
కరీంనగర్,సాక్షి: కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దళితబంధు కోసం ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ధర్నా చేపట్టారు. కౌశిక్‌రెడ్డి, నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కౌశిక్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
రెండోవిడత దళితబంధు ఇవ్వాలంటూ దరఖాస్తుదారులతో కలిసి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ధర్నాకు దిగారు. దరఖాస్తుదారులతో కలిసి ధర్నా కోసం అంబేద్కర్ చౌక్ కు వెళ్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, దరఖాస్తుదారులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ధర్నాకు దిగిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో హుజూరాబాద్ అంబేద్కర్ చౌక్ వద్ద ధర్నా ఉద్రిక్తంగా మారింది.