Gellu Srinivas Yadav
-
రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి
కవాడిగూడ (హైదరాబాద్): మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు గొల్లకురుమల వృత్తిని కించపరిచేలా, యాదవుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, దీనికి రేవంత్‌రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మ న్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ యాదవ, కురుమ సంఘాల జేఏసీ కన్వీనర్ అయిలయ్య, కో కన్వినర్ జి. శ్రీనివాస్ యాదవ్‌లు డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం కురుమ, యాదవ సంఘాలు ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహించాయి. దీనిలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న యాదవులు, కురుమలు రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశా రు. అనంతరం గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఇటీవల రేవంత్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై గొల్ల వృత్తిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. తక్షణమే రేవంత్‌రెడ్డి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని యాదవ సంఘాలు డెడ్‌లైన్ ప్రకటించినప్పటికీ ఆయన స్పందించకపోవడంతో మహాధర్నా చేపట్టామన్నారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపట్ల కాంగ్రెస్ నాయకులు స్పందించాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. చలో గాందీభవన్‌తో ఉద్రిక్తత ధర్నా అనంతరం కురుమ, యాదవ సంఘాలు గాందీభవన్ ముట్టడికి పిలుపునివ్వడంతో ధర్నా చౌక్ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. -
హుజురాబాద్ ఫలితాలు: వెక్కి వెక్కి ఏడ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు?
Gellu Srinivas Yadav On Huzurabab Election Results: 90 శాతం మంది ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్లో ఉన్నా.. చివరికి ఓటర్లు మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కే పట్టం కట్టారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాల్లో 24,068 ఓట్ల మెజారీటితో బీజేపీ సత్తాచాటిన విషయం తెలిసిందే. తనకు ప్రజల మద్దతు ఉందన్న విశ్వాసంతో టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన రాజేందర్ ఉప ఎన్నికలో గెలిచి జిల్లాలో మరోసారి తన బలాన్ని చాటుకున్నారు. ఈటల రాజేందర్‌కు 1,06,780 వేల ఓట్లు రాగా.. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ 82,712 ఓట్లతో రెండో స్థానానికి పరిమితయ్యారు. చదవండి: గిట్లెట్లాయే: జితేందర్ వర్సెస్ హరీశ్.. రెండు సార్లు పైచేయి ఒకరిదే ఇక ఉప ఎన్నిక ఫలితంపై గెల్లు శ్రీనివాస్ స్పందిస్తూ హుజూరాబాద్‌లో నైతిక విజయం తనదే అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. అయితే, ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా వస్తుండటంతో ఆయన తన సన్నిహితుల వద్ద వెక్కి వెక్కి ఏడ్చినట్టుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాల్లో 9వ రౌండ్ తర్వాత బీజేపీ 5 వేల ఓట్లతో ఆధిక్యంలో ఉందని, ఆసమయంలో గెల్లు కంటతడి పెట్టిన్నట్లు సౌమిత్ యక్కటి అనే వ్యక్తి ట్విటర్లో పోస్టు చేశారు. అయితే ఈ వీడియో ఎంతవరకు నిజమనేది క్లారిటీ లేదు. ఫలితాల నేపథ్యంలో వైరల్‌గా మారింది. చదవండి: Huzurabad Bypoll:1978 నుంచి కాంగ్రెస్‌కు నో చాన్స్.. #Huzurabad 😂😂 After 9th Round BJP Lead - 5,111 pic.twitter.com/mJAkUQmZI8 — Sowmith Yakkati (@sowmith7) November 2, 2021 -
మాటకు మాట
-
హుజూరాబాద్‌లో నైతిక విజయం నాదే: గెల్లు శ్రీనివాస్
-
హుజూరాబాద్‌లో నైతిక విజయం నాదే: గెల్లు శ్రీనివాస్
సాక్షి, కరీంగనర్: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ స్పందించారు. హుజూరాబాద్‌లో నైతిక విజయం తనదే అన్నారు. ఈ ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు.. విద్యార్థి నాయకుడు వెంకట్‌ని బలిపశువును చేశాయని గెల్లు శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ఫలితంపై కేటీఆర్, హరీశ్‌రావు కూడా స్పందించారు. (చదవండి: హుజూరాబాద్‌లో ఓటమి.. వైరలవుతోన్న కేటీఆర్ ట్వీట్) ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 24వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెల్లు శ్రీనివాస్‌పై విజయం సాధించారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ కేవలం 3000పైచిలుకు ఓట్లకే పరిమితం అయ్యింది. చదవండి: Huzurabad Bypoll Results: బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు: హరీశ్ రావు -
Huzurabad Bypoll Results: బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు: హరీశ్ రావు
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. టీఆర్ఎస్ ఓటమిపాలైన నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ.. ప్రజా తీర్పును శిరసావహిస్తామని అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసిన ఓటర్లందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేమీ తగ్గలేదని, అయితే దేశంలో ఎక్కడలేని విధంగా హుజురాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీలు కల్సిపనిచేశాయని ఎద్దేవా చేశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా చెప్తున్నారని, జాతీయ స్థాయిలో కొట్లాడే బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్ర స్థాయిలో కుమ్మక్కు కావడాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. ఏది ఏమైనా టీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎన్నికలో ఓటమితో కుంగిపోదని, గెలిచిననాడు పొంగిపోలేదని గుర్తుచేశారు. ఓడినా.. గెలిచినా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన ఉండి పనిచేస్తుందని హరీశ్ తెలిపారు. -
Huzurabad Bypoll 2021: గెల్లు సొంత గ్రామంలో కారు పంక్చర్
సాక్షి, కరీంనగర్: ఈటల రాజేందర్‌ను ఢీకొట్టడంలో కారు పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తడబడ్డారు. గెల్లు సొంత గ్రామమైన వీణవంకలోని హిమ్మత్ నగర్లో ఈటల రాజేందర్‌కు 191 ఓట్ల మెజారిటీ లభించడమే ఇందుకు నిదర్శనం. ఎన్నో ఆశలతో టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన గెల్లుకు సొంతూరి ప్రజలే షాకివ్వడం ఈటల ప్రభంజనాన్ని తెలియజేస్తోంది. ఎనిమిదో రౌండ్లో భాగంగా జరిగిన లెక్కింపు ప్రక్రియలో హిమ్మత్ నగర్ గ్రామంలో బీజేపీకి 548 రాగా, టీఆర్ఎస్కు 358 ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ స్వగ్రామంతోపాటు కౌశిక్ రెడ్డి సొంతూరు ఓట్ల లెక్కింపు కూడా జరిగింది. రెండు రౌండ్లలో మాత్రమే టీఆర్ఎస్ మొత్తం 22 రౌండ్ల ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. 20 రౌండ్లలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం సాధించగా, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ 2 రౌండ్లలో మాత్రమే ఆధిక్యం సాధించారు. ఫలితంగా ఈటల 24వేల పైగా ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. చదవండి: (ఈటల విజయం ఖాయం.. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయం) -
Huzurabad ByElection: రౌండ్ల వారీగా హుజూరాబాద్ బైపోల్ ఫలితాలు
రౌండ్ల వారీగా హుజూరాబాద్ బైపోల్ ఫలితాలు ఓట్లు టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మొత్తం ఓట్లు 82712 106780 3012 రౌండ్-22 3715 5048 109 రౌండ్-21 3431 5151 136 రౌండ్-20 3795 5269 107 రౌండ్-19 2869 5916 97 రౌండ్-18 3735 5611 94 రౌండ్-17 4187 5610 203 రౌండ్-16 3977 5689 135 రౌండ్-15 3358 5407 149 రౌండ్-14 3700 4746 152 రౌండ్-13 2971 4836 101 రౌండ్-12 3632 4849 158 రౌండ్-11 4326 3941 104 రౌండ్-10 3709 4295 118 రౌండ్- 9 3470 5305 174 రౌండ్- 8 4248 4086 89 రౌండ్- 7 3792 4038 94 రౌండ్- 6 3639 4656 180 రౌండ్- 5 4014 4358 132 రౌండ్- 4 3882 4444 234 రౌండ్- 3 3159 4064 107 రౌండ్- 2 4659 4851 220 రౌండ్- 1 4444 4610 114 -
హుజూరాబాద్ ఉప ఎన్నిక: ఈటల రాజేందర్ ఘన విజయం
Live Updates: 06:30PM: హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. 22వ రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యంలో నిలిచింది. 22వ రౌండ్లో 1333 ఓట్ల లీడ్‌ను బీజేపీ సాధించింది. 22 రౌండ్లు ముగిసిన తర్వాత 23,855 ఓట్ల ఆధిక్యంతో ఈటల రాజేందర్ భారీ విజయాన్ని సాధించారు. 06:21PM: 21వ రౌండ్లో బీజేపీ 1720 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 21వ రౌండ్లో బీజేపీ-5151, టీఆర్ఎస్-3431 ఓట్లు వచ్చాయి. 21 రౌండ్లు ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మొత్తం 22,735 ఓట్ల ఆధిక్యం సాధించారు. 05:58PM: 20వ రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యం. 20వ రౌండ్లో బీజేపీ 1474 లీడ్‌లో ఉంది. 20 రౌండ్లు ముగిసేసరికి ఈటల ఆధిక్యం 20 వేలు దాటింది. ఈటల రాజేందర్ 21,015 లీడ్‌లో ఉన్నారు. 05:41PM: 19వ రౌండ్లో ఈటల ఆధిక్యంలో దూసుకెళ్లుతున్నారు. 19వ రౌండ్లో ఈటల 3047 ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 19,541 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. 19 రౌండ్ ముగిసేసరికి మొత్తంగా బీజేపీ-91,306, టీఆర్ఎస్-71,771, కాంగ్రెస్- 2660 ఓట్లు వచ్చాయి. 05:24PM: 18వ రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 1976 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ ఈటల రాజేందర్ ఆధిక్యం 15 వేలు దాటింది. 18 రౌండ్లు ముగిసేసరికి ఈటల16, 594 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తుతున్నారు. 18వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ-85,396, టీఆర్ఎస్-68,902, కాంగ్రెస్-2563 ఓట్లు వచ్చాయి. 04:59PM: 17వ రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యం సాధించింది. 17వ రౌండ్లో బీజేపీ-5610, టీఆర్ఎస్-4187 ఓట్లు వచ్చాయి. 17వ రౌండ్లో బీజేపీ 1423 లీడ్ సాధించింది. 17వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 14618 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. ఇప్పటివరకు బీజేపీ- 79,785, టీఆర్ఎస్-65,167, కాంగ్రెస్- 2469 ఓట్లు వచ్చాయి. సిలివేరు శ్రీకాంత్(చపాతీ మేకర్ గుర్తు) అభ్యర్థి 1468 ఓట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. 04:38PM: 16వ రౌండ్లోనూ బీజేపీ లీడ్‌లో ఉంది. 16వ రౌండ్లో బీజేపీ 1712 ఓట్ల ఆధిక్యం సాధించింది.16వ రౌండ్లో బీజేపీ-5689, టీఆర్ఎస్-3917 ఓట్లు వచ్చాయి. 16వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 13,255 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. 04:08PM: 15వ రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యం సాధించింది.15వ రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 2149 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 15 వ రౌండ్లో బీజేపీ-5507, టీఆర్ఎస్- 3358 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం 10 వేలు దాటింది. ఇప్పటివరకు ఈటల రాజేందర్ 11,583 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు బీజేపీ-68,486, టీఆర్ఎస్- 57,003, కాంగ్రెస్-1982 ఓట్లు సాధించాయి. 03:44PM: 14వ రౌండ్లో బీజేపీ ఆధిక్యం సాధించింది. 14వ రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 1046 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 14వ రౌండ్లో బీజేపీ-4746, టీఆర్ఎస్-3700, కాంగ్రెస్-152 ఓట్లు వచ్చాయి. ఇప్పటివరకు బీజేపీ 63079, టీఆర్ఎస్-53627 ఓట్లు సాధించగా.. బీజేపీ 9434 ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతోంది. 03:20PM: 13వ రౌండ్లో ఈటల ఆధిక్యం సాధించారు. 13వ రౌండ్లో బీజేపీ 1865 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 13వ రౌండ్లో బీజేపీ- 4836, టీఆర్ఎస్-2971, కాంగ్రెస్-101 ఓట్లు వచ్చాయి. 13 రౌండ్లు ముగిసేసరికి ఈటల మొత్తం 8,388 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు మొత్తం బీజేపీ-58,333, టీఆర్ఎస్- 49,945 ఓట్లు వచ్చాయి. 03:08PM:12 రౌండ్లో బీజేపీ 1217 ఓట్ల ఆధిక్యం సాధించింది. 12 రౌండ్లో బీజేపీ-4849, టీఆర్ఎస్-3632, కాంగ్రెస్-158 ఓట్లు వచ్చాయి. 12 రౌండ్ల తర్వాత 6523 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ దూసుకుపోతున్నారు. 02:42PM: 11వ రౌండ్లో మళ్లీ ఆధిక్యంలో టీఆర్ఎస్ పార్టీ. 11వ రౌండ్లో టీఆర్ఎస్ 385 ఓట్ల ఆధిక్యం సాధించింది. 11 వ రౌండ్లో టీఆర్ఎస్-4326, బీజేపీ-3941, కాంగ్రెస్-104 ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు బీజేపీ-48,588, టీఆర్ఎస్- 43,324 ఓట్లు వచ్చాయి. 11 రౌండ్లు ముగిసేసరికి 5, 306 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ. 02:31PM: బీజేపీ అభ్యర్థి ఈటల పదో రౌండ్లోను ఆధిక్యం సాధించారు. 10 రౌండ్ల తర్వాత 5631 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ దూసుకుపోతుంది. పదో రౌండ్లో బీజేపీ 526 ఓట్ల ఆధిక్యంలో ఉంది. బీజేపీ-4295, టీఆర్ఎస్-3709 ఓట్లు సాధించాయి. 02:24PM హుజూరాబాద్‌లో బీజేపీ దూకుడు కొనసాగుతోంది. ఇక ఇప్పటికి వరకు హుజూరాబాద్, వీణవంక మండలాల్లో ఓట్ల లెక్కింపు పూర్తి అయింది. 02:00PM బీజేపీ దూకుడు హుజూరాబాద్‌లో బీజేపీ దూకుడును ప్రదర్శిస్తోంది. ఒక్క ఎనిమిదో రౌండ్ మినహా మిగిలిన అన్ని రౌండ్లలోనూ బీజేపీ అభ్యర్థి ఈటల స్పష్టమైన మెజార్టీని కొనసాగిస్తున్నారు. 01:52PM 9వ రౌండ్లో ఈటల 1835 ఓట్ల ఆధిక్యం బీజేపీ అభ్యర్థి ఈటల తొమ్మిదో రౌండ్లోనూ ఆధిక్యం సాధించారు. 9వ రౌండ్లో ఈటల 1835 ఓట్ల ఆధిక్యం సాధించి మొత్తంగా.. 5,105 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 9వ రౌండ్లో టీఆర్ఎస్ 3,470.. బీజేపీ 5,305.. కాంగ్రెస్ 174 ఓట్లు సాధించాయి. చదవండి: (Huzurabad ByElection: రౌండ్ల వారీగా హుజూరాబాద్ బైపోల్ ఫలితాలు) 01:42PM టీఆర్ఎస్ అభ్యర్థి స్వగ్రామంలోనూ బీజేపీ ఆధిక్యం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ సొంత గ్రామం వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌లో ఆయన వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ 190 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. ఇక్కడ బీజేపీ 548 ఓట్లు సాధించగా.. టీఆర్ఎస్ 358 ఓట్లు సాధించింది. 01:22PM టీఆర్ఎస్ ఆధిక్యం ఎనిమిదో రౌండ్లో టీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది. ఈ రౌండ్లో టీఆర్ఎస్కు 162 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఎనిమిది రౌండ్ల తర్వాత బీజేపీ 35,107.. టీఆర్ఎస్ 31,837.. కాంగ్రెస్ 1175 ఓట్లు సాధించాయి. ఈ రౌండ్లో గెల్లు, కౌశిక్ రెడ్డి సొంత గ్రామాల ఓట్ల లెక్కింపు జరిగింది. ఎనిమిదో రౌండ్లో టీఆర్ఎస్ 4248.. బీజేపీ 4,086.. కాంగ్రెస్ 89 ఓట్లు సాధించాయి. మొత్తంగా బీజేపీ అభ్యర్థి ఈటల 8 రౌండ్లు ముగిసేసరికి 3,270 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 01:06PM అన్ని రౌండ్లలోనూ ఈటలదే ఆధిక్యం బీజేపీ అభ్యర్థి ఈటల ఏడో రౌండ్లోనూ ఆధిక్యం సాధించారు. ఏడు రౌండ్ల తర్వాత బీజేపీ 3,432 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఏడో రౌండ్లో ఈటల 246 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఏడో రౌండ్లో టీఆర్ఎస్ 3,792.. బీజేపీ 4,038.. కాంగ్రెస్ 94 ఓట్లు సాధించాయి. ఇప్పటిదాకా వెలువడిన అన్ని రౌండ్లలోనూ ఈటలదే ఆధిక్యం. ఇప్పటిదాకా వెలువడిన ఫలితాల్లో బీజేపీ 31021.. టీఆర్ఎస్ 27589.. కాంగ్రెస్ 1086 ఓట్లు సాధించాయి. 12:43PM వీణవంక మండలం ఓట్ల లెక్కింపు ప్రారంభం వీణవంక మండలం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బీజేపీ అభ్యర్థి ఈటల ఆరో రౌండ్లోనూ ఆధిక్యం సాధించారు. ఈటల ఆధిక్యం రౌండ్ రౌండ్‌కు పెరుగుతోంది. ఆరు రౌండ్ల తర్వాత బీజేపీ 3,186 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఆరో రౌండ్లో బీజేపీ 4656.. టీఆర్ఎస్ 3639 ఓట్లు సాధించాయి. ఆరో రౌండ్లో బీజేపీ 1017 లీడ్ సాధించింది. ఇప్పటిదాకా వెలువడిన ఫలితాల్లో బీజేపీ 26,983.. టీఆర్ఎస్ 23,797.. కాంగ్రెస్ 992 ఓట్లు సాధించాయి. 11:50AM ఈటల హవా.. హుజూరాబాద్‌లో ఈటల తన హవా కొనసాగిస్తున్నారు. ఇప్పటిదాకా వెలువడిన తొలి ఐదు రౌండ్ల ఫలితాలలోనూ బీజేపీ అభ్యర్థి ఈటల ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ఐదు రౌండ్లు ముగిసే సరికి 2,169 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఐదో రౌండ్లో బీజేపీ 4,358.. టీఆర్ఎస్ 4,014.. కాంగ్రెస్ 132 ఓట్లు సాధించాయి. మొత్తంగా ఐదు రౌండ్లు ముగిసే సమయానికి బీజేపీ 22,327.. టీఆర్ఎస్ 20,158.. కాంగ్రెస్ 680 ఓట్లు సాధించాయి. 11:23AM 1,825 ఓట్ల ఆధిక్యంలో ఈటల నాలుగు రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యం సాధించింది. నాలుగో రౌండ్లో ఈటలకు 562 ఓట్ల ఆధిక్యం లభించింది. మొత్తంగా 4 రౌండ్ల తర్వాత 1,825 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతోంది. నాలుగో రౌండ్లో బీజేపీ 4,444.. టీఆర్ఎస్ 3,882.. కాంగ్రెస్ 234 ఓట్లు సాధించాయి. మొత్తంగా బీజేపీ 17,969.. టీఆర్ఎస్ 16,144.. కాంగ్రెస్ 680 ఓట్లు సాధించాయి. 10:58AM మూడు రౌండ్ల తర్వాత పార్టీల వారీగా ఓట్లు వరుసగా మూడు రౌండ్లలోనూ టీఆర్ఎస్ వెనుకబడింది. ఇప్పటిదాకా వెలువడిన ఫలితాల్లో బీజేపీ 13,525.. టీఆర్ఎస్ 12,262.. కాంగ్రెస్ 446 ఓట్లు సాధించాయి. మొత్తంగా బీజేపీ 1263 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. 10:48AM దళితబంధు పథకం ప్రారంభించిన శాలపల్లిలోనూ బీజేపీ ఆధిక్యం ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకం ప్రారంభించిన శాలపల్లిలోనూ బీజేపీ 129 ఓట్ల ఆధిక్యతను సాధించింది. ఈ గ్రామంలో బీజేపీకి 311 ఓట్లు రాగా, టీఆర్ఎస్కు 182 ఓట్లు వచ్చాయి. 10:35AM మూడో రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యత మూడో రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యతను కొనసాగించింది. మూడో రౌండ్లో 905 ఓట్ల ఆధిక్యం సాధించిన బీజేపీ, మొత్తంగా 1,263 ఓట్ల ఆధిక్యం సాధించింది. మూడో రౌండ్లో హుజూరాబాద్ మున్సిపాలిటీ ఓట్లను లెక్కించారు. 10:15AM రెండో రౌండ్‌ముగిసే సమయానికి బీజేపీ 9,461.. టీఆర్ఎస్ 9,103.. కాంగ్రెస్ 339 ఓట్లు సాధించాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 358 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 10:08AM రెండో రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యం హుజూరాబాద్ రెండో రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యం సాధించింది. తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి కంటే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 192 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండు రౌండ్ల తర్వాత బీజేపీ మొత్తం 358 ఓట్ల ఆధిక్యంలో ఉంది. రెండో రౌండ్లో బీజేపీ 4,851, టీఆర్ఎస్ 4,659 ఓట్లు సాధించగా.. కాంగ్రెస్ కేవలం 220 ఓట్లు సాధించింది. 10:00AM కాంగ్రెస్ అభ్యర్ధి కంటే రోటీ మేకర్‌కు ఎక్కువ ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి సాధించిన ఓట్లు(114) కంటే ఎక్కువగా ఇండిపెండెంట్ రోటీ మేకర్ గుర్తుకు 122 ఓట్లు పోలయ్యాయి. మొదటి ఐదు రౌండ్లలో హుజూరాబాద్ మండల ఓట్లను లెక్కిస్తారు. 9:30 AM తొలిరౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 166 ఓట్ల ఆధిక్యం సాధించారు. బీజేపీ 4610, టీఆర్ఎస్ 4444, కాంగ్రెస్ 114 ఓట్లు సాధించాయి. 08:52AM పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్ ఆధిక్యం పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్కు 503, బీజేపీ 159, కాంగ్రెస్ 32, చెల్లనవి 14గా ఉన్నాయి. మొత్తంగా పోస్టల్బ్యాలెట్లలో టీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది. 08:38AM ఈవీఎంల లెక్కింపు ప్రారంభమైంది. మొదటి రౌండ్లో హుజూరాబాద్ టౌన్ ఓట్లను లెక్కిస్తున్నారు. 08:28AM హుజూరాబాద్‌లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. 08:20AM పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. 08:00AM హుజూరాబాద్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. 8 గంటలకు మొదలైన ఈ ప్రక్రియ 8.30 వరకూ కొనసాగనుంది. మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. అరగంటలో పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెలువడనున్నాయి. తొలుత హుజూరాబాద్ మండలానికి చెందిన పోతిరెడ్డిపేట్ గ్రామం (పోలింగ్ స్టేషన్)తో లెక్కింపు మొదలవుతుంది. చివరిగా కమలాపూర్ మండలంలోని శంభునిపల్లి (పీఎస్ నెం.305)కి చెందిన ఈవీఎంలో ఓట్లు లెక్కిస్తారు. 14 టేబుళ్లపై మొత్తం 22 రౌండ్లుగా ఈ ప్రక్రియ కొనసాగనుంది. -
30 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తా
-
హుజురాబాద్ ఎన్నికల పోలింగ్ (ఫోటోలు)
-
ఓటు హక్కు వినియోగించుకున్న గెల్లు శ్రీనివాస్
-
Huzurabad Bypoll: ఓటెత్తిన హుజూరాబాద్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠను, ఆసక్తిని రేకెత్తించిన హుజూరాబాద్ ఉపఎన్నిక అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఓటు వేసేందుకు ప్రజలు పోటెత్తడంతో రికార్డు స్థాయిలో 86.33% పోలింగ్ నమోదైంది. 2018 ఎన్నికల్లో 82.19% పోలింగ్ నమోదు కావడం గమనార్హం. అధికార టీఆర్ఎస్ సహా అన్ని పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈటల రాజేందర్ (బీజేపీ), గెల్లు శ్రీనివాస్‌యాదవ్ (టీఆర్ఎస్), బల్మూరి వెంకట్ (కాంగ్రెస్)లు ప్రధాన పార్టీల తరఫున బరిలో నిలిచిన విషయం తెలిసిందే. గతంలో పలుమార్లు టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి వరుస విజయాలు సాధించిన ఈటల, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈసారి బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగడంతో ఈ ఉప ఎన్నికకు ప్రాధాన్యత చేకూరింది. 12 గంటల పోలింగ్ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న ఓటర్లు భారీ సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నానికే 45% దాటిన పోలింగ్ నియోజకవర్గంలోని ఇల్లందకుంట, జమ్మికుంట, వీణవంక, హుజూరాబాద్, కమలాపూర్‌లలో ఉదయం 7 గంటలకే ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు చేరుకోవడం ప్రారంభమైంది. జమ్మికుంట మున్సిపాలిటీ, హుజూరాబాద్ మున్సిపాలిటీలో ఉదయం 9 తరువాత పోలింగ్ ఊపందుకుంది. ఉదయం 7 నుంచి 9 గంటల సమయంలో 10.61 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం పూట వృద్ధులు, వికలాంగులు ఎక్కువగా ఓట్లు వేసేందుకు వచ్చారు. పోలింగ్ సమయం రాత్రి 7 గంటల వరకు ఉన్నా.. మధ్యాహ్నం లోగానే ఓటు వేసేందుకు స్థానికులు ఆసక్తి చూపించారు. మధ్యాహ్నం ఒంటిగంటకే పోలింగ్ 45 శాతం దాటడం అధికారులను ఆశ్చర్యపరిచింది. రైతులు, ఇతర వ్యవసాయ పనులు, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునేవారు, ఇతర ప్రాంతాల్లో సెటిలైనవారు మాత్రం సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల సమయంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటలకే చీకటి పడినా.. అధికారులు ముందస్తుగా చేపట్టిన చర్యల కారణంగా అంతా ఇబ్బందుల్లేకుండా ఓట్లేశారు. చివరి గంటలో కరోనా పాజిటివ్ రోగులు ఓటేసేందుకు అనుమతించారు. సాయంత్రానికి 76.26 శాతానికి చేరుకున్న పోలింగ్ పర్సంటేజీ, చివరగా పోలింగ్ ముగిసేసరికి గతంలో ఎన్నడూ లేనివిధంగా 86.33 శాతానికి చేరింది. మూడంచెల భద్రతలో ఈవీఎంలు గతంలో పోలింగ్ సాయంత్రం 5 గంటలకే ముగిసేది. కానీ కరోనా నిబంధనలతో రెండు గంటలు అదనంగా సమయం ఇచ్చారు. అయినా మండలాల్లోని చాలా ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటలకే పోలింగ్ ముగిసింది. అలాంటి కేంద్రాల్లో 7 గంటల తరువాత ఈవీఎంలను సీజ్ చేసి కరీంనగర్‌కు తరలించారు. ఇల్లందకుంట, జమ్మికుంట, వీణవంక వంటి కొన్ని పోలింగ్స్టేషన్లలో ఓటర్లు సాయంత్రం కూడా బారులు తీరారు. రాత్రి ఏడు గంటల లోపు క్యూలో ఉన్నవారిని అధికారులు ఓటు వేసేందుకు అనుమతించారు. ఈవీఎంలన్నీ కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కళాశాలకు తరలించి కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. నవంబర్ 2వ తేదీన కౌంటింగ్ జరగనుంది. అదేరోజు అభ్యర్థుల భవితవ్యంపై ప్రజా తీర్పు వెలువడనుంది. భారీ బందోబస్తు నియోజకవర్గంలో మొత్తం 305 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అందులో 172 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు, 73 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఇందుకు అనుగుణంగా దాదాపు 1,800 మంది (90 కంపెనీలు) కేంద్ర బలగాలు, 2,000 మందికి పైగా స్థానిక పోలీసులు కలిపి మొత్తం సుమారు 4,000 మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడక్కడా చిన్నచిన్న గొడవలు నియోజకవర్గంలో పలుచోట్ల చిన్నచిన్న ఘటనలు చోటు చేసుకున్నాయి. ఉదయం టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్‌రెడ్డి వీణవంక పోలింగ్ కేంద్రంలో పర్యటించిన సమయంలో బీజేపీ నేతలు ఘర్షణకు దిగారు. మరోవైపు నియోజకవర్గంలోని ఐదు మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో ఓటర్లకు డబ్బుల పంపిణీపై బీజేపీ, టీఆర్ఎస్ నేతలు పరస్పరం ఆరోపణలకు దిగారు. మరికొన్ని చోట్ల రెండుపార్టీల నేతలు బాహాబాహీకి దిగారు. ► జమ్మికుంట పట్టణంలోని ఎంప్లాయిస్ కాలనీలో అధికార పార్టీ వారు డబ్బులు పంచుతున్నారని బీజెపీ నేతలు ధర్నాకు దిగారు. ► జమ్మికుంట మండలంలోని శాయంపేట గ్రామంలో అధికార పార్టీ తరఫున ఓ మీడియా ప్రతినిధి డబ్బులు పంచుతుండగా స్థానికులు పట్టుకున్నారు. ► హుజూరాబాద్‌లోని రెండు వార్డుల్లో డబ్బులు పంపిణీ చేసిన ఓ పార్టీకి చెందిన స్థానికేతర నేతలను స్థానికులు అడ్డుకోవడం గొడవకు దారితీసింది. ► ఇల్లందకుంట మండలం సిరిసేడు, శ్రీరాములుపల్లిలో డబ్బులు పంచుతున్నారంటూ గొడవలు జరిగాయి. ► తమ డబ్బులు ఇవ్వలేదంటూ వీణవంక మండలం గంగారం, ఇల్లందకుంట మండలం టేకుర్తి గ్రామాల్లో ఓటర్లు నిరసన వ్యక్తం చేశారు. ► మధ్యాహ్నం వరకు స్థానికులు, ఆ తరువాత ఇతర ప్రాంతాల్లో నివసించేవారు అధికంగా పోలింగ్‌లో పాల్గొన్నారు. ఇదే సమయంలో తమకు అనుకూలంగా ఉండే వర్గాలన్నీ అకస్మాత్తుగా మరో పార్టీకి ఓటేశాయనే ప్రచారం ప్రధాన పార్టీల్లో జరిగింది. దీంతో ఎవరి ఓట్లు ఏ పార్టీకి పడ్డాయో తెలియని అయోమయం నెలకొంది. ఎగ్జిట్ పోల్ సర్వేలు దాదాపు ప్రతి పోలింగ్‌స్టేషన్ వద్ద పలు సంస్థలు ఎగ్జిట్ పోల్ సర్వేలు నిర్వహించాయి. ఓటర్ల నాడిని తెలుసుకునే ప్రయత్నం చేశాయి. కానీ చాలామంది తీర్పును వెల్లడించేందుకు నిరాకరించారు. దీంతో ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపారు అన్న విషయంలో అన్ని పార్లీల్లోనూ ఉత్కంఠ నెలకొంది. మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం, రాజకీయ పార్టీలు ఊపిరి పీల్చుకున్నాయి. -
గెల్లు శ్రీనివాస్‌కే మా మద్దతు
ఖైరతాబాద్(హైదరాబాద్): హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాల్సిందిగా 120 బీసీ సంఘాలు ప్రజలకు విజ్ఞప్తి చేశాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. అయితే కొందరు వ్యక్తులు, సంఘాల నేతలు ఈ అంశంపై అనవసర విమర్శలు చేస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నందుకు తాము అనేక కారణాలు చెప్పగలమని, ఈటల రాజేందర్‌కు మీరు మద్దతు ఇవ్వడానిగల కారణాలు చెప్పగలరా అని ఆయన సవాలు చేశారు. గురువారం కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ బీసీబంధు పథకం పెట్టాలని, ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని తాము రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేశామని, అదే రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం నిర్వహించి బీసీబంధు పథకంపై సానుకూలత వ్యక్తం చేశారని, వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తామని ప్రకటించారని తెలిపారు. బీసీల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, అందుకే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు మద్దతు ఇస్తున్నామని స్పష్టంచేశారు. జనగణనలో బీసీలను లెక్కించడానికి ఒప్పుకోని బీజేపీ, దేశంలోని 70 కోట్లమంది బీసీలను ఎలా అభివృద్ధి చేస్తుందని ప్రశ్నించారు. బీజేపీ బీసీ వ్యతిరేక వైఖరి మానుకోవాలని హెచ్చరించారు. -
బీజేపీకి గ్యాస్ బండ దెబ్బ ఖాయం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఈనెల 30న జరిగే హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ నెత్తిన గ్యాస్ సిలిండర్ దెబ్బ పడటం, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ విజయం ఖాయమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన హుజూరాబాద్‌లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటికే పలు సంస్థలు, మీడియా విభాగాలు చేసిన సర్వేలు టీఆర్ఎస్ విజయం ఖాయమని తేల్చాయన్నారు. దీంతో నిరాశలో కూరుకుపోయిన బీజేపీ నేతలు ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజాసంక్షేమం, పథకాలు, అభివృద్ధి తదితర విషయాల్లో తాము ప్రజలకు చేసిన మేలును మాత్రమే చెప్పామన్నారు. కానీ.. బీజేపీ నేతలు కూల్చేస్తాం, చీల్చేస్తాం, బద్దలు కొడుతాం అంటూ ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్నారు. పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించేందుకు ఏమైనా హామీ ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఇది చాలదన్నట్లుగా నవంబరు 2వ తేదీ తరువాత సిలిండర్‌పై మరో రూ.200 పెంచబోతున్నారని ఆరోపించారు. ఈ ప్రచారం మొత్తంలో ప్రజలకు బీజేపీ ఎలాంటి హామీలు ఇవ్వకపోగా దళితబంధుపై లేఖలు రాసి ఆపేసిందని ధ్వజమెత్తారు. తాము రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులతో రైతు, పేదల సంక్షేమానికి పట్టం కట్టామన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం కేంద్రంలో రైతుల పాలిట శాపంగా మారిన నల్లచట్టాలను తీసుకువచ్చిందన్నారు. ఈ ఏడేళ్లలో బీజేపీ ప్రభుత్వం– టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి మంచి పనులు చేశాయో బేరీజు వేసుకుని ఓటేయాలని కోరారు. బీజేపీ అంటే కోతలు.. వాతలే ‘బీజేపీ అంటే ప్రజా సంక్షేమ పథకాల సబ్సిడీల్లో కోతలు, ప్రజలపై పన్నుల వాతలు’అని మంత్రి హరీశ్ ఎద్దేవా చేశారు. ఈ ఏడేళ్లలో పెట్రోలు, డీజిల్, నిత్యావసరాల ధరలు పెంచి జనం నడ్డి విరిచారన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించి ఉద్యోగులను రోడ్డుకీడ్చారన్నారు. కరీంనగర్–జమ్మికుంట–హుజూరాబాద్ రైల్వేలైన్‌ను ఆపివేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను బానిస అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. ఎట్లా అంటారని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ బీజేపీ అహంకారానికి, బీసీలపై వ్యతిరేకతకు నిదర్శనమని విమర్శించారు. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా వచ్చే మీడియా కథనాలు, సోషల్ మీడియా పోస్టులను నమ్మవద్దని విజ్ఞప్తిచేశారు. హుజూరాబాద్‌లో అభివృద్ధికి పట్టం కట్టాలని ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. -
ఎన్నికల ఏర్పాట్ల పై SEC పర్యవేక్షణ
-
మూగబోనున్న మేకులు..నేటితో ప్రచారనికి తెర
-
‘సంక్షేమం’లో రాష్ట్రం రోల్‌మోడల్
హుజూరాబాద్/ఎల్కతుర్తి: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రోల్‌మోడల్‌గా నిలుస్తోందని రాష్ట్ర ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం హుజూరాబాద్‌లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పొనగంటి శ్రవణ్‌కుమార్ తన అనుచరులతో కలిసి పార్టీలో చేరగా మంత్రి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. మంత్రి మాట్లాడుతూ ‘తెలంగాణ అంటే వలసలు, బొగ్గుబాయి పని. ఇప్పుడు ఈ ఏడేళ్లలో ఇతర రాష్ట్రాల వారు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. రైతుబంధు తెలంగాణ మోడల్. 24 గంటల ఉచిత విద్యుత్ తెలంగాణ మోడల్. రైతు బీమా తెలంగాణ మోడల్. టీఎస్ ఐపాస్ తెలంగాణ మోడల్. ఇది మనం చెబుతున్నది కాదు. కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ సభ్యులే అంటున్నారు’ అని చెప్పారు. హుజూరాబాద్‌లో అరాచానికి.. అభివృద్ధికి మధ్య పోటీ నడుస్తోందని.. ఈటల మాటల్లో ఒక్క నీతివంతమైన మాట ఉందా? అని నిలదీశారు. ‘గ్యాస్ సిలిండర్ ధర బీజేపీ పాలనలో వెయ్యి రూపాయలకు పెరిగింది. రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్ర పన్ను రూ.291 ఉందన్నారు. రూ.291 రాష్ట్ర పన్ను ఉంటే నేను ముక్కు నేలకు రాస్తా. దీనిపై హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద చర్చకు వస్తావా’ అని సవాల్ విసిరారు. సిలిండర్ ధరను రూ.500కు తగ్గిస్తామని చెప్పి బీజేపీ ఓట్లు అడగాలని పేర్కొన్నారు. హుజూరాబాద్‌ను అభివృద్ధి చేసి చూపిస్తాం.. హుజూరాబాద్ ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపిస్తే నియోజక వర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తామని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. మంగళవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికలపేట గ్రామ శివారులో జరిగిన వడ్డెర కుల ఆశీర్వాద సభలో హరీశ్ మాట్లాడారు. ఆత్మగౌరవం అంటూ ఈటల రాజేందర్ వింతగా మాట్లాడుతున్నాడని, నియోజకవర్గ ప్రజలకు గడియారాలు, కుక్కర్లు పంచిననాడే ఆయన ఆత్మగౌరవం మంటకలిసిందని విమర్శించారు. సమావేశంలో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైతులను బీజేపీ ఉగ్రవాదులంటోంది..
సాక్షి, ఇల్లందకుంట (కరీంనగర్): రైతులను ఉగ్రవాదులతో పోల్చిన బీజేపీకి ఓటు వేస్తారా.. ధరలు పెంచిన పువ్వు గుర్తుకు ఓటు వేస్తారా లేక ప్రజలను ఆదుకుంటున్న టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తారా అన్నది ప్రజలు ఆలోచించాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కోరారు. సోమవారం ఇల్లంద కుంట మండలంలోని టేకుర్తి, రాచపల్లి గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. బీజేపీ తెచ్చిన నల్ల చట్టాలు, వ్యవసాయ చట్టాలు రైతులకు ఉరి తాళ్లుగా మారుతున్నాయని, ఈటల రాజేందర్ కారణంగానే మధ్యంతర ఎన్నికలు వచ్చాయని అన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న పార్టీ టీఆర్ఎస్ అని, నిత్యం డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న పార్టీ బీజేపీ అని దుయ్యబట్టారు. ఈటల రాజేందర్ తన ఆస్తులను రక్షించుకునేందుకే ఉప ఎన్నికకు తెరలేపారని మండిపడ్డారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
Huzurabad Bypoll: 61 మంది.. 92 నామినేషన్లు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో కీలకమైన నామినేషన్ల పర్వం ముగిసింది. శుక్రవారం చివరిరోజున భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఈటల రాజేందర్, ఈటల జమున (బీజేపీ), గెల్లు శ్రీనివాస్ యాదవ్ (టీఆర్ఎస్), బల్మూరి వెంకట్ (కాంగ్రెస్) మరోసారి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా పోలీసులు హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు మొత్తం 61 మంది అభ్యర్థులు 92 నామినేషన్లు దాఖలు చేసినట్టు అధికారులు ప్రకటించారు. ఇందులో బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు మినహా మిగతా వారంతా గుర్తింపు లేని పార్టీలు, స్వతంత్రు లే కావడం గమనార్హం. కొనసాగిన ఫీల్డ్ అసిస్టెంట్ల నిరసన..! పెద్ద సంఖ్యలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు శుక్రవారం ఉదయం 10 గంటలకే ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. సీఎం కేసీఆర్‌కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు పలుమార్లు సూచించారు. నామినేషన్ వేయాలనుకుంటే ఆఫీసు లోపలికి వెళ్లాలని, అంతేతప్ప నిబంధనలను ఉల్లంఘించొద్దని కోరారు. అయినా ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళన కొనసాగించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్, మంత్రి హరీశ్‌రావు వచ్చిన సమయంలో.. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ డౌన్‌డౌన్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ప్రభుత్వం తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారి వాహనాలకు అడ్డుగా వెళ్లారు. పోలీసులు కలగజేసుకుని ఫీల్డ్ అసిస్టెంట్లను పక్కకు తప్పించారు. బరిలో 12 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు హుజూరాబాద్ ఉప ఎన్నికలో 12 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు బరిలో ఉన్నారని ఫీల్డ్ అసిస్టెంట్ల జేఏసీ చైర్మన్ శ్యామలయ్య తెలిపారు. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ నుంచి తప్పుకోబోరని చెప్పారు. జిల్లాల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్లు అంతా వచ్చి ప్రచారం చేస్తారని వెల్లడించారు. ఈసారీ గెలుపు ఈటలదే..: జమున మరోసారి నామినేషన్ వేసిన ఈటల రాజేందర్ భార్య జమున మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికలో విజయం రాజేందర్‌దేనని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులని, ఇంతకాలం తమను ఆదరించారని, ఇప్పుడూ గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. నియోజకవర్గంలో ఈటల రాజేందర్ చేసిన అభివృద్ధి పనులే ఆయన్ను గెలిపిస్తాయన్నారు. నామినేషన్ దాఖలు చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్. చిత్రంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్ తాను ప్రతిసారీ ఈటలకు డమ్మీగా నామినేషన్ వేస్తుంటానని, ఈసారీ అలాగే వేశానని చెప్పారు. కాగా.. ఈటల రాజేందర్ సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు మరోసారి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన వెంట కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు ఉన్నారు. నిరుద్యోగుల గళమవుతా: బల్మూరి వెంకట్ తనకు హుజూరాబాద్ నుంచి పోటీ చేసే అవకాశమిచ్చిన రాహుల్, సోనియాగాంధీలకు కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ కృతజ్ఞతలు తెలిపారు. సీనియర్ నేతలు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, కవ్వంపల్లి సత్యనారాయణలతో కలిసి నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగుల తరఫున తాను పోరాడుతున్నానని.. విద్యార్థులు–నిరు ద్యోగుల గళంగా నిలుస్తానని వెంకట్ చెప్పారు. రైతుల ఉసురు తీసే బీజేపీకి ఎందుకు ఓటేయాలి: హరీశ్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, పాడి కౌశిక్‌రెడ్డిలతో హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయానికి వచ్చిన మంత్రి హరీశ్‌రావు.. నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈటల రాజేందర్ వ్యక్తిగత స్వార్థంతోనే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారని హరీశ్ ఆరోపించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 70 శాతం వ్యవసాయాధారిత కుటుంబాలే అని.. రైతుల సంక్షేమం ఏమాత్రం పట్టని బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. నామినేషన్ దాఖలు చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్. చిత్రంలో మంత్రి హరీశ్‌రావు, కౌశిక్‌రెడ్డి రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ, ఆసరా పింఛన్లు, ఎరువులు, విత్తనాలు, మార్కెటింగ్ సదుపాయాలు, కాళేశ్వరం ప్రాజెక్టు వంటి ఎన్నో చేపట్టామన్నారు. ‘‘బీజేపీకి రైతులు ఎందుకు ఓటేయాలో ఒక్క కారణమైనా చెప్పగలరా? యూపీలో రైతులను నడిరోడ్డుపై వాహనాలతో తొక్కించినందుకు వేయాలా? రైతులను లాఠీలతో చితకబాదినందుకు వేయాలా? రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చినందుకు వేయా లా? ప్రభుత్వ రంగం సంస్థలను కార్పొరేట్లకు అమ్ముకుంటున్నందుకు వేయాలా? బీసీ, ఎస్సీ–ఎస్టీల రిజర్వేషన్ల ఎత్తివేతకు కుట్ర పన్నుతున్నందుకా?’’అని హరీశ్ ప్రశ్నించారు. వంట గ్యాస్ ధర రూ.1,000కి చేరిందని.. పెట్రోల్, డీజిల్ ధరల ను అడ్డగోలుగా పెంచేశారని మండిపడ్డారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. -
ఈటల స్వార్థం వల్లే ఉపఎన్నిక
హుజూరాబాద్: ‘హుజూరాబాద్ ఉపఎన్నిక ఈటల రాజేందర్ స్వార్థం వల్ల వచ్చింది. హుజూరాబాద్ జిల్లా కావాలనో, హుజూరాబాద్‌కు మెడికల్ కాలేజీ కావాలనో ఆయన రాజీనామా చేశారా? స్వలాభం కోసం రాజీనామా చేశారు. వ్యక్తి లాభం ముఖ్యమా.. వ్యవస్థ లాభం ముఖ్యమా అన్నది ప్రజలు ఆలోచన చేయాలి’అని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం హుజూరాబాద్ మండలంలోని ధర్మరాజుపల్లి, పెద్దపాపయ్యపల్లి, కాట్రపల్లి సిర్సపల్లి, వెంకట్రావ్పల్లి గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌తో కలిసి హరీశ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడతూ.. బీజేపీ ప్రజలకు ఏం చేసిందని ఆ పార్టీలో చేరారో ఈటల రాజేందర్ ప్రజలకు చెప్పాలన్నారు. గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి రూపాయలు చేసిన బీజేపీ.. నిన్న మరో రూ.15 పెంచి ప్రజలకు వాతలు పెడుతోందని విమర్శించారు. ధరలు పెంచే బీజేపీకి ఓటు వేయాలా? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయల సాయం చేస్తున్నారా అని ప్రశ్నించారు. ‘ఆరుసార్లు ఈటలను గెలిపించినా ఒక్క ఇల్లు కట్టలేదు. గెల్లుని గెలిపిస్తే డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని’హామీఇచ్చారు. కాట్రపల్లి గ్రామానికి రూ.రెండు కోట్లు మంజూరు చేశామని తెలిపారు. ఎంపీ బండి సంజయ్ గెలిచి రెండేళ్లు దాటినా ఒక్క పని అయినా చేశాడా అని నిలదీశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి పాల్గొన్నారు. -
హుజురాబాద్ ఉపఎన్నిక: సమరభేరిలో సకుటుంబం..
సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ ఉపపోరు క్రమంగా ఊపందుకుంటోంది. తొలుత గెల్లు శ్రీనివాస్ యాదవ్ (టీఆర్ఎస్), తరువాత బల్మూరి వెంకట్ (కాంగ్రెస్), తాజాగా ఈటల రాజేందర్ (బీజేపీ) ప్రధాన పార్టీల అభ్యర్థులుగా ఉపపోరు బరిలో దిగారు. ప్రధానపార్టీల నుంచి అభ్యర్థుల ఎంపిక ఖరారైంది. ఈలోపే అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెట్టారు. మరికొందరు ఏకంగా అమలు చేసేస్తున్నారు. ఈ ముగ్గురు కూడా తమ ఇంటి మద్దతుతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వారి భార్యలు, తల్లులు మద్దతుగా ప్రచారంలోకి రానున్నారు. ఈటల రాజేందర్ రాజీనామా నుంచి ఇప్పటి దాకా ఆయన సతీమణి ఈటల జమున ఆయన వెంటే ఉన్నారు. ఒకదశలో ఈటలకు మోకాలి నొప్పి తీవ్రమైన సమయంలో ఆయనకు వీలుకాని పక్షంలో తానే రంగంలోకి దిగాలనుకున్నారు. చదవండి: హుజురాబాద్ ఉపఎన్నిక: రెండో డోసు సర్టిఫికెట్ ఉంటేనే రండి! ఈలోపు రాజేందర్ కోలుకోవడంతో ఆయనకు మద్దతుగా జమున ప్రచారం ప్రారంభించారు. గెల్లు శ్రీనివాస్‌యాదవ్ అభ్యర్థిత్వం ఆగస్టులోనే ఖరారైంది. కొన్నిరోజులుగా ఆయన భార్య గెల్లు శ్వేత కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. తన భర్తను గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఇక అందరి కంటే ఆఖరుగా కాంగ్రెస్ ప్రకటించిన బల్మూరి వెంకట్ తల్లి బల్మూరి పద్మ కూడా ప్రచారబరిలోకి త్వరలోనే రానున్నారు. ఉప ఎన్నిక సమరభేరికి వెళ్లే కుమారునికి ఓ తల్లి, తమ భర్తలకు భార్యలు వీరతిలకం దిద్దారు. ఎన్నికల ప్రచార పోరులోనూ భాగస్వాములవుతూ మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ముందుకు సాగుతున్నారు. చదవండి: హుజూరాబాద్ ఉప ఎన్నిక: ఉత్సాహవంతులకు ఊహించని దెబ్బ గెల్లు ఉద్యమం కొనసాగుతుంది 20 ఏళ్లుగా నా భర్త విద్యార్థి నాయకుడిగా తెలంగాణ కోసం పోరాడాడు. ఏనాడూ ఏ పదవీ ఆశించలేదు. పేదింటి ఉద్యమకారుడు, నిజాయితీగా పనిచేయడమే తెలుసు. అందుకే.. సీఎం ఇక్కడ పోటీ చేసే అవకాశం కల్పించారు. గతంలో రాష్ట్ర సాధన కోసం పోరాడిన నా భర్త, భవిష్యత్తులో కేసీఆర్ అండదండలతో నియోజకవర్గ అభివృద్ధికి అదే సంకల్పంతో పోరాటం చేస్తాడు. – గెల్లు శ్వేత యాదవ్ హుజూరాబాద్ ప్రజలు చైతన్యవంతులు హుజూరాబాద్ ప్రజలు చాలా చైతన్యవంతులు. డబ్బుకు అమ్ముడు పోయేవారు కాదు. దళిత కాలనీలలో రూ.10 లక్షలు కాదు ఉద్యోగం కావాలని అడుగుతున్నారు. ట్రాక్టర్లు, కార్లు ఇస్తే చదువుకున్న వాళ్లు వాటికి డ్రైవర్లుగా పనిచేయాలా అని నిలదీస్తున్నారు. హుజూరాబాద్‌కు వస్తున్న ప్రతీ పథకం ఈటల రాజేందర్ రాజీనామా వల్లనే. తమ్ముడు తమ్ముడు అని కేసీఆర్ తడిగుడ్డతో గొంతుకోశారు. అందుకే.. రాజేందర్‌ను గెలిపించాలి. – ఈటల జమునప్రభుత్వ వైఖరిని ఎండగడతా ఈనెల 8వ తేదీ నుంచి నేను ప్రచారంలో పాల్గొంటా. రాష్ట్రంలో ఉద్యోగాలు రాకుండా బాధ పడుతున్న అయోమయంలో పడేసింది. ప్రభుత్వ వైఖరిని ప్రతీ తల్లికి తండ్రికి తెలిసేలా అందరినీ ఏకం చేస్తూ ప్రచారంలో ముందుకు వెళతాం. నా బిడ్డ విజయానికి నా వంతుగా కృషి చేస్తా. – బల్మూరి పద్మ -
గెల్లును గెలిపించండి
హుజూరాబాద్/ సిద్దిపేట: హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపించాలని, హుజూరాబాద్ అభివృద్ధి బాధ్యత తమదని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం హుజూరాబాద్, సిద్దిపేటలో మంత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సింగాపూర్‌లో పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన పలువురు టీఆర్ఎస్ చేరగా, వారికి హరీశ్‌రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆరుసార్లు ఎన్నికల్లో గెలిచిన ఈటల రాజేందర్ హుజూరాబాద్‌కు చేసిందేమీ లేదని, నాలుగు వేల ఇళ్లు సీఎం కేసీఆర్ ఈ నియోజకవర్గ ప్రజల కోసం మంజూరు చేస్తే ఒక్క ఇల్లు కూడా ఈటల కట్టలేదని విమర్శించారు. ఏడేళ్లలో 21సార్లు ధరలు పెంచిన కేంద్రం కేంద్ర ప్రభుత్వం తీరుతో వంటింట్లో మహిళల కం ట్లో కన్నీరు వస్తోందని, అడ్డూఅదుపూ లేకుండా పెరిగిపోతున్న గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్య ప్రజలకు, నిరుపేదలకు గుదిబండగా మారుతున్నాయని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ది పేట జిల్లా కేంద్రంలో పేదల డబుల్ బెడ్రూం (కేసీఆర్ నగర్) కాలనీలో ఇంటింటికి పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరాకోసం ప్లాంట్ ప్రారంభం, 360 డబుల్ బెడ్రూం ఇళ్ల సామూహిక గృహ ప్రవేశాలు, బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం గడిచిన ఏడేళ్లలో 21 సార్లు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచి ప్రజల నడ్డి విరిచిందని విమర్శించారు. జిల్లాలోని తన ఇంటికి, జిల్లా కలెక్టర్ ఇంటికి కూడా పైప్‌లైన్ గ్యాస్ సరఫరా లేదని, మొదటిసారిగా పేదల ఇళ్లకు ఈ అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో సిద్దిపేట పట్టణంలో ఇప్పటికే 1,976 డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేశామని, మరో వెయ్యి ఇళ్ల పంపిణీ కోసం త్వరలో లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. -
Huzurabad Bypoll: ‘గులాబీ’ దూకుడు
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం ప్రారంభంకాగా టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ తొలిరోజే నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలుతోపాటు ప్రచారంలోనూ తమదే ముందంజ అని చాటిచెప్పాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ ఏడాది మే 1న ఈటల కేబినెట్ నుంచి బర్తరఫ్ కాగా, జూలై 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజు నుంచే హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ కేడర్ చేజారకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. తర్వాత ఈటల వెంట వెళ్లిన లీడర్లతోపాటు ఇతర పార్టీల ముఖ్యనేతలు, క్రియాశీల నాయకులను టీఆర్ఎస్ గూటికి తెచ్చేలా పావులు కదిపి ఫలితం సాధించింది. పార్టీ నుంచి ఈటల నిష్క్రమించిన తర్వాత 114 రోజుల వ్యవధిలో హుజూరాబాద్ నియోజకవర్గంలో 140 వరకు సభలు, సమావేశాలు నిర్వహించింది. ఆర్థికమంత్రి టి.హరీశ్‌రావు సారథ్యంలో పార్టీ యంత్రాంగం ఊరూరా, ఇంటింటా ప్రచారం చేసి జనానికి చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది. తొలుత పార్టీ కేడర్‌తో మండలాలవారీగా సమావేశాలు, నియోజకవర్గంలో పెండింగ్ పనుల పూర్తి, కొత్త పనులకు శంకుస్థాపన వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. పలువురు నియోజకవర్గ నేతలకు రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పదవులు ఇవ్వడం ద్వారా స్థానిక నాయకత్వం విశ్వాసాన్ని చూరగొనే ప్రయత్నం చేసింది. ‘దళితబంధు’ అమలుకు హుజూరాబాద్‌ను వేదికగా ఎంచుకుని ఆగస్టు 16న జరిగిన సభకు పార్టీ అధినేత కేసీఆర్ హాజరయ్యారు. ఓ వైపు లబ్ధిదారులు.. మరోవైపు సామాజిక వర్గాలు నియోజకవర్గంలో 2.36 లక్షల మంది ఓటర్లు ఉండగా వీరిలో సుమారు లక్షన్నర మంది వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులే ఉన్నట్లు టీఆర్ఎస్ గుర్తించింది. దీంతో లబ్ధిదారులను చేరుకోవడం లక్ష్యంగా మూడు నెలలుగా అనేక సభలు, సమావేశాలు నిర్వహిస్తూ వచ్చింది. సామాజికవర్గాలవారీగా ఓటర్లను గుర్తించి సమ్మేళనాలను నిర్వహించింది. మరోవైపు నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలు, ఐదు మండలాల పరిధిలో రూ.80 కోట్లు ప్రత్యేక నిధులు విడుదల చేసి పెండింగ్ పనులు పూర్తి చేయించేలా మంత్రి హరీశ్‌రావు కీలక పాత్ర పోషించారు. దళితబంధు పథకం లబ్ధిదారులకు అందుబాటులో ఉండేలా పార్టీ తరపున ఏడుగురు ఇన్చార్జీలను నియమించింది. ముగ్గురు మంత్రులు, సుమారు 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మరో 50 మంది టీఆర్ఎస్ ముఖ్యనేతలు నియోజకవర్గంలో మకాం వేసి ప్రచారవ్యూహాన్ని అమలు చేస్తున్నారు. సమన్వయం, ప్రచారంపైనే ఎక్కువ దృష్టి పార్టీ కేడర్ చేజారకుండా చూసుకోవడం, ఇతర పార్టీల నుంచి చేరికలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలుతో హుజూరాబాద్ నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో పట్టు సాధించామనే ధీమా టీఆర్ఎస్లో కనిపిస్తోంది. అయితే, దుబ్బాక చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పోలింగ్ తేదీవరకు అన్ని స్థాయిల్లోనూ అప్రమత్తంగా ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ‘గత మూడు నెలలుగా నియోజకవర్గంలోని ప్రతి ఓటరునూ కనీసం మూడు నుంచి నాలుగుసార్లు కలిశాం. ఇంటింటి ప్రచారం చేసి ఓటర్లను ప్రత్యక్షంగా కలిసేందుకు ఎక్కువ ప్రయత్నించాం. ఓ రకంగా ఉప ఎన్నికల సన్నాహాలకు సంబంధించి పార్టీపరంగా సిలబస్ పూర్తి చేశాం. ఇక తుది పరీక్ష కోసం సన్నద్ధం కావాల్సి ఉంది. ప్రత్యర్థి పార్టీలకు తావు ఇవ్వకుండా ఎప్పటికప్పుడు పార్టీ వ్యూహాన్ని పునశ్చరణ చేసుకునేలా ప్రచార సరళి ఉంటుంది’అని హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ తరపున కీలకంగా పనిచేస్తున్న నేత ఒకరు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. -
టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో కేవలం 10 వేలే, బంగారం, బండి లేనే లేదు
సాక్షి, హుజురాబాద్: ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు సొంత వాహనం లేదంట. ఒక్క గ్రాము బంగారం కూడా తన వద్ద లేదని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నాడు. ఇక తన చేతిలో కేవలం రూ.10 వేలు ఉన్నాయని వెల్లడించాడు. శ్రీనివాస్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రెండు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించాడు. అయితే గెల్లు శ్రీనివాస్ అఫిడవిట్లో సమర్పించిన వివరాలు ఆసక్తికరంగా మారింది. తన వద్ద కేవలం రూ.10 వేలు, తన భార్య వద్ద రూ.5 వేల నగదు మాత్రమే ఉందని శ్రీనివాస్ పేర్కొన్నాడు. బ్యాంకుల్లో రూ.2,82,402 డిపాజిట్లు అతడి వద్ద ఉన్నాయి. అదే విధంగా భార్యకు 25 తులాల బంగారం, బ్యాంకు డిపాజిట్ల కింద రూ.11,94,491 చూపించారు. వీటితోపాటు వీణవంకలో సొంతిల్లు, 10.25 గుంటల స్థలం విలువను రూ.20 లక్షలుగా చూపించారు. అలాగే గెల్లు శ్రీనివాస్‌కు సొంత వాహనం, కనీసం గ్రాము బంగారం కూడా లేకపోవడం గమనార్హం. పేరు : గెల్లు శ్రీనివాస్ యాదవ్ విద్యార్హతలు : ఎంఏ, ఎల్ఎల్బీ భార్య : గెల్లు శ్వేత కేసులు : మూడు -
హుజురాబాద్ ఉప ఎన్నిక: ‘మీ ఉద్యమ బిడ్డను ఆశీర్వదించండి’
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ హుజూరాబాద్: ‘హుజూరాబాద్ బరిలో పోటీ చేస్తున్న మీ ఉద్యమబిడ్డను ఆశీర్వదించండి’అని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రజలను కోరారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, మంత్రి గంగుల కమలాకర్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డిలతో కలసి నామినేషన్ వేసేందుకు హుజూరాబాద్ ఆర్డీఓ కార్యాలయానికి వచ్చారు. తొలిరోజు గెల్లు శ్రీనివాస్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన అనంతరం గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ.. హుజూరాబాద్‌లోని ప్రతీ ఒక్క ఓటరును వ్యక్తిగతంగా కలసి తనకు ఓటేయాల్సిందిగా కోరుతానని.. తాను గెలిచిన తరువాత నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. ఈటల ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతిందో.. అనంతరం రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచి తెలంగాణ కోసం పోరాడిన బడుగు బలహీనవర్గాల బిడ్డ గెల్లు శ్రీనివాస్ సేవలు గుర్తించి సీఎం కేసీఆర్ బీఫామ్ ఇచ్చారన్నారు. అన్నంపెట్టిన పార్టీకి వెన్నుపోటు పొడిచిన ఈటల రాజేందర్, ఆత్మగౌరవం పేరుతో భారతీయ జనతా పార్టీ పంచన చేరారని విమర్శించారు. వ్యవసాయ చట్టాల పేరుతో రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన పార్టీ బీజేపీ అని మండిపడ్డారు. మాట్లాడితే ఆత్మగౌరవం అంటున్న ఈటల రాజేందర్.. ఎక్కడ ఆయన ఆత్మగౌరవానికి భంగం కలిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. 2001 నుంచి తెలంగాణ ఉద్యమాల్లో పాలుపంచుకున్న గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు. కాగా అన్న వైఎస్సార్ పార్టీ నుంచి నిజామాబాద్ జిల్లాకు చెందిన మహ్మద్ మన్సూర్ అలీ అనే వ్యక్తి హుజురాబాద్ నుంచి పోటీకి నిలబడ్డారు. ఆయన ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. -
తొలి రోజు మూడు నామినేషన్ల దాఖలు
సాక్షి , కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నికల సంగ్రామంలో ప్రథమ ఘట్టం నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. తొలి రోజు మూడు నామినేషన్లు దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారి సీహెచ్ రవీందర్‌రెడ్డి తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజునే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్సూరి అలీ నామినేషన్ వేశారు. మరో స్వతంత్ర అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్ నామినేషన్‌ను పలు సాంకేతిక కారణాలతో అధికారులు స్వీకరించలేదు. కాగా.. నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వంద మీటర్ల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తల్లిదండ్రుల దీవెనలు.. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు గురువారం సాయంత్రం సీఎం కేసీఆర్ ఆశీర్వదించి బీఫారం అందించగా, శ్రీనివాస్ శుక్రవారం ఉదయం కొమురెల్లి మల్లిఖార్జునస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి కమలాపూర్ మండలం ఉప్పల్ చేరుకొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి నేరుగా 12.40 నిమిషాలకు మంత్రి గంగుల కమలాకర్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి నామినేషన్ దాఖలు చేయడానికి హుజూరాబాద్‌లోని ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే గెల్లు శ్రీనివాస్ తల్లిదండ్రుల మల్లయ్య, లక్ష్మి దీవెనలు తీసుకోగా, భార్య శ్వేత శుభాకాంక్షలు చెప్పారు. తర్వాత రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డితో కలిసి 12.55 నిమిషాలకు మొదటి సెట్, 01.16 నిమిషాలకు రెండో సెట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేశారు. మొదటి నామినేషన్‌ను మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి ప్రతిపాదించగా, రెండో సెట్‌కు జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ ప్రతిపాదించారు. కోడ్ హుజూరాబాద్‌కే పరిమితం.. హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఆ నియోజకవర్గానికే అమలులో ఉంటుందని కలెక్టర్ తెలిపారు. కరీంనగర్, వరంగల్ (హనుమకొండ) నగరపాలక సంస్థలకు వర్తించదని ప్రకటనలో స్పష్టంచేశారు. నామినేషన్ ప్రక్రియ పరిశీలన నామినేషన్ స్వీకరణ ప్రక్రియను ఎన్నికల అధి కారి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నా మినేషన్ల స్వీకరణ సమయంలో నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. తుపాకులు వెనక్కివ్వాలని.. కోడ్ వెలువడిన నేపథ్యంలో పోలీసు అధికారులు లైసెన్స్డ్ తుపాకులను సరెండర్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి అనేక మంది తమకు ప్రాణహాని ఉందని వెపన్స్‌ను తమతోపాటే ఉంచుకుంటామని పోలీసులకు విజ్ఞప్తులు చేశారు. కానీ.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎవరికీ మినహాయింపులు లేవని కరాఖండిగా చెప్పిన పోలీసులు మొత్తానికి దాదాపు 40 మందికిపైగా వ్యక్తుల నుంచి తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రానికి కలెక్టర్ కార్యాలయం నుంచి ఎన్నికల కోడ్ పరిధిని హుజూరాబాద్‌కే పరిమితం చేస్తూ ప్రకటన రావడంతో మానకొండూరు, కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాల్లోని పలువురు ప్రముఖులు పోలీస్స్టేషన్లకు పరుగులు తీశారు. చెక్ పోస్ట్ తనిఖీ.. హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా వరంగల్, హుజూరాబాద్ మధ్యలో స్టాటిక్ సర్వలెన్స్ టీమ్‌తో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తనిఖీ చేశారు. శుక్రవారం వరంగల్ నుండి హుజూరాబాద్ వచ్చే ప్రధాన రోడ్డులో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్‌ను ఎక్స్పెండేచర్ అబ్జర్వర్ జి.ఎలమురుగుతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ద్వారా వచ్చే ప్రతీ వాహనాన్ని చెక్ పోస్టు వద్ద తనిఖీ చేయాలని స్టాటిక్ సర్వలెన్స్ టీమ్‌ను ఆదేశించారు. ఎన్నికల సందర్భంగా అక్రమంగా డబ్బులు, మద్యం రవాణా చేసే అవకాశం ఉందని, 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. చదవండి: BJP: వ్యూహాలు సిద్ధం.. హుజూరాబాద్‌లో గెలవాల్సిందే.. -
Huzurabad Bypoll: గెల్లుతో బల్మూరి ఢీ!
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక కసరత్తు దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూఐ) రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ నర్సింగరావు పేరు ఖరారయినట్టేనని తెలుస్తోంది. ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ టీపీసీసీ నుంచి ఇప్పటికే అధిష్టానానికి ప్రతిపాదనలు వెళ్లాయని, ఏఐసీసీ ఆమోదంతో నేడో, రేపో అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. వెంకట్‌తో పాటు స్థానిక నేతలు రవీందర్‌రెడ్డి, కృష్ణారెడ్డిల పేర్లు కూడా పంపినప్పటికీ విద్యార్థి సంఘం నాయకుడు, వెలమ సామాజిక వర్గానికి చెందిన వెంకట్ పేరే అధికారికంగా ఖరారవుతుందని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. సీఎల్పీ సై .. పీసీసీ ఓకే టీఆర్ఎస్ తరఫున టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను బరిలో దించిన నేపథ్యంలో కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేరు పరిశీలనకు వచ్చింది. సీఎల్పీ నేత భట్టి ఈ ప్రతిపాదన చేయగా మాజీ మంత్రులు, కరీంనగర్ జిల్లా నేతలు టి.జీవన్‌రెడ్డి, డి.శ్రీధర్ బాబులు సంపూర్ణంగా మద్దతిచ్చారు. ఇందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదని సమాచారం. అనంతరం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, భట్టి, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ మరోసారి సమావేశమై వెంకట్ పేరును ఖరారు చేసి అధిష్టానానికి పంపించినట్లు తెలుస్తోంది. వెంకట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నాయకుడు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన స్వగ్రా మం ఉంది. 2018 ముందస్తు ఎన్నికల్లో అక్కడి నుంచి టికెట్ ఆశించినప్పటికీ రాలేదు. ఆ తర్వాతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ విద్యార్థి సంఘాన్ని వెంకట్ పరుగులు పెట్టించారు. అనేక విద్యార్థి సంబంధిత అంశాలపై ఎన్ఎస్యూఐని క్రియాశీలకంగా నడిపించడంతో పాటు మంత్రి మల్లారెడ్డి అవినీతి విషయంలో ఆందోళనలు చేసి కేసుల పాలయ్యారు. కరోనా తదనంతర విద్యార్థి అంశాల్లో ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి సమ స్యలను తీసుకెళ్తున్నారు. ఈ అంశాలన్నిటినీ పరిగ ణనలోకి తీసుకుని వెంకట్‌ను బరిలో దింపుతు న్నామని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. పార్టీ అభిమతమే ఫైనల్: వెంకట్ హుజూరాబాద్‌లో పోటీ విషయమై పార్టీ తనను అడిగిందని గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ వెంకట్ వెల్లడించారు. పార్టీ అభిమతమే ఫైనల్ అని చెప్పానని తెలిపారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు. టీఆర్ఎస్ నుంచి విద్యార్థి సంఘం నేత బరిలోకి దిగిన నేపథ్యంలో.. టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులకు చేసిన మోసాన్ని ఈ ఎన్నికల వేదికగా ప్రజలకు వివరిస్తామని వెంకట్ వ్యాఖ్యానించారు. -
హుజురాబాద్ ఉప ఎన్నిక: తొలిరోజే టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ దాఖలు
-
హుజురాబాద్ ఉప ఎన్నిక: తొలిరోజే టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ దాఖలు
సాక్షి, హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్లు ప్రారంభమయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తొలిరోజే(శుక్రవారం) నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నేరుగా హుజురాబాద్ చేరుకున్నారు. ఆర్డీఓ కార్యాలయంలో శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆయన వెంట ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు ఈ.పెద్దిరెడ్డి తదితరులు ఉన్నారు. చదవండి: జీ‘హుజుర్’ ఎవరికో.. వారిద్దరి మధ్యే తీవ్ర పోటీ -
గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు బీఫాం అందజేసిన సీఎం కేసీఆర్
-
గెల్లు శ్రీనివాస్‌కు బీఫారం అందజేసిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు పార్టీ బీఫారం అందజేశారు. దానితోపాటు ఎన్నికల ఖర్చుల కోసం పార్టీ ఫండ్‌గా రూ.28 లక్షల చెక్కును ఇచ్చారు. ఉప ఎన్నికకు శుక్రవారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై అక్టోబర్ 8న ముగియనుంది. 7 లేదా 8 తేదీల్లో గెల్లు శ్రీనివాస్ టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసే అవకాశముంది. అయితే గురువారం రాత్రి మంచి ముహూర్తం ఉండటంతో మంత్రి హరీశ్‌రావుతో కలిసి గెల్లు శ్రీనివాస్ ప్రగతిభవన్‌కు వెళ్లారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సీఎం కేసీఆర్ పార్టీ బీఫారం అందజేశారు. అనంతరం ఉప ఎన్నిక ప్రచార షెడ్యూల్, విపక్షాల విమర్శలకు సమాధానం, అన్నివర్గాల ఓటర్లను కలిసేలా ప్రణాళికలపై హరీశ్‌రావు, గెల్లు శ్రీనివాస్‌లకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. కనీసం రెండు బహిరంగ సభల్లో పాల్గొనాలని కేసీఆర్ ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. -
ఈటల మాటలతో ప్రజల మనోభావాలకు దెబ్బ
హుజూరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాటలు హుజూరాబాద్ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మరో మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘రాజేందర్‌కు టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అన్యాయం చేయలేదు. అన్ని విషయాల్లో అండగా నిలబడింది. సీఎం కేసీఆర్, రాజేందర్‌కు అనేక అవకాశాలు ఇచ్చి ఈ స్థాయికి తెచ్చారు’అని అన్నారు. ‘సీఎం శాలపల్లిని ఎన్నుకొని.. ఎన్నికలు లేకుండానే అక్కడ రైతుబంధు పథకం ప్రారంభించారు. ఆ సభలో సీఎం కేసీఆర్, ఈటల రాజేందర్ నాకు తమ్ముడు, నా కుడి భుజం అని గొప్పగా చెప్పారు’అని గుర్తు చేశారు. ‘అలాంటి రాజేందర్.. సీఎంపై ఏం మాట్లాడుతున్నారు. కేసీఆర్ నీకు గోరి కడతా అన్నారు. నిన్ను ఈ స్థాయికి తెచ్చిన వ్యక్తిపై అంతటి మాట మాట్లాడితే ఇంక నీపై విశ్వాసం ఎలా ఉంటుంది’అని ప్రశ్నించారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు సీఎం కేసీఆర్, తాను తోడుగా ఉంటామని.. అభివృద్ధి చేసి చూపుతామని అన్నారు. బండి సంజయ్ ఎంపీగా గెలిచి ఎక్కడైనా కోటి రూపాయల పని చేశారా అని ప్రశ్నించారు. గెల్లును గెలిపించి తనకూ హుజూరాబాద్ అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, నరేందర్, టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్‌రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కె.దామోదర్ పాల్గొన్నారు. -
హుజురాబాద్ ఉప ఎన్నిక: జీ‘హుజుర్’ ఎవరికో..
వెబ్ ప్రత్యేకం: మరో ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలవడంతో తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు మంగళవారం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అయితే ఈ ఎన్నికలో ఎవరు విజయం సాధిస్తారనే చర్చ సర్వత్రా జరుగుతోంది. ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలు రావడంతో మంత్రివర్గం నుంచి ప్రభుత్వం బర్తరఫ్ చేసింది. అయితే తనను పొమ్మనలేక పొగబెట్టారని పేర్కొంటూ ఈటల టీఆర్ఎస్ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో హుజురాబాద్ అసెంబ్లీకి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ప్రస్తుతం షెడ్యూల్ విడుదలవడంతో ఆ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారో.. హజురాబాద్ ఎవరికీ ‘జీ హుజుర్’ అంటుందో చూద్దాం.. చదవండి: కాంగ్రెస్‌కు భారీ షాక్.. బీజేపీలో చేరనున్న మాజీ సీఎం? అయితే ఈ ఎన్నిక పార్టీల పరంగా కాదు ఈటల రాజేందర్ వర్సెస్ టీఆర్ఎస్గా మారింది. అయితే ఇప్పటివరకైతే ఒక్క టీఆర్ఎస్ పార్టీ మినహా ఏ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయలేదు. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గులాబీ పార్టీ బరిలోకి దింపింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. అయితే బీజేపీ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థి విషయంలో ఇంకా ఓ స్పష్టత రాలేదు. బీజేపీ (ఈటల రాజేందర్) ఈ ఉప ఎన్నికల ఈటల రాజేందర్ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. బీజేపీ తనను అభ్యర్థిగా ప్రకటించపోయినప్పటికీ ఈటల బరిలో దిగనున్నారు. రాజీనామా చేసిన నాటి నుంచి ఈటల ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు. కొన్ని రోజులు పాదయాత్ర చేపట్టారు. అస్వస్థతకు గురవడంతో పాదయాత్రకు ముగింపు పలికి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గవ్యాప్తంగా రెండుసార్లు చుట్టేశారు. 2004 కమలాపూర్ నియోజకవర్గం నుంచి, 2009, 10 (ఉప ఎన్నిక), 2014, 2018 ఎన్నికల్లో హుజురాబాద్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో అర్బన్ ‘తెలంగాణలో..’ ఐదు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం.. ప్రజలందరికీ చేరువ కావడం ఈటలకు కలిసొచ్చే అంశం. అన్ని మండలాలు ఆయనకు సుపరిచితమే. ప్రతిఒక్కరినీ పేరుపేరున పలకరించేంత ప్రజల్లో కలిసిపోయారు. పైగా స్థానికుడు. ఈటలపై ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం బహిష్కరించిందనే సానుభూతి ప్రజల్లో ఏర్పడడం, నరేంద్ర మోదీ హవా కూడా కనిపించే అవకాశం ఉంది. బలహీనతల విషయానికి వస్తే హుజురాబాద్ అభివృద్ధిలో వెనకపడి ఉండడం.. అవినీతి ఆరోపణలు రావడం వంటివి ఈటలకు చేటు చేసేలా ఉంది. బీజేపీ నాయకత్వం సహకరించపోవడం కూడా కొంత ప్రభావం చూపనుంది. ఈ ఎన్నిక ఈటలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఎన్నిక ఆయనకు చావో రేవోగా పేర్కొంటున్నారు. టీఆర్ఎస్ (గెల్లు శ్రీనివాస్ యాదవ్) హుజురాబాద్‌లో టీఆర్ఎస్ బలంగా ఉంది. అభ్యర్థిని కొన్ని నెలల ముందటే ప్రకటించారు. స్థానికుడైన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను వ్యూహాత్మకంగా అభ్యర్థిగా ప్రకటించి బీసీ ఓటర్లకు గాలం వేసింది. పైగా కాంగ్రెస్‌లో కీలక నాయకుడిగా ఉన్న పాడి కౌశిక్‌రెడ్డిని పార్టీలోకి చేర్చుకోవడం.. ఈ నియోజకవర్గానికే చెందిన వ్యక్తికి ఎస్పీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కట్టబెట్టింది. వీటికితోడు దేశంలోనే ప్రప్రథమంగా రూ.10 లక్షల నగదు సాయం పథకం ‘దళితబంధు’ ప్రకటించడం టీఆర్ఎస్కు కలిసొచ్చే అంశం. నియోజకవర్గ బాధ్యతలు పార్టీ అప్పగించడంతో మంత్రి హరీశ్ రావు హుజురాబాద్‌లోనే కొన్ని నెలలుగా ఉంటున్నారు. తరచూ పర్యటనలు.. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోనే తిష్ట వేశారు. ఈ గెలుపు టీఆర్ఎస్కు ప్రతిష్టాత్మకంగా మారింది. నాగార్జునసాగర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో ఊపు మీదున్న టీఆర్ఎస్.. హుజురాబాద్‌తో విజయయాత్ర కొనసాగించాలని భావిస్తోంది. అయితే ప్రతికూలతలు ఏమున్నాయంటే.. ఈటలను అకారణంగా మంత్రివర్గం నుంచి తొలగించారని స్థానికుల్లో ఆగ్రహం. ఏడున్నరేళ్ల ప్రభుత్వంపై వ్యతిరేకత చేటు చేసేలా ఉంది. దృష్టి సారించని కాంగ్రెస్ ఈ ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు దృష్టి సారించలేదు. ఈ నియోజకవర్గంపై ఓ కమిటీ ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకుంది. ఇప్పటివరకు పార్టీ అభ్యర్థినే ఖరారు చేయలేదు. ఇక్కడ పార్టీకి నాయకులు కరువయ్యారు. ఉన్నగానొక్క పాడి కౌశిక్‌రెడ్డి పార్టీని వీడడం హస్తం పార్టీకి ఊహించని దెబ్బ తగిలింది. ఇక పార్టీ శ్రేణులంతా కౌశిక్ వెంట తరలివెళ్లారు. పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఈ నియోజకవర్గంలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పార్టీ అభ్యర్థిగా పరిశీలనలో ఉన్న మాజీ మంత్రి కొండా సురేఖ పోటీపై విముఖంగా ఉన్నారు. అయితే భవిష్యత్ దృష్ట్యా పార్టీ ఆదేశాల మేరకు పోటీ చేసేందుకు సంసిద్ధత వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ నామమాత్ర పోటీ కూడా ఇవ్వదని సొంత పార్టీ వర్గాల్లోనే చర్చ నడుస్తోంది. బరిలో మరికొందరు ఇక తెలుగుదేశం పార్టీ గురించి అసలు చర్చించనవసరం లేదు. రాష్ట్రంలో ఉన్న మాదిరే హుజురాబాద్‌లో ఆ పార్టీకి దిక్కూదివానం లేదు. ఇక మరికొన్ని చిన్న పార్టీలు కూడా ఈ ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశం ఉంది. మరికొందరు రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ భారీ సంఖ్యలో స్వతంత్రులుగా నిలిచేందుకు సిద్ధమవుతున్నారట. నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికలో జరిగినట్టు హుజురాబాద్ ఉప ఎన్నికకు భారీగా అభ్యర్థులు పోటీలో ఉంటారని వార్తలు వస్తున్నాయి. అది జరిగితే ఈ ఎన్నిక మరోసారి దేశవ్యాప్త చర్చ జరిగే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న ఉప ఎన్నిక కొద్ది రోజుల్లో రానుంది. -
హుజురాబాద్‌కు మోగిన నగారా.. తక్షణమే అమల్లోకి ఎన్నికల కోడ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధాన పార్టీలన్నీ వ్యూహ-ప్రతివ్యూహాలు, ఆరోపణలు- ప్రత్యారోపణలు, సవాళ్లు - ప్రతిసవాళ్లతో దాడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే హుజురాబాద్ కేంద్రంగా టీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక దృష్టి సారించాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. షెడ్యూల్ కూడా విడుదల కావడంలో పార్టీల ప్రచార కార్యకలాపాలు మరింత ఊపందుకోనున్నాయి. పాదయాత్రలు, జాతీయస్థాయి నేతల బహిరంగ సభలు వంటి వాటితో నియోజకవర్గం బిజీబిజీగా మారిపోయింది. కాగా జూన్ 12వ తేదీన ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజురాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం విదితమే. చదవండి: జోగులాంబ గద్వాల్లో ఎస్సై వీరంగం.. వీడియో వైరల్ ఇక అక్టోబర్ 30వ తేదీన ఉప ఎన్నిక జరగనుండడంతో దీపావళి కంటే ముందే హుజురాబాద్‌లో పండుగ వాతావరణం నెలకొననుంది. ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలవడంతో ఎన్నికల సంఘం తక్షణమే ఎన్నికల కోడ్‌ను అమల్లోకి వచ్చింది. ఉప ఎన్నికపై ఈసీ కరోనా ఆంక్షలు విధించింది. ప్రభుత్వ కార్యక్రమాలకూ బ్రేక్ వేసింది. ర్యాలీలు రోడ్‌షోలపై నిషేధం విధించింది. వెయ్యి మందితోనే సభలకు అనుమతిచ్చింది. హుజురాబాద్ ఉప ఎన్నికపై ఈసీ కాసేపట్లో సమావేశం కానుంది. కాగా హుజురాబాద్‌లో 2 లక్షల 26వేల మంది ఓటర్లు ఉన్నారు. ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో హుజురాబాద్లోపాటు కడపలోని బద్వేల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇక దేశవ్యాప్తంగా 30 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలకు ఈసీ మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. చదవండి: పోలీస్- పొలిటీషియన్ దోస్తీ.. నయా ట్రెండ్! -
ఆరుసార్లు గెలిపిస్తే.. అవమానిస్తావా?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఆరుసార్లు గెలిపించిన హుజూరాబాద్ ప్రజలను ఈటల రాజేందర్ తన మాటలతో అవమానించాడని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం జమ్మికుంటలోని కొత్త వ్యవసాయ మార్కెట్లో నిర్వహించిన రెడ్డి ఆత్మీయ సమ్మేళనం సభలో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్దిరెడ్డి సుదర్శన్‌రెడ్డి, సతీశ్‌బాబు, రాసరి మనోహర్‌రెడ్డి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. హుజూరాబాద్‌లో రూ.కోటి వ్యయంతో చేపట్టిన రెడ్డి కమ్యూనిటీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌కు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం జమ్మికుంటలో ఈ సభ నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన దాదాపు 20 వేల మంది సభకు హాజరయ్యారు. సభలో మంత్రి హరీశ్‌రావు ఈటల రాజేందర్‌పై నిప్పులు చెరిగారు. ఇంతకాలం టీఆర్ఎస్లో ఉండి ఇటీవల పార్టీ మారిన ఈటల రాజేందర్, ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను విమర్శించడం ఏంటని మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ హుజూరాబాద్ ప్రజలను అవమానించడమేనని స్పష్టంచేశారు. బీజేపీ పంచన చేరిన ఈటల, చేతనైతే తెలంగాణకు విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీలను తీసుకురావాలని సవాలు విసిరారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటును సీఎం దృష్టికి తీసుకువెళ్తామని హరీశ్ హామీ ఇచ్చారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించి, కేసీఆర్‌కు అండగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. రెడ్డిలకు డబుల్ బెడ్రూం ఇళ్లు: గెల్లు చిన్నప్పటి నుంచి తమ కుటుంబానికి రెడ్డి సామాజికవర్గంతో అనుబంధం ఉందని హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తమ గ్రామంలో రెడ్డి సామాజికవర్గం నాయకుల సహకారంతోనే తన తల్లి సర్పంచ్‌గా గెలిచిన విషయాన్ని గుర్తుచేశారు. తనను మంత్రి నిరంజన్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజకీయంగా ఎంతో ప్రోత్సహించారని తెలిపారు. తాను గెలిస్తే పేద ఓసీలకు డబుల్ బెడ్రూంలు ఇప్పించేందుకు కృషి చేస్తానని అన్నారు. కేసీఆర్‌ది రైతుసంక్షేమ ప్రభుత్వం: పోచారం సభకు ముఖ్యఅతిథిగా వచ్చిన స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను ఈ సభకు స్పీకర్ హోదాలో రాలేదని అన్నారు. కొంతకాలంగా తమ సామాజికవర్గంలో పేరు చివరన రెడ్డి అని పెట్టుకోకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిత్యం సామాజికసేవలో ముందుండే రెడ్లు తప్పకుండా పేర్లు పెట్టుకోవాల్సిందేనన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు లాంటి ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఈ పథకాలు లేవు: నిరంజన్‌రెడ్డి 45 లక్షల ఎకరాలకు నీరిచ్చే కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం మూడేళ్లలో పూర్తి చేయడం రైతులపై కేసీఆర్‌కు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. రైతుబంధు, రైతుబీమా, ధాన్యం కొనుగోలు, రైతువేదికలు తదితర రైతు సంక్షేమ పథకాలు గుజరాత్లో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. మహిళలకు పెద్దపీట: సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ ఏర్పాటుకు ముందు రైతుల కష్టాలు తాము స్వయంగా చూశామని మంత్రి సబితారెడ్డి గుర్తు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ ఇస్తున్నారని, బాలికల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. రాజకీయాల్లో మహిళలు రాణించాలని 50 శాతం రిజర్వేషన్ తెచ్చారని, నామినేటెడ్ పోస్టుల్లోనూ 50 శాతం రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. -
రజనీకాంత్ స్టైల్లో మంత్రి హరీశ్‌రావు డ్యాన్స్
-
రజనీకాంత్ స్టైల్లో మంత్రి హరీశ్‌రావు డ్యాన్స్
సాక్షి, కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తిరుగుతూ పార్టీ విజయానికి బాటలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం కమలాపూర్‌లో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ స్టైల్లో డ్యాన్స్ చేసి అబ్బురపరిచారు. చదవండి: అమ్మా దొంగా ఇక్కడున్నావా? చిన్నారి బిస్కెట్ దొంగతనం వైరల్ కమలాపూర్ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం సందర్భంగా కళాకారుల ధూమ్‌ధామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ‘తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా’ అనే పాటకు మంత్రి హరీశ్ రావు ఎమ్మెల్యే బాల్క సుమన్, అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి డ్యాన్స్ చేశారు. పార్టీ కండువాలు పట్టుకుని గాల్లో తిప్పుతూ కొంత కాలు కదిపారు. దీంతో ఒక్కసారిగా పార్టీ శ్రేణుల్లో జోష్ వచ్చింది. కొన్ని సెకన్ల పాటు ఉన్నఈ వీడియో ఆకట్టుకుంటోంది. చదవండి: ‘నా కోడిది హత్య.. న్యాయం చేయండి’ మాజీ ఎమ్మెల్యే తనయుడు -
TS: 50 వేల మెజార్టీతో గెల్లు గెలుపు ఖాయం
హుజూరాబాద్/సిద్దిపేటరూరల్: హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ 50 వేల మెజార్టీతో గెలుస్తారని మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని జమ్మికుంట రోడ్లో ఆదివారం మున్నూరుకాపు భవనానికి మంత్రి గంగుల కమలాకర్‌తో కలసి భూమిపూజ చేసిన అనంతరం వారి ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్‌రావు మాట్లాడారు. బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ ప్రజలకు చేసిందేమీ లేకనే హుజూరాబాద్‌లో బొట్టు బిళ్లలు, గోడ గడియారాలు, కుట్టుమెషీన్లు, గ్రైండర్లు పంచుతున్నారని, ప్రజలు వాటిని పట్టించుకోకుండా ఇక్కడ ఎవరు గెలిస్తే అభివృద్ధి జరుగుతుందో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. అనంతరం మున్నూరుకాపు సంఘం నాయకులు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లుకు మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానపత్రాన్ని మంత్రికి అందజేశారు. కేంద్రానికి రైతుల ఉసురు రైతు వ్యతిరేక చట్టాల అమలు, దొడ్డు రకం వడ్లను కొనుగోలు చేయమని చెప్పడం, డీజిల్ ధరల పెంపు, మార్కెట్ల ఎత్తివేత వంటి చర్యల ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటోందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై దేశవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు జరుగుతున్నా కేంద్రం మొండిపట్టుదలకు పోతుందని ఆయన విమర్శించారు. సిద్దిపేట జిల్లా రూరల్ మండలం చింతమడక మధిర గ్రామం అంకంపేటలో నిర్మించిన డబుల్బెడ్రూమ్ ఇళ్లను మంత్రి ప్రారంభించారు. రాబోయే రోజుల్లో సంగారెడ్డి వరకు మల్లన్నసాగర్ జలాలను తరలిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ శ్రీదేవిచందర్‌రావు, సర్పంచ్ హంసకేతన్‌రెడ్డి, సీనియర్ నాయకులు బాలకిషన్‌రావు పాల్గొన్నారు. -
నిఖార్సయిన బీసీ బిడ్డ గెల్లు.. పావలా బీసీ ఈటల
సాక్షి, హుజూరాబాద్: టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ నిఖార్సయిన బీసీ బిడ్డ అని, ఈటల పావలా బీసీ అని బీసీ సంక్షేమ సంఘం, పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ ఎద్దేవా చేశారు. పద్మశాలీల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని, పద్మశాలీ కులబాంధవులు ఏకతాటిపై నిలిచి గెల్లు గెలుపునకు కృషి చేయాలని కోరారు. మంగళవారం హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్హాల్లో పద్మశాలీల ఆత్మీయ సమ్మేళన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్.. పద్మశాలీల సంక్షేమాన్ని విస్మరించారని, ఆత్మగౌరవ భవన నిర్మాణానికి భూమి అడిగితే పట్టించుకోలేదని విమర్శించారు. బీసీల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి పట్టం కట్టాలని కోరారు. పద్మశాలీలు ఆర్థికంగా ఎదిగేందుకు రూ.లక్ష వ్యక్తిగత రుణాల మంజూరు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. అలాగే పద్మశాలీ వ్యాపారస్తులకు టూవీలర్ మోపెడ్ వాహనాలను అందజేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. గెల్లు శ్రీనివాస్‌కు మద్దతు తెలుపుతూ హుజూరాబాద్ గౌడ కులస్తులు ఏకగ్రీవ తీర్మానం చేసి గంగులకు అందజేశారు. చదవండి: కరీంనగర్.. అతలాకుతలం కాంగ్రెస్ పార్టీలో మొదలైన సందడి.. ఆ ఎన్నికల కోసం ఏకంగా.. టీపీసీసీ ఓబీసీ సెల్ కార్యవర్గం రద్దు సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ ఓబీసీ సెల్ కార్యవర్గంతో పాటు జిల్లా చైర్మన్ పదవులను తాత్కాలికంగా రద్దు చేశారు. ఏఐసీసీ ఓబీసీ విభాగం చైర్మన్ తమరద్వజ్ సాహు ఆదేశాల మేరకు కార్యవర్గాన్ని రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ఓబీసీ సెల్ చైర్మన్ శ్రీకాంత్‌గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలోనే కొత్త కార్యవర్గాన్ని నియమిస్తామని, జిల్లాలకు కొత్త చైర్మన్లను ఎంపిక చేస్తామని, ఆసక్తి కలిగిన నేతలు తమ దరఖాస్తులను గాం«దీభవన్‌లో అందజేయాలని శ్రీకాంత్‌గౌడ్ సూచించారు. -
దళిత బంధు రాదంటూ ఈటల తప్పుడు ప్రచారం: మంత్రి హరీశ్ రావు
కరీంనగర్: దళిత బంధు రాదంటూ ఈటల తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈటల రాజేందర్ చెప్పే మోసపూరిత మాటలు నమ్మొద్దని హరీశ్‌రావు సూచించారు. ప్రతి దళిత కుటుంబానికి 9లక్షల 90వేలు వస్తున్నట్లు మేసేజ్‌లు వస్తున్నాయన్నారు. హుజురాబాద్ దళిత బంధు విజయం రాష్ట్రానికి, దేశానికి ఆదర్శం కావాలన్నారు. దళిత బంధుకు పైసలు ఎక్కడివి అని ఈటల అన్నారని, కానీ ఇప్పుడు అందరికీ దళిత బంధు వస్తుందని తెలిపారు. దీనికి ఈటల ఏం చెబుతారని ప్రశ్నించారు. కాగా హుజురాబాద్‌లో పోటాపోటీ ప్రచారాలు మొదలయ్యాయి. టీఆర్ఎస్ పార్టీ జమ్మికుంటలో సభను ఏర్పాటు చేసింది. బీజేపీ గోడ గడియారాలను, గొడుగులను సభలో ఓ యువకుడు ధ్వంసం చేశాడు. గోడ గడియారాలు భరోసానిస్తాయా అంటూ ప్రశ్నించారు. మంత్రులు హరీశ్ రావు, కొప్పుల వేదికపై ఉండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కొరుకంటి చందర్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, కౌశిక్ రెడ్డిలు పాల్గొన్నారు. చదవండి: Huzurabad Bypoll: ఉప ఎన్నికపై ఈసీకి నివేదిక పంపాలి -
దళితబంధు మరో సామాజిక ఉద్యమం
సాక్షి, హైదరాబాద్: దళితబంధు మరో సామాజిక ఉద్యమమని, ఈ కార్యక్రమం అమలు కోసం సీఎం కేసీఆర్ సంకల్పాన్ని బలపరిచి మనమంతా ముందుకు సాగాలని టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, ఎంపీ కె.కేశవరావు (కేకే) పిలుపునిచ్చారు. తెలంగాణలో దళితబంధు అనే కొత్త ఉద్యమం తీసుకొచ్చారని, దీని అమలు కోసం ఎన్నో అవరోధాలు, కష్టాలు వస్తాయని చెప్పారు. కేసీఆర్ ఉక్కు సంకల్పంతో దళితబంధు అమలవుతుందని, ఆయన నాయకత్వంలో చేసినంత అభివృద్ధి ఏ రాష్ట్రంలోనూ జరగలేదన్నారు. ఆదివారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో కేశవరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం 200 ఏళ్లు బ్రిటిష్ వారిపై పోరాడామని అనేక మంది ప్రాణత్యాగం ఫలితంగానే స్వాతంత్య్రం వచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో హుజూరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. -
Huzurabad: గెలుపు ఖాయం.. గెల్లు శ్రీనివాస్‌తో సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావును ప్రగతిభవన్‌లో కలిశారు. తనను హుజూరాబాద్ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ను అభినందించిన కేసీఆర్.. హుజూరాబాద్‌లో పార్టీ గెలుపు ఖాయమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల్లో మంచి ఆదరణ ఉందని చెప్పారు. పార్టీ ఇన్చార్జీల సూచనలకు అనుగుణంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఓటర్ల మద్దతు కోరాల్సిందిగా సూచించారు. ఈ నెల 16న హుజూరాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లపైనా సీఎం పలు సూచనలు చేసినట్లు తెలిసింది. -
హుజూరాబాద్ ఓటర్లకు సీఎం కేసీఆర్ లేఖలు
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నిక అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ఖరారు చేసిన టీఆర్ఎస్... ఓటర్లను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. నియోజకవర్గంలో వివిధ ప్రభుత్వ పథకాల కింద లబ్ధి పొందిన వారిని పార్టీ తరఫున వ్యక్తిగతంగా కలసి గెల్లు శ్రీనివాస్‌కు మద్దతు కోరాలని నిర్ణయించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏడేళ్లలో నియోజకవర్గంలో వివిధ ప్రభుత్వ పథకాల కింద లబ్ధి పొందిన వారి జాబితాను మున్సిపాలిటీలు, వార్డులు, మండలాలు, గ్రామాలవారీగా సిద్ధం చేశారు. ఈ జాబితాల ఆధారంగా లబ్ధిదారులను పార్టీ యంత్రాంగం ద్వారా నేరుగా చేరుకొని పార్టీ అభ్యర్థికి మద్దతు కూడగట్టేలా ప్రణాళిక సిద్ధం చేసింది. నియోజకవర్గంలో 2.26 లక్షల మంది ఓటర్లు ఉండగా వారిలో సుమారు 70 వేల మంది వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందుతున్నట్లు టీఆర్ఎస్ గుర్తించింది. లబ్ధిదారులకు స్వయంగా ప్రభుత్వ పథకాలను వివరించడంతోపాటు నియోజకవర్గంలోనూ విస్తృతంగా పంపిణీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖతో కూడిన రెండు లక్షల కరపత్రాలను గులాబీ రంగులో ముద్రించింది. ‘దళితబంధు’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఈ నెల 16వ తేదీన సీఎం కేసీఆర్ హుజూరాబాద్‌కు వస్తుండటంతో ఆలోగా లేఖల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని ఉప ఎన్నిక ఇన్‌చార్జీలకు ఆదేశాలు అందాయి. ప్రభుత్వ పథకాలపై ప్రత్యేక దృష్టి.: హుజూరాబాద్‌లో మకాం వేసిన మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌తోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలుపై దృష్టి కేంద్రీకరించారు. కొత్తగా సామాజిక పింఛన్ల మంజూరు, రేషన్ కార్డుల జారీ, సీసీ రోడ్లు, మహిళలు, కుల సంఘాలకు భవనాలు, స్త్రీనిధి రుణాల చెక్కుల పంపిణీ వంటి కార్యక్రమాల్లో తలమునకలై పనిచేస్తున్నారు. తాజాగా హుజూరాబాద్‌లో పద్మశాలి స్థలానికి రూ.కోటి నిధులతోపాటు ఎకరా స్థలాన్ని కూడా ప్రభుత్వం కేటాయించింది. -
లెక్కలు వేసి.. ఎంపిక చేసి.. ఎవరీ గెల్లు శ్రీనివాస్?
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికకు టీఆర్ఎస్ అభ్య ర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి చురుగ్గా పనిచేస్తూ, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రస్తుతం టీఆర్ఎస్ విద్యార్థి విభాగం (టీఆర్ఎస్వీ) రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ‘‘గెల్లు శ్రీనివాస్ యాదవ్ పార్టీలో అంకితభావంతో పనిచేస్తూ, ఉస్మానియా యూనివర్సిటీ టీఆర్ఎస్వీ అధ్యక్షుడిగా ఉద్యమ సమయంలో పలుమార్లు జైలుకు వెళ్లారు. క్రమశిక్షణతో కూడిన వ్యక్తిత్వం, సేవాభావం, నిబద్ధతను గుర్తించిన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్.. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం గెల్లు శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు’’ అని టీఆర్ఎస్ బుధవారం ప్రకటన విడుదల చేసింది. తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండల కేంద్రంలో జరిగిన ‘ప్రజా ఆశీర్వాద సభ’ వేదికగా గెల్లు శ్రీనివాస్‌ను టీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి హరీశ్‌రావు పరిచయం చేశారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అభినందించారు. తెలంగాణ ఉద్యమంలో గట్టిగా కొట్లాడిన మరో విద్యార్థి నాయకుడు ప్రజల ఆశీర్వాదంతో అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆచితూచి లెక్కలు వేసి..! ఈటల రాజీనామా నాటి నుంచీ హుజూరాబాద్ ఉప ఎన్నిక లక్ష్యంగా పావులు కదుపుతున్న సీఎం కేసీఆర్.. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను అభ్యర్థిగా ఖరారు చేశారు. వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన సీనియర్ నేత ఈటల రాజేందర్‌కు కొత్తతరం నాయకత్వంతో చెక్ పెట్టాలనే ఆలోచనతో గెల్లు శ్రీనివాస్ పేరు తెరమీదకు వచ్చినట్టు సమాచారం. హుజూరాబాద్ నియోజకవర్గంలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబాలు, నాయకులను కాదని మరీ గెల్లు శ్రీనివాస్‌ను ఎంపిక చేయడం గమనార్హం. నియోజకవర్గంలో వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలను టీఆర్ఎస్ గూటికి చేర్చిన తర్వాతే అభ్యర్థి పేరును ప్రకటించారు. వాస్తవానికి వారం రోజుల కిందటే అభ్యర్థి ఖరారైనా ఆషాఢం సెంటిమెంట్‌తో తాత్కాలికంగా వాయిదా వేసినట్టు తెలిసింది. ‘‘కేసీఆర్ తలచు కుంటే సాధారణ కార్యకర్తలను ఏ స్థాయికైనా తీసుకెళ్లగలరు. కేసీఆర్ ఆశీస్సులతోనే ఈటల ఎదిగారు. ఆర్థిక, అంగబలంతోపాటు కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ అభ్యర్థిగా హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగుతున్న రాజేందర్‌పై సాధారణ కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్‌ను అభ్యర్థిగా ఖరారు చేయడం ద్వారా కేసీఆర్ తెగువను, రాజకీయ చతురతను చూపారు’’ అని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. బీసీ కోణంలో.. ‘ఈటల హుజూరాబాద్‌లో బీసీ.. హైదరాబాద్‌లో ఓసీ’ అనే నినాదంతో టీఆర్ఎస్ ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేస్తోంది. పార్టీ అభ్యర్థిత్వం కోసం కేసీఆర్ వివిధ సామాజికవర్గాలకు చెందిన పలువురి పేర్లను పరిశీలించారు. వివిధ సర్వేలు, నివేదికలను పలు కోణాల్లో మదింపు చేశారు. చివరిగా బీసీ (యాదవ) సామాజికవర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్ వైపు మొగ్గు చూపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓట్లపరంగా యాద వులు మూడోస్థానంలో ఉండటం ఆయనకు కలిసి వచ్చే అవకాశమని పార్టీ శ్రేణులు భావి స్తున్నాయి. గెల్లు శ్రీనివాస్ తండ్రి మల్లయ్య పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. ఎంపీటీసీగా, పార్టీ మండల ఉపాధ్యక్షుడు, జిల్లా గొల్ల కురుమల సహకార సంఘం డైరెక్టర్, పీఏసీఎస్ డైరెక్టర్ వంటి పదవులు నిర్వహించారు. ఇదే సమయంలో గెల్లు శ్రీనివాస్ టీఆర్ఎస్వీలో చురుగ్గా పనిచేశారు. ఉద్యమ సమయంలో 127 కేసులు ఎదుర్కొన్నారు. కుటుంబ నేపథ్యం, ఉద్యమంలో పాల్గొనడం, విద్యాధికుడు కావడం, పార్టీ పట్ల విధేయుడిగా ఉండటం, హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందినవాడు కావడం వంటివి గెల్లు శ్రీనివాస్ ఎంపికలో కీలకపాత్ర పోషించినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అన్ని రకాలుగా సంసిద్ధమై.. మంత్రివర్గం నుంచి ఈటల బర్తరఫ్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా, బీజేపీలో చేరిక తదితర పరిణా మాల నేపథ్యంలో ఈ ఏడాది మే తొలివారం నుంచే హుజూరాబాద్‌పై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు. టీఆర్ఎస్ యంత్రాంగం చేజారకుండా కట్టడి చేయడంతోపాటు విపక్షాల నేతలను చేర్చుకునే బాధ్యతను మంత్రి హరీశ్‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌లకు అప్పగించారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన పాడి కౌశిక్‌రెడ్డిని టీఆర్ఎస్లో చేర్చుకుని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. నియోజక వర్గానికి చెందిన బండా శ్రీనివాస్‌ను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. నియోజకవర్గంలో పలుకుబడి ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి, కశ్యప్‌రెడ్డి తదితరులను టీఆర్ఎస్ చేర్చుకున్నారు. పనిమనిషిలా సేవ చేస్తా: గెల్లు శ్రీనివాస్ ఇల్లందకుంట (హుజూరాబాద్): తాను నిరుపేదనని, రెండు గుంటల భూమి మినహా ఇంకేం లేదని.. తనను గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు పనిమనిషిలా సేవ చేస్తానని హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి« గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం ఇల్లందకుంటలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 20 ఏళ్లుగా పార్టీ విద్యార్థి విభాగంలో పనిచేశానని చెప్పారు. 2001 నుంచీ విద్యార్థుల సమస్యలపై పోరాటా ల్లో, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నా నని తెలిపారు. ఉద్యమంలో పాల్గొన్నందుకు పోలీసులు తనపై 120 కేసులు పెట్టారని, 28 రోజులు జైల్లో ఉన్నానని గుర్తు చేసుకున్నారు. ఉద్యమంలో మొదటి నుంచీ క్రియాశీలకంగా పనిచేసిన నిరుపేద బిడ్డకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం కేసీఆర్ అవకాశం కల్పించడం ఆయన గొప్పతనానికి నిదర్శమన్నారు. డబ్బులు, ఆస్తి లేకున్నా తనకు టికెట్ ఇచ్చారని.. పార్టీలో పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో హుజూరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. పేరు : గెల్లు శ్రీనివాస్ యాదవ్ తండ్రి : గెల్లు మల్లయ్య (మాజీ ఎంపీటీసీ, కొండపాక) తల్లి : లక్ష్మి (మాజీ సర్పంచ్, హిమ్మత్‌నగర్) పుట్టినతేదీ : 21–08–1983 విద్యార్హతలు : ఎంఏ, ఎల్ఎల్బీ, పరిశోధక విద్యార్థి (రాజనీతి శాస్త్రం) సామాజికవర్గం : బీసీ (యాదవ) ప్రస్తుత హోదా : టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు -
అభ్యర్థిగా గెల్లు.. రంగంలో దిగిన హరీష్‌రావు
సాక్షి, కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ దూకుడు పెంచింది. ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను సీఎం కేసీఆర్ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఇక గెలుపు బాధ్యతలు తీసుకున్న మంత్రులు హరీష్‌రావు, గంగుల కమలాకర్ బుధవారం హుజురాబాద్‌లో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. గెల్లుతో కలిసి నియోజకవర్గంలో పర్యటించారు. కాగా ఈనెల 16న హుజురాబాద్ మండలం శాలపల్లిలో గులాబీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సభ నేపథ్యంలో.. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్ ఈ సందర్భంగా పరిశీలించారు. ఇక ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీఆర్ఎస్ను వీడిన ఈటల.. మంత్రి పదవితో పాటు హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. బీజేపీలో చేరిన ఈటల.. నియోజకవర్గంలో పర్యటిస్తూ టీఆర్ఎస్ తీరును ఎండగడుతున్నారు. అయితే, ఇంతవరకు బీజేపీ తరఫున ఈటల అభ్యర్థిత్వం అధికారికంగా ఖరారు కాకపోగా.. గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను టీఆర్ఎస్ తమ అభ్యర్థిగా ప్రకటించడం గమనార్హం. చదవండి: అందుకు భార్య సమ్మతి అవసరం లేదు: హైకోర్టు -
అవేవి నమ్మొద్దు.. రాష్ట్రమంతా దళిత బంధు: తలసాని
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం రెండూ సమాంతరంగా జరుగుతోందని మత్య్స, పశుసంవర్థశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సామాజిక న్యాయం చేయాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని పేర్కొన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. మహిళలకు కూడా సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. అభివృద్ధికే పట్టం కట్టాలని హుజురాబాద్ ప్రజలను కోరుతున్నామని మంత్రి తలసాని అన్నారు. రైతుబంధు, దళితబంధు పథకాలపై విపక్షాలది అనవసర ఆరోపణలని కొట్టిపారేశారు. విపక్షాల మాటలు నమ్మవద్దని, త్వరలో తెలంగాణ వ్యాప్తంగా దళిత బంధు అమలు చేస్తామని పేర్కొన్నారు. బాధ్యత లేకుండా విపక్షాలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాయని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఏడేళ్ల కాలంలో 74 ఏళ్ల చరిత్ర తిరగ రాశారన్నారు. ఇరిగేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని గుర్తుచేశారు. చదవండి: హుజురాబాద్ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్ -
హుజురాబాద్ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్/కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న హుజురాబాద్ ఉప ఎన్నికకు అధికార టీఆర్ఎస్ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను పోటీలో దింపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గులాబీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం అధికారికంగా ప్రకటన చేశారు. కాగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ను వీడిన ఈటల బీజేపీలో చేరడం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉంటారని భావించిన పాడి కౌశిక్‌రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకోవడం వంటి పరిణామాలు ఆసక్తిని పెంచాయి. ఇక ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అధికార టీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా విజయం సాధించాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తోన్న కేసీఆర్ సర్కారు.. తమ పార్టీ అభ్యర్థి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేసి చివరకు గెల్లు శ్రీనివాస్ వైపు మొగ్గు చూపింది. చదవండి: దళితబంధులో మొత్తం 30 పథకాలు.. జాబితా ఇదే