సాక్షి, అమరావతి: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్నీ ఎన్నిక ఏకగ్రీవమైంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. కాగా, స్వతంత్ర అభ్యర్థి షఫీ తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ఎన్నిక ఏకగీవ్రమైంది.
కాగా, విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో రిట్నరింగ్ అధికారి ఎల్లుండి బొత్స పేరును అధికారికంగా ప్రకటించనున్నారు.
ఇదిలా ఉండగా.. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరి నుంచి అధికార టీడీపీ తప్పుకుంది. బలం లేకపోవడం.. బలగానికీ ఇష్టంలేకపోవడంతో పోటీలో ఉంటే చిత్తుగా ఓడిపోవడం తప్పదని పార్టీ పెద్దలు గ్రహించారు. అయినా, కుతంత్రాలపై ఆశలు పెట్టుకున్నారు. చివరికి.. సామదానభేద దండోపాయాలను ఉపయోగించారు. డబ్బులతో అయినా ఓట్లు కొనాలని చివరి నిమిషం వరకూ చూశారు. కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీల్లో కించిత్తైనా నమ్మకం లేకపోవడంతో కూటమి చేతులెత్తేసి తోకముడిచింది. దీంతో.. ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా వైఎస్సార్‌సీపీ కేడర్ చెక్కు చెదరకపోవడంతో ఆ పార్టీ ఖాతాలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ సీటు చేరింది. బొత్స విజయం లాంఛనంగా మారింది. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఇది తొలిమెట్టుగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment