ప్రచార హోరు | Voting campaign | Sakshi
Sakshi News home page

ప్రచార హోరు

Published Wed, Apr 2 2014 11:58 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ప్రచార హోరు - Sakshi

ప్రచార హోరు

ప్రాదేశిక ఎన్నికల ప్రచారం జిల్లాలో హోరెత్తిపోతోంది. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థులు తెగ హైరానా పడుతున్నారు.

  •  అయోమయంలో టీడీపీ
  •  ఉనికిని చాటుకుంటున్న కాంగ్రెస్
  •  తొలి విడతకు రేపటితో తెర
  •  విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : ప్రాదేశిక ఎన్నికల ప్రచారం జిల్లాలో హోరెత్తిపోతోంది. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థులు తెగ హైరానా పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు దీటుగా వాహనాలు, మైకులు, డ్యాన్సులు, భారీగా అనుచరగణం,అభిమానులతో గ్రామాల్లో కలియతిరుగుతున్నారు. గడగడపకు వెళ్లి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.

    మండలాల్లో ఎక్కడ చూసినా ప్రాదేశిక ఎన్నికల కోలాహలమే కనిపిస్తోంది. పోలింగ్ ముగింపునకు 48 గంటల ముందు ఆపేయాలన్న నిబంధనతో తొలివిడత ‘పరిషత్ ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెరపడనుం ది. జిల్లాలోని 22 మండలాల్లో ఆదివారం 22 జెడ్పీటీసీ, 379 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు సైతం ప్ర చారాల్లో బిజీగా ఉన్నారు. అన్ని సెగ్మెంట్లకు పూర్తిస్థాయిలో అభ్యర్థులను నిలబెట్టలేకపోయిన కాంగ్రెస్ ప్రచారంలోనూ జోరును కొనసాగించలేకపోతోంది. ఉనికిని చాటుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.
     
    ఆయోమయంలో టీడీపీ
     
    తెలుగుదేశం పార్టీ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. జిల్లాలో ఆ పార్టీ నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం, ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం మిన హా ఈ ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. ఈ పరిణామం ఆ పార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు సంకటంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గంపగుత్తగా ఎమ్మెల్యేలను టీడీపీ అరువు తెచ్చుకోవడంతో దీర్ఘకాలంగా ఆ పార్టీలో పనిచేస్తున్న నాయకులకు అసెం బ్లీ టికెట్లు దక్కే అవకాశం కనిపించడం లేదు. దీంతో వారు అసమ్మతి సెగలు కక్కుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తున్నా అభ్యర్థులను ఆ పార్టీ ఖరారు చేయలేదు.

    అసలు పార్టీలో ఎవరికి టికెట్ దక్కుతుందోనన్న సందేహాల నేపథ్యంలో ప్రథమ శ్రేణి నాయకు లు స్థానిక అభ్యర్థులను గాలికొదిలేశారు. వారిని గెలిపిం చే బాధ్యతను ఏ ఒక్కరూ భుజాన వేసుకోవడం లేదు. ఇలా టీడీపీ అభ్యర్థులు ప్రచారాల్లో వెనుకబడిపోయారు. కొంత మంది మొండిగా ప్రచా రం చేపడుతున్నప్పటికీ గ్రామాల్లో ప్రజల నుంచి ఆశించిన స్పందన రావడం లేదు. దీంతో వారంతా ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడంపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గ్రామాల్లో విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీకి సిద్ధం చేస్తున్నారు.
     
     జోరుమీదున్న వైఎస్‌ఆర్‌సీపీ

     వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. రెట్టించిన ఉత్సాహంతో హోరెత్తిస్తున్నారు. ఇటీవల పార్టీ అధినాయకుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో పర్యటించారు. జిల్లా వాసులు యువనేతకు బ్రహ్మరథం పట్టారు. పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టాలని ఆయన ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ తొమ్మిదేళ్ల పాలనలో చేపట్టిన ప్రజావ్యతిరేక విధానాలను తూర్పారబట్టారు. ఇది వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. అసెంబ్లీ సెగ్మెంట్లకు కో-ఆర్డినేటర్‌ల నియామకం కూడా పూర్తయింది. వారు సార్వత్రిక ఎన్నికలు లక్ష్యంగా ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల్లోకి వెళుతున్నారు. పార్టీ ‘ప్రాదేశిక’అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈ పరిణామం ఆ పార్టీకి కలిసి వస్తోంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement