స్థానిక ఎన్నికలపై సుప్రీంలో అఫిడవిట్ | election commission files affidavit in supreme court over local body elections | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికలపై సుప్రీంలో అఫిడవిట్

Published Fri, Mar 14 2014 11:34 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

స్థానిక ఎన్నికలపై సుప్రీంలో అఫిడవిట్ - Sakshi

స్థానిక ఎన్నికలపై సుప్రీంలో అఫిడవిట్

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను రెండు విడతలలో నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఏప్రిల్‌ 6, 8 తేదీల్లో ఎన్నికలు నిర్వహిస్తామని, ఏప్రిల్‌ 11న ఫలితాలు వెల్లడిస్తామని సర్వోన్నత న్యాయస్థానానికి ఎన్నికల సంఘం తెలిపింది.

అయితే.. సార్వత్రిక ఎన్నికలపై వీటి ప్రభావం ఉండే అవకాశం ఉంది కాబట్టి, ఫలితాలను వాయిదా వేయాలని వివిధ పార్టీలు కోరినట్లు కూడా తన అఫిడవిట్లో ఎన్నికల సంఘం వివరించింది. దీంతో ఈ మొత్తం అంశంపై సుప్రీంకోర్టు విచారణ చేయనుంది. సుప్రీం తీర్పు ఆధారంగా ఎన్నికల సంఘం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement