
సాక్షి, హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్లు ప్రారంభమయ్యాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తొలిరోజే(శుక్రవారం) నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నేరుగా హుజురాబాద్ చేరుకున్నారు. ఆర్డీఓ కార్యాలయంలో శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆయన వెంట ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు ఈ.పెద్దిరెడ్డి తదితరులు ఉన్నారు.
చదవండి: జీ‘హుజుర్’ ఎవరికో.. వారిద్దరి మధ్యే తీవ్ర పోటీ
Comments
Please login to add a commentAdd a comment