Huzurabad TRS Candidate Gellu Srinivas Yadav Meets CM KCR In Pragathi Bhavan - Sakshi
Sakshi News home page

Huzurabad: గెలుపు ఖాయం.. గెల్లు శ్రీనివాస్‌తో సీఎం కేసీఆర్‌

Published Sat, Aug 14 2021 12:33 PM | Last Updated on Sat, Aug 14 2021 4:08 PM

TRS Candidate Of Huzurabad Gellu Srinivas Meets CM KCR In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ శుక్రవారం పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావును ప్రగతిభవన్‌లో కలిశారు. తనను హుజూరాబాద్‌ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ను అభినందించిన కేసీఆర్‌.. హుజూరాబాద్‌లో పార్టీ గెలుపు ఖాయమన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల్లో మంచి ఆదరణ ఉందని చెప్పారు. పార్టీ ఇన్‌చార్జీల సూచనలకు అనుగుణంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఓటర్ల మద్దతు కోరాల్సిందిగా సూచించారు. ఈ నెల 16న హుజూరాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లపైనా సీఎం పలు సూచనలు చేసినట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement