మూడుసార్లు ఓటమే.. బీఆర్ఎస్కు మళ్లీ భంగపాటు తప్పదా..
సాక్షి, ఖమ్మం: మధిర నియోజకవర్గ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మరోసారి సీఏల్పీ నేత భట్టి విక్కమర్క రంగంలో దిగుతున్నారు. అటు బీఆర్ఎస్ నుంచి సైతం లింగాల కమల్ రాజ్ బరిలో నిలుస్తున్నారు. అయితే వరుసగా మూడు సార్లు గెలిచిన భట్టి నాలుగోసారి తన అదృష్టాన్ని పరిక్షించుకుంటుండగా.. మరోవైపు మూడుసార్లు భట్టిపై ఓటమిపాలైన లింగాల కమల్‌రాజ్ ఈసారైన పరాజయాల పరంపరకు బ్రేక్ వేయాలనే ఉద్దేశ్యంతో సీరియస్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు.
అయితే ఏంత చేసిన వర్క్ అవుట్ అయ్యే అవకాశాలు లింగాల కమల్ రాజ్‌కు తక్కువగానే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న మధిర నియోజకవర్గంలో ఈసారి సీఏల్పీ నేత భట్టి విక్కమార్కకు బీఆర్ఎస్ అధిష్టానం చెక్ పెడుతుందా.. మధిర నియోజకవర్గంలో పొలిటికల్‌గా ఏటువంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి?.
ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గ రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు కలిగిన నియోజకవర్గం...ఒకప్పుడు సీపీఏంకు కంచుకోటగా ఉన్న మధిర ఇప్పుడు హస్తం పార్టీకి కంచుకోటగా మారింది. సర్దార్ జమలాపురం కేశవరావు, మాజీ మంత్రి శీలం సిద్ధారెడ్డి లాంటి మహనీయులు ఈ నియోజకవర్గానికి చెందినవారు.
లింగాల కమల్ రాజు
ఎస్సీ రిజర్వడ్‌గా ఉన్న మధిర నియోజకవర్గంలో 2009లో జరిగిన ఎన్నికల్లో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి శిష్యుడుగా ప్రస్తుత సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ నుండి పోటి చేసి గెలుపోందారు. ఆ తర్వాత వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో భట్టి విక్కమార్కనే గెలుస్తూ వస్తున్నారు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.. రోడ్లు,ప్రభుత్వ నూతన కార్యాలయాలు, 100 పడకల హాస్పిటల్, జాలిముడి ప్రాజెక్టు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మధిర నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకెళ్లుతుంది.
చదవండి: రెండుచోట్లా మైనంపల్లికి బీఆర్ఎస్ చెక్.
తెలంగాణ ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా చింతకాని, మధిర మండలాలను దళిత బంధు పథకంకు ఎంపిక కావడంలో భట్టి విక్కమార్కనే కీలక పాత్ర పోషించారు. ఎంతో మంది లబ్ధిదారులకు ఉపాధి అవకాశం కల్పించారు. వ్యవసాయధారిత ప్రాంతం కావడంతో రైతు సంక్షేమ పథకాలు నుండి ఎక్కువగా లబ్ధి పొందారు. ఇవన్ని వచ్చే ఎన్నికల్లో భట్టికి మరింత ప్లేస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఖమ్మం జిల్లా జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజును మధిర ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం కమల్‌రాజ్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నియోజకవర్గంలో స్థానికులు అడిగిన సమస్యలపై దృష్టి పెట్టి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో నెరవేర్చేల ప్రయత్నాలు జరుపుతున్నారు. గత మూడుసార్లు పోటీలో నిలిచినా ఒక్కసారి కూడ గెలవలేకపోయారు. అయితే ఈసారి బీఆర్ఎస్ అధిష్టానం అభ్యర్థిని మార్చి భట్టికి పోటిగా బలమైన అభ్యర్థిని పోటిలో దించుతుందనుకున్నారు. కాని మారిన పొలిటికల్ ఈక్వేషన్స్ నేపథ్యంలో బీఆర్ఎస్లింకు గాల కమల్ రాజే అభ్యర్థిగా దిక్కయ్యారు.
అయితే నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే తనను ఈ సారైనా గెలిపించాలని స్థానిక ప్రజలను కోరుతున్నారు..అంతేకాదు కాంగ్రెస్ పార్టీ నుంచి కొందరు నేతలు పార్టీలో చేర్పించేందుకు మంత్రి అజయ్ కుమార్‌తో కలిసి ప్రయత్నాలు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈసారి మధిరలో లింగాల కమల్‌రాజ్ ఓటమి పాలైతే పొలిటికల్‌గా రాబోయే రోజుల్లో గట్టు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. దీంతో కమల్‌రాజ్ కు ఈ ఎన్నికలు డూ ఆర్ డై గా మారయన్న ప్రచారం నడుస్తుంది.
మధిర మున్సిపాలిటీలో సుమారు 32 వేల మంది ఓటర్లు ఉన్నారు. దీనిలో అత్యధికంగా కమ్మ, ఎస్సీ, వైశ్య సామాజిక వర్గం వారికి చెందినవారు ఉండటంతో వీళ్ల ఓటు బ్యాంకును బట్టి ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపు, ఓటమిలు ఆధారపడ్డాయి. అదేవిధంగా ఎర్రుపాలెం, ముదిగొండ మండలంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉండటంతో అత్యధిక వీళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. దీంతో పాటుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది.
మొత్తానికి మధిర నియోజకవర్గంలో బీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలు ఢీ అంటే ఢీ అనేలా దూసుకుపోతున్నాయి..రెండు పార్టీలు గెలుపు పై దీమాతో ఉన్నాయి..కాంగ్రెస్ నుంచి సీఏల్పీ నేతగా ఉన్న భట్టి విక్కమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఇక్కడ రసవత్తరమైన పోటి ఉండే అవకాశం ఉంది...