నామినేషన్ పత్రాలపై సంతకం చేస్తున్న మమత
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ భవానీపూర్ నుంచి టీఎంసీ తరఫున అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. బెంగాల్‌లోని పలు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల కమిషన్ ఉపఎన్ని కలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది వేసవిలో జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే పార్టీకి మెజారిటీ రావడంతో సీఎం పదవి చేపట్టారు. ఆరు నెలల తర్వాత కూడా సీఎంగా కొనసాగాలంటే ఏదో ఓ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో జరగనున్న ఈ ఉప ఎన్నికల్లో ఆమె గెలిస్తేనే సీఎంగా కొనసాగుతారు. నామినేషన్ వేసే సమయంలో మమతతో పాటు రాష్ట్ర కేబినెట్ మంత్రి భార్య ఫిర్హాద్ హకిమ్‌తో కలసి వెళ్లారు. అనంతరం పిర్హాద్ మాట్లాడుతూ.. నంది గ్రామ్‌లో మమతపై కుట్రపన్ని ఓడించారని, ఇప్పు డు భవానీపూర్ ప్రజలు మమతను రికార్డు మెజా రిటీతో గెలిపించి చరిత్రను తిరగరాస్తారని వ్యాఖ్యా నించారు. భవానీపూర్ నుంచి 2011, 2016 ఎన్ని కల్లో మమత పోటీ చేసి విజయం సాధించారు.
బీజేపీ తరఫున ప్రియాంక తిబ్రేవాల్..
భవానీపూర్‌లో మమతకు పోటీగా బీజేపీ నేత ప్రియాంక తిబ్రేవాల్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు బీజేపీ ఆమె పేరును నామినేట్ చేసింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తే ఈ ప్రియాంక తిబ్రేవాల్. వృత్తిరీత్యా ఆమె న్యాయవాది. ఆమెతో పాటు సంసేర్గంజ్‌కు మిలాన్ ఘోష్, జంగీపూర్‌కు సుజిత్ దాస్‌లను అభ్యర్థులుగా బీజేపీ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment