
కమలాపూర్ సభలో డ్యాన్స్ చేస్తున్న మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే సుమన్, అభ్యర్థి గెల్లు
సాక్షి, కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తిరుగుతూ పార్టీ విజయానికి బాటలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం కమలాపూర్‌లో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ స్టైల్‌లో డ్యాన్స్ చేసి అబ్బురపరిచారు.
చదవండి: అమ్మా దొంగా ఇక్కడున్నావా? చిన్నారి బిస్కెట్ దొంగతనం వైరల్
కమలాపూర్ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం సందర్భంగా కళాకారుల ధూమ్‌ధామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ‘తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా’ అనే పాటకు మంత్రి హరీశ్ రావు ఎమ్మెల్యే బాల్క సుమన్, అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, టీఆర్‌ఎస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి డ్యాన్స్ చేశారు. పార్టీ కండువాలు పట్టుకుని గాల్లో తిప్పుతూ కొంత కాలు కదిపారు. దీంతో ఒక్కసారిగా పార్టీ శ్రేణుల్లో జోష్ వచ్చింది. కొన్ని సెకన్ల పాటు ఉన్నఈ వీడియో ఆకట్టుకుంటోంది.
చదవండి: ‘నా కోడిది హత్య.. న్యాయం చేయండి’ మాజీ ఎమ్మెల్యే తనయుడు
Comments
Please login to add a commentAdd a comment