వారణాసి: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి మంగళవారం(మే14) నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన ఆస్తుల వివరాలను ఎన్నికల కమిషన్‌కు అఫిడవిట్‌లో సమర్పించారు. తనకు సొంత ఇల్లు, కారు లేదని మోదీ అఫిడవిట్‌లో తెలిపారు. మొత్తం ఆస్తుల విలువ రూ.3.02 కోట్లని వెల్లడించారు.
తన ఆస్తిలో రూ.2.86 కోట్లు స్టేట్ బ్యాంక్ ఫ్ ఇండియా(ఎస్బీఐ)లో ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా ఉన్నాయని తెలిపారు. సేవింగ్స్ ఖాతాలో రూ.80,304, తన చేతిలో రూ. 52,920 నగదు ఉందని పేర్కొన్నారు. ఇవి కాకుండా రూ.2.68 లక్షల విలువైన నాలుగు బంగారు ఉంగరాలున్నట్లు తెలిపారు.
2018-19లో రూ.11.14 లక్షలుగా ఉన్నవార్షిక ఆదాయం 2022-23లో రూ.23.56లక్షలకు పెరిగినట్లు తెలిపారు. 1978లో ఢిల్లీ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, 1983లో గుజరాత్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసినట్లు అఫిడవిట్‌లో తెలిపారు. జూన్1న తుది దశలో భాగంగా వారణాసిలో పోలింగ్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment