నర్సంపేట, న్యూస్‌లైన్ : నర్సంపేట డివిజన్ పరిధిలోని మండలాల్లో 375 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్‌కాగా అందులో 177 చెల్లలేదు. నర్సంపేట వుండలం లో 36 ఓట్లకు 32 ఓట్లు, నల్లబెల్లిలో 41 ఓట్లకు 40, దుగ్గొండిలో 37 ఓట్లకు 15 ఓట్లు, చెన్నా రావుపేటలో 43కు 3, కొత్తగూడలో 82ఓట్లకు 10 చెల్లలేదు. గూడూరులో 74 ఓట్లు మొత్తంగా చెల్లుబాటు కాలేదు. నెక్కొండలో 30, ఖానాపు రం 32 ఓట్లలో అన్నీ చెల్లుబాటయ్యాయి.
చెల్లుబాటైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో జెడ్పీటీసీ అభ్యర్థులకు టీఆర్‌ఎస్ 42, టీడీపీ 28, కాంగ్రెస్‌కు 61 ఓట్లు పడ్డారుు. దుగ్గొండిలో 37లో 22 చెల్లగా.. కాంగ్రెస్ 2, టీడీపీ 8, టీఆర్‌ఎస్ 12 పడ్డారుు. నల్లబెల్లిలో ఒక ఓటు టీఆర్‌ఎస్‌కు పడింది. చెన్నారావుపేట 40 ఓట్లలో టీఆర్‌ఎస్‌కు 9, టీడీపీ 5, కాంగ్రెస్ 26, నెక్కొం డలో 30కు కాంగ్రెస్ 16, టీడీపీ 8, టీఆర్‌ఎస్ 6, ఖానాపురంలో 32 ఓట్లకుగాను టీఆర్‌ఎస్‌కు 13, టీడీపీకి 7, కాంగ్రెస్‌కు 12 ఓట్లు పడ్డారుు.
అయితే పోస్టల్ ఓట్లు వేసిన ఉద్యోగులు తవు ఓటు హక్కుతోపాటు పొందుపర్చిన డిక్లరే షన్ ఫారాలు నింపడంలో అసంపూర్తిగా ఉన్న ట్లు అధికారులు గుర్తించారు. వాటిలో గెజిటెడ్ అధికారి చేత సంతకం చేరుుంచలేదు. వురికొన్నింట్లో డిక్లరేషన్ ఫారాలు ఓటు హక్కుతోపాటు లోపల జత పర్చడాన్ని అధికారులు అనర్హతగా గుర్తించారు. అంతేకాక ఓటరు జాబి తాలోని తన వరుస సంఖ్యను కొందరు నమో దు చేయలేదు. వీటిలో ఏ చిన్నలోపం ఉన్నా లెక్కింపు అధికారులు ఆ ఓట్లను తొలగించారు.
మానుకోట డివిజన్ పరిధిలో..
నెల్లికుదురు/కురవి : మానుకోటలో మంగళవారం నిర్వహించిన స్థానిక ఓట్ల లెక్కింపులో అధికారులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను పరిశీలించారు. జెడ్పీటీసీ అభ్యర్థులకు 35 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవగా 32 ఓట్లను రిజక్ట్ చేయగా మూడు ఓట్లు అనుమతించారు. అనుమతించిన ఓట్లు కాంగ్రెస్ జెడ్పీటీసీ అభ్యర్థి శ్రీరాం భరత్‌కు ఒక టి, టీఆర్‌ఎస్ అభ్యర్థి గోగుల మల్లయ్యకు ఒక టి, టీడీపీ అభ్యర్థి నల్లబెల్లి తిరుమల్‌కు ఒకటి పోలయ్యాయి. ఎంపీటీసీ అభ్యర్థులకు 37 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవగా 35 ఓట్లు తిరస్కరణకు గురయ్యా యి. రెండు ఓట్లు మాత్రమే అనుమతించారు. ఈ విషయమై నెల్లికుదురు జెడ్పీటీసీ అభ్యర్థులు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు శివాజీ, కె.కర్ణాకర్‌రెడ్డిని వివరణ కోరగా ఉపాధ్యాయులు డిక్లరేషన్ పత్రాలు సమర్పించకుండా ఓట్లు వేశారని ఈ నేపథ్యంలో వాటిని తిరస్కరించినట్లు తెలిపారు.
మహబూబాబాద్‌లోని మోడల్ స్కూల్ లోని ఓట్ల లెక్కింపు కేంద్రంలో మంగళవారం తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఇందులో ఎంపీటీసీకి, జెడ్పీటీసీకి 37 చొప్పున ఓట్లు పోలయ్యాయి. డిక్లరేషన్ ఫాం జతపరచకపోవడంతో వాటన్నింటినీ తిరస్కరించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.విజయభాస్కర్ తెలిపారు.
పోస్టల్ బ్యాలెట్‌లో చెల్లని ఓట్లే ఎక్కువ
Published Wed, May 14 2014 4:17 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement