తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు జోరందుకున్నాయి.
ఖమ్మం: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు జోరందుకున్నాయి. ఖమ్మం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా లింగాల కమల్రాజ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో పాటు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి నామినేషన్ వేశారు. ఆయన వెంట ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. మహబూబ్నగర్ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దయాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్లకు గడువు రేపటితో ముగియనుంది. పోలింగ్ 27న జరుగుతుంది.