Minister T Harish Rao
-
రజనీకాంత్ స్టైల్లో మంత్రి హరీశ్‌రావు డ్యాన్స్
-
రజనీకాంత్ స్టైల్లో మంత్రి హరీశ్‌రావు డ్యాన్స్
సాక్షి, కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తిరుగుతూ పార్టీ విజయానికి బాటలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం కమలాపూర్‌లో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ స్టైల్లో డ్యాన్స్ చేసి అబ్బురపరిచారు. చదవండి: అమ్మా దొంగా ఇక్కడున్నావా? చిన్నారి బిస్కెట్ దొంగతనం వైరల్ కమలాపూర్ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం సందర్భంగా కళాకారుల ధూమ్‌ధామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ‘తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా’ అనే పాటకు మంత్రి హరీశ్ రావు ఎమ్మెల్యే బాల్క సుమన్, అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి డ్యాన్స్ చేశారు. పార్టీ కండువాలు పట్టుకుని గాల్లో తిప్పుతూ కొంత కాలు కదిపారు. దీంతో ఒక్కసారిగా పార్టీ శ్రేణుల్లో జోష్ వచ్చింది. కొన్ని సెకన్ల పాటు ఉన్నఈ వీడియో ఆకట్టుకుంటోంది. చదవండి: ‘నా కోడిది హత్య.. న్యాయం చేయండి’ మాజీ ఎమ్మెల్యే తనయుడు -
మంత్రుల ముందు ‘ఈటల’ గడియారాలు ధ్వంసం
సాక్షి, హుజురాబాద్: జహీరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట సభలో మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్ ఎదుట కొందరు యువకులు గడియారాలు ధ్వంసం చేశారు. ఈటల రాజేందర్ ఇచ్చినవాటిగా పేర్కొంటున్న గడియారాలను ఆదివారం పగులగొట్టారు. జమ్మికుంటలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో టీఆర్ఎస్ యువ నాయకులు వేదికపైకి వచ్చారు. ఈటల రాజేందర్ ప్రజలకు పంపిణీ చేస్తున్నారని గడియారాలు, గొడుగులు తీసుకువచ్చారు. గడియారాన్ని నేలకేసి కొట్టాడు. గొడుగులను చింపేశాడు. ఇవి ఆర్ధిక భరోసానిస్తాయా? అని ప్రశ్నించారు. దళిత వాడల్లో గడియారాలు, గొడుగులు పంచాలని ఈటల చెప్పాడని అయితే తాము నిరాకరించినట్లు యువకులు ఆరోపించారు. అతడి చర్యను చూస్తూ మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల, టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి పగలబడి నవ్వుకున్నారు. సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కొరుకంటి చందర్, అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. చదవండి: సారీ చెప్పు లేదంటే! జావేద్ అక్తర్‌కు బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరిక చదవండి: రెచ్చిపోయిన ఉగ్రవాదులు: పోలీస్ శిబిరంపై బాంబు దాడి -
కాషాయ జెండా పట్టుకొని ఎర్ర జెండా డైలాగులా ఈటలా?: మంత్రి హరీశ్‌రావు
జమ్మికుంట (హుజూరాబాద్): కాషాయ జెండా చేతిలో పట్టుకొని ఎర్ర జెండా డైలాగులు కొడుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ప్రజలు నమ్మరని మంత్రి హరీశ్‌రావు అన్నారు. జమ్మికుంట పట్టణంలోని వ్యవసాయ పత్తి మార్కెట్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఐటీయూసీ కార్మిక సంఘాలు, టీడీపీ నాయకులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి జరగాలన్నా టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. చదవండి: కాటేసిన అప్పులు.. ఇద్దరు రైతులు బలవన్మరణం ప్రజల బాధను తన బాధగా భావించే వ్యక్తి సీఎం కేసీఆర్ అని, అందుకే వారి బాధలు దూరం చేసే అనేక పథకాలను తీసుకువచ్చారని, కానీ ఈటల రాజేందర్ మాత్రం తన బాధను ప్రజల బాధగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి హరీశ్ ఆరోపించారు. ఈటల మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గ పరిధిలో ఒక్కరికైనా డబుల్ బెడ్రూం ఇచ్చారా అని ప్రశ్నించారు. జమ్మికుంట, హుజూరాబాద్, ఇల్లందకుంట, వీణవంక, కమలాపూర్ మండలాల్లో కార్మికులు, ఇల్లు లేని పేదకుటుంబాలకు డబుల్బెడ్రూం మంజూరు చేస్తామని, సొంత స్థలాలు ఉండి ఇల్లు కట్టుకునేలా సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపు బాటలో ఉన్నారని, బీజేపీని చిత్తుగా ఓడించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కార్మిక, రైతు వ్యతిరేకత, వ్యవసాయ మార్కెట్ యార్డు బంద్ అనే పాలన చేస్తున్న బీజేపీకి కార్మికులు, రైతులు గుణపాఠం చెప్పాలని సూచించారు. సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, పాడి కౌశిక్‌రెడ్డి, పురపాలక సంఘం చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. చదవండి: హుజురాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్‌కు దరఖాస్తులు ఆహ్వానం -
తెలంగాణలో మరో భారీ పెట్టుబడి
సాక్షి, హైదరాబాద్: డేటా సెంటర్ల ఏర్పాటు, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశ కార్పొరేట్ కంపెనీలు ఆసక్తితో ఉన్నట్లు సింగపూర్ హైకమిషనర్ హెచ్.ఈ. సైమన్ వాంగ్ అన్నారు. వాంగ్ తన ప్రతినిధుల బృందంతో ఆర్థిక మంత్రి హరీశ్‌రావును సోమవారం అరణ్యభవన్‌లో కలిశారు. మర్యాదపూర్వకంగా జరిగిన ఈ భేటీలో వాంగ్ హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్ర స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. డేటా సెంటర్ల ఏర్పాటు, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశ కార్పొరేట్ కంపెనీలు ఆసక్తితో ఉన్నట్లు వాంగ్ చెప్పారు. పెట్టుబడులకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని మంత్రి వెల్లడించారు. డేటాసెంటర్లకు అనువైనదని, ఇప్పటికే అమెజాన్ వంటి సంస్థలు ఇక్కడ కార్యాలయాలను ఏర్పాటు చేశాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సకల సౌకర్యాలతో ఫార్మా సిటినీ ఏర్పాటు చేస్తోందన్నారు. తెలంగాణ వ్యాక్సిన్ హబ్‌గా మారిందన్నారు. సోలార్ వంటి రంగాల్లో పెట్టుబడులకు కూడా తెలంగాణ అనువైందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరా.. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు విశేషాల గురించి సింగపూర్ ప్రతినిధులు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అని హరీశ్ తెలిపారు. సముద్రమట్టం నుంచి వంద నుంచి 630 మీటర్ల ఎత్తులో తెలంగాణ ప్రాంతం ఉందని, గోదావరి నీటిని 630 ఎత్తు వరకు ఈ ప్రాజెక్టు ద్వారా లిఫ్ట్ చేస్తున్నట్లు వివరించారు. ఏడున్నరేళ్ల కాలంలో వ్యవసాయం రంగంలోనూ సమూల మార్పులను సీఎం కేసీఆర్ తీసుకువచ్చారన్నారు. ఫలితంగా రాష్ట్రం వరి ధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. విద్యుత్ రంగంలోనూ స్వావలంభన సాధించామన్నారు. వచ్చే పర్యటనలో తెలంగాణలోని పల్లెలను సందర్శించి ప్రజల జీవన విధానం పరిశీలించాలన్నారు. సిద్దిపేట జిల్లాను సందర్శించాలని కోరారు. ఈ భేటీలో సింగపూర్ హైకమిషన్ సెక్రటరీలు సెన్ లిమ్, అమండా క్వెక్, సింగపూర్ కన్సోల్ జనరల్ (చైన్నై) పాంగ్ కాక్ టైన్, వైస్ కన్సోల్ జనరల్ అబ్రహం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ను శాలువాతో సత్కరించారు. చదవండి: సర్కారీ స్కూళ్లు.. సరికొత్తగా! -
మంత్రి హరీశ్‌రావు భావోద్వేగం: ఈ జన్మకిది చాలు..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయం తగ్గినా ప్రభుత్వం రైతు సంక్షేమ పథకాలను ఎలాంటి ఆటంకం లేకుండా అమలు చేస్తోందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రైతుబంధు వానాకాలం సీజన్‌కు సంబంధించి రూ.7,500 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు రూ.6,012 కోట్లను 57.67 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. సంగారెడ్డి జిల్లాలో 1.65 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో నిర్మించతలపెట్టిన బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మనూరు మండలం బోరంచ గ్రామం వద్ద ఏర్పాటుచేసిన సభలో మాట్లాడారు. బసవేశ్వర ఎత్తిపోతల పథకం నిర్మాణం పనులు త్వరగా పూర్తయ్యేలా బోరంచ నల్లపోచమ్మ దీవించాలని అంటూ, నిర్మాణం పూర్తయితే అమ్మవారికి ముక్కుపుడక చేయిస్తానని మొక్కుకున్నారు. ఈ జన్మకిది చాలు.. బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనుల ప్రారంభ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావుకు ఓ మహిళ తారసపడింది. ఆమెను గుర్తుపట్టిన మంత్రి.. ‘చిమ్నీబాయి కైసే హో’ అని ఆప్యాయంగా పలకరించారు. ఆమె కూడా ‘కాలుబాబా తల్లి ఆశీర్వాదంతో మీరు చల్లగా ఉండాలి’ అని బదులిచ్చారు. కాగా, కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి మధ్యలో ఆమె ప్రస్తావన తెచ్చారు. ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగిందని తెలియగానే కంగ్టి మండలానికి చెందిన చిమ్నీబాయి ఫోన్‌చేసి తన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారని అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ జన్మకు ఇది చాలనుకున్నానని వ్యాఖ్యానించారు. -
భారీగా నిధులు: ప్రజావైద్యానికి తెలంగాణ పెద్దపీట
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2,500 మంది స్పెషలిస్టు వైద్యులు ఉన్నా ప్రజలకు వైద్య సేవలు అందకపోవడానికి గల కారణం ఏమిటి? కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉచితంగా వైద్యం అందించే ప్రభుత్వ ఆసుపత్రులను కాదని రూ. లక్షల్లో అప్పులు చేసి మరీ ప్రైవేటు ఆసుపత్రులవైపు ఎందుకు పరుగులు తీస్తున్నారు? లోపం ఎక్కడుంది? ఈ సమస్య మూలాలను కనుగొని తగిన ‘మందు’ వేసేందుకు ప్రభుత్వం సంసిద్ధమైంది. సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్యశాఖలో విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. అన్ని రకాల మౌలిక సదుపాయాలు, మానవవనరులను సమకూర్చి ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దేందుకు వచ్చే రెండేళ్లలో రూ.10 వేల కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమయ్యే నిధులను సాధారణ బడ్జెట్‌తో సంబంధం లేకుండా అదనంగా కేటాయించనుంది. ‘రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితి రాకూడదు. ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా తీర్చిదిద్దడమే లక్ష్యం. అందుకే రూ.10 వేల కోట్లు కేటాయించాలని సర్కారు నిర్ణయించింది’ అని ఒక ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ నిధులను ఎక్కడెక్కడ ఖర్చు చేయాలన్న దానిపై ప్రాధాన్యాలను గుర్తించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో వైద్య, ఆరోగ్యశాఖకు రూ.6,295 కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్‌ను సాధారణ అవసరాలకు, ఆరోగ్య కార్యక్రమాలకు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. వైద్య, ఆరోగ్యశాఖపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఈ అంశంపై మేధోమథనం ప్రారంభించింది. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఆదేశాల మేరకు అధికారులు ఇందుకు సంబంధించి కసరత్తు ప్రారంభించారు. ప్రైవేటు ప్రాక్టీసు వీడితేనే... ప్రభుత్వ డాకర్లు ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తుండటం వల్ల రోగులకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందడం లేదని కొందరు వైద్యాధికారులు చెబుతున్నారు. తమిళనాడు తరహా ప్రభుత్వ వైద్య విధానాన్ని తీసుకురావడమే ఇందుకు పరిష్కారమని సూచిస్తున్నారు. తమిళనాడులో ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీస్ చేసేందుకు అనుమతి లేదు. ఎవరైనా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సిందే. అర్హతలేని ప్రాక్టీషనర్లు లేకపోవడంతో ప్రాథమిక వైద్యాన్ని అక్కడ బలోపేతం చేశారు. ప్రభుత్వ వైద్యులు తప్పనిసరిగా నిర్ణీత వేళల్లో విధులు నిర్వహించాల్సిందే. ప్రజారోగ్య రంగాన్ని మరింత అభివృద్ధి చేశారు. ఈ నేపథ్యంలో కరోనా తగ్గుముఖం పట్టాక రాష్ట్ర అధికారులు తమిళనాడు, కేరళలలో పర్యటించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిమ్స్ తరహా విధానం మేలు.. నిమ్స్‌లో పనిచేసే డాక్టర్లు బయట ప్రైవేటు ప్రాక్టీస్ చేయడానికి వీలులేదు. అయితే సాయంత్రం వేళల్లో ఆసుపత్రిలోనే ప్రాక్టీస్ చేస్తే కొద్ది మొత్తంలో రోగుల నుంచి కన్సల్టేషన్ ఫీజు తీసుకోవచ్చు. రెండు దశాబ్దాల క్రితం గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో ఇటువంటి పద్ధతి ఉండేదని ఒక సీనియర్ వైద్యాధికారి వెల్లడించారు. ఇటువంటి పద్ధతిని ప్రవేశపెట్టడం ద్వారా డాక్టర్లు ప్రైవేటు ప్రాక్టీస్ వైపు వెళ్లకుండా చేయడానికి వీలు కలుగుతుందని అంటున్నారు. -
సమస్యల పరిష్కారానికి ‘సాక్షి’ ఓ ముందడుగు
సాక్షి, నెట్వర్క్: స్థానిక సమస్యల పరిష్కారానికి సాక్షి మీడియా గ్రూప్ మరో అడుగు ముందుకేసింది. అన్ని వనరులున్నా కాసింత చొరవ, ముందుచూపు లేకపోవటంతో కొనసాగుతున్న సమస్య లకు చెక్ చెప్పే ప్రయత్నంలో భాగంగా పౌర సమాజాన్ని, ప్రజాప్రతినిధులు, అధికారులను ఒకే వేదిక మీదకు తీసు కువచ్చింది. శుక్రవారం జూమ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా చర్చా వేదికలు నిర్వహించింది. ఆయా పట్టణాలు ఎదుర్కొంటున్న వరద ముంపు, చెత్త వంటి సమస్యల పరిష్కారం దిశగా చొరవ తీసుకుంది. పట్టణాల సమగ్ర అభివృద్ధితో పాటు కొత్త ఉపాధి అవకా శాలపై చర్చలు నిర్వహించింది. నిరుద్యోగుల ఉపాధికి ఇండస్ట్రియల్ పార్కులు: హరీశ్‌రావు సిద్దిపేటలో నిర్వహించిన డిబేట్లో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. ‘వలసలు. కరువుల నుంచి బయటపడి సీఎం కేసీఆర్ ఆశీస్సులతో సస్యశ్యామల జిల్లాగా సిద్దిపేటను మార్చుకున్నాం. సమగ్రాభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్న జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి పై దృష్టి పెట్టాం. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన నీరు, విద్యుత్, రవాణా లాంటి వసతులను ఒక్కొక్కటిగా కల్పిస్తున్నాం. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, చేర్యాల ప్రాంతాల్లో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. అందుకు వెయ్యి ఎకరాల భూసేకరణ కూడా చేశాం. పరిశ్రమలకు ప్రత్యేక లేఔట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. వర్గల్లో 1,200 ఎకరాల్లో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేస్తున్నాం..’ అని హరీశ్‌రావు తెలిపారు. వరంగల్‌లో ‘ముంపు’పై ముందుచూపు గతేడాది ఇదే సీజన్లో భారీగా వచ్చిన వర్షాల కారణంగా వరంగల్ నగరంలో 33 డివిజన్లు ముంపునకు గురయ్యాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌లో ఇలాంటి విపత్తులు సంభవించకుండా ఉండేందుకు వీలుగా ‘వరంగల్ ముంపు’పై శుక్రవారం చర్చ జరిగింది. న్యాయవాది పొట్లపల్లి వీరభద్రరావు, సామాజిక కార్యకర్తలు తిరునగర్ శేషు, పుల్లూరు సుధాకర్, రెడ్‌క్రాస్ చైర్మన్ విజయచందర్ రెడ్డి, టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, గ్రేటర్ వరంగల్ సీఎంహెచ్వో రాజిరెడ్డి, గ్రేటర్ వరంగల్ డీఎఫ్ఓ కిశోర్ పాల్గొన్నారు. ప్రధానంగా వరంగల్ మహానగరంలో నాలాలు, గొలుసుకట్టు చెరువులు ఆక్రమణకు గురై అక్రమ నిర్మాణాలు వెలియడం వల్ల చాలా కాలనీలు ముంపునకు గురవుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. నగరంలో ఉన్న సుమారు 32 చెరువులు కుదించుకుపోగా, 12 వరకు నామరూపాలు లేకుండా పోయాయని వీరభద్రరావు, పుల్లూరు సుధాకర్ తదితరులు పేర్కొన్నారు. వరదలు వచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు స్పందించకుండా, ఆక్రమణలపై కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు శాశ్యత ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ముంపునకు గురికాకుండా ఏమేమి చర్యలు చేపట్టాలో వెల్లడించారు. కాగా ముంపు ప్రాంతాల్లో గతేడాది ఎలాంటి చర్యల ద్వారా ప్రజలను ఆదుకున్నారు? ఎలాంటి ముందస్తు ప్రణాళికలు చేపడుతున్నారు? తదితర అంశాలను సీఎంహెచ్ఓ రాజిరెడ్డి, డీఎఫ్ఓ కిశోర్ వివరించారు. మౌలిక వసతులపైనా.. నిజామాబాద్ నగరంలో మౌలికవసతులు, నల్లగొండలో భూగర్భ డ్రైనేజీ, భువనగిరిలో ప్రధాన రహదారి , సంగారెడ్డిలో చెత్త డంపింగ్ యార్డు అంశాలపై, మహబూబ్‌నగర్ పట్టణంలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణ కోసం ఉద్దేశించిన భారత్ మాల రహదారి నిర్మాణ అవాంతరాలపై చర్చ జరిగింది. -
భూముల మార్కెట్ ధరలు పెంచుదాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల మార్కెట్ ధరలు పెంచాలని, తొలుత హెచ్ఎండీఏ పరిధిలో పెంపును వర్తింపజేయాలని, ఆర్థిక వన రుల సమీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసం ఘం ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. ప్రస్తు తం అమల్లో ఉన్న మార్కెట్ ధరలను ఉమ్మడి రాష్ట్ర పాలనలో చాలా కాలం కిందట ఖరారు చేశారని, ప్రస్తుత వాస్తవ మార్కెట్ ధరలు ఎన్నో రెట్లు అధికంగా ఉన్నాయని అభిప్రాయపడుతోంది. కరోనా నియంత్రణకు లాక్డౌన్ విధించడం తో రాష్ట్ర ఆదాయానికి భారీ గండి పడిన నేపథ్యంలో.. ఈ ఏడాది భూముల అమ్మకాల ద్వారా అదనంగా రూ.15 వేల కోట్లను సమీకరించాలనే నిర్ణయానికి ఉప సంఘం వచ్చినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే భూముల ధరలు పెంచాలనే ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం.. గురువారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమై ఈ అంశంపై విస్తృతంగా చర్చించింది. మంత్రులు కేటీఆర్, వి.శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రస్తుతం అధిక ధరలకే రిజిస్ట్రేషన్లు కరోనా సమయంలో భూముల మార్కెట్ ధరలను పెంచితే.. భూకొనుగోళ్లపై ప్రభావం పడి ప్రభుత్వానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రూపంలో వచ్చే ఆదాయం తగ్గే అవకాశంపై కూడా ఉపసంఘం చర్చించింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి హెచ్ఎండీఏ పరిధిలో భూముల మార్కెట్ ధరలు పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుతం అమల్లో ఉన్న మార్కెట్ విలువ కన్నా అధిక ధరతోనే హెచ్ఎండీఏ పరిధిలో భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్న అంశాన్ని అధికారులు ఉపసంఘం దృష్టికి తీసుకువచ్చారు. బ్యాంకుల నుంచి అధిక మొత్తంలో రుణాలు పొందడానికి ప్రస్తుతం అమల్లో ఉన్న భూముల మార్కెట్ విలువలు అడ్డంకిగా మారినట్టుగా వ్యాపార, వాణిజ్యవర్గాల్లో అభిప్రాయం ఉందని కూడా వివరించారు. హెచ్ఎండీఏ పరిధిలో భూముల మార్కెట్ విలువలు పెంచితే రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా పెరుగుతుందని నివేదించారు. వాస్తవానికి హెచ్ఎండీఏ పరిధిలోని ప్రభుత్వ భూములు, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ పరిధిలోని భూముల విక్రయాలకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయ్యింది. నగరం చుట్టుపక్కల ఉన్న 64 ఎకరాల భూములను విక్రయించేందుకు ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్‌కు వచ్చే స్పందన ఆధారంగా తదుపరి భూముల అమ్మకాలకు సంబంధంచిన ధరల పెంపుపై ఒక నిర్ణయానికి రావాలని, ఆ తరువాత ముఖ్యమంత్రికి దీనిపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. మద్యం ధరల పెంపుతో ఎక్సైజ్ ఆదాయం పెంచుకునేందుకు ఉన్న అవకాశాన్ని కూడా ఉపసంఘం పరిశీలించింది. అయితే ఈ మధ్యకాలంలోనే రెండుసార్లు మద్యం ధరలు పెంచినందున ఇప్పుడే మళ్లీ పెంచడం సరికాదని అభిప్రాయపడింది. ఈ సమావేశంలో ఆర్అండ్బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ, ఆర్థిక, పురపాలక, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శులు కె.రామకృష్ణారావు, అరవింద్ కుమార్, జయేష్ రంజన్, రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ కమిషనర్ వి.శేషాద్రి కూడా పాల్గొన్నారు. భారం పెరిగింది.. రెవెన్యూ పెరగాలి రాష్ట్రంలో భారీ ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధి కార్యకమాలు అమలు చేస్తున్నందున వీటి కొనసాగింపు కోసం నిధుల సమీకరణ భారీగా పెరగాల్సిన అవసరం ఉందని ఉపసంఘం అభిప్రాయపడింది. సంక్షేమ పథకాలకు నిధులు ఏటేటా భారీగా పెరుగుతున్నాయని, ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆపే పరిస్థితి లేనందున ఆర్థిక వనరుల సమీకరణకు కొత్త మార్గాల అన్వేషణ ఒక్కటే మార్గమని భావించింది. ఉద్యోగులకు వేతనాలు పెంచడంతో రాష్ట్ర ఖజానాపై ఏటా రూ.11 వేల కోట్ల అదనపు భారం పడటం, కొత్తగా 50 వేల ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై ఉపసంఘం చర్చించినట్లు సమాచారం. -
ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగినా.. మేం.. హరీశ్‌రావు
పాపన్నపేట (మెదక్ జిల్లా): కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ వాళ్లు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రంలో ఎక్కడైనా నీటి తీరువా రద్దు చేశారా అని ప్రశ్నించారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారా..ఎకరానికి రూ.10 వేలు ఏ రాష్ట్రమైనా ఇస్తోందా? అని నిలదీశారు. పేదింటి అమ్మాయి పెళ్లికి రూ.లక్ష, రైతు బీమాకు రూ.5 లక్షలు ఎక్కడైనా ఇస్తున్నారా అని అడిగారు. మన పథకాలే కేంద్రం కాపీ కొడుతోందని పునరుద్ఘాటించారు. మన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం గాజులగూడెం, ఛత్రియాల్లో 48 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను బుధవారం ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. కరోనా వల్ల సొంత జాగాలో ఇళ్లు కట్టుకోలేకపోయామని తెలిపారు. ఆదాయం తగ్గింది.. ఖర్చు పెరిగిందని తెలిపారు. అయినా కూడా కల్యాణలక్ష్మి, రైతుబంధు, పింఛన్లు ఆపలేదని మంత్రి హరీశ్ గుర్తుచేశారు. రైతులంతా ఆలోచన చేయాలని సూచించారు. రుణమాఫీ, సొంత జాగాలో ఇల్లు మాత్రమే ఆగాయని చెప్పారు. ఉగాది తర్వాత ఈ కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం హామీ నెరవేరుస్తాం అని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నీటి తీరువాను రద్దు చేసి ఎకరానికి రూ.పది వేలు ఇస్తోందని తెలిపారు. 2014 తర్వాత నీరు వదలమని హైదరాబాద్‌కు ఒక్క రైతన్నా వెళ్తున్నాడా అని ప్రశ్నించారు. అప్పుడు ఊరికి 2 జీప్లలో రైతులంతా హైదరాబాద్ వెళ్లి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి అని గుర్తుచేశారు. ప్రస్తుతం ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంచుతున్నామని.. నీటికి ఇబ్బంది లేదని తెలిపారు. కాళేశ్వరం నీటిని పాపన్నపేటకు తెస్తున్నట్లు చెప్పారు. సింగూరుకు కాళేశ్వరం నీరు నింపుతాం.. రెండు పంటలు పండించుకుంటామని పేర్కొన్నారు. మూడో పంట వేయాలన్న ఆలోచన వచ్చే రీతిలో పరిస్థితులు మారనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
యువతకి సందేశం
‘‘రామసక్కనోళ్లు’ సినిమా ట్రైలర్ చూస్తుంటే కనీస బాధ్యతలను విస్మరిస్తున్న నేటి యువతకు ఒక మంచి సందేశాన్ని అందిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి’’ అన్నారు మంత్రి హరీష్ రావు. చమ్మక్ చంద్ర, సలీం షేక్ హీరోలుగా, మేఘనా చౌదరి, షాయాజీ షిండే, బ్రహ్మానందం, నాగినీడు, చలపతి ప్రధాన పాత్రల్లో ఫహీం సర్కార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రామసక్కనోళ్లు’. సునయన పరాంకుశం సమర్పణలో సతీష్ కుమార్ సాత్పడి నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ని మంత్రి హరీష్ రావు విడుదల చేశారు. సతీష్ కుమార్ సాత్పడి మాట్లాడుతూ–‘‘ఓ గ్రామంలో కొందరు పెద్ద మనుషులుగా చలామణీ అవుతూ చేసే అరాచకాలను నలుగురు కుర్రాళ్లు ఎలా ఎదుర్కొన్నారు? అన్నదే ఈ చిత్రకథ. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం’’ అన్నారు. ‘‘ఆదిలాబాద్, నిర్మల్, హైదరాబాద్, విశాఖపట్నం, ఊటీలో సినిమా చిత్రీకరించాం’’ అన్నారు ఫమీం సర్కార్. ఈ చిత్రానికి సంగీతం: ఘంటాడి కృష్ణ, కెమెరా: జగ¯Œ -
మంత్రి హరీష్‌రావుకు పొన్నం సవాల్
కరీంనగర్ : ప్రాజెక్టుల నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతుందని ప్రజలను రెచ్చగోట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు చేసిందేమిటో తెల్చుకునేందుకు బహిరంగ చర్చకు రావాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సవాల్ విసిరారు. కరీంనగర్లో శనివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో 2013 భూసేకరణ చట్టాన్ని అమోదించడం జరిగిందని అప్పుడు ఇప్పటి టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం లోక్‌సభ సభ్యుడేనని గుర్తు చేశారు. 2013 భూసేకరణ చట్టం రైతులను ముంచే విధంగా ఉందని పదేపదే వల్లేవేస్తున్న మంత్రి హరీష్‌రావు కేసీఆర్ ఆ చట్టానికి ఆమోదం ఎలా తెలిపి ఓటు వేశాడో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలను మభ్యపెడుతూ ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరిట కాలయాపన చేస్తూ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేయడం హరీష్‌రావుకు తగదని సూచించారు. తాజాగా 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా ఉభయసభల్లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చి రాష్ట్రపతి ఆమోదం జరిపి రైతులను, భూనిర్వాసితుల నోట్లో మట్టికోట్టే చర్యలకు టీఆర్ఎస్, బీజేపీలు ప్రయత్నించడం సిగ్గుచేటని విమర్శించారు. 2013 భూసేకరణ చట్టం లో ఉన్న వాటి కంటే భూనిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇస్తే స్వాగతిస్తామని ఏ ఒక్క నిబంధన రైతులకు హనీ కలిగే విధంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. -
‘పాలమూరు’ ప్రాజెక్టులకు జూలై డెడ్‌లైన్
సాక్షి, హైదరాబాద్: పూర్వ మహబూబ్ నగర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు మంత్రి హరీశ్‌రావు గురువారం డెడ్ లైన్ విధించారు. జూన్ చివరి నాటికి యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులను పూర్తి చేసి జూలైలో 8.5 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని అధికార యంత్రాంగాన్ని మంత్రి ఆదేశిం చారు. జిల్లాలో పనులు కొనసాగుతున్న నాలుగు సాగునీటి పథకాలపై మంత్రులు హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావులు గురు వారం ఇక్కడి జలసౌధలో సమీక్ష జరిపారు. కల్వకుర్తి నుంచి 4 లక్షలు, భీమా నుంచి 2లక్షలు, నెట్టెంపాడు నుంచి 2 లక్షలు, కోయిల్ సాగర్ నుంచి 50 వేల ఎకరాలకు ఖరీఫ్‌లో సాగునీరందించాల్సిందేనని చెప్పా రు. ఈ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. నేటి నుంచి 15 రోజులకోసారి పనుల పురోగతిని సమీక్షిం చాలని, నిర్ణీత సమయంలో పనులు చేయని పక్షంలో ’60 సి’ నిబంధన కింద సంబంధిత ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. కల్వకుర్తి, నెట్టంపాడు, బీమా, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాల కోసం ప్రాధాన్యత ప్రకారం, ప్రభుత్వం పెట్టిన గడువు ప్రకారం పనులు పూర్తి చేయాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారని, జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి గుర్తుచేశారు. ప్రాజెక్టుల డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, ఫీల్డు చానల్స్ లను తనిఖీలు చేయాలని ఆయా కాలువల్లో ఉన్న గడ్డి, రాళ్ళు, రప్పలు, ఇతర అడ్డంకులు తొలగించాలని కోరారు. భూ సేకరణ పనుల పురోగతిని ప్రతి వారం సమీ క్షించాలని ఇంజనీర్లు, ఎమ్మెల్యేలను మంత్రి కోరారు. ఈ పథకాల కోసం ఇంకా భూ సేకరణ జరగాల్సి ఉందని, అది పూర్తయితే 8 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ సాగునీటిరంగ సలహాదారు విద్యాసాగరరావు, స్పెషల్ సీఎస్ జోషి, ఈఎన్సీ మురళీధర్ రావు, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రాజేందర్ రెడ్డి, సీహెచ్ రాంమోహనరెడ్డి, ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి, మర్రి జనార్దనరెడ్డి, సీఈలు ఖగేందర్ రావు, ఓఎస్డీ దేశ్ పాండే, వివిధ ఏజెన్సీల ప్రతినిధులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.