సాక్షి, కరీంనగర్: కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ అతిపెద్ద స్కాం చేశాడని బీఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. మంత్రి అండగదండలతో రామగుండంలో ఫ్లై యాష్ బూడిదను ఉచితంగా తరలిస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీపీసీలో నుంచి వస్తున్న యాష్‌ను లోడ్ రికార్డు లేకుండానే బయటకు పంపిస్తున్నారని అన్నారు. అయితే లారీ లోడు ఖాళీగా చూపిస్తూ వే బ్రిడ్జి ఇస్తున్నారని విమర్శించారు. .
కలెక్షన్ బాయ్‌గా పొన్నం ప్రభాకర్ అన్న కొడుకు అనూప్ ఈ వ్యవహారాలు చూస్తున్నాడని కౌశిక్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. స్థానికంగా దీనిపై వార్తలు రాస్తున్న రిపోర్టర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ క్రమంలో రెండు లారీలను సీజ్ చేసి, మిగితా 13 లారీలను వదిలిపెట్టారని తెలిపారు.
ఇంత పెద్ద స్కాంపై బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ పొన్నం ప్రభాకర్‌ను ప్రశ్నించారు. తమ ఆరోపణలపై దమ్ముంటే మంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు. `నా దిష్టి బొమ్మ తగలబెట్టడం కాదు. ఈ స్కాం పై మీరు మాట్లాడాలి. ఆధారాలతో సహా మేము బయట పెడుతున్నాం. రేపటి నుంచి లా అండ్ ఆర్డర్ అదుపు తప్పితే మేము బాధ్యులం కాదు. పేద పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.` అంటూ మండిపడ్డారు.
కాగా రెండు రోజుల క్రితం ఓవర్ లోడ్‌తో రామగుండం నుంచి ఖమ్మం వెళ్తున్న బూడిద లారీలను హుజురాబాద్ వద్ద ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. వే బిల్లు లేకుండా ప్లై యాష్ బూడిద తరలించడాన్ని గుర్తించి సంబంధించిన అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు సకాలంలో స్పందించకపోవడంతో ఆందోళనకు దిగి అధికారుల తీరు, మంత్రి పొన్నం వైఖరిపై మండిపడ్డారు.
రవాణా శాఖ మంత్రి అండదండలతోనే అక్రమ దందా సాగుతుందని ఆరోపించారు. అధికారులకు పిర్యాదు చేసిన మంత్రి ప్రోద్బలంతో పట్టించుకోవడం లేదని విమర్శించారు. అక్రమ దందాకు చేస్తున్న మంత్రి పొన్నం ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment