affidavit
-
తప్పుడు అఫిడవిట్ దాఖలు చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: ‘తప్పుడు అఫిడవిట్ దాఖలు చేస్తారా? అన్నీ నిజాలే చెప్తాను.. అని ప్రమాణం చేసి అబద్ధాలు ఎలా ఆడతారు ? క్రిమినల్ కేసు పెట్టి చర్యలు తీసుకోవాలా..’అని సుందిళ్ల బరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ) గంగం వేణుబాబుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలపై విచారణలో భాగంగా మంగళవారం 16 మంది నీటిపారుదల శాఖ ఇంజనీర్లకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. అఫిడవిట్లో పేర్కొన్న విషయాలన్నీ వాస్తవాలేనా? సుందిళ్ల బరాజ్ బ్లాక్–2ఏ డిజైన్, డ్రాయింగ్స్ ఉన్నాయా? ..అని విచారణ ప్రారంభంలో ఈఈ గంగం వేణుబాబును కమిషన్ ప్రశ్నించింది. బరాజ్‌లో నిర్మించిన ఇతర బ్లాకుల డిజైన్లు, డ్రాయింగ్స్ ఆధారంగా బ్లాక్–2ఏను నిర్మించాలని నాటి రామగుండం సీఈ నల్లా వెంకటేశ్వర్లు ఆదేశించారని వేణుబాబు బదులిచ్చారు. సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్(సీడీఓ) సీఈ ఆమోదించిన డిజైన్లతోనే బ్లాక్–2ఏ కట్టామని అఫిడవిట్లో మీరు పొందుపరిచిన అంశం అబద్ధమా? ఆమోదిత డ్రాయింగ్స్ లేకుండానే బ్లాక్–2ఏ నిర్మించారా? అఫిడవిట్లో అబద్ధాలు ఎలా చెప్తారు? అని ఈ సందర్భంగా ఆయనపై కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘పొరపాటైంది.. అఫిడవిట్లో పొందుపరిచిన అంశం వాస్తవం కాదు’అని వేణుబాబు వివరణ ఇవ్వడానికి ప్రయత్నించగా కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. మీరు ఒక ఇంజనీర్ ? బాధ్యత లేదా? ఏ బ్లాకును కట్టాకా దాని డిజైన్ల ఆధారంగా ఏయే బ్లాకులు కట్టారు? బ్లాక్ –1, 2 కట్టిన తర్వాత బ్లాక్–2ఏ కట్టారా? అని కమిషన్ నిలదీయగా, సమాధానం ఇవ్వలేక వేణుబాబు ఇబ్బందిపడ్డారు. తప్పుడు అఫిడవిట్ ఇవ్వడం నేరం.. క్రిమినల్ కేసు పెట్టాలా? అని కమిషన్ మందలించింది. బ్లాక్–2, 3ల నిర్మాణాన్ని ఎప్పుడు ప్రారంభించారని తదుపరిగా కమిషన్ ప్రశ్నించగా, వేణుబాబు సమాధానం ఇవ్వలేక నీళ్లు నమిలారు. తేదీలు తెలియకపోతే కనీసం ఏ సంవత్సరమో తెలపాలని కమిషన్ కోరగా, 2016 నిర్మాణం ప్రారంభమైందని బదులిచ్చారు. బ్లాక్–2, 3, 2ఏల నిర్మాణం 2017లో ప్రారంభించినట్టు రికార్డుల్లో ఉందని మళ్లీ కమిషన్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈఎన్సీ ఆదేశాలతోనే బ్లాక్–2ఏ నిర్మాణం సుందిళ్ల బరాజ్ బ్లాక్–2ఏకి సంబంధించిన డిజైన్లు, డ్రాయింగ్స్ లేవని రిటైర్డ్ డీఈఈ బండారి భద్రయ్య వెల్లడించారు. బ్లాక్–2, బ్లాక్–3 మధ్య దూరం పెరగడంతో అదనంగా బ్లాక్–2ఏ నిర్మించాల్సి వచి్చందని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. డ్రాయింగ్స్ లేకుండానే ఇతర బ్లాకులను ఎలా కట్టారో బాక్–2ఏను సైతం అదే తరహాలో కట్టాలని రామగుండం మాజీ సీఈ నల్లా వెంకటేశ్వర్లు ఆదేశించారని తెలియజేశారు. డ్రాయింగ్స్ లేకుండా ఎలా కట్టారు? అని కమిషన్ నిలదీయగా, ఆయన పైవిధంగా బదులిచ్చారు. సుందిళ్ల బరాజ్ పూర్తయినట్టు తాను ధ్రువీకరణ పత్రం జారీ చేశానని మరో డీఈఈ సునీత కమిషన్‌కు వివరణ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తనకు సంబంధం లేదని చొప్పదండి ఈఈ శ్రీధర్ బదులిచ్చారు. సుందిళ్ల పునరుద్ధరణ పూర్తి అఫిడవిట్లో పేర్కొన్న విషయాలన్నీ వాస్తవాలేనా? నిజం తప్ప మరేమీ చెప్పను.. అని చేసిన ప్రమాణానికి అర్థం తెలుసా? అని రామగుండం ఎస్ఈ సత్యరాజుచంద్రను కమిషన్ ప్రశ్నించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర సిఫారసుల ఆధారంగా సుందిళ్ల బరాజ్‌కు అత్యవసర మరమ్మతులను నిర్మాణ సంస్థ నవయుగ సొంత ఖర్చులతో చేపట్టిందని, బ్లాక్–8కి ఎదురుగా ఉన్న కాంక్రీట్ బ్లాకుల పునరుద్ధరణ తప్ప మిగిలిన పనులన్నీ పూర్తయ్యాయని ఏఈఈ చెన్న అశోక్‌కుమార్ తెలిపారు. ఏ రోజు పనిని అదేరోజు పరిశీలించి ప్లేస్మెంట్ రిజిస్టర్లో నమోదు చేసి సంతకాలు చేశారా? అని ఏఈఈ హరితను కమిషన్ అడగ్గా, అవును అని ఆమె బదులిచ్చారు. క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరైన మిగిలిన ఇంజనీర్లు బరాజ్‌ల నిర్మాణంతో తమకు సంబంధం లేదని బదులిచ్చారు. -
కేటీఆర్ గురించి పోలీసులకు నేనేమీ చెప్పలేదు: పట్నం నరేందర్‌రెడ్డి
-
మహారాష్ట్ర ఎన్నికలు: పూజా ఖేద్కర్ తండ్రి అఫిడవిట్లో.. మరో సందేహం?
ముంబై: త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అహ్మద్ నగర్ సౌత్ నుంచి మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తండ్రి దిలీప్ ఖేద్కర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.దీనిలో దిలీప్ ఖేద్కర్ తాను విడాకులు తీసుకున్నట్లు వెల్లడించారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆయన దాఖలు చేసిన అఫిడవిట్లో ఇచ్చిన సమాచారానికి భిన్నమైన వివరాలు దీనిలో ఉన్నాయి. కొద్ది నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దిలీప్ ఖేద్కర్ తాను మనోరమ ఖేద్కర్‌ను వివాహం చేసుకున్నట్లు వెల్లడించారు.2024 లోక్‌సభ ఎన్నికల్లో దిలీప్ ఖేద్కర్ అహ్మద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. నాడు లోక్‌సభ ఎన్నికల్లో దాఖలు చేసిన అఫిడవిట్లో దిలీప్ ఖేద్కర్.. మనోరమ ఖేద్కర్‌ను తన భార్యగా పేర్కొన్నారు. నాటి అఫిడవిట్లో దిలీప్ ఖేద్కర్ తమ ఉమ్మడి ఆస్తుల వివరాలను తెలిపారు. తన కుటుంబాన్ని అవిభక్త హిందూ కుటుంబంగా పేర్కొన్నారు.దిలీప్, మనోరమ ఖేద్కర్ 2009లో పూణే ఫ్యామిలీ కోర్టులో పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారని ఒక మీడియా సంస్థ తెలిపింది. వారిద్దరూ 2010, జూన్ 25న విడిపోయారు. విడాకులు తీసుకున్నప్పటికీ, ఈ జంట పూణేలోని బానర్ ప్రాంతంలోని మనోరమా ఖేద్కర్ బంగ్లాలో సహజీవనం కొనసాగించారు.కాగా రిజర్వేషన్ ప్రయోజనాలను పొందేందుకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (2022) కోసం ఆమె చేసిన దరఖాస్తులో తప్పుడు సమాచారాన్ని అందించినందుకు పూజా ఖేద్కర్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సస్పెండ్ చేసింది. అయితే ఆమె ఈ ఆరోపణలను ఖండించారు. ఢిల్లీలోని వివిధ అకాడమీలలో తన మాక్ ఇంటర్వ్యూలలో పూజా ఖేద్కర్ తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నందున తన కుటుంబ ఆదాయం సున్నా అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె తన తల్లితోపాటు ఉంటోంది. అయితే, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా దిలీప్ ఖేద్కర్ దాఖలు చేసిన అఫిడవిట్లో ఆయన తన ఆస్తుల విలువను రూ.40 కోట్లగా చూపారు. ఇది కూడా చదవండి: లింగ సమానత్వంలో భారత్ ముందడుగు -
మరీ ఇంత బరితెగింపా?
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉండేవారు వివాదాస్పదులవుతారో, లేక అలాంటివారినే ఆ పదవికిఎంపిక చేస్తారో గానీ మరోసారి అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్‌కుమార్ సక్సేనా వార్తల్లోకెక్కారు. ఈసారి ముఖ్యమంత్రితో వచ్చిన జగడం వల్లకాక సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ వల్ల ఆయన పేరు మార్మోగింది. ఢిల్లీ మహానగరంలో రోడ్ల వెడల్పు కోసం 1,100 వృక్షాలు నేల కూల్చడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌కు జవాబిస్తూ సక్సేనా వింత వాదన చేశారు. కేంద్ర సాయుధ పోలీసు దళాల కోసం కేంద్రం నిర్మిస్తున్న ఆసుపత్రి భవనాల సముదాయానికి వున్న అప్రోచ్ రోడ్డును వెడల్పు చేయటం కోసం రిట్జ్ ప్రాంతంలో చెట్లను కూల్చారు. రూ. 2,200 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ప్రగతి ఎలావుందో పరిశీలించటానికి గత ఫిబ్రవరిలో వెళ్లిన ప్పుడు అక్కడున్న అధికారులెవరూ చెట్ల కూల్చివేతలకు అనుమతి అవసరమని తనతో చెప్ప లేదన్నది ఆయన వాదన. 1994లో తీసుకొచ్చిన ఢిల్లీ వృక్ష సంరక్షణ చట్టం (డీపీటీఏ) కింద అటవీ విభాగం కేంద్ర పర్యావరణ, అడవుల మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకుందనీ, ఢిల్లీ సీఎం, తానూ కూడా అందుకు అంగీకరించామనీ సక్సేనా వివరించారు. ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకోనట్టయితే కోర్టు ధిక్కారమవుతుందని తనకు తెలియదని ఆయన చెబుతున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్నవారికి అన్నీ తెలియాలని లేదు. నిజమే. కానీ తెలుసుకోవటం, తెలియజెప్పటం రివాజుగా సాగిపోవాలి. ఢిల్లీ సీఎం ఏదైనా నిర్ణయం తీసుకోగానే ఫలానా నిబంధన ప్రకారం ఇది చెల్లదని బుట్టదాఖలు చేయటం అలవాటైనవారికీ, అన్ని చట్టాలూ శోధించి ఆధిక్యతను చాటుకునేవారికీ నిబంధనలు తెలియలేదంటే ఎవరైనా నవ్విపోరా? చెట్లు కూల్చడం ఫిబ్రవరి 16న మొదలైతే, జూన్ 10న ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) వైస్ చైర్మన్ చెప్పేవరకూ తెలియదనటం ఆశ్చర్యకరం. గురువారం సుప్రీంకోర్టు ఈ విషయాన్ని సూటిగా ప్రశ్నించింది. ఏప్రిల్ 10నే లెఫ్టినెంట్ గవర్నర్‌కు చెప్పినట్టు రికార్డులు చూస్తే వెల్లడవుతోందని ధర్మాసనం తెలిపింది. పోనీ తెలియదనే అనుకుందాం... చట్ట నిబంధన తెలియక పొరపాటు చేశానని పౌరుడె వరైనా అంటే చెల్లుతుందా? అధికారులు నిబంధనలను సరిగా అర్థం చేసుకోకపోవటంవల్ల పొర పాటు జరిగిందని, ఇది ప్రజా ప్రయోజనం కోసం చిత్తశుద్ధితో చేసిన పని అని లెఫ్టినెంట్ గవర్నర్ అఫిడవిట్ చెప్పటమూ సరికాదు. సక్సేనా కార్పొరేట్ రంగంలో, వివిధ సామాజిక రంగాల్లో విశేషానుభవం కలవారని అంటారు. ఒక కార్పొరేట్ రంగానికి చెందిన వ్యక్తిని లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించటం ఇదే ప్రథమం. అలాంటి వ్యక్తి సైతం నిబంధన ఉల్లంఘిస్తే ఎలా?అసలు ఆ రోడ్ల వెడల్పు ప్రాజెక్టు వెనక మరింత వివాదం ఉన్నదని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఆగస్టు 2022లో డీడీఏ ఆమోదించిన ప్లాన్‌కూ, అనంతర కాలంలో సవరించిన ప్లాన్‌కూ మధ్య ఎన్నో వ్యత్యాసాలున్నాయని ఆ కథనాలు వివరిస్తున్నాయి. ఆ ప్రాంతంలో ఉండే ఫార్మ్ హౌస్‌లకూ, శ్రీ జ్ఞానానంద ఆశ్రమం, ఇతర ప్రైవేటు ఆస్తులకూ నష్టం కలుగుతున్నదన్న కారణంతోనే ముందనుకున్న ప్లాన్ కాస్తా సవరించారన్నది అభియోగం. పర్యవసానంగా అక్కడి అటవీ భూముల్లోని చెట్లు కూల్చేయాల్సి వచ్చిందని ఆ కథనాలు చెబుతున్నాయి. ముందు రూపొందిన మ్యాప్ ప్రకారం రోడ్లు వెడల్పు చేస్తే 50 చెట్లకు మించి నష్టం ఉండేది కాదని లెక్కేస్తున్నారు. పైగా మార్చిన ప్లాన్ వల్ల సాధారణ పౌరుల నివాస గృహాలకు నష్టం జరిగిందని మీడియా కథనాలు వివరిస్తున్నాయి. అంటే నోరూ వాయీ లేని వారికి ఎంత నష్టం కలిగినా ఫర్వాలేదు... సంపన్నులకు మాత్రం తేడా రావొద్దన్నది అధికారుల ఉద్దేశం. ఈ విషయంలో గోశాల రోడ్‌కు చెందిన పౌరుడు నీరజ్ కుమార్... ప్రధాని మొదలుకొని లెఫ్టినెంట్ గవర్నర్ వరకూ ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోయింది. దాంతో సుప్రీంకోర్టు ముందు దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్లో తాను కూడా కక్షిదారుగా ఉండదల్చుకున్నట్టు దరఖాస్తు చేసుకున్నాడు. లెఫ్టినెంట్ గవర్నర్ ఆ ప్రాంతాన్ని సందర్శించటానికి సంబంధించిన రికార్డు ఉందో లేదో తెలియదని, అందుకు వ్యవధి కావాలని కూడా డీడీఏ సుప్రీంకోర్టుకు తెలిపింది. కానీ ఇంత చిన్న సమాచారం కోసం ఎన్నాళ్లు వెదుకుతారని ధర్మాసనం గట్టిగా ప్రశ్నించటంతో, అక్షింతలేయటంతో లెఫ్టినెంట్ జనరల్ జవాబివ్వటం తప్పని సరైంది. కింది స్థాయిలో జరిగిన లాలూచీలు సక్సేనాకు తెలియలేదనుకున్నా ఫిర్యాదు వచ్చినప్పుడైనా ఆరా తీయలేదంటే ఏమనుకోవాలి? దేశంలో అభివృద్ధి పేరుతో జరిగేదంతా ఇలాగే ఉంటున్నది.సంపన్నుల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే అధికారులు పేదలకు నిలువ నీడ లేకుండా పోతున్న దన్న స్పృహ లేకుండా వ్యవహరిస్తుంటారు. ప్రశ్నించినవారిపై కేసులు బనాయించటం, జైళ్లలో పెట్టడం సర్వసాధారణమైంది. ఇప్పుడు డీడీఏ నిర్వాకం కారణంగా భారీయెత్తున చెట్లు కూలి పోవటం మాత్రమే కాదు... 43 ఏళ్లుగా ఆ ప్రాంతంలో చిన్నా చితకా ఇళ్లలో నివసిస్తున్నవారిని నిర్దాక్షి ణ్యంగా ఖాళీ చేయించారు. దేశంలోని కీలక వ్యవస్థలన్నీ కొలువుదీరిన చోటే ఇంతగా నియమోల్లంఘనలు చోటుచేసుకుంటే ఏ ఛత్తీస్‌గఢ్ అడవుల్లోనో, ఇతర మారుమూల ప్రాంతాల్లోనో సక్రమంగా జరుగుతున్నాయని ఎలా అనుకోగలం? ఇలాంటి దురన్యాయాలుంటే తిరుగుబాట్లు రావా? సమస్య మూలాలు వదిలి పరిష్కారాలు వెదికే తెలివితక్కువతనం మరిన్ని సమస్యలకు దారితీయటం లేదా? ప్రభుత్వాలు ఆలోచించాలి. తామే చట్టాలు ఉల్లంఘిస్తే, మానవీయతను మరిస్తే సామాన్య పౌరు లను చట్టబద్ధంగా నడుచుకొమ్మని చెప్పే నైతికార్హత ఉంటుందా? -
‘సెంటర్లవారీగా ఫలితాలు వెల్లడించండి’.. సుప్రీంకోర్టులో నీట్ విచారణ వాయిదా
న్యూఢిల్లీ, సాక్షి: నీట్ పేపర్ లీక్‌పై సుప్రీం కోర్టులో విచారణ సోమవారానికి(జులై 22కి) వాయిదా పడింది. ఇవాళ్టి విచారణ ముగించే ముందు.. సెంటర్ల వారీగా ఫలితాలు విడుదల చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఆదేశించింది. శనివారం మధ్యాహ్నాం కల్లా ఫలితాల్ని వెబ్సైట్లో ఉంచాలన్న ధర్మాసనం.. విద్యార్థుల పేర్లు మాత్రం బయటపెట్టకూడదని స్పష్టం చేసింది. అలాగే తదుపరి విచారణలో ఇరుపక్షాలు రాతపూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశించింది. ఇక ఇవాళ్టి విచారణ టైంలోనూ సీజేఐ త్రిసభ్య న్యాయమూర్తుల బెంచ్.. విస్తృత స్థాయిలో పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని గుర్తిస్తేనే రీటెస్ట్‌కు ఆదేశించగలమని మరోసారి స్పష్టం చేసింది. ‘‘సామాజిక పరిణామాల దృష్ట్యా నీట్ పరీక్షకు సంబంధించిన పిటిషన్ల విచారణకు మేం ప్రాముఖ్యత ఇస్తాం. ఈ వ్యవహారంలో కోర్టు నుంచి చివరకు ఎలాంటి తీర్పు వస్తుందోనని లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అలాగే పిటిషనర్లు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి మరింత సమాచారాన్ని అడిగారు. అలాగే.. మెడికల్ సీట్లు ఎన్ని ఉన్నాయి? పిటిషన్లు వేసిన విద్యార్థులు పొందిన కనీస మార్కులు ఎన్ని? అసలు ఎంతమంది విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు?అని న్యాయవాదుల్ని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు.‘‘పరీక్ష రాసిన 23 లక్షల మందిలో లక్ష మంది మాత్రమే వైద్య కళాశాలల్లో ప్రవేశం పొందుతారు. విస్తృతస్థాయిలో పేపర్ లీక్ జరిగిందని తేలితే.. రీ టెస్ట్ నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సీబీఐ విచారణ జరుగుతోంది. మాకు దర్యాప్తు సంస్థ వెల్లడించిన వివరాలు బయటపెడితే.. దర్యాప్తుపై ప్రభావం పడుతుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఏడాది మే 5వ తేదీన దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2024 పరీక్ష నిర్వహించారు. అయితే పరీక్ష పేపర్ లీక్ అవడంతో పాటు పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఫలితాల్లో ఏకంగా 67 మందికి జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు రావడంపైనా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. నీట్ అభ్యర్థుల్లో 1563 మందికి గ్రేస్ మార్కులు కలపడం, ఓఎంఆర్ షీట్లు అందకపోవడం, న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు సహా నీట్‌ను రద్దు చేయాలన్న డిమాండ్లతో సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక.. నీట్ ప్రశ్నపత్రం లీకైనమాట వాస్తవమని తేలడంతో ఇందులో అవకతవకలు జరిగాయనడంలో ఎటువంటి సందేహం లేదని సుప్రీంకోర్టు ఇటీవల పేర్కొన్న తెలిసిందే.ల -
‘నీట్ పరీక్షను రద్దు చేయం’.. సుప్రీం కోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు
సాక్షి,న్యూఢిల్లీ : నీట్ యూజీ పరీక్షపై సుప్రీం కోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. అఫిడవిట్లో నీట్-యూజీ 2024 పరీక్షలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేనందున, పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. పరీక్షను రద్దు చేస్తే లక్షలాది మంది విద్యార్ధుల జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని చెప్పింది. ఈ మొత్తం అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని ఇప్పటికే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ను కోరినట్లు చెప్పిన కేంద్రం.. నీట్ పరీక్ష లీకేజీ నిందితుల్ని అరెస్ట్ చేశామని పేర్కొంది. -
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
వారణాసి: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి మంగళవారం(మే14) నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన ఆస్తుల వివరాలను ఎన్నికల కమిషన్‌కు అఫిడవిట్లో సమర్పించారు. తనకు సొంత ఇల్లు, కారు లేదని మోదీ అఫిడవిట్లో తెలిపారు. మొత్తం ఆస్తుల విలువ రూ.3.02 కోట్లని వెల్లడించారు. తన ఆస్తిలో రూ.2.86 కోట్లు స్టేట్ బ్యాంక్ ఫ్ ఇండియా(ఎస్బీఐ)లో ఫిక్స్డ్ డిపాజిట్లుగా ఉన్నాయని తెలిపారు. సేవింగ్స్ ఖాతాలో రూ.80,304, తన చేతిలో రూ. 52,920 నగదు ఉందని పేర్కొన్నారు. ఇవి కాకుండా రూ.2.68 లక్షల విలువైన నాలుగు బంగారు ఉంగరాలున్నట్లు తెలిపారు.2018-19లో రూ.11.14 లక్షలుగా ఉన్నవార్షిక ఆదాయం 2022-23లో రూ.23.56లక్షలకు పెరిగినట్లు తెలిపారు. 1978లో ఢిల్లీ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, 1983లో గుజరాత్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసినట్లు అఫిడవిట్లో తెలిపారు. జూన్1న తుది దశలో భాగంగా వారణాసిలో పోలింగ్ జరగనుంది. -
పవన్ కళ్యాణ్ అఫిడవిట్ పై పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు
-
మాస్టారూ.. ఎవరీమె?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నారాయణ విద్యాసంస్థల అధినేతగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఎన్నికల వేళ సత్యాన్ని సమాధిచేసి తన రాజకీయ పదవి కోసం తాళి కట్టిన భార్యనే కాదనుకున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నారాయణతో మూడు దశాబ్దాల పాటు అన్యోన్య దాంపత్య జీవితం పంచుకున్న ఆమె ప్రస్తుతం ఎవరు? అనేది ప్రశ్నార్థకంగా మారింది.ఎన్నికల అఫిడవిట్లో తనకు ఒక భార్య, కుమార్తెను మాత్రమే చూపారు. రెండో భార్య ఆమె కుమార్తెను చూపించకపోవడంతో గత నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అభివృద్ధి మంత్రాన్ని పఠిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నారాయణ మహిళలను వంచించిన విషయంలో సింహపురి మహిళలకు ఏమని సమాధానం చెబుతారు.తప్పుల కుప్ప.. ఆ ‘అఫిడవిట్’ టీడీపీ నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ చిక్కుల్లో పడ్డాడు. భారత ఎన్నికల సంఘం నిబంధనలను సవాల్ చేస్తూ తన నామినేషన్ పత్రంతో సమర్పించిన అఫిడవిట్లో తప్పుడు సమాచారం పొందుపరిచారు. ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం ఒక భార్య ఉన్న వారే రాజ్యాంగబద్ధ పదవులకు అర్హులు. ఇంకో భార్య ఉన్నప్పటికీ విడాకులు అయినా ఇచ్చి ఉండాలి. అయితే నారాయణ విద్యా సంస్థల అధినేతగా నారాయణ వ్యక్తిగత జీవితం ‘తెరిచిన పుస్తకం’. నారాయణకు ఇద్దరు భార్యలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. 2014లో ఇలా.. 2014లో ఎమ్మెల్సీ నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తన భార్య పి. రమాదేవిగా, శారిణి (రెండో భార్య ఇందిర కుమార్తె), కుమారుడు నిషింత్‌ను డిపెండెంట్లుగా చూపించారు. వీరు కొడుకు, కూతురు అయినప్పటికి మిగతా ఐఐఐలోవారు తన సంతానంగా సృష్టంగా పేర్కొనకపోవడం విశేషం. 2019 ఎన్నికల్లో ఇలా.. 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడివిట్లో కేవలం తన భార్య రమాదేవిని మాత్రమే చూపించారు. అయితే అంతకు ముందే కుమారుడు నిషాంత్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కుమార్తె శారిణిని అఫిడవిట్లో సంతానంగా, డిపెండెంట్లుగా పేర్కొనకపోవడం గమనార్హం. 2024లో (ప్రస్తుతం)ఇలా.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్లో తన భార్య రమాదేవిని మాత్రమే చూపించారు. కానీ ఎక్కడా కుమార్తెలు ఉన్నట్లుగా చూపించకపోగా, శారిణి, సింధూర వద్ద అప్పులు తీసుకున్నట్లు అఫిడవిట్లో చూపించడం గమనార్హం. ఇందిర నారాయణ రెండో భార్యే? పొంగూరు ఇందిర రెండో భార్యే అనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. 1996లో ఏర్పాటు చేసిన నారాయణ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సంస్థలో ఇందిర భర్త పొంగూరు నారాయణగా ఆమె చైర్మన్ హోదాతో ఉన్నట్లు ట్రస్ట్ బోర్డులో రిజి్రస్టేషన్ డాక్యుమెంట్లు నిర్థారణ చేస్తున్నాయి. ఇందిర నిర్వహణ కమిటీలో కూడా కోశాధికారిగా ఉన్నట్లు తెలుస్తోంది. 2014లో మాత్రం ఎన్నికల కోసం ఆమెతో రాజీనామా చేయించారు.2011 నుంచి 2020 వరకు నారాయణ ఎడ్యుకేషన్ సోసైటికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్లో లావాదేవీల విషయంలో కూడా ఇందిర సంతకం ఉంది. అయితే ఆమెతో కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నట్లు ఎప్పుడు, ఎలా, ఎక్కడ అనే ఆధారాల్లేవు. ఆమె పాస్‌పోర్టు పరిశీలించినా నారాయణ భార్యగా తేటతెల్లం అవుతుంది. ఆమె పేరుతో ఉన్న ఆస్తుల రిజిస్టర్ డాక్యుమెంట్లను పరిశీలించినా ఇదే విషయం ప్రస్ఫుటం అవుతుంది.ఇందిర కుమార్తె శారిణి పాస్‌పోర్ట్‌లో తన తండ్రి నారాయణగా ఉన్నట్లు సమాచారం. అయితే నారాయణ మంత్రి అయ్యాక వీకీపీడియాలో మాత్రం భార్య రమాదేవి, కుమార్తెలు సింధూర, శారిణి, కుమారుడు నిషాంత్ (లేట్) అనే విషయాలు నమోదు చేసి ఉండడం విశేషం. కన్యాదానం చేసి.. తర్వాత మసి పూసి నారాయణ గతంలో మంత్రి పదవి చేపట్టిన తర్వాత కొంత కాలానికి కుమారుడు హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. తర్వాత కొన్నాళ్లకు తన కుమార్తె శారిణి (రెండో భార్య కుమార్తె)కి టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజతో వివాహం జరిగింది.ఆ వివాహ సందర్భంలో నారాయణ, ఇందిర దంపతులుగా వ్యవహరించి కన్యాదానం చేశారు. అలాగే నారాయణ ఎడ్యుకేషనల్ సోసైటీ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్‌గా శారిణి, రవితేజగా వ్యవహరిస్తున్నారు. అన్ని సందర్భాల్లో ఇందిరను భార్యగా చూపిస్తున్న నారాయణ ఎన్నికల అఫిడవిట్లో మాత్రం చూపించకపోవడం విశేషం. టీడీపీకి ఆర్థిక దన్ను టీడీపీకి నారాయణ ఆర్థిక వెన్నుదన్నుగా నిలుస్తూ చంద్రబాబు అండతో రాజధాని ప్రాంతంలో వేలాది ఎకరాల భూ కుంభకోణానికి పాల్పడ్డారు. అనేక అవినీతి బాగోతాల్లో నారాయణ పాత్రధారుడుగా ఉన్నారు. ఇక విద్యా సంస్థల్లో అయితే పేపర్ల లీకేజీల నుంచి అనేక అడ్డదారులు తొక్కారు. వీటి నుంచి బయటపడాలని 2019లో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నారాయణ అవినీతి బాగోతాలన్నీ బయటపడ్డాయి. ఈ కేసులన్నీ మెడకు చుట్టుకోవడంతో కేసుల నుంచి బయటపడేందుకు ఈ ఎన్నికల్లో గెలవాలని రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీకి సైతం దాదాపు రూ.900 కోట్ల ఎన్నికల ఫండ్‌ను అందజేసినట్లు ప్రచారం జరుగుతోంది.నెల్లూరు సిటీలో కూడా వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నిలబెట్టిన ఒక సామాన్యుడిపై ఓడిపోతాననే భయంతో రూ.100 కోట్లు వరకు ఖర్చు చేసేందుకు కూడా వెనుకాడడం లేదని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అక్రమాలపై ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నారాయణ ఎన్నికల అక్రమాలపై ఇప్పుడు వైఎస్సార్సీపీ దృష్టి సారించింది. 2014లో ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఆయన ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌పై అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఉండడంతో వైఎస్సార్సీపీ నేతలు దృష్టి సారించలేదు. 2019 ఎన్నికలప్పుడు కూడా ఆయన వ్యక్తిగత అఫిడవిట్‌పై దృష్టి కేంద్రీకరించలేదు.తాజాగా జరుగుతున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్సార్సీపీ గతంలో, ఇప్పుడు సమర్పించిన అఫిడవిట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. తన అఫిడవిట్లలో తనకు ఇద్దరు భార్యలు, ముగ్గురు సంతానం ఉన్నట్లు ఎక్కడా చూపించకపోవడంపై నిశితంగా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. ప్రధానంగా నారాయణ భార్యగా రికార్డుల్లో ఉన్న ఇందిరతో విడాకులు తీసుకున్నట్లు ఎక్కడా ఆధారాలు లేవు.ఆయనకు ముగ్గురు సంతానం అనేదానికి సైతం ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం కుమారుడు చనిపోయినప్పటికీ ముగ్గురు సంతానం అనే నిబంధన నారాయణకు వర్తిస్తుందని ఎన్నికల కమిషన్ నియమావళి చెబుతోంది. వీటిపై దృష్టిసారించిన వైఎస్సార్సీపీ నారాయణ అఫిడవిట్‌పై పోరాటం చేయడానికి సిద్ధమైంది. ఆస్తుల్లోనూ తప్పుడు సమాచారమే? దేశ వ్యాప్తంగా నారాయణ విద్యాసంçస్థలను నెలకొల్పి వేలకోట్ల ఆస్తులను సొంతం చేసుకున్న నారాయణ ఎన్నికల ఆఫిడవిట్లో ఆస్తులపై తప్పుడు సమాచారం ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఆయన కుటుంబ ఆస్తులు విలువ రూ.824.05 కోట్లుగా చూపారు. ఆయన తోపాటు మొదటి భార్య రమాదేవి పేరిట ఆస్తులున్నట్లు పేర్కొన్నారు. వారిద్దరి పేర్లతో అప్పులు కూడా రూ.189.59 కోట్లుగా చూపారు. కానీ దేశ వ్యాప్తంగా వేల కోట్ల ఆస్తులు పోగేసుకున్న నారాయణ అఫిడవిట్లో కొన్నింటినే చూపారని చెప్పుకోవాలి. కేసుల్లో దిట్ట నారాయణపై అఫిడవిట్లో చూపిన ప్రకారం ఎనిమిది కేసులు నమోదయిన్నాయి. నారాయణ తమ్ముడు భార్య నెల్లూరు నగరంలోని బాలాజీనగర్ స్టేషన్లో వరకట్నం, వేధింపుల కేసు నమోదు చేయించింది. అలాగే చిత్తూరులో ప్రశ్నాపత్రాల లీక్ చేసిన అభియోగంతో కేసు నమోదయింది.అలాగే నారాయణ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న కేసులో కడప జిల్లా బి కోడూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.. మిగిలిన ఐదు కేసులు అమరావతితో భూముల విషయంలో సీఐడీ కేసులు నమోదు చేసింది.. అమరావతి భూముల మాస్టర్ డిజైనింగ్ అక్రమాలు, దళితుల భూములు కొనుగోలు, మంత్రిగా తన విధులను దుర్వినియోగం చేశారన్న అభియోగాలపై సీఐడీ కేసులు నమోదు చేసినట్లు చూపారు. నామినేషన్ స్క్రూట్నిలో అభ్యంతరాలు నెల్లూరులోని శుక్రవారం జరిగిన నామినేషన్ల స్క్రూట్ని సమయంలో నెల్లూరు నగర టీడీపీ అభ్యర్థి నారాయణ నామినేషన్ సందర్భంగా పొందుపరిచిన అఫిడవిట్‌పై స్థానిక వైఎస్సార్సీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ పలు అభ్యంతరాలను తెలిపారు. నారాయణకు రెండు పెళ్లిళ్లు అధికారికంగా అయినట్లు పలు ఆధారాలతో సహ రిటర్నింగ్ అధికారికి చూపించారు. అఫిడవిట్లో రెండో భార్యను ఎక్కడ చూపించలేదని. రెండో భార్య కుమార్తె శారిణి ఉన్నట్లు చూపించారు.నారాయణ ఎడ్యుకేషన్ సోసైటీ ఏర్పాటు నుంచి ఆయన భార్యగా ఇందిరను చూపించారని, కుమార్తె శారిణి కూడా సోసైటి మేనేజ్మెంట్ మెంబర్‌గా ఉందని, వారి పాస్‌పోర్ట్‌లు పరిశీలించినా వాస్తవాలు తెలుస్తాయయని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆయా అభ్యంతరాల ఆధారంగా నారాయణ నామినేషన్‌ను తిరస్కరించాలని ఫిర్యాదు చేసినా రిటర్నింగ్ అధికారి ఆ అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం. -
సుజనా చౌదరి అఫిడవిట్ పై అనుమానాలు..కేశినేని నాని డిమాండ్
-
అ‘సామాన్యులు’ వైఎస్సార్సీపీ తరఫు అభ్యర్థుల్లో నిరుపేదలు..
సాక్షి నెట్వర్క్: అటుపక్క.. ఒక్కో అభ్యర్థి ఎన్నికల అఫిడవిట్ చూస్తే కళ్లు చెదిరే స్థిరాస్తులు.. మతిపోయే చరాస్తులు. వేలకోట్ల ధనికస్వాములూ ఉన్నారు. దేశంలోనే అపర కుబేర అభ్యర్థుల్లోని వారూ ఆ బ్యాచ్‌లో కొలువుదీరారు. ఇలా పెత్తందారులంతా ఒక్కటై టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి తరఫున రాష్ట్ర ఎన్నికల కదనరంగంలో మోహరించారు. వీరికి దన్నుగా కోటానుకోట్ల సంపద ఉన్న ఐశ్వర్యవంతులు కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎక్కడెక్కడి నుంచో వారి తరఫున రాష్ట్రంలో వాలిపోయారు. వైఎస్సార్సీపీ అభిమానులను ‘వెధవలు’ అంటూ సంభోదిస్తూ కుటుంబానికి రూ.3–4 లక్షలు వెదజల్లయినా వారిని లోబరుచుకునేందుకు వీరంతా బరితెగిస్తున్నారు.కానీ, ఇటుపక్క చూస్తే పేదలకు కొమ్ముకాసే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సింగిల్‌గా సై అంటోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలో ఈ పార్టీ బలగం. ఈ పార్టీ ఎంపిక చేసిన అనేకమంది అభ్యర్థుల ఆర్థిక స్థోమత కూడా అంతంతమాత్రమే. చెప్పుకోదగ్గ ఆస్తిపాస్తులున్న వారేమీ కాదు. కేవలం కోటి రూపాయలు అంతకన్నా తక్కువ ఆస్తి ఉన్న వారూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అలా వైఎస్సార్సీపీ తరఫున పోటీచేస్తూ రూ.కోటి లోపు ఆస్తి ఉన్న అభ్యర్థులు ఎవరంటే.. ► శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఎస్ఎల్ ఈరలక్కప్ప రాష్ట్రంలోనే అత్యంత నిరుపేద అభ్యర్థి. ఈయన అఫిడవిట్‌లోని వివరాలను పరిశీలిస్తే.. ఈరలక్కప్పకు సొంత ఇల్లు, కారు కూడా లేదు. ద్విచక్ర వాహనం మాత్రమే ఉంది. ఆయన పేరు మీద వ్యవసాయ భూమి కూడా లేదు. బంగారు ఆభరణాలు లేవు. బ్యాంకు బ్యాలెన్స్ రూ.27,883 మాత్రమే ఉంది.గుడిబండ కెనరా బ్యాంకులో రూ.41, ఇదే మండలంలోని మందలపల్లి ఏడీసీసీ బ్యాంకులో రూ.26,950 , అగళి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో రూ.11, మడకశిర యూనియన్ బ్యాంకులో రూ.881 బ్యాంకు బ్యాలెన్స్ మాత్రమే ఉంది. అదే విధంగా అప్పు రూ.1,13,050 ఉంది. గుడిబండ కెనరా బ్యాంకులో వ్యక్తిగత రుణం రూ.86,100, మందలపల్లి ఏడీసీసీ బ్యాంకులో రూ,26,950 అప్పు ఉంది. రూ.99,883 విలువ చేసే చరాస్తులు ఈరలక్కప్పపేరు మీద ఉన్నాయి. అలాగే చేతిలో రూ.10 వేలు ఉన్నట్లు అఫిడవిట్లో ఈరలక్కప్ప పేర్కొన్నారు. ► అనంతపురం జిల్లా శింగనమల ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఎం.వీరాంజనేయులు కూడా అత్యంత నిరుపేద. సెంటు స్థలం కానీ, తులం బంగారం కానీ లేదు. నామినేషన్లో ఈయన సమర్పించిన అఫిడవిట్‌ను పరిశీలిస్తే రాష్ట్రంలో అత్యంత పేద అభ్యర్థుల్లో ఒకరన్న విషయం స్పష్టమవుతోంది. ఈయన పేరున విలువైన చరాస్తులు రూ.1,06,478 ఉన్నాయి.ఇందులో చేతిలో నగదు రూ.50 వేలు, అనంతపురం ఎస్బీఐలో రూ.11,193, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (కొత్తూరు బ్రాంచ్)లో రూ.10,002 నగదు నిల్వ ఉంది. అలాగే, 2020లో కొనుగోలు చేసిన ద్విచక్ర వాహనం ఉంది. దీని విలువ రూ.35 వేలు. ఇక ఆయన భార్య పేరున శింగనమలలోని కెనరా బ్యాంక్‌లో కేవలం రూ.283 నగదు ఉంది. ► పాడేరు అసెంబ్లీ అభ్యర్థి ఎం. విశ్వేశ్వరరాజు పేరు మీద రూ.20,39,512లు, భార్య పేరున రూ.16,20,320లు, ఇద్దరు పిల్లల పేరున రూ.7,25,927లు, రూ.7,12,606లు కలిపి మొత్తం రూ.50,98,365ల ఆస్తులున్నాయి. రూ.1,20,000 గోల్డ్‌లోన్ అప్పు ఉంది. ► రంపచోడవరం అసెంబ్లీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి మొత్తం ఆస్తి రూ.53,45,321లు. ఈమె చేతిలో ఉన్న నగదు రూ.2,50,000. బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో ఉన్నది రూ.23,72,821లు. ఇన్నోవా కారు రూ.11,22,500, బంగారు ఆభరణాల విలువ రూ.16,00,000, బ్యాంకులో అప్పు రూ.1,76,223లు ఉంది. ► కృష్ణాజిల్లా మైలవరం అసెంబ్లీ అభ్యర్థి సర్నాల తిరుపతిరావు మొత్తం ఆస్తి రూ.4,27,066లు. స్థిర, చరాస్తులు రూ.1,89,642లు. తన పేరుతో మైలవరం సెంట్రల్ బ్యాంకు అకౌంట్లో రూ.88, మైలవరం కెనరా బ్యాంకులో రూ.1000, మైలవరం మండల పుల్లూరు ఎస్బీఐ అకౌంట్లో రూ.9,823లు.. రూ.73,531 విలువ గల 2016 మోడల్ బైకు.. రూ.55,200 విలువ గల 8 గ్రాముల బంగారు ఉంగరం.. చేతిలో క్యాష్ రూపంగా రూ.50వేలు ఉన్నాయి. ఇందులో ఆయన భార్య పేరున మైలవరం యూనియన్ బ్యాంకులో రూ.1,624లు.. రూ.55,200 విలువ గల 8 గ్రాముల రెండు బంగారు ఉంగరాలు.. రూ.1,65,600 విలువ గల 24 గ్రాముల బంగారు చైను.. చేతిలో క్యాష్ రూపంగా రూ.15వేలు ఉన్నాయి. -
ఎన్నికల వేళ.. పవన్ సంపద సృష్టి
సాక్షి, అమరావతి: సరిగ్గా ఎన్నికలకు రెండు నెలల ముందు జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ హైదరాబాద్, మంగళగిరిలో దాదాపు రూ.25 కోట్ల ఆస్తులను కొనుగోలు చేశారు. ప్రస్తుత సాధారణ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీచేస్తున్న ఆయన మంగళవారం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా తన వ్యక్తిగత, కుటుంబ సభ్యుల ఆదాయ, ఆస్తుల వివరాలను అఫిడవిట్ రూపంలో ఎన్నికల సంఘానికి సమర్పించారు. అందులో ఆయన నెలన్నర క్రితం 2024 మార్చి 4న రూ.16.14 కోట్లతో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో 1,060 చదరపు గజాల స్థలంలో 15,709 చదరపు అడుగుల్లో ఉన్న ఇంటిని కోనుగోలు చేసినట్లు చూపగా.. 2024 ఫిబ్రవరి 12న రూ.7.11 కోట్లతో మంగళగిరి పట్టణ పరిధిలోని 5,517.6 చదరపు గజాల స్థలం కొనుగోలు చేసినట్లు పవన్ అందులో పేర్కొన్నారు. అంతేకాక.. వ్యక్తిగతంగా తన పేరిట రూ. 209.13 కోట్లు స్థిర చరాస్తులుగానూ, రూ.65.76 కోట్లు అప్పులు ఉన్నట్లు ఆయన తెలిపారు. తన భార్య అన్నా లెజినోవా, అఫిడవిట్లో పేర్కొన్న నలుగురు పిల్లల పేరిట మరో రూ.28.47 కోట్ల స్థిర చరాస్తులు ఉన్నట్లు పవన్ పేర్కొన్నారు. ఇక మొత్తం ఆస్తుల్లో 10 శాతానికి పైగా ఆస్తులు ఎన్నికలకు రెండు నెలల ముందు కొనడం గమనార్హం. ఆ పిల్లలకు ఒక రకంగా.. ఈ పిల్లలకు మరో రకంగా.. ఇదిలా ఉంటే.. అఫిడవిట్లో పవన్ తన పిల్లలు దేశాయి అకీరా నందన్, దేశాయి ఆద్య (వీరిద్దరూ రేణుదేశాయి–పవన్‌కళ్యాణ్ పిల్లలు)తో పాటు పోలీనా అంజని, మార్క్ శంకర్ (పవన్‌కళ్యాణ్–అన్నా లెజినోవా పిల్లలు) పేర్లతో ఉన్న ఆస్తులూ వెల్లడించారు. ఆ అఫిడవిట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. వీరికి ఆస్తుల కేటాయింపులో పవన్ వ్యత్యాసం చూపించారు. విడాకులిచ్చిన రేణుదేశాయి పిల్లలకు ఒక రకంగా, ఆ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకున్న లెజినోవా పిల్లలకు మరో రకంగా వారి పేరిట తన ఆస్తులు బహుమతుల రూపంలో ఇవ్వడం గమనార్హం. చదివింది పదో తరగతే.. ఇక పవన్ పదో తరగతి వరకే చదువుకున్నారు. అది కూడా ఎస్ఎస్ఎల్సీ (సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్) రద్దయి, దాని స్థానంలో ఎస్ఎస్సీ (సెకండరీ స్కూల్ సర్టిఫికెట్) వచ్చిన చాలా ఏళ్ల తర్వాత ఎస్ఎస్ఎల్సీ చదవడం గమనార్హం. ఇంటర్లో మేథమేటిక్స్ మొదలు ఎకనామిక్స్ వరకు దాదాపు అరడజను సబ్జెక్టులు చదివినట్లు సందర్భాన్ని బట్టి చెప్పే పవన్.. అవన్నీ హంబక్ అని అఫిడవిట్లో కుండబద్దలు కొట్టారు. 1984లో నెల్లూరులోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టెన్త్ ఉత్తీర్ణులైనట్లు అఫిడవిట్లో వివరించారు. తనపై మొత్తం 8 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొనగా.. తన ప్రస్తుత చిరునామా మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాలనీగా చెబుతూ.. మంగళగిరి అసెంబ్లీ పరిధిలోని 197 పోలింగ్ బూత్ 1120 నెంబరుగా తనకు ఓటు ఉన్నట్లు తెలిపారు. పవన్, కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు.. 2018–19 ఆర్థిక సంవత్సరంలో తనకెలాంటి ఆదాయం లేకపోగా, రూ.1,10,62,939 నష్టం వచ్చిందని.. అయితే, 2019–20లో రూ.4.51 కోట్లు, 2020–21లో రూ.12.86 కోట్లు, 2021–22లో 30.09 కోట్లు, 2022–23 ఆర్థిక ఏడాదిలో 12.20 కోట్లు మాత్రమే తన ఆదాయంగా ఆదాయపన్ను శాఖకు సమర్పించినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే, తన భార్య, పిల్లల ఆదాయాలకు సంబంధించి ఎలాంటి ఐటీ రిటరŠన్స్ వివరాలు లేవు. చరాస్తులు.. ► పవన్‌కళ్యాణ్ చేతిలో ఈ ఏడాది ఏప్రిల్ 19 నాటికి తన చేతిలో నగదు రూపంలో రూ.3.15 లక్షలు ఉన్నాయని.. బ్యాంకుల్లో డిపాజిట్లుగా రూ.16.48 కోట్లు.. షేర్లు, బాండ్ల రూపంలో రూ.15.48 లక్షలు.. ఇన్సూరెన్స్ తదితర పెట్టుబడులుగా మరో రూ.3.02 కోట్లు.. ఇతరులకు అప్పు రూపంలో ఇచ్చిన మొత్తం రూ.3.65 కోట్లు.. అలాగే, రూ.14.01 కోట్లు విలువ చేసే కార్లు, వాహనాలున్నాయని.. రూ.2.34 కోట్ల బంగారు ఆభరణాలు.. రూ.14.51 లక్షల విలువ చేసే వెండి ఆభరణాలు.. ఇతర రూపాల్లో మరో రూ.1.79 కోట్లు కలిపి మొత్తం చర ఆస్తుల రూపంలో రూ.41.65 కోట్లుగా చూపించారు. ► తన వద్ద రూ.32 లక్షల విలువ చేసే హార్లీ డేవిడ్సన్ బైక్‌తో పాటు పది కార్లు (రెండు బెంజి, మూడు మహీంద్రా స్కార్పియాలు, రేంజ్ రోవర్, రెండు టయోటాలు, జీపు, టాటా పికప్ ట్రక్ వాహనాలున్నట్లు పవన్ పేర్కొన్నారు. ► ఇక తన భార్య అన్నా లెజినోవా పేరిట నగదు రూపంలో రూ.19,340లు.. బ్యాంకు డిపాజిట్లు రూపంలో రూ.86.05 లక్షలు.. రూ.13.97 లక్షల విలువ చేసే బంగారు, వెండి అభరణాలు కలిపి మొత్తంగా రూ.ఒక కోటి చరాస్తులున్నాయి. ► పిల్లలు దేశాయి అకీరా నందన్ పేరిట బ్యాంకు డిపాజిట్లుగా రూ.89.38 లక్షలు.. దేశాయి ఆద్య పేరిట రూ 87.77 లక్షల బ్యాంకు డిపాజిట్లు.. పోలీనా అంజని పేరిట బ్యాంకు డిపాజిట్లుగా రూ.85.92 లక్షలు.. మార్క్ శంకర్ పేరిట రూ.86.25 లక్షలు బ్యాంకు డిపాజిట్లుగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆకీరా నందన్‌కు తన తల్లి 2022లో ఆడి కారు బహుమతిగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ► మరోవైపు.. మొత్తం రూ.65.76 కోట్ల మేర తాను బ్యాంకులు లేదా వివిధ వ్యక్తులకు చెల్లించాలని పవన్ పేర్కొంటూ, అందులో రూ.17.56 కోట్లు బ్యాంకులకు, మరో రూ.46.70 కోట్లు 15 మంది వ్యక్తులు లేదా సంస్థలకు అప్పులుగా చెల్లించాల్సి ఉందని ఆయన తన అఫిడవిట్లో వివరించారు. స్థిరాస్తులు.. ► హైదరాబాద్ శంకరపల్లి మండలం జొన్నవాడ గ్రామంలో 18.02 ఎకరాల వ్యవసాయ భూములున్నాయని, వాటి ప్రస్తుత విలువ రూ. 10.42 కోట్లు ఉన్నట్లు పవన్ పేర్కొన్నారు. ► ప్రస్తుత మార్కెట్ విలువ అంచనాల ప్రకారం రూ.52.85 కోట్ల విలువచేసే ఏడుచోట్ల స్థలాలు (శేరిలింగంపల్లి మండల పరిధిలో రెండు, మంగళగిరి మండల పరిధిలో నాలుగు, హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఒకటి స్థలాలు ఉన్నట్లు తెలిపారు. మంగళగిరిలో పేర్కొన్న నాలుగు స్థలాల్లో ఒకటి ఈ ఏడాది ఫిబ్రవరి 12న రూ.7.11 కోట్లతో కోనుగోలు చేసినట్లు వివరించారు. ► ఆ ఏడింటిలో ఒకటి మంగళగిరిలోని స్థలం తన తల్లి బహుమతి రూపంలో ఇచ్చారని.. మిగిలినవి తను కొనుగోలు చేసినవన్నారు. ► హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో రూ. 3.14 కోట్లు విలువచేసే రెండు ఇళ్లు ఉన్నట్లు తెలిపారు. è రూ.1.95 కోట్లు విలువచేసే హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఇంటిని భార్య అన్నా లెజినోవాకు బహుమతిగా ఇచ్చానన్నారు. è రూ.22 కోట్లు విలువ చేసే హైదరాబాద్ జూబీహిల్స్‌లోని ఇంటిని తన భార్య అన్నా లెజినోవా పిల్లలు పోలీనా అంజని, మార్క్ శంకర్ ఇద్దరికీ చేరి సగం వాటాగా బహుమతిగా అందజేసినట్లు పవన్ పేర్కొన్నారు. పవన్‌కళ్యాణ్ నామినేషన్ అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మంగళవారం రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. సోదరుడు నాగబాబు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ, తన న్యాయవాదితో కలిసి వచ్చిన ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల నిబంధనలను వారు బేఖాతరు చేశారు. నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు నలుగురికే అనుమతి ఉండగా అంతకుమించి లోపలకు అనుమతించారు. నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో మాత్రమే అభ్యర్థుల అనుచరులు ఉండాలన్న నిబంధననూ లెక్కచేయలేదు. అక్కడ నినాదాలూ చేశారు. బీజేపీ నేతలకు పరాభవం.. కూటమిలో సభ్యులైన టీడీపీ నేతలకు మాత్రమే విలువనిచ్చిన పవన్‌కళ్యాణ్.. అప్పటివరకూ ర్యాలీలో తనతో పాటు తిప్పుకున్న బీజేపీ నేత బుర్రా కృష్ణంరాజుకు నామినేషన్ కేంద్రంలోకి వచ్చే అవకాశం లేకుండా చేశారు. తనను పోలీసులు గేటు వద్ద అడ్డుకోవడంతో పొత్తు ధర్మాన్ని పాటించలేదంటూ కృష్ణంరాజు అసహనానికి గురయ్యారు. తరువాత పోలీసులు వర్మ కుమారుడు గిరీష్ వర్మతో పాటు ఆయన్ను లోపలకు పంపించారు. ఇక నామినేషన్ వేసేందుకు గొల్లప్రోలు మండలం చేబ్రోలు నుంచి ఒకసారి ర్యాలీగా పిఠాపురం చేరుకోవడానికే పవన్ అనుమతి తీసుకున్నారు. అయితే, రెండుసార్లు తిరగడం గమనార్హం. -
చంద్రబాబు, లోకేశ్ ప్రకటించిన ఆస్తులు రూ.1,474 కోట్లు
సాక్షి, అమరావతి: చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ వారి ఆస్తుల గురించి ఎన్నికల అఫిడవిట్లలో వెల్లడించిన వివరాలు చర్చనీయాంశమయ్యాయి. అపారమైన ఆస్తులు ఉన్నా చాలా తక్కువ ఆస్తుల్ని మాత్రమే వారు బయటపెట్టినట్లు తెలుస్తోంది. కుప్పం అసెంబ్లీ అభ్యర్థిగా చంద్రబాబు, మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థిగా లోకేశ్ విడివిడిగా ఆస్తులు చూపించారు. కానీ వారు కలిసే ఉంటున్నారు. ఆస్తుల్ని మాత్రం పక్కాగా పంచుకున్నారు. అందరూ కలిసి ఒకే కుటుంబంగా ఉంటున్నప్పటికీ, విడివిడిగా ఆస్తుల్ని చూపించడం ద్వారా తక్కువ ఆస్తిపరులని ప్రజలను మభ్య పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. అఫిడవిట్లలో అధికారికంగా వారు ప్రకటించిన ఆస్తుల విలువ రూ.1,474 కోట్లు. చంద్రబాబు, భువనేశ్వరి ఆస్తుల విలువ రూ.931.83 కోట్లు కాగా, లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్ ఆస్తుల విలువ రూ.542.17 కోట్లుగా చూపారు. వారి ఆస్తుల్లో ఎక్కువ హెరిటేజ్ షేర్ల రూపంలో ఉన్నాయి. స్థిరాస్తులు హైదరాబాద్ పరిసరాల్లో ఎక్కువగా ఉండగా, కొన్ని తమిళనాడులోనూ ఉన్నాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో మాత్రం నామమాత్రంగా రెండు స్థలాలున్నాయి. వారు తమదిగా చెప్పుకునే అమరావతి, విజయవాడ ప్రాంతాల్లో మాత్రం ఈ కుటుంబంలోని ఐదుగురిలో ఎవరికీ ఒక్క ఆస్తి కూడా లేదు. వారి సొంతిల్లు హైదరాబాద్‌లోనే ఉన్న విషయం తెలిసిందే. లోకేశ్, భువనేశ్వరి హెరిటేజ్ షేర్ల విలువే రూ.1102 కోట్లు చంద్రబాబు ఆస్తుల్లో ఆయన భార్య భువనేశ్వరి, కొడుకు లోకేశ్‌కి ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ షేర్ల విలువే రూ.1102.11 కోట్లు. భువనేశ్వరికి రూ.763 కోట్ల విలువైన షేర్లు ఉండగా, లోకేశ్‌కి రూ.339.11 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. మొత్తంగా చంద్రబాబు, భువనేశ్వరి పేరు మీద రూ.121.41 కోట్ల స్థిరాస్తులు, రూ.815.17 కోట్ల చరాస్తులుగా చూపించారు. అలాగే భువనేశ్వరికి రూ.1.84 కోట్ల విలువైన బంగారం, రూ. 1.09 కోట్ల విలువైన ముత్యాలు, వజ్రాభరణాలు, రూ.30 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నట్లు పేర్కొన్నారు. అప్పులు రూ. 10.31 కోట్లుగా చూపారు. లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్‌కు కలిపి రూ.394 కోట్ల చరాస్తులు ఉండగా, స్థిరాస్తులు రూ.148.07 కోట్ల విలువైనవి ఉన్నట్లు పేర్కొన్నారు. బ్రాహ్మణికి 2500.338 గ్రాముల బంగారం, 97.441 కిలోల వెండి, రూ.1.48 కోట్లు విలువైన వజ్రాభరణాలు ఉండగా, దేవాన్స్ వద్ద 7.5 కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి. ఆస్తుల విలువ తగ్గించి చూపారు చంద్రబాబు కుటుంబం అఫిడవిట్లలో ప్రకటించిన ఆస్తుల విలువను తక్కువ చేసి చూపించింది. హైదరాబాద్ మదీనగూడలో లోకేశ్, భువనేశ్వరి పేరు మీద ఉన్న 10 ఎకరాల వ్యవసాయ భూమి విలువను రూ.100 కోట్లుగా చూపించారు. నిజానికి అక్కడ ఎకరం రూ.50 కోట్లకు పైనే ఉంటుంది. ఆ లెక్కన ఆ భూమి విలువ రూ.500 కోట్లకు పైమాటే. అలాగే ఈ భూమి వ్యవహారాన్ని చంద్రబాబు గతంలో రహస్యంగా ఉంచారు. 10 ఎకరాల్లో 5 ఎకరాలు లోకేశ్‌కి ఉన్నట్లు బయటపడినప్పుడు అది ఎలా వచ్చిందనే దానిపై మల్లగుల్లాలు పడ్డారు. నానమ్మ అమ్మణ్ణమ్మ నుంచి లోకేశ్‌కి గిఫ్ట్‌గా రాసినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈ విషయంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. కుప్పంలో ఉండే అమ్మణ్ణమ్మకు ఖరీదైన ప్రాంతంలో అంత భూమి ఎలా వచ్చిందనే ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెప్పలేదు. మదీనగూడలోనే మరో 5 ఎకరాలను భువనేశ్వరి కొన్నట్లు చూపారు. రెండేళ్ల వయసులోనే రూ.20 కోట్ల ఆస్తి కొన్న దేవాన్ష్ చంద్రబాబు మనుమడు దేవాన్ష్ రెండేళ్ల వయసులోనే రూ.20 కోట్ల విలువైన ఆస్తిని కొన్నట్లు చూపడం విశేషం. జూబ్లీహిల్స్‌లో తల్లి బ్రాహ్మణితో కలిపి ఉన్న వాణిజ్య భవనాన్ని దేవాన్ష్ 2017లో కొన్నట్లు పేర్కొన్నారు. అతను పుట్టింది 2015లో. పిల్లలకు వారసత్వంగా ఆస్తి ఇవ్వడం మామూలుగా జరుగుతుంటుంది. కానీ ఆ వయసులో కొన్నట్లు చూపడమే కొసమెరుపు. చంద్రబాబు పేరుతో ఉన్న స్థిరాస్థులు 1. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కొడుకు లోకేశ్‌తో కలిపి 1,285 గజాల వాణిజ్య భవనం. విలువ రూ.70.20 కోట్లుగా చూపారు. 2. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లి వద్ద 96.23 సెంట్ల భూమి. విలువ రూ.77.33 లక్షలుగా చూపించారు. 3. నారావారిపల్లె శేషాపురంలో ఇల్లు. విలువ రూ.43.66 లక్షలుగా పేర్కొన్నారు. భువనేశ్వరి పేరుతో స్థిరాస్థులు 1. హైదరాబాద్ మదీనగూడలో 5 ఎకరాల వ్యవసాయ భూమి (ఫామ్ హౌస్). దాని విలువ రూ.55 కోట్లుగా చూపారు. 2. తమిళనాడు కాంచీపురం జిల్లా సెన్నేర్ కుప్పం గ్రామంలో 2.33 ఎకరాల వాణిజ్య భూమి. విలువ రూ.30.10 కోట్లుగా చూపారు. లోకేశ్ స్థిరాస్థులు 1. హైదరాబాద్ మదీనగూడలో నానమ్మ గిఫ్ట్‌గా ఇచ్చిన 5 ఎకరాల వ్యవసాయ భూమి. దాని విలువ రూ.57.21 కోట్లుగా చూపారు. 2. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో తండ్రి చంద్రబాబుతో కలిపి (50 శాతం వాటా) 1285 గజాల్లో నివాస భవనం. విలువ రూ.35.10 కోట్లుగా పేర్కొన్నారు. బ్రాహ్మణి స్థిరాస్థులు 1. హైదరాబాద్ మాదాపూర్‌లో 924 గజాల స్థలం. విలువ రూ.4.15 కోట్లుగా పేర్కొన్నారు. 2. రంగారెడ్డి జిల్లా మల్లాపూర్‌లో 4 వేల గజాల స్థలం. విలువ రూ.90.39 లక్షలుగా చూపించారు. 3. హైదరాబాద్ మణికొండలో 2,440 గజాల స్థలం. విలువ రూ.3.66 కోట్లుగా చూపారు. 4. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కొడుకు దేవాన్ష్‌తో కలిపి (50 శాతం వాటా) 1,024 గజాల్లో వాణిజ్య భవనం. విలువ రూ.20.17 కోట్లుగా చూపారు. 5. చెన్నైలో 383 గజాల స్థలం. విలువ రూ.6.69 కోట్లుగా పేర్కొన్నారు. దేవాన్ష్ స్థిరాస్థులు 21. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో తల్లి బ్రాహ్మణితో కలిపి (50 శాతం వాటా) 1,024 గజాల వాణిజ్య భవనం. విలువ రూ.20.17 కోట్లుగా పేర్కొన్నారు. -
గంటా దొంగ లెక్కలు ఒక భార్య.. రెండు పాన్ కార్డుల కథ
-
అధికారంలో ఉన్నా, లేకున్నా ఆస్తుల పెంపులో చంద్రబాబు తగ్గేదేలే !
-
గంటా.. ఒక భార్య.. రెండు పాన్లు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ నాయకుడు గంటా శ్రీనివాసరావుకు చట్టం తెలియదా? లేకపోతే తననెవరేం చేస్తార్లే అన్న ధీమానా? ఎందుకంటే ఏ వ్యక్తికైనా రెండు పాన్ నెంబర్లుండటం చట్టరీత్యా నేరం. శిక్షార్హులు కూడా. కానీ గంటాది కళ్లు మూసేసుకుని... తననెవ్వరూ చూడటం లేదనుకునే బాపతు. అందుకే... గత ఎన్నికలకు, ఈ ఎన్నికలకు తన భార్య పాన్ నంబరును మార్చేశారు. భార్య శారద పేరుతో గత ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న పాన్ నంబర్‌కు, ఈ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న పాన్ నంబర్‌కు సంబంధం లేకపోవటంతో దీనివల్ల ఆయన పోటీ నుంచి తప్పుకోవాల్సి వస్తుందేమోనని ఆయన అనుచరులే ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. 2019 ఎన్నికల్లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు.... నాటి అఫిడవిట్లో తన సతీమణి శారద పాన్ నంబరు ఏబీపీపీజీ2215ఏగా పేర్కొన్నారు. ప్రతిసారీ నియోజకవర్గాన్ని మార్చే అలవాటున్న గంటా ఈ సారి పట్టుబట్టి, చంద్రబాబు నాయుడిని ఎదిరించి మరీ భీమిలి టికెట్టు సాధించుకున్నారు. శుక్రవారం నామినేషన్ వేస్తూ... అఫిడవిట్ దాఖలు చేశారు. దీన్లో భార్య శారద పాన్ నంబరును మాత్రం ఏబీపీపీజీ2216ఏగా పేర్కొన్నారు. అంటే... 2215ఏ, 2216ఏ నంబర్లతో దాదాపు ఒకేసారి రెండు పాన్ నంబర్లను తీసుకున్నట్లు దీన్నిబట్టి స్పష్టమవుతోంది. అంతా నగదు రూపంలోనే...! ఆదాయపన్నుశాఖ చట్టం ప్రకారం నగదు లావాదేవీలు రూ.2 లక్షలకు మించి జరగకూడదు. ఒకవేళ జరిగితే అది నేరం అవుతుంది. అయితే, గంటా శ్రీనివాసరావు తన సతీమణి పేరుతో 2018లో భీమునిపట్నం పరిధిలో భూమిని కొన్నపుడు పెద్దమొత్తంలో నగదు రూపంలోనే చెల్లించడంపై అప్పట్లో విమర్శలొచ్చాయి. రూ.92,98,000ను నగదు రూపంలోనే ఇచ్చినట్టు చూపించారు. అంతేకాకుండా మరో రూ.25 లక్షలను ఆర్టీజీఎస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసినట్టు చూపి సర్వే నంబరు టీఎస్ నంబరు 1,490, బ్లాక్ నంబరు 17, వార్డు నంబరు 24లోని 1,936 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇంత భారీ స్థాయిలో నగదు లావాదేవీలు జరిపితే పాన్ నంబరును పేర్కొనడంతో పాటు ఐటీ రిటర్న్స్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. కానీ గంటా శారద 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరం వరకు ఏ ఒక్క సంవత్సరంలోనూ ఐటీ రిటర్న్‌లు దాఖలు చెయ్యలేదు. వాస్తవానికి ఆ పాన్ నెంబర్లను చూసినపుడు రెండూ ఒకే సమయంలో తీసుకున్నట్లుగా స్పష్టమవుతుంది. అయితే ఐటీ రిటర్నుల కోసం ఒకటి, భారీ నగదు లావాదేవీల కోసం మరొకటి వినియోగిస్తూ ఉండవచ్చని, ఆ రెండింటినీ చెక్ చేస్తే ఆదాయపు పన్నును మోసం చేసిన వ్యవహారాలు చాలావరకూ బయటపడతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టే ఉద్దేశంతో ఇలా రెండు పాన్ నెంబర్లను కలిగి ఉండటం నేరమని, మంత్రిగా పనిచేసిన గంటాకు ఇది తెలియనిదేమీ కాదని, కావాలనే ఇలా చేస్తున్నారని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. తాజా అఫిడవిట్ ప్రకారం గంటాపై ఏడు కేసులున్నాయి. భార్యాభర్తలిద్దరి పేరిటా మొత్తం రూ.23.36 కోట్ల స్థిర, చరాస్తులున్నాయని, కాకపోతే సొంత కారు మాత్రం లేదని గంటా పేర్కొన్నారు. ఆస్తుల కొనుగోలుకు మరో పాన్ అసలు కథేమిటంటే... 2018లో తన సతీమణి పేరుతో కొనుగోలు చేసిన ఆస్తి కోసం పాన్ నంబర్‌ను ఏబీపీపీజీ2216ఏగా గంటా పేర్కొన్నారు. ఇందుకు విరుద్ధంగా 2019 ఎన్నికల అఫిడవిట్లో మాత్రం ఏబీపీపీజీ2215ఏగా పేర్కొన్నారు. అంటే... అప్పట్లో కొన్న ఆస్తిని గత ఎన్నికల్లో చూపించలేదు. పైపెచ్చు 2018లో కొనుగోలు చేసిన భూ లావాదేవీలన్నీ నగదు రూపంలోనే సతీమణి పేరుతో కొనసాగించిన గంటా.. 2018–19, 2019–20 ఆర్థిక సంవత్సరాల్లో ఐటీ రిటర్న్స్‌ను కూడా దాఖలు చెయ్యలేదు. ఈ వ్యవహారాన్ని అప్పట్లోనే ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి భూ లావాదేవీల కోసం పేర్కొన్న పాన్ నంబర్‌ను అఫిడవిట్లో పేర్కొనడం గమనార్హం. నిజానికి ఒకే వ్యక్తికి రెండు పాన్ నంబర్లు ఉండటం చట్టరీత్యా నేరమని, అంతేగాకుండా ఒక్కోసారి ఒక్కో విధంగా ఎన్నికల అఫిడవిట్లో వివరాలివ్వటం కూడా ఎన్నికల కోడ్‌కు విరుద్ధమని ఎన్నికల అధికారులే చెబుతున్నారు. -
బాలయ్య కుటుంబ ఆస్తులు రూ.465.35 కోట్లు.. అయ్యన్నపై కేసులు 17
సాక్షి నెట్వర్క్: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. 2022–23లో ఆదాయం రూ.10 కోట్లు, స్థిరాస్తులు రూ.103 కోట్లు, చరాస్తులు రూ.82 కోట్లు కలిపి బాలయ్యకు మొత్తం రూ.185 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్లో పొందుపరిచారు. క్రిమినల్ కేసులు ఏవీ లేవని పేర్కొన్నారు. నందమూరి హిందూ అవిభాజ్య కుటుంబంలో బాలకృష్ణకు స్థిరాస్తులు రూ.28.91 కోట్లు, చరాస్తులు రూ.2.41 కోట్లుగా చూపారు. బాలయ్య సతీమణి వసు«ంధర పేరిట రూ.179.28 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా.. అందులో స్థిరాస్తులు రూ.38.90 కోట్లు, చరాస్తుల విలువ రూ.140.38 కోట్లుగా చూపారు. కుమారుడు మోక్షజ్ఞ పేరిట స్థిరాస్తులు రూ.11.11 కోట్లు, చరాస్తులు రూ.58.64 కోట్లు కలిపి బాలకృష్ణ కుటుంబానికి మొత్తం ఆస్తుల విలువ రూ.465.35 కోట్లుగా చూపారు. అయ్యన్నపాత్రుడిపై 17 కేసులు చింతకాయల అయ్యన్నపాత్రుడి పేరిట రూ.5,04,61,500, అతని భార్య పేరిట రూ.10,84,63,200 విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. అయ్యన్నపాత్రుడు దళితులపై దూషణలు చేయడం.. అధికారులపై చిందులు వేయడం పరిపాటిగా మార్చుకున్నారు. ఈ క్రమంలోనే అతనిపై 17 కేసులు సైతం నమోదయ్యాయి. ఉమ్మడి విశాఖలోనే కాకుండా రాష్ట్రంలో పలుచోట్ల ఆయనపై కేసులు ఉన్నాయి. మాగుంట వద్ద ఉన్నది రూ.18 వేలేనట దేశవ్యాప్తంగా పేరున్న మద్యం వ్యాపారి. కానీ.. ఆయన చేతిలో ఉన్న నగదు రూ.18,529 మాత్రమేనట. టీడీపీ ఒంగోలు పార్లమెంటరీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మాగుంట శ్రీనివాసులరెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తన చేతిలో ఉన్న నగదుతో పాటు భార్య వద్ద రూ.6,68,134, ఉమ్మడి కుటుంబ సభ్యుల (హెచ్‌యూఎఫ్) వద్ద రూ.67,854 నగదు ఉందని తెలిపారు. చరాస్థుల కింద తనకు రూ.4,58,30,319 ఉండగా.. భార్య పేరిట రూ.17,98,70,139, ఉమ్మడి కుటుంబం కింద రూ.4,24,94,762 ఉన్నట్టు తెలిపారు. తన పేరిట రూ.1.09 కోట్లు స్థిరాస్తులు ఉండగా.. భార్య పేరిట రూ.30,04,44,600, ఉమ్మడి కుటుంబ సభ్యుల కింద రూ.4,29,44,876 ఉన్నట్టు పేర్కొన్నారు. కేసుల చిట్టా విప్పిన బొండా ఉమా విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు (ఉమా) ఎన్నికల అఫిడవిట్లో తన కేసుల చిట్టా విప్పారు. 2006 నుంచి 2024 ఏప్రిల్ వరకు వివిధ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో తనపై 23 కేసుల నమోదైనట్టు వెల్లడించారు. 2006 నుంచే తనపై కేసులు ఉన్నప్పటికీ 2014, 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ల వీటి ప్రస్తావన తేలేదు. భార్య, కుమారుడితో పాటు తన పేరిట మొత్తంగా రూ.98.53 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నట్టు వివరించారు. కావలి అభ్యర్థికీ కారు లేదట! కావలి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దగుమాటి వెంకటకృష్ణారెడ్డి (కావ్య కృష్ణారెడ్డి) ఆస్తుల విలువ రూ.153.27 కోట్లు అని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. అతని పేరున రూ.115.67 కోట్లు, భార్య శ్రీలత పేరిట రూ.31.92 కోట్లు, కుమార్తె వెన్నెల పేరిట రూ.5.67 కోట్లు చర, స్థిరాస్తులున్నట్టు చూపారు. కృష్ణారెడ్డి కారు లేదని అఫిడవిట్లో పేర్కొన్నారు. వేమిరెడ్డి దంపతులకు 19 కార్లు కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆమె భర్త ప్రభాకర్‌రెడ్డి ఉమ్మడి ఆస్తులు విలువ రూ.715.62 కోట్లుగా ఎన్నికల ఆఫిడవిట్లో పేర్కొన్నారు. ప్రశాంతిరెడ్డి పేరుతో రూ.76.35 కోట్లు, ప్రభాకర్‌రెడ్డి పేరుతో రూ.639.26 కోట్లు ఉన్నట్టు వెల్లడించారు. వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.1.17 కోట్లు ఉండగా.. షేర్లు, బాండ్ల రూపంలో రూ.10.62 కోట్లు ఉన్నాయి. ఆ దంపతులిద్దరికీ రూ.6.96 కోట్ల విలువైన 19 కార్లు ఉన్నట్టు తెలిపారు. -
తిరువనంతపురం ఫైట్.. కేంద్ర ఐటీ మంత్రిపై ‘ఈసీ’కి ఫిర్యాదు
తిరువనంతపురం: కేరళలోని కీలక సీటు తిరువనంతపురం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆస్తులు దాచారని ఎన్నికల కమిషన్(ఈసీ)కి వామపక్ష ఎల్డీఎఫ్ కూటమి ఫిర్యాదు చేసింది. నామినేషనన్ సందర్భంగా రాజీవ్ చంద్రశేఖర్ దాఖలు చేసిన ఆస్తుల అఫిడవిట్లో గత ఏడాది ఆదాయాన్ని ఆయన చాలా తక్కువగా చూపించారని ఫిర్యాదులో ఎల్డీఎఫ్ నేతలు పేర్కొన్నారు. జూపిటర్ క్యాపిటల్ అనే కంపెనీలో ఆయనకు ఉన్న సింహభాగం వాటాల నుంచి వచ్చే ఆదాయాన్ని వెల్లడించలేదని ఆరోపించారు. ఇంతకముందు ఇదే విషయమై రాజీవ్ చంద్రశేఖర్‌పై కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి కూడా ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రిగా ఉన్న రాజీవ్‌చంద్రశేఖర్ తిరువనంతపురం నుంచి ప్రధానంగా యూడీఎఫ్ అభ్యర్థి శశిథరూర్‌తో పోటీపడుతున్నారు. ఇదీ చదవండి.. ప్రచార హోరు..తృణమూల్‌పై ప్రధాని మోదీ ఫైర్ -
రాజీవ్ చంద్రశేఖర్ అఫిడవిట్.. ఆస్థులకంటే అప్పులే ఎక్కువ!
కేరళలోని తిరువనంతపురం లోక్‌సభ స్థానానికి 'రాజీవ్ చంద్రశేఖర్' నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆస్తులు, అప్పులు వంటి వాటిని వెల్లడించారు. ఆస్తులకు సంబంధించి.. చంద్రశేఖర్ వద్ద రూ.52,000 నగదు, చరాస్తులతో పాటు మొత్తం రూ.9.26 కోట్లు ఉన్నట్లు తెలిపారు. ఇందులో రూ.10.38 కోట్లు బ్యాంకు డిపాజిట్లు, రూ.45.7 కోట్ల రుణాత్మక ఆస్తులు, వ్యక్తిగత రుణాలు రూ.41.2 కోట్లు ఉన్నట్లు సమాచారం. రాజీవ్ చంద్రశేఖర్ వద్ద రూ. 10000 విలువ చేసే స్కూటర్, రూ. 3.35 లక్షల విలువైన నగదు ఉన్నట్లు సమాచారం. కాగా ఆయన భార్యకు రూ. 12.47 కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించారు. మొత్తం మీద ఐటీ మంత్రి స్థిరాస్థులురూ. 14.4 కోట్లుగా ప్రకటించారు. అప్పులు దాదాపు రూ. 19.42 కోట్లు ఉన్నట్లు సమాచారం. తిరువనంతపురం నుంచి మూడుసార్లు కాంగ్రెస్ అధిపతి 'శశి థరూర్' & సీపీఐకి చెందిన పన్నియన్ రవీంద్రన్‌పై చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో శశిథరూర్ నాలుగోసారి గెలుస్తామన్న ధీమాను వ్యక్తం చేసారు. -
రాహుల్ గాంధీ కోటీశ్వరుడేనా?
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తన ఆస్తులు, అప్పుల వివరాలను ప్రకటించారు. ప్రస్తుతం కేరళలోని వాయనాడ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన అదే స్థానం నుంచి ఈసారి లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పుల వివరాలను సమర్పించారు. రాహుల్ గాంధీ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం... ఆయన వద్ద స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రూ.4.3 కోట్లు, మ్యూచువల్ ఫండ్ డిపాజిట్లు రూ.3.81 కోట్లు, బ్యాంకు ఖాతాలో రూ.26.25 లక్షలు ఉన్నాయి. ప్రస్తుతం తన వద్ద రూ. 55,000 నగదు ఉందని, 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 1,02,78,680 ఆర్జించినట్లు పేర్కన్నారు. #Congress leader Rahul Gandhi's Asset and Liability!!👇👇 Assets worth 20,29,52,000. Liability- 49,70,000. Also Invested in Stocks-Mutual Fund and Gold Bond.#stockmarkets #stockmarkets #RahulGandhi #BJP #NarendraModi pic.twitter.com/tx6eCcrWrf — House of Stocks~NISM certified (@CommonInsan) April 4, 2024 రాహుల్ గాంధీ వద్ద రూ.15.2 లక్షల విలువైన బంగారు బాండ్లు కూడా ఉన్నాయి. అలాగే జాతీయ పొదుపు పథకాలు, పోస్టల్ సేవింగ్స్, ఇన్సూరెన్స్ పాలసీలలో రూ. 61.52 లక్షల విలువైన పెట్టుబడులు ఉన్నాయి. ఇక ఆయన దగ్గరున్న ఆభరణాల విలువ రూ.4.2 లక్షలు. రాహుల్ గాంధీ చరాస్తుల మొత్తం విలువ రూ.9.24 కోట్లు కాగా, స్థిరాస్తుల మొత్తం విలువ దాదాపు రూ.11.14 కోట్లు. ఆయన నామినేషన్‌తోపాటు అందించిన వివరాల ప్రకారం ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.20 కోట్లకుపైగా ఉంది. అదే సమయంలో సుమారు రూ.49.7 లక్షల అప్పు కూడా ఉంది. -
‘తప్పయింది.. నన్ను క్షమించండి’, సుప్రీం కోర్టులో బాబా రాందేవ్
న్యూఢిల్లీ : ప్రముఖ యోగా గురు, పతంజలి ఆయర్వేద కో-ఫౌండర్ బాబా రాందేవ్, ఆ కంపెనీ సీఈఓ ఆచార్య బాలకృష్ణలను సుప్రీం కోర్టు మందలించింది. పతంజలిపై కేంద్రం సైతం ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు ఉందని ప్రశ్నించింది. బాబా రాందేవ్ గతంలో.. కోవిడ్-19 వ్యాక్సిన్ వేసుకున్న కొందరు మరణిస్తున్నారు. అల్లోపతి వైద్య విధానం 100 శాతం పనిచేయలేదనడానికి ఇదే నిదర్శనమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత వైద్య సంఘం (ఐఎంఎ) గత ఏడాది సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై అత్యున్నత న్యాయ స్థానం పలు మార్లు విచారణ చేపట్టింది. అఫిడవిట్ దాఖలు చేయాలంటూ చివరిసారి ఫిబ్రవరిలో జరిపిన విచారణలో భాగంగా పతంజలి తప్పుడు ప్రకటనలు ఇవ్వొద్దని ఆదేశించింది. నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఒక్కో ఉత్పత్తిపై రూ.కోటి జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరించింది. మెడికల్ యాడ్స్ కేసులో కొత్త అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. కోర్టు ధిక్కరణ తగదు తాజాగా, అఫిడవిట్ దాఖలు చేయడంతో పాటు బాబా రామ్ దేవ్, ఆచార్య బాలకృష్ణలు స్వయంగా సుప్రీం కోర్టుకు హాజరయ్యారు. విచారణ సమయంలో సుప్రీం కోర్టు జస్టిస్ హిమ కోహ్లీ, జస్టీస్ అహ్సానుద్దీన్ అమానుల్లా ధర్మాసనం మరోసారి బాబారామ్ దేవ్, ఆచార్య బాలకృష్ణలు న్యాయాస్థానాన్ని ధిక్కరించేలా వ్యవహరిస్తున్నారని తెలిపింది. అంతేకాదు ఆధునిక వైద్యం కోవిడ్-19 వైరస్‌లను నయం చేయలేవన్న బాబా రామ్ దేవ్ వ్యాఖ్యలపై కేంద్రం కళ్లు మూసుకుని కూర్చుందని వ్యాఖ్యానించింది. అఫిడవిట్ ‘అవాస్తవం’,‘మోసం’ గత నెలలో యాడ్స్‌కు బేషరతుగా క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేసినందుకు రాందేవ్, బాలకృష్ణపై కోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అఫిడవిట్‌ను ‘అవాస్తవం’,‘మోసం’గా అభివర్ణించింది. అంతేకాదు, పతంజలి గత ఏడాది తప్పుదోవ పట్టించేలా యాడ్స్ ఇవ్వడంపై స్పందించింది. తాము (కోర్టు) ఇచ్చిన ఆదేశాల గురించి పతంజలి మీడియా యూనిట్(pmpl) కు తెలియదన్న వాదన తోసిపుచ్చింది. #WATCH | Yog Guru Ramdev leaves from Supreme Court. He appeared before the court in the misleading advertisement case filed against the Patanjali Ayurveda. He tendered an unconditional apology before the Supreme Court for violating the apex court's order for misleading… pic.twitter.com/y9oz8vl1IL — ANI (@ANI) April 2, 2024 నన్ను క్షమించండి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పతంజలి ఆయుర్వేద్ తరపు న్యాయవాది, బాబా రాందేవ్‌లు అత్యున్నత న్యాయస్థానాన్ని క్షమాపణలు కోరారు. క్షమాపణలతో దేశవ్యాప్తంగా ఉన్న కోర్టులు జారీ చేసే ప్రతి ఉత్తర్వును గౌరవించాలి. కోర్టు ఆదేశాల్ని బేఖాతరు చేశారు. ఇది ధిక్కారమే అవుతుందని అని జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం పేర్కొంది. మీకిదే చివరి అవకాశం బాబా రాందేవ్, బాలకృష్ణలకు చివరి అవకాశంగా ఒక వారంలో సరైన పద్ధతిలో అఫిడవిట్లను దాఖలు చేయాలి. ఏప్రిల్ 10న కోర్టు విచారణకు మీరిద్దరూ తప్పనిసరిగా హాజరు కావాలి అంటూ సుప్రీం కోర్టు జస్టిస్ హిమ కోహ్లీ, జస్టీస్ అహ్సానుద్దీన్ అమానుల్లా ధర్మాసనం అనుమతి ఇచ్చింది. -
నాలుగు సార్లు ఎమ్మెల్యే, మాజీ ఆర్ధిక మంత్రి.. ఆయన ఆస్తులెంతో తెలుసా?
తిరువనంతపురం: ఎన్నికల నేపథ్యంలో కేరళ మాజీ ఆర్ధిక శాఖ మంత్రిగా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన ఎల్డిఎఫ్ నేత, పతనంతిట్ట అభ్యర్థి డా. థామస్ ఐజాక్ వార్తల్లో నిలిచారు. అప్పుడప్పుడు అమెరికా పర్యటనలు, డిజైనర్ కుర్తాలంటే ఇష్టపడే థామస్ ఐజాక్ సాధారణ జీవనశైలితో తోటి నేతలకు ఆదర్శ ప్రాయంగా నిలుస్తున్నారు. నిబద్ధత కలిగిన కమ్యూనిస్ట్ నేతగా పేరొందిన థామస్ ఐజాక్ అఫిడవిట్‌ను సమర్పించారు. ఐజాక్ పేరిట రూ. 9.6 లక్షల విలువైన 20,000 పుస్తకాలు తప్ప మరే ఆస్తి లేదని తెలుస్తోంది. అద్దె ఇంట్లోనే బ్యాంక్ సేవింగ్స్‌లో రూ.6,000, సహా వివిధ బ్యాంక్ అకౌంట్లలో రూ.1.31 లక్షల డిపాజిట్లు ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న నేత అయినప్పటికీ ఐజాక్ తిరువనంతపురంలో తన సోదరుడి ఇంట్లో అద్దెకి నివసిస్తున్నారు. 10వేల విలువ చేసే షేర్లు పెన్షనర్ల ట్రెజరీ ఖాతాలో రూ.68,000, ఎస్బీఐ సేవింగ్స్ ఖాతాలో రూ.39,000, కేఎస్ఎఫ్ఈ సుగమా ఖాతాలో రూ.36,000 ఉన్నాయి. అంతేకాకుండా, అతను కేఎస్ఎఫ్ఈలో చిట్ ఫండ్‌ను వివిధ వాయిదాలలో మొత్తంగా రూ.77వేలు చెల్లించారు. అదనంగా, మలయాళం కమ్యూనికేషన్స్‌లో రూ.10వేలు విలువ చేసే షేర్లు మాత్రమే ఆయన పేరు ఉండటం గమనార్హం. -
భార్య కన్నా గడ్కరీ ఆదాయం తక్కువ.. భూములు కూడా లేవు!
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరుపున ఎన్నికల బరిలోకి దిగిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్లో ఆయన తన ఆస్తిపాస్తుల వివరాలు తెలియజేశారు. ఆదాయం విషయంలో నితిన్ గడ్కరీ తన భార్య కంచన్ నితిన్ గడ్కరీ కంటే చాలా వెనుకబడివున్నారు. అఫిడవిట్‌లోని వివరాల ప్రకారం నితిన్ గడ్కరీ 2022-23లో రూ. 13,84,550 ఆదాయం సంపాదించారు. ఆయన భార్య కంచన్కు 2022-23లో రూ.40,62,140 ఆదాయం అందుకున్నారు. నితిన్ గడ్కరీ ఆస్తుల విలువ రూ. ఒక కోటీ 32 లక్షల 90 వేల 605. ఆయన భార్య కంచన్ ఆస్తుల విలువ రూ. ఒక కోటీ 24 లక్షల 86 వేల 441. నితిన్ గడ్కరీ కుటుంబానికి రూ.95,46,275 విలువైన చరాస్తులు ఉన్నాయి. గడ్కరీ పేరు మీద మూడు కార్లు ఉన్నాయి. వీటిలో అంబాసిడర్ కారు ఒకటి. 1994లో కొనుగోలు చేసిన ఈ కారు ధర రూ.10 వేలు. గడ్కరీ దగ్గర హోండా కంపెనీకి చెందిన కారు ఉంది. దీని ధర 6,75,000. గడ్కరీకి ఎల్సుజు కంపెనీకి చెందిన మరో కారు ఉంది. దాని విలువ రూ.12,55,000. నితిన్ గడ్కరీ భార్య కంచన్ పేరు మీద మూడు కార్లు ఉన్నాయి. అవి రూ.5,25,000 విలువైన ఇన్నోవా, రూ.4,10,000 విలువైన మహీంద్రా కంపెనీ కారు, రూ.7,19,843 విలువైన టాటా కంపెనీ కారు. బంగారం, ఆభరణాల విషయంలో భార్య కంచన్ కంటే నితిన్ గడ్కరీ ముందున్నాడు. నితిన్ గడ్కరీ వద్ద రూ.31,88,409 విలువైన బంగారం లేదా ఆభరణాలు ఉన్నాయి. అదే సమయంలో కంచన్ వద్ద రూ.24,13,348 విలువైన ఆభరణాలు ఉన్నాయి. స్థిరాస్తుల విషయానికొస్తే నితిన్ గడ్కరీ పేరు మీద వ్యవసాయ భూమి లేదు. ముంబైలో అతని పేరు మీద ఓ ఇల్లు ఉంది. 960 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటి ధర రూ.4.95 కోట్లు. కంచన్కు ఇల్లు, భూమి ఉన్నాయి. వీటి ధర రూ.7 కోట్ల 99 లక్షల 83 వేలు. నితిన్ గడ్కరీ కుటుంబానికి రూ.11 కోట్ల 55 లక్షల 11 వేల విలువైన స్థిరాస్తి ఉంది. నితిన్ గడ్కరీకి రూ. ఒక కోటీ 66 లక్షల 82 వేల 750 రుణం, ఆయన భార్య కంచన్కు రూ.38 లక్షల 8 వేల 390 రుణం ఉంది. -
SBI: మొత్తం 22,217 ఎన్నికల బాండ్లు జారీ
ఢిల్లీ: ఎన్నికల బాండ్ల కేసులో సుప్రీం కోర్టు ఆగ్రహానికి గురైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఎట్టకేలకు ఆ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. మంగళవారం సాయంత్రమే కోర్టు ఆదేశాల మేరకు వివరాలు ఇవ్వగా.. ఇవాళ సమ్మతి అఫిడవిట్(compliance affidavit) సమర్పించింది. అందులో.. ఈసీకి ఇచ్చిన పెన్ డ్రైవ్ వివరాలను అఫిడవిట్లో ప్రస్తావించింది. పెన్‌డ్రైవ్‌లో రెండు పీడీఎఫ్ ఫైల్స్ ఉన్నాయని.. వాటికి పాస్వర్డ్ ఉన్నాయని పేర్కొంది. అలాగే.. ఏప్రిల్ 2019 నుంచి.. ఈ ఏడాది 2024 ఫిబ్రవరి 15వ తేదీ దాకా(అంటే.. ఎన్నికల బాండ్లు చెల్లవని కోర్టు తీర్పు ఇచ్చేదాకా ) మొత్తం 22, 217 ఎన్నికల బాండ్లను జారీ చేసినట్లు ఎస్బీఐ పేర్కొంది. ఈ మొత్తంలో రాజకీయ పార్టీలు 22, 030 బాండ్లను తీసుకున్నాయని తెలిపింది. అలాగే.. మిగిలిన 187 తాలుకా బాండ్ల నగదు ప్రధాని రిలీఫ్ ఫండ్‌కు జమ అయినట్లు ఎస్బీఐ పేర్కొంది. ఎన్నికల బాండ్ల పథకం కింద.. దాతలు తమ ఇష్టపూర్వకంగా విరాళాలను ఎస్బీఐ నుంచి ఎన్నికల బాండ్ల రూపేణా కొనుగోలు చేసి ఆయా పార్టీలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ.. 15 రోజుల్లో గనుక పార్టీలు ఆ బాండ్లను స్వీకరించకపోతే ఆ డబ్బు ప్రధాని రిలీఫ్ ఫండ్‌కు వెళ్తుంది. కానీ, ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ రద్దు చేస్తూ ఫిబ్రవరి 15వ తేదీన సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇదీ చదవండి: 26 రోజులేం చేశారు?.. ఎస్బీఐపై సుప్రీం కన్నెర్ర -
సోనియా గాంధీ ఆస్తుల విలువెంతో తెలుసా?
ఢిల్లీ: ఏడు సార్లు లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఈ సారి రాజ్యసభకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. రాయ్‌బరేలీ సీటును వదులుకొని రాజస్థాన్ నుంచి పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు. తన ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలను ఆమె ప్రకటించారు. ప్రస్తుతం తన వద్ద రూ. 90,000 నగదు ఉందని, తన మొత్తం ఆస్తుల విలువ రూ. 12,53,76,822 (రూ.12.53 కోట్లు)గా పేర్కొన్నారు తనకు రూ.12.53 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఇటలీలో తన తండ్రికి చెందిన రూ.27 లక్షల విలువైన ఆస్తిలో వాటా ఉందని, వీటితో పాటు 88 కిలోల వెండి, 1,267 గ్రాముల బంగారం, ఆభరణాలు ఉన్నట్లు సోనియా తెలిపారు. ఢిల్లీలోని డేరా మండి గ్రామంలో మూడు బిగాల వ్యవసాయ భూమి ఉందని, ఎంపీగా వచ్చే వేతనం, రాయల్టీ ఆదాయం, మూలధన లాభాలను ఆదాయంగా ఆమె పేర్కొన్నారు. తన వద్ద రూ.90 వేల నగదు ఉందని తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో ఆమె తన ఎన్నికల అఫిడవిట్లో తనకు మొత్తం రూ. 11.82 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని వెల్లడించారు. తనకు వ్యక్తిగతంగా సొంత కారు కూడా లేదన్న సోనియా.. సోషల్ మీడియాలో తనకు ఖాతా లేదని తెలిపారు. ఇదీ చదవండి: ప్రియాంక గాంధీకి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక