
సాక్షి, హుజురాబాద్: ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు సొంత వాహనం లేదంట. ఒక్క గ్రాము బంగారం కూడా తన వద్ద లేదని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నాడు. ఇక తన చేతిలో కేవలం రూ.10 వేలు ఉన్నాయని వెల్లడించాడు. శ్రీనివాస్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రెండు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించాడు. అయితే గెల్లు శ్రీనివాస్ అఫిడవిట్‌లో సమర్పించిన వివరాలు ఆసక్తికరంగా మారింది. తన వద్ద కేవలం రూ.10 వేలు, తన భార్య వద్ద రూ.5 వేల నగదు మాత్రమే ఉందని శ్రీనివాస్ పేర్కొన్నాడు.
బ్యాంకుల్లో రూ.2,82,402 డిపాజిట్లు అతడి వద్ద ఉన్నాయి. అదే విధంగా భార్యకు 25 తులాల బంగారం, బ్యాంకు డిపాజిట్ల కింద రూ.11,94,491 చూపించారు. వీటితోపాటు వీణవంకలో సొంతిల్లు, 10.25 గుంటల స్థలం విలువను రూ.20 లక్షలుగా చూపించారు. అలాగే గెల్లు శ్రీనివాస్‌కు సొంత వాహనం, కనీసం గ్రాము బంగారం కూడా లేకపోవడం గమనార్హం.
పేరు : గెల్లు శ్రీనివాస్ యాదవ్
విద్యార్హతలు : ఎంఏ, ఎల్‌ఎల్‌బీ
భార్య : గెల్లు శ్వేత
కేసులు : మూడు