
రాచపల్లిలో మాట్లాడుతున్న హరీశ్. చిత్రంలో గెల్లు
సాక్షి, ఇల్లందకుంట (కరీంనగర్): రైతులను ఉగ్రవాదులతో పోల్చిన బీజేపీకి ఓటు వేస్తారా.. ధరలు పెంచిన పువ్వు గుర్తుకు ఓటు వేస్తారా లేక ప్రజలను ఆదుకుంటున్న టీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేస్తారా అన్నది ప్రజలు ఆలోచించాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కోరారు. సోమవారం ఇల్లంద కుంట మండలంలోని టేకుర్తి, రాచపల్లి గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. బీజేపీ తెచ్చిన నల్ల చట్టాలు, వ్యవసాయ చట్టాలు రైతులకు ఉరి తాళ్లుగా మారుతున్నాయని, ఈటల రాజేందర్ కారణంగానే మధ్యంతర ఎన్నికలు వచ్చాయని అన్నారు.
అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న పార్టీ టీఆర్‌ఎస్ అని, నిత్యం డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న పార్టీ బీజేపీ అని దుయ్యబట్టారు. ఈటల రాజేందర్ తన ఆస్తులను రక్షించుకునేందుకే ఉప ఎన్నికకు తెరలేపారని మండిపడ్డారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment