న్యూఢిల్లీ, సాక్షి: దేశ రాజధానిలో లోక్‌సభ ఎన్నికల నామినేషన్లలో ఆసక్తికర పరిణామం జరిగింది. ఢిల్లీలో తొలి థర్డ్ జెండర్ అభ్యర్థి నామినేషన్ వేశారు. దక్షిణ ఢిల్లీ నియోజకవర్గానికి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
ధోతీ, తలపై టోపీ, బంగారు ఆభరణాలు ధరించి సాకేత్‌లోని దక్షిణ ఢిల్లీ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్న 26 ఏళ్ల రాజన్ సింగ్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. థర్డ్ జెండర్ వ్యక్తుల హక్కులతోపాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజలతోపాటు అధికారుల దృష్టిని ఆకర్షించేందుకు తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు రాజన్ సింగ్ తెలిపారు.
బిహార్‌కు చెందిన రాజన్ సింగ్ ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో నివసిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు తన నామినేషన్ థర్డ్ జెండర్ ఉనికిని, హక్కులను తెలియజేసే ప్రయత్నం అని రాజన్ సింగ్ అన్నారు. దేశంలో జంతువులకు కూడా సంక్షేమ బోర్డులు ఉన్నాయి కానీ థర్డ్ జెండర్ వ్యక్తుల పరిస్థితి వాటి కన్నా హీనంగా ఉందని వాపోయారు. తాను గెలిస్తే, థర్డ్ జెండర్ ప్రాథమిక అవసరాలను పరిష్కరిస్తానని రాజన్ సింగ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment