటీకి దించింది. సార్వత్రిక ఎన్నికల్లో బరిలో దిగిన నేపథ్యంలో పలువురు సభ్యులు రాజీనామాలు చేయడం, అలాగే, తెలంగాణలో బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు, ఒడిశాలో బిజేడీ ఎంపీ మమతా మొహంత తమ పదవులకు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. -
ఎమ్మెల్సీ ఎన్నికలు.. నామినేషన్ వేసిన బొత్స సత్యనారాయణ
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు వైఎస్సార్సీపీకి పూర్తిగా బలం ఉందన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. అనైతికంగా కూటమి సర్కార్ ఎందుకు అభ్యర్థిని పోటీలో నిలుపుతోందని ప్రశ్నించారు.కాగా, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమవారం బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈరోజు నామినేషన్ వేశాను. మాకు సంఖ్యా బలం ఉంది. వైఎస్సార్సీపీ తప్పకుండా విజయం సాధిస్తుంది. మాకు 530 మందికి పైగా ప్రజాప్రతినిధుల బలం ఉన్నప్పుడు కూటమి అభ్యర్థిని ఎందుకు బరిలో నిలుపుతోంది?. వైఎస్సార్సీపీకి బలం ఉన్నప్పుడు అనైతికంగా ఎందుకు అభ్యర్థిని పెడుతున్నారు.ఒకవేళ టీడీపీ కనుక అభ్యర్థిని నిలబెడితే అది దుశ్చర్య అవుతుంది. ఇదిమే వ్యాపారం కాదు. మోజార్టీ ఉంది కాబట్టే పోటీ చేస్తున్నాం. మాకు నివాదం అవసరం లేదు. రాజకీయాల్లో విలువలు అవసరం. సంఖ్య దగ్గరగా ఉంటే తప్పులేదు. మాకు మెజార్టీ ఉన్నప్పుడు టీడీపీ అభ్యర్థిని నిలబెడుతుందని నేను అనుకోవడం లేదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
కాసేపట్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్
సాక్షి, విశాఖపట్నం: మరికాసేపట్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేయనున్నారు. బొత్స నివాసానికి పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. పార్టీ నాయకులతో కలిపి ఇంటి నుంచి కలెక్టరేట్‌కు బొత్స బయలుదేరనున్నారు.కాగా, రేపటితో నామినేషన్లకు గడువు ముగుస్తుండగా, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై కూటమిలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. అభ్యర్థి ఎంపికపై ఆరు మంది సభ్యులతో చంద్రబాబు కమిటీ ఏర్పాటు చేయగా.. అభ్యర్థి ఎంపికపై నేడు మరోసారి నాయకులు సమావేశం కానున్నారు. బొత్స పై పోటీకి స్థానిక నాయకులు ముందుకు రాలేదు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొత్తగా దిలీప్ చక్రవర్తి పేరు తెరపైకి రాగా, ప్రచారంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ దూసుకుపోతున్నారు.స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి మరింత బలం పెరిగింది. ఆరు వందలకుపైగా ఓటర్లతో ఇప్పటికే స్పష్టమైన ఆధిక్యత ఉంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 838 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 39 మంది జెడ్పీటీసీల్లో ప్రస్తుతం 36 మంది జెడ్పీటీసీ ఉన్నారు. అల్లూరి జిల్లాకు చెందిన హుకుంపేట జెడ్పీటీసీ రేగం మత్స్యలింగం అరకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రావికమతం జెడ్పీటీసీ తలారి రమణమ్మ, సబ్బవరం జెడ్పీటీసీ తుంపాల అప్పారావు చనిపోయారు. ప్రస్తు తం ఉన్న జెడ్పీటీసీల్లో వైఎస్సార్సీపీకి 34 మంది, టీడీపీకి నర్సీపట్నం జెడ్పీటీసీ, సీపీఎంకి అనంతగిరి జెడ్పీటీసీ ఉన్నారు. మొత్తం 652 మంది ఎంపీటీసీలకు గాను 636 మంది ఎంపీటీసీలు ఉన్నారు.స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 838 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 39 మంది జెడ్పీటీసీల్లో ప్రస్తుతం 36 మంది జెడ్పీటీసీ ఉన్నారు. అల్లూరి జిల్లాకు చెందిన హుకుంపేట జెడ్పీటీసీ రేగం మత్స్యలింగం అరకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రావికమతం జెడ్పీటీసీ తలారి రమణమ్మ, సబ్బవరం జెడ్పీటీసీ తుంపాల అప్పారావు చనిపోయారు. ప్రస్తు తం ఉన్న జెడ్పీటీసీల్లో వైఎస్సార్సీపీకి 34 మంది, టీడీపీకి నర్సీపట్నం జెడ్పీటీసీ, సీపీఎంకి అనంతగిరి జెడ్పీటీసీ ఉన్నారు. మొత్తం 652 మంది ఎంపీటీసీలకు గాను 636 మంది ఎంపీటీసీలు ఉన్నారు. -
ఏపీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు నామినేషన్
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు నామినేషన్ వేశారు. శుక్రవారం ఉదయం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం అయ్యన్న తరపున కూటమి నేతలు నామినేషన్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి మంత్రులు పవన్, నారా లోకేష్, ఇతరులు పాల్గొన్నారు.ఏపీ అసెంబ్లీలో ఇవాళ 172 మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి నాలుగు పార్టీల ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. ఇక రేపు మిగిలిన ముగ్గురు సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయనున్నారు. ఆ తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక డిప్యూటీ స్పీకర్ పోస్ట్ జనసేన లేదంటే బీజేపీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపించినప్పటికీ.. టీడీపీనే ఆ పోస్ట్ దక్కించుకునే అవకాశాలు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డిప్యూటీ స్పీకర్ బదులు జనసేనకు విప్ పోస్ట్‌తో సరిపెట్టవచ్చని సమాచారం.అయ్యన్నపాత్రుడి కామెంట్స్.. చంద్రబాబు , పవన్, బీజేపీ నేతలు నన్ను స్పీకర్ గా నామినేట్ చేశారు. నామినేషన్ వేశాను. సాయంత్రం వరకు నామినేషన్ గడువు ఉంది..ఇంకా ఎవరైనా వేస్తారేమో వేచి చూడాలి. స్పీకర్ గా ఎన్నిక కావడం సంతోషం గా ఉంది. గతంలో ఎమ్మెల్యే గా, మంత్రిగా, ఎంపీ గా పని చేశాను. స్పీకర్ గా కుర్చీలో కూర్చున్న తరువుతా పార్టీ గుర్తు రాకూడదు. గౌరవ సభ్యులకు కూడా ప్రాధాన్యత ఇస్తాను. మాట్లాడేందుకు సమయం ఇస్తాను. -
నామినేషన్ వెనక్కి.. ప్రముఖ నటుడికి ఊరట
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో పలు ఆసక్తికర ఉదంతాలు కూడా వెలుగు చూస్తున్నాయి. బీహార్‌లోని కరకట్ లోక్‌సభ స్థానంలో విచిత్ర రాజకీయ వాతావరణం కనిపించింది.ఈ సీటు నుంచి భోజ్‌పురి స్టార్ పవన్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. అయితే ఇంతలోనే అతని తల్లి తల్లి ప్రతిమా దేవి కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి, అనంతరం ఉపసంహరించుకున్నారు. మరోవైపు పవన్ సింగ్ ఎన్నికల ప్రచారంతో ప్రజల మధ్యకు వెళుతున్నారు.పవన్ సింగ్ తల్లి నామినేషన్ ఉపసంహరణ వెనుక ఒక వాదన వినిపిస్తోంది. రాష్ట్రీయ లోక్ మోర్చా చీఫ్, మాజీ కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహా బీజేపీ కూటమి తరపున కరకట్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే పవన్ సింగ్‌కు కూడా బీజేపీతో అనుబంధం ఉంది. దీంతో అతనిపై నామినేషన్ ఉపసంహరించుకోవాలనే ఒత్తిడి వచ్చిందని సమాచారం. దానిని పట్టించుకోకుండా పవన్ సింగ్ కరకట్ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసి, ఎన్నికల బరిలోకి దిగారు. కుమారునికి ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే అతని తల్లి నామినేషన్ దాఖలు చేశారనే మాట వినిపిస్తోంది. అయితే ఆ తరువాత ఆమె తన నామినేషన్ వెనక్కి తీసుకున్నారు.దీనికి ముందు పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ లోక్‌సభ స్థానం టిక్కెట్‌ను బీజేపీ పవన్ సింగ్‌కు కేటాయించింది. అయితే ఆయన అక్కడి నుంచి పోటీ చేసేందుకు నిరాకరించారు. అనంతరం తాను కరకట్ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు పవన్ సింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ప్రకటించారు. ప్రతిమాదేవి నామినేషన్ ఉపసంహరణను ఎన్నికల సంఘం ధృవీకరించింది. ఆమె మే 14న స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పవన్ సింగ్ తన నామినేషన్ తిరస్కరణకు గురవుతుందనే అనుమానంతోనే తన తల్లి ప్రతిమా దేవి చేత నామినేషన్ దాఖలు చేయించినట్లు తెలుస్తోంది. జూన్ ఒకటిన కరకట్ లోక్‌సభ స్థానానికి పోలింగ్ జరగనుంది. -
పాడెపై వెళ్లి నామినేషన్! గోరఖ్‌పూర్‌లో విచిత్రం
ఎన్నికల వేళ నామినేషన్ దాఖలు సందర్భంగా అభ్యర్థులు చిత్ర విచిత్ర విన్యాసాలతో అందరి దృష్టినీ ఆకర్షించడం పరిపాటే. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి మంగళవారం ఏకంగా పాడె మీద ఊరేగుతూ వచ్చి నామినేషన్ వేశారు! ఆయన పేరు రాజన్ యాదవ్. ఎంబీఏ పట్టభద్రుడైన ఆయన బౌద్ధ సన్యాసిగా మారారు. భిక్షపైనే జీవిక గడుపుకుంటారు. దేశంలో ప్రజాస్వామ్య మనుగడ ప్రమాదంలో పడిందని చెప్పేందుకే తానిలా పాడెపై వచ్చానని చెప్పారాయన. ‘పాడె బాబా’గా ఆయన స్థానికంగా బాగా ప్రసిద్ధుడు. ఈసారి తన ఎన్నికల కార్యాలయాన్ని కూడా ఏకంగా శ్మశానవాటికలోనే తెరిచారు! స్థానిక రాప్తీ నది ఒడ్డున ఉన్న ఆ శ్మశానవాటిక నుంచే ఎన్నికల సంబంధిత కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం తనను చూసేందుకు వచి్చన ఒక్కొక్కరి నుంచి రూపాయి చొప్పున వసూలు చేస్తున్నారు. గమ్మత్తైన హామీలు రాజన్ యాదవ్ ఎన్నికల హామీలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. తనను గెలిపిస్తే ఎలాగైనా లైఫ్‌టైం ఉచిత ఇన్కమింగ్ కాల్స్ సౌకర్యాన్ని తిరిగి తీసుకొస్తానంటున్నారాయన. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ద్విచక్ర వాహనాలకు వేస్తున్న జరిమానాలు కూడా మరీ ఎక్కువగా ఉన్నాయని, వాటిని తగ్గించేందుకు ప్రయతి్నస్తానని హామీ ఇస్తున్నారు. గతంలోనూ ఎన్నికల్లో పోటీ చేసిన చరిత్ర ఈ ‘పాడె బాబా’ది. ఆయన తర్వాతి లక్ష్యం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలట! ఆ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకూ పోటీ చేసి ఆప్ చీఫ్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను గద్దె దింపడమే తన లక్ష్యమని చెబుతున్నారు! – గోరఖ్‌పూర్ -
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
వారణాసి: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి మంగళవారం(మే14) నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన ఆస్తుల వివరాలను ఎన్నికల కమిషన్‌కు అఫిడవిట్లో సమర్పించారు. తనకు సొంత ఇల్లు, కారు లేదని మోదీ అఫిడవిట్లో తెలిపారు. మొత్తం ఆస్తుల విలువ రూ.3.02 కోట్లని వెల్లడించారు. తన ఆస్తిలో రూ.2.86 కోట్లు స్టేట్ బ్యాంక్ ఫ్ ఇండియా(ఎస్బీఐ)లో ఫిక్స్డ్ డిపాజిట్లుగా ఉన్నాయని తెలిపారు. సేవింగ్స్ ఖాతాలో రూ.80,304, తన చేతిలో రూ. 52,920 నగదు ఉందని పేర్కొన్నారు. ఇవి కాకుండా రూ.2.68 లక్షల విలువైన నాలుగు బంగారు ఉంగరాలున్నట్లు తెలిపారు.2018-19లో రూ.11.14 లక్షలుగా ఉన్నవార్షిక ఆదాయం 2022-23లో రూ.23.56లక్షలకు పెరిగినట్లు తెలిపారు. 1978లో ఢిల్లీ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, 1983లో గుజరాత్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసినట్లు అఫిడవిట్లో తెలిపారు. జూన్1న తుది దశలో భాగంగా వారణాసిలో పోలింగ్ జరగనుంది. -
నామినేషన్ దాఖలు చేసిన కంగనా రనౌత్
ప్రముఖ సినీ నటి, బీజేపీ అభ్యర్థి 'కంగనా రనౌత్' మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకంటే ముందు మీడియాతో మాట్లాడుతూ.. మండి ప్రజలకు నాపైన ఉన్న ప్రేమే ఇంత దూరం తీసుకువచ్చిందని కంగనా పేరొన్నారు.మన దేశంలో మహిళలు ప్రతి రంగంలోనూ ముందుకు సాగుతున్నారు. అయితే మండి ప్రాంతంలో ఇప్పటికి కూడా భ్రూణహత్య ఎక్కువగానే ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం మండికి చెందిన మహిళలు విద్య, రాజకీయాల్లో మాత్రమే కాకుండా.. ఆర్మీలో ఉన్నారని కంగనా పేర్కొన్నారు.#WATCH | Himachal Pradesh: Ahead of filing nomination, BJP candidate from Mandi, Kangana Ranaut says "The people of Mandi and their love for me have brought me here. Women in our country are making a mark in every field but incidents of feticide in Mandi were high a few years… pic.twitter.com/MTi9WndTgH— ANI (@ANI) May 14, 2024తన నామినేషన్ దాఖలు చేసిన తర్వాత కంగనా రనౌత్ మాట్లాడుతూ.. ఈ రోజు నేను మండి లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసాను. మండి నుంచి పోటీ చేసే అవకాశం నాకు లభించడం గర్వించదగ్గ విషయం. బాలీవుడ్లో విజయం సాధించి, రాజకీయ రంగంలో కూడా విజయం సాధిస్తానని ఆశిస్తున్నానని ధీమా వ్యక్తం చేశారు.#WATCH | Himachal Pradesh: After filing her nomination, BJP candidate from Mandi Lok Sabha constituency, Kangana Ranaut says "Today I have filed nomination from Mandi LS seat. It is a matter of pride for me to have the opportunity to contest from Mandi...I have been successful in… pic.twitter.com/qh1DnIMi0A— ANI (@ANI) May 14, 2024 -
నామినేషన్ వేసిన ప్రధాని మోదీ
ఢిల్లీ: బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభ ఎన్నికల కోసం నామినేషన్ వేశారు. మంగళవారం ఉదయం ఉత్తర ప్రదేశ్ వారణాసి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న ఆయన.. ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ సమర్పించే టైంలో మోదీ వెంట సాధువులు, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఉన్నారు. మోదీ నామినేషన్‌ను నలుగురు నేతలు బలపర్చారు. వాళ్లలో అయోధ్య ఆలయ పూజారి, ఒకరు దళితుడు, మరో ఇద్దరు ఓబీసీ నేతలు ఉన్నారు.మోదీ నామినేషన్ కార్యక్రమానికి 18 మంది కేంద్ర మంత్రులు హాజరయ్యారు. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సహా 12 రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ఎన్టీయే నేతలతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా రాజకీయ ప్రముఖులు వెళ్లారు.#WATCH | Prime Minister Narendra Modi files nomination from Varanasi Lok Sabha seat for #LokSabhaElections2024 pic.twitter.com/lSgGcPiNjR— ANI (@ANI) May 14, 2024 #WATCH | Prime Minister Narendra Modi files nomination from Varanasi Lok Sabha seat for #LokSabhaElections2024Uttar Pradesh CM Yogi Adityanath is also present on the occasion. pic.twitter.com/woWNPgqdiG— ANI (@ANI) May 14, 2024నామినేషన్ వేయడానికి ముందు.. దశ అశ్వమేథ ఘాట్‌లో మోదీ ప్రత్యేక పూజలు చేశారు. ఇదిలా ఉంటే.. మోదీ వారణాసి నుంచి పోటీ చేయడం ఇది మూడోసారి. గుజరాత్‌కు చెందిన నరేంద్ర మోదీ.. 2014, 2019 ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. లోక్‌సభ ఎన్నికలు-2024 చివరి ఫేజ్‌లో భాగంగా జూన్ 1వ తేదీన వారణాసి పార్లమెంట్ స్థానానికి పోలింగ్ జరగనుంది. #WATCH | Uttar Pradesh: PM Narendra Modi offers prayers at Dasaswamedh Ghat in VaranasiPM Narendra Modi will file his nomination for #LokSabhaElections2024 from Varanasi today. PM is the sitting MP and BJP's candidate from Varanasi. pic.twitter.com/tnZNsQCnmV— ANI (@ANI) May 14, 2024 -
ప్రధాని మోదీ నామినేషన్‌కు సీఎం నితీష్ గైర్హాజరు.. కారణమిదే!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు (మంగళవారం)వారణాసి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఇందులో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరు కూడా ఉంది. అయితే ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కావడంలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.సీఎం నితీష్ కుమార్ అస్వస్థతకు గురయిన నేపధ్యంలో ఆయన నేడు ఏ కార్యక్రమంలోనూ పాల్గొనడం లేదని సమాచారం. ఆయన ఎన్నికల ప్రచారానికి, బహిరంగ సభలకు కూడా హాజరుకారు. అయితే ఈరోజు సుశీల్ కుమార్ మోదీ నివాసానికి వెళ్లి, ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించనున్నారు. బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ(72) సోమవారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన నితీష్ కుమార్‌కు సన్నిహితునిగా మెలిగారు.ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ, హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్, త్రిపుర సీఎం మాణిక్ సాహా పాల్గొననున్నారు. -
14న ప్రధాని మోదీ నామినేషన్?
దేశంలో ప్రస్తుతం ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మే 14న తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. అభిజిత్ ముహూర్తంలో ప్రధాని తన నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందించనున్నారు. అయోధ్య రామ మందిర శంకుస్థాపనకు ముహూర్తాన్ని అందించిన పండిట్ గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ తాజాగా ప్రధాని మోదీ నామినేషన్ దాఖలుకు ముహూర్తాన్ని నిర్ణయించారు.మే 14న గంగా సప్తమి. ఆరోజు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఆ రోజున నామినేషన్ దాఖలు చేయడం శ్రేయస్కరమని పండితులు ప్రధాని మోదీకి సూచించారు. గంగా సప్తమి రోజున బ్రహ్మదేవుని కమండలంలో నుంచి గంగ జన్మించిందని చెబుతారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం మే 13న ప్రధాని మోదీ వారణాసిలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఆ మర్నాడు అంటే మే 14న ప్రధాని నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీనికి ముందు మోదీ గంగామాతకు పూజలు నిర్వహించనున్నారు. అయితే ఈ కార్యక్రమాలను సంబంధించిన షెడ్యూల్ ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. -
హ్యాట్రిక్ కోసం అభిషేక్ బెనర్జీ.. మళ్ళీ అక్కడ నుంచే పోటీ
కోల్‌కతా: దేశంలో ఇప్పటికే మూడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకా నాలుగు దశల్లో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ తరుణంలో తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, 'అభిషేక్ బెనర్జీ' పశ్చిమ బెంగాల్‌లోని సౌత్ 24 పరగణాస్ జిల్లాలోని డైమండ్ హార్బర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.అభిషేక్ బెనర్జీ డైమండ్ హార్బర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఇది వరుసగా మూడోసారి. నామినేషన్ దాఖలు చేయడానికి ఈయన కాళీఘాట్ నుంచి నడిచి.. అలీపూర్‌లోని జిల్లా కలెక్టర్ ఆఫీసులో తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.నామినేషన్ దాఖలు చేసిన తరువాత తృణమూల్ కాంగ్రెస్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి 'అభిషేక్ బెనర్జీ' మాట్లాడుతూ.. డైమండ్ హార్బర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ సాధించడంపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ నియోజకవర్గాన్ని నెంబర్ స్థానానికి తీసుకురావడమే లక్ష్యమని అన్నారు.#WATCH | TMC candidate from Diamond Harbour seat, Abhishek Banerjee files nomination for Lok Sabha elections#LokSabhaElections2024 pic.twitter.com/SLymSD1IHq— ANI (@ANI) May 10, 2024 -
రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
తిరువనంతపురం: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రాయ్‌బరేలీ నుంచి నామినేషన్ వేయడంపై వయనాడ్ ప్రజలు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ‘తప్పేముంది రాహుల్ ఇండియా కూటమిలో అగ్రనేత’ అని ఒకరు అనగా రాయ్‌బరేలీలో గెలిస్తే వయనాడ్ సీటును రాహుల్ వదిలేస్తారని మరొకరన్నారు. అయితే రాహుల్ వయనాడ్‌ను వదిలేయడం తమకు అంత మంచిది కాదని చెప్పాురు. రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని రాహుల్‌గాంధీ తీసుకున్న నిర్ణయం ఇండియా కూటమికి మేలు చేస్తుందని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్)నేత కున్హలికుట్టి అన్నారు. ప్రధాని మోదీ కూడా గతంలో రెండు సీట్లలో పోటీ చేశారని కుట్టి గుర్తు చేశారు. -
ఢిల్లీలో తొలి ట్రాన్స్‌జెండర్ నామినేషన్
న్యూఢిల్లీ, సాక్షి: దేశ రాజధానిలో లోక్‌సభ ఎన్నికల నామినేషన్లలో ఆసక్తికర పరిణామం జరిగింది. ఢిల్లీలో తొలి థర్డ్ జెండర్ అభ్యర్థి నామినేషన్ వేశారు. దక్షిణ ఢిల్లీ నియోజకవర్గానికి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.ధోతీ, తలపై టోపీ, బంగారు ఆభరణాలు ధరించి సాకేత్‌లోని దక్షిణ ఢిల్లీ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్న 26 ఏళ్ల రాజన్ సింగ్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. థర్డ్ జెండర్ వ్యక్తుల హక్కులతోపాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజలతోపాటు అధికారుల దృష్టిని ఆకర్షించేందుకు తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు రాజన్ సింగ్ తెలిపారు.బిహార్‌కు చెందిన రాజన్ సింగ్ ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో నివసిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు తన నామినేషన్ థర్డ్ జెండర్ ఉనికిని, హక్కులను తెలియజేసే ప్రయత్నం అని రాజన్ సింగ్ అన్నారు. దేశంలో జంతువులకు కూడా సంక్షేమ బోర్డులు ఉన్నాయి కానీ థర్డ్ జెండర్ వ్యక్తుల పరిస్థితి వాటి కన్నా హీనంగా ఉందని వాపోయారు. తాను గెలిస్తే, థర్డ్ జెండర్ ప్రాథమిక అవసరాలను పరిష్కరిస్తానని రాజన్ సింగ్ చెప్పారు. -
రాజ్‌నాథ్ సింగ్‌తో పోరుకు దిగిన నీలమ్ ఎవరు?
యూపీలోని లక్నో లోక్‌సభ స్థానానికి ఐదవ దశలో మే 20న ఓటింగ్ జరగనుంది. ఈ స్థానానికి నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. అయితే ఒకరి నామినేషన్‌పై చర్చ జరుగుతోంది. రాష్ట్రీయ ఉదయ్ పార్టీ నుంచి నీలమ్ శర్మ అనే మహిళ తన నామినేషన్ దాఖలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆమె.. తాను బీజేపీ తరపున బరిలో దిగిన రాజ్‌నాథ్ సింగ్‌ను ఓడించడానికే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలిపారు.తాను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి, ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. అసదుద్దీన్ ఒవైసీ, పల్లవి పటేల్‌ల మద్దతు తమ పార్టీకి ఉందని ఆమె పేర్కొన్నారు. నీలమ్ శర్మ సామాజిక కార్యకర్తగా సేవలందించేందుకు ఒక స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. నీలమ్ శర్మ గతంలో మేయర్ పదవికి కూడా పోటీ చేశారు.నీలమ్ శర్మ నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చినప్పుడు ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారారు. స్టయిలిష్ లుక్‌లో ఆమె కారు దిగగానే అక్కడున్నవారు ఆమెను చూస్తూ ఉండిపోయారు. ఆమె పోలీసులతో తాను లక్నో లోక్‌సభ స్థానం నుండి ఎంపీ పదవికి నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చినట్లు తెలిపారు. తాను గెలిచిన తర్వాత మీరే నన్ను సన్మానిస్తారని ఆమె పోలీసులతో అన్నారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం నీలమ్ శర్మ తన నామినేషన్ దాఖలు చేసినప్పటికీ అది తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. ఆమె తాను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, దాని అమలు ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ఈ కారణంగా ఆమె నామినేషన్ చెల్లకపోవచ్చని సమాచారం. -
పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాలుగు ముక్కలు
నల్లగొండ: పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాలుగు ముక్కలవుతుందని.. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రజల సొమ్మును దోచుకోవడంతో కూతురు జైలుకెళ్లిందని, వారు కూడా జైలుకు వెళ్లకతప్పదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న నామినేషన్ వేసిన సందర్భంగా శుక్రవారం నల్లగొండలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడారు. తీన్మార్ మల్లన్న కేసీఆర్ దోపిడీపై పోరాటం చేశాడని, ఆయన్ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. జీఓ 46తో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత దానిపై అసెంబ్లీ సమావేశాల్లో కమిటీ వేసి రద్దు చేస్తామని చెప్పారు. ప్రభుత్వానికి ఆస్తులు అప్పగించిన తీన్మార్ మల్లన్ననల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) తన కుటుంబం పేరు మీద ఉన్న ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. తన కుటుంబం పేర ఇప్పటివరకు రూ.కోటీ 50 లక్షల ఆస్తులు ఉన్నాయని చెప్పారు.తన భార్య ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నదని, ఆమె ఒప్పుకున్నాకే ఆమె పేరు మీద ఉన్న కోటిన్నర ఆస్తిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేరున రాసి ఇస్తున్నట్టు ప్రకటించారు. రాజకీయాల్లో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలన్న ఉద్దేశంతో ఆస్తులను అప్పగించినట్టు చెప్పారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే.. రాజకీయాల్లో సంచలన మార్పులు తీసుకొస్తానని ఆయన చెప్పారు. అంతకుముందు ఆయన నల్లగొండ పట్టణంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. తీన్మార్ మల్లన్నపై 56 కేసులు రాష్ట్రంలోని వివిధ పోలీస్స్టేషన్లలో తనపై 56 కేసులు ఉన్నాయని తన ఎన్నికల అఫిడవిట్లో తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. తన పేరుతో రూ.16.34 లక్షల విలువైన బంగారం, ఆస్తులు, నగదు ఉండగా, తన భార్య పేరుతో రూ.17.66 లక్షల విలువైన బంగారం, ఆస్తులు, నగదు ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. మార్కెట్ విలువ ప్రకారం రూ.3 లక్షల విలువైన వ్యవసాయ భూమి, రూ.50 లక్షల విలువలైన వ్యవసాయేతర భూమి, రూ.50 లక్షల విలువైన నివాస గృహం ఉన్నట్లు తెలిపారు. రూ.31.29 లక్షల అప్పులు ఉన్నట్టు వివరించారు. -
Lok Sabha Election 2024: రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ కంచుకోటలైన రాయ్‌బరేలీ, అమేథీ లోక్‌సభ స్థానాల్లో ఈసారి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై కొన్నిరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఈ రెండు స్థానాల్లో తమ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం శుక్రవారం ఉదయం ప్రకటించింది. రాయ్‌బరేలీ నుంచి అనూహ్యంగా రాహుల్ గాంధీ పోటీకి దిగుతున్నారు. సోనియా గాంధీ కుటుంబానికి వీరవిధేయుడైన కిశోరీలాల్ శర్మ అమేథీ నుంచి పోటీ చేస్తున్నారు. రాహుల్, కిశోరీలాల్ శుక్రవారమే నామినేషన్లు దాఖలు చేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20న పోలింగ్ జరుగనుంది. రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ అభ్యరి్థత్వం ఖరారు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ స్థానంలో ఆయన సోదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను బరిలోకి దింపాలని పలువురు కాంగ్రెస్ సీనియర్లు పట్టుబట్టారు. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలు చేస్తోందని, ఆ పారీ్టలో సోనియా గాంధీ కుటుంబానిదే అసలు పెత్తనం అంటూ బీజేపీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ప్రియాంక గాంధీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎవరూ ఊహించని విధంగా రాయ్‌బరేలీ నుంచి రాహుల్ పేరు తెరపైకి వచ్చింది. గత ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా గెలిచిన సోనియా గాంధీ ఈసారి పోటీ చేయడం లేదు. ఆమె ఇప్పటికే రాజస్తాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాయ్‌బరేలీ స్థానం ప్రస్తుతం ఖాళీగానే ఉంది. రాహుల్ గాం«దీని పోటీ చేయించడం ద్వారా ఇక్కడ మరోసారి విజయకేతనం ఎగురవేయాలని, తమ పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. తన తల్లి సోనియా గాంధీ 20 ఏళ్లపాటు ప్రాతినిధ్యం వహించిన లోక్‌సభ స్థానం నుంచి రాహుల్ పోటీకి దిగుతుండడం ఆసక్తికరంగా మారింది. రాయ్‌బరేలీలో రాహుల్ నామినేషన్ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాం«దీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రాలతో కలిసి రాహుల్ తన నామినేషన్ పత్రాలను రాయ్‌బరేలీ జిల్లా మెజిస్ట్రేట్ హర్షితా మాథుర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్‌కు మద్దతుగా కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీజేపీ కార్యకర్తలు ‘గో బ్యాక్ రాహుల్’ అంటూ నినాదాలు చేస్తూ కనిపించారు. ఈ ఎన్నికల్లో రాయ్‌బరేలీలో బీజేపీ అభ్యరి్థగా ఉత్తరప్రదేశ్ మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్‌తో బరిలో నిలిచారు. రూ.20 కోట్లకు పైగా ఆస్తులు తనకు రూ.20 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు రాహుల్ తన నామినేషన్ పత్రాల్లో వెల్లడించారు. రూ.3.81 కోట్ల విలువైన షేర్లతో కలిపి రూ.9.24 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్లు తెలియజేశారు. రూ.26.25 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, రూ.15.21 కోట్ల విలువైన గోల్డ్ బాండ్ల ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే రూ.11.15 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం చేతిలో రూ.55 వేల నగదు ఉందని, రూ.49.79 లక్షల అప్పులు ఉన్నాయని ప్రస్తావించారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రాహుల్ వార్షికాదాయం రూ.1.02 కోట్లు. మా కర్మభూమి రాయ్‌బరేలీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తుండడం తనకు భావోద్వేగ సమయమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘‘మా కుటుంబానికి కర్మభూమి అయిన రాయ్‌బరేలీని మా తల్లి సోనియా గాంధీ ఎంతో నమ్మకంతో నాకు అప్పగించారు. ఇక్కడి ప్రజలకు సేవ చేసుకొనే భాగ్యం కల్పించారు. అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాలు నాకు వేర్వేరు కాదు. ఇవి రెండూ నా సొంత కుటుంబం లాంటివే. 40 ఏళ్లుగా ఆమేథీ నియోజకవర్గానికి సేవలందిస్తున్న కిశోరీలాల్ శర్మ ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీ చేస్తుండడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొనేందుకు సాగుతున్న ఈ పోరాటంలో అందరూ నాకు అండగా నిలుస్తున్నారన్న విశ్వాసం ఉంది’’ అని రాహుల్ వెల్లడించారు. -
లెక్క లేదంటే.. వేటే..!
సాక్షి, మంచిర్యాల: ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఆదిలాబాద్‌లో 12 మంది, పెద్దపల్లిలో 42మంది బరిలో ఉన్నారు. ఎ న్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రచారమూ ప్రభావితం చేస్తుంది. ఆ ప్రచార వ్యయం కూడా పె రుగుతూ వస్తోంది. ర్యాలీలు, సభలు, సమావేశాలు, సభలకు జనాలను తరలించే వాహనాలు, భో జనాలు, టెంట్లు ఇలా ప్రతీదానికి అభ్యర్థులు ఖ ర్చు చేయాల్సి వస్తుంది. వీటన్నింటికి కూడా ఎన్నిక ల సంఘం స్థానికంగా ధరలను అనుసరించి చెల్లింపులను నిర్దేశించింది.ఆ మేరకు వ్యయ వివరాలను అభ్యర్థులు నమోదు చేయాల్సి ఉంటుంది. బ్యాంకులో ఖాతా తెరిచి దాని ద్వారానే చెల్లింపులు చేయా లి. అభ్యర్థులు ప్రచార వ్యయానికి సంబంధించి ప్ర తీ ఖర్చు వివరాలను ఎన్నికలు పూర్తయిన తర్వాత నెల రోజుల్లోగా ఎన్నికల సంఘానికి సమర్పించాలి. లేనిపక్షంలో ఆ తర్వాత జరిగే ఎన్ని కల్లో పోటీకి అనర్హులుగా ప్రకటిస్తుంది. అలా వేటు పడిన వారిలో రాష్ట్ర వ్యాప్తంగా 107మంది ఉన్నారు.వ్యయ పరిశీలకులు వీరే..ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులుగా మహారాష్ట్రకు చెందిన ఐఆర్ఎస్ అ« దికారి జాదావార్ వివేకానంద, పెద్దపల్లి నియోజకవర్గానికి సమీర్ నైరంతర్య వ్యవహరిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో వీరు పర్యటించి రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రచార వ్యయాలను పరిశీలిస్తారు.పెంపు ఇలా..లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచార వ్యయ పరి మితి 1952లో రూ.25వేలుగా ఉండేది. 1971లో రూ.35వేలు ఉండగా.. 1980లో రూ.లక్షకు పెరిగింది. 1984నుంచి 1991వరకు రూ.1.50లక్షలు, 199 6లో రూ.4.50లక్షలకు చేరింది. 1998లో రూ.15లక్షలు, 2004లో రూ.25లక్షలకు పెరుగుతూ వచ్చింది. 2014లో ఎన్నికల ప్రచార వ్యయ పరిమితిపై ప్ర ధాన సవరణ జరిగి రూ.70లక్షలకు పెరిగింది. దీని పై 2020లో 10శాతం పెరిగింది. ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కమిటీ సూచన మేరకు 2022లో ప్రచార వ్యయ పరిమితిని రూ.95లక్షలకు పెంచా రు. లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు గరి ష్టంగా రూ.95లక్షల వరకు ప్రచారానికి ఖర్చు చేసే అవకాశం ఉంది.107మంది పోటీకి అనర్హులు..రాష్ట్రంలోని 107మందిని ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల ప్రచార వ్య యానికి సంబంధించిన వివరాలు సమర్పించకపోవడంతో ప్రజాప్రాతినిధ్య చట్టం–1951 10ఏ ప్రకారం అనర్హత వేటు వేసింది. వీరిలో అత్యధి కంగా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన 68 మంది ఉ న్నారు. అప్పట్లో పసుపు రైతులు భారీ సంఖ్యలో నామినేషన్ వేసిన వారే కావడం గమనార్హం.వచ్చే జూన్ 23 వరకు వీరు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. నల్గొండ లోక్‌సభ నియోజకవర్గంలోని 2, మహబూబాబాద్, మెదక్‌లో ఒక్కొక్కరు ఉండగా.. వీరిపై జూన్ 10వరకు వేటు కొనసాగుతుంది. జుక్కల్, రామగుండం, కరీంనగర్, గజ్వేల్, మల్కాజ్గిరి, నాగార్జునసాగర్, ఆలేరు, జనగాం, మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఒక్కొక్కరు, దేవరకొండ 5, మిర్యాలగూడ, పాలకుర్తి ముగ్గురు చొప్పున, నల్గొండ, ములుగు 4 చొప్పున, నకిరేకల్ 2, మల్కాజ్గిరి ఒకరిపై జూలై 14వరకు వేటు వేసింది. పాలకుర్తిలో ముగ్గురిపై ఆగస్టు 25వరకు, డోర్నకల్ ఒకరిపై సెప్టెంబర్ 21వరకు అనర్హత వేటు పడింది.ఇవి చదవండి: దేవుడి పేరుతో బీజేపీ రాజకీయం.. : మంత్రి సీతక్క -
నామినేషన్ దాఖలు చేసిన రాజ్‌నాథ్ సింగ్
లక్నో: కేంద్ర రక్షణ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత రాజ్‌నాథ్ సింగ్ లక్నో స్థానం నుంచి రానున్న లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీలతో కలిసి వెళ్లి ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు.నామినేషన్ దాఖలుకు ముందు, రాజ్‌నాథ్ సింగ్ నగరంలో రెండు కిలోమీటర్ల మేర రోడ్‌షో నిర్వహించి, స్థానిక దక్షిణ్ ముఖి హనుమాన్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. సార్వత్రిక ఎన్నికలు ఐదవ దశ పోలింగ్ మే 20న జరగనుంది. లక్నోతో పాటు మరో పదమూడు నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది.లక్నో లోక్‌సభ స్థానంలో 2019 ఎన్నికలలో రాజ్‌నాథ్ సింగ్ 6.3 లక్షల ఓట్లు సాధించి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి పూనమ్ శత్రుఘ్న సిన్హాను ఓడించారు. అలాగే 2014లో కాంగ్రెస్ అభ్యర్థి రీటా బహుగుణ జోషిపై 2.72 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. -
అమేథీలో కాంగ్రెస్ 1981 ఫార్ములా?
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ యూపీలోని అమేథీ నుంచి పోటీ చేయనున్నారని ఆ పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలు అంటున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయమై నోరు మెదపలేదు. అయితే పార్టీ 1981 నాటి ఉప ఎన్నికల ఫార్ములాను ఇప్పుడు అనుసరించనున్నదనే మాట వినిపిస్తోంది.1981లో కాంగ్రెస్ నామినేషన్ల పర్వం ప్రారంభమైన తర్వాతనే అభ్యర్థులను రంగంలోకి దించింది. రాజీవ్ గాంధీని యూపీలోని అమేథీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన రోజునే రాజీవ్ గాంధీ తన నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఇదే విధానాన్ని కాంగ్రెస్ అనుసరించనున్నదని కొందరు పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు.మరోవైపు అమేథీలో బీజేపీ మినహా ఏ పార్టీ కూడా అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. ఎస్పీ-కాంగ్రెస్ పొత్తులో అభ్యర్థి ఎవరనేదానిపై బీఎస్పీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అదేసమయంలో బీఎస్పీ అభ్యర్థి ఖరారైనట్లు కూడా ప్రచారం జరుగుతోంది.ఇప్పటి వరకు రాహుల్ గాంధీ తాను అమేథీ నుంచి పోటీ చేస్తానని చెప్పలేదు. అమేథీ నుంచి బీజేపీ తరుపున స్మృతి ఇరానీ ఎన్నికల రంగంలోకి దిగారు. కాగా రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయనున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ప్రదీప్ సింఘాల్ ప్రకటించారు. -
మనోహర్ ఆస్తి పెరిగింది!
తెనాలిరూరల్: జనసేన పార్టీ తరఫున తెనాలి అభ్యర్థిగా నామినేషన్ వేసిన నాదెండ్ల మనోహర్ తన ఆస్తి రూ 22.89 కోట్లుగా ప్రకటించారు. 2019 కన్నా రూ. 12 కోట్లు పెరిగినట్టు అఫిడడవిట్‌లో పేర్కొ న్నారు. తనపేరిట రూ. 1,48, 03,300 విలువ చేసే చరాస్తులు ఉండగా తన భార్య పేర రూ. 2,49,33,338, కుమారుడి పేర రూ. 3,63,966 చరాస్తులు ఉన్న ట్టు చూపారు.తన పేర రూ, 1.95 కోట్ల విలువ చేసే 6.32 ఎకరాల వ్యవసాయ భూమి, తన భార్య పేరిట ద్వారకా తిరుమల, కర్ణాటకలలో రూ. 8.75 కోట్ల విలువ చేసే 8.54 ఎకరాల వ్యవసాయ భూమి, శేరిలింగంపల్లిలో రూ. 2,99,15,000 విలువ చేసే ఫ్లాట్, జూబ్లి హిల్స్‌లో రూ. 4,59,40. 000 విలువ చేసే ప్లాట్ ఉన్నట్టు చూపారు. తన పేరిట రూ. 43,96,641 వాహన రుణం ఉండగా తన భార్యకు రూ. నాలుగు కోట్లు రుణం ఉందని చూపారు. ఇక తనపై ఎటువంటి కేసులు లేవని స్పష్టం చేశారు. కాగా 2019లో తన ఆస్తి రూ. 10,68,78,117గా మనోహర్ చూపారు. తెనాలిలో మనోహర్ నామినేషన్ తెనాలిరూరల్: నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రపసాద్, బీజేపీ నేతలు, జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలతో ఐతాన గర్ లింగారావు సెంటరు నుండి భారీ ర్యాలీగా గాం«దీచౌక్, శివాజీచౌక్‌ల మీదుగా సబ్‌కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. తన భార్య మనోహరం, ఆలపాటి రాజా తదితరులతో కలసి రిటరి్నంగ్ అధికారి ప్రఖర్ జైన్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు. -
మతతత్వ శక్తులను ఓడించండి
ఖమ్మం వన్‌టౌన్: మతతత్వ, ఫాసిస్ట్ శక్తులను ఓడించి దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రేణుకా చౌదరి పిలుపునిచ్చారు. ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ దాఖలు అనంతరం మీడియా పాయింట్ వద్ద మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ, దేశం కోసం గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని, సోనియా, రాహుల్ ప్రధాని పదవిని సైతం వదులుకున్నారన్నారు.మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, రఘురాంరెడ్డి కుటుంబం ప్రజలందరికీ తెలుసునని, జిల్లా నాయకుల అభిప్రాయాలు తీసుకున్నాకే అధినాయకత్వం ఆయనను అభ్యర్థిగా ఎంపిక చేసిందని చెప్పారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం నేత పోతినేని మాట్లాడుతూ మతాన్ని అడ్డుపెట్టుకుని మోదీ అధికారంలోకి రావాలని చూస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ను ఓడించాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నామని కూనంనేని వెల్లడించగా, భువనగిరి తప్ప మిగతా అన్ని స్థానాల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఉంటుందని సీపీఎం నేత సుదర్శన్ తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి మాట్లాడుతూ తనది ఖమ్మం జిల్లానేనని.. ప్రజలు, ప్రభుత్వ అవసరాల కోసం ఏళ్ల క్రితమే తమ భూములు ఇచ్చామని చెప్పారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
ఒవైసీ లాపతా.. జబ్సే ఆయీ మాధవీ లతా..
చార్మినార్ (హైదరాబాద్): ఒవైసీ లాపతా.. జబ్ సే ఆయీ మాధవీ లతా.. (మాధవీ లత వచ్చి నప్పటి నుంచి ఒవైసీ కనిపించడం లేదు) అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించా రు. మాధవీ లత హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి అనగానే సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పత్తా లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. బుధవారం మాధవీ లత చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయాన్ని సందర్శించి తన నామినేషన్ పత్రాలను అమ్మవారి పాదాల చెంత పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం బీజేపీ నేతలతో కలిసి చార్మినార్ నుంచి ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఆమెతోపాటు పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనురాగ్ ఠాకూర్ ప్రచార రథంపై నుంచి మాట్లాడుతూ.. 40 ఏళ్లుగా హైదరాబాద్‌లో అధికారం చెలాయిస్తున్న మజ్లిస్ పార్టీ పాతబస్తీ అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు.అసదుద్దీన్ ఒవైసీ, రాహుల్‌గాంధీలు ఔరంగజేబు యూనివర్సిటీలో చదివారని.. వారిద్దరి ఆలోచనలు ఒకేతీరుగా ఉంటాయన్నారు. మజ్లిస్‌తో కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నందునే ఇప్పటివరకు హైదరాబాద్ అభ్యర్థిని ఇంకా ప్రకటించ లేదని దుయ్యబట్టారు. పాతబస్తీలో మత రాజకీయాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్న మజ్లిస్‌కు ఈసారి ఓటమి తప్పదన్నారు. చార్మినార్ నుంచి బయలుదేరిన ప్రచార ర్యాలీ మదీనా, అఫ్జల్‌గంజ్, బేగంబజార్, మోజంజాహీ మార్కెట్, నాంపల్లి ద్వారా లక్డీకాపూల్ వరకు సాగింది.