ఎమ్మెల్సీ ఎన్నికలు.. నామినేషన్‌ వేసిన బొత్స సత్యనారాయణ | Bosta SatyaNarayana Flied MLC Nomination At Visakhapatnam | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లో విలువలు అవసరం: బొత్స సత్యనారాయణ

Published Mon, Aug 12 2024 2:42 PM | Last Updated on Mon, Aug 12 2024 3:02 PM

Bosta SatyaNarayana Flied MLC Nomination At Visakhapatnam

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు వైఎస్సార్‌సీపీకి పూర్తిగా బలం ఉందన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. అనైతికంగా కూటమి సర్కార్‌ ఎందుకు అభ్యర్థిని పోటీలో నిలుపుతోందని ప్రశ్నించారు.

కాగా, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమవారం బొత్స సత్యనారాయణ నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కోరారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈరోజు నామినేషన్‌ వేశాను. మాకు సంఖ్యా బలం ఉంది. వైఎస్సార్‌సీపీ తప్పకుండా విజయం సాధిస్తుంది. మాకు 530 మందికి పైగా ప్రజాప్రతినిధుల బలం ఉన్నప్పుడు కూటమి అభ్యర్థిని ఎందుకు బరిలో నిలుపుతోంది?. వైఎస్సార్‌సీపీకి బలం ఉన్నప్పుడు అనైతికంగా ఎందుకు అభ్యర్థిని పెడుతున్నారు.

ఒకవేళ టీడీపీ కనుక అభ్యర్థిని నిలబెడితే అది దుశ్చర్య అవుతుంది. ఇదిమే వ్యాపారం కాదు. మోజార్టీ ఉంది కాబట్టే పోటీ చేస్తున్నాం. మాకు నివాదం అవసరం లేదు. రాజకీయాల్లో విలువలు అవసరం. సంఖ్య దగ్గరగా ఉంటే తప్పులేదు. మాకు మెజార్టీ ఉన్నప్పుడు టీడీపీ అభ్యర్థిని నిలబెడుతుందని నేను అనుకోవడం లేదు’ అంటూ కామెంట్స్‌ చేశారు.

ఇది వ్యాపారం కాదు రాజకీయం.. నామినేషన్ తర్వాత బాబుకు బొత్స స్ట్రాంగ్ కౌంటర్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement