local elections
-
లోకల్ ఫైట్ కు సర్వం సిద్ధం
-
మళ్లీ స్థానిక ఎన్నికలపై చర్చ
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలపై మళ్లీ రాజకీయ చర్చ మొదలైంది. త్వరలోనే ఎన్నికలు ఉంటాయంటూ కాంగ్రెస్ పీఏసీ భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి తాజాగా కామెంట్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఇప్పటికే స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్ కోసం ఎదురుచూస్తోంది. వాస్తవానికి సంక్రాంతి పండుగ నాటికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి, 15, 20 రోజుల్లోనే మొదట జీపీ, ఆ తర్వాత మండల ఎన్నికలు నిర్వహిస్తారనే ఊహాగానాలు గతంలోనే వచ్చాయి. తాజాగా ఈ నెలాఖరులోగా రైతు భరోసా, ఇందిరమ్మ రైతు కూలీ భరోసా చెల్లింపు మొదలుపెట్టాక, ఎన్నికల షెడ్యూల్ ఇస్తే మంచిదనే సూచనలు అధికారపార్టీకి అందినట్టు తెలుస్తోంది.ఫిబ్రవరి మొదటివారంలోగా నోటిఫికేషన్ ఇచ్చి రెండువారాల్లో ఒక ఎన్నిక, మరో వారం, పదిరోజుల గడువు ఇచ్చి మరో ఎన్నిక పూర్తి చేస్తే అన్నివిధాలా బావుంటుందనే అభిప్రాయం అధికారవర్గాల్లో వినిపిస్తోంది. మార్చి నెలలో ఇంటర్, టెన్త్ పరీక్షలు ఉన్నందున అంతకు ముందే ఎన్నికలు జరిపితే మంచిదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఫిబ్రవరిలోనే మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు కూడా జరగాల్సి ఉన్నందున, పనిలో పనిగా స్థానిక ఎన్నికలు కూడా నిర్వహిస్తే మంచిదని భావిస్తున్నారు. ముందుగా పంచాయతీల ఎన్నికలు, ఆ తర్వాత మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఫిబ్రవరిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ఆయా శాఖలకు సంబంధించి బడ్జెట్ నిధుల వ్యయం పూర్తిచేయాల్సి ఉన్నందున, వేసవి ముగిశాక లేదా మేలో ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశం కూడా లేకపోలేదని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై.... కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచి్చన హామీ మేరకు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంపుదలపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే రాష్ట్రవ్యాప్తంగా కులగణన సర్వే పూర్తయ్యింది. దీనికి సంబంధించిన నివేదికను ఇంకా ప్రభుత్వం విడుదల చేయలేదు. ఆయా అంశాలపై పరిశీలన చేపట్టిన డెడికేటెడ్ కమిషన్ బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే దానిపై ఇంకా నివేదికను సమర్పించలేదు. దీనిని పరిశీలించాక ఎంతశాతం బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసి ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీకి పంపించనుంది. ఈ ఉత్తర్వులు అందిన వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసి ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తుంది. -
బీసీ రిజర్వేషన్లు పెంచాకే ‘స్థానిక’ ఎన్నికలు జరపాలి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచని పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికలను జరగనివ్వబోమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీని అమలు చేయకుంటే ఉద్యమిస్తామన్నారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్‌తో జనవరి 3న ఇందిరాపార్కు వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కవిత ప్రకటించారు. 40కి పైగా బీసీ సంఘాల నాయకులతో శుక్రవారం కవిత తన నివాసంలో భేటీ అయ్యారు.బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు, కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై ఆమె బీసీ సంఘాల నాయకులతో చర్చించారు. అనంతరం సమావేశంలో చర్చించిన అంశాలను మీడియాతో పంచుకున్నారు. ‘స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపు అంశంపై స్పష్టత ఇవ్వడం లేదు’అని కవిత పేర్కొన్నారు.జనవరి 3న సినిమా చూపిస్తాం ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్‌తో మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు జరుపుతాం. బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక సమర్పణ, బీసీల జనాభా సంఖ్యను వెల్లడించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. బీసీల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అనేక పథకాల అమలును కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. మొత్తంగా బీసీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ప్రశ్నిస్తూ, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్‌తో జనవరి 3న జరిపే సభ ద్వారా ప్రభుత్వానికి సినిమా చూపిస్తాం’అని కవిత ప్రకటించారు. -
ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల సమరం
-
‘పంచాయతీ’ రిజర్వేషన్లు మారుతాయి
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు మారుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీలకు స్పష్టం చేసింది. వాస్తవానికి రెండు టర్మ్‌ల వరకు రిజర్వేషన్లు మారకుండా గత ప్రభుత్వం చట్టం చేసిన విష యం తెలిసిందే. అయితే కొత్త ఓటర్ల జాబితాలకు అనుగుణంగా మళ్లీ రిజర్వేషన్లు మారుతాయని, సామాజికవర్గాల రిజర్వేషన్లు మాత్రం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. 50 శాతం మించరాదనే విషయంలో స్పష్టత ఉందని చెప్పింది. అయితే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారు అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది అని, ప్రభుత్వపరంగా ఇచ్చే రిజర్వేషన్లను తాము అమలు చేయాల్సి ఉంటుందని తెలిపింది. క్షేత్రస్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా దామాషాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలన్న ట్రిపుల్ టెస్ట్ పేరిట సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్ల మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పింది. శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాల యంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధు లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా పార్థ సారథి మాట్లాడుతూ రాష్ట్రంలోని 12,966 గ్రామ పంచాయతీలు, వాటి పరిధిలోని 1,14,620 వార్డుల్లో ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగా ఎలాంటి మార్పులు లేకుండా గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాను వార్డుల వారీగా తయారు చేసి సెప్టెంబర్ 6న ముసాయిదా జాబితాను గ్రామపంచాయతీల్లో ప్రకటిస్తారని వెల్లడించారు. 7వ తేదీ నుంచి 13 వరకు ముసా యిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించి, 19వతేదీ లోగా జిల్లా పంచాయతీ అధికారి పరిష్కరించి.. 21న గ్రామ పంచాయతీ తుది ఓటర్ల జాబితాను వార్డుల వారీగా ప్రకటిస్తారని తెలిపారు. ఓటర్ల జాబితా ప్రచురణకు ఇచ్చిన ప్రకటనలో పేర్కొన్న విధంగా 9న జిల్లా స్థాయిలో, 10న మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఓటరు ముసాయిదాలో లోపాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తారని చెప్పారు.కిలోమీటర్ పరిధిలోనే పోలింగ్ కేంద్రాలు ఉండాలి : పార్టీల ప్రతినిధులు పోలింగ్స్టేషన్లు ఒక కిలోమీటర్ పరిధిలో ఉండేలా చూడాలని, ఓటర్ల జాబితాను గ్రామపంచాయతీలోని వార్డులుగా విభజించేటప్పుడు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు ఒకే వార్డులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు సూచించారు. అనుబంధ ఓటర్ల జాబితాలోని ఓటర్లను సంబంధిత వార్డుకు మాత్రమే అనుసంధానిస్తామని, కానీ చివరివార్డుకు కాదని కమిషనర్ తెలిపారు. గ్రామ, మండల స్థాయిలోని ప్రజాప్రతినిధులు ఓటర్లకు తగిన సూచనలు, సలహాలు చేసి వారితో అభ్యంతరాలు క్లెయిమ్ చేయించి.. వారిని ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా అవగాహన కల్పించాలని కోరారు.రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్ రాజకీయపార్టీ ప్రతినిధుల సందేహాలపై వివరణ ఇచ్చారు. ఈ సమావేశంలో గోపిశెట్టి నిరంజన్, పి.రాజేశ్‌కుమార్(కాంగ్రెస్), భరత్‌కుమార్ గుప్తా, పి.శశిధర్‌రెడ్డి, దుదిమెట్ల బాలరాజ్యాదవ్ (బీఆర్ఎస్) చింతల రామచంద్రారెడ్డి, రామారావు (బీజేపీ), పల్లా వెంకటరెడ్డి, ఎన్.బాలమల్లేష్ (సీపీఐ), ఎన్.నర్సింహారెడ్డి, నర్సింగరావు (సీపీఎం) బండ సురేందర్‌రెడ్డి (ఏఐఎఫ్బీ), ఇతర పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
Indonesia election 2024: ఒకే రోజు... ఐదు ఎన్నికలు
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన ఇండోనేసియాలో పార్లమెంట్, స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. దేశ జనాభా 27 కోట్లు కాగా, 20 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 17 ఏళ్లు నిండినవారంతా ఓటు వేయడానికి అర్హులే. ఈ నెల 14వ తేదీన జరిగే ఎన్నికల్లో విజయం కోసం ప్రధానంగా మూడు పారీ్టలు హోరీహోరీగా తలపడుతున్నాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడితోపాటు నేషనల్, ప్రావిన్షియల్, రీజినల్, రిజెన్సీ, సిటీ స్థాయిల్లో ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. మొత్తం ఐదు బ్యాలెట్ పేపర్లపై ఓటు వేయాల్సి ఉంటుంది. జాతీయ, స్థానిక ఎన్నికలు ఒకే రోజు జరగడం ఇండోనేసియా ప్రత్యేకత. అయితే, ఈ ఎన్నికల్లో ఓటు వేయడం తప్పనిసరి కాదు. అయినా ప్రజలు ఉత్సాహంగా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు. 2019లో జరిగిన ఎన్నికల్లో 81 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. దేశంలో 575 పార్లమెంట్ స్థానాలు ఉండగా, 18 జాతీయ పారీ్టలు ఎన్నికల బరిలో నిలిచాయి. వివిధ స్థాయిలో మొత్తం 20,616 పదవులకు 2,58,602 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అధ్యక్షుడి పదవీ కాలం ఐదేళ్లు. అమెరికా అధ్యక్షుడి తరహాలో రెండుసార్లు మాత్రమే పదవిలో కొనసాగడానికి అర్హత ఉంటుంది. ప్రస్తుత అధ్యక్షుడు జొకో విడొడో(జొకోవి) వరుసగా రెండుసార్లు గెలిచారు. పదేళ్లపాటు పదవిలో కొనసాగారు. ఆయన రెండు టర్మ్‌లు పూర్తయ్యాయి. కాబట్టి పది సంవత్సరాల తర్వాత ఈసారి మార్పు తప్పనిసరి కాబోతోంది. మొత్తం జనాభాలో 90 శాతం మంది ముస్లింలే ఉన్న ఇండోనేíÙయాలో పోలీసులకు, సైనికులకు ఎన్నికల్లో ఓటు వేసే హక్కు లేదు. 40 కొత్త నగరాలు నిర్మిస్తాం అనీస్ బాస్వెదాన్ జకార్తా మాజీ గవర్నర్, విద్యావేత్తగా పేరుగాంచిన అనీస్ బాస్వెదాన్(54) స్వతంత్ర, ప్రతిపక్ష అభ్యరి్థగా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. ఆయన అమెరికాలో విద్యాభ్యాసం చేశారు. స్వదేశంలో తొలుత విద్యారంగంలోకి, తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. విద్యాశాఖ మంత్రిగానూ వ్యవహరించారు. ఇక అనీస్ సహచరుడిగా ఉపాధ్యక్ష పదవికి నేషనల్ అవేకెనింగ్ పార్టీ నేత, పీపుల్స్ రిప్రిజెంటేటివ్ కౌన్సిల్ డిప్యూటీ స్పీకర్ ముహైమిన్ ఇస్కాందర్(57) బరిలో ఉన్నారు. వీరికి మరో రెండు పార్టీలు మద్దతిస్తున్నాయి. ఎన్నికల్లో తమను గెలిపిస్తే దేశవ్యాప్తంగా 40 కొత్త నగరాలు నిర్మిస్తామని అనీస్ బాస్వెదాన్, ఇస్కాందర్ హామీ ఇస్తున్నారు. యువత కోసం కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామని చెబుతున్నారు. సుబియాంటోకు విజయావకాశాలు! ఇండోనేసియా ఎన్నికల్లో అధ్యక్ష పదవిపై ప్రధానంగా ముగ్గురు నేతలు కన్నేశారు. ఇండోనేషియా జాతీయవాద పార్టీ అయిన గెరిండ్రా పార్టీ నుంచి మాజీ సైనికాధికారి ప్ర»ొవో సుబియాంటో(72) పోటీలో ఉన్నారు. ఇదే పార్టీ నుంచి ఉపాధ్యక్ష పదవికి జొకో విడొడో తనయుడైన 36 ఏళ్ల గిబ్రాన్ రాకాబుమింగ్ రాకా బరిలో నిలిచారు. 2014, 2019 ఎన్నికల్లో అధ్యక్ష పదవికి సుబియాంటో పోటీపడ్డారు. రెండుసార్లు ఓటమి పాలయ్యారు. మూడోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. జొకోవి ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా పనిచేసిన సుబియాంటోపై పలు తీవ్ర అభియోగాలు ఉన్నాయి. 1990వ దశకంలో సైనికాధికారిగా పని చేస్తున్న సమయంలో 20 మందికిపైగా ప్రజాస్వామ్య ఉద్యమ కార్యకర్తలను కిడ్నాప్ చేయించినట్లు ప్రచారం జరిగింది. వారిలో 10 మందికిపైగా ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. సుబియాంటో ఈస్ట్ తిమోర్, పపువా న్యూ గినియా దేశాల్లో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారు. 1998లో సైన్యం నుంచి తప్పుకున్నారు. 2020 వరకు తమ దేశంలో ప్రవేశించకుండా ఆయనపై అమెరికా నిషేధం విధించింది. గిబ్రాన్ రాకాబుమింగ్ కూడా వివాదాస్పదుడే. ప్రస్తుతం సురకర్తా సిటీ మేయర్‌గా పనిచేస్తున్నాడు. తమను గెలిపిస్తే దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని, ప్రజల జీవనాన్ని మెరుగుపరుస్తామని సుబియాంటో, గిబ్రాన్ హామీ ఇస్తున్నారు. గెరిండ్రా పారీ్టకి ఇతర చిన్నాచితక పారీ్టలు మద్దతిస్తున్నాయి. ఇప్పుడు అంచనాలను బట్టి చూస్తే ప్ర»ొవో సుబియాంటో తదుపరి అధ్యక్షుడయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అధ్యక్ష బరిలో విద్యావేత్త ప్రనొవో మెగావతి సుకర్నోపుత్రి సారథ్యంలోని ఇండోనేషియన్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ స్ట్రగుల్ నుంచి అధ్యక్ష పదవికి గాంజార్ ప్రనొవో(55), ఉపాధ్యక్ష పదవికి మహ్ఫుద్ ఎండీ(66) పోటీలో ఉన్నారు. ప్రనొవో గతంలో సెంట్రల్ జావా గవర్నర్‌గా సేవలందించారు. మహ్ఫుద్ ఎండీకి గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ స్ట్రగుల్‌తో మరో మూడు పార్టీలు జట్టుకట్టాయి. ఇద్దరు అభ్యర్థులపై ఎలాంటి అరోపణలు, వివాదాలు లేకపోవడం కలిసివచ్చే అంశంగా భావిస్తున్నారు. సామాన్య ప్రజల సమస్యలు తమకు తెలుసని, అధికారం అప్పగిస్తే వారి సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తామని ప్రనొబో, మహ్ఫుద్ విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. ప్రజలకు సామాజిక సాయం పంపిణీ చేస్తామని, ఉద్యోగుల వేతనాలు పెంచుతామని అంటున్నారు. కీలక ప్రచారాంశాలు? ► ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో ఉన్నట్లుగానే ఇండోనేíÙయాలోనూ ఎన్నో సమస్యలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. ఆర్థిక వృద్ధి 2022లో 5.3 శాతం కాగా, 2023లో అది 5.05 శాతానికి పడిపోయింది. ► దేశంలో ప్రజల జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. కుటుంబాలను పోషించుకోవడం కష్టతరంగా మారింది. ► నిరుద్యోగ సమస్య వేధిస్తోంది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కరువైపోయాయి. ఉద్యోగులు, కారి్మకులకు వేతనాలు తగ్గిపోయాయి. మొత్తం ఓటర్లలో సగానికి పైగా ఓటర్లు 40 ఏళ్లలోపు యువతే ఉన్నారు. వారే నిర్ణయాత్మక శక్తిగా తీర్పు ఇవ్వబోతున్నారు. ► దేశంలో మానవ హక్కుల హననం, ప్రజాస్వామ్య వ్యవస్థ పతనమవుతుండడంపై యువత పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయన్న నమ్మకం తమకు లేదని చెబుతున్నారు. అక్రమాలకు తావు లేకుండా ఎన్నికలు సజావుగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘స్థానిక’ ఉపఎన్నికల్లో వైఎస్సార్సీపీ జయకేతనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పట్టణ, స్థానిక సంస్థల్లో గురువారం జరిగిన పలు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జయకేతనం ఎగురవేసింది. ఒక మండలాధ్యక్ష పదవికి, మూడు మండల ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు. మచిలీపట్నం నగరపాలక సంస్థలో రెండు డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నికలు జరిగాయి. అధికార వైఎస్సార్సీపీకి చెందిన మాడపాటి విజయలక్ష్మి (26వ వార్డు కార్పొరేటర్), సీలం భారతీనాగకుసుమ (మూడోవార్డు) ఈ పదవుల్ని గెల్చుకున్నారు. పెడన మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా వైఎస్సార్సీపీకి చెందిన కటకం నాగకుమారి (ఏడోవార్డు కౌన్సిలర్) గెలుపొందారు. మాచర్ల మున్సిపాలిటీలో వైస్ చైర్మన్‌గా మాచర్ల ఏసోబు (18వ వార్డు) ఎన్నికయ్యారు. ధర్మవరం మున్సిపాలిటీ వైస్ చైర్మన్లుగా వేముల జయరామిరెడ్డి (రెండోవార్డు), షేక్ షంసద్ బేగం (38వ వార్డు) గెలుపొందారు. 13 మండలాల్లో నాలుగు ఎంపీపీ, ఏడు మండల ఉపాధ్యక్ష, మూడు కో–ఆప్షన్ సభ్యుల పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వీటిలో రామకుప్పం (చిత్తూరు జిల్లా) మండలాధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు, విజయాపురం (చిత్తూరు), రాయదుర్గం (అనంతపురం) మండలాల ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు వాయిదాపడ్డాయి. తొండంగి (కాకినాడ), వత్సవాయి (ఎన్టీఆర్), చేజర్ల (నెల్లూరు) మండలాధ్యక్షులుగా, పెదకడబూరు (కర్నూలు), గాలివీడు (అన్నమయ్య), రాపూరు (నెల్లూరు), పార్వతీపురం (పార్వతీపురం మన్యం) మండల ఉపాధ్యక్షులుగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. చిత్తూరు (చిత్తూరు), రాజంపేట (అన్నమయ్య), బి.మఠం (వైఎస్సార్) మండలాల్లో కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తయింది. -
బెంగాల్ స్థానిక ఎన్నికల్లో టీఎంసీ ఆధిక్యం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ స్థానిక ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. మంగళవారం రాత్రి 11:30కి ప్రకటించిన ఫలితాల్లో 30,391 సీట్లను కైవసం చేసుకుంది. ఓట్ల లెక్కింపులో మరో 1,767 పంచాయతీ స్థానాల్లో ముందంజలో కొనసాగు తోంది. టీఎంసీ ప్రధాన ప్రత్యర్థి అయిన బీజేపీ 8,239 పంచాయతీ సీట్లను తన ఖాతాలో వేసుకుంది. మరో 447 సీట్లలో ముందంజలో ఉంది. లెఫ్ట్ ఫ్రంట్ 2,534 స్థానాల్లో విజయ బావుటా ఎగురవేసింది. కాంగ్రెస్ పార్టీ 2,158 సీట్లను సొంతం చేసుకుంది. సీపీఎంకు 2,409 సీట్లు లభించాయి. ఇతర పార్టీలు 725 సీట్లు దక్కించుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు 1,656 స్థానాలు సాధించడం విశేషం. రాష్ట్రంలో మొత్తం 63,229 గ్రామ పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక 9,728 పంచాయతీ సమితి స్థానాలకు ఎన్నికలు జరగ్గా, టీఎంసీ 2,155 స్థానాలను గెలుచుకుంది. 493 సీట్లలో లీడింగ్‌లో ఉంది. బీజేపీ 214 స్థానాలను గెలిచింది. 113 చోట్ల లీడింగ్‌లో ఉంది. 928 జిల్లా పరిషత్ సీట్లకు టీఎంసీ ఇప్పటివరకు 77 స్థానాల్లో విజయం సొంతం చేసుకుంది. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. బెంగాల్లో శనివారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో భారీగా హింస చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ హింసాకాండలో కనీసం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 11 మంది అధికార టీఎంసీకి చెందినవారే ఉన్నారు. -
19 పార్టీలకు ‘స్థానిక’ ఎన్నికల్లో రిజర్వు గుర్తులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికలకు మొత్తం 19 రాజకీయ పార్టీలకు గుర్తులు కేటాయిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల కొన్ని రాజకీయ పార్టీలను గుర్తింపు కలిగిన జాతీయ పార్టీల జాబితాల నుంచి తొలగించి, మరికొన్నింటిని చేర్చడంతోపాటు రాష్ట్రాల్లో గుర్తింపు కలిగిన జాబితాలో మార్పులు చేస్తూ నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. ఆ నోటిఫికేషన్‌కు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్.. గుర్తింపు కలిగిన జాతీయ, రాష్ట్ర పార్టీల వివరాలతో ఈ కొత్త నోటిఫికేషన్‌ను జారీచేసింది. రాష్ట్రంలో అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో సహా కేంద్ర ఎన్నికల సంఘం వద్ద జాతీయ పార్టీల గుర్తింపు ఉన్న ఆమ్ ఆద్మీ, బీఎస్సీ, బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు ఆయా పార్టీల ఎన్నికల గుర్తులు కలిగి ఉంటాయని ఆ నోటిఫికేషన్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి కె.ఆర్.బి.హెచ్.ఎన్.చక్రవర్తి పేర్కొన్నారు. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ సహా వివిధ రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన మరో 11 రాజకీయ పార్టీలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీలుగా గుర్తిస్తూ, కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఆయా రాజకీయ పార్టీల గుర్తులనే అవి కలిగి ఉంటాయని వివరించారు. నిబంధనల ప్రకారం.. గత అసెంబ్లీ ఎన్నికల్లో నిర్ణీత ఓట్ల శాతం గానీ, అసెంబ్లీలో సీట్ల సంఖ్యను గానీ పొందలేక, కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ప్రత్యేక గుర్తును కలిగి ఉండే రిజిస్టర్డ్ పార్టీ జాబితాలో స్థానాన్ని కూడా కోల్పోయిన జనసేన పార్టీకి రాష్ట్ర ఎన్నికల కమిషన్ మాత్రం రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ విత్ రిజర్వుడ్ సింబల్ (ప్రత్యేక గుర్తింపు కలిగి ఉండే రిజిస్టర్డ్ పార్టీగా) గుర్తిస్తున్నట్టు ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ప్రత్యేక గుర్తును కలిగి ఉండే రిజిస్టర్డ్ పార్టీ జాబితాలో లేని పార్టీలకు సైతం రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తుల కేటాయింపు నిబంధనలు 5 (ఏ) (బీ) ప్రకారం.. రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడైనా 15 ఎంపీటీసీ స్థానాలు లేదా మూడు జెడ్పీటీసీ స్థానాలు లేదా 15 మున్సిపల్ వార్డు స్థానాలు లేదా 15 నగర కార్పొరేషన్ వార్డులు గెల్చుకున్న పార్టీలకు ప్రత్యేక ఎన్నికల గుర్తు కలిగి ఉండే రిజిస్టర్డ్ పార్టీగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తిస్తుందని తెలిపారు. దీనికి తోడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తుల కేటాయింపు నిబంధనలు 5 (ఏ) (బీ–1)ప్రకారం.. రాష్ట్ర అసెంబ్లీలో కనీస ఒక సభ్యుడు ఉన్న ప్రతి పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద ప్రత్యేక రిజర్వు సింబల్‌ను పొందే అర్హత ఉంటుందని పేర్కొన్నారు. ఇంకొక 94 రాజకీయ పార్టీలను కూడ రాష్ట్ర ఎన్నికల కమిషన్ రిజిస్టర్డ్ పార్టీలుగా గుర్తించినప్పటికీ, వాటికి మాత్రం ఎటువంటి రిజర్వు సింబల్ కేటాయించని పార్టీల జాబితాల్లో పేర్కొంది. -
యూకే ‘స్థానికం’లో అధికార పక్షానికి ఎదురుదెబ్బ
లండన్: యూకే స్థానిక ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ బాధ్యతలు చేపట్టాక జరిగిన మొదటి ఎన్నికలివి. ఇంగ్లండ్‌లోని 317 కౌన్నిళ్లకుగాను 230 కౌన్సిళ్లలోని 8 వేల సీట్లకు గురువారం ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు ప్రకటించిన ఫలితాల్లో అధికార పార్టీ 20కిపై కౌన్సిళ్లను కోల్పోయింది. ఎన్నికలు జరిగిన 8 వేల సీట్లలో లేబర్ పార్టీ 1,384, కన్జర్వేటివ్ పార్టీ 1,041, లిబరల్ డెమోక్రాట్లు 768 సీట్లను సాధించాయి. 20 ఏళ్లుగా అధికారపక్షానికి కంచుకోటగా ఉన్న మెడ్వే లాంటి కౌన్సిళ్లను సైతం లేబర్ పార్టీ, లిబరల్ డెమోక్రాట్లు కైవసం చేసుకున్నారు. మరికొద్ది నెలల్లో సాధారణ ఎన్నికలు జరగనుండగా వెలువడిన ఈ ఫలితాలపై ప్రధాని రిషి సునాక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. -
చరిత్ర సృష్టించిన చింతాదేవి.. డిప్యూటీ మేయర్‌గా..
ఒక సామాన్యురాలు అసామాన్య విజయం సాధిస్తే.. అది చరిత్ర సృష్టించినట్లే కదా!. పారిశుద్ధ్య కార్మికురాలు చింతాదేవి Chinta Devi ఆ జాబితాలోకి చేరిపోయారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఘన విజయం సాధించిన ఆమె.. ఇప్పుడు డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. బీహార్ గయలో తాజాగా ఈ పరిణామం చోటు చేసుకుంది. నలభై ఏళ్ల చరిత్ర ఉన్న గయ మున్సిపాలిటీలో చింతాదేవి విజయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పబ్లిక్ టాయిలెట్లు తక్కువగా ఉండే ఆ ప్రాంతంలో ఒకప్పుడు బహిరంగ మలవిసర్జన అధికంగా ఉండేది. చింతాదేవి అదంతా ఊడ్చి శుభ్రం చేసి, ఎత్తి దూరంగా తీసుకెళ్లి పారబోసే పనిని చేశారు. ఆ తర్వాత రోడ్లు ఊడవడం, డ్రైనేజీలు, మ్యాన్‌హోల్స్‌కు శుభ్రం చేస్తూ వస్తున్నారు. అలాంటి చింతాదేవి ఎన్నికల్లో పోటీ చేసి.. ఘన విజయం సాధించారు. ప్రజలకు నిత్యం చేరువగా ఉండడంతోనే తనకు ఈ విజయం దక్కి ఉంటుందని ఆమె భావిస్తున్నారు. బహుశా ప్రపంచంలో ఇలాంటి విజయం ఎవరూ సాధించి ఉండబోరని, ఇది చారిత్రక ఘట్టమని గయ నూతన మేయర్ గణేష్ పాశ్వాన్ ఆమెను ఆశీర్వదించారు. అంతేకాదు.. మాజీ డిప్యూటీ మేయర్ మోహన్ శ్రీవాస్తవ సైతం ఆమె అభ్యర్థిత్వాన్ని బలపర్చడం గమనార్హం. పారిశుద్ధ్య కార్మికురాలిగానే కాదు.. మిగతా టైంలో ఆమె కూరగాయలు అమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నారు. బుద్ధుడి జ్క్షానోదయ ప్రాంతంగా పేరున్న గయలో.. ఇలాంటి గెలుపు కొత్తేం కాదు. 1996 సార్వత్రిక ఎన్నికల్లో రాళ్లు కొట్టి జీవనం కొనసాగించే భగవతి దేవి ఏకంగా పార్లమెంట్‌కు ఎన్నికై చరిత్ర నెలకొల్పారు. అంటరాని కులంగా పేరున్న ముసహార్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. జేడీయూ పార్టీ తరపున పోటీ చేసి ఆమె నెగ్గారు. -
తైవాన్‌లో చైనా అనుకూల పార్టీ ప్రభంజనం!
తైపేయి: తైవాన్‌లో శనివారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికార పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. చైనా వ్యతిరేక నినాదం.. ప్రజల నుంచి ఓట్లు విదిలించలేకపోయింది. విశేషం ఏంటంటే.. చైనా నుంచి మద్ధతు ఉన్న ప్రతిపక్ష పార్టీ స్థానిక ఎన్నికల్లో సత్తా చాటింది. దీంతో తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(DPP)ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల్లో అధికార పార్టీ దారుణ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారామె. అయితే.. ఈ ఎన్నికల్లో చైనా అనుకూల పార్టీ ఘన విజయం సాధించింది. ‘‘ఎన్నికల ఫలితాలు మేం ఆశించినట్లు రాలేదు. తైవాన్ ప్రజల తీర్పును శిరసావహిస్తున్నాం. ఓటమికి అంతా నాదే బాధ్యత. డీపీపీ చైర్ఉమెన్ బాధ్యతల నుంచి ఇప్పటికిప్పుడే తప్పుకుంటున్నా’’ అని సాయ్ ఇంగ్-వెన్ మీడియాకు తెలియజేశారు. పార్టీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పుకునప్పటికీ 2024 వరకు ఆమె తైవాన్ అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. మేయర్లు, కౌంటీ చీఫ్‌లు, లోకల్ కౌన్సిలర్లు.. ఇలా జరిగింది స్థానిక సంస్థల ఎన్నికలే అయినా ఈ ఎలక్షన్స్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారామె. చైనా విధానాలకు, మిలిటరీ ఉద్రిక్తతల పట్ల తైవాన్ ప్రజల నుంచి ఏమేర వ్యతిరేకత ఉందో ప్రపంచానికి తెలియజేసేందుకు.. ఈ ఎన్నికలను ఉపయోగించుకోవాలని సాయ్ ఇంగ్-వెన్ భావించారు. కానీ, ఆ ప్రయత్నం బెడిసి కొట్టింది. చైనా వ్యతిరేకత ప్రచారం వర్కవుట్ కాలేదు. ఇక చైనా నుంచి పరోక్ష మద్దతు ఉన్న కోమింటాంగ్ (KMT)పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ప్రచార సమయంలో డీపీపీ చైనా వ్యతిరేక గళం వినిపించగా.. కేఎంటీ మాత్రం చైనాతో డీపీపీ ప్రభుత్వ వైరం శ్రుతి మించుతోందని, అది దేశానికి ప్రమాదకరమని ప్రచారం చేసింది. అయినప్పటికీ తాము చైనాకు కొమ్ము కాయబోమని.. తైవాన్ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాల కోసం సంప్రదింపులు జరుపుతామన్న ప్రచారంతో జనాల్లోకి దూసుకెళ్లింది. ఇక శనివారం వెలువడిన తైవాన్ స్థానిక ఎన్నికల ఫలితాల్లో.. 21 నగర మేయర్ స్థానాలకు గానూ పదమూడింటిని కైవసం చేసుకుంది కేఎంటీ. అందులో రాజధాని తైపేయి కూడా ఉంది. కౌంటీ చీఫ్ సీట్ల సంఖ్యను సైతం పెంచుకుంది. అయితే.. గత ఎన్నికల్లో మాదిరే ఈ దఫా ఎన్నికల్లోనూ సైతం డీపీపీ పెద్దగా ప్రభావం చూపించలేదు. 2018లో డీపీపీ కేవలం ఐదు స్థానాలే దక్కించుకోగా.. చైనాను ఎదుర్కొంటున్న పరిణామాలు జనాల నుంచి సానుకూల ఫలితాలు తెప్పిస్తాయని భావించింది. అయితే.. ఇప్పుడు ఈ ఎన్నికల్లోనూ ఐదు స్థానాలే కైవసం చేసుకుంది. అందులో పెద్దగా ప్రభావితం చూపని ప్రాంతాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ ఫలితంపై చైనా ఇంకా స్పందించలేదు. కానీ, జిన్హువా వార్తా సంస్థ మాత్రం తైవాన్ స్థానిక ఎన్నికల్లో పార్టీ పనితీరుకు బాధ్యత వహిస్తూ సాయ్ రాజీనామా చేశారంటూ ఓ కథనం ప్రచురించింది. ఇదిలాఉంటే.. కరోనా సమయంలో తైవాన్ పేరు ప్రపంచమంతా మారుమోగిపోయింది. అందరికంటే ముందే మేల్కొని లాక్డౌన్ విధించకుండా.. కేసుల ట్రేసింగ్‌పై దృష్టి సారించారు ఆమె. తద్వారా తైవాన్‌లో కరోనాను సమర్థవంతంగా కట్టడి చేయగలిగారు. ఈ ఘనతకు గానూ 2020 ఫోర్బ్స్ శక్తివంతమైన మహిళల జాబితాలో సాయ్ ఇంగ్-వెన్కి చోటు దక్కింది. ఇప్పటికీ తైవాన్ ప్రయాణాలకు కరోనా నెగెటివ్ ఫలితం.. అదీ ప్రయాణానికి మూడు రోజుల ముందు తీసుకున్న సర్టిఫికెట్‌ను ఎయిర్పోర్ట్ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: పుతిన్‌కి భంగపాటు.. అస్సలు ఊహించి ఉండడు! -
ఎంఐఎం తరపున గెలిచిన అరుణ
భోపాల్: ఎంఐఎం పార్టీ తరపున ఓ హిందూ అభ్యర్థి మధ్యప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందడం అక్కడి రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఊహించని రీతిలో ఓ మహిళా అభ్యర్థిని బరిలోకి దింపి గెలుపు అందుకుంది ఆ పార్టీ. స్వయానా మంత్రే దగ్గరుండి అక్కడి ప్రచార బాధ్యతలను చూసుకున్నా.. ఆమె గెలుపును ఆపలేకపోయారు. తన విజయానికి గానూ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. హామీలను నెరవేరుస్తానంటోంది అరుణ ఉపాధ్యాయ. మొట్టమొదటిసారి మధ్యప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది ఎంఐఎం. మొదటి ఫేజ్‌లో నాలుగు చోట్ల సంచలన విజయం సాధించింది. ఆయా చోట్ల బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించారు ఎంఐఎం అభ్యర్థులు. ఇప్పుడు రెండో ఫేజ్లోనూ ఏడు స్థానాల్లో పోటీ చేస్తే.. మూడు స్థానాలు కైవసం చేసుకుంది. అందులో ఖార్గావ్ మున్సిపల్ స్థానం విజయం ప్రత్యేకంగా నిలిచింది. ఈ మున్సిపాలిటీలో వార్డు నెంబర్ 2లో పోటీకి దిగింది గృహిణి అయిన అరుణ శ్యామ్ ఉపాధ్యాయ. ఆమె భర్త శ్యామ్ ఉపాధ్యాయ స్థానికంగా ఉద్యమవేత్త. రాజ్యాంగం, దళిత-వెనుకబడిన వర్గాల వాదనకు ఆకర్షితుడై ఎంఐఎంలో చేరాడు. తొలుత పార్టీ సీటును శ్యామ్‌కే కేటాయించాలనుకుంది. కానీ, అనూహ్యంగా స్థానికంగా మహిళలతో కలివిడిగా ఉండే అరుణకు బరిలోకి దించింది. కీలకమైన మున్సిపాలిటీ కావడంతో మధ్యప్రదేశ్ మంత్రి విశ్వాస్ సారంగ్ తన అనుచరులతో ప్రచారం చేయించినప్పటికీ.. అరుణనే గెలుపు అందుకుంది. #ArunaUpadhyaya Thanked #AIMIM President Barrister @asadowaisi after Winning Corporator Election on AIMIM Ticket from City of #Khargone for the First Time in #MadhyaPradesh, #AIMIM has Registered a Big Victory in Corporator Elections. pic.twitter.com/hRIjsP8eqk — Syed Mubeen (Tez Dhar) (@SyedZiya_Mubeen) July 21, 2022 -
మా వల్ల కాదు బాబోయ్.. 15వ తేదీలోపు ఎన్నికలు అసాధ్యం!
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మళ్లీ జాప్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరు నెలలు గడువు కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో శనివారం పిటిషన్ దాఖలు చేయడంతో ఈ వాదనకు మరింత బలం చేకూర్చుతోంది. నేపథ్యం ఇదీ.. రాష్ట్రంలో కొత్తగా ఆవిర్భవించిన విల్లుపురం, కళ్లకురిచ్చి, తిరునల్వేలి, తెన్కాశి, వేలూరు, రాణి పేట, తిరుపత్తూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లోని జిల్లా, యూనియన్, పట్టణ, గ్రామ పంచాయతీల అధ్యక్షులు, వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మిగిలిన జిల్లాల్లో ఈ ప్రక్రియ ముగిసింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15 కార్పొరేషన్లు, 120 మేరకు మునిసిపాలిటీలకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. కొత్త జిల్లాల్లోని స్థానిక సంస్థలు, రాష్ట్రంలోని నగర, మునిసిపాలిటీలకు సెపె్టంబరు 15లోపు ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: వీడని మిస్టరీ: అంతులేని ‘కొడనాడు’ కథ ఇందుకు తగ్గ పనులు రాష్ట్రంలో శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే వార్డుల విభజన ముగించి, ఓటర్ల జాబితా ప్రకటించారు. అలాగే, ఈనెల 6న కోయంబేడులోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో గుర్తింపు పొందిన పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సమావేశానికి సిద్ధమయ్యారు. ఈ పరిస్థితుల్లో సెపె్టంబరు 15లోపు ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని.. ఈ మేరకు మరో ఆరు నెలలు గడువు కోరుతు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ‘కొత్త’ తలనొప్పి.. ఎన్నికల ఏర్పాట్లు వేగంగా సాగుతున్న నేపథ్యంలో రెండు రోజుల క్రితం రాష్ట్రంలో 6 మేజర్ మునిసిపాలిటీల ను కార్పొరేషన్లుగాను, 30 మేజర్ పట్టణ పంచాయతీలకు మునిసిపాలిటీ హోదా కలి్పస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామాలతో రాష్ట్రంలో కార్పొరేషన్ల సంఖ్య 21గాను, మునిసిపాలిటీల సంఖ్య అదనంగాను పెరిగింది. దీంతో ఆయా సంస్థల్లో వార్డుల విభజనతో పాటుగా ఇతర అంశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం మళ్లీ దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చదవండి: కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కొత్త బ్రేక్.. 5 నిముషాల సమయం ఈ సమయంలో కోర్టు ఉత్తర్వుల మేరకు ఈనెల 15లోపు ఎన్నికలు నిర్వహించలేమంటూ ఎస్ఈసీ పిటిషన్లో పేర్కొంది. ఇది సోమవారం విచార ణకు వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ విషయాలపై నగరాభివృద్ధి శాఖ మంత్రి కేఎన్ నెహ్రు మీడియాతో మాట్లాడు తూ ఎన్నికల నిర్వహణలో జాప్యం అనివార్యం అని.. అన్ని సమస్యలను సకాలంలో పరిష్కరిస్తే డిసెంబర్ నాటికి ఈ ప్రక్రియను ముగించే అవకాశం ఉందన్నారు. -
వారంలో స్థానిక నగారా... సై అంటున్న పార్టీలు!
సాక్షి, చెన్నై: వారం రోజుల్లో స్థానిక నగారా మోగే అవకాశం కనిపిస్తోంది. దీంతో వివిధ పార్టీలు కసరత్తులు వేగవంతంగా చేస్తున్నాయి. ఇక, జిల్లాల నేతలతో సోమవారం టీఎన్‌సీసీ అధ్యక్షు డు కేఎస్ అళగిరి సమావేశమయ్యారు. తమిళనాడులో కొత్తగా ఆవిర్భవించిన తిరునల్వేలి, తెన్కాశి, విల్లుపురం, కళ్లకురిచ్చి, చెంగల్పట్టు, కాంచీపురం, వేలూరు, తిరుపత్తూరు, రాణి పేట జిల్లాల్లో స్థానిక నగారా వాయిదా పడి ఉన్న విషయం తెలిసిందే. వీటిలో సెప్టెంబరు చివరిలోపు ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. దీంతో రాష్ట్ర ఎన్నికల అధికారులు ఏర్పాట్లు వేగవంతం చేశారు. డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీలు ఈ జిల్లాల్లో పాగా వేయడమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టాయి. ఇక ఇప్పటికే ఆయా జిల్లాల నేతలతో సమావేశాలు నిర్వహించి, కార్యక్రమాలు విస్తృతం చేశాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర కాంగ్రెస్ సైతం ఎన్నికల పనుల మీద దృష్టి సారించింది. డీఎంకే కూటమిలోని కాంగ్రెస్ ఈ జిల్లాల్లో తమకు బలం అధికంగా ఉన్న స్థానిక సంస్థల మీద గురిపెట్టింది. మరోవైపు... సోమవారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఆయా జిల్లాల అధ్యక్షులు, ముఖ్యనేతల నుంచి వివరాల్ని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి రాబట్టారు. ఆ మేరకు డీఎంకే నుంచి ఆ స్థానిక సంస్థల్ని ఆశించే ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయ పక్షాల కసరత్తులు ఓ వైపు ఉంటే, మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పళనికుమార్ ఏర్పాట్లలో వేగం పెంచారు. కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో సమావేశాలు నిర్వహించి ఓటర్ల జాబితా సిద్ధం చేశారు. మరో రెండు రోజుల్లో దీన్ని విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ వర్గాలు వెల్లడించాయి. చదవండి: Tamil Nadu: మాట తప్పం..! గుబులు వద్దు.. -
రాయచోటి మున్సిపల్ చైర్మన్‌గా కూరగాయల వ్యాపారి
రాయచోటి: రాయచోటి మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన ఓ కూరగాయల వ్యాపారి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కష్టనష్టాలకు ఓర్చి మున్సిపల్ చైర్మన్‌గా అతడు ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకంగా మారింది. వివరాల్లోకి వెళితే.. రాయచోటికి చెందిన షేక్ బాష డిగ్రీ వరకు చదువుకున్నారు. ఉద్యోగం దొరక్కపోవటంతో గ్రామంలోనే కూరగాయలు అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్నారు. స్థానికంగా ప్రజల్లో మంచి పేరున్న షేక్ భాషకు వైఎస్సార్ సీపీ మున్సిపాలిటీ ఎన్నికలలో కౌన్సిలర్ టికెట్ ఇచ్చింది. దీంతో ప్రజలు షేక్ బాషను గెలిపించారు. గురువారం రాయచోటి మున్సిపాలిటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా షేక్ బాష సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తన జీవితంలో ఇలాంటి అవకాశం వస్తుందని ఊహించలేదన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వెనుకబడిన వర్గాల వారికి అధిక శాతం సీట్లు కేటాయించిందని పేర్కొన్నారు. ఈ మున్సిపాలిటీ, కార్పోరేషన్ ఎన్నికలలో వైఎస్సార్ సీపీ 86కు గాను, 84స్థానాలలో విజయకేతనం ఎగరవేసిందని అన్నారు. ఈ ఎన్నికలలో మహిళలకు 60.47 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ ,వెనుకబడిన వర్గాల వారికి 78 శాతం పోస్టులను కేటాయించడం గొప్ప విషయమని కొనియాడారు. చదవండి: ఏపీ: కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు వీరే.. -
ఒకే అభ్యర్థి బరిలో ఉన్నా ‘ఏకగ్రీవం’ వద్దు
సాక్షి, అమరావతి: స్థానిక ఎన్నికలతోపాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఒకే అభ్యర్థి బరిలో ఉన్నచోట ఆ వ్యక్తి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించకుండా, నోటా కింద ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఒకే అభ్యర్థి బరిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తూ ఫారం 10 జారీచేయాలని చెబుతున్న ఏపీ పంచాయతీ ఎన్నికల నిర్వహణ నిబంధనల్లో రూల్ 16 అమలును, ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 34 అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ చిత్తూరు పీపుల్స్ యాక్షన్ కమిటీ (సీపీఏసీ) అధ్యక్షుడు ఎ.రాంబాబు, మరొకరు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది అన్వేష వాదనలు విన్న ధర్మాసనం, ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 16కి వాయిదా వేసింది. -
స్థానికం హింసాత్మకం: పార్టీ అధ్యక్షుడి కాన్వాయ్‌పై దాడి
చండీగడ్: స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పంజాబ్‌లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏకంగా ఓ పార్టీ అధ్యక్షుడి కాన్వాయ్‌పై రాళ్ల దాడి చేశారు. దీంతో పంజాబ్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. పంజాబ్‌లోని ఫజ్లికా జిల్లా జలాలాబాద్‌లో శిరోమణి అకాలీదల్ (ఎస్ఏడీ) అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్ పర్యటనకు రాగా కాంగ్రెస్ నాయకులు అడ్డగించారు. పార్టీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి బాదల్ వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తకలు అకాళీదల్ పార్టీ కార్యకర్తలతో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో ఒక్కసారిగా గుర్తుతెలియని వ్యక్తులు బాదల్ కాన్వాయ్‌పై రాళ్లు, కర్రలతో దాడులు చేశారు. దీంతో కాన్వాయ్‌లోని ఓ వాహనం తీవ్రంగా దెబ్బతింది. పరిస్థితి అదుపు తప్పడంతో వెంటనే బాదల్‌ను పక్కకు తీసుకెళ్లారు. అక్కడే ఉన్న పోలీసులు పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు గాల్లోకి కాల్పులు చేశారు. రెండు వర్గాలను చెదరగొట్టాయి. ఆప్ రాష్ట్ర అధ్యక్షుడు భగవంత్ మన్ కూడా జలాలాబాద్ పర్యటన ఉండడంతో నిమిష నిమిషానికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘర్షణల్లో ఇద్దరు తీవ్రంగా గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనను శిరోమణి అకాలీదళ్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనను నిరసిస్తూ చౌరస్తాలో బాదల్ తన అనుచరులతో ధర్నా చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే అకాలీదళ్ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తిప్పి కొట్టింది. ఈ ఘటనకు సుఖ్బీర్ సింగ్ బాదల్ బాధ్యత వహించాలని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. -
‘డీజీపీగా ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా’
సాక్షి, విజయవాడ : గత నాలుగు రోజులుగా పోలీసులు పలు ఛాలెంజ్‌లు ఎదుర్కొంటున్నారని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఫ్రంట్‌లైన్ సిబ్బందిగా పోలీసులకు వేక్సినేషన్ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికలు కూడా నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశం రావడంతో ఏవిధంగా ముందుకు వెళ్ళాలి అనేదానిపై పోలీసు ఉద్యోగ సంఘాలతో చర్చించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎలక్షన్ సెకండ్ ఫేజ్‌లో సెంటర్లు, ఓటర్లు ఎక్కువ ఉంటారని, పొలీసులు గ్రామస్థాయిలో కచ్చితంగా పనిచేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో వ్యాక్సినేషన్ అనేది కోవిడ్ పోర్టల్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతుందని పేర్కొన్నారు. బందోబస్తు పోలీసులు వ్యాక్సినేషన్‌కు వెళ్ళడానికి వారి ఎలక్షన్ బాధ్యతలు వదిలి వెళ్ళాల్సి వస్తుందని డీజీపీ తెలిపారు. చదవండి: మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లిన మహిళా ఎస్సై ఎన్నికలకు రెండు రోజుల ముందు నుంచి పోలీసులు పనిచేయాల్సి వస్తుందని గౌతమ్ సవాంత్ తెలిపారు. ఎలక్షన్ ఫేజ్‌లో పోలీసులు ఉండే ప్రాంతం మారిపోతుందున్నారు. రాజ్యాంగ బద్ధమైన విధులు నిర్వహించడానికి తాము వ్యాక్సినేషన్ చేయించుకోవడాన్ని త్యాగం చేస్తాం అని పోలీసు, ఉద్యోగ సంఘాలు నిర్ణయించుకున్నారన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పోలీసు ఉద్యోగులు తీసుకున్న నిర్ణయానికి తాను గౌరవిస్తున్నానన్నారు. ప్రజా సంక్షేమం ముందు, స్వ ప్రయోజనాలు తరువాత అని నిర్ణయించిన పోలీసు ఉద్యోగులకు డీజీపీగా ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నానని తెలిపారు. ఏపీ పోలీస్ ఒక నిబద్ధతతో పని చేస్తున్నామని పేర్కొన్నారు. పోలీస్ పని చేస్తున్న కొంత మంది రాజకీయ నాయకులు అడుగడుగునా రాజకియం చేస్తున్నారని, టెక్కలిలో సీఐపై దాడి చేసిన వాళ్ళను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కొంతమంది సిస్‌లో ఉండకూడా.. వెనక ఉండి నడిపిస్తున్నారని తెలిపారు. విచారణ చేస్తున్నామని, ఎలాంటి వారైన వదిలే ప్రసక్తే లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. -
ఫ్యాక్షన్ ఉంటేనే టీడీపీకి మనుగడ: శ్రీకాంత్ రెడ్డి
సాక్షి, అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు హుంకరింపులకు భయపడేవారు ఎవరూ లేరని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2001లో ఏకగ్రీవాలపై జీవో విడుదల చేసిందే చంద్రబాబేనని ఆయన అన్నారు. శనివారం శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఢిల్లీ కోటనే గడగడలాడించిన వ్యక్తి అడుగు జాడల్లో నడుస్తున్న పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనని వ్యాఖ్యానించారు. పార్టీలకతీతంగా జరిగే ఎన్నికల్లో గ్రామాల్లో కక్ష్యలు, కారుణ్యాలు ఉండకుడదనే ఉద్యేశ్యంతో పోత్సహకాలు ప్రకటిస్తే హేళన చేస్తారా అని చంద్రబాబును నిలదీశారు. నిమ్మగడ్డ రాయలసీమ పర్యటన రాజకీయ పర్యటనను తలపించిందని విమర్శించారు. 20 నెలల నుంచి ఎన్నికల అధికారిగా కాకుండా టీడీపీ ప్రతినిధిలా వ్యవహరించారని మండిపడ్డారు. చదవండి: రాష్ట్రపతి చిత్తూరు జిల్లా పర్యటన ఖరారు నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు 11 సంవత్సరాల తర్వాత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తొచ్చారని శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆధారాలతో సహ రాజకీయా నాయకులతో మంతనాలు జరిపింది రాష్ట్ర ప్రజలు చూశారని పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్‌గా ఆయన నిర్వర్తించే విధులను పూర్తిగా గౌరవిస్తామని, ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వంపై నిందలు వేయడమే నిమ్మగడ్డ పనిలా అనిపిస్తుందన్నారు. మహనేత వైఎస్ఆర్ అధికారంలోకి రాగానే ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న నాయకులకు టికెట్లు ఇవ్వద్దంటే చంద్రబాబు వెనకడుగు వేశాడని, ఫ్యాక్షన్ ఉంటేనే టీడీపీకి మనుగడ ఉంటుందని అన్నారు. చంద్రబాబు వ్యవస్థలను ఏవిధంగా వాడుకుంటారో అందరికి తెలుసని, ఆయన అధికారంలో ఉన్నప్పుడే వైఎస్సార్సీపీ 86 శాతం సీట్లు దక్కించుకుందని ప్రస్తావించారు. చదవండి: టీడీపీకి ఎన్నికల కమిషన్ నోటీసులు రమేశ్ కుమార్లా కాకుండా ఎలక్షన్ కమిషనర్‌గా వ్యవహరించాలని హితవు పలికారు. చంద్రబాబు, అతని అనుచరుల ప్రోద్భలంతో ప్రయివేట్ యాప్ పేట్టుకున్నారని, టీడీపీ హయాంలో జరిగిన దౌర్జన్యాలను గుర్తుచేసుకోవాలని సూచించారు. తహసీల్దార్ కార్యాలయంలో హత్యలు, మహిళలపై దాడులు, అడపిల్లలపై వేధింపులు చేసి ఫ్యాక్షన్‌ను ప్రోత్సహించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి అయిన వేంటనే మా వాళ్లు తప్పు చేస్తే చూసి చూడనట్లు వ్యవహరించండి అని ఐపీఎస్, ఐఏఎస్‌లకు చెప్పిన నీచ చరిత్ర చంద్రబాబుదని దుయ్యబట్టారు. మంచి చేసిన నాయకుడిని ప్రజలు ఏ విధంగా ఆభిమానిస్తున్నారో ప్రజల్లోకి వచ్చి చూడాని కోరారు. ఆలయాలను కూల్చి ఆ నిందలను వైఎస్సార్సీపీపై మోపారని మండిపడ్డారు. ప్రజలకు ఏ సమస్య లేదన్న శ్రీకాంత్ రెడ్డి ప్రజలు సంతోషంగా ఉన్నారని, రాష్ట్రంలో స్వచ్ఛమైన పాలన సాగుతోందని పేర్కొన్నారు. చదవండి: ‘మదనపల్లి దంపతుల్లాగే సత్యలోకంలో చంద్రబాబు’ -
పంచాయతీ: మమ్మల్ని బలి చేస్తారా!
భీమవరం: పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో గ్రామాల్లో చర్చలు వేడెక్కుతున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం, జనసేన అధినాయకత్వం ఎన్నికలు ఏకగ్రీవం కాకూడదంటూ చేస్తున్న ప్రకటనలకు ఆయా పార్టీల గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు ఖంగుతింటున్నారు. సాధారణంగా గ్రామాల్లో పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, వర్గాలు, కుటుంబాలు, సంప్రదాయాలు వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల వ్యవహారం నడుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండటంతో ఆ పార్టీ సానుభూతిపరులు సర్పంచ్‌గా ఎన్నికైతే ఆయా గ్రామాలకు ఎక్కువగా సంక్షేమ పథకాలు అమలు, గ్రామాభివృద్ధికి నిధులు పెద్ద మొత్తంలో మంజూరవుతాయని గ్రామీణ ప్రజలు భావిస్తున్నారు. దీంతో గ్రామాల్లో పార్టీలను పక్కన పెట్టి ఎన్నికలు ఏకగ్రీవం చేసేందుకు ఎక్కువగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో తెలుగుదేశం, జనసేన నాయకులు ఎన్నికలు ఏకగ్రీవం కాకూడదంటూ చేస్తున్న ప్రకటనలకు ఆయా పార్టీల గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు విస్తుపోతున్నారు. కన్నెత్తి చూడలేదు సాధారణ ఎన్నికలు జరిగి దాదాపు రెండేళ్లు కావస్తుండగా పార్టీ కోసం పనిచేసిన నాయకులను ఆయా పార్టీల పెద్దలు కనీసం ఇప్పటివరకు పట్టించుకోలేదని వాపోతున్నారు. నరసాపురం లోక్‌సభ స్థానానికి జనసేన అ భ్యర్థిగా పోటీచేసిన కొణిదెల నాగేంద్రబాబు, భీమవరం అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన కొణిదెల పవన్‌కల్యాణ్ ఇంతవరకు జిల్లాను కన్నెత్తి చూడలేదంటున్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో వ్యయప్రయాసల కోర్చి పార్టీ కోసం పనిచేస్తే ఎన్నికల అనంతరం తమను పట్టించుకున్న నాథుడే లేడని పార్టీ శ్రేణులు ఆవేదన చెందుతున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కన్వీనర్లను నియమించినా వారెవరూ గ్రామాలను పట్టించుకోవ డం లేదని ఆరోపిస్తున్నారు. టీడీపీ, బీజేపీ అధినాయకు లు ఇచ్చిన పిలుపు సైతం గ్రామాల వరకు తీసుకువెళ్లకుండా తమ ఉనికిని కాపాడుకోవడానికి కార్యక్రమాలు మమ అనిపిస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో గ్రామాల్లో కార్యకర్తలు పార్టీ కోసం ఎలా పనిచేయాలని ప్రశ్నిస్తున్నారు. అండగా ఉంటారా? పంచాయతీ ఎన్నికల్లో పార్టీ కోసం ఎన్నికల బరిలో నిలిస్తే అండగా ఎవరుంటారని ఆయా పార్టీల గ్రామస్థాయి నాయకులు ప్రశ్నిస్తున్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసిన పల్లె ప్రజలంతా వైఎస్సార్ సీపీ వైపు ఎక్కువ మక్కువ చూపుతున్నారని అంటున్నారు. సాధారణ ఎన్నికల అనంతరం గ్రామాల్లో పార్టీ పటిష్టానికి ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయాలంటూ అధిష్టానాలు ఒత్తిడి చేయడం ఎంతవరకు సమంజసమని మదనపడుతున్నారు. పార్టీలకు అతీతంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని అధినాయకులకు తెలిసినా కార్యకర్తలను బలిచేస్తారా అంటూ ధ్వజమెత్తుతున్నారు. పంచాయతీ ఎన్నికలు టీడీపీ, జనసేన నాయకులకు తలబొప్పికట్టే విధంగా తయారవుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
సీఎస్ ఆదిత్యనాథ్‌ను కలిసిన ఉద్యోగ సంఘాలు
సాక్షి, విజయవాడ: సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌ను ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు కలిశారు. ఎన్నికల నిర్వహణ విషయంలో ఉద్యోగ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఉద్యోగ సంఘాలతో సీఎస్ చర్చించారు. అనంతరం ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల విధులకు సహకరించాలని సీఎస్ కోరారని తెలిపారు. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కరోనా వ్యాప్తి ఎక్కువవుతుందని.. ఎస్ఈసీ ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపుతోందని చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. త్వరలో వ్యాక్సిన్ ఇస్తామని సీఎస్ హామీ ఇచ్చారన్నారు. ఎన్నికల విధుల్లో కరోనాతో చనిపోతే రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని కోరామని తెలిపారు. సీఎస్ హామీ మేరకు ఎన్నికల విధుల్లో పాల్గొంటామని చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. చదవండి: ‘ఎస్ఈసీ అలా ఎందుకు చెప్పలేదు..? సీఎస్ సానుకూలంగా స్పందించారు.. ఉద్యోగుల సమస్యల పట్ల సీఎస్ సానుకూలంగా స్పందించారని ఏపీ ఎన్జీవో సెక్రటరీ బండి శ్రీనివాస్ తెలిపారు. కోర్టు తీర్పుకు అనుగుణంగా ఎన్నికల్లో పాల్గొంటామని చెప్పారు. ఉద్యోగులకు ఏమీ జరిగినా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌దే బాధ్యత అని తెలిపారు. చదవండి: ‘అప్పుడు బీజేపీని ఓడించాలని టీడీపీ చెప్పలేదా?’ పీపీఈ కిట్లు ఇవ్వాలి.. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇచ్చే విధంగా ఎన్నికలను రీ షెడ్యూల్ చేయాలని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు కోరారు. రేపటి భేటీలో ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లాలని సీఎస్‌ను కోరామని చెప్పారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పీపీఈ కిట్లు ఇవ్వాలని ఆయన కోరారు. -
ఏపీ: ఎన్నికల పర్యవేక్షణకు ఐజీ స్థాయి అధికారి నియామకం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణకి పోలీస్ శాఖ తరపున ప్రత్యేక అధికారిగా డాక్టర్ ఎన్.సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయన ఎస్ఈసీ కార్యాలయానికి చేరుకుని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో సమావేశమయ్యారు. అనంతరం ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషనర్‌కి ఐజీ సంజయ్ సహకరించనున్నారు. ఐజీ సంజయ్‌కి ఎన్నికల కమిషన్ కార్యాలయంలోనే ప్రత్యేక చాంబర్‌ని కూడా ఏర్పాటు చేశారు. చదవండి: ‘ఎస్ఈసీ అలా ఎందుకు చెప్పలేదు..? -
‘ఎస్ఈసీ అలా ఎందుకు చెప్పలేదు..?
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో మౌలిక మార్పులు వచ్చాయని, వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గ్రామ సచివాలయాల ద్వారా పరిపాలన, సంక్షేమ ఫలాలు ఇంటి ముందుకు వెళ్లాయని, అందుకే ఈ ఎన్నికల్లో తమకు అన్ని విధాలా ఆహ్వానించదగ్గ పరిస్థితి అని పేర్కొన్నారు. చదవండి: ‘అప్పుడు బీజేపీని ఓడించాలని టీడీపీ చెప్పలేదా?’ ‘‘ప్రజాప్రతినిధుల పాత్ర కూడా అభ్యుదయ పాలనకు మెరుగులు దిద్దినట్టవుతుంది. రాబోతున్న సర్పంచ్‌లు పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవచ్చు.ఎవరూ పట్టుదలకు పోవాల్సిన అవసరం లేని ఎన్నికలు ఇవి. ఎన్నికలు ఎంత ప్రశాంతంగా జరిగితే భవిష్యత్తులో అంత అభివృద్ధి జరుగుతుంది. పట్టుదలకు పోకుండా ఏకగ్రీవంగా ముందుకెళ్తే బాగుంటుంది.మేం అధికారంలోకి వచ్చాక పంచాయతీ స్థాయిని బట్టి ప్రోత్సాహకం పెంచాం. ఎన్నికల్లో డబ్బు ప్రవాహం లేకుండా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చట్టం చేశారు. ఎన్నికల్లో ఎవరైనా ప్రలోభపెడితే రెండేళ్ల జైలు శిక్ష. గ్రామ అభ్యుదయం, అభివృద్ధి, సంక్షేమం మా లక్ష్యం’’ అని సజ్జల తెలిపారు. ఎంపీటీసీ ఎన్నికలు ఆపి పంచాయతీ ఎన్నికలు తేవడంపై దురుద్దేశాలు, ఏకగ్రీవాలు జరగకూడదు.. పోటీ ఉండాలనడంపై అనుమానాలున్నాయని.. దీని వెనుక టీడీపీ ఉందని తమకు అనుమానం ఉందన్నారు. పచ్చని పల్లెల్లో గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నామని సజ్జల పేర్కొన్నారు. చదవండి: రాజ్యాంగం ఇప్పటికీ మార్గనిర్దేశం చేస్తూ ఉంది: సీఎం జగన్ ‘‘ప్రతిపక్షం డబ్బు పంపిణీకి పాల్పడితే జైలు శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నాం. మా పార్టీ అయినా, ఏ పార్టీ అయినా చట్టం ఒక్కటే.అక్రమాలకు పాల్పడితే శాశ్వతంగా అనర్హులుగా చేస్తాం. ఎంపీటీసీ ఎన్నికల్లో అన్నీ ఏకగ్రీవాలు కావడంతోనే ఆపేశారని మేం భావిస్తున్నాం. టీడీపీ గెలిచే పరిస్థితి లేదు.. అందుకే ప్రలోభాలకు దిగుతున్నారు. ఏకగ్రీవాలకు వెళ్లాలని ఎన్నికల కమిషన్ చెప్పాలి.. కానీ ఆ ప్రయత్నం లేదు. ఏకగ్రీవాలపై కొరడా అంటున్నారు.. అందుకే ఆ బాధ్యత మేం తీసుకున్నామని’’ సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. -
ఎస్ఈసీ నిమ్మగడ్డకు సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ లేఖ
సాక్షి, అమరావతి: ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ పేర్కొన్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు సీఎస్ లేఖ రాశారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికలు వాయిదా వేయాలని ఆయన లేఖలో కోరారు. ‘‘ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి రెండు డోసుల వ్యాక్సిన్ అవసరం. మొదటి డోస్‌కు, రెండో డోస్‌కు 4 వారాల వ్యవధి అవసరమని.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. మొదటి దఫా వ్యాక్సినేషన్ పూర్తయ్యాక.. 60 రోజుల తర్వాత ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. చదవండి: సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌తో ఉద్యోగ సంఘాల భేటీ తొలి విడతలోనే ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ తప్పనిసరని కేంద్రం చెప్పింది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యం కాదు. ఇలా చేస్తే కేంద్రప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినట్లే. ఎన్నికలు, వ్యాక్సినేషన్ ప్రక్రియలు రెండూ సజావుగా జరగాలని హైకోర్టు సూచించింది. హైకోర్టు ఆదేశాలను పాటించాల్సిన దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేయాలని’’ సీఎస్ లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశామని.. సుప్రీంకోర్టులో విచారణ ముగిసేవరకు ఎన్నికల ప్రక్రియలో ముందుకు వెళ్లొద్దని సీఎస్ విజ్ఞప్తి చేశారు. చదవండి: గ్రామాల్లో అన్ లిమిటెడ్ ఇంటర్నెట్: సీఎం జగన్ -
సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌తో ఉద్యోగ సంఘాల భేటీ
సాక్షి, విజయవాడ: సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్‌తో ఉద్యోగ సంఘాలు శుక్రవారం భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా సీఎస్‌కు ఉద్యోగ సంఘాల జేఏసీ వినతిపత్రం ఇచ్చారు. ఉద్యోగులకు వ్యాక్సిన్ వేసేంత వరకు ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని సీఎస్‌కు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. చదవండి: గ్రామాల్లో అన్ లిమిటెడ్ ఇంటర్నెట్: సీఎం జగన్ ‘‘గత 10 నెలలుగా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. కరోనా విపత్కర పరిస్థితుల్లో మేం ముందు వరుసలో ఉండి పనిచేశాం. వ్యాక్సినేషన్ ఇస్తున్న సమయంలో ఎన్నికలకు ఎస్ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. ఉద్యోగుల పట్ల ఎస్ఈసీ నిమ్మగడ్డ కఠినంగా వ్యవహరిస్తున్నారు. వ్యాక్సినేషన్ పొందే సమయంలో ఎన్నికలు పెట్టడం సరికాదు. వ్యాక్సినేషన్, ఎన్నికలు రెండూ ఒకే సమయంలో ఎలా సాధ్యం. మేం వ్యాక్సినేషన్ తీసుకుని ఎన్నికల విధుల్లో పాల్గొనడం సాధ్యం కాదు. మాకు వ్యాక్సిన్ రెండు డోస్‌లు ఇచ్చాక.. ఎన్నికల విధుల్లో పాల్గొంటామని’’ ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి.చదవండి: విశాఖ భూ కుంభకోణం: సిట్ గడువు పొడిగింపు -
స్థానిక ఎన్నికలు: సుప్రీంను ఆశ్రయించిన సర్కార్
సాక్షి, న్యూఢిల్లీ : స్థానిక సంస్థల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వం పేర్కొంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ వేసిన రిట్ పిటిషన్‌ను అనుమతించిన హైకోర్టు.. ఇబ్బంది లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని గురువారం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. చదవండి: ‘ప్రజల ప్రాణాలతో నిమ్మగడ్డ చెలగాటం’) ఇది ఇలా ఉండగా, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఈ నెల 8వ తేదీన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించగా.. 11వ తేదీన ఎస్ఈసీ ఆదేశాలను హైకోర్టు సింగిల్ జడ్జి కొట్టేశారు. ఎన్నికల కమిషన్ ఆచరణ సాధ్యం కాని నిర్ణయం తీసుకుందని ఆక్షేపించారు. ఈ ఎన్నికల షెడ్యూల్ రాజ్యాంగంలోని అధికరణలు 14, 21లకు విరుద్ధమని తేల్చి చెప్పారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కరోనా వ్యాక్సినేషన్ బృహత్కార్యానికి విఘాతం కలిగిస్తుందని స్పష్టం చేశారు. చదవండి: చంద్రబాబు యూటర్న్.. వ్యూహకర్త నియామకం -
ఏపీ: సుప్రీంకోర్టుకు ఉద్యోగ సంఘాలు..
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టుకు వెళ్తామని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. ఎన్నికల ప్రక్రియ నిలిపివేయాలని సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. రేపు(శుక్రవారం) సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని తెలిపాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగుల ప్రాణాలకు ముప్పు ఉందని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి అన్నారు. ఎన్నికల నిర్వహణపై హైకోర్టు తీర్పును సవాల్ చేయాలని, ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టుకు వెళ్లమని కోరుతున్నామని జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. చదవండి: ప్రజల ప్రాణాలతో నిమ్మగడ్డ చెలగాటం’ స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొనలేం.. స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామన్నారు. వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తవ్వకుండా ఎన్నికల్లో పాల్గొనలేమని.. ఓ వైపు వ్యాక్సిన్, మరో వైపు ఎన్నికలు ఎలా సాధ్యం అని ప్రశ్నించారు. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో మళ్లీ కేసులు పెరిగాయని.. ఎన్నికల కమిషనర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘ప్రజల ప్రాణాలతో నిమ్మగడ్డ చెలగాటం’
సాక్షి, విశాఖపట్నం: పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వార్థ ప్రయోజనాలతో వెళ్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన పదవి ముగిసేలోపు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారని, కరోనా సమయంలో ప్రజల ప్రాణాలతో నిమ్మగడ్డ చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో ఒక్క సీటు అయినా గెలిచే స్థితి టీడీపీకి ఉందా? అని ఆయన ప్రశ్నించారు. కోర్టు తీర్పుపై తమకు గౌరవం ఉందని మంత్రి కన్నబాబు తెలిపారు. చదవండి: బుల్లెట్ ప్రూఫ్ లేకుంటే ఎంపీ సాయిరెడ్డికి ఏమయ్యేదో ప్రజల ఆరోగ్యమే ముఖ్యం: విశ్వరూప్ ప్రకాశం: కోర్టులపై తమకు ఎప్పుడూ గౌరవం ఉందని.. ప్రభుత్వ వాదనను సింగిల్ జడ్జి సమర్థించారని మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. తాము సుప్రీం కోర్టుకు వెళ్తామన్నారు. ఎన్నికలంటే తమకు భయం లేదని, ఎప్పుడైనా సిద్ధమేనన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యం తమకు ముఖ్యమని వివరించారు. సచివాలయాలు ఏర్పాటుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంచలనం సృష్టించడంతో పాటు, లక్షలాది ఉద్యోగాలు ఇచ్చి చరిత్ర సృష్టించారని విశ్వరూప్ అన్నారు. చదవండి: రేషన్ డోర్ డెలివరీ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్ చంద్రబాబు మెప్పు కోసమే..: గుడివాడ అమర్నాథ్ విశాఖ: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మెప్పు కోసం నిమ్మగడ్డ రమేష్ కుమార్ పనిచేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. చంద్రబాబు చెప్పినట్లు నిమ్మగడ్డ నడుచుకుంటున్నారని మండిపడ్డారు. కోవిడ్ వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు వద్దని కోరామన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం వైఎస్సార్‌సీపీదేనని అమర్నాథ్ ధీమా వ్యక్తం చేశారు. -
‘ఆయన వెనుక ఏ దుష్టశక్తి ఉంది..?’
సాక్షి, శ్రీకాకుళం: రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన రాజకీయ క్రీడ జరుగుతోందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజ్యాంగ పదవులను కొంతమంది అపహాస్యం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ‘‘కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. కొన్ని దేశాల్లో ఇంకా లాక్డౌన్ కొనసాగుతోంది. కోవిడ్ వ్యాక్సిన్ సరఫరా ఏర్పాట్లలో ప్రభుత్వం నిమగ్నమై ఉంది. ఇలాంటి సమయంలో ఎన్నికలు నిర్వహించలేమని సీఎస్ తెలిపారు. అయినా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వటం దారుణమని’’ స్పీకర్ తప్పుపట్టారు. (చదవండి: బండారు దత్తాత్రేయను కలిసిన సీఎం వైఎస్ జగన్) ప్రభుత్వంతో సంప్రదింపులు జరపకుండా.. నోటిఫికేషన్ ఇవ్వడం వెనుక ఉన్న ఏ దుష్టశక్తి ఉందని ఆయన ప్రశ్నించారు.న్యాయస్థానం ప్రజల పక్షాన తీర్పు చెప్పిందన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం ఇంత రాద్ధాంతం ఎందుకని, ఓ రాజకీయ పార్టీ కనుసన్నల్లో ఈసీ నడుస్తోందని స్పష్టమవుతోందని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.(చదవండి:హైకోర్టు తీర్పు శుభపరిణామం) -
అశోక్‌బాబుకు ఏపీ ఉద్యోగుల జేఏసీ కౌంటర్
సాక్షి, అమరావతి: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మొండి వైఖరిని ఉద్యోగ సంఘాలు తప్పుపట్టాయి. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ ఎన్నికల విధుల్లో పాల్గొనమనడంపై మండిపడుతున్నారు. నిమ్మగడ్డ ప్రకటనపై జేఏసీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పీపీఈ కిట్లు, మాస్క్‌లు కరోనాను అడ్డుకోగలవా? అని ఏపీ ఉద్యోగుల జేఏసీ ప్రశ్నించింది. (చదవండి: బాబు చేతిలో తోలుబొమ్మలా నిమ్మగడ్డ) ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనలేం. గడిచిన 10 నెలల్లో ఎంతో మంది ఉద్యోగులు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.ఉద్యోగుల ప్రాణాలు ఎస్ఈసీకి పట్టవా?.ఎన్నికల నిర్వహణ అంత చిన్న విషయం కాదు.మరో మూడు నెలలు స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలి.ఉద్యోగుల విజ్ఞప్తిని ఎస్ఈసీ పరిగణలోకి తీసుకోవాలి. వ్యాక్సినేషన్ తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. ఉద్యోగులను విమర్శించే అర్హత టీడీపీ నేత అశోక్‌బాబుకు లేదు. రాజకీయ వ్యవహారాలు చూసుకోవాలంటూ’ జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు కౌంటర్ ఇచ్చారు. (చదవండి: స్థానిక ఎన్నికలను వాయిదా వేయండి) ఎస్ఈసీ పునరాలోచించాలి.. పీపీఈ కిట్లు, మాస్క్‌లు, శానిటైజర్లు కరోనాను ఆపలేవని పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు మండిపడ్డారు. కరోనాతో ఎంతో మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని, వ్యాక్సినేషన్ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలన్నారు. తమ విజ్ఞప్తిని ఎస్ఈసీ పునరాలోచించాలని ఆయన కోరారు. -
చంద్రబాబు డైరెక్షన్లో నిమ్మగడ్డ..
సాక్షి, ప్రకాశం: స్థానిక ఎన్నికలను నిర్వహించడమనేది ప్రజల ప్రాణాలతో చెలగాటమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే వ్యతిరేకిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తోన్న సంక్షేమ పాలన చూసి చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని.. రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు. ‘‘చంద్రబాబు ఎలా చెబితే ఎస్ఈసీ అలా పనిచేస్తోంది. ప్రభుత్వ సలహా కూడా తీసుకోకుండా ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారు. ఎన్నికల నిర్వహణను ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. గుజరాత్లో కూడా ఎన్నికలు వాయిదా వేశారని’’ బాలినేని పేర్కొన్నారు.(చదవండి: అమ్మ ఒడి ఆగదు: మంత్రి సురేష్) ప్రజాశ్రేయస్సుకు అవిరామ కృషి: మంత్రి వేణుగోపాల కృష్ణ పశ్చిమగోదావరి: కులమతాలకు అతీతంగా సీఎం వైఎస్ జగన్ మంచి పరిపాలన అందిస్తున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. ప్రజాశ్రేయస్సుకు అవిరామంగా సీఎం కృషి చేస్తున్నారన్నారు. ఆనాడు చంద్రబాబు భస్మాసురుడులా వచ్చి.. మహిళల నెత్తిన చేతులు పెట్టారని’’ ఆయన ఎద్దేవా చేశారు.(చదవండి: పేదలకు పథకాలందే వేళ ఎన్నికల కోడ్ తెస్తారా!) -
నిమ్మగడ్డ ‘కోడ్’ ముందే కూత
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ‘కోడ్’ పేరుతో సుదీర్ఘ కాలం అడ్డుకునేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సుప్రీంకోర్టు తీర్పులకు సైతం వక్రభాష్యం చెబుతున్నారని రాజ్యాంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వంతో దీర్ఘకాలిక ఘర్షణ దిశగా ఆయన సాగుతున్నారని పేర్కొంటున్నారు. గతేడాది మార్చిలో నిమ్మగడ్డ అర్థాంతరంగా నిలిపివేసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభించేందుకు పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు మాత్రమే ఎన్నికల కోడ్ అమలులోకి తేవచ్చని నాడు సుప్రీం కోర్టు తీర్పు వెలువరించగా ఎస్ఈసీ ఇప్పుడు దీన్ని పంచాయతీ ఎన్నికలకు వర్తింపచేస్తుండటం గమనార్హం. అత్యున్నత న్యాయస్థానం తీర్పులో పేర్కొన్న విధంగా నాలుగు వారాల ఎన్నికల కోడ్ నిబంధనను మధ్యలో నిలిపివేసిన ఎన్నికలను తిరిగి నిర్వహించడానికి వర్తింపచేయడానికి బదులు కొత్త నోటిఫికేషన్ ఇచ్చిన పంచాయతీ ఎన్నికల్లో అమలు చేసేందుకు ఎస్ఈసీ ఉపక్రమించారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. నోటిఫికేషన్ విడుదలకు పక్షం ముందే షెడ్యూలు.. సాధారణంగా స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎన్నికల నోటిఫికేషన్‌కు ఒకట్రెండు రోజుల ముందు షెడ్యూల్ ప్రకటించి అప్పటి నుంచే ఎన్నికల కోడ్‌ను అమల్లోకి తేవడం ఆనవాయితీ. అయితే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు దాదాపు 15 రోజుల ముందు షెడ్యూల్‌ను ప్రకటించి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కోడ్ అమలులో ఉంటుందని ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు 2020 మార్చి 18వ తేదీన వెలువరించిన తీర్పును కారణంగా చూపుతూ నాలుగు వారాల నిబంధన మేరకు వెంటనే కోడ్ అమలులోకి తెస్తున్నట్టు నిమ్మగడ్డ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిమ్మగడ్డ వాదనను తిరస్కరించిన సుప్రీం... ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నామినేషన్ల ప్రక్రియ ఉపసంహరణ తర్వాత, మున్సిపల్ ఎన్నికలను నామినేషన్ల స్వీకరణ తర్వాత గతేడాది మార్చిలో నిమ్మగడ్డ వాయిదా వేశారు. అప్పుడు కేవలం ఆ ఎన్నికలకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేశారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీ చేయలేదు. ఎన్నికలను వాయిదా వేస్తూ నాడు నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2020 మార్చి 18వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తూ.. అర్థాంతరంగా వాయిదా పడిన ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిపోయిందో అదే స్థాయి నుంచి తిరిగి ప్రారంభించాలని స్పష్టం చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాకే ఎన్నికల తేదీలను ప్రకటించాలని ఆదేశించింది. ఎన్నికలను వాయిదా వేసినప్పటికీ ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందన్న నిమ్మగడ్డ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వాయిదా పడిన ఆ ఎన్నికలను తిరిగి ప్రారంభించే సమయంలో పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు మాత్రమే కోడ్ అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. ఒక్క మాటా ప్రస్తావించలేదు.. తాజాగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే సమయంలో ఎస్ఈసీ గతంలో అర్ధాంతరంగా వాయిదా వేసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణ గురించి ఒక్క మాటా ప్రస్తావించలేదు. సుప్రీం తీర్పులో ప్రస్తావించిన 4 వారాల ముందు నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందన్న నిబంధనను గ్రామ పంచాయతీ ఎన్నికలకు వర్తింపచేస్తున్నట్లు పేర్కొన్నారు. సంక్షేమాన్ని అడ్డుకునే కుట్రలు.. సుప్రీంకోర్టు తీర్పునకు వక్రభాష్యం చెబుతూ పంచాయతీ ఎన్నికలకు చాలా ముందు నుంచే కోడ్‌ను అమలులోకి తీసుకు రావడం ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలవుతున్న సంక్షేమ పథకాలను అడ్డుకోవాలనే కుట్ర దాగి ఉందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో 44.84 లక్షల మంది తల్లులకు ఈ నెల 11న అమ్మ ఒడి పథకం కింద రెండో విడత ఆర్థిక సహాయం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం వైఎస్ జగన్ నెల్లూరు జిల్లాలో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఈ నెల 20 వరకు ఇళ్ల పట్టాల పంపిణీ కొనసాగనుంది. -
‘ఎస్ఈసీ నిర్ణయం ఆందోళనకు గురిచేసింది’
సాక్షి, విజయవాడ: కరోనా నేపథ్యంలో ఎన్నికలు సరికాదని.. తమతో పాటు, ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పెట్టలేమని ఏపీ పోలీసు అధికారుల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వం కృషితో కరోనాపై నియంత్రణ సాధిస్తున్న తరుణంలో ఎన్నికల నిర్వహణ ప్రజాహితం కాదని పేర్కొంది. శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా షెడ్యూల్ జారీ చేయడం.. పోలీసు సిబ్బందిని ఆందోళనకు గురిచేసిందన్నారు.(చదవండి: ఎన్నికల విధులు బహిష్కరిస్తాం: ఏపీ ఎన్జీవో) ‘కోవిడ్ మహమ్మారి వలన రాష్ట్రంలో 109 మంది పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. 14 వేల మంది కరోనా బారిన పడ్డారు. ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ అందించే ప్రక్రియలో పోలీస్ సిబ్బంది అనేక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వ్యాక్సిన్ రవాణా, నిల్వకు పోలీస్ బందోబస్తు నిర్వహించవలసి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తి అవ్వకుండా ఎన్నికల విధులకు హాజరు కావడం పోలీసు సిబ్బంది తమ ప్రాణాలను పెను ప్రమాదంలో పెట్టినట్లే. వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసేవరకు పోలీసు సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించలేరు’ అని పోలీసు అధికారుల సంఘం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.(చదవండి: ‘నిమ్మగడ్డ.. చంద్రబాబు తొత్తు’) -
ఎస్ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం పిటిషన్
సాక్షి, అమరావతి: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. శనివారం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హౌస్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు.. సోమవారం విచారించనుంది. ఇది ఇలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభించాలన్న సుప్రీంకోర్టు తీర్పును తోసిరాజని గ్రామ పంచాయతీ ఎన్నికలను నాలుగు దశల్లో నిర్వహించేందుకు శుక్రవారం రాత్రి ఏకపక్షంగా షెడ్యూల్ జారీ చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: మళ్లీ ఏకపక్ష నిర్ణయం) ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు కరోనా ఉధృతి కొనసాగుతుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూలు జారీ చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. రాజకీయ దురుద్దేశంతోనే ఆయన ఇలాంటి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. (చదవండి: ‘నిమ్మగడ్డ.. చంద్రబాబు తొత్తు’) -
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చంద్రబాబు తొత్తు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రతిపక్ష నేత చంద్రబాబు తొత్తుగా మారిపోవడం రాజ్యాంగ విరుద్ధమని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వ అభిప్రాయానికి వ్యతిరేకంగా.. రాజ్యాంగ వ్యవస్థను భ్రష్టుపట్టిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఏకపక్షంగా ఎన్నికలు వాయిదా వేయడం, వద్దన్నా నిర్వహించడం రాజ్యాంగ సంస్థ విధానమేనా అని ప్రశ్నించారు. ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందించి, 2 నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తే నష్టమేంటో ఆయన చెప్పాలన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పుడలా.. ఇప్పుడిలా.. గత ఏడాది జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్లు వేసిన తర్వాత అకారణంగా ఇదే నిమ్మగడ్డ రమేశ్‡ ఎన్నికలను వాయిదా వేసిన విషయాన్ని అంబటి గుర్తుచేశారు. అప్పట్లో రాష్ట్రంలో 30 కోవిడ్ కేసులు కూడా లేకపోయినా, ప్రభుత్వంతో ఏమాత్రం సంప్రదించకుండా తెల్లారేసరికి ఎన్నికలు వాయిదా వేశారని తెలిపారు. నిజానికి 2018లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే.. తెలుగుదేశం ఓడిపోతుందనే నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహించలేదన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌కు ట్రయల్ రన్ జరుగుతోందని.. ఈ సమయంలో ఎన్నికల నిర్వాహణకు ప్రభుత్వం సిద్ధంలేదని చెప్పినా నిమ్మగడ్డ పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కల్గిస్తోందన్నారు. (చదవండి: చంద్రబాబు ఓ మానసిక రోగి: జోగి రమేష్) ప్రజలపై కక్ష తీర్చుకోవడానికే.. తనను ఓడించిన ప్రజలపై కక్ష తీర్చుకోవడానికే చంద్రబాబు ఈ వ్యవహారం నడుపుతున్నారా అని ఆయన ప్రశ్నించారు. నిమ్మగడ్డ కంటే పెద్ద స్థాయిలో ఉన్న చీఫ్ సెక్రటరీ, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వద్దంటున్నా, ఎన్నికలు పెడతానని నిమ్మగడ్డ చెప్పడం చూస్తుంటే ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన కుట్రగా భావించాల్సి వస్తోందన్నారు. -
ఎస్ఈసీకి సర్వాధికారాలు ఉండవు: తెలకపల్లి రవి
సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో ఎన్నికలు సరికాదని గతంలో హైకోర్టు చెప్పిందని.. ఎస్ఈసీకి సర్వాధికారాలు ఉండవని సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవి తెలిపారు. గతంలో ప్రభుత్వానికి చెప్పకుండా ఎన్నికలు వాయిదా వేయడం, ఇప్పుడు ప్రభుత్వానికి చెప్పకుండా నోటిఫికేషన్ ఇవ్వడం కూడా సరికాదన్నారు. నిమ్మగడ్డ కావాలనే ప్రతిష్టంభన వాతావరణం తీసుకొస్తున్నారన్నారు. నిమ్మగడ్డ రమేష్ వాస్తవిక దృక్పథాన్ని అవలంభించాలన్నారు. ఎస్ఈసీ సంఘర్షణలతో కాకుండా సమన్వయంతో ముందుకెళ్లాలని తెలకపల్లి రవి సూచించారు.(చదవండి: చంద్రబాబు ఓ మానసిక రోగి: జోగి రమేష్) -
నిమ్మగడ్డ రమేష్‌ది మోసమే..!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ రాష్ట్రంలో నివసించడం లేదని, కానీ ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా మోసం చేస్తూ ప్రతి నెలా ఇంటి అద్దె అలవెన్స్ పొందుతున్నారని సమాచార హక్కు ఉద్యమ ఐక్య వేదిక (యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్), గవర్నర్ విశ్వభూషణ్‌కు ఫిర్యాదు చేసింది. నిమ్మగడ్డపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ ప్రభుత్వం నుంచి పొందుతున్న వేతన వివరాలను సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం ద్వారా తీసుకున్న వేదిక ప్రతినిధులు.. ఆ వివరాల కాపీలను ఫిర్యాదుకు జత చేశారు. ఉన్నత స్థాయి వ్యక్తులు ఆదర్శంగా ఉండాలి గవర్నర్‌కు ఫిర్యాదు అనంతరం వేదిక ప్రతినిధులు జంపాన శ్రీనివాసగౌడ్, కేఎండీ నస్రీన్ బేగంలు ఆ వివరాలను సోమవారం ఒక ప్రకటన రూపంలో మీడియాకు విడుదల చేశారు. ప్రకటనలో ఏముందంటే.. ► రాజ్యాంగబద్ధమైన ఉన్నత స్థాయి పదవులలో ఉన్న వ్యక్తులు అధికారులకు, ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. ► తాము ఆర్టీఐ చట్టం ద్వారా పొందిన వివరాల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి నెలా రూ. 3,19,250 జీతం పొందుతున్న నిమ్మగడ్డ రమేష్ అసలు రాష్ట్రంలోనే నివాసం ఉండడం లేదు. రాజధాని హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివచ్చినప్పటి నుంచి, ఇక్కడ సరైన సౌకర్యాలు లేనప్పటికీ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర ఉన్నత స్థాయి అధికారులు విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లోనే నివాసం ఉంటున్నారు. ► రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం కూడా హైదరాబాద్ నుంచి విజయవాడకు మారినా ఎన్నికల కమిషనర్ మాత్రం హైదరాబాద్ నుంచి విజయవాడకు ఇప్పటివరకు మారలేదు. హైదరాబాద్‌లో ఉండడం సమంజసమా? ► స్థానిక ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించాల్సిన కమిషనర్ రాష్ట్ర ప్రజలకు ఏ మాత్రం అందుబాటులో లేకుండా హైదరాబాద్‌లో నివాసం ఉండడం ఎంతవరకు సమంజసం? ఆయన ఎందుకు హైదరాబాద్ వీడేందుకు ఇష్టపడడం లేదు? ► హైదరాబాద్‌లో ఉంటున్నా.. ప్రతి నెలా ఇక్కడ ఇంటి అద్దె అలవెన్స్‌ను తీసుకుంటున్నందున, ఇప్పటివరకు ఆయనకు చెల్లించిన ఆ అలవెన్స్ మొత్తాన్ని రికవరీ చేయాలి. ప్రభుత్వాన్ని మోసగించి ఇంటి అద్దె పొందుతున్న నిమ్మగడ్డపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. -
ఒక ఎన్నికల ప్రేమకథ
కేరళలో స్థానిక ఎన్నికల కథ ఎలా ఉన్నా అక్కడ పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థుల కథలు మాత్రం సినిమాలకు తక్కువ కాకుండా ఉన్నాయి. పాలక్కాడ్‌లో పంచాయతీ ఎన్నికలలో పోటీ చేస్తున్న జ్యోతి ఇప్పుడు న్యూస్‌మేకర్. చత్తిస్గడ్కు చెందిన ఈమె 2010లో బస్‌లో ప్రయాణిస్తూ అదే బస్‌లో ఉన్న కేరళకు చెందిన జవాన్ ను ప్రమాదం నుంచి రక్షించి తన చేతిని భుజం వరకూ కోల్పోయింది. అతడు ఆమెను హాస్పిటల్లో చేర్చాడు. పునఃజన్మ ఇచ్చినందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడామె కేరళ కోడలు. ఎన్నికలలో ఆమె గెలుపు కంటే ఈ ప్రేమ కథ అందరికీ ఇష్టంగా ఉంది. సాహసాలు, త్యాగాలు చేసిన సామాన్యులు జనంలో కలిసి సాధారణ జీవితం గడుపుతుంటారు. కాని పబ్లిక్‌లోకి వచ్చి నిలబడినప్పుడే వారి గాథలు లోకానికి తెలిసి ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఇప్పుడు అలాంటి అసామాన్య స్త్రీల కథలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కారణం ఇప్పుడు అక్కడ స్థానిక ఎన్నికలు జరుగుతూ ఉండటమే. ఆ పోటీల్లో భిన్నమైన నేపథ్యాలు ఉన్న మహిళలు పోటీకి నిలుస్తూ ఉండటమే. జ్యోతిది కూడా అలాంటి కథే. దంతెవాడ అమ్మాయి దంతెవాడకు చెందిన జ్యోతి 2010లో నర్సింగ్ చదువుతోంది. జనవరి 3న ఆమె తన హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లడానికి బస్ ఎక్కింది. అదే బస్‌లో ఎవరో మిత్రుణ్ణి కలిసి క్యాంప్‌కు వెళుతున్న వికాస్ కూడా ఉన్నాడు. వికాస్‌ది కేరళలోని పాలక్కాడ. అతనక్కడ సిఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్)లో పని చేస్తున్నాడు. సాయంత్రం కావడంతో ప్రయాణికులు కునుకుపాట్లు పడుతున్నాడు. వికాస్‌ది విండో సీట్ కావడంతో విండో కడ్డీల మీద తల వాల్చి నిద్రపోతున్నాడు. జ్యోతి అతని వెనుక కూచుని ఉంది. ఇంతలో ఒక లారీ అదుపుతప్పి వేగంగా వస్తున్నట్టు జ్యోతి గ్రహించింది. అది విండోల మీదకి వస్తోంది. జ్యోతి క్షణం కూడా ఆలస్యం చేయకుండా వికాస్‌ను లాగేసింది. కాని అప్పటికే లారీ ఢీకొనడం, జ్యోతి కుడి చేయి నుజ్జు నుజ్జు కావడం జరిగిపోయాయి. మొదలైన ప్రేమకథ తేరుకున్న వికాస్ గాయపడిన జ్యోతిని తానే స్వయంగా దంతెవాడ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ డాక్టర్లు ఇక్కడ వైద్యం కుదరదు... చేయి తీసేయాలి రాయ్‌పూర్‌కు తీసుకెళ్లండి అని చెప్పారు. ‘ఆమె నీ ప్రాణం కాపాడ్డానికి ఈ ప్రమాదం తెచ్చుకుంది’ అని తోటి ప్రయాణికులు వికాస్‌కు చెప్పారు. వికాస్ ఆమెను రాయ్‌పూర్ తీసుకెళ్లాడు. వైద్యానికి అయిన ఖర్చంతా తనే భరించాడు. ‘తను నాకు పునర్జన్మను ఇచ్చింది. నేను ఆమెకు పునర్జీవితాన్ని ఇద్దామని నిశ్చయించుకున్నాను‘ అన్నాడు వికాస్. వారిద్దరూ క్రమంగా ప్రేమలో పడ్డారు. ట్విస్ట్ వచ్చింది అయితే ఈ ప్రేమ కథ సవ్యంగా సాగలేదు. జ్యోతి తండ్రి గోవింద్ కుండు ప్రభుత్వ ఉద్యోగి. తన కూతురికి యాక్సిడెంట్ అయ్యాక మొదట నర్సింగ్ చదువును మాన్పించాడు. చేయి పోవడానికి కారకుడైన వాడే ప్రేమ పేరుతో దగ్గరవుతున్నాడని తెలిసి ప్రేమకు అడ్డుగా నిలిచాడు. అయితే జ్యోతి వికాస్‌ను గట్టిగా ప్రేమించింది. ప్రేమే ముఖ్యం అనుకుంది. అంతే... ఇల్లు విడిచి అతనితో పాలక్కాడ్ వచ్చేసింది. 2011 ఏప్రిల్‌లో వారిద్దరికీ పెళ్లయ్యింది. వికాస్ ఉద్యోగరీత్యా దేశమంతా తిరుగుతూ ఉన్నా జ్యోతి పాలక్కాడ్‌లోనే ఉండిపోయింది. ఇప్పుడు ఆమెకు ఇద్దరు పిల్లలు. పెద్దాడికి 8. చిన్నాడికి 4. పంచాయతీ ఎన్నికలలో ప్రస్తుతం కేరళలో జరుగుతున్న స్థానిక ఎన్నికలలో సరైన మహిళా అభ్యర్థుల కోసం వెతుకుతున్న పార్టీలు జ్యోతి కథ తెలిసి ఆమెను ఎన్నికలలో పోటీ చేయమని కోరాయి. జ్యోతి వెంటనే రంగంలో దిగింది. పాలక్కాడ్‌లో కొల్లన్‌గోడే బ్లాక్ నుంచి పంచాయతీ ఎన్నికలలో పోటీ చేస్తోంది. ‘నాకు ఓట్లు వేస్తారో లేదో తెలియదు. కాని జనం మాత్రం నా ధైర్యానికి త్యాగానికి మెచ్చుకుంటున్నారు’ అని ఆమె చెప్పింది. ఎన్నికల ప్రచారంలో జ్యోతి జ్యోతి ఎప్పుడూ ఒక శాలువను కుడి చేతి మీద వేసుకుని ఉంటుంది. ఎందుకంటే ఆమె కుడిచేయి భుజం దిగువ వరకూ తీసివేయబడింది. ఆమె ఒక్క చేత్తోనే జీవితాన్ని సమర్థంగా నిర్వహిస్తోంది. గెలిస్తే పదవి బాధ్యతలను కూడా అంతే సమర్థంగా నిర్వహిస్తుందనిపిస్తుంది. స్త్రీల సామర్థ్యాలకు అవకాశం దొరకాలే గాని నిరూపణ ఎంత సేపు. – సాక్షి ఫ్యామిలీ -
‘ఓ పార్టీ కనుసన్నల్లో ఎస్ఈసీ’
సాక్షి, విజయవాడ: స్వప్రయోజనాల కోసం ఎన్నికల కమిషనర్ పని చేయకూడదని, ఇతర రాష్ట్రాలతో ఏపీని పోల్చాల్సిన అవసరం లేదని మాజీ ఆర్టీఐ కమిషనర్ విజయబాబు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ పునరాలోచన చేయాలని సూచించారు. ‘‘ఎన్నికలను ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని నిర్వహిస్తామని చెప్పడం భావ్యం కాదు. బీహార్ ఎన్నికల తర్వాత కోవిడ్ కేసులు పెరగటం చూశాం. హైదరాబాద్ ఎన్నికల్లో ఓటర్లు కోవిడ్ భయానికి ప్రజలు ఓటు వేసేందుకు కూడా రాని పరిస్థితి చూశాం. యూఎస్ అధ్యక్ష ఎన్నికల తర్వాత కూడా అధికసంఖ్యలో యూఎస్‌లో కేసులు పెరిగాయని’’ ఆయన పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ ఓ పార్టీ కనుసన్నల్లోనే నడుస్తున్నట్లు కనిపిస్తుందని.. రాజ్యాంగానికి లోబడి పనిచేయాలన్నారు. విపత్కర పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం సమంజసం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలను లెక్క చేయకుండా ఎస్ఈసీ వ్యవహరిస్తున్నారని విజయబాబు విమర్శించారు. -
హైకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు నిర్వహించొద్దని హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహణ సాధ్యం కాదంటూ పిటిషన్లో పేర్కొంది. ఎస్ఈసీ నిర్ణయం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉందని ప్రభుత్వం తెలిపింది. పిటిషన్లో ప్రతివాదిగా ఎన్నికల కమిషన్ కార్యదర్శిని ప్రభుత్వం చేర్చింది. కరోనా సమయంలో ప్రజారోగ్యం ప్రభుత్వ కర్తవ్యమని ఏపీ ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటికే కరోనాతో 6వేల మంది మరణించారని, ఎన్నికల ప్రక్రియను వెంటనే నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును ప్రభుత్వం కోరింది. గతంలో కరోనా అంటూ ఎన్నికలు వాయిదా వేసి.. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తామనడంపై పిటిషన్లో ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. (చదవండి: సీఎం జగన్‌పై దాఖలైన పిటిషన్లు కొట్టివేత..) -
కరోనాతో ఉద్యోగులు మరణిస్తే ఎన్నికల కమిషన్ బాధ్యత వహిస్తుందా?
సాక్షి, అమరావతి: ‘స్థానిక ఎన్నికలు కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత పెడితే ఏమవుతుంది? తగ్గక ముందే ఎన్నికలు నిర్వహించడం వల్ల విధుల్లో పాల్గొనే ఉద్యోగులెవరికైనా వైరస్ సోకి మరణిస్తే అందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ బాధ్యత వహిస్తుందా?’ అని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి నిలదీశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చంద్రశేఖరరెడ్డి, సంఘ ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావులు ప్రకటించారు. మంగళవారం విజయవాడలో ఏపీ ఎన్జీవో సంఘం వెబ్సైట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు మాట్లాడారు. ‘కరోనా వల్ల రాష్ట్రంలో ఇప్పటికీ రోజూ పదుల సంఖ్యలో చనిపోతున్నారు. ఇప్పటిదాకా ఉద్యోగులతో సహా మొత్తం 7 వేల మంది చనిపోయారు. ఇలాంటి సమయంలో ఎన్నికలు పెడతామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చెబుతున్నారు. రాష్ట్రంలో రోజుకు కేవలం 20 కేసులు వచ్చినప్పుడే ఎన్నికలను వాయిదా వేసి, ఇప్పుడు వేలల్లో నమోదవుతుంటే ఎన్నికలు పెట్టి ఎంత మందిని చంపాలని చూస్తున్నారు?’ అని చంద్రశేఖర్‌రెడ్డి ప్రశ్నించారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు జరపాలన్న ఎన్నికల కమిషనర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. అవసరమైతే ఉద్యోగ సంఘాల పక్షాన కోర్టుల్లో ఇంప్లీడ్ అయ్యి వాదనలు వినిపిస్తాం. ఉద్యోగులు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇప్పుడు ఎన్నికలు మంచిది కాదన్నారు. కరోనా తగ్గిన తర్వాతే ఎన్నికలు జరపాలి. అప్పుడు పని చేసేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు..’ అని తెలిపారు. వచ్చే ఏప్రిల్ కల్లా ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కారిస్తానని సీఎం హామీ ఇచ్చారని చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ను ప్రకటించారని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని శ్రీనివాసరావు గుర్తు చేశారు. సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ అజయ్‌కుమార్, అసోసియేటెడ్ ప్రెసిడెంట్ పురుషోత్తంనాయుడు, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీ సెక్రటరీ జనరల్ జోసెఫ్ సుధీర్‌బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా సంక్షేమంతో పాటే ఉద్యోగుల సంక్షేమం: సజ్జల వీలైనంత ఎక్కువమందికి వీలైనంత ఎక్కువ ప్రయోజనం కలిగించాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచన అని వెబ్సైట్ ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కొంత జాప్యం జరిగినప్పటికీ, రానున్న రోజుల్లో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశలో సీఎం జగన్ ముందడుగు వేస్తారని చెప్పారు. ప్రజలకే సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న జగన్ వాటిని అమలు చేసే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ఎందుకు వెనుకాడుతారని ప్రశ్నించారు. -
‘అప్పుడాయన ఎక్కడున్నారు..?’
సాక్షి, విజయవాడ: కరోనా కేసులు, రాష్ట్రంలోని పరిస్థితులు పరిగణనలోకి తీసుకునే ఎన్నికలకు ఈసీ ముందుకెళ్లాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు కోరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం, ఎన్నికల కమిషనర్ సమన్వయంతో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాలన్నారు. సెకండ్ వేవ్ వస్తుందని కొట్టొచ్చినట్టు కనబడుతోందని, ప్రపంచ దేశాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రమాద పరిస్థితులు కనబడుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై నిర్లక్ష్యం పనికిరాదన్నారు. (చదవండి: ఆంధ్రజ్యోతి ఆనాడు ఎందుకు రాయలేదు..?) ‘‘బీజేపీతో కలిశాక పవన్‌కల్యాణ్‌కు తొలిచిన ఆలోచననే జమిలి ఎన్నికల మాట. జమిలి ఎన్నికలు వస్తే జనసేన లాంటి ప్రాంతీయ పార్టీలకే ప్రమాదం. అధికారంలో ఉన్న బీజేపీ.. దేశాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతుంది. సోము వీర్రాజు తల, తోక లేని రాజకీయాలను రాష్ట్రంలో నడుపుతున్నారు. మతోన్మాదం మీద ఆధారపడ్డ పార్టీ బీజేపీ. దేశం మొత్తాన్ని కార్పొరేట్లకు బీజేపీ తాకట్టు పెడుతుంది. వామపక్షాలు నాడు దేశ స్వాతంత్రం కోసం పోరాడాయి. నేడు రైతుల కోసం ఉద్యమిస్తున్నాయి. బీజేపీ రైతాంగానికి వ్యతిరేకంగా చట్టాలు చేసినప్పుడు సోము వీర్రాజు ఎక్కడున్నారు..?. కార్మిక చట్టాలు కాల రాసినప్పుడు నోరు మెదపలేదే’’ అని మధు ప్రశ్నించారు. (చదవండి: పెట్టుబడి.. గిట్టుబాటు కావాలి: సీఎం జగన్) -
ఆ విషయంలో పునరాలోచన చేయాలి
సాక్షి, విశాఖపట్నం: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై ఎన్నికల కమిషన్ పునరాలోచన చేయాలని ఏపీ బీసీ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు పోలాకి శ్రీనివాస్ కోరారు. కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తగదని, కరోనా తగ్గిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే మంచిదని పేర్కొన్నారు. రోజుకి మూడు, నాలుగు వేలు కరోనా కేసుల నేపథ్యంలో ఎన్నికల వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో ఉద్యోగులను బలి చేయొద్దని కోరారు. -
‘పత్రికలకు నిమ్మగడ్డ ముందే లీక్ చేశారు’
సాక్షి, తాడేపల్లి : రాజ్యాంగ వ్యవస్థలో ఉంటూ ఎలక్షన్ కిమషనర్ నిమ్మగడ్డ రమేష్ నీతి, న్యాయం పాటించకుండా దిగజారి ప్రవర్తిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వాస్తవాలను ప్రజలకు వివరించే ప్రయత్నమే తాము చేస్తున్నామని, ఎవరిని టార్గెట్ చేయాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీకాంత్ రెడ్డి మట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణకు సిద్దంగా ఉన్నామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైకోర్టులో నిన్న(మంగళవారం) అఫిడవిట్ వేసినట్లు పత్రికల్లో వచ్చిందన్నారు. హైకోర్టుకు నిన్ననే ఈసీ నివేదించినట్లు పత్రికల్లో వచ్చిందని, హైకోర్టులో మాత్రం ఆ అఫిడవిట్ ఈ రోజు ఫైల్ అయినట్లుగా ఉందని పేర్కొన్నారు. ముందుగానే పత్రికలకు నిమ్మగడ్డ రమేష్ ఎందుకు లీక్ చేశారని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తి నిజాయితీగా వ్యవహరిస్తారని ఎలా నమ్మాలని నిలదీశారు. ఈ విషయంతో చంద్రబాబు ఆదేశాలతో నిమ్మగడ్డ పనిచేస్తున్నట్లు తేలిందన్నారు. చదవండి: ఏపీలో పనిచేస్తూ.. హైదరాబాద్‌లో నివాసమా! సొంత ప్రయోజనాల కోసం, స్వార్థం కోసం వ్యవస్థలను తాకట్టు పెడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. అఫిడవిట్ సంబంధించిన రిపోర్టులను ముందుగానే ఎందుకు పత్రికలకు ఇచ్చారుని ప్రశ్నించారు. రెండు కేసులు వచ్చి నపుడు కరోనా పేరు చెప్పి ఎన్నికలను వాయిదా వేసిన ఆయన ఇప్పడు సరాసరిగా ౩ వేల కరోనా కేసులు రోజుకు వస్తున్నాయి. అయినా ఈ పరిస్థితుల్లో ఎన్నికలను నిమ్మగడ్డ రమేష్ ఎలా నిర్వహిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ద్వివేదిని చంద్రబాబు బెదిరించారని, రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించే తత్వం చంద్రబాబుకు లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు చెప్పినట్లుగా ఎస్ఈసీ రమేష్ పని చేస్తున్నారన్న శ్రీకాంత్ రెడ్డి స్వార్థం కోసం చంద్రబాబు వ్యవస్థలను సర్వనాశనం చేస్తున్నారని విమర్శించారు. ఇంట్లోంచి బయటకు రాని నాయకుడు చంద్రబాబు. జూమ్ మీటింగ్‌లలో ప్రభుత్వంపై చంద్రబాబు బురద జల్లుతున్నారు. చదవండి: 'ప్రతీది వక్రీకరించటం చంద్రబాబుకు అలవాటే' ‘మూసేసిన పార్టీకి గడపదాటని నాయకుడు చంద్రబాబు. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు ఏమీ చేయడం లేదు. అమరావతిలో చంద్రబాబు చేసిన అభివృద్ది శూన్యం. అమరావతిలో చంద్రబాబు అడుగుకు 12వేలు దోచుకుని సర్వనాశనం చేశారు. విజయవాడలో దుర్గ వారధిని కూడా కొద్దిగా చేసి వదిలేస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పూర్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు పేరిట చంద్రబాబు వేల కోట్లు దోచుకున్నారు. రివర్స్ టెండరింగ్‌లో ప్రభుత్వం 800 కోట్లను మిగిల్చింది. కాంట్రాక్టులు, కమిషన్లు కక్కుర్తి కోసం కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తీసుకున్నారు. పేదలకు 30లక్షల పట్టాలు రాకుండా చేసింది చంద్రబాబే ఇప్పుడేమో అర్హులతో ఇళ్లు స్వాధీనం చేసుకుంటామని దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా వైపు తప్పులు ఉంటే మేము సరి చేసుకుంటాం. కులాలు మతాల మధ్య తగాదాలు పెట్టింది తెదేపానే. ఒట్ల కోసం చంద్రబాబు ఎంతకైనా దుగజారుతారు. సంక్షేమ పథకాలపై ఎక్కడైనా సరే చర్చించేందుకు మేము సిద్దం’ అని పేర్కొన్నారు. రాజధాని పేరిట చంద్రబాబు బినామీ ఉద్యమం -
పోలీస్‌లకు బహిరంగ క్షమాపణ చెప్పాలి
-
‘నిమ్మగడ్డ నిజస్వరూపం తెలిసిపోయింది’
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిజస్వరూపం అందరికి తెలిసిపోయిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘26 కరోనా కేసులున్నప్పుడు ఎన్నికలను వాయిదా వేసి 26 వేల కేసులున్నప్పుడు పెడతామని ఎలా అంటారు? అని ప్రశ్నించారు. ప్రభుత్వంతో సంప్రదించకుండా ఎన్నికలు కమిషన్ నిర్ణయం తీసుకోవడం సరికాదు అన్నారు. గతంలో వాయిదా వేసినప్పుడు ఎందుకు రాజకీయ పార్టీలతో చర్చించలేదు అని అన్నారు. అచ్చెన్నాయుడు పోలీస్‌లకు బహిరంగ క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికలంటే భయపడాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. సోనియా గాంధీని ఢీకొని సింగిల్‌గా ఎన్నికలకు వెళ్లిన చరిత్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది అని అన్నారు. టీడీపీకి 50 నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లే లేరని, వాళ్ళకి ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. ‘వాళ్ళకి మేం భయపడేది ఏంటి’ అని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 16 నెలల పాలనతో టీడీపీకి ఓటేసేవాడే లేడని తేలిపోయిందన్నారు. చంద్రబాబు రాష్ట్రానికే రావట్లేదని, ఇక ఎన్నికల్లో వాళ్లెం చెయ్యగలరు అని అన్నారు. చదవండి: పేదల ద్రోహి చంద్రబాబు -
రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ భేటీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మధ్యలో నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలను తిరిగి నిర్వహించే అంశంపై చర్చించేందుకు ఈ నెల 28న వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఈ సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. రాజకీయ పారీ్టల నుంచి అభిప్రాయాలను సేకరించాక తదుపరి కార్యాచరణకు సంబంధించి ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. చదవండి: జనం సొమ్ముతో హైదరాబాద్‌లో ఇల్లా? -
రాష్ట్ర ఈసీగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి
సాక్షి, అమరావతి: మద్యం, ధనం ప్రభావమన్నది లేకుండా నిష్పక్షపాతంగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ఇటీవల అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నియమించేలా చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టం–1994 సెక్షన్–200కు చేసిన సవరణల ఆర్డినెన్స్‌కు గవర్నర్ విశ్వభూషణ్ ఆమోద ముద్ర వేయడంతో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. పారదర్శకత కోసమే.. ► ఇప్పటి వరకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్లుగా నియమితులవుతూ వచ్చారు. ఇక మీదట హైకోర్టు రిటైర్డ్ జడ్జి.. ఎస్ఈసీ కానున్నారు. ► రిటైర్డ్ ఐఏఎస్‌లు ప్రభుత్వ పెద్దల వద్ద పని చేసి ఉండటం వల్ల చాలా సందర్భాల్లో వారి ‘నిష్పాక్షికత’ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలనే లక్ష్యంతో ఎన్నికల సంస్కరణల్లో కొనసాగింపుగా ఎస్ఈసీగా హైకోర్టు రిటైర్డ్ జడ్జిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ► ఈ నిర్ణయం దేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో నూతన ఒరవడి సృష్టించనుంది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం దేశంలో ఇదే ప్రథమం కానుంది. ఇందువల్ల అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని ప్రజాస్వామ్యవాదులు, న్యాయనిపుణులు, విశ్లేషకులు, మేధావివర్గాలు అభిప్రాయ పడుతున్నారు. ఆదిలోనే ఎన్నికల సంస్కరణకు శ్రీకారం ► పంచాయతీ రాజ్, మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి అభ్యర్థులు మద్యం, డబ్బులు పంపిణీ వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే అటువంటి వారు గెలిచినప్పటికీ ఆయా పదవుల్లో కొనసాగటానికి అనర్హులుగా పరిగణించేలా రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో సంస్కరణలకు శ్రీకారం చుట్టడం తెలిసిందే. ► గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీ పాలక వర్గాలకు మరిన్ని అధికారాలు కల్పిస్తూ చట్ట సవరణ చేసింది. ► ప్రస్తుతం అనుసరిస్తున్న సుదీర్ఘమైన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ప్రలోభాలకు తావివ్వని విధంగా కేవలం 13 రోజుల వ్యవధికి తగ్గించింది. ► ఎన్నికల్లో గెలిచిన తర్వాత గ్రామ పంచాయతీ సర్పంచ్ సంబంధిత గ్రామంలోనే నివసించాలని, గ్రామ పంచాయతీ కార్యాలయానికి క్రమం తప్పకుండా హాజరు కావాలని నిబంధన విధించింది. ► ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఓటర్లను ప్రలోభ పెట్టడం, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా చేయటం వంటి నేరాలకు పాల్పడినట్లయితే 3 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.10,000 వరకు జరిమానా విధించడానికి అవకాశం కల్పిస్తూ చట్టంలో మార్పులు చేసింది. గరిష్టంగా రెండు పర్యాయాలు ► రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని 5 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు కుదించినట్లు ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. మరో 3 సంవత్సరాల పదవీ కాలాన్ని గవర్నర్ తన అభీష్టం మేరకు పొడిగించడానికి అవకాశం కల్పించారు. ► ఒక వ్యక్తిని గరిష్టంగా ఎస్ఈసీగా రెండు పర్యాయాలు (3+3 ఏళ్లు) మాత్రమే కొనసాగించాలని పరిమితి విధించారు. ► ప్రస్తుతం ఎస్ఈసీగా పని చేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ 2016 ఏప్రిల్ 1వ తేదీన ఆ బాధ్యతల్లో చేరారు. నాలుగేళ్లకు పైగానే ఆ బాధ్యతల్లో కొనసాగుతున్నారు. తాజా ఆర్డినెన్స్ ప్రకారం.. ఎస్ఈసీ పదవీకాలం మూడేళ్లు. ఫలితంగా నిమ్మగడ్డ పదవీకాలం పూర్తయింది. దీంతో ఆయన స్థానంలో.. ఆర్డినెన్స్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం కొత్త ఎస్ఈసీని నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
డబ్బు ఇవ్వకపోతే చస్తారు బీకే పార్థసారథి అల్టిమేటం
పెనుకొండ: తీసుకున్న డబ్బు వాపస్ చేయకపోతే చస్తారంటూ పెనుకొండ నియోజవకర్గం టీడీపీ నాయకులను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి తీవ్రంగా హెచ్చరించారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రొద్దం జెడ్పీటీసీ స్థానానికి టీడీపీ నుంచి గాండ్ల విశాలాక్షి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బరిలో నిలిచిన నియోజకవర్గంలోని ఎంపీటీసీ అభ్యర్థుల ఖర్చులకు తన సొంత డబ్బు రూ.కోటి వరకు వెచ్చించేందుకు సిద్ధమైన ఆమె ఆ మొత్తాన్ని పార్టీ అధ్యక్షుడు బీకే పార్థసారథికి అందజేసినట్లు సమాచారం. అయితే ఎన్నికలు వాయిదా పడడంతో తాను ఇచ్చిన డబ్బు వాపసు చేయాలంటూ బీకేపై ఆమె ఒత్తిడి చేశారని తెలిసింది. దీంతో నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థులను బుధవారం రొద్దంకు రప్పించుకుని బీకే సమావేశమయ్యారు. తాను ఇచ్చిన డబ్బు వెంటనే వాపసు చేయాలని లేకపోతే చస్తారంటూ హుకుం జారీ చేయడంతో నాయకులు బిత్తరపోయారు. ఎన్నికలు సకాలంలో జరుగుతాయనే ఉద్దేశంతో ఇప్పటికే ఆ డబ్బు తాము ఖర్చు చేశామని, ఇప్పటికిప్పుడు వాపసు చేయాలంటే ఎక్కడి నుంచి తెచ్చేదంటూ పలువురు వాపోతున్నారు. అయినా పార్టీ అధ్యక్షుడు ససేమిరా అంటూ గడువు విధించి, ఆ లోపు డబ్బు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అల్టిమేటం జారీ చేసినట్లు చర్చ జరుగుతోంది. -
పక్కా ప్లాన్‌తో మాచర్లలో బుద్దా,బొండా ఎంట్రీ
సాక్షి, గుంటూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేయడానికి కింది స్థాయి క్యాడర్ కూడా వెనుకడుగు వేసింది. బరిలో నిలవడానికి ఎవ్వరు ముందుకు రావడం లేదు. దీంతో పరువు పోతుందని భావించిన టీడీపీ నాయకులు కొత్త ఎత్తుగడ వేశారు. ప్రశాంతగా వాతావరణాన్ని రణరంగంగా మర్చే ఎత్తుగడ వేశారు. ఇందులో భాగంగా వెల్దుర్తి మండలం బోదలవీడులో తమ పార్టీ కార్యకర్తలను నామినేషన్లు వేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని, ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు సాకుతో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావులను చంద్రబాబు మాచర్లకు పంపారు. ఓ పథకం ప్రకారం టీడీపీ నాయకులు గత బుధవారం మాచర్లకు వెళ్లారు. అక్కడి ప్రజలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో స్థానికులు ఆగ్రహానికి గురై ఆవేశంలో టీడీపీ నాయకుల కారుపై దాడి చేయడాన్ని ఆ పార్టీ నాయకులే వ్యూహం ప్రకారం వీడియోలు చిత్రీకరించారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు పథకం ప్రకారం తమపై దాడి చేశాయని ఆరోపించారు. తమకు రక్షణ కల్పించడంతో పోలీసుల వైఫల్యం ఉందని కలరింగ్ ఇచ్చారు. సీన్ కట్ చేస్తే మాచర్ల ఘటనపై రూరల్ ఎస్పీ, మాచర్ల టౌన్ సీఐలపై చర్యలకు ఈసీ సిఫార్సు చేసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తే ఎన్నికల ప్రక్రియను భంగం కలిగించాలని టీడీపీ పన్నిన కుట్రలో పోలీసులు బలయ్యారని విమర్శలు వినిపిస్తున్నాయి. పక్కా ప్లాన్‌తో.. పథకం ప్రకారం టీడీపీ నాయకులు ప్రజలను రెచ్చగొట్టి ఏ చిన్న ఘటనలు చోటు చేసుకున్నా వీడియోలు ఫొటోలు చిత్రీకరించేలా వ్యూహాలు రచించారు. ఇందులో భాగంగా టీడీపీ నాయకుల రెచ్చగొట్టే చర్యలకు ఆవేశంతో స్థానికులు దాడి చేయడానికి బుద్దా, బొండా ఉమాల కారును వెంబడిస్తుంటే వారి వెనుక కారులో ప్రయాణిస్తున్న వారు వీడియోలు చిత్రీకరించారే తప్ప పోలీసులకు ఫోన్ కూడా చేయలేదు. సాధారణంగా అపాయం, ప్రాణాపాయ సమయంలో ఎవరైనా వెంటనే పోలీసులకు ఫోన్ చేసి రక్షించాలని కోరతారు. అయితే మాచర్ల ఘటనలో టీడీపీ నాయకులు అలాంటి ఆలోచననే చేయలేదు. సున్నిత ప్రాంతం అని తెలిసి కూడా.. పల్నాడు ప్రాంతం అతిసున్నితమైనదని మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు తెలుసు. అయినా గుంటూరు జిల్లాలో ఉన్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులను కాదని కృష్ణా జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలను మాచర్లకు పంపడం రాజకీయ ఎత్తుగడలో భాగమేనని విమర్శలొస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి రాజకీయ నాయకులు ఏదైనా నియోజకవర్గంలోకి వెళ్లే ముందు ఆ ప్రాంతం, ఆ నియోజకవర్గ ఇన్చార్జిలకు సమాచారం ఇస్తారు. అయితే టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న, బొండా ఉమ మాచర్లకు వస్తున్న విషయం తనకు తెలియదని ఆ నియోజకవర్గ ఇన్చార్జి చలమారెడ్డి పోలీసు అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. మరో వైపు పోలీసులకు సైతం ముందస్తు సమాచారం ఇవ్వకుండా పల్నాడు ప్రాంతానికి వెళ్లి కుట్ర పూరితంగా వ్యవహరించిన టీడీపీ నాయకులు పోలీసుల వైఫల్యం వల్లే తమపై దాడి జరిగిందని విమర్శిస్తున్నారు. టీడీపీ నుంచి అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా పోలీసులే బెదిరించారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ వ్యవస్థపై టీడీపీ వ్యవహరిస్తున్న తీరు విస్మయానికి గురి చేస్తోందని పోలీస్ శాఖ సీనియర్ అధికారులు మండిపడుతున్నారు. టీడీపీ పన్నిన కుట్రల్లో పోలీసులు బలవుతున్నారని పోలీస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. -
కోవిడ్‌కంటే భయంకర రూపం చంద్రబాబు..
నువ్వొద్దుబాబూ అంటూ జనం భూస్థాపితం చేయగా...లోలోన కుళ్లిపోయిన చంద్రబాబు...ఇప్పుడు జనంపై పగ తీర్చుకునేందుకు కోవిడ్ పేరుతో అంతకంటే భయంకర రూపం దాల్చాడు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు బూతంలా మారాడు. లోలోన మంత్రాంగం నడిపి స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడేలా చేశాడు. మార్చి 31వ తేదీ లోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తికాకపోతే 14వ ఆర్థిక సంఘం నుంచి జిల్లాకు విడుదల కావాల్సిన రూ.250 కోట్లు నిలిచిపోనుండగా...ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. అనంతపురం: దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు... ఇలాంటి గ్రామాలకు రెండేళ్లుగా నిధులు లేక అభివృద్ధి పడకేసింది. ఏడాదిన్నరకు పైగా పంచాయతీల ఖజానాల్లో పైసా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని పంచాయతీల్లో రూ.లక్షలు చేతినుంచి ఖర్చు చేసిన కార్యదర్శులు నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. సాధారణ నిధులు అవకాశం ఉన్న పంచాయతీల్లో కాస్తోకూస్తో ఫర్వాలేదు కానీ, మధ్య, చిన్నస్థాయి పంచాయతీల్లో పరిస్థితి ఘోరంగా ఉంది. జిల్లాలోని 1,044 పంచాయతీల్లో దాదాపు 29 లక్షలకు పైగా జనాభా ఉన్నారు. అభివృద్ధిలో భాగంగా ఏడాదికి ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున నిధులను కేంద్రం విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా 14వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి 2018 జూన్ వరకు నిధులు వచ్చాయి. అప్పటి నుంచి పెండింగ్ ఉన్నాయి. గత టీడీపీ ప్రభుత్వం సకాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదు. పైగా గత పాలకవర్గాలు పంచాయతీల్లో పైసా ఉంచకుండా ఉన్న నిధులన్నీ భోంచేశారు. దీంతో గ్రామాల్లో తాగునీరు సమస్య తాండవిస్తోంది. పారిశుద్ధ్య పడకేసింది. 2018–19 సంవత్సరానికి సంబంధించి ఆర్నెళ్లు, 2019–20కు సంబంధించి పూర్తి కోటా కేంద్రం నిధులు రావాల్సి ఉంది. ఈ లెక్కన జిల్లాలోని పంచాయతీలకు దాదాపు రూ. 221 కోట్ల దాకా రావాల్సి ఉంది. అలాగే మున్సిపాల్టీలకు సంబంధించి రూ. 29 కోట్లు కలిపి మొత్తం రూ. 250 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. ఈనెల 31లోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయితేనే ఈ నిధులు వస్తాయి. లేదంటే ఈ నిధులన్నీ వెనక్కు పోయే ప్రమాదముందని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఎక్కడికక్కడే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయించడంతో ప్రక్రియ ఎక్కడికక్కడే ఆగిపోయింది. జిల్లాలో 841 ఎంపీటీసీ స్థానాలకు గాను 50 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థులు 49 మంది, టీడీపీ అభ్యర్థి ఒకరు ఏకగ్రీవమయ్యారు. ఏకగ్రీవమైన అభ్యర్థులను అధికారికంగా ప్రకటించారు. తక్కిన స్థానాలకు ఈనెల 21న పోలింగ్ ఉండేది. బరిలో నిలిచే అభ్యర్థులు శనివారం ఖరారు కావడంతో అదేరోజు రాత్రే బ్యాలెట్ల ప్రింటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ నిలపకుండా పూర్తి చేసేసి మండలాలకు తరలించి స్ట్రాంగు రూంల్లో భద్రపరిచేలా జిల్లా అధికార యంత్రంగా చర్యలు తీసుకుంటోంది. ఇక అవసరమైన బ్యాలెట్ బాక్సులు ఇప్పటికే అన్ని మండలాలకు తరలించారు. పీఓ, ఏపీఓలు, ఓపీఓల నియామం కూడా పూర్తయింది. విధుల కేటాయింపునకు పరిశీలకుల సమక్షంలో ఆదివారం ర్యాండమైజేషన్ జరగాల్సి ఉండగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నియామకమైన స్టేజ్–1 అధికారులకు శిక్షణ జరుగుతుండగా ఆదివారం మధ్యాహ్నానికి నిలుపుదల చేశారు. మైక్రో పరిశీలకులకు శిక్షణ కూడా ఈనెల 17న జరగాల్సి ఉండగా అదీ వాయిదా పడింది. కాగా ఎన్నికల కోడ్ మాత్రం ఈ ఆరు వారా>ల పాటు ఎన్నికల అమలులో ఉంటుందని ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. -
కరోనా ఎఫెక్ట్ ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా
-
నామినేషన్ల స్వీకరణపై వివాదం
మచిలీపట్నం: మచిలీపట్నంలోని భాస్కరపురంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రంలో శుక్రవారం వివాదం చోటుచేసుకుంది. సమ యం దాటిన తరువాత కూడా నామినేషన్ పత్రాలను అభ్యర్థుల నుంచి తీసుకోవటంపై వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భాస్కర పురం పాఠశాల భవనంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో నగర పాలక సంస్థ పరిధిలో 10,11,12 డివిజన్లుకు సంబంధించిన అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఆఖరి రోజు కావటంతో నామినేషన్ పత్రాలు దాఖలకు అధిక సంఖ్యలో అభ్యర్థులు కేంద్రానికి వచ్చారు. మధ్యా హ్నం 3 గంటలు వరకు వచ్చిన నామినేషన్లు మా త్రమే పరిగణలోకి తీసుకోవాలి. అయితే భాస్కర పురంలో కేంద్రంలో 3 గంటల తరువాత కూడా నామినేషన్లు తీసుకున్నారనే సమాచారం తెలుసుకున్న మున్సిపల్ కౌన్సిల్ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు షేక్ సలార్‌దాదా, మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ అచ్చెబా, నగర పాలక సంస్థ కార్పొరేటర్లుగా పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థులు కేంద్రానికి చేరుకొని, దీనిపై కేంద్రం రిటర్నింగ్ అధికారిని వివరణ కోరారు. విషయం తెలుసుకున్న మచిలీపట్నం ఎస్ఐ రాజేష్ తమ సిబ్బందికి అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కేంద్రంలోకి ఎవ్వరనీ వెళ్లనీయకుండా బయటనే ఉంచారు. అయితే 3 గంటల తరువాత 11వ డివిజన్‌కు దేవబత్తిని నిర్మల, 12వ డివిజన్లో చిన్నం రజని, కాకి సునీత నామినేషన్లు అందాయని కేంద్రం రిటర్నింగ్ అధికారి ఎస్.ఉమాదేవి తెలిపారు. నిబంధనల మేరకు వ్యవహరిస్తామని, సమయం మించిన తరువాత ఆ ముగ్గురు అభ్యర్థుల «నామినేషన్ పత్రాలు వచ్చినందున వాటిని తిరస్కరిస్తామని వెల్లడించారు. అయితే ఇదే విషయాన్ని తమకు ధృవీకరించి ఇవ్వాలని నాయకులు పట్టుబట్టారు. చివరిలో వచ్చిన చాలా నామినేషన్ పత్రాల్లో సరైన పత్రాలు సమర్పించలేదనే అనుమానాలు మాకు ఉన్నాయని, వీటిని నివృత్తి చేయాలని షేక్ సలార్ దాదా కోరారు. ఈ విషయాన్ని నగర పాలక సంస్థ కమిషనర్ దృష్టికి అక్కడ నుంచే ఫోన్‌ద్వారా తెలియజేశారు. ఆర్ఓ సిఫార్స్ మేరకు తగిన చర్యలు తీసుకుంటామని, నామినేషన్ పత్రాలు సవ్యంగా జతచేయని అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలనలో తొలగిస్తామని చెప్పారు. దీంతో అక్కడి నుంచి నాయకులు వెళ్లిపోయారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు గూడవల్లి నాగరాజు, థామస్ నోబుల్, అస్గర్ పాల్గొన్నారు. -
టీడీపీ, జనసేన, బీజేపీ ఏకమై దాడులు
టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఏకమయ్యాయి. గతంలో మాదిరిగా దాడులకు పూనుకున్నాయి. రౌడీ మూకలఅండతో రెచ్చిపోయాయి. అధికార పార్టీ నాయకులకు అడుగడుగునా ఆటంకాలు సృష్టించాయి. అనరాని మాటలతో రెచ్చగొట్టాయి. నామినేషన్లు వేయనీయకుండా అడ్డుతగిలాయి. అడ్డొచ్చిన కార్యకర్తలపై కత్తులు దూశాయి. విచక్షణా రహితంగా దాడులకు తెగబడ్డాయి. రక్తసిక్తం చేస్తూ భయాందోళనలు సృష్టించాయి. అధికారులనూ హడలెత్తించాయి. స్థానిక పోరులో తమ కండకావరాన్ని ప్రదర్శించాయి. ప్రతిపక్షాల దౌర్జన్య కాండపై జిల్లా ప్రజానీకం పెదవి విరుస్తోంది. సాక్షి, తిరుపతి: దాడులు.. దౌర్జన్యాలు.. హత్యలు చెయ్యడంలో టీడీపీ శ్రేణులు ఆరితేరిపోయాయి. అధికారంలో ఉన్నా.. లేకపోయినా.. టీడీపీ నాయకుల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దతిప్పసముద్రం మండలం రామాపురం వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్త వెంకటరమణారెడ్డిని టీడీపీ నాయకులు హత్యచేశారు. ఆ ఎన్నికల్లోనే పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ బాబు ప్రయాణిస్తున్న కారును ధ్వంసం చేశారు. ఎంఎస్ బాబును ఎత్తుకెళ్లితీవ్రంగా దాడిచేశారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయన అనుచరుల సహకారంతో ఆస్పత్రిలో చేరి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అసెంబ్లీ ఎన్నికల సమయంలో రామచంద్రాపురం మండలంలో అడుగడుగునా అడ్డుకున్నారు. గణేశ్వరపురంలో కారును ధ్వంసంచేసి దాడికి తెగబడ్డారు. ముంగిలిపట్టులో వైఎస్సార్సీపీ అభ్యర్థులను ప్రచారానికే రానివ్వకుండా అడ్డుకున్నారు. టీటీ కండ్రిగలో జనరల్ ఏజెంట్లను పోలింగ్ కేంద్రానికి రానివ్వకుండా రాళ్లు రువ్వుతూ దాడికి తెగబడ్డారు. దళితులను ఓటెయ్యనివ్వని చరిత్ర టీడీపీది రామచంద్రాపురం మండలం ఎన్ఆర్ కమ్మపల్లి దళితులను చంద్రబాబు సామాజిక వర్గం వారు ప్రతి ఎన్నికల్లో ఓటెయ్యనివ్వకుండా అడ్డుకుంటూ వచ్చారు. సుమారు 40 ఏళ్లు దళితులు ఓట హక్కును వినియోగించుకున్న దాఖలాలు లేవు. ఎమ్మెల్యే చెవిరెడ్డి చొరవతో దళితులు రీపోలింగ్ సమయంలో స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. సదుం, సోమలలో 2015లో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులకు తెగబడ్డారు. కుప్పంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒకటవ వార్డు పోలింగ్ స్టేషన్లోకి చొరబడి బ్యాలెట్ బాక్సును ఎత్తుకెళ్లారు. ప్రత్యేకహోదా కోసం ఆందోళన చేస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్త వెంకటేష్‌బాబుపై దాడిచేశారు. శ్రీకాళహస్తి పరిధిలోని మన్నవరం గ్రామంలో బియ్యపు మధుసూదన్‌రెడ్డిని ప్రచారం చెయ్యనివ్వకుండా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో 23 వార్డు కౌన్సిలర్‌గా నామినేషన్ వెయ్యనివ్వకుండా అడ్డుకున్నారు. పార్థసారథిని చైర్మన్ చేసేందుకు కౌన్సిలర్ రంగస్వామిని కిడ్నాప్‌చేశారు. పాలసొసైటీ ఎన్నికల్లో మునిరాజనాయుడు వైఎస్సార్సీపీ శ్రేణులను నామినేషన్లు వెయ్యకుండా దౌర్జన్యం చేశారు. పుత్తూరులో ఎమ్మెల్యే ఆర్కే రోజాను మహిళ అని కూడా చూడకుండా ప్రభు త్వ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొనకుండా దౌర్జన్యానికి దిగారు. నగ రిలో గంగజాతర సందర్భంగా ఎమ్మెల్యే రోజా, మున్సిపల్ చైర్పర్సన్ శాంతిపై టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. 1989లో మదనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు బ్యాలెట్ పెట్టెలను తీసుకెళ్లి చెరువులో పడేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తపై హత్యాయత్నం తాజాగా శుక్రవారం తొట్టంబేడులో వైఎస్సార్సీపీ కార్యకర్తను హతమార్చేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ప్రయత్నించాయి. బీడీ కాలనీకి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త బత్తెయ్య (40)పై కొందరు ముసుగులు ధరించి కత్తులతో దాడిచేసి హత్య చేసేందుకు ప్రయత్నించారు. కత్తుల దాడిలో బత్తెయ్య తీవ్రంగా గాయపడ్డాడు. రక్తపు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
టీడీపీకి అభ్యర్థులే లేరు: పార్థసారథి
సాక్షి, కృష్ణా: కృష్ణా జిల్లా ఉయ్యూరు మున్సిపాలిటీలో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియను పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పరిశీలించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జడ్పీటీసీ, ఎంపీటీసీ సహా అన్ని మున్సిపాలిటీ స్థానాలను కైవసం చేసుకుంటామని అన్నారు. టీడీపీకి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ముందు ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చామని అన్నారు. డబ్బు, మద్యం పంపిణీ లేకుండా ఎన్నికల్లో గెలుస్తామని పార్థసారథి ధీమా వ్యక్తం చేశారు. చదవండి: ‘ఆయన లాంటి దద్దమ్మను ఎక్కడా చూడలేదు’ -
టీడీపీలో టిక్కెట్ల లొల్లి
సాక్షి, గుంటూరు/కొరిటెపాడు(గుంటూరు): మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీలో టికెట్ల లొల్లి తారాయి స్థాయికి చేరింది. కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా పోటీ చేయడానికి టికెట్ల కోసం తెలుగు తమ్ముళ్లు గొడవలకు దిగుతుంటే మరొకొన్ని చోట్ల అభ్యర్థులు కరవవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఒక కార్పొరేషన్, 7 మున్సిపాల్టీల ఎన్నికల నామినేషన్ల తుది గడువు శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో టికెట్లు ఆశించి భంగపడ్డ వారు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. గుంటూరు కార్పొరేటర్లు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు ఆ పార్టీ వీరవిధేయులు చాలా మంది ఆశించారు. అయితే వారికి టిక్కెట్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని టీడీపీ సీనియర్ నాయకుడు షేక్ మీరావలి ఆధ్వర్యంలో సుమారు 150 మంది కార్యకర్తలతో టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి నసీర్ అహ్మద్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నాకు దిగాడు. 30 సంవత్సరాల పాటు పార్టీకి సేవ చేసిన కార్యకర్తలను పరిగణలోకి తీసుకోవడం లేదని, టిక్కెట్లు అమ్ముకుంటున్నారంటూ మండిపడ్డారు. తూర్పు నియోజకవర్గంలోని 5వ డివిజన్ బీసీకి రిజర్వు అయింది. అయితే టీడీపీ నుంచి డివిజన్లో ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందినవారిని కాకుండా వేరే డివిజన్లోని వారికి కేటాయించారంటూ స్థానిక టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. స్థానికులకే టిక్కెట్ ఇవ్వాలని లేదంటే ఓడించి తీరుతామని హెచ్చరించారు. తన కార్యాలయం ఎదుట కార్యకర్తలు, నాయకులు ధర్నా చేస్తున్నా ఇన్చార్జి నసీర్ బయటికి రాలేదు. షేక్ మీరావలి మాట్లాడుతూ పార్టీ స్థాపించిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా పని చేస్తున్నామని, కనీసం తమ పేరును పరిగణలోకి తీసుకోకపోవడం బాధాకరమన్నారు. అభ్యర్థులు కరువు.. సత్తెనపల్లి, మాచర్ల, చిలకలూరిపేట సహా పలు మున్సిపాలిటీల్లో టీడీపీ నుంచి పోటీకి ముఖ్య నాయకులు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రాక టీడీపీ ఇన్చార్జిలు తలలు పట్టుకుంటున్నారు. కొన్ని మున్సిపాలిటీల్లో అన్ని వార్డుల్లో టీడీపీ బరిలోకి దిగడం కూడా కష్టంగా ఉందని ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు పోటీకి ససేమిరా అంటుండటంతో పోటీలో ఉన్నాంలే అనిపించుకోడానికి ఎవరో ఒకరిని బరిలో నిలుపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఓట్ల కోసం ఎర! ఎన్నికల అనంతరం మేయర్ అభ్యర్థిని ప్రకటించనున్నట్టు ఇప్పటికే వైఎస్సార్ సీపీ స్పష్టం చేసింది. అయితే టీడీపీ అభ్యర్థిని ముందే ఖరారు చేయనున్నట్టు సమాచారం. అయితే మేయర్ అభ్యర్థి ఎవరన్న దానిపై స్పష్టత రాలేదని తెలుస్తోంది. మాజీ ఎంపీ కోడలు, గుంటూరు నగర పార్టీ కీలక బాధ్యతలు చూస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త సతీమణి, ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తిని, లేక ఇటీవల గుంటూరు నగరంలో పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టిన నాయకుడు.. వీరిలో ఎవరో ఒకరిని మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేయాలనే దానిపై అధిష్టానం స్థాయిలో చర్చలు సాగుతున్నాయి. ముందే మేయర్ అభ్యర్థిని ప్రకటించి ఓ వర్గం ఓటర్లను ఆకర్షించాలనే ఉద్దేశంతోనే టీడీపీ ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. -
కాషాయ పవనం.. సైకిల్‌పై పయనం
కాషాయంతో దోస్తీ కట్టిన పవన్ కళ్యాణ్.. మళ్లీ సైకిల్‌పైనే మనసు పారేసుకున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీతో ‘పొత్తు’ పొడిచినా.. ‘పచ్చ’బొట్టును చూసి మనసుమార్చుకున్నాడు. కుట్రలకు తెరతీసి పాతమిత్రునికే లబ్ధి కలిగేలా పావులు కదుపుతున్నాడు. ప్రశ్నించేందుకే వచ్చామంటూ.. ఇప్పటికే జనంలో పలుచనైన జనసేనాని.. ఫ్యాన్ గాలిని తట్టుకోలేక స్థానికంలోనూ సైకిలెక్కి దిగజారుడు రాజకీయం చేస్తుండటం గమనార్హం. అనంతపురం: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ బంధం ఈ నాటిది కాదు. చంద్రబాబు అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఆయనకు అనుకూలంగానే ఉంటారు. తాను ప్రజాగొంతుక అని చెప్పుకునే పవన్‌కళ్యాణ్.. అప్పట్లో టీడీపీ ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలపై ఏ సందర్భంలోనూ çపల్లెత్తు మాట అనలేదు. పైగా అప్పటి ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్సార్సీపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ ఒంటిరిగా పోటీ చేస్తామని చెప్పి.. చివరి నిముషంలో చేతులెత్తేశారు. కొన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టినా నామమాత్రంగా బరిలో నిలిపి పరోక్షంగా టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా నిలిచారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జనసేన ఇదే వైఖరి అవలంబిస్తోంది. బీజేపీతో పొత్తు కుదిరినా.. చాలా స్థానాల్లో పోటీకి దూరంగా ఉంది. దీని వెనుక టీడీపీ మంత్రాంగం నడిపిందనే విషయం స్పష్టమవుతోంది. సార్వత్రికంలో సై..స్థానికంలో నై... గత సార్వత్రిక ఎన్నికల్లో గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన తరఫున పోటీ చేసిన కొట్రికే ముధుసూదన్ 20వేల ఓట్లు సాధించి మూడోస్థానంలో నిలిచాడు. జనసేన పార్టీ అభ్యర్థుల్లో రాయలసీమలోనే అత్యధిక ఓట్లు సాధించాడు. ఈ నియోజకవర్గంలోనూ జనసేన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలుప లేదు. మరోవైపు బీజేపీ కూడా ఈ నియోజకవర్గంలో అభ్యర్థులను నిలపకపోవడం చూస్తే.. టీడీపీకి లబ్ధి చేకూర్చేందుకే ఈ రకమైన ఎత్తుగడ వేశారనే వాదనకు బలం చేకూరుస్తోంది. 13 జెడ్పీటీసీ స్థానాల్లో పోటీకిబీజేపీ, జనసేన దూరం జిల్లాలోని 63 జెడ్పీటీసీ స్థానాలకు గాను 13 స్థానాల్లో అటు బీజేపీ గానీ, ఇటు జనసేన పార్టీగాని అభ్యర్థులను నిలపడం లేదు. ఆత్మకూరు, డి.హీరేహాళ్, గుంతకల్లు, కణేకల్లు, కూడేరు, ఓడీ చెరువు, పామిడి, పెద్దపప్పూరు, పుట్టపర్తి, రాప్తాడు, రాయదుర్గం, శింగనమల, యల్లనూరు జెడ్పీటీసీ స్థానాల్లో ఈరెండు పార్టీలు పోటీకి దూరంగా ఉన్నాయి. అలాగే 841 ఎంపీటీసీ స్థానాలకు గాను బీజేపీ 200, జనసేన 83 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్నాయి. తక్కిన 358 స్థానాల్లో ఆ రెండు పార్టీలుపోటీ చేయలేదు. పుట్లూరు, పెనుకొండ, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, పామిడి, ఓడీ చెరువు, కూడేరు, ఆత్మకూరు, బుక్కపట్నం, డి.హీరేహాళ్, గుంతకల్లు, కణేకల్లు, పుట్టపర్తి, రాప్తాడు, రాయదుర్గం, శింగనమల, యల్లనూరు మండలాల్లో ఒక్క ఎంపీటీసీ స్థానాలకు కూడా బీజేపీ, జనసేన పోటీ చేయకపోవడం విశేషం. మరికొన్ని మండలాల్లో ఒకట్రెండు స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను బరిలో నిలిపారు. పాతబంధానికే ప్రాధాన్యత ఈ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన టీడీపీతో ఉన్న బంధాన్ని తెంచుకోలేకపోతోంది. ఎలాగైనా సరే టీడీపీకి లబ్ధి కలిగేలా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే జిల్లాలో చాలా స్థానాల్లో జనసేన పోటీ నుంచి తప్పుకుంది. కొన్నిచోట్ల పోటీ చేస్తున్నా.. అదీ నామమాత్రమే. ప్రజల్లో తమ పార్టీ పట్ల మరో అభిప్రాయం రాకూడదనే ఉద్దేశంతో నామమాత్రంగా పోటీలో నిలిచినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో జెడ్పీటీసీ స్థానాలు : 63 బీజేపీ, జనసేన నామినేషన్లు దాఖలు చేయని స్థానాలు :13 జిల్లాలో ఎంపీటీసీ స్థానాలు :841 బీజేపీ, జనసేన పార్టీలు నామినేషన్లు దాఖలు చేయని స్థానాలు ;358 -
ఇది ఫెవికాల్ బంధం
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మధ్య అనుబంధం ఫెవికాల్ కన్నా దృఢమైనదని మరోసారి నిరూపితమైంది. స్థానిక సంస్థల్లో మిత్రపక్షం బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నట్లు కనపడుతున్నా, చాలా స్థానాల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ గెలుపు కోసమే జనసేన సహకారం అందిస్తోంది. మొన్నటి అసెంబ్లీ – లోకసభ ఎన్నికల సమయంలో లోపాయికారీగా జనసేన పార్టీ కొన్ని చోట్ల తన సొంత గెలుపును పక్కనపెట్టి టీడీపీ గెలుపునకు సహకరించిన విషయం తెలిసిందే. ఇప్పుడూ అదే రీతిలో ‘స్థానిక’ ఎన్నికల్లో టీడీపీకి కనీస గౌరవం దక్కించడానికి వీలుగా జనసేన అధినేత పావులు కదుపుతున్నారు. ఇదీ అంతర్గత ఒప్పందం ►కొన్ని మండలాల్లో జెడ్పీటీసీ స్థానంలో జనసేన, ఎంపీపీ పదవిని టీడీపీ పంచుకొని పోటీ చేస్తున్నాయి. ►మరికొన్ని మండలాల్లో కొన్ని ఎంపీటీసీ పదవులకు మాత్రమే పోటీ చేసిన జనసేన.. ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులు రెండింటిలోనూ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పని చేస్తోంది. ►తెలుగుదేశం పార్టీ గెలుపునకు కొద్దో గొప్పో అవకాశాలున్న చోట జనసేన అభ్యర్థి పోటీకి సిద్ధమైతే.. వారు నామినేషన్లు ఉపసంహరించుకోవాలని పవన్ కల్యాణ్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే వారు సూచిస్తున్నారు. ►టీడీపీకి వ్యతిరేకంగా పని చేయకుండా ఆయా జిల్లాల నాయకులకు సూచనలు చేసినట్లు సమాచారం. ►టీడీపీ ప్రయోజనాల కోసం బీజేపీని జనసేన వాడుకుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. భీమవరంలోనే పదవుల పంపకం ►పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ స్వయంగా పోటీ చేసి ఓడిపోయిన విషయం విదితమే. ఆ నియోజకవర్గంలో భీమవరం రూరల్, వీరవాసరం మండలాల్లో ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులను టీడీపీ, జనసేన నేతలు పంచేసుకుంటూ లోపాయికారీ ఒప్పందంతో పోటీకి దిగారు. ►భీమవరం జెడ్పీటీసీ బరిలో జనసేన పోటీలో లేదు. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి బరిలోకి దిగారు. ►ఈ మండలంలో కాపు సామాజిక వర్గంతోపాటు మత్స్యకారులు జనసేనకు అండగా ఉంటున్నారు. దీంతో అధికంగా ఓట్లు ఉన్న మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని తెలుగుదేశం పార్టీ తరఫున నిలబెట్టారు. ఇక్కడి ఎంపీపీ పదవిని జనసేన పార్టీకి కేటాయించే విధంగా ఒప్పందం చేసుకున్నారు. ►వీరవాసరం మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉండడంతో జెడ్పీటీసీ స్థానంలో జనసేన, ఎంపీపీ పదవికి టీడీపీ పోటీ చేసే విధంగా ఒప్పందం చేసుకున్నారు. ►భీమవరం రూరల్ మండలంలో జనసేన పార్టీ పోటీ చేస్తున్న వెంప, శ్రీరామపురం, పెదగరవు ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ కనీసం నామినేషన్లు కూడా దాఖలు చేయలేదు. కొన్ని చోట్ల జనసేన నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ, వారి నామినేషన్ల ఉపసంహరణకు ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయి. ►నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలంలో జెడ్పీటీసీ అభ్యర్థిగా తెలుగుదేశం నుంచి అభిశెట్టి పద్మకుమారి నామినేషన్ వేశారు. గతంలో పెరవలి జెడ్పీటీసీగా ఉన్న అరిటికాయల రమ్యశ్రీ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి 24 వేల ఓట్లు సాధించింది. ఇప్పుడు తాజాగా తమకు బలం ఉన్న పెరవలి మండలంలో జనసేన జెడ్పీటీసీ రేసు నుంచి తప్పుకుని తెలుగుదేశం పార్టీకి లోపాయికారీగా మద్దతు ప్రకటించింది. దీనికి ప్రతిఫలంగా ఎంపీపీ పదవి లక్ష్యంగా రమ్యశ్రీ భర్త మురళీకృష్ణ బరిలోకి దిగనున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోనూ అదే వైఖరి ►జనసేన పార్టీలో పవన్ కల్యాణ్ తర్వాత నాదెండ్ల మనోహర్ నిర్ణయాలే కీలకం. మనోహర్ సొంత నియోజకవర్గం గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండలంలో 21 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. టీడీపీకి మేలు జరిగేలా జనసేన నుంచి కేవలం 12 స్థానాలకు మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ స్థానాల్లో జనసేన మిత్రపక్షంగా ఉన్న బీజేపీ సైతం పోటీలో లేదు. ►ఇదే నియోజకవర్గంలోని కొల్లిపర మండలంలో 16 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, 5 స్థానాల్లోనే జనసేన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ►జనసేన పోటీ చేయని 11 స్థానాలకు గాను 3 గ్రామాల్లో మాత్రమే బీజేపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ‘తూర్పు’న లోపాయికారీ ఒప్పందం ►తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి–1 ఎంపీటీసీ స్థానంలో టీడీపీ తరఫున పోటీ చేస్తున్న మాజీ జెడ్పీటీసీ సభ్యుడు దేశంశెట్టి లక్ష్మీనారాయణ సతీమణి దేశంశెట్టి రత్నకుమారికి మేలు జరిగేలా జనసేన వదులుకుంది. ►ఈ ఎంపీటీసీ స్థానం పరిధిలో గత సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మెజార్టీ వచ్చింది. రెండో స్థానంలో జనసేన నిలిచింది. అతి తక్కువ ఓట్లు వచ్చి మూడో స్థానంలో నిలిచిన టీడీపీకి ఇక్కడ జనసేన మద్దతు ఇవ్వడం గమనార్హం. ఇందుకు బదులుగా భీమనపల్లి–2 ఎంపీటీసీ స్థానాన్ని జనసేన కోసం టీడీపీ వదులుకుంది. ►అమలాపురం మండలంలో గత సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తొలి స్థానంలో నిలబడగా జనసేన రెండో స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఈ జెడ్పీటీసీ స్థానానికి పెద్దగా పేరు లేని చీకురమిల్లి కిరణ్‌కుమార్‌ను జనసేన ఎంపిక చేసింది. ఇక్కడ టీడీపీ నుంచి పోటీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు కోసమే జనసేన బలహీన అభ్యర్థిని బరిలోకి దించింది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం గడియారం స్తంభం సెంటర్లో జనసేన, టీడీపీ జెండాలతో ర్యాలీ పావుగా మారిన బీజేపీ జెడ్పీటీసీ స్థానాల్లో జనసేన కాకుండా బీజేపీ పోటీలో ఉంటేనే టీడీపీకి గౌరవప్రదమైన సంఖ్యలో ఓట్లు వస్తాయని జనసేన పెద్దలు వ్యూహం పన్నారు. ఇందులో భాగంగానే జెడ్పీటీసీ స్థానాల్లో అత్యధికం బీజేపీ.. ఎంపీటీసీ స్థానాల్లో అత్యధికం జనసేన పార్టీలు పోటీ చేయాలని ఒప్పందం చేసుకున్నారు. ఈ ప్రకారం మొత్తం 652 జెడ్పీటీసీ స్థానాల్లో అత్యధికంగా 433 మంది బీజేపీ అభ్యర్థులు, 270 మంది జనసేన అభ్యర్థులు (కొన్ని చోట్ల ఇద్దరు అభ్యర్థులు) నామినేషన్లు దాఖలు చేశారు. ►ఒప్పందం మేరకు ఎంపీటీసీ స్థానాల విషయంలో జనసేన పార్టీ దాదాపు మూడింట రెండు వంతుల ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేయాల్సి ఉంది. ►కానీ 9,696 ఎంపీటీసీ స్థానాలకు గాను జనసేన అభ్యర్థులను బరిలోకి దించింది కేవలం 2,027 స్థానాల్లో మాత్రమే. బీజేపీ తరఫున కేవలం 1,816 మంది అభ్యర్థులు ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేశారు. అంటే ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నది 3,843 చోట్ల మాత్రమే. ►మిగిలిన చోట్ల లోపాయికారీ ఒప్పందం ప్రకారం జనసేన టీడీపీ అభ్యర్ధులకే మద్దతు ఇవ్వనుంది. ►అనంతపురం జిల్లాలో 13 జెడ్పీటీసీ స్థానాల్లో బీజేపీ–జనసేన అభ్యర్థులను బరిలో నిలుపలేదు. ►841 ఎంపీటీసీ స్థానాలకు గాను బీజేపీ 200, జనసేన 83 స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశాయి. టీడీపీకి మేలు జరిగేలా మిగిలిన స్థానాలకు నామినేషన్లు వేయలేదు. -
‘ఇంతమంది ఎలా నామినేషన్లు వేశారు బాబూ’
సాక్షి, విశాఖపట్నం : స్థానిక సంస్థల ఎన్నికల్లో అలజడి సృష్టించేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన యత్నిస్తున్నాయని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టబద్ధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుంటే ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 9,696 ఎంపీటీసీ స్థానాలకు 50,063 నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. వీటిలో వైఎస్సార్సీపీ 23 వేలు, టీడీపీ 18వేలు, జనసేన 2వేలు, బీజేపీ 1800 నామినేషన్లు దాఖలు చేశాయని చెప్పారు. చంద్రబాబు ఆరోపిస్తున్నట్టు నామినేషన్ల ప్రక్రియలో ఇబ్బందులు ఉంటే ఇన్ని వేల మంది ఎలా నామినేషన్లు వేశారని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో గెలవలేమనే చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఎక్కడైనా పర్యటించవచ్చని మంత్రి తెలిపారు. ఎన్నికల సమయంలో సున్నితమైన ప్రాంతాలకు వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం ఇచ్చి పర్యటించాలని సూచించారు. బొండా ఉమా 15 కార్లలో గూండాల మాదిరిగా వెళ్లారని.. అలా వెళితే ప్రజలు అడ్డగించరా అని మంత్రి ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సినిమాలు అలవాటని, అందుకనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం దిగజారిందని ప్రజలకు తప్పుడు సినిమా చూపిస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ అన్ని వర్గాలకు మేలు చేస్తున్నారని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారని మంత్రి కొనియాడారు. మార్పు తెచ్చేందుకే ఎన్నికల వేళ డబ్బు, మద్యం పంపిణీ జరగకూడదని చట్టం తెచ్చామని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. చదవండి: చంద్రబాబు, లోకేశ్ పలకరేం!? -
వలసల జోరు.. టీడీపీ బేజారు
జిల్లాలో టీడీపీ పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో చావుతప్పి కన్నులొట్టబోయిన ఆ పార్టీ.. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కనీసం పోటీ చేసేందుకు అభ్యర్థులు లేక చతికిలపడుతోంది. ఇప్పటి వరకు ఆ పార్టీకి అండగా నిలబడిన ద్వితీయశ్రేణి నాయకత్వం.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేస్తున్న నిష్పాక్షిక పాలనకు జై కొడుతోంది. ఫలితంగా వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికే వందల సంఖ్యలో నాయకులు వైఎస్సార్ సీపీ కండువా కప్పుకున్నారు. ఎన్నికల తేదీ నాటికి ఈ జాబితా మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష టీడీపీ అచేతనావస్థకు చేరడంతో ఆ పార్టీ నుంచి వైఎస్సార్ సీపీ వైపునకు వచ్చేందుకు పలు నియోజకవర్గాల్లోని నాయకులు ఆసక్తి చూపుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు వలసలు ఊపందుకున్నాయి. అనేక నియోజకవర్గాల్లో ఇప్పటికే కొంతమంది నేతలు వైఎస్సార్ సీపీ కండువాను కప్పుకోగా.. ఎన్నికల నాటికి మరికొంతమంది పార్టీ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ముందు ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీని వీడటం వల్ల గ్రామ, మండల స్థాయిలో అంతంత మాత్రంగా ఉన్న టీడీపీ మరింత బలహీన పడే అవకాశాలున్నాయి. ఎన్నికలకు ముందే.. గుడివాడ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్, టీడీపీ నేత జోగా సూర్యప్రకాశరావు, నందివాడ మండలం జిల్లా సెక్రటరీ తమ్మినేని రూమేశ్వరరావు ఆధ్వర్యంలో 300 మంది, గుడివాడ రూరల్ మండల యూత్ అధ్యక్షుడు బాతీ ఆధ్వర్యంలో 200 మంది రాష్ట్ర మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. మైలవరం నియోజకవర్గం రెడ్డి గూడెంలో టీడీపీ నేత రామినేని వెంకటేశ్వరరావు తన అనుచరులు 50 మందితో కలిసి వైఎస్సార్ సీపీలో చేరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 40వ డివిజన్ అధ్యక్షుడు ఎస్ఈ అతీక్ తన అనుచరులతో కలిసి వైఎస్సార్ సీపీ కండువా కప్పుకున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని చల్లపల్లికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర బీసీ సంఘం నేత మోర్ల ప్రసాద్ తన అనుచరులతోనూ, నందిగామ మండలం ఏటిపట్టు, రుద్రవరం గ్రామాలకు చెందిన పలువరు టీడీపీ నేతలు ఆ పార్టీని వీడి ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావుల ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఇంకా తిరువూరు, కైకలూరు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ వైపు అడుగులు వేశారు. బేషరతుగానే.. వైఎస్సార్ సీపీలోకి బేషరతుగానే చేరేందుకు టీడీపీ నేతలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే వైఎస్సార్ సీపీలో సీట్ల కోసం ఆశావహుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు టీడీపీ నుంచి తీసుకున్న వారు పోటీ పడితే ఇబ్బందులు ఎదురవుతాయని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పట్ల ఆకర్షితులవ్వడమే కాకుండా, గ్రామాలను అభివృద్ధి చేస్తారని నమ్మి పార్టీలు మారుతున్నారు. వైఎస్సార్ సీపీలో పనిచేయడం ద్వారా గుర్తింపు తెచ్చుకోవడానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు లభించక జిల్లా నాయకత్వం నానా ఇబ్బందులు పడుతోంది. ఈ స్థాయిలో క్యాడర్ పార్టీని వీడితే టీడీపీ అభ్యర్థులకు గెలుపు కష్టమేనని పార్టీలోని సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. పట్టించుకోని నియోజకవర్గ నేతలు.. గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఇప్పుడు ఎన్నికలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. జిల్లా, రాష్ట్ర నాయకత్వం కూడా కార్యకర్తల విషయంలో పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో కార్యకర్తలు పార్టీ నేతల తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
డామిట్..కథ అడ్డం తిరిగింది!
ఒంగోలు టౌన్ :డామిట్! కథ అడ్డం తిరిగింది!! ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ డివిజన్ నుంచే పోటీ చేస్తానంటూ ఇప్పటి వరకు ప్రగల్భాలు పలుకుతూ వచ్చిన ప్రధాన రాజకీయ పార్టీల కార్పొరేట్ అభ్యర్థుల తలరాతలు మారాయి. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా ఈ డివిజన్ మనదే. మనమే గెలుస్తామంటూ తమ అనుచరులకు గట్టి భరోసా ఇస్తూ వచ్చిన ప్రతిపాదిత అభ్యర్థులు బొక్కబోర్లా పడ్డారు. నాకు, మా పార్టీకి కంచుకోటగా ఉంటుందంటూ చెప్పుకొచ్చినవారు రిజర్వేషన్ల పుణ్యమా అంటూ మరో డివిజన్ చూసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఒంగోలు నగర పాలక సంస్థలో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. ఈ డివిజన్లకు సంబంధించిన రిజర్వేషన్లను ఆదివారం ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ డివిజన్ నుంచి పోటీ చేసేది నేనేనంటూ చెప్పుకుంటూ వచ్చిన అభ్యర్థుల్లో కొంత మందికి స్థానచలనం కలిగింది. దీంతో తమకు అనుకూలమైన డివిజన్లపై కార్పొరేట్ అభ్యర్థులు కన్ను వేశారు. ఆ డివిజన్ నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న విషయమై తన వర్గీయులతో చర్చల్లో మునిగిపోయారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల్లో ఎక్కువగా ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అనేక చోట్ల ప్రతిఘటన ఒంగోలు నగర పాలక సంస్థలోని డివిజన్లను రిజర్వేషన్ల ద్వారా మార్పులు చేర్పులు చేసుకున్న నేపథ్యంలో అప్పటి వరకు ఆ డివిజన్ తానేదంటూ కర్చీఫ్ పరచినట్లుగా ఉన్న ప్రతిపాదిత అభ్యర్థులకు ఇతర డివిజన్లలో ప్రతిఘటన ఎదురుకానుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి అన్ని డివిజన్లలో నాయకత్వాలు బలంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల కారణంగా మారిన సమీకరణలతో ఆ డివిజన్లో స్థానికంగా ఉంటున్న ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కార్పొరేట్ పదవిపై కన్నేశారు. అదృష్టం తలుపు తట్టినట్లుగా తన సామాజిక వర్గానికి రిజర్వ్ అయితే ఇక్కడి స్థానాన్ని మరో డివిజన్‌కు చెందిన నాయకుడు వచ్చి పాగా వేస్తానంటూ ఎలా కుదురుతుందని తమ నాయకుల వద్ద ప్రశ్నించడం మొదలెట్టారు. రిజర్వేషన్ల పుణ్యమా అంటూ వచ్చిన ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేది లేదంటూ తమ నాయకులకు తేల్చి చెబుతున్నారు.ఈ పరిస్థితి ఒంగోలు నగర పరిధిలోని పలు డివిజన్లలో చోటు చేసుకుంటుంది. ఈ పంచాయతీని చక్కదిద్దేందుకు రెండు పార్టీలకు చెందిన కొంతమంది ద్వితీయశ్రేణి నాయకులు రంగంలో దిగుతున్నారు. రంగంలోకి నాయకత్వాలు ఒంగోలు నగర పాలక సంస్థలో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. ప్రతి డివిజన్ నుంచి ఒకరు చొప్పున కార్పొరేటర్ ఎన్నిక కానున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో సామాజిక వర్గాల వారీగా ఓటర్ల జాబితాను ఆధారం చేసుకొని జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ పోల భాస్కర్ రిజర్వేషన్లను ఖరారు చేశారు. మొత్తం ఎస్టీ జనరల్‌కు ఒక డివిజన్, ఎస్సీ మహిళలకు నాలుగు డివిజన్లు, ఎస్సీ జనరల్‌కు ఐదు డివిజన్లు రిజర్వ్ చేశారు. బీసీలకు సంబంధించి మహిళలకు ఏడు డివిజన్లు, బీసీ జనరల్‌కు ఎనిమిది డివిజన్లు రిజర్వ్ చేశారు. జనరల్ కోటాలో మహిళలకు 14 డివిజన్లు రిజర్వ్ చేశారు. 11 డివిజన్లను అన్ రిజర్వ్డ్ కింద ప్రకటించారు. ఈ నేపథ్యంలో తమ సామాజిక వర్గాలకు చెందిన బలమైన అభ్యర్థులను కార్పొరేటర్లుగా నిలబెట్టేందుకు ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఒక డివిజన్ నుంచి మరో డివిజన్‌కు జంపింగ్ చేసే బలమైన అభ్యర్థుల విషయంలో ఆ డివిజన్‌కు చెందిన నాయకులను బుజ్జగించేందుకు సిద్ధమవుతున్నారు. ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల ఘట్టం దగ్గర పడుతుండటంతో రిజర్వేషన్ల పంచాయతీని చక్కదిద్దుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. -
‘వాలంటీర్లను ఎన్నికల విధులకు ఉపయోగించం’
సాక్షి, వైఎస్సార్ కడప : నేటి నుంచి (శనివారం) జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అన్బురాజన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 9వ తేదీ నుంచి 11 తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ స్వీకరించనున్నట్లు తెలిపారు. 14వ తేదీన ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్‌ను ప్రకటిస్తామని, 21న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 24న ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. (ఏపీ: ‘స్థానిక’ ఎన్నికల షెడ్యూల్ విడుదల) కలెక్టర్ మాట్లాడుతూ.. ‘‘24 న తేదీ ఉదయం 8 నుండి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం. జిల్లా వ్యాప్తంగా 1985 పోలింగ్ స్టేషన్ గుర్తించాము. జిల్లా స్థాయిలో 20 వేల మంది సిబ్బందితో ఎన్నికల నిర్వహణ చేపడతాము.. గ్రామ, వార్డు వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల విధులకు ఉపయోగించకూడదని ఆదేశాలు జారీ చేశాము. ఎన్నికలకు 10879 బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయి. 1821 బాక్సులు అదనంగా కావాల్సి ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు తెలిపాము. ప్రతి పోలింగ్ బూత్‌లో అన్ని మౌలిక సదుపాయాల కల్పిస్తాం. మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ ఏ మునిసిపాలిటీ కి సంబంధించి అక్కడే జరుగుతాయి. 807 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఏవి కూడా కోర్టులో కేసులు లేవు. అన్ని చోట్ల ఎన్నికలు జరుగుతాయి. రాజంపేట, బద్వేలు ఎన్నికలకు హైకోర్టు స్టే వచ్చినట్లు సమాచారం. ఈ రెండు ప్రాంతాలు తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో ఎన్నికలు సజావుగా జరుగుతాయి’’. అని పేర్కొన్నారు. (‘ఆయన సిగ్గు, శరం లేని మనిషి’) ఎస్పీ అన్బురాజన్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో భాగంగా ఎక్కడా అక్రమంగా డబ్బులు, మద్యం తరలిస్తే, పంచినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసు అనుమతి లేకుండా ఎక్కడా ప్రచారం నిర్వహించరాదని, ఎన్నికలు సజావుగా జరిగేందుకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అవసరమైతే పక్క జిల్లాల నుంచి ఫోర్స్‌ను వాడుకుంటామని తెలిపారు. 6 వేల మంది భారీ పోలీసు బలగాలతో ఎన్నికల నిర్వహణ చేపడుతున్నట్లు, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి సహకారంతో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. (ఏపీ : జెడ్పీ రిజర్వేషన్లు.. 6 స్థానాలు వారికే) స్థానిక సంస్థల ఎన్నికలపై బొత్స కీలక ప్రకటన -
చంద్రబాబుకు మల్లాది విష్ణు సవాల్..
సాక్షి, విజయవాడ : చంద్రబాబుకు ఎన్నికల భయం పట్టుకుందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. అందుకే ఎన్నికలు ఆపాలని కుట్రలు పన్నుతున్నారని ఆయనమండిపడ్డారు. ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లు గురుంచి ఇన్నాళ్లు మాట్లాడని చంద్రబాబు.. ఇప్పుడు ఎన్నికల సమయంలో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్నికలు జరిపాలని చూస్తుంటే, స్టేల కోసం టీడీపీ నాయకులు యత్నిస్తున్నారని మండిపడ్డారు.బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబు కోల్పోయారన్నారు. (‘బీసీల పట్ల ప్రేమ అంటూనే కోర్టుకు వెళ్తారా..’) అధికారంలో ఉండగా చంద్రబాబు బీసీలకు చేసిందేమి లేదని, గడిచిన ఎన్నికల్లో బీసీలు వైఎస్సార్సీపీకి అండగా నిలిచారని మల్లాది విష్ణు గుర్తు చేశారు. టీడీపీ నాయకులు ప్రభుత్వం పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, రానున్న స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం కనుచూపు మేరలో కూడా కనిపించదని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటే లోకేష్ ఏడుపు గొట్టు మాటలు మాట్లాడుతున్నారని, అధికారం కోల్పోయారని తండ్రి కొడుకు కడుపు మంటతో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్నారు. ఎన్నికల హామీలు 90 శాతం అమలు చేశామని తెలిపారు. (టీడీపీకి మరోసారి బుద్ధి చెప్పాలి: మంత్రి బొత్స) ‘‘బీసీలకు ఎవరు మేలు చేశారో చర్చిదాం. మీరు సిద్దమేనా...? గత ఐదేళ్లలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వ్యక్తి చంద్రబాబు. కులాల మతాల ప్రస్తావనతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వ్యక్తి చంద్రబాబు. సీఎం జగన్ పారదర్శకంగా పాలన సాగిస్తున్నారు. సంక్షేమ పథకాలు డోర్ డెలివరీ చేసేలా చర్యలు చేపట్టారు. ఒక్కరోజులోనే 95 శాతం పింఛన్లు పంపిణీ చేసిన ఘనత మాది. ప్రజలు తిరస్కరించిన వ్యక్తి చంద్రబాబు. విద్య, వైద్య రంగాల్లో ఏపీని అగ్రగామిగా నిలపాలని సీఎం చూస్తున్నారు. బోండా ఉమా నిరాశలో ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారని విమర్శించారు. విడతల వారిగా మద్యం నియంత్రణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని అన్నారు. చిత్తశుద్ధి,నిజాయితీ ఉంటే మీ అయిదు సంవత్సరాల పాలనపై, మా తొమ్మిది నెలల పాలపై చర్చకు సిద్దమా...?’’ అంటూ చంద్రబాబుకు మల్లాది విష్ణు సవాల్ విసిరారు. -
వైఎస్ జగన్ నిర్ణయంపై జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, అనంతపురం : టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన చట్టంపై బుధవారం ఆయన స్పందించారు. నూతన చట్టం అమలు అయితే ఎన్నికల్లో పోటీ చేయలేమని పేర్కొన్నారు. కాగా స్థానిక ఎన్నికల్లో డబ్బు, మద్యం నిషేదిస్తూ సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. డబ్బు, మద్యం పంచినట్లు రుజువైతే మూడు సంవత్సరాల పాటు జైలుశిక్ష తప్పదని సీఎం ఆదేశాలపై జేసీ మాట్లాడుతూ.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉంటామని.. మున్సిపల్, సర్పంచ్, పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయమని తెలిపారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ చేయవద్దంటే ఎలా అని.. డబ్బు పంచితే జైలుకు వెళ్లాలా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి చట్టం ఉంటే పోటీ చేసినా ప్రయోజనం ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశారు. (జేసీ ఫోర్జరీ కేసులో సరికొత్త ట్విస్ట్) ‘గత స్థానిక ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ చేసే మా వాళ్లు ఎన్నికల్లో గెలిచారు. వచ్చే ఎన్నికల్లో మా అనుచరులు దూరంగా ఉంటారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో ఇటాంటి చట్టాలు లేవు కనుకే పోటీ చేస్తున్నాం. చంద్రబాబు అదృష్టవంతుడు.. విశాఖలో ఎలాంటి భౌతిక దాడి లేకుండానే క్షేమంగా బయటపడ్డారు’.అని వ్యాఖ్యానించారు. (అల్లు అర్జున్, విజయ్ డైట్ తెలుసుకోవాలి: హృతిక్ ) -
సీఎం కేసీఆర్ చేతికి లిస్ట్
సాక్షి, హైదరాబాద్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) మేనేజింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్లు మంగళవారం స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలన, ఉప సంహరణ కార్యక్రమం మంగళవారం సాయంత్రం ఐదు గంటల లోపు పూర్తి కానుంది. మేనేజింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం కాని పక్షంలో ఈ నెల 28న ఎన్నిక నిర్వహించి, అదే రోజు సాయంత్రం ఫలితాన్ని ప్రకటిస్తారు. తిరిగి ఈ నెల 29న డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించి నూతన పాలక మండలికి బాధ్యతలు అప్పగిస్తారు. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని పూర్వం ఉమ్మడి జిల్లాల వారీగా తొమ్మిది డీసీసీబీ, డీసీఎంఎస్‌ల పాలక మండలి ఎన్నికలను సహకార ఎన్నికల అథారిటీ నిర్వహిస్తోంది. ఒక్కో డీసీసీబీకి 20 మందిని మేనేజింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నుకోవాల్సి ఉండగా, ఇందులో ఏ క్లాస్ సొసైటీలుగా పేర్కొనే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నుంచి 16 మందిని ఎన్నుకుంటారు. బీ క్లాస్ సొసైటీలుగా పేర్కొనే చేనేత, ఉద్యోగ, గీత, మత్స్య సహకార సంఘాల నుంచి నలుగురిని ఎన్నుకుంటారు. డీసీఎంఎస్‌లకు పది మంది డైరెక్టర్లను ఎన్నుకోవాల్సి ఉండగా, ఏ క్లాస్ సొసైటీల నుంచి ఆరుగురు, బీ క్లాస్ సొసైటీల నుంచి నలుగురిని ఎన్నుకుంటారు. డీసీసీబీలన్నీ టీఆర్ఎస్ ఖాతాలోకే! ఇటీవల జరిగిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంస్థల (పీఏసీఎస్) ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో టీఆర్ఎస్ మద్దతుదారులే చైర్మన్లుగా ఎన్నికయ్యారు. డీసీసీబీ, డీసీఎంఎస్ మేనేజింగ్ కమిటీ ఎన్నికల్లో వీరి ఓట్లే కీలకం కానుండటంతో మేనేజింగ్ కమిటీ సభ్యులు కూడా టీఆర్ఎస్కు చెందిన వారే ఎన్నికయ్యే అవకాశముంది. చాలాచోట్ల పోటీ లేకుండా టీఆర్ఎస్ మద్దతుదారులను మేనేజింగ్ కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ మేరకు మంత్రులు రెండు రోజులుగా ఉమ్మడి జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, కీలక నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేసి ఆశావహుల జాబితాను రూపొందించారు. మరోవైపు డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవులను ఆశిస్తున్న టీఆర్ఎస్ నేతలు మేనేజింగ్ కమిటీ సభ్యులుగా నామినేషన్లు వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మేనేజింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన వారే డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవులకు పోటీ పడే అవకాశం ఉంటుంది. పీఏసీఎస్ డైరెక్టర్, చైర్మన్ పదవుల ఎంపికలో స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్రియాశీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం జరిగే డీసీసీబీ, డీసీఎంఎస్ మేనేజింగ్ కమిటీ పదవులను ఆశించే వారి ఎంపికను మాత్రం సంబంధిత జిల్లా మంత్రులకు అప్పగించారు. మరోవైపు జిల్లాల వారీగా డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవులు ఆశిస్తున్న ఆశావహుల జాబితాను జిల్లాల వారీగా క్రోడీకరించి పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు జిల్లా మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు అప్పగించినట్లు సమాచారం. జాబితాకు తుదిరూపు.. టెస్కాబ్ చైర్మన్ పదవిని ఆశిస్తున్న కొందరు టీఆర్ఎస్ నేతలు డీసీసీబీ చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ పదవి దక్కని కొందరు నేతలకు డీసీఎంఎస్ చైర్మన్ పదవిని ఇవ్వడం ద్వారా సంతృప్తి పరిచే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాల వారీగా.. డీసీసీబీ పీఠం కోసం నల్లగొండ నుంచి గొంగిడి మహేందర్‌రెడ్డి, మల్లేశ్ గౌడ్, ఏసిరెడ్డి దయాకర్‌రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. పాలమూరు నుంచి మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డికి కేటీఆర్ ఇప్పటికే హామీ ఇచ్చారు. మెదక్ నుంచి దేవేందర్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, బక్కి వెంకటయ్య పేర్లు సీఎం పరిశీలనకు పంపినట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా నుంచి మనోహర్‌రెడ్డి, నవాబ్‌పేట మండలం అర్కతలకు చెందిన పోలీస్ రాంరెడ్డి, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి పదవిని ఆశిస్తున్నారు. ఉద్యమ సమయం నుంచి పార్టీలో ఉన్న రాంరెడ్డి, మనోహర్‌రెడ్డి పేర్లు సీఎం పరిశీలనకు వెళ్లినట్లు తెలిసింది. కరీంనగర్ నుంచి టెస్కాబ్ మాజీ చైర్మ న్ కె.రవీందర్రావు, నిజామాబాద్ నుంచి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తనయుడు భాస్కర్‌రెడ్డి, ఆదిలాబాద్ నుంచి అడ్డి బోజారెడ్డి, దామోదర్‌రెడ్డి, వరంగల్ నుంచి మార్నేని రవీందర్రావు, గుండేటి రాజేశ్వర్‌రెడ్డి, ఖమ్మం జిల్లా నుంచి తు ళ్లూరు బ్రహ్మయ్య, సత్వాల శ్రీనివాస్‌రావు, కూరాకుల నాగభూషణం పేర్లు జాబితాలో ఉన్నాయి. -
ఏప్రిల్ మొదటి వారంలో రాత పరీక్ష!
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ మొదటి వారంలో రాత పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 19 రకాలైన 16,208 ఉద్యోగాలకు జనవరి 10న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 7 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించారు. మొత్తంగా 11,06,614 మంది దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఉద్యోగాల నియామకానికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న పంచాయతీరాజ్ శాఖ.. ఏప్రిల్ మొదటి వారంలో రాత పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఐదు రోజుల పాటు ఈ పరీక్షలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఒకవేళ రాష్ట్రంలో ఏప్రిల్ మొదటి వారంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంటే.. ఈ ఉద్యోగాల రాత పరీక్షలు మరికొంత కాలం వాయిదా పడే అవకాశం ఉందని కూడా తెలిపారు. రానున్న వారం పది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశాన్ని పరిశీలించి రాత పరీక్షల తేదీలపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. -
ఎన్నికల్లో సంస్కరణలు చేపట్టాలి: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, అమరావతి: గ్రామ స్థాయి నుంచే ఎన్నికల సంస్కరణలు చేపట్టాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. స్థానికంగా నివాసం ఉండేలా సర్పంచ్‌లకు నిబంధనలు రూపొందించాలని అలాగే డబ్బు, మద్యం పంపిణీ జరగకుండా ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల నియమావళిని రూపొందించాలని తెలిపారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే అనర్హత వేటు వేయాలని సూచించారు. అందరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ఉగాది కల్లా పేదలందరికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు. వికేంద్రీకరణకు ప్రజలందరు మద్దతు తెలుపుతున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. -
ఎన్నికల్లో సంస్కరణలు చేపట్టాలి
-
స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్దం
సాక్షి, విజయవాడ: స్థానిక ఎన్నికల రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు తుది తీర్పు వెలువడగానే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ సెక్రటరీ రామసుందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్పందించారు. మీడిమాతో ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలు(కార్పొరేషన్, మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల)కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలను పేపర్ బ్యాలెట్‌లోనే నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఏపీలో 1,5732 బ్యాలెట్ బాక్స్‌లు సిద్ధంగా ఉన్నాయని, కేరళ, తమిళనాడు, రాష్ట్రాల నుంచి 13, 227 బ్యాలెట్ బాక్సులను తెప్పించామని తెలిపారు. ప్రస్తుతం 1,18,959 బ్యాలెట్ బాక్స్‌లు సిద్ధంగా ఉంచామని, తెలంగాణ రాష్ట్రం నుంచి 40 వేల బ్యాలెట్ బాక్స్‌లు ఇచ్చేందుకు అనుమతించారని పేర్కొన్నారు. సర్పంచ్, ఎం.పి.టి.సి ఎన్నికలకు పింక్ కలర్ పేపర్, మున్సిపాలిటీ జెడ్పీటీసీ, వార్డు సభ్యుల ఎన్నికలకు వైట్ కలర్ పేపర్ ఉపయోగిస్తామని అన్నారు. పంచాయితీ ఎన్నికలను రాజకీయ పార్టీల రహితంగా ఫ్రీ సింబల్స్ ఉపయోగిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు కావాల్సిన సామగ్రి సిద్ధంగా ఉందన్నారు. -
4 వారాల్లో తేల్చండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ 176పై సుప్రీంకోర్టు స్టే విధించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల్లో జీఓ 176 జారీ చేసిన సంగతి తెలిసిందే. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న సుప్రీంకోర్టు గత తీర్పు నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం 59.85 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై విచారణ జరపాలని ఏపీ హైకోర్టుకు సూచించింది. ఈ రిజర్వేషన్ల వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాలను నాలుగు వారాల్లోగా తేల్చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే, న్యాయమూర్తులు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాలు చేస్తూ బీసీ రామాంజనేయులు, బిర్రు ప్రతాప్‌రెడ్డి, మరికొందరు కొద్దిరోజుల క్రితం హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం, ప్రభుత్వం నిర్ణయించిన 59.85 శాతం రిజర్వేషన్లపై జోక్యానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ నెల 17న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనిని సవాలు చేస్తూ బీసీ రామాంజనేయులు, బిర్రు ప్రతాప్‌రెడ్డిలు వేర్వేరుగా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేశారు. మంత్రివర్గంలో, నామినేటెడ్ పదవుల్లో, ఇతర ప్రభుత్వ పదవుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు బలహీనవర్గాలకు పెద్దపీట వేసిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో స్థానిక సంస్థల్లోను బలహీనవర్గాలకు తగిన న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్ చట్టం ఆధారంగానే రిజర్వేషన్లు కల్పించాం సుప్రీంలో విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు అంజనా ప్రకాశ్, ప్రేరణా సింగ్ తదితరులు వాదనలు వినిపిస్తూ, కె.కృష్ణమూర్తి వర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రిజర్వేషన్లు 50 శాతం దాటరాదని సుప్రీంకోర్టు 2010లో తీర్పునిచ్చిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే 50 శాతం దాటొచ్చని తీర్పులో చెప్పారని, ఏపీలో అలాంటి పరిస్థితులేవీ లేవని వివరించారు. సుప్రీం గత తీర్పుకు విరుద్ధంగా రిజర్వేషన్లు కల్పించడాన్ని ఎలా సమర్ధించుకుంటారని ఏపీ ప్రభుత్వ న్యాయవాది ఆర్.వెంకటరమణిని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ సందర్భంగా వెంకటరమణి స్పందిస్తూ.. 1994 పంచాయతీరాజ్ చట్టంలో జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనుందని.. ఆ మేరకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని చెప్పారు. హైకోర్టు తేల్చడమే సబబు: సుప్రీం ఆ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, రిజర్వేషన్లు 50 శాతం దాటరాదన్న తమ తీర్పును వచ్చే పదేళ్లలో కూడా అమలు చేసే పరిస్థితులు కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. వచ్చే ఎన్నికల్లో కాకున్నా, ఆ వచ్చే ఎన్నికల నాటికైనా చట్టాన్ని సవరించి తమ తీర్పును అమలు చేస్తారని ఆశిస్తున్నామని పేర్కొంది. ఏది ఏమైనా తమ తీర్పును మాత్రం అమలు చేసి తీరాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటొచ్చని కృష్ణమూర్తి కేసులో సుప్రీం చెప్పిందని వెంకటరమణి చెప్పగా, ఆ ప్రత్యేక పరిస్థితులు కేవలం షెడ్యూల్ ప్రాంతాలకే పరిమితమని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. ఇంతవరకు ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయలేదన్న విషయాన్ని ధర్మాసనం దృష్టికి వెంకటరమణి తీసుకొస్తూ.. ఎన్నికలకు ముందే రిజర్వేషన్ల వ్యవహారాన్ని హైకోర్టు తేలుస్తామంటే తమకు అభ్యంతరం లేదని ధర్మాసనానికి వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ఈ వ్యవహారాన్ని కేసు పూర్వపరాల ఆధారంగా నిబంధనలకు లోబడి హైకోర్టే తేల్చడం సబబని అభిప్రాయపడింది. సంక్రాంతి సెలవుల అనంతరం ఈ నెల 20న హైకోర్టు కార్యకలాపాలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ రోజున తామిచ్చిన ఉత్తర్వులను సీజే నేతత్వంలోని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లాలని పిటిషనర్లను సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఈ వ్యాజ్యాలు తేలేంత వరకు జీవో 176పై స్టే ఉంటుందని స్పష్టం చేసింది. -
వరంగల్ జిల్లాలో తొలి మున్సిపాలిటీ ప్రస్థానం
సాక్షి, వరంగల్:1952లో మొదటిసారి దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ సంస్థానం నిజాం నవాబుల పాలనలోనే కొనసాగింది. 1935లో దేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగించారు. ఒక్క నైజాం(హైదరాబాద్) మినహా అన్ని రాష్ట్రాల్లో లోకల్ బాడీ ఎన్నికల ద్వారా ప్రజా ప్రతినిధుల పాలన అమలులోకి వచ్చింది. అదే సమయంలో నిజాం నవాబు బల్దియా(మునిసిపల్) పరిధిలో తహసీల్దార్‌ను చైర్మన్‌గా నియమించి.. పేరు ప్రఖ్యాతలు ఉన్న ఐదుగురు సభ్యులను నామినేటెడ్‌గా నియమించారు. అలా 17 ఏళ్ల పాటు కొనసాగిన తహసీల్దార్ పాలన 1952లో ముగిసింది. అదే ఏడాది నవంబర్‌లో జనగామలో మొదటిసారి 14 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. వార్డు సభ్యుల ఎన్నికల్లో జనగామ మొదటి చైర్మన్‌గా కోడూరి జగన్నాథరెడ్డి, వైస్ చైర్మన్‌గా పెద్ది నారాయణ ఎన్నికయ్యారు. ఇందులో ముగ్గురు అఫీషియల్స్, మరో ముగ్గురు నాన్ అఫీషియల్స్‌ను నామినేటెడ్ పద్ధతిలో సభ్యులుగా నియమించారు. వీరి పాలన ఆరేళ్ల పాటు కొనసాగింది. అవిశ్వాస తీర్మానాలు.. రెండోసారి 1959లో 17 వార్డులకు ఎన్నికలను నిర్వహించారు. చైర్మన్‌గా రాగి నర్సింహులు, వైస్ చైర్మన్‌గా పన్నీరు సోమయ్యను ఎన్నుకున్నారు. ఏడాది తర్వాత అవిశ్వాస తీర్మాణం పెట్టడంతో నర్సింహులు తన పదవి కోల్పోయారు. వార్డు సభ్యుడిగా ఉన్న వెన్నెం వెంకటనర్సింహారెడ్డి మెజార్టీ సభ్యుల మద్దతుతో చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1961 వరకు ఆయన పదవీ కాలం కొనసాగింది. 1965లో మూడోసారి ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయగా.. పాకిస్తాన్‌తో యుద్ధం రావడంతో దాన్ని రద్దు చేశారు. 1966లో మూడోసారి 20 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తిరిగి వెన్నెం వెంకట నర్సింహారెడ్డి రెండోసారి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి ఐదేళ్ల పాటు పాలన కొనసాగించారు. ఎన్నికల నిర్వహణలో సవరణలతో పాటు రిజర్వేషన్ పద్ధతి ద్వారా ఎన్నికలను నిర్వహించాలన్న ఉద్ధేశంతో 1971– 1981 వరకు ప్రత్యేక అధికారి çపర్యవేక్షణలో పాలన కొనసాగించారు. ఆ సమయంలో నలుగురు అధికారులు మారారు. సీఎం అంజయ్య హయాంలో 1982లో నాలుగోసారి పార్టీ రహిత(పార్టీల గుర్తు లేకుండా) 20 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా, చైర్మన్‌గా వీరారెడ్డి భాస్కర్‌రెడ్డి ఎన్నికై ఏడాది పాటు కొనసాగారు. అవిశ్వాస తీర్మానంలో బలనిరూపణతో చొల్లేటి ప్రభాకర్ చైర్మన్‌గా పదవిని అలంకరించారు. రెండున్నరేళ్ల పాటు అధికారంలో ఉన్న ప్రభాకర్‌పై వార్డు సభ్యులు అవిశ్వాసం పెట్టి పబ్బా శివకోటిని ఎన్నుకున్నారు. ఇలా 1982– 1987 వరకు ఏకంగా ముగ్గురు చైర్మన్లు మారడం గమనార్హం. 1987లో డైరెక్టు ఎన్నికలు.. వార్డు సభ్యుల ద్వారా చైర్మన్‌ను ఎన్నుకునే విధానానికి నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్వస్తి చెప్పారు. 1987లో ఐదోసారి ఎన్నికలను డైరెక్టు పద్ధతిలో నిర్వహించారు. డైరెక్టుగా నిర్వహించిన ఎన్నికల్లో చైర్మన్‌గా పీటీ దశరథ గెలుపొందారు. 20 మంది వార్డు సభ్యులు కలిసి పజ్జూరి మురళిని వైస్ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఆరోసారి 1992లో ఎన్నికలను నిర్వహించారు. చైర్మన్‌గా ఎర్రమళ్ల సుధాకర్ డైరెక్టు పద్ధతిలో గెలుపొందగా, వైస్ చైర్మన్‌గా సత్యనారాయణరెడ్డిని సభ్యులు ఎన్నుకున్నారు. ఆ తర్వాత మూడేళ్ల పాటు ఆర్టీఓ పాలన కొనసాగింది. 2000లో ఏడో సారి డైరెక్టు ఎన్నికల్లో డాక్టర్ కరుణాకర్‌రాజు చైర్మన్‌గా, వైస్ చైర్మన్‌గా మోతుకు గౌరారెడ్డి అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నారు. 2005లో ఎనిమిదో సారి 24 వార్డులకు డైరెక్టు ఎన్నికలు నిర్వహించగా వేమెళ్ల సత్యనారాయణరెడ్డి చైర్మన్‌గా గెలుపొందారు. వైస్ చైర్మన్‌గా కంచె రాములును సభ్యులు ఎన్నుకున్నారు. 2010లో సత్యనారాయణరెడ్డి పదవీ కాలం ముగిసిన తర్వాత, 2014 వరకు ఎన్నికలు నిర్వహించలేదు. 2014లో తొమ్మిదో సారి 28 వార్డులకు నిర్వహించిన ఎన్నికల్లో వార్డు సభ్యుల బలనిరూపణతో మొదటిసారి మహిళా చైర్‌పర్సన్‌గా గాడిపెల్లి ప్రేమలతారెడ్డి అధికారం పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అయితే, జెడ్పీటీసీగా పోటీకి దిగిన ప్రేమలతారెడ్డి.. ఆరు నెలల ముందుగానే తనపదవికి రాజీనామా చేయగా వైస్ చైర్మన్‌గా ఉన్న నాగారపు వెంకట్‌కు చైర్మన్ పీఠం దక్కింది. చీటకోడూరు రిజర్వాయర్ ఏర్పాటు పట్టణ ప్రజలకు దాహార్తి తీర్చాలనే సంకల్పంతో 2005లో 11.13 ఎంఎల్డీ సామర్థ్యంతో చీటకోడూరు వద్ద రిజర్వాయర్‌ను నిర్మించారు. రిజర్వాయర్‌లో ప్రస్తుత నీటి సామర్థ్యం ఆధారంగా.. ప్రతిరోజు .01(73 లక్షల లీటర్లు) తాగునీటిని 120.40 కిలోమీటర్ల పరిధిలోని పైపులైన్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. రూ.36వేల ఆదాయంతో.. 1952లో 12వేల జనాభా.. మూడు వేల నివాస గృహాలతో రూ.36వేల ఆదాయంతో మునిసిపల్ ప్రస్తానం ప్రారంభమైంది. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో పట్టణ అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించారు. సొంతంగా నిధులను సమకూర్చుకోవాలనే ఉద్ధేశంతో పెద్దల నిర్ణయం మేరకు సైకిళ్లకు లైఫ్ ట్యాక్స్‌ను అమలులోకి తీసుకొచ్చారు. ఏడాది రూ.3 చొప్పున చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే వ్యవసాయ ఉత్పత్తులతో పాటు వ్యాపార పరంగా వివిధ ప్రాంతాల నుంచి జనగామకు వచ్చే ఎడ్ల బండ్లు, ఇతర వాహనాలు టోల్ ట్యాక్స్ చెల్లించేలా నిబంధనలు పెట్టారు. ఒక్కో ఎడ్ల బండి నుంచి నాలుగు అణాలు టోల్ కింద తీసుకునే వారు. ప్రతీ నివాస గృహ యజమానులు ఏడాది రూ.5 నుంచి రూ.వెయ్యి వరకు ట్యాక్స్ చెల్లించే వారు. ఇంటింటికీ నల్లాలు లేకపోవడంతో బోరు బావుల ద్వారా నీటిని వాడుకున్నారు. 1964లో అప్పటి చైర్మన్ వెన్నెం వెంకట నర్సింహారెడ్డి ఆరు బోర్లు వేయించి నల్లా కనెక్షన్లు బిగించారు. అభివృద్ధి కోసం పనిచేసినం.. జనగామ పట్టణ అభివృద్ధి కోసం అకుంఠిత దీక్షతో పనిచేసినం. వేసవిలో ట్రాక్టర్ల ద్వారా తాగునీటి సరఫరా చేయాలని ప్రభుత్వం నిధులు మంజూరు చేసేది. కానీ నా హయాంలో బోరుబావులు తవ్వించేందుకు నిర్ణయం తీసుకోగా.. అప్పటి కలెక్టర్ ససేమిరా అన్నారు. అయినప్పటికీ బోరుబావుల అవసరాన్ని ఆయనకు వివరించి తాగునీటి సమస్య లేకుండా చేసినం. జనగామను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చేపట్టిన ఎన్నో కార్యక్రమాలు సఫలీకృతమయ్యాయి. – వెన్నెం వెంకటనర్సింహారెడ్డి, మునిసిపల్ మూడో చైర్మన్ ఎన్నికలను విజయవంతంగా నిర్వహిస్తాం.. 13వ సారి జరగనున్న జనగామ మునిసిపల్ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నాం. కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు 30 వార్డుల పరిధిలో 60 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఎక్కడ కూడా చిన్న పొరపాటు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. – నోముల రవీందర్, కమిషనర్, జనగామ -
నల్లగొండలో ఓటరు జాబితా విడుదల
సాక్షి, నల్లగొండ : మున్సిపాలిటీల తుది ఓటరు జాబితాలను శనివారం సాయంత్రం అధికారులు విడుదల చేశారు. వారం రోజులుగా సామాజిక కుల గణన, ఓటరు ముసాయిదా జాబితాపై కసరత్తు చేసిన అధికారులు మొత్తం ఓటర్లను వార్డుల వారీగా విభజించి తుది జాబితా తయారు చేశారు. నీలగిరి మున్సిపాలిటీ తుది ఓటరు జాబితాను మున్సిపల్ కమిషనర్ దేవ్‌సింగ్ విడుదల చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 48 వార్డుల్లో మొత్తం 1,27,044 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 62,215 మంది, మహిళలు 64,828 మంది, ఇతరులు ఒకరు ఉన్నారు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, ఇతరుల ఓట్లను కూడా వార్డుల వారీగా లెక్క తేల్చి తుది జాబితాను తయారు చేశారు. పురుషల కన్నా మహిళలు 2,613 మంది ఎక్కువగా ఉన్నారు. 39 వార్డుల్లో మహిళలే అధికం నీలగిరి పట్టణంలో 48 వార్డులు ఉండగా అత్యధిక వార్డుల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. మున్సిపల్ అధికారులు విడుదల చేసిన తుది ఓటరు జాబితా ప్రకారం 39 వార్డుల్లో మహిళా ఓటర్లు ఎక్కువ ఉండగా, 9 వార్డుల్లో పురుష ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఎస్సీ ఓటర్లు 18,486మంది, ఎస్టీలు 1,483మంది, బీసీలు 79,632, ఇతరులు ఒకటి, జనరల్ ఓటర్లు 27,443 మంది ఉన్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలోని 48 వార్డులకు చెందిన కులాల వారిగా ప్రకటించారు. మున్సిపాలిటీలో మొత్తం 87.431 మంది ఓటర్లు కాగా వీరిలో పురుషులు 42,744, మహిళలు 44,685 మంది ఓటర్లున్నారు. నందికొండ (నాగార్జునసాగర్) మున్సిపాలిటీలో 12 వార్డులుండగా 12,715 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 6,160 మంది, మహిళలు 6,555 మంది ఉన్నారు. చండూరు మున్సిపాలిటీలో 10 వార్డులకుగాను 10,055 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 5,128, మహిళలు 4,927 మంది ఉన్నారు. చిట్యాల మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో 11,094 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 5,578 మంది,, మహిళలు 5,516 మంది ఓటర్లున్నారు. వీరిలో ఎస్టీ ఓటర్లు 132మంది, ఎస్సీలు 1975 మంది, బీసీలు 6337 మంది, జనరల్ 2,650 మంది ఉన్నారు.దేవరకొండ మున్సిపాలిటీలో 20 వార్డుల్లో 21,590 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 10,595 మంది పురుషులు, 10,995 మహిళలు ఉన్నారు. కాగా, హాలియా మున్సిపాలిటీకి సంబంధించి కమిషనర్ బాలకృష్ణ అందుబాటులో లేకపోవడంతో ఓటర్ల వివరాలను ప్రకటించలేదు. -
మహబూబ్‌నగర్‌లో ‘పుర’ ఓటర్ల జాబితా విడుదల
సాక్షి, మహబూబ్‌నగర్: అనేక అభ్యంతరాలు.. సవరణల అనంతరం ఎట్టకేలకు ‘పుర’ ఓటర్ల జాబితా విడుదలైంది. ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలో ఎన్నికలు జరగనున్న 17 మున్సిపాలిటీల్లో ఉన్న 338 వార్డుల్లో మొత్తం 5,23,489 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. ఎన్నికల నిర్వహణలో భాగంగా.. గతేడాది జూన్ నెలాఖరులోనే అన్ని మున్సిపాలిటీల్లో ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేసింది. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన కులాల వారీగా ఓటర్లను గుర్తించారు. అయితే.. ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లడం.. అందులో తమ పేర్లు లేకపోవడం, లోపభూయిష్టమైన వార్డుల విభజనతో అనేక మంది ఆశావహులు, వివిధ పార్టీల నాయకులు మూడు నెలల క్రితమే హైకోర్టును ఆశ్రయించారు. అనేక వాదనలు, ఫిర్యాదులపై వచ్చిన విచారణ అనంతరం గత నెలలోనే హైకోర్టు ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అధికారులను పంపింది. ఓటర్ల జాబితా, వార్డుల విభజన విషయంలో దొర్లిన తప్పులను సవరించింది. తాజాగా గత నెల 30న ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రచురించి ఈనెల 2 తేదీ వరకు 374 అభ్యంతరాలను స్వీకరించింది. 3న పరిశీలించి శనివారం తుది జాబితాను విడుదల చేసింది. మహిళలే న్యాయ నిర్ణేతలు ఈసారి ఎన్నికలు జరగనున్న 17 మున్సిపాలిటీలకు గానూ 11 పురపాలికల్లో మహిళా ఓటర్లే న్యాయనిర్ణేతలుగా మారనున్నారు. మహబూబ్‌నగర్, గద్వాల, నారాయణపేట, వడ్డేపల్లి, మక్తల్, అయిజ, కోస్గి, ఆత్మకూరు, భూత్పూర్, అమరచింత, ఆలంపూర్ మున్సిపాలిటీల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో మొత్తం 5,23,489 మంది ఓటర్లు ఉంటే.. వారిలో 2,62,449 మంది మహిళలు, 2,60,912 మంది పురుషులు మిగిలినవి ఇతరులు ఉన్నారు. -
ఓటర్ల తుది జాబితా విడుదల
సాక్షి, మేడ్చల్‌జిల్లా: మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా శనివారం అధికారులు తుది ఓటర్ల జాబితాను కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వారిగా వెల్లడించారు. డిసెంబర్ 30న విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాపై మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయా కలెక్టరేట్లతో(జిల్లా కేంద్రాల్లో) పాటు మున్సిపాలిటీల్లో సమావేశాలు నిర్వహించి..జాబితాలో చేర్పులు, మార్పులు, తప్పొప్పులపై చర్చించారు. అలాగే, ఓటర్ల నుంచి స్వీకరించిన అభ్యంతరాలను పరిశీలించి, పరిష్కరించిన అనంతరం ఆయా మార్పులతో శనివారం అధికారికంగా తుది ఓటర్ల జాబితాను ప్రకటించారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో డివిజన్లు, వార్డుల వారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర ఓటర్లు ఎంతమందో ఫైనల్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 8వ తేదీ నుంచి 10 వరకు నామినేషన్లు స్వీకరించే అవకాశముంది. కాగా, శనివారం విడుదల చేసిన తుది ఓటర్ల జాబితా ప్రకారం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు, తొమ్మిది మున్సిపాలిటీల్లో 115 డివిజన్లు, 189 వార్డులు ఉన్నాయి. ఈ జిల్లాలో మొత్తం 5,90,493 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 3,07,895 మంది, మహిళలు 2,82,541 మంది, ఇతరులు 57 మంది ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీల్లో 100 డివిజన్లు, 151 వార్డులు ఉన్నాయి. జిల్లాలో మొత్తం ఓటర్లు 6,40,366 ఉండగా, వీరిలో 3,29,261 మంది పురుషులు, 3,11,037 మంది మహిళలు, 68 మంది ఇతరులు ఉన్నారు. -
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పక్కా వ్యూహం
సాక్షి, మెదక్: ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసి వారం రోజులవుతుండడంతో ఇప్పటికే ఎన్నికల వ్యూహంపై జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు అంతర్గతంగా మంతనాలు జరుపుతున్నారు. మున్సిపాలిటీల వారీగా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించి ఎన్నికల సమరానికి శంఖం పూరించడానికి సర్వ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేశారు. ఈ నెల 5న రిజర్వేషన్ల ప్రకటన, 7వ తేదీన నోటిఫికేషన్ విడుదల నాటికి అన్ని మున్సిపాలిటీల్లో కార్యకర్తల సమావేశాలు పూర్తి చేయాలని నిర్ణయించారు. గత అన్ని ఎన్నికల్లోనూ అనూహ్య ఫలితాలు ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ అనూహ్య ఫలితాలను సాధించింది. 18 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో ఇంత ఉచ్ఛస్థితి ఫలితాలను ఆ పార్టీ ఊహించి ఉండదు. ఆశించిన, అనుకున్నదాని కంటే కూడా ఎక్కువ ఫలితాలను సాధించింది. అదే ఉత్సాహంతో 100 శాతం ఫలితాలను సాధించాలనే పట్టుదలతో పార్టీ జిల్లా అగ్ర నేతలున్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని ఐదు స్థానాల్లో ఒక్క సంగారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి మినహా మిగతా నాలుగు నియోజకవర్గాలైన జహీరాబాద్, అందోల్, పటాన్చెరు, నారాయణఖేడ్లలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. జిల్లా పరిధిలోకి వచ్చే జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ స్థానాల్లో సైతం టీఆర్ఎస్ అభ్యర్థులు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డిలు గెలుపొందారు. గత ఏడాది జనవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలోని 647 సర్పంచ్ స్థానాలకు గాను 446, మొత్తం 295 ఎంపీటీసీ స్థానాలకు గాను 178, 25 జెడ్పీటీసీ స్థానాలకు గాను 20 చోట్ల టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఇదే ఉత్సాహంతో మున్సిపల్ ఎన్నికల్లో పాగా వేయాలని కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. ఇన్చార్జిల నియామకం.. మున్సిపల్ ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా టీఆర్ఎస్ అధిష్టానం పక్కా వ్యూహంతో వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ ముఖ్య నేతలతో మంత్రి హరీశ్‌రావు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని 8 మున్సిపాలిటీల్లో తప్పనిసరిగా గెలవాలనే ఉద్దేశంతో ఎన్నికల ఇన్చార్జిలను నియమించారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, పార్టీ సీనియర్ నేత పట్లోళ్ల జైపాల్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి బక్కి వెంకటయ్యలను నియమించారు. ఈ నెల 7న నోటిఫికేషన్ అనంతరం వీరు పూర్తి స్థాయిలో పని చేయడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఎమ్మెల్యేలకే అభ్యర్థుల ఎంపిక, గెలుపు బాధ్యతలు జిల్లాలో మొత్తం 8 మున్సిపాలిటీలు ఉన్నాయి. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, అందో ల్/జోగిపేట్, నారాయణఖేడ్, తెల్లాపూర్, బొల్లారం, అమీన్పూర్ మున్సిపాలిటీలు ఉన్నా యి. కోర్టులో కేసు ఉన్న కారణంగా జహీరాబా ద్ మున్సిపాలిటీలో ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం లేదు. స్థానిక పరిస్థితులు, రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థుల ఎంపికతోపాటు గెలిపించే బాధ్యతలను సైతం స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే లకే అప్పగించాలని టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించింది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు లేని చో ట మాజీ ఎమ్మెల్యేలు లేదా పార్టీ ఇన్చార్జిలు ఈ బాధ్యతలను నిర్వహించనున్నారు. కాగా సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లేకపోవడంతో ఇక్కడ 2018లో పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు ఈ బాధ్యతలు అప్పగించినట్లు స మాచారం. ఈ మేరకు అధిష్టానం నుంచి ఇప్పటికే సంకేతాలు అందినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఏ ఎన్నికలొచ్చినా ట్రబుల్ షూటర్‌గా పేరొందిన మంత్రి హరీశ్‌రావుకు ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పర్యవేక్షణ, గెలుపు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఈ మేరకు ఆయన ఇప్పటికే ప్రజాప్రతినిధులు, పార్టీకి చెందిన ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుకోసం టీఆర్ఎస్ పార్టీ కార్యాచరణను సిద్ధం చేసి అందుకు అనుగుణంగా ముందుకు వెళ్తోంది. -
ఉత్కంఠకు తెర!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలిఘట్టం పూర్తయ్యింది. జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి..జిల్లా పరిషత్ చైర్పర్సన్ పీఠం ఈసారి ఎస్సీ మహిళకు దక్కింది. 2014 జెడ్పీ ఎన్నికల్లో చైర్పర్సన్ స్థానం ఎస్టీ మహిళకు కేటాయించారు. ఈ సారి ఎస్సీ మహిళకు రిజర్వయ్యింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ రిజర్వేషన్ల వివరాల జాబితాను విడుదల చేశారు. జిల్లాలో 34 జెడ్పీటీసీలు, 34 ఎంపీపీలు, 549 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఎంపీపీల్లో ఎస్టీ మహిళలకు 2, ఎస్టీ జనరల్‌కు 2 స్థానాలు కేటాయించారు. ఎస్సీ మహిళలకు 2, ఎస్సీ జనరల్ 2 స్థానాలు, బీసీ మహిళలకు 13, బీసీ జనరల్‌కు 13 స్థానాలు కేటాయించారు. జిల్లాలోని 34 జెడ్పీటీసీ స్థానాలకు ఎస్టీ మహిళలకు 2 స్థానాలు, ఎస్టీ జనరల్‌కు 2 స్థానాలను కేటాయించారు. ఎస్సీ మహిళలకు 2, ఎస్సీ జనరల్ 2 స్థానాలు, బీసీ మహిళలకు 9, బీసీ జనరల్‌కు 9, అన్ రిజర్వుడ్ మహిళలకు 4, అన్ రిజర్వుడ్ జనరల్‌కు 4 స్థానాలు కేటాయించారు. ఎంపీటీసీలకు సంబంధించి 549 స్థానాలకు ఎస్టీ మహిళలకు 37, ఎస్టీ జనరల్‌కు 24, ఎస్సీలకు 35, ఎస్సీ జనరల్‌కు 23, బీసీ మహిళలకు 150, బీసీ జనరల్‌కు 138, అన్ రిజర్వుడ్ మహిళలకు 80, అన్ రిజర్వుడ్ జనరల్‌కు 62 స్థానాలను కేటాయించారు. తుది నిర్ణయం తీసుకోనున్న హైకోర్టు రిజర్వేషన్ల ఖరారుపై ఈ నెల 8న రాష్ట్ర హైకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం 1994 రూల్ నెం.13 ప్రకారం రిజర్వేషన్ల కేటాయింపు జరగడంతో దాదాపుగా ఇవే ఖరారయ్యే అవకాశం ఉంది. రిజర్వేషన్ల ప్రకారం చూస్తే జిల్లాలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యం లభించింది. ఎంపీటీసీలుగా 549 స్థానాలకు 302 స్థానాల్లో మహిళలే పోటీ చేయాల్సి ఉంది. 34 జెడ్పీటీసీ స్థానాల్లో సగం మహిళలకే దక్కాయి. ఎంపీపీల్లోనూ 34 స్థానాల్లో 17 మహిళలకే కేటాయించారు. తాజా రిజర్వేషన్ల ప్రకారం రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా చోట్ల ఆశావహులు పోటీ చేయాలని ఆశగా ఉన్నారు. రిజర్వేషన్ల గెజిట్ విడుదల తర్వాత వారిలో చాలా మంది అవకాశాన్ని కోల్పోయారు. అలాంటి వారిలో కొంత నైరాశ్యం ఏర్పడింది. కానీ ప్రభుత్వం ఏ విధమైన రాజకీయాలకు, పక్షపాతానికి తావు లేకుండా 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను అనుసరించి అధికారుల చేత రిజర్వేషన్లు రూపొందించింది. -
నాటినుంచి.. నేటికి ‘కోదాడ’!
సాక్షి, కోదాడ : నియోజకవర్గ కేంద్రమైన కోదాడను 1952లో గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. దీనికి తొలి సర్పంచ్‌గా మర్ల పానకాలయ్య, ఉపసర్పంచ్‌గా కాకుమాను నర్సింహారెడ్డి, కార్యదర్శిగా గుడుగుంట్ల చిన అప్పయ్య వ్యవహరించారు. నాడు పంచాయతీలో నాలుగు వేల మంది జనాభా, మూడు వేల ఓటర్లు ఉండగా ఆదాయం రూ.రెండు వేలుగా ఉండేది. 1956 నుంచి 64 వరకు తమ్మర వెంకటేశ్వరరావు సర్పంచ్‌గా ఉన్నారు. ఆ తరువాత చినఅప్పయ్య 1965 నుంచి 1971 మార్చి వరకు సర్పంచ్‌గా పని చేశారు. 1971 మార్చి నుంచి 72 మార్చి వరకు గరిడేపల్లి స్వామి, 1972 నుంచి 81 వరకు దాదాపు 10 సంవత్సరాలు వెలిశాల అనంతరామయ్య సర్పంచ్‌గా పనిచేశారు, 1981లో జరిగిన ఎన్నికల్లో వేనేపల్లి చందర్రావు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 1984 జరిగిన రాజకీయ పరిణామాలతో ఆయన కోదాడ ఎమ్మెల్యేగా వెళ్లడంతో అప్పటి ఉప సర్పంచ్ చిట్టాబత్తిని సుబ్బరామయ్య సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఆయన తరువాత సత్యబాబు, ఎర్నేని బాబు, పారా సీతయ్య, ఏర్నేని కుసుమ పని చేశారు. ఉపసర్పంచ్‌గా ఉన్న వాడపల్లి వెంకటేశ్వర్లు రెండుసార్లు ఇన్చార్జ్ సర్పంచ్‌గా పని చేశారు. 2012 వరకు కోదాడ గ్రామపంచాయతీగా కొనసాగింది. ప్రభుత్వం మున్సిపాలిటీగా ప్రకటించి ప్రత్యేక అధికారిని నియమించింది. 2014లో మున్సిపాలిటీకి ఎన్నికలు జరగడంతో టీడీపీ–కాంగ్రెస్ ముఖాముఖి తలపడ్డాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి వంటిపులి అనిత మొదటి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికై 2019 వరకు కొనసాగారు. పెరిగిన వార్డులు.. మేజర్ పంచాయతీగా ఉన్న కోదాడను 2012లో ప్రభుత్వం మున్సిపాలిటీగా ప్రకటించింది. దీనికి తొలిసారిగా 2014లో ఎన్నికలు జరిగాయి. అప్పుడు మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండేవి. తాజాగా శివారు గ్రామాలైన తమ్మర, కొమరబండ కోదాడ మున్సిపాలిటీలో కలవడంతో వార్డుల సంఖ్య 35కు పెరిగింది. ప్రస్తుతం 75 వేల జనాభా 53,898 మంది ఓటర్లు ఉన్నారు. -
మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లకు గాలం..
సాక్షి, మహబూబ్‌నగర్ క్రైం: పురపోరు వేడి మున్సిపాలిటీల్లో రాజుకుంది. ఇప్పటికే టికెట్ వచ్చిన అభ్యర్థులు, టిక్కెట్ వస్తోందని ఎదురుచూస్తున్న ఆశవాహులు అందరూ ప్రచారాల్లో బీజీ బీజీగా తిరుగుతున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడేకొద్ది నాయకులు అంచెలంచెల వ్యూహాలతో ఆయా పార్టీల అభ్యర్థులు పంపకాల పర్వానికి తెరతీస్తారు. ప్రలోబాలే ఓటు బలంగా భావిస్తూ నోటుకు ఓటు సూత్రాన్ని అమలు చేస్తారు. ఓటు బలాన్ని నోటు బలహీనతతో సొమ్ము చేసుకునేందుకు సిద్ధం కానున్నారు. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో అయితే ఒక అడుగు ముందే ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఇప్పుడు అభ్యర్థుల దృష్టి అంతా ఓటర్లను తమవైపు ఎలా తిప్పుకోవాలి అనే దాంట్లో బీజీగా ఉన్నారు. ఇక చివరి రోజుల్లో ఓటర్ల చెంతకు నోట్లను చేర్చడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. ముందస్తుగానే నగదును ఆయా వార్డులకు చేర్చే పనిలో పడ్డారు. నమ్మకమైన ఓటర్లకే పంపకాలు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లను ప్రత్యేక్ష దైవంగా భావించడం పరిపాటి. ఏ పుట్టలో ఏ పాముందో అదే మనకు బలంగా మారుతుందో అంటూ అందరిని ప్రసన్నం చేసుకోవడం సహజం. కానీ ఈ దఫా ఎన్నికల్లో మాత్రం అభ్యర్థులు బలంగా పడే ఓట్లను మాత్రమే కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగానే తమ ఓటు వీళ్లని నమ్మిన వాళ్లకే డబ్బు చెల్లిస్తున్నారు. సర్వేలతో రెండు పార్టీల నాయకుల ఆయా బూత్‌ల వారీగా నిర్దరించుకున్నారు. ఆమేరకు మాత్రమే డబ్బు అందజేయాలని నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. భారీగా మద్యం నిల్వలు ఈ ధపా ఎన్నికల్లో ఓటర్లను వశం చేసుకోవడానికి అభ్యర్థులు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. గత నెల పాత మద్యం దుకాణాలకు చివరి రోజులు కావడంతో వారి దగ్గర మిగిలిపోయిన మద్యాన్ని ఇప్పటికే చాలా వరకు అభ్యర్థులు కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నట్లు సమాచారం. ఒకవైపు మద్యం అమ్మకాలు, తరలింపుపై భారీ స్థాయిలో నిఘా ఉండవచ్చని భావించే ఒక నెల రోజుల ముందుగానే కీలక అభ్యర్థులు భారీ స్థాయి రహస్య ప్రాంతాల్లో స్టాక్ చేసి పెట్టుకున్నారు. ఎన్నికలు ఇంకా రెండు రోజుల వ్యవధి ఉన్న సమయంలో ఓటర్ల చెంతకు మద్యం చేర్చుతారు. కొందరు అభ్యర్థులు మద్యం ఓటర్లకు ఇవ్వడానికి అనుచరగణానికి చీటిలను పంపిణీ చేయాలని చూస్తే.. మరి కొందరు టోకన్లు జారీ చేయాలని చూస్తున్నారు. మరి కొందరు నేరుగా ఇంటింటికి తిరిగి మద్యం బాటిల్స్ అందజేయాలని ప్లాన్ వేసుకుంటున్నారు. దీంట్లో యువత కీలక పాత్ర వహిస్తున్నారు బృందాలు ఏర్పడి ఆయా వార్డులలో ద్విచక్ర వాహనాల సాయంతో మద్యం తరలించే దాంట్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. -
‘గుట్ట’ను పాలించింది ముగ్గురే..!
సాక్షి, యాదగిరిగుట్ట (ఆలేరు) : 1951– 52లో యాదగిరిగుట్ట గ్రామపంచాయతీగా ఏర్పడగా.. మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న యాదగిరిగుట్టను 2018 ఆగస్టు 2న మున్సిపాలిటీగా చేశారు. యాదగిరిగుట్ట పట్టణంతో పాటు దాతారుపల్లి పరిధిలోని పాతగుట్ట, పెద్దిరెడ్డిగూడెం గ్రామాలు కూడా మున్సిపాలిటీలో కలిపారు. యాదగిరిగుట్ట గ్రామపంచాయతీగా ఉన్న కాలంలో ముగ్గురు వ్యక్తులే సర్పంచ్‌లుగా సుమారు 63 సంవత్సరాలు పాలించారు. వివరాలు పరిశీలిస్తే.. యాదగిరిగుట్ట గ్రామపంచాయతీ ఏర్పాటు అయిన నాటి నుంచి ముగ్గురు సర్పంచ్‌లు మాత్రమే పరిపాలించారు. 1952లో యాదగిరిగుట్ట సర్పంచ్‌గా యాదగిరిపల్లికి చెందిన వేముల లక్ష్మీనర్సయ్య సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఆనాటి నుంచి 1995 వరకు వరుసగా 43 సంవత్సరాలు ఏకదాటిగా సర్పంచ్‌గా కొనసాగారు. ఆ తర్వాత 1995లో గుట్ట సర్పంచ్ బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో లక్ష్మీనర్సయ్య తన సుదీర్ఘ పదవి నుంచి తప్పుకున్నారు. 1995లో జరిగిన ఎన్నికల్లో తొలి మహిళా సర్పంచ్‌గా కైరంకొండ శ్రీదేవి గెలుపొంది 1995–2000, 2001–2006, 2006–11వరకు 15 సంవత్సరాలు సర్పంచ్‌గా కొనసాగింది. ఆ తరువాత ఎస్సీ రిజర్వ్ కావడంతో 2013–14లో జరిగిన ఎన్నికల్లో యాదగిరిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన బూడిద స్వామి గెలుపొందారు. ఈయన 1 ఆగస్టు 2018 వరకు సర్పంచ్‌గా కొనసాగారు. ఇప్పుడు చైర్మన్ పదవి ఎవరికో.. 2018 ఆగస్టు 2న ఏర్పాటు ఆయిన యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఎన్నికలు ఎప్పుడెప్పుడా అన్నట్లు ఆశావహులు ఎదురుచూశారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో తొలి చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి పలువురు సిద్ధమయ్యారు. ప్రధానంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు పట్టణాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తుండటంతో తొలి చైర్మన్ పీఠాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఇక టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు, ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో బలం పెంచుకున్న దానిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ చైర్మన్ గిరిని చేజిక్కించుకునేందుకు ముందుకు వెళ్తున్నారు. ఇక బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చూపించి కాషాయం జెండా ఎగురవేయాలని భావిస్తోంది. సీపీఐ, సీపీఎంలు తమ పట్టును చాటుకునేందుకు తహతహలాడుతున్నాయి. ఈ పార్టీలతో పాటు ఇండిపెండెంట్‌గా పోటీ చేసి చైర్మన్ రేసులో ఉండాలని పలువురు యువకులు భావిస్తున్నారు.