
విశాఖ : సంఖ్యా బలం లేకపోయినా విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందని వైఎస్సార్‌సీపీ రిజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు మండిపడ్డారు. తాము జీవీఎంసీ మేయర్ పీఠాన్ని నిలబెట్టుకుంటామన్నారు కన్నాబాబు. ఈరోజు(ఆదివారం) విశాఖలో బొత్స సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కన్నబాబు, గుడివాడ్ అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘ టీడీపీ ఎప్పుడూ సిగ్గుమాలిన నీతిలేని రాజకీయం చేస్తుంది. కుట్రపూరితంగా మేయర్ పై అవిశ్వాసం ఇచ్చారు. రాష్ట్ర పాలనను కూటమికి ఇచ్చారు. స్థానిక సంస్థలు వైఎస్సార్‌సీపీకి ఇచ్చారు. భయపెట్టి మా వాళ్లను తీసుకెళ్తున్నారు. బొత్స అధ్యక్షతన మా కార్పోరేటర్లతో సమావేశం నిర్వహించాం. దొడ్డిదారి రాజకీయాలకు టీడీపీ పేటెంట్.. కూటమి తీరును ఖండిస్తున్నాం. . అదే సమయంలో వారి కుట్రలను ఎదుర్కొంటాం. అనైతికి రాజకీయాలు మానేయాలని సీఎం చంద్రబాబుకి హితవు పలుకుతున్నా’ కన్నబాబు పేర్కొన్నారు.
అవిశ్వాస తీర్మానం ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటి?
టీడీపీకి సంఖ్యాబలం లేకపోయినా అవిశ్వాస తీర్మానం ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. ప్రలోభాలకు గురిచేసి, భయపెట్టి వైఎస్సార్‌సీపీ కార్పోరేటర్లను కూటమి చేర్చుకుంటుంది. 30, 40 మందితో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని కూటమి సర్కార్ భావిస్తోంది. మా రాజకీయం మేం చేసఆం.. మా వారిని మేం కాపాడుకుంటాం. మా వ్యూహ రచనలతో మేయర్ పీఠాన్ని కాపాడుకుంటాం.’ అని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment