సాక్షి, అమరావతి: ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మొండి వైఖరిని ఉద్యోగ సంఘాలు తప్పుపట్టాయి. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ ఎన్నికల విధుల్లో పాల్గొనమనడంపై మండిపడుతున్నారు. నిమ్మగడ్డ ప్రకటనపై జేఏసీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పీపీఈ కిట్లు, మాస్క్‌లు కరోనాను అడ్డుకోగలవా? అని ఏపీ ఉద్యోగుల జేఏసీ ప్రశ్నించింది. (చదవండి: బాబు చేతిలో తోలుబొమ్మలా నిమ్మగడ్డ)
‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనలేం. గడిచిన 10 నెలల్లో ఎంతో మంది ఉద్యోగులు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.ఉద్యోగుల ప్రాణాలు ఎస్‌ఈసీకి పట్టవా?.ఎన్నికల నిర్వహణ అంత చిన్న విషయం కాదు.మరో మూడు నెలలు స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలి.ఉద్యోగుల విజ్ఞప్తిని ఎస్‌ఈసీ పరిగణలోకి తీసుకోవాలి. వ్యాక్సినేషన్ తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. ఉద్యోగులను విమర్శించే అర్హత టీడీపీ నేత అశోక్‌బాబుకు లేదు. రాజకీయ వ్యవహారాలు చూసుకోవాలంటూ’ జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు కౌంటర్ ఇచ్చారు. (చదవండి: స్థానిక ఎన్నికలను వాయిదా వేయండి)
ఎస్‌ఈసీ పునరాలోచించాలి..
పీపీఈ కిట్లు, మాస్క్‌లు, శానిటైజర్లు కరోనాను ఆపలేవని పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు మండిపడ్డారు. కరోనాతో ఎంతో మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని, వ్యాక్సినేషన్ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలన్నారు. తమ విజ్ఞప్తిని ఎస్‌ఈసీ పునరాలోచించాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment