
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికను ప్రభుత్వం, ప్రతిపక్షాలు సవాలుగా తీసుకుంటుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికలో విజయం సాధించేందుకు ఎంత డబ్బు అయినా ఖర్చ పెట్టి తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని ఆయాపార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు రూ.వందల కోట్లు ఖర్చుపెట్టిన ఎన్నికగా హుజూరాబాద్ చరిత్ర తిరగరాయనుందనే ప్రచారం కూడా జరుగుతోంది.
(చదవండి: అంతర్జాతీయ మారథాన్‌లలో వరంగల్ ‘జ్యోతి’ )
అధికార, ప్రతిపక్షపార్టీలు ఖర్చుకు వెనుకాడకుండా ముందడుగు వేస్తున్నాయి. ప్రధానపార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఈటల దంపతులు అత్యధిక ధనవంతులుగా గుర్తింపు పొందారు. ఉపఎన్నిక నామినేషన్‌లో ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం మొదటి స్థానంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సతీమణి జమున ఉండగా, ఆ తర్వాత స్థానంలో రాజేందరే ఉన్నారు. తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్, చివరిస్థానంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ నిలిచారు.
అయితే, ప్రతి ఎన్నికలో ఈటల జమున సెంటిమెంట్ కోసం తన భర్త రాజేందర్ కంటే ముందు నామినేషన్ వేస్తుంటారు. రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా పోటీలో నిలుస్తుండటంతో జమున నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకోనున్నారు. జమున నామినేషన్ విత్‌డ్రా చేసుకుంటే ఈటల రాజేందర్ రూ.16.12 కోట్ల ఆస్తులతో హుజురాబాద్ నియోజకవర్గంలో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో అత్యంత ధనవంతుడిగా నిలువనున్నారు. ధన ప్రవాహంతో జరగనున్న ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ఈ నెల 30 తర్వాత తేలనుంది.
(చదవండి: వారి వయసంతా 25 లోపే.. అన్నీ హైస్పీడ్ స్పోర్ట్స్ బైక్‌లే)
Comments
Please login to add a commentAdd a comment