JAC leaders
-
సమాన-సమాగ్రాభివృద్ధి అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు
-
18న ఎమ్మెల్యేల ఇళ్ల ఎదుట ధర్నా
సాక్షి, హైదరాబాద్: తమ డిమాండ్ల సాధనకు పది రోజులుగా సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బంది సోమవారం నుంచి తీవ్రం చేయాలని నిర్ణయించారు. ఈ నెల 18 నుంచి ఎమ్మెల్యేల ఇళ్ల ఎదుట ధర్నాలు, 19న మండల కేంద్రాల్లో రాజకీయపార్టీలు, ట్రేడ్ యూనియన్లతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ (సీఐటీయూ, ఏఐటీయూసీ, టీజీకేబీయూ, ఐఎఫ్‌టీయూలతో కూడిన) శనివారం నిర్ణయించింది. అలాగే 20న సమ్మె పరిష్కరించాలంటూ అన్ని గ్రామ పంచాయతీల్లో తీర్మానాలు చేయాలని, 21న కలెక్టరేట్ల ముట్టడి చేపట్టాలని తీర్మానించింది. ప్రభుత్వం స్పందించకపోతే ఈనెల 21 తర్వాత నీరు, కరెంట్, వీధి దీపాలు సహా అన్ని అత్యవసర సేవలు నిలిపేస్తామని హెచ్చరించింది. డిమాండ్ల సాధన కోసం జేఏసీ ఈనెల 6న ప్రారంభించిన సమ్మె నేటికి పదో రోజుకు చేరనుంది. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో వివిధ కేటగిరీల్లో 50 వేల మంది పనిచేస్తున్నారు. సిబ్బందిని పర్మినెంట్ చేయడంతోపాటు పీఆర్సీలో నిర్ణయించినట్టు రూ.19 వేలు కనీస బేసిక్ పే ఇవ్వాలని, అప్పటిదాకా స్వీపర్లకు రూ.15,600, పంప్ ఆపరేటర్లు, ఎల్రక్టీషియన్లు, డ్రైవర్లు, కారోబార్, బిల్ కలెక్టర్లకు రూ.19,500 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, పది రోజులుగా సమ్మె చేస్తున్నా జేఏసీని ప్రభుత్వం చర్చలకు పిలవకపోగా సమ్మెను నీరుగార్చేందుకు పోటీ కార్మికులను నియమించే ప్రయత్నం చేస్తోందని జేఏసీ చైర్మన్ పాలడుగు భాస్కర్ ఆరోపించారు. -
సెల్యూట్ సీఎం సార్
సాక్షి, అమరావతి/లబ్బీపేట/రామచంద్రపురం/గుంటూరు మెడికల్/గాంధీనగర్: కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అన్ని వర్గాలకు మేలు చేకూర్చేలా ఉన్నాయని పలు ఉద్యోగ సంఘాల నేతలు, జేఏసీల నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను నెరవేర్చి ఎన్నో వేల కుటుంబాలకు మేలు చేకూర్చారని పేర్కొంటూ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 13,000 మంది ఉద్యోగులకు మేలు ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ)ను ప్రభుత్వ శాఖగా మారుస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ఏపీవీవీపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉల్లి కృష్ణ, ప్రధాన కార్యదర్శి సురేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో 13,000 ఉద్యోగుల కుటుంబాలకు మేలు చేకూరనుందని చెప్పారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో అందరు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే తమకూ 010 పద్దు ద్వారా జీతాలు చెల్లింపులు చేపడతారని వెల్లడించారు. కాగా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని ఏరియా ఆసుపత్రి వద్ద ఏపీవీవీపీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది సీఎంకు ధన్యవాదాలు తెలుపుతూ నినాదాలు చేశారు. నిరుద్యోగులకు ఎంతో ఊరట ఏపీలోని నిరుద్యోగులకు ఊరట కలిగించేలా కేబినెట్ నిర్ణయాలు ఉన్నాయని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ తెలిపారు. జాబ్ క్యాలెండర్‌కు 10,000 పోస్టులను గుర్తించడంపై హర్షం వ్యక్తం చేశారు. టెట్ కమ్ డీఎస్సీ, డిజిటల్ గ్రంథాలయ శాఖ, పోలీస్, ఎస్ఐ, ఫైర్, జైల్ వార్డెన్స్, మెడికల్ అండ్ హెల్త్, సచివాలయాలు, వర్సిటీల్లో ఉన్న బోధన,బోధనేతర సిబ్బంది భర్తీ దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం శుభ పరిణామమన్నారు. జీపీఎస్ అమలుపై కృతజ్ఞతలు ఒకేసారి 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టి తమ జీవితాల్లో వెలుగులు నింపడమే కాకుండా జీపీఎస్ అమలుతో పెన్షన్ భరోసా కల్పించినందుకు ప్రభుత్వానికి గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కృతజ్ఞతలు తెలిపింది. సీఎం జగన్‌కు తాము మనస్ఫూర్తిగా సెల్యూట్ చేస్తున్నట్లు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ జాని పాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్టి రత్నం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరి, రామకృష్ణా రెడ్డి, హరీంద్ర, కిరణ్, కార్యనిర్వాహక కార్యదర్శి సుభాని, పుల్లారావు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఎంతో మేలు సీపీఎస్‌కు బదులుగా జీపీఎస్ విధానానికి కేబినెట్ ఆమోదం తెలపడంపై సీఎం వైఎస్ జగన్‌కు పీటీడీ(ఆర్టీసీ) వైఎస్సార్ యూనియన్ కృతజ్ఞతలు తెలిపింది. 50 శాతం కనీస పింఛన్‌తో పాటు డీఏలు వర్తించే విధంగా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేసింది. ఈ విధానంతో ఆర్టీసీ ఉద్యోగులకు గరిష్టంగా లబ్ధి చేకూరుతుందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు జేఎం నాయుడు, ఉపాధ్యక్షురాలు లత తెలిపారు. జీపీఎస్‌తో ఎంతో మేలు కేబినెట్లో ఉద్యోగులకు సంబంధించి 5 అంశాలకు ఆమోదం లభించింది. డీఏ కోసం ఇచ్చిన జీవోను ర్యాటిఫై చేశారు. అన్ని జిల్లా కేంద్రాలకు సమానంగా 16% హెచ్ఆర్ఏ అమలు చేస్తామన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించారు. కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ను రెగ్యులరైజ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం. కొత్త పీఆర్సీ కమిషన్ వేయడం అభినందనీయం. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగులకు మేలు చేసేలా జీపీఎస్ తీసుకువచ్చారు. ఈ స్కీమ్ కిందకు వచ్చే వారికి చివరి పే స్కేల్లో 50% ఇస్తూ, దానికి అదనంగా డీఏ ఇచ్చేలా తీసుకున్న నిర్ణయం హర్షణీయం. పాత పెన్షన్ స్కీమ్‌కు, జీపీఎస్‌కు మధ్య ఒకటే తేడా ఉంది. పీఆర్సీ ఒక్కటే లేదు. డీఏ కూడా ఫిక్స్ చేశారు. ప్రతీ ఆర్నెల్లకు 2% డీఏ ఇవ్వాలని నిర్ణయించారు. హౌస్‌సైట్స్ విషయంలో సీఎం సానుకూలంగా ఉన్నారు. జగనన్న లేఅవుట్లలో 10% కేటాయించారు. 20% డి స్కౌంట్ ఇచ్చారు. ప్రత్యేకంగా స్థలాలు కేటాయించేందుకూ సుముఖంగా ఉన్నారు. 10 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసిన అవుట్సోర్సింగ్ ఉ ద్యోగులను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మార్చి క్రమబద్ధీకరించాలని కోరుతున్నాం. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. – కాకర్ల వెంకట్రామిరెడ్డి, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సీఎం జగన్‌ది సంక్షేమ సంతకం ఇచ్చిన హామీల అమల్లో పేటెంట్ రైట్ ఏదైనా ఉంటే అది సీఎం వైఎస్ జగన్‌దే. సీపీఎస్ స్థానంలో జీపీఎస్ అమలు చేస్తూ నిర్ణయం తీసుకోవడం సంతోషకరం. సీఎం జగన్ సంతకమే సంక్షేమ సంతకం. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయడంతో వారంతా సీఎం జగన్‌కు రుణపడి ఉంటారు. – పి.గౌతంరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ దశాబ్దాల కలను నెరవేర్చారు కాంట్రాక్ట్ ఉద్యోగుల దశాబ్దాల కలను సీఎం జగన్ నెరవేర్చారు. ఈ మేలును ఎన్నటికీ మరువలేము. కేబినెట్లో క్రమబద్ధీకరణ తీసుకున్న క్షణం మా ఇళ్లలో పండుగ వాతావరణం కనిపించింది. సుధీర్ఘ నిరీక్షణకు సీఎం జగన్ చరమగీతం పలికారు. – రవికుమార్, కొలకలూరి రత్నాకర్‌బాబు, ఏపీ స్టేట్ కాంట్రాక్ట్ ఫార్మాసిస్ట్స్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ చాలా సంతోషంగా ఉన్నాం సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ నిర్ణయం ఎంతో సంతోషానిచ్చింది. ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేస్తోన్న వారికి మేలు జరుగుతుంది. ఇప్పుడు 1,500 మందిని క్రమబద్ధీకరిస్తారు. వీరితోపాటే మిగిలిన వారినీ క్రమబద్ధీకరించాలని కోరుతున్నాం. – గాంధీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం రుణపడి ఉంటాము చంద్రబాబు సీఎంగా ఉండి 1994లో పోస్టుల్లో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బందిని నియమించారు. ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ సీఎం జగన్ సానుకూల నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. మా కుటుంబాలు సీఎం జగన్‌కు రుణపడి ఉంటాయి. – ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్వాగతిస్తున్నాం.. 12వ పీఆర్సీ ఏర్పాటు చేయాలని కేబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. కొత్త డీఏ అమలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిర్ణయం హర్షణీయం. ఉద్యోగ, కార్మిక, పెన్షనర్ల సమస్యలు, డిమాండ్లపై కేబినెట్లో సానుకూల నిర్ణయాలు తీసుకున్న సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు. –డీ శ్రీను, రాష్ట్ర అధ్యక్షుడు, డీపీఆర్టీయూ 10వేల కుటుంబాల్లో వెలుగులు పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్‌ను కలిసి వైద్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకుని వెళ్లాము. తాను అధికారంలోకి వస్తే ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని జగన్ హామీ ఇచ్చి ఇప్పుడు దాన్ని నెరవేర్చారు. క్రమబద్ధీకరణ నిర్ణయంతో 10 వేల కుటుంబాల్లో వెలుగులు నింపారు. – అరవ పాల్, అధ్యక్షుడు ఏపీ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ పీఆర్సీ ఏర్పాటు హర్షణీయం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయబద్ధంగా రావలసిన 12వ పేరివిజన్ కమిషన్ ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం హర్షణీయం. దీనికి సహకరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు. – వినుకొండ రాజారావు, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ మంచి నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర చరిత్రలో ఏ సీఎం తీసుకోని గొప్ప నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారు. ఈ నిర్ణయంతో 7 వేల మందికి లబ్ధి చేకూరనుంది. 2014 నాటికి సర్వీస్‌లో ఉన్నవారందరినీ క్రమబద్ధీకరించినట్లయితే మరో 4 వేల మందికి మేలు జరుగుతుంది. ప్రస్తుతం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 110 మంది రెగ్యులర్ అవుతున్నారు. – బి.కృష్ణ, ప్రధాన కార్యదర్శి, ఏపీ పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ -
31లోగా ‘వేతన’ ప్రకటన చేయాలి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణపై ఈ నెల 31లోగా ప్రకటన చేయాలని, లేనిపక్షంలో వచ్చే నెల 2 నుంచి ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ప్రకటించింది. ఫిబ్రవరి 1న నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తామని, 2న విద్యుత్ సౌధ ముట్టడి, మహాధర్నా నిర్వహిస్తామని వెల్లడించింది. జేఏసీ నేతలు మంగళవారం విద్యుత్ సౌధలో తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావును కలిసి వినతిపత్రం అందజేశారు. అమల్లో ఉన్న విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ గడువు గతేడాది మార్చి 31తో ముగిసిపోగా, అదే ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త పీఆర్సీ అమలు చేయాల్సి ఉందని నేతలు జి.సాయి బాబు, రత్నాకర్‌రావు, శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త పీఆర్సీపై గతేడాది మే 30న సంప్రదింపుల కమిటీని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఏర్పాటు చేసినా, ఇప్పటి వరకు పీఆర్సీపై ప్రకటన చేయలేదన్నారు. 1999, అక్టోబర్ 2 నుంచి 2004, ఆగస్టు 31 మధ్యకాలంలో నియమితులైన విద్యుత్ ఉద్యోగులకు ఈపీఎఫ్‌కి బదులు జీపీఎఫ్‌ను అమలు చేయాలన్నారు. -
సీఎం జగన్‌ను కలిసిన ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు కలిశారు. అసోసియేషన్ల క్యాలెండర్, డైరీలను సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మీడియతో మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న బకాయిలను త్వరలోనే విడుదల చేస్తామని సీఎం చెప్పారని ఆయన తెలిపారు. ‘‘రెండు డీఏలు కూడా ఇవ్వాలని కోరాం. సంక్రాంతికి ఒక డీఏ, ఏప్రిల్ నుంచి ఎరియర్స్ ఇస్తామన్నారు. సీఎంకు ఉద్యోగుల తరఫున కృతజ్ఞలు తెలుపుతున్నాం’’ అని బండి శ్రీనివాసరావు అన్నారు. చదవండి: చింతకాయల విజయ్‌కు షాకిచ్చిన చంద్రబాబు -
గన్ పార్క్ వద్ద గల్ఫ్ కార్మికుని మృతదేహానికి నివాళి
సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ధర్మాజీపేట గ్రామానికి చెందిన జనగామ నర్సయ్య ఇటీవల బహ్రెయిన్‌లో మరణించారు. శనివారం బహ్రెయిన్ నుంచి హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మృతదేహాన్ని గల్ఫ్ జేఏసీ నాయకులు, మృతుని కుటుంబ సభ్యులు కలిసి హైదరాబాద్‌లోని అమరవీరుల స్తూపం, గన్ పార్క్ వద్ద ఉంచి నివాళులు అర్పించారు. గల్ఫ్ అమరులకు నివాళులు అర్పిస్తూ అరుణోదయ సాంస్కృతిక బృందం పాటలు పాడారు. గల్ఫ్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గుగ్గిల్ల రవిగౌడ్, తెలంగాణ బీజేపీ గల్ఫ్ మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు, తెలంగాణ గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, గల్ఫ్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుల మురళీధర్ రెడ్డి, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల, సీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చెన్నమనేని శ్రీనివాస రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన గల్ఫ్ జేఏసీ నాయకులు రూ.500 కోట్ల వార్షిక బడ్జెట్‌తో గల్ఫ్ బోర్డుతో కూడిన సమగ్ర ప్రవాసీ విధానం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి గత ఎనిమిది ఏళ్లలో 1,600 మంది తెలంగాణ కార్మికులు గల్ఫ్ దేశాలలో మృతి చెందారని, కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి గల్ఫ్ మృతుని కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు -
పరిపాలన రాజధాని వచ్చే వరకూ విశ్రమించం
సాక్షి, విశాఖపట్నం: ‘ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి స్వస్తి పలుకుతూ.. అభివృద్ధి బాటలో నడిపించేందుకు చేపట్టిన ఉద్యమంలో ఇది తొలి అడుగు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ఏర్పాటు చేసుకునేంత వరకు ఊరూ వాడా ఏకమై ఉద్యమిద్దాం. మరోసారి రాష్ట్రం విడిపోకుండా సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయానికి ప్రతి ఒక్కరం మద్దతు పలుకుదాం. ఉత్తరాంధ్ర అభివృద్ధిని వ్యతిరేకిస్తున్న వారిని ఈ ప్రాంతం లో నిషేధిద్దాం. ఉద్యమాల పురిటిగడ్డపై వేషగాళ్లు వెనకడుగు వేసేంత వరకూ గర్జిద్దాం..’ అంటూ నాన్ పొలిటికల్ జేఏసీ, మద్దతునిచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచెయ్యకుండా సాగిన విశాఖ గర్జన ర్యాలీ ముగింపు సభ బీచ్‌రోడ్డులోని వైఎస్సార్ విగ్రహం సమీపంలో జరిగింది. విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో ఏర్పాటైన జేఏసీ నేతృత్వంలో జరిగిన ఈ సభలో ప్రజా ప్రతినిధులు, మేధావులు, న్యాయవాదులు, ప్రజా, యువజన సంఘాల నేతలు పాల్గొని తమ ఆకాంక్షను చాటారు. జేఏసీ నేతలు దేవుడు, కొయ్య ప్రసాద్‌రెడ్డి, డిప్యూటీ సీఎంలు పీడిక రాజన్న దొర, బూడి ముత్యాల నాయుడు, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, జోగి రమేష్, సీదిరి అప్పలరాజు, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, గొడ్డేటి మాధవి, భీశెట్టి సత్యవతి, బెల్లాన చంద్రశేఖర్, మాజీ మంత్రులు పేర్ని నాని, ధర్మాన కృష్ణదాస్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు, మేయర్ జి.హరివెంకటకుమారి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. విశాఖకు రాజధాని రావాల్సిందే వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధి కోసం న్యాయంగా చేస్తున్న మా పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలకాలి. ఇప్పటికే మూడుసార్లు మన రాష్ట్రాన్ని విభజించారు. మళ్లీ అమరావతే ఏకైక రాజధాని అయితే.. భవిష్యత్తులోనూ మళ్లీ విభజన డిమాండ్ పురుడు పోసుకుంటుందనడంలో సందేహం లేదు. రాజధాని వచ్చేంత వరకూ పోరాటం సాగిద్దాం. భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుందాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. విశాఖకు రాజధాని రావాల్సిందే. – ప్రొఫెసర్ లజపతిరాయ్, నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్ టీడీపీ, జనసేనకు ఉత్తరాంధ్ర అభివృద్ధి ఇష్టం లేదు మన హక్కుల్ని మనం కాపాడుకుందాం. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఇదే తరహాలో నినదిద్దాం. ఏపీ సువిశాలంగా.. మూడు ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందాలని సీఎం వైఎస్ జగన్ కాంక్షిస్తుంటే.. అమరావతి పేరుతో 29 గ్రామాలున్న ప్రాంతానికి మాత్రమే అభివృద్ధిని పరిమితం చేయాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ కుతంత్రాలు పన్నుతున్నారు. పైన ఆకుపచ్చ చొక్కాలు.. లోపల పసుçపు పచ్చ ఆలోచనలతో.. తమ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పాదయాత్ర పేరుతో వారు దండయాత్ర చేస్తుండటం సిగ్గు చేటు. అధికారంలో ఉండగా, అమరావతి ప్రాంతంలో రైతులను దోచుకున్న చంద్రబాబే.. అమరావతి రైతుల పేరుతో పాదయాత్ర చేయిస్తున్నారు. కేవలం విశాఖ మాత్రమే కాకుండా.. అమరావతి, కర్నూలు ప్రాంతాలు కూడా సమానాభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి జగన్ సంకల్పించినా.. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం ఇష్టం లేని టీడీపీ, జనసేన దాన్ని ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మూడు రాజధానులే ఈ రాష్ట్రానికి శరణ్యం. – మేరుగు నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఉత్తరాంధ్ర ప్రజలకు సెల్యూట్ విశాఖను రాజధానిగా చేయాలన్న ఆకాంక్ష ప్రజల మనసుల్లో బలంగా నాటుకుపోయింది. వర్షాన్ని లెక్క చేయకుండా వచ్చిన జనానికి సెల్యూట్ చేస్తున్నా. విశాఖ రాజధాని ఉద్యమానికి మద్దతిచ్చేందుకు ఇంత మంది జనం తరలివస్తారని ఊహించలేదు. విశాఖ గర్జనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించేందుకు ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రయత్నించినా, వారి కుట్రలు ఫలించలేదు. ఇప్పటికైనా టీడీపీ, జనసేన, ఇతర పార్టీల నేతలు ప్రజల మనోభావాలు, ఆకాంక్షలను గౌరవించి విశాఖ రాజధాని ఉద్యమానికి మద్దతివ్వాలి. – గుడివాడ అమర్నాథ్, ఐటీ శాఖ మంత్రి జగన్ ఉండగా.. మనకెందుకు భయం? విశాఖను పాలన రాజధానిగా చేయాలన్న తపన.. వేలాది మందిని ఇక్కడికి నడిపించింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటూ ప్రకృతి కూడా గర్జించి.. ఆమోదం తెలిపింది. తాత ముత్తాతలు మూడేళ్లు కర్నూలు రాజధానికి వెళ్లారు. మన తండ్రులు, మనం హైదరాబాద్ వెళ్లాం. ఇకపై అక్కడెక్కడికో వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తకూడదనే ఉద్దేశంతో.. ఉత్తరాంధ్రని వెనుకబాటు నుంచి అభివృద్ధి పథంలోకి తీసుకురావాలన్న సంకల్పంతో సీఎం వైఎస్ జగన్ విశాఖను పాలన రాజధానిగా ఎంపిక చేస్తూ అరుదైన అవకాశం కల్పించారు. ఈ అవకాశాన్ని మనం వదులుకోరారు. మా ప్రాంతానికి ఉద్యోగాలు రాకుండా, ఉపాధి లేకుండా, పరిశ్రమలు రాకుండా అడ్డుకోవాలనుకుంటున్న వారి ఆటలిక సాగవు. 130 ఏళ్ల నుంచి వస్తున్న వెనుకబాటుతనానికి వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఈ రోజు గర్జిస్తుంటే.. దాన్ని అడ్డుకోవాలని చూస్తున్న వారు మిత్రులు కాదు.. ఉత్తరాంధ్ర ద్రోహులు. విభజన చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్రంలో భిన్నమైన అభిప్రాయాలు కలిగిన నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి అవసరమని సూచించింది. రాష్ట్రంలో అన్ని నగరాలకంటే విశాఖపట్నం రాజధానికి సరైనదని స్పష్టం చేసింది. దీనికి భిన్నంగా.. చంద్రబాబు తన తొత్తులైన నారాయణ, సుజనాచౌదరి, ఇతర నేతలతో కూడిన కమిటీ వేసి రాజధాని అమరావతి అని నిర్ణయించేశారు. ఈ అధికారం ఎవరు ఇచ్చారు? అప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, ఏపీని తాకట్టు పెట్టడానికి 35వేల ఎకరాలు చుట్టేసి, చుట్టూ భూముల్ని చంద్రబాబు సన్నిహితులు, టీడీపీ నేతలు కొనుగోలు చేసేశారు. భవిష్యత్తులో హైదరాబాద్ మాదిరిగా.. అమరావతి నుంచి మనల్ని వెళ్లగొడితే దిక్కెవరు? ఇప్పటికైనా మనం గట్టిగా నిలబడదాం. బలమైన నాయకుడు సీఎం వైఎస్ జగన్ ఉండగా.. మనకెందుకు భయం? పోరాటాన్ని మరింత ఉధృతం చేద్దాం. – ధర్మాన ప్రసాదరావు, రెవెన్యూ శాఖ మంత్రి అందరూ బాగుండాలన్నదే మా ఆకాంక్ష విశాఖ వాసులు ఉక్కు సంకల్పంతో రాజధానిని సాధించుకోవాలనే కాంక్షతో భారీ వర్షాన్ని సైతం లెక్క చెయ్యకుండా గర్జించారు. విశాఖ రాజధానిని సాధించుకొని బానిస సంకెళ్ల నుంచి బయటపడాలి. కర్నూలు, హైదరాబాద్‌ని రాజధాని చేసినా ఉత్తరాంధ్ర ప్రజలు సరే అన్నారు. కానీ.. ఈసారి మాత్రం ఆ తప్పు చేయకూడదు. వికేంద్రీకరణ జరగాల్సిందే. విశాఖలో రాజధాని ఏర్పాటు కావాల్సిందే. నాది గుంటూరు జిల్లా అయినా.. వికేంద్రీకరణ మా అభిమతం. విశాఖ ప్రజల ఉగ్రరూపం ఎలా ఉంటుందో అందరూ చూశారు. ఈరోజు విశాఖ గర్జన చూస్తే చంద్రబాబు బ్యాచ్‌కు నిద్రపట్టదు. ఉక్కు సంకల్పంతో విశాఖను పరిపాలన రాజధానిగా ఉత్తరాంధ్ర ప్రజలు సాధిస్తారు. పెయిడ్ ఆర్టిస్టులతో చేస్తున్న పాదయాత్రతో దేనికి సంకేతమిస్తున్నారు? అందరూ బాగుండాలని మేము కోరుకుంటే.. అమరావతి మాత్రమే బాగుండాలని టీడీపీ, జనసేన, ఇతర నేతలు కోరుకోవడం సమంజసమేనా? – విడదల రజిని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రూ.5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృథా చెయ్యాలనుకుంటున్నారా? రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది దివంగత వైఎస్సార్ కల. ఇవాళ విశాఖ గర్జన ర్యాలీకి ఇంత మంది తరలి రావడం చూసి ఆనందం ఉప్పొంగుతోంది. విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలన్న బలమైన ఆకాంక్షతోనే ఇంత మంది ప్రజలు విశాఖ గర్జనకు తరలివచ్చారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇంత మంది వచ్చారంటే వారంతా విశాఖకు మద్దతిస్తున్నారనే అర్థం. విశాఖ రాజధాని కేవలం ఆ నగర ప్రజలకు మాత్రమే కాదు.. రాష్ట్రం మొత్తానికి అవసరం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను మెరుగు పరిచేందుకు విశాఖకు రాజధాని రావాల్సిన అవసరం ఉంది. పోర్టులు, రైల్వే ఫ్యాక్టరీ వంటి సదుపాయాలున్న విశాఖకు రాజధాని వస్తే పెట్టుబడులు పెరిగి నిధులు సమకూరుతాయి. ఇలాంటి నగరాన్ని వదిలేసి రూ.5 లక్షల కోట్లతో రాజధానిని కట్టి చంద్రబాబు ప్రజాధనాన్ని వృథా చేయాలనుకుంటున్నారు. అసలు అమరావతి ఎలా రాజధాని అవుతుంది? అది కేవలం దోపిడీ మాత్రమే. 29 గ్రామాలనే అభివృద్ధి చేసి దానిని రాజధాని అంటే ఎవరు నమ్ముతారు? అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే సీఎం జగన్ వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారు. దానికి అందరూ మద్దతివ్వాలి. – బొత్స సత్యనారాయణ, విద్యా శాఖ మంత్రి టీడీపీ కార్యాలయాల్లో క్షుద్రపూజలు! ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నాళ్లీ బానిస బతుకులు బతకాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్ విశాఖని కార్యనిర్వాహక రాజధానిగా చేయాలని సంకల్పించారు. పరిపాలన రాజధాని వస్తే.. ఈ ప్రాం తంలో అభివృద్ధి జరుగుతుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కానీ.. మనం స్వతంత్రంగా ఉండకూడదనే కుటిలబుద్ధితో కొందరు లుచ్ఛాలు, పచ్చ నేతలు.. టీడీపీ, దానికి కొమ్ముకాస్తున్న పార్టీలు కలిసి.. టీడీపీ కార్యాలయాల్లో క్షుద్ర పూజలు చేస్తున్నారు. ఎన్ని క్షుద్ర పూజలు చేసినా.. ఈ పోరాటం ఆగదు. రాబందుల్ని ఇక్కడి నుంచి పంపించి.. ఉత్తరాంధ్రకు రాజధాని సాధించేంత వరకు చేయి చేయి కలుపుతూ.. సీఎం జగన్ ఇచ్చిన అవకాశాన్ని నెరవేర్చుకుందాం. – కరణం ధర్మశ్రీ, ప్రభుత్వ విప్ విశాఖ నుంచి త్వరలో పరిపాలన అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని సీఎం జగన్ సంకల్పిస్తే.. అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని, ఆ ప్రాంతంలో తమ భూముల రేట్లు పెంచుకుని దోచుకోవాలని టీడీపీ, ఇతర ప్రతిపక్షాలు చూస్తున్నాయి. సీఎం జగన్ నిర్ణయం మేరకు మూడు రాజధానులను ఏర్పాటు చేసుకుంటాం. విశాఖ నుంచే సీఎం త్వరలో పరిపాలన సాగిస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పాదయాత్ర పేరుతో ఈ ప్రాంతంపై దండయాత్ర చేస్తున్న వారు, ఆ దండయాత్రకు మద్దతిస్తున్న టీడీపీ, చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్‌లను ఉత్తరాంధ్ర ప్రజలు నిలదీయాలి. విశాఖను పరిపాలన రాజధానిగా సాధించుకునేందుకు, జేఏసీ ఏ పోరాటం చేసినా మద్దతు ఇస్తాం. – వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ చైర్మన్, వైఎస్సార్సీపీ ఉమ్మడి విశాఖ ఇన్చార్జ్ మన ఆకాంక్ష నెరవేరే వరకు పోరాడుదాం ఈ ప్రాంతంపై దశాబ్దాలుగా పాలనా పరమైన వివక్ష చూపారు. ఈ కారణంగానే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి గురైంది. ఉద్యమాలకు పురిటిగడ్డ ఉత్తరాంధ్ర ప్రాంతం. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం నాడు ఉద్యమాలు జరిగితే.. ఈరోజు మళ్లీ మన బతుకుల బాగు కోసం విశాఖే పరిపాలన రాజధానిగా ఉండాలని ఉద్యమిస్తున్నాం. ఆకలి మంటలతో చచ్చే బదులు.. పోరాడి చద్దాం. ప్రతి పురుషుడు, ప్రతి మహిళ, ప్రతి యువకుడు.. ఈ కదన రంగంలోకి దిగాలి. మరో ఉద్యమం రాకుండా వికేంద్రీకరణ అనే పవిత్రమైన నిర్ణయాన్ని సీఎం జగన్ తీసుకున్నారు. ఏపీని సర్వతోముఖాభివృద్ధిగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీల్ని నిలదీయాలి. మన హక్కుల్ని సాధించుకునే అవకాశం దశాబ్దాల తర్వాత సీఎం జగన్ ఇచ్చారు. పోరాడి తెచ్చుకుందాం. సీఎం ఇక్కడి నుంచి పాలన ప్రారంభించేంత వరకూ ఈ పోరాటాన్ని కొనసాగిద్దాం. – తమ్మినేని సీతారాం, శాసనసభ స్పీకర్ చంద్రబాబును, దత్తపుత్రుడిని తరిమికొట్టాలి రాయలసీమలో పుట్టినా ఉత్తరాంధ్ర ప్రజలకు మద్దతు ఇస్తున్నాను అంటే సీఎం జగన్ నిర్ణయం ఎంత బలమైనదో అర్థం చేసుకోవాలి. దేశంలో చక్రం తిప్పానని చెప్పుకుంటూ, తుప్పు పట్టిన సైకిల్ చక్రం అధినేత చంద్రబాబు మన రాష్ట్రానికి చేసిందేమీ లేదు. చంద్రబాబు అసమర్థ పాలన వల్లే ఉత్తరాంధ్ర, రాయలసీమలు అన్యాయానికి గురయ్యాయి. సీఎం జగన్ వికేంద్రీకరణ నిర్ణయానికి 26 జిల్లాల ప్రజలు మద్దతు తెలియజేస్తుంటే.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు.. అమరావతి రైతుల ముసుగులో వస్తున్న పెయిడ్ ఆర్టిస్టులకు మద్దతిస్తున్నారు. వారిని తమిరి కొట్టాలా.. వద్దా? చంద్రబాబు దత్తపుత్రుడు పవన్‌కల్యాణ్ పెళ్లి చేసుకోడానికి విశాఖ అమ్మాయి కావాలి. షూటింగులకు విశాఖ కావాలి. నటన నేర్చుకోడానికి వైజాగ్ కావాలి. చివరికి ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా విశాఖ కావాలి. కానీ.. వైజాగ్‌కు రాజధాని వద్దు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందకూడదా? గాజువాక ప్రజలు విజన్ ఉన్న వాళ్లు కాబట్టే.. ఈయన నిజ స్వరూపం ముందే తెలుసుకొని చిత్తుగా ఓడించారు. ఆకలి పోరాటం విలువ తెలిసిన ఉత్తరాంధ్ర ప్రజలు తొడగొడితే.. పవన్ కల్యాణ్ చిత్తు అవ్వడం ఖాయం. వికేంద్రీకరణ కోరుకున్న వాళ్లంతా పిచ్చికుక్కలంటూ ఉత్తరాంధ్రలో పుట్టిపెరిగిన అచ్చోసిన ఆంబోతులా అచ్చెన్న మాట్లాడుతున్నారు. 26 జిల్లాల అభివృద్ధిని 29 గ్రామాలకు మాత్రమే కావాలనుకుంటున్న వారే పిచ్చికుక్కలు, గజ్జికుక్కలు, ఊరకుక్కలు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు చెయ్యలేని అభివృద్ధిని సీఎం జగన్ మూడేళ్లలో చేసి చూపించారు. – ఆర్కే రోజా, పర్యాటక శాఖ మంత్రి ఇక్కడ పేపర్లు, పచ్చళ్లు అమ్మడం లేదా? హైదరాబాద్ తరహాలో రాష్ట్ర సంపదంతా ఒకే చోట అమరావతిలో ఖర్చు చేశాక, మిగతా ప్రాంతాల్లో ఉద్యమాలు వస్తే దానికి ఎవరు బాధ్యులు? ఇకపై ఇలా జరగరాదనే సీఎం జగన్ ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. విశాఖ గర్జన చూశాక అయినా, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ 5 బీఆర్ నాయుడు ప్రజల మద్దతు ఎవరికి ఉందో తెలుసుకోవాలి. అమరావతికే మద్దతు ఇస్తున్న తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్రలో లేదా? ఈనాడు రామోజీరావు ఇక్కడ పేపర్లు, పచ్చళ్లు అమ్ముకోవడం లేదా? రాధాకృష్ణ, టీవీ–5 చానళ్లు ఇక్కడ నడపడం లేదా? వీళ్లందరికీ అమరావతి మీదే ఎందుకు ప్రేమ అంటే, వీళ్లంతా ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామనుకున్నారు. జగన్ సీఎం అయ్యాక వారి పప్పులు ఉడకడం లేదు. అమరావతిలో రూ.40లక్షలు పెట్టి కొన్న భూములు రూ.4 కోట్లు కాలేదన్న బాధతో వీరంతా మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారు. తమ ఆస్తుల కోసం ఉత్తరాంధ్ర మీద విషం చిమ్ముతున్నారు. చంద్రబాబు ఒక 420. పిల్లనిచ్చి, పార్టీలో చేర్చుకున్న ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, పార్టీని, ముఖ్యమంత్రి పదవిని ఆక్రమించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఎందర్నో వేధించి.. 210 లోకేష్ కోసం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబుకు తన ఆస్తుల మీద, పార్టీ మీద, కొడుకు లోకేష్ మీద తప్పితే.. ప్రజల మీద ప్రేమ, దయ, బాధ్యత ఉండదు. ఉత్తరాంధ్ర ద్రోహులందరినీ బ్యాన్ చెయ్యాలి. వారి పేపర్లు, పచ్చళ్లు కొనొద్దు, చానల్స్ రాకుండా కేబుల్ ఆపరేటర్లతో మాట్లాడండి. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్లు.. వారు ఇటువైపు చూడాలంటే భయం కలిగేలా చేయండి. కృష్ణా, గుంటూరు జిల్లాలు కూడా ఉత్తరాంధ్ర అభివృది ్ధని కోరుకుంటున్నాయి. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేస్తే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందు తుంది. – కొడాలి నాని, మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే. -
అయ్యన్న పాత్రుడు క్షమాపణ చెప్పాలి
-
AP: ఉపాధ్యాయ సంఘాల బండారం బయటపెట్టిన పీఆర్సీ స్టీరింగ్ కమిటీ
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ సంఘాల బండారం పీఆర్సీ స్టీరింగ్ కమిటీ బయటపెట్టింది. హెచ్ఆర్ఏ విషయంలో తెలంగాణకు సమానంగా తెచ్చుకున్నామని.. పీఆర్సీ ఐదేళ్లకు ఒకసారి ఇచ్చేలా చూశామని పీఆర్సీ జేఏసీ నేతలు అన్నారు. అదనపు పెన్షన్, సీసీఏ కూడా వచ్చిందన్నారు. చదవండి: ఆంధ్రప్రదేశ్ కోణంలో ఇది చెత్త బడ్జెట్: విజయసాయిరెడ్డి ‘‘ఉపాధ్యాయ సంఘాలు ప్రతి అంశంలో చర్చల్లో పాల్గొన్నాయి. అప్పుడే ఉపాధ్యాయ సంఘాలు చర్చల నుంచి బయటకు రావాల్సింది. ఫిట్‌మెంట్‌పై అప్పుడే బయటకు వచ్చి చెప్పాల్సింది. సమ్మె విరమించుకుందామని కూడా ఉపాధ్యాయ సంఘాలు చెప్పాయి. ఉపాధ్యాయుల ఆందోళనలో వేరే శక్తులు ఉన్నాయని’’ పీఆర్సీ జేఏసీ నేతలు అన్నారు. ఉపాధ్యాయ ముసుగులో దుష్ఫ్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నిర్ణయంలోనూ 20 మంది అభిప్రాయం మేరకే ముందుకెళ్లామన్నారు. మెరుగైన ప్రయోజనం వచ్చింది కాబట్టే సమ్మె విరమించామన్నారు. ఉపాధ్యాయ సంఘాలు మంత్రులు పక్కన కూర్చుని మాట్లాడలేదా? గ్రాట్యుటీ, ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై చర్చ జరిగినప్పుడు మీకు తెలియదా?. అన్నింటికీ ఒప్పుకుని ఇప్పుడు ఇలా మాట్లాడతారా అంటూ ఉపాధ్యాయ సంఘాలను పీఆర్సీ జేఏసీ నేతలు నిలదీశారు. -
అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన
తాడికొండ: అమరావతి రైతులు ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరిట సోమవారం నిర్వహించిన మహా పాదయాత్రలో అడుగడుగునా హైకోర్టు పేర్కొన్న నిబంధనలు ఉల్లంఘించారు. కోర్టు ఆదేశాల మేరకు పాదయాత్రకు 157 మందికే అనుమతులు ఇవ్వగా.. అందుకు భిన్నంగా వేలాది మంది టీడీపీ నేతలు అమరావతి రైతుల ముసుగులో చేరారు. కరోనా నిబంధనలను సైతం పాటించకుండా పాదయాత్రలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు శివాలయంలో పూజల అనంతరం ప్రారంభమైన పాదయాత్ర తాడికొండ వరకు కొనసాగింది. రైతుల పేరుతో గుంటూరు, విజయవాడ, ఇతర గ్రామాల నుంచి టీడీపీ కార్యకర్తలు గుంపులుగా చేరారు. డీజేలు, తీన్మార్లు లేకుండా, రెచ్చగొట్టే ప్రసంగాలు లేకుండా పాదయాత్ర నిర్వహించుకోవాలని కోర్టు ఆదేశించినా పట్టించుకోలేదు. మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. గుంటూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్, మాజీ మంత్రులు దేవినేని ఉమా, పత్తిపాటి పుల్లారావు ఆద్యంతం పాదయాత్రను దగ్గరుండి మరీ నడిపించారు. టీడీపీ నేతలు పత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబు, పోతినేని శ్రీనివాసరావు, గద్దె అనురాధ, సీపీఐ నారాయణ, బీజేపీ నేత పాతూరి నాగభూషణం, కాంగ్రెస్ పార్టీ నేత సుంకర పద్మశ్రీ తదితరులు పాదయాత్రలో పాల్గొనడం గమనార్హం. అమరావతి జేఏసీ నేతలు టీడీపీ నేతలతో కలిసి రాత్రి బసకు తాడికొండలో ఏర్పాట్లు చేశారు. -
విశాఖ ఉక్కును కాపాడేందుకు కృషి: సీఎం జగన్
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సమగ్ర సూచనలతో నేను ప్రధానికి లేఖ రాశాను. దానిని మీడియాకు కూడా విడుదల చేశాం. అయితే లేఖ రాయలేదని కొంత మంది సీనియర్ నాయకులు చెబుతున్నారు. వారి ఐక్యూ లెవల్ ఏ పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోండి. నేను రాసిన లేఖ అందినట్లుగా ప్రధాన మంత్రి కార్యాలయం రసీదు కూడా పంపింది. దానిని టీడీపీ అధినేత చంద్రబాబుకు మీరే (కార్మిక సంఘాల నేతలు) పంపించండి. ప్రధాన మంత్రికి లేఖ రాయాలన్న ఆలోచన ఇంత గొప్ప ఆరోపణలు చేస్తున్న ఆయనకు ఎందుకు రావడం లేదు? – సీఎం వైఎస్ జగన్ సాక్షి , విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించడానికి అన్ని విధాలా ప్రయత్నాలు సాగిస్తామని తెలిపారు. పరిశ్రమను కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీగా, చిత్తశుద్ధితో అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న రాజ శ్యామల యాగంలో పాల్గొనేందుకు బుధవారం ఆయన విశాఖకు వచ్చారు. ఉదయం 11.48 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. ఎయిర్పోర్ట్ లాంజ్‌లో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో నాయకులు చెప్పిన విషయాలను సీఎం సానుకూలంగా విన్నారు. ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం శాంతియుతంగా చేస్తున్న పోరాటాలకు ప్రభుత్వం తరఫున మద్దతు ఇవ్వాలని కమిటీ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు వారు సీఎంకు ఓ వినతి పత్రం ఇచ్చారు. ఎంపీలను ముందు పెట్టి కేంద్రం వైఖరికి నిరసనగా ఉద్యమాన్ని నడిపించాలని విజ్ఞప్తి చేశారు. పరిశ్రమకు సొంత గనులు లేని కారణంగా నష్టాలు చవిచూడాల్సి వస్తోందని, కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి గనులు కేటాయించేలా ప్రయత్నం చేయాలన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. వీటన్నింటిపై సీఎం సానుకూలంగా స్పందిస్తూ మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి. సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నా.. – నాపై నమ్మకం ఉంచినందుకు, ఆప్యాయత చూపిస్తున్నందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ప్రత్యామ్నాయాలను సూచిస్తూ నేను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశాను. 32 మంది ప్రాణ త్యాగంతో వచ్చిన స్టీల్ ప్లాంట్ నేపథ్యాన్ని తెలియజేస్తూ.. స్టీల్ ప్లాంట్‌ను బాగు చేసేందుకు ఒక కార్యాచరణను సూచించాను. – సొంత గనులు కేటాయించడంతో పాటు రుణాలను ఈక్విటీ రూపంలోకి మార్చాలని ప్రతిపాదించాను. దాదాపు రూ.22 వేల కోట్లు దీర్ఘకాలిక రుణాలు, మరో రూ.10 వేల నుంచి రూ.11 వేల కోట్లు వర్కింగ్ క్యాపిటల్ రూపంలో తీసుకోవడం వల్ల లాంగ్ టర్మ్ అప్పులుగా మారాయి. కొన్ని బ్యాంకులు 14 శాతం వడ్డీతో రుణాలు ఇచ్చాయి. – బ్యాంకులు ఎక్కువ వడ్డీకి ఇచ్చిన రుణాలు ఈక్విటీల రూపంలోకి మారిస్తే.. వడ్డీల భారం తగ్గుతుందని, ఆ మేరకు రూ.2500 కోట్లు నుంచి రూ.3 వేల కోట్లు కట్టాల్సిన అవసరం ఉండదని, ఫలితంగా కంపెనీ లాభాల్లోకి వస్తుందని లేఖలో వివరించాను. – పరిశ్రమకు సొంత గనులు లేకపోవడంతో ప్రతి టన్నుకు రూ.4 వేలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని, ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా సూచించాను. – స్టీల్ ప్లాంట్‌కు దాదాపు 20 వేల ఎకరాల భూములు ఉండగా, అందులో ఉపయోగించని భూమి 7 వేల ఎకరాల వరకు ఉంటుందని చెబుతున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ల్యాండ్ యూజ్ కన్వర్షన్‌కు అనుమతి ఇస్తాం. ఆ భూములను ప్లాట్లుగా వేసి కంపెనీయే విక్రయించి వచ్చిన డబ్బును సంస్థలోనే పెడితే ఒకేసారి నగదు నిల్వలు పెరుగుతాయి. దీని వల్ల పరిశ్రమ కష్టాల నుంచి బయట పడుతుందని తెలిపాం. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నా. సొంత గనులు ఉండాల్సిందే – స్టీల్ ప్లాంట్‌కు సొంత గనుల కేటాయింపుపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఒడిశాలో పుష్కలంగా ఇనుప ఖనిజ నిల్వలు ఉన్నాయి. ఈ ప్లాంటుకు గని కేటాయించాలని కేంద్రాన్ని కోరాం. ఆర్ఐఎన్ఎల్కు ఈఐఎల్ పేరుతో ఇప్పటికే ఒడిశాలో ఐదు మైన్స్ ఉన్నాయి. అయితే వాటి లీజు ఒప్పందాల కాలం తీరిపోయింది. వాటిని పునరుద్ధరించాల్సి ఉంది. – ఈ గనుల్లో దాదాపు 51 శాతం వాటా ఆర్ఐఎన్ఎల్కు ఉంది. మిగిలినది ఎల్ఐసీ, కేంద్ర ప్రభుత్వానికి, ఒక శాతం ఒడిశా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు వాటాలున్నాయి. ఈ మైన్స్ ఏ పరిస్థితుల్లో ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం విచారించింది. – ఈ గనుల నుంచి ఖనిజాన్ని పొందేలా లీజులను పునరుద్ధరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ గనులలో 200 మిలియన్ టన్నుల నిల్వలు ఉన్నాయని పీఎంకు రాసిన లేఖలో వివరించాను. ఏపీలో ఆ స్థాయిలో ఖనిజ నిల్వలు లేవు. అందువల్ల ఒడిశాలో ఉన్న గనుల లీజులు పునరుద్దరించాలని చెప్పాను. ఒక గనికి అటవీ అనుమతి కూడా లభించిందని చెబుతున్నారని, మరో నాలుగు నెలల్లో సొంతంగా ఒడిశాలో గని కూడా వస్తుందని భావిస్తున్నాం. పోస్కో విశాఖకు రాదు.. – పోస్కో ప్రతినిధులు గతంలో నన్ను కలిసిన మాట వాస్తవమే. భావనపాడు, కృష్ణపట్నం, కడపలో పరిశ్రమల కోసం పెట్టుబడులు పెట్టాలని వారికి సూచించాం. అంతేగానీ పోస్కో సంస్థ విశాఖకు రాడానికి ప్రయత్నిస్తోందనడం సరికాదు. ఈ విషయంలో ఉద్యోగులు, కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – విశాఖ స్టీల్ ప్లాంట్ మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి హక్కు లేదు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఈ ప్లాంట్ వచ్చిన నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రైవేటీకరణ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తోంది. కార్మికులకు అండగా ప్రభుత్వం – స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని మళ్లీ చెబుతున్నా. పరిశ్రమను కాపాడుకోడానికి కార్మికులు, ఉద్యోగులు, అఖిల పక్షం నాయకులు చేస్తున్న పోరాటానికి ప్రభుత్వం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుంది. – ఒక్క రోజు కూడా ప్లాంట్ మూత పడకుండా, ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం లేకుండా.. ఉన్న సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేస్తూ.. ఏ ఒక్కరూ వేలెత్తి చూపకుండా పోరాటం సాగించాలి. ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మీరు కోరిన మేరకు అసెంబ్లీలో తీర్మానం కూడా చేస్తాం. – ఈ భేటీలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, బి.సత్యవతి, పలువురు ఎమ్మెల్యేలు, సీఎం పోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి భరోసా ధైర్యాన్నిచ్చింది స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించిన తీరు పట్ల ఉక్కు పరిరక్షణ పోరాట కమిటి ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కును సీఎం వైఎస్ జగన్ కాపాడతారన్న నమ్మకం ఉందని వారు స్పష్టం చేశారు. సీఎంతో భేటీ అనంతరం కమిటీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. సీఎం చాలా సానుకూలంగా స్పందించారని చెప్పారు. సీఎంతో భేటీ తర్వాత ఉద్యమానికి ఊపిరి వచ్చిందని ఐఎన్టీయుసి నేత మంత్రి రాజశేఖర్ వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో ముఖ్యమంత్రి చూపిస్తున్న చొరవ అభినందనీయమని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ నరసింగరావు అన్నారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించడానికి సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేయడం సంతోషంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి అన్నారు. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు మానుకొని, అందరూ కలసికట్టుగా ఉద్యమంలో భాగస్వాములై కేంద్రంపై పోరాడాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. సీఎంతో భేటీ అయిన వారిలో ఎఐటియుసి నేతలు డి.ఆదినారాయణ, కె.ఎస్.ఎన్.రావు, వైఎస్సార్టీయుసి నేత వై.మస్తానప్ప, సీఐటియూ నేత జె.అయోధ్యరామ, ఐఎన్టియుసి నేతలు గంధం వెంకటరావు, బి.మురళిరాజు, టీఎన్టీయూసీ నేత బొడ్డు పైడిరాజు, జేఎంఎస్ నేత వి.శ్రీనివాసరావు, బీఎంఎస్ నేత కె.శ్రీనివాస్, సీఎఫ్‌టీయూ నేత దాసరి సురేష్‌బాబు, హెచ్ఎంఎస్ నేత డి.అప్పారావు ఉన్నారు. -
సీఎస్ ఆదిత్యనాథ్‌ను కలిసిన ఉద్యోగ సంఘాలు
సాక్షి, విజయవాడ: సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌ను ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు కలిశారు. ఎన్నికల నిర్వహణ విషయంలో ఉద్యోగ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఉద్యోగ సంఘాలతో సీఎస్ చర్చించారు. అనంతరం ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల విధులకు సహకరించాలని సీఎస్ కోరారని తెలిపారు. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కరోనా వ్యాప్తి ఎక్కువవుతుందని.. ఎస్ఈసీ ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపుతోందని చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. త్వరలో వ్యాక్సిన్ ఇస్తామని సీఎస్ హామీ ఇచ్చారన్నారు. ఎన్నికల విధుల్లో కరోనాతో చనిపోతే రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని కోరామని తెలిపారు. సీఎస్ హామీ మేరకు ఎన్నికల విధుల్లో పాల్గొంటామని చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. చదవండి: ‘ఎస్ఈసీ అలా ఎందుకు చెప్పలేదు..? సీఎస్ సానుకూలంగా స్పందించారు.. ఉద్యోగుల సమస్యల పట్ల సీఎస్ సానుకూలంగా స్పందించారని ఏపీ ఎన్జీవో సెక్రటరీ బండి శ్రీనివాస్ తెలిపారు. కోర్టు తీర్పుకు అనుగుణంగా ఎన్నికల్లో పాల్గొంటామని చెప్పారు. ఉద్యోగులకు ఏమీ జరిగినా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌దే బాధ్యత అని తెలిపారు. చదవండి: ‘అప్పుడు బీజేపీని ఓడించాలని టీడీపీ చెప్పలేదా?’ పీపీఈ కిట్లు ఇవ్వాలి.. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇచ్చే విధంగా ఎన్నికలను రీ షెడ్యూల్ చేయాలని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు కోరారు. రేపటి భేటీలో ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లాలని సీఎస్‌ను కోరామని చెప్పారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పీపీఈ కిట్లు ఇవ్వాలని ఆయన కోరారు. -
అశోక్‌బాబుకు ఏపీ ఉద్యోగుల జేఏసీ కౌంటర్
సాక్షి, అమరావతి: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మొండి వైఖరిని ఉద్యోగ సంఘాలు తప్పుపట్టాయి. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ ఎన్నికల విధుల్లో పాల్గొనమనడంపై మండిపడుతున్నారు. నిమ్మగడ్డ ప్రకటనపై జేఏసీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పీపీఈ కిట్లు, మాస్క్‌లు కరోనాను అడ్డుకోగలవా? అని ఏపీ ఉద్యోగుల జేఏసీ ప్రశ్నించింది. (చదవండి: బాబు చేతిలో తోలుబొమ్మలా నిమ్మగడ్డ) ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనలేం. గడిచిన 10 నెలల్లో ఎంతో మంది ఉద్యోగులు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.ఉద్యోగుల ప్రాణాలు ఎస్ఈసీకి పట్టవా?.ఎన్నికల నిర్వహణ అంత చిన్న విషయం కాదు.మరో మూడు నెలలు స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలి.ఉద్యోగుల విజ్ఞప్తిని ఎస్ఈసీ పరిగణలోకి తీసుకోవాలి. వ్యాక్సినేషన్ తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. ఉద్యోగులను విమర్శించే అర్హత టీడీపీ నేత అశోక్‌బాబుకు లేదు. రాజకీయ వ్యవహారాలు చూసుకోవాలంటూ’ జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు కౌంటర్ ఇచ్చారు. (చదవండి: స్థానిక ఎన్నికలను వాయిదా వేయండి) ఎస్ఈసీ పునరాలోచించాలి.. పీపీఈ కిట్లు, మాస్క్‌లు, శానిటైజర్లు కరోనాను ఆపలేవని పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు మండిపడ్డారు. కరోనాతో ఎంతో మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని, వ్యాక్సినేషన్ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలన్నారు. తమ విజ్ఞప్తిని ఎస్ఈసీ పునరాలోచించాలని ఆయన కోరారు. -
టీఎస్ఆర్టీసీ జేఏసీ నేతల హౌస్ అరెస్ట్
-
ఉద్రిక్తం: జేఏసీ నేతల హౌస్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల జేఏసీ శనివారం తలపెట్టిన బస్‌రోకో ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. కార్మికులు కార్యక్రమానికి పోలీసు శాఖ నుంచి అనుమతులు రాలేదు. దీంతో ఆర్టీసీ జేఏసీ నేతలు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని బీఎన్‌రెడ్డి నగర్లో హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.. మరోనేత రాజిరెడ్డి సైతం గృహ నిర్బంధం చేశారు. నేతల ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు వారి ఇంటి వద్దకు పెద్ద ఎత్తున చేరకుంటున్నారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అయితే బస్‌రోకోకు ఎలాంటి అనుమతి లేదని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రకటించిన నేపథ్యంలో ముందస్తుగానే పలువురు నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్‌ల పరంపర కొనసాగుతోంది. దీనిపై సిటీ సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. నగరంలోని బస్ భవన్‌తో పాటు డిపోల వద్ద 500 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఇది శనివారం తెల్లవారుజామున 3గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 3గంటల వరకు వర్తిస్తుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రూపులుగా ఏర్పడి ఆందోళన చేయొద్దని, బస్సుల రాకపోకలు అడ్డుకుంటే ఉపేక్షించబోమన్నారు. నగరంలో ఇలాంటి చర్యల వల్ల విద్య, వ్యాపార కార్యకలాపాలకు ఇబ్బందులు కలుగుతాయని, నిబంధనలు పాటించాలని సూచించారు. -
ఆర్టీసీ సమ్మె.. నెక్ట్స్ ఏంటి?
సాక్షి, హైదరాబాద్: సమ్మెలో భాగంగా ఆర్టీసీ జేఏసీ తదుపరి ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతోంది. ఈ అంశంపై చర్చించేందుకు శనివారం అఖిలపక్ష నేతలతో భేటీ అవుతోంది. కేసు విచారణలో భాగంగా శుక్రవారం హైకోర్టులో జరిగిన వాదనల్లో సమ్మె నివారణకు ఏవైనా పరిష్కార మార్గాలు దొరుకుతాయని అంతా భావించారు. కానీ తదుపరి విచారణ ఈనెల ఏడో తేదీకి వాయిదా పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం తనంతట తానుగా సమ్మె ముగింపునకు చర్యలు తీసుకునే అవకాశం లేదని కార్మికులు భావిస్తున్నారు. ఫలితంగా తదుపరి కోర్టు విచారణ జరిగే వరకు సమ్మె కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో సిద్ధం చేసిన కార్యాచరణ పూర్తి కావటంతో కొత్త ప్రణాళిక రూపొందించాలని జేఏసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా శనివారం అఖిలపక్ష నేతలతో సమావేశమై చర్చించాలని నిర్ణయించింది. మరోవైపు శనివారం సీఎం మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఆర్టీసీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నారు. ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇచ్చి పెద్ద సంఖ్యలో రూట్లు కేటాయించే అంశం ఉంటుందని చెబుతున్నారు. అదే నిర్ణయం వెలువడితే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు నిర్ణయించారు. అలాగే మిలియన్ మార్చ్ నిర్వహించే అంశాన్ని యోచిస్తున్నామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ప్రకటించిన నేపథ్యంలో, శనివారం సమావేశంలో దీనిపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అధికారులూ అబద్ధాలు ఆపి.. సమ్మెకు రండి ఆర్టీసీలో పనిచేస్తూ సంస్థకు నష్టం జరిగేలా అధికారులు హైకోర్టుకు తప్పుడు వివరాలను అందించటం సిగ్గుచేటని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు మండిపడ్డారు. ఆర్టీసీ ఉనికే ప్రశ్నార్థకంలో పడుతున్న నేపథ్యంలో అధికారులు కూడా బయటకు వచ్చి సమ్మెలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. శుక్రవారం హైకోర్టు వెలుపల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తదితరులు విలేకరులతో మాట్లాడారు. మున్సిపల్ శాఖ నుంచి ఆర్టీసీకి నిధులు రావాల్సిన అవసరం లేదంటూ ఆర్టీసీ అధికారులు మున్సిపల్ శాఖకు అనుకూలంగా మాట్లాడ్డం విడ్డూరంగా ఉందని విమర్శించారు. అధికారులు వాస్తవాలు వదిలేసి ప్రభుత్వం చెప్పినట్టుగా కోర్టుకు వివరాలు సమర్పిస్తున్నారని దుయ్యబట్టారు. అధికారులు తప్పుడు వివరాలు ఇస్తున్నారని జడ్జి గుర్తించి అక్షింతలు వేసినా వారిలో మార్పు రాకపోవటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. -
సెల్ఫ్ డిస్మిస్ లేదు
సాక్షి, హైదరాబాద్: ‘మేము (ఆర్టీసీ కార్మికులు) కార్యాలయాలకు వెళ్తలేం కాబట్టి ఉద్యోగులం కాదన్న మాట ప్రభుత్వం నుంచి వచ్చింది. సెల్ఫ్ డిస్మిస్ అనే పదం ఎక్కడా లేదు. చెప్పినంత మాత్రాన తీసేసినట్టు కాదు. రేపు ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగినప్పుడు అన్ని అంశాలొస్తాయి. సెల్ఫ్ డిస్మిస్కు కూడా చర్చల ద్వారా పరిష్కారం దొరుకుతుంది’అని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కారం రవీందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ గురువారం సాయంత్రం ఉద్యోగుల జేఏసీ ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని తాత్కాలిక సచివాలయంలో కలసి వినతిపత్రం అందజేసింది.అనంతరం జేఏసీ నేతల తో కలసి కారం రవీందర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మిక జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 19న జరగనున్న రాష్ట్ర బంద్ లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ పాల్గొంటుం దని అన్నారు. ఆ రోజు మధ్యాహ్న భోజనం సమయంలో నిరసన తెలియజేస్తామన్నారు. నమ్మకంతో ఉన్నారు.. ‘చాలా మంది కార్మికులు రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకంతో ఉన్నరు. గతంలో 43 శాతం ఫిట్మెంట్తో ప్రభుత్వం పీఆర్సీ ఇచ్చింది. 16 శాతం ఐఆర్ ఇచ్చింది. ప్రభుత్వం తప్పనిసరిగా తమ సమస్యలను పరిష్కరిస్తుందని ఆర్టీసీ కార్మికులు నమ్మకంతో ఉన్నరు. ప్రభుత్వం ఈ నమ్మకాన్ని నిజం చేయాల్సి ఉంది’అని సీఎస్‌కు వివరించినట్లు రవీందర్‌రెడ్డి తెలిపారు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి, కండక్టర్ సురేందర్ గౌడ్లు ఆత్మహత్యకు పాల్పడగా, కొందరు ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులు గుండెపోటుతో మరణించిన విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.సమ్మెలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగాలని కోరినట్లు తెలిపారు. మానవతా దృక్పథంతో ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించాలని కోరామని ఉద్యోగుల జేఏసీ సెక్రటరీ జనరల్ మమత పేర్కొన్నారు. మాకు ఏ లోగుట్టు లేదు.. టీఎన్జీవో, టీజీవో, తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలకు ఎలాంటి లోగుట్టు లేదని రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని 8 లక్షల మంది ఉద్యోగులకు ఏ లోగుట్టు ఉందో మాకు అదే ఉందని అన్నారు. ఉద్యోగ సంఘాల నేతల బలహీనతల వల్ల ఉద్యోగుల ప్రయోజనాలు నీరుగారిపోతున్నాయని వస్తున్న విమర్శలను తోసిపుచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై 15 అంశాలతో కూడిన డిమాండ్ల పత్రాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించామన్నారు. 2018 జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ అమలు, రెండు డీఏలు రావాల్సి ఉందన్నారు. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తిరిగి రాష్ట్రానికి తీసుకురావాలని, సీపీఎస్ స్థానంలో పాత పెన్షన్ విధానం అమలు చేయాల న్న డిమాండ్లను సీఎస్ ముందు ఉంచామన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించి ప్రభుత్వ మే జీతం చెల్లించాలని డిమాండ్ చేశామన్నారు. ఈ నెల 24న హుజూర్నగర్ ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం సమస్యలను పరిష్కరించేందుకు చర్య లు తీసుకుంటామని సీఎస్ హామీ ఇచ్చారన్నారు. సాయంత్రం 4 గంటలకు బీఆర్కేఆర్ భవన్‌కు చేరుకున్న తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నేతలు సీఎస్‌ను కలిసేందుకు దాదాపు గంటకు పైగా వేచి చూడాల్సి వచ్చింది. సీఎస్ వేరే సమావేశంలో ఉండటంతో ఉద్యోగ నేతలు వేచిచూడక తప్పలేదని సచివాలయ వర్గాలు తెలిపాయి. -
ప్రభుత్వ చర్యలే సమ్మెకు వెళ్లేలా చేశాయి
-
టీడీపీలో చేరిక
నల్లగొండ : పట్టణానికి చెందిన సుమారు 50 మంది జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నల్లగొండ టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ మాదగోని శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో తెలంగాణ విద్యార్థి జేఏసీ నాయకుడు ఏరుకొండ హరి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఆకునూరి సత్యనారాయణ, కభంపాటి రాజు, రాము, జాని, అశోక్, రవీందర్‌యాదవ్, శ్రవణ్, జానయ్య గౌడ్, నరేష్, శ్రీను, హేమంత్ , రాష్ట్ర బీపీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎల్వీ యాదయ్య, మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు ఎండీ రియాజ్ అలీ, ఇంతియాజ్ అలి, కత్తుల సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన శక్తిని విచ్ఛిన్నం చేయొద్దు
సాక్షి, హైదరాబాద్: అన్నదమ్ముల్లా ఉన్న ఆదివాసీలు– లంబాడీల మధ్యలో చిచ్చుపెట్టి విభజించి–పాలించు అనే నినాదంతో కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారని లంబాడీ జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లంబాడీలపై జరుగుతున్న అసత్య ఆరోపణలు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికి చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికి సుమారు ఐదు లక్షల జనాభాతో బుధవారం సరూర్‌నగర్ స్టేడియంలో ‘లంబాడీల ఆత్మగౌరవ శంఖారావం’పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని జేఏసీ నేతలు తెలిపారు. ఈ సభకు ఇంటికి ఒకరు చొప్పున కదలి రావాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో లంబాడీ ఐక్యవేదిక సభ్యులు మాట్లాడుతూ రాజ్యాంగ పరంగా ఆర్టికల్ 342–2, 108/1976 చట్టం ప్రకారం లంబాడీలను ఎస్టీలుగా చేర్చారని తెలిపారు. కానీ కొందరు లంబాడీలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోయ– గోండు సొమ్మును దోచుకొని తిన్నట్లు డిసెంబర్ 9న జరిగిన బహిరంగ సభలో అసభ్య పదజాలంతో మాట్లాడారని, లంబాడీలు విద్య, ఉద్యోగాలు, రాజకీయంగా అభివృద్ధి చెందారని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. 70 శాతమున్నా అందని పథకాలు రాష్ట్ర గిరిజనుల్లో 25 లక్షల జనాభా (70 శాతం) ఉన్న లంబాడీలకు ఒక ఎంపీ, 6.5 లక్షలు ఉన్న ఆదివాసీ తెగలకు ఒక ఎంపీ ఉన్నారన్నారు. 12 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు ఆదివాసీలు, ఏడుగురు లంబాడీలు ఉన్నారని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధుల్లో 75 శాతం ఐటీడీఏలకు కేటాయిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రకటిస్తున్న అనేక పథకాలు లంబాడీలకు అందడం లేదన్నారు. లంబాడీలకు 10 శాతం రిజర్వేషన్లు, బ్యాక్లాగ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రిటైర్డ్ అదనపు డీజీపీ డీటీ నాయక్, మాజీ మంత్రి టిలావత్ అమర్‌సింగ్, మాజీ మంత్రి జగన్ నాయక్, ఆలిండియా బంజారా సేవా సంఘం రాçష్ట్ర అధ్యక్షుడు కిషన్‌సింగ్, లంబాడీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బెల్లయ్యనాయక్, తెలంగాణ గిరిజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గుగులోతు శంకర్‌నాయక్ ఐక్యవేదిక నాయకుడు హనుమంత్ నాయక్ పాల్గొన్నారు. -
ప్రభుత్వంపై జేఏసీ మరో లడాయి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంపై పలుమార్లు న్యాయపోరాటానికి దిగిన తెలంగాణ జేఏసీ మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యవహారశైలి, పోలీసుల నిర్బంధంపై కోర్టుకు ఫిర్యాదు చేయాలని భావిస్తోంది. కొలువుల కొట్లాటకు హాజరయ్యేవారిని అడ్డుకోవద్దని చెప్పినా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జేఏసీ నేతలను నిర్బంధించి, అరెస్టు చేసి కోర్టు ఆదేశాలను కూడా పోలీసులు, ప్రభుత్వం ఉల్లంఘించాయని జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన పోలీసులపై, ప్రభుత్వంపై హైకోర్టుకు ఫిర్యాదు చేయాలని జేఏసీ నేతలు యోచిస్తున్నారు. కొలువుల కొట్లాట సభకు అనుమతి ఇవ్వాలని పలుమార్లు కోరినా అనుమతి ఇవ్వకపోవడంతో జేఏసీ హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో ఈనెల 4న సభను నిర్వహించుకోవడానికి పోలీసులు అనుమతించారు. ఈ సభను జేఏసీ విజయవంతంగా పూర్తిచేసింది. అయితే జిల్లాల్లోనూ, రాజధానిలోనూ జేఏసీ నేతలను సభకు హాజరుకాకుండా నిర్బంధించారని జేఏసీ నేతలు అంటున్నారు. తెలంగాణవ్యాప్తంగా ఏయే ప్రాంతాల్లో జేఏసీ నేతలను నిర్బంధించారు, ఎక్కడెక్కడ వాహనాలను అడ్డుకున్నారనే వివరాలను ఆధారాలతో సహా సేకరిస్తోంది. ఒకటిరెండు రోజుల్లో పూర్తి వివరాలను సేకరించి, హైకోర్టులో ఫిర్యాదు చేయడానికి జేఏసీ ఏర్పాట్లు చేసుకుంటున్నది. -
రిజర్వేషన్లు అమలు చేయాలి
నల్లగొండ టౌన్ : జనాభా ప్రకారం మాదిగలు, ము స్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు అమలు చే యాలని మాదిగ,ముస్లిం జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక అంబేద్కర్ భవన్లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన లేని కారణంగా చాలా వెనుకబాటులకు గురవుతున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. ముస్లింలకు 12 శా తం రిజర్వేషన్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాదిగ, ముస్లింలకు అన్ని ప్రాంతాల్లో నామినేటెడ్ పదువులు కల్పించాలన్నారు. మాదిగలు, ముస్లిలు రిజర్వేషన్లను సాధించుకోవడానికి ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మాదిగ యూత్ జేఏసీరాష్ట్ర అధ్యక్షుడు పెరిక కరంజయ్‌రాజ్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సయ్యద్ ఎహసానొద్దీన్, అనీష్, ఖలీం బాయ్, హఫీజ్‌ఖాన్, సలీం,మైళాన అ బ్బర్, హాషం, ఎంఎ నాజీర్, కత్తుల నర్సింహ్మ, పెరిక ఉమామహేశ్వర్, దున్నయాదగిరి, కొంపెల్లి భిక్షపతి, పెరి కరాజు, తలారి పరమేష్, మేడి రాజు, బొజ్జ నర్సింహ్మ, మహ్మద్‌షరీఫ్, షమీ, ఆసిస్, రిజ్వాన్, కొండల్, మేడి నర్సిం హ్మ, హరికృష్ణ, చింత జయసేన, కత్తుల తులసీదాస్, అంబేద్కర్ పాల్గొన్నారు. -
ఆశించిన స్థాయిలో పాలన లేదు
జేఏసీ చైర్మన్ కోదండరాం వీణవంక: ఉద్యమ కాలంలో ప్రజలు ఆశించిన స్థాయిలో ప్రభుత్వ పాలన కొనసాగడంలేదని రాష్ట్ర జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘తెలంగాణ వస్తే నౌకరీ వస్తదని ప్రజలు ఆశపడ్డరు... కానీ ఆ పరిస్థితి కనిపించడంలేద’న్నారు. తెలంగాణకు సింగరేణి గుండెకాయలాంటిదని ఈ ప్రాంత ప్రజలకు ఎంతో దోహదపడుతుందన్నారు. అలాంటి సింగరేణిని విధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రా పాలకుల లాగే మన పాలకులు కూడా కేవలం హైదరాబాద్ అభివృద్ధి మీదనే దృష్టి పెట్టారని ఆరోపించారు. మరీ మిగితా జిల్లాల అభివృద్ధి విస్మరించడం మంచిది కాదని తెలిపారు. కొత్తగా ఏర్పడ్డ జిల్లాలను విస్మరించకుండ అభివృద్ధి చేయాలని సూచించారు. కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా చేయాలని కోరారు. ఏటా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని, అదేవిధంగా వ్యవసాయం, పాడి పరిశ్రమను ప్రోత్సహించాలని అన్నారు. రానున్న రోజుల్లో జేఏసీని విస్తరిస్తామని జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆయన వెంట రాష్ట్ర జేఏసీ నాయకులు వెంకట్‌రెడ్డి, పిట్టల రవీందర్, ప్రహ్లాద్ తదితరులు ఉన్నారు. -
సత్తుపల్లి పట్టణంలో ఉద్రిక్తత
సత్తుపల్లి: ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిని జిల్లా కేంద్రం చేయాలంటూ పట్టణంలో నేటి నుంచి చేపడుతున్న 48 గంటల బంద్ ఉద్రిక్తంగా మారింది. బుధవారం తెల్లవారుజామునే ఆర్టీసీ డిపో ఎదుట జేఏసీ నాయకులు బైఠాయించడంతో.. డిపో నుంచి బస్సులు బయటకు రాలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో జేఏసీ నాయకులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రస్తుతం డిపో ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న నాయకులు
గంభీర్రావుపేట : కరీంనగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. గంభీర్రావుపేట మండలం మల్లుపల్లె వద్ద ఆదివారం సాయంత్రం సిరిసిల్ల సాధన సమితి ఆధ్వర్యంలో నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సిరిసిల్లను జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జి చేశారు. ఆగ్రహించిన ఆందోళనకారులు పోలీసు వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు ఆందోళనకారులను రహదారిపై తొలగించి మంత్రి కాన్వాయ్‌ను పంపించారు. -
సిరిసిల్లలో జేఏసీ నాయకుల అరెస్ట్
సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లా సాధన జేఏసీ నాయకులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సిరిసిల్ల 48 గంటల బంద్‌లో భాగంగా ఆర్టీసీ బస్సు అద్దాలు, పెట్రోల్ బంక్‌ను ధ్వంసం చేసిన ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు టౌన్ సీఐ జి.విజయ్‌కుమార్ తెలిపారు. వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చొక్కాల రాము(36), బీజేవైఎం నాయకుడు అన్నల్దాస్ వేణు(26), బీఎస్పీ నాయకుడు లింగంపల్లి మధూకర్(24)ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ చెప్పారు. మరికొందరు పరారీలో ఉన్నారన్నారు. -
కాపు నేతల భేటీకి దాసరి, చిరంజీవి
శ్రీకాకుళం : ఈనెల 11న రాజమహేంద్రవరంలో రాష్ట్రస్థాయి కాపు నేతలు సమావేశమవుతారని జేఏసీ నేతలు తెలిపారు. శ్రీకాకుళంలోని వైఎస్సార్ కళ్యాణమండపంలో రాష్ట్ర కాపు జేఏసీ సమావేశం మంగళవారం జరిగింది. జేఏసీ ప్రతినిధి ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ 11న జరిగే భేటీకి కాపు ప్రముఖ నేతలు దాసరి నారాయణరావు, చిరంజీవి, పలువురు ఐఏఎస్ అధికారులు హాజరవుతారని తెలిపారు. కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులస్తులను బీసీల్లో చేర్చాలని కోరుతూ 70 ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ కులాలన్నీ బీసీలుగా పరిగణిస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం ఓసీలుగా గుర్తించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కులాలను బీసీల్లో చేర్పించేందుకు గత కొన్నేళ్లుగా మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం ఉద్యమిస్తున్నారన్నారు. ఆయన దీక్షను విరమింపచేసేందుకు ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చిందని, ఆ హామీల కోసం గడువు కూడా కోరిందన్నారు. ఆగస్ట్ నెలతో గడువు ముగిసినా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుకు కృషి చేయకపోవడం దారుణమన్నారు. -
ముద్రగడను కలిసిన కాపు జేఏసీ నాయకులు
విజయవాడ(గుణదల) : కాపుల అభ్యున్నతికి దీక్ష చేపట్టిన కాపు ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభంను రాధారంగా మిత్ర మండలి, విజయవాడ కాపు జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు బుధవారం కిర్లంపూడిలోని ఆయన ఇంటిలో కలిశారు. నగరం నుంచి సుమారు 200 మంది కాపు నాయకులు అక్కడికి వెళ్లి ఆయన ఉద్యమానికి మద్దతు పలికారు. కాపు రిజర్వేషన్ పొందే వరకు పోరాటం సాగాలని, దీనికి పూర్తిస్థాయిలో తమ మద్దతు ఉంటుందని ముడ్రగడకు హామీ ఇచ్చారు. ముద్రగడను కలిసిన వారిలో కాపు జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ కొప్పుల వెంకట్, రాధారంగా మిత్రమండలి రాష్ర్ట అధ్యక్షుడు చె న్నుపాటి శ్రీనివాస్, కాపు నాయకులు మల్లెమూడి పిచ్చయ్యనాయుడు, అడపా నాగేంద్ర, నరహరిశెట్టి నరసింహారావు, ఆళ్ల చెల్లారావు, చింతల ఆనంద్, రవి కుమార్, విక్రం, నాగు, రాజనాల బాబ్జి, అల్లంపూర్ణ, రామాయణపు శ్రీనివాస్, తిరుమలశెట్టి ఉదయ్, అక్కల గాంధీ, బాడిత శంకర్, ఎన్ గాంధీ, ఎన్ సాంబశివరావు, అడ్వకేట్ ఏడుకొండలు, ఎస్టీ నాయకులు మేడ రమేష్, బీసీ నాయకులు బోను చిన్న శ్రీరాములు, బ్రాహ్మణ సంఘం నాయకులు అరుణ్‌కుమార్, ఎం.వివేక్ తదితరులు ఉన్నారు. -
టీడీపీ నేతలు క్షమాపణ చెప్పాలి
తెలంగాణ ఇంజనీర్ల జేఏసీ సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ, మిష న్ భగీరథ పథకాల్లో ఇంజనీర్లు కమీషన్లు తీసుకుంటున్నారని మహానాడులో తెలుగుదేశం పార్టీ నేతలు వ్యాఖ్యానించడంపై తెలంగాణ ఇంజనీర్స్ జేఏసీ నేతలు మండిపడ్డారు. నిరాధార ఆరోపణలు చేసిన టీడీపీ నేతలు ఇంజనీర్లకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శనివా రం సచివాలయంలో మీడియా పాయింట్ వద్ద జేఏసీ నేతలు మాట్లాడారు. ప్రజలకు లబ్ధి కలిగించే ఎంతో ప్రతిష్టాత్మకమైన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను విజయవంతం చేయడానికి ఇంజనీర్లు ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. -
రోహిత్ ఘటనపై 20న చలో ఢిల్లీ
♦ 8 నుంచి తెలుగు రాష్ట్రాల్లో బస్సు యాత్ర ♦ ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన జేఏసీ నాయకులు హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల మృతి ఘటనపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 20న చలో ఢిల్లీ కార్యక్రమానికి విద్యార్థి జేఏసీ పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. హెచ్‌సీయూలోని బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించిన జేఏసీ నాయకులు ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ వెంకటేష్ చౌహాన్ మాట్లాడుతూ రోహిత్ ఘటనకు కారుకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేస్తున్నా.. కేంద్రం స్పందించకపోవడం ఆవేదన కలిగించిందన్నారు. కేంద్రమంత్రులు దత్తాత్రేయ, స్మృతీఇరానీ, వీసీ అప్పారావులపై చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ చలో ఢిల్లీకి పూనుకున్నామన్నారు. ఢిల్లీలో అన్ని వర్సిటీల విద్యార్థులతో నాలుగు రోజులు ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ నెల 8 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వర్సిటీల్లో బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 5న ప్రత్యేక సమావేశం, 6న హెచ్‌సీయూలో రౌండ్ టేబుల్ సమావేశం, పబ్లిక్ మీటింగ్ ఉంటుందని చెప్పారు. ముఖ్య వక్తలుగా ఆలిండియా ఫోరం ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ సభ్యులు ప్రొఫెసర్ అనిల్ సద్గోపాల్, రమేష్ పట్నాయక్, తెలంగాణ సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ ప్రతినిధులు ప్రొఫెసర్ జగేంద్రబాబు, చక్రధర్రావులతో పాటు పలువురు ప్రసంగిస్తారని చెప్పారు. రిలే నిరాహారదీక్షలు నిరంతరాయంగా కొనసాగుతాయని వెల్లడించారు. కొనసాగుతున్న రిలే దీక్షలు.. రోహిత్ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హెచ్‌సీయూలో విద్యార్థుల రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. దీక్షల్లో విద్యార్థులు ప్రకాష్, సందీప్ కాంబ్లే, రాహుల్, తుషార్ గాడ్గే, యోగేష్ పాల్గొన్నారు. పరిపాలనకు, తరగతులకు అంతరాయం కలగకుండా సాయంత్రం వేళల్లో జేఏసీ ప్రతినిధులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. -
విద్యార్థులను చితకబాదిన బీజేపీ నేతలు
-
సమరానికి సై...
సాక్షి, హైదరాబాద్: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. తమ సమస్యలపై గత కొంతకాలంగా ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడంతో జూలై 1 నుంచి సమ్మె చేస్తామంటూ పలు కార్మిక సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. ఇందుకు సంబంధించి ఈ నెల 16నే సమ్మె నోటీసు సైతం ఇచ్చాయి. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన కరువైన నేపథ్యంలో.. సోమవారం మున్సిపల్ కార్యాలయాల ఎదుట ధర్నాలు, నిరసనలు చేపట్టేందుకు మున్సిపల్ ఉద్యోగ, కార్మిక ఐక్య కార్యాచరణ కమిటీ(జేఏసీ) పిలుపు ఇచ్చింది. ఈ మేరకు సోమవారం మొత్తం 111 మున్సిపాలిటీల్లో నిరసనలు తెలిపేందుకు కార్మిక సంఘాలు సమాయత్తమయ్యాయి. తాము జూన్ 16నే సమ్మె నోటీసిచ్చినా ప్రభుత్వం తాత్సారంపై అవి తీవ్రంగా మండిపడ్డాయి. దీంతో ప్రభుత్వం స్పందించింది. కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానించింది. ఈ మేరకు పురపాలక మంత్రి పి.నారాయణ ఆధ్వర్యంలో సోమవారం సచివాలయంలో చర్చలు జరగనున్నాయి. అయితే ఈ చర్చల్లో తమ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించకుంటే ముందు ప్రకటించినట్టుగా జూలై 1 నుంచి సమ్మెకు దిగుతామని కార్మికసంఘాలు స్పష్టం చేశాయి. ప్రధాన డిమాండ్లివే... : మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులకు 10వ వేతన సవరణ కమిటీ సిఫార్సులు వర్తింపచేయాలి ఈ సవరణ ప్రకారం కనీసం వేతనం రూ.15,432 ఇవ్వాలి. ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్డ్, సెమీ స్కిల్డ్ జీతాలివ్వాలి. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదు.. మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి సోమవారం నాటి చర్చల్లో ప్రభుత్వం అంగీకరించకపోతే ముందు ప్రకటించినట్టుగా జూలై 1 నుంచి సమ్మె చేస్తాం. సమస్యలు పరిష్కారమయ్యే వరకూ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం. మా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకరిస్తుందని ఆశిస్తున్నాం. -కె.ఉమామహేశ్వరరావు, జేఏసీ నాయకులు(సీఐటీయూ) -
కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె
-
కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె
► డిపోల్లో ధర్నాలు, వంటా వార్పు ► రొడ్డెక్కిన 421 బస్సులు ► ప్రమాదం అంచున ప్రయాణం ► పట్టించుకోని జిల్లా యంత్రాంగం నెల్లూరు (రవాణా) : ప్రభుత్వ ఉద్యోగులతో పాటు తమకు 43 శాతం ఫిట్మెంట్ పెంచాలంటూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆదివారానికి ఐదో రోజుకు చేరుకుంది. జిల్లాలోని పలు డిపోల్లో ధర్నాలు, రాస్తారోకోలు, వంటా వార్పు నిర్వహించారు. నెల్లూరు ఆర్టీసీ బస్‌స్డాండ్ సెంటర్లో యూనియన్లు జేఏసీ ఆధ్వర్యంలో గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. ఇరువైపులా వాహనాలు కిలోమీటరు పొడవునా నిలిచిపోయాయి. అనంతరం వంటావార్పు నిర్వహించారు. సమ్మె కారణంగా ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. జిల్లాలో ఆయా డిపోల నుంచి 421 బస్సులు రోడ్డెక్కాయి. పొలీసు పహారాతో డిపోల నుంచి బస్సులను తీసి ఆయా రూట్లకు ఆర్టీసీ అధికారులు పంపించారు. అయితే బస్సులకు తాత్కాలిక డ్రైవర్లు కావడంతో ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం సాగించారు. ప్రయాణికుల ఆందోళన ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు సమ్మెలో ఉండటంతో అధికారులు తాత్కాలిక డ్రైవర్లతో బస్సులను తిప్పుతున్నారు. వీరికి రూట్లపై అవగాహన లేదు. స్పీడు బ్రేకర్లు, గుంతలు ఉన్న ప్రాంతాల్లో వేగాన్ని తగ్గించకపోవడంతో బస్సులు కుదుపులకు గురవుతున్నాయి. ప్రయాణికలు భయాందోళన చెందుతున్నారు. శనివారం రెండు బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. పామూరు నుంచి నెల్లూరు వస్తున్న రెండో డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సంగం - కలిగిరి మధ్య ఆటోను ఢీకొంది. ఆటోలో ఉన్న ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో బస్సు డ్రైవర్ సెల్‌ఫోన్ మాట్లాడుతున్నాడని ప్రయాణికులు చెబుతున్నారు. అదేవిధంగా బుచ్చిరెడ్డిపాళెం దామరమడుగు వద్ద రాత్రి సమయంలో కడప నుంచి నెల్లూరు వస్తున్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. తాత్కాలిక డ్రైవర్ల పనితీరుపై అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. కేవలం అధికారులు డిపోలకే పరిమితమవుతున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలంటేనే ప్రయాణికులు హడలెత్తి పోతున్నారు. అధిక చార్జీలతో జేబులు గుల్ల తాత్కాలిక డ్రైవర్లు కావడంతో అధికారులు ఆర్టీసీ బస్సులను కేవలం జిల్లా పరిధిలోనే తిప్పుతున్నారు. దూర ప్రాంతాలకు బస్సులను పంపించకపోవడంతో ప్రైవేటు వాహన యజమానులు ప్రయాణికుల జేబులను గుల్ల చేస్తున్నారు. సాధారణ చార్జీకంటే రెండు రెట్లు అధికంగా పెంచి వసూలు చేస్తున్నారు. ఆదివారం కావడంతో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్టణం తదితర ప్రాంతాలకు చార్జీలను అమాంతంగా పెంచేశారు. బెంగళూరు, హైదరాబాద్‌కు ఏసీ బస్సులో రూ.800 టికెట్‌ను రూ.2400కు, ఆర్డినరీ బస్సులో రూ.500 టికెట్‌ను రూ.1300కు పెంచారు. ఈ రీతిలో ప్రయాణికుల అవసరాలను ఆసరాగా తీసుకుని ప్రయాణికుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. అధిక చార్జీలను నియంత్రించాల్సిన ఆర్టీసీ, రవాణా, పోలీసు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఆదివారం జిల్లాలోని ఆయా డిపోల నుంచి మొత్తం 421 బస్సులు తిరిగినట్లు అధికారులు చెబుతున్నారు. వాటిలో 313 ఆర్టీసీ, 108 అద్దె బస్సులు ఉన్నాయి. ఈ బస్సులకు తాత్కాలికంగా 421 మంది డ్రైవర్లు, 108 కండక్టర్లును తీసుకున్నారు. అయితే తాత్కాలిక కండక్టర్లు టెకెట్ కొట్టడం లేదు. సాధారణ చార్జీ కంటే అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. సమ్మె కొనసాగిస్తాం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వచ్చినా, మంగళవారం ఎలాంటి తీర్పు ఇచ్చినా సమ్మెను ఆపేది లేదని ఆర్టీసీ యూనియన్లు జేఏసీ నాయకులు తెలిపారు. ఆదివారం డిపోల ముందు ధర్నా నిర్వహించారు. ఆర్టీసీలో ఈడీ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల రక్షణతో కార్మికులను అణిచి వేయాలని అధికారులు చూస్తున్నారని ఆరోపించారు. కోర్టు తీర్పు అనంతరం సమ్మెను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
తెలంగాణ ఉద్యమ వేదిక ఆవిర్భావం
- చెరుకు సుధాకర్ నేతృత్వంలో నకిరేకల్‌లో పతాకావిష్కరణ - ఏకమవుతున్న టీఆర్ఎస్ మాజీ నేతలు - రాజకీయ ప్రత్యామ్నాయంగా రూపుదిద్దుకునే యోచన సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ పునాదులే ఆశయాలుగా మరో రాజకీయ ‘వేదిక’ పురుడు పోసుకుంటోంది. టీఆర్ఎస్లో గతంలో పనిచేసి నిర్లక్ష్యానికి గురైన వారు, రాజకీయ జేఏసీలో క్రియాశీల పాత్ర పోషించిన నేతలు ఏకమయ్యేందుకు ఇది మరో వేదిక కాబోతోంది. ప్రభుత్వం వైఖరికి వ్యతిరేకంగా, రాజకీయ జేఏసీ ఉదాసీన వైఖరికి సమాంతరంగా సామాజిక వర్గాల కోణంలో ఏర్పాటు చేస్తున్న ఈ సంస్థను రాజకీయ ప్రత్యామ్నాయంగా మారుస్తామని కొత్త వేదిక రూపకర్తలు చెబుతున్నారు. రాష్ట్ర సాధన ఫలాలు క్షేత్రస్థాయికి చేరుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని వారంటున్నారు. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో మేడే సందర్భంగా టీఆర్ఎస్ మాజీ నేత డాక్టర్ చెరుకు సుధాకర్ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమ వేదిక పతాకాన్ని ఆవిష్కరించారు. సంప్రదాయానికి భిన్నంగా... సంప్రదాయ నాయకత్వానికి భిన్నంగా ముందుకెళ్లే యోచనలో వేదిక నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీలు ప్రతిపక్ష పార్టీలుగా చెపుతున్నా.. ఆ పార్టీల నేతలు అట్టడుగు వర్గాల భాగస్వామ్యం గురించి ప్రశ్నించడం లేదని, అందుకే తాము రాజకీయ ప్రత్యామ్నాయంగా ముందుకెళ్లాలని వారు భావిస్తున్నారు. చిలకపచ్చ పతాకం వేదిక పతాకాన్ని పరిశీలిస్తే.. ఇందులో అనేక ఉద్యమ, సామాజిక కోణాలు కనిపిస్తున్నారు. ముఖ్యంగా వేదికపై ఉద్యమ యోధురాలు చాకలి ఐలమ్మ, ప్రొఫెసర్ జయశంకర్‌ల చిత్రపటాలను ముద్రించారు. నీలిరంగు తెలంగాణ చిహ్నంలో ఎరుపు రంగు పిడికిలి ముద్రించారు. పతాకాన్ని చిలకపచ్చ రంగుతో తయారు చేయడం గమనార్హం. ఉద్యమ హామీల అమలుకు పోరాడాలి జేఏసీ నేతలు పిట్టల రవీందర్, గురజాల రవీందర్ రావు జనగామ : ‘తెలంగాణ సాధనకు ఎలా పోరాడామో... ఇప్పుడు సమస్యల సాధనకు అదేవిధంగా పోరాడేందుకు అందరూ ఏకమవ్వాలి. సామాజిక తెలంగాణ కోసం మరో ఉద్యమం చేయాలి.. కోదండరాం నేతృత్వంలోని జేఏసీ స్తబ్దంగా మారింది. ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిలదీతలు లేవు.. ఉద్యమ కాలం నాటి హామీలను కేసీఆర్ ప్రభుత్వం మరి చింది. మన సమస్యల సాధనకు మరో వేదిక అవసరం.. దీని విధివిధాలనాలను త్వరలోనే ప్రకటించుకుందాం.. బైరాన్‌పల్లి అమరుల స్ఫూర్తిగా.. పోరుగడ్డ జనగామ నుంచే ఉద్య మం ప్రారంభిద్దాం’అని జేఏసీ రాష్ట్ర సమన్వయకర్త పిట్టల రవీందర్, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గురజాల రవీందర్రావు అన్నారు. వరంగల్ జిల్లా జనగామలో జేఏసీ డివిజన్ కన్వీనర్ కన్నా పరుశరాములు అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం ఉద్యమకారుల సన్నాహక సమావేశం నిర్వహించారు. అతిథులుగా పిట్టల రవీందర్, గురజాల రవీందర్రావులు హాజరయ్యారు. సమావేశంలో వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాథమ్యాలను మరిచిందన్నారు. తెలంగాణ ద్రోహులను కేసీఆర్ చేరదీస్తున్నాడని అన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు కోల జనార్దన్, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా కేంద్రంగా కామారెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ కామారెడ్డిని జిల్లా కేంద్రంగా మార్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. కార్యాలయాలకు అవసరమైన స్థలాలను చూడాలని కూడా విప్ గోవర్ధన్‌కు సూచించారు. పట్టణంలోని డిగ్రీ కళాశాల ఆస్తులను స్వాధీ నం చేసుకుని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికీ అంగీకరించారు. కామారెడ్డి: కామారెడ్డివాసుల చిరకాల కోరిక తీరబోతోంది. జిల్లాల పునర్వవ్యవస్థీకరణలో భాగంగా కామారెడ్డిని జిల్లా కేంద్రంగా మారుస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని జేఏసీ నేతలు తెలిపారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఆస్తుల వ్యవహారంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో జేఏసీ, విద్యార్థి సంఘాల నేతలు శుక్రవారం రాత్రి సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారి తో మాట్లాడుతూ జిల్లాలో మరో మూడు అ సెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయని, ఆరు నియోజకవర్గా లకో జిల్లా చొప్పున రెండు జిల్లాలను చేస్తామన్నారని పేర్కొన్నారు. కామారెడ్డిలో జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ స్థలాలను అధికారులతో కలిసి చూడాలని కూడా స్థానిక ఎమ్మెల్యే గోవర్ధన్‌కు సీఎం సూచించారు.అంతకు ముం దు వారు కామారెడ్డిలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు జరిగిన పరి ణామాలను సీఎంకు వివరించారు. కాలేజీ ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించేందుకు మేనేజ్మెంట్ కమి టీ ముందుకు వస్తున్నందున వారిని ఆహ్వాని ద్దామని సీఎం పేర్కొన్నారని జేఏసీ నేతలు తెలిపారు. కాలేజీ ఆస్తులన్నింటినీ స్వాధీనం చే సుకుని, కేజీ నుంచి పీజీ విద్యాపథకాన్ని అమలు చేయడంలో భాగంగా అక్కడ ప్రభుత్వ వి ద్యా సంస్థలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. సుమారు గంటపాటు సీఎం వా రితో మాట్లాడారు. త్వరలోనే కామారెడ్డికి వ చ్చి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారన్నా రు. సీఎంను కలిసినవారిలో జేఏసీ కన్వీనర్ జి.జగన్నాథం,కొమ్ముల తిర్మల్‌రెడ్డి, డాక్టర్ వి. శంకర్, వీఎల్ నర్సింహారెడ్డి, క్యాతం సిద్ధరా ములు,వెకంట్రాంరెడ్డి, విద్యార్థి సంఘాల నేత లు బాలు, ఆజాద్, దశరథ్, రవీందర్, భాను, అరుణ్, నరేశ్, జబ్బార్ తదితరులున్నారు. -
సింగరేణిలో సమ్మె పాక్షికం
విధులకు హాజరైన 50 శాతం కార్మికులు కొత్తగూడెం/గోదావరిఖని: కేంద్ర ప్రభుత్వం బొగ్గు పరిశ్రమల్లో అవలంబిస్తున్న కార్మిక విధానాలకు వ్యతిరేకంగా ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, బీఎంఎస్ సంఘాలు చేపట్టిన ఐదు రోజుల సమ్మె సింగరేణిలో మంగళవారం ప్రారంభమైంది. తొలిరోజు సమ్మె పాక్షికంగానే జరిగింది. గుర్తింపు కార్మిక సంఘమైన టీబీజీకేఎస్ సమ్మెకు దూరంగా ఉంది. సమ్మె సందర్భంగా గనులతోపాటు డిపార్ట్మెంట్ల వద్ద పోలీసు బలగాలను మోహరింపజేశారు. సింగరేణి వ్యాప్తంగా ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని 11 ఏరియాల్లో సుమారు 50 శాతం మంది కార్మికులు విధులకు హాజరయ్యారు. కాగా, ఎక్కువ శాతం కార్మికులు ఫ్రీ షిఫ్టును ఉపయోగించుకుని విధులకు హాజరయ్యారు. ఉదయం పూట విధులకు హాజరయ్యేందుకు వచ్చేవారిని జేఏసీ నాయకులు అడ్డుకునే అవకాశం ఉండటంతో పోలీసులు వారిని తెల్లవారుజామునే అదుపులోకి తీసుకున్నారు. సింగరేణివ్యాప్తంగా మంగళవారం 50 శాతం కార్మికులు విధులకు హాజరయ్యారు. ఉత్పత్తిపై సమ్మెప్రభావం.. సమ్మెలో 22 వేల మంది కార్మికులు పాల్గొనడం వల్ల ఉత్పత్తిపై ఈ ప్రభావం పడింది. ఓపెన్‌కాస్టు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోకుండా యాజమాన్యం ముందస్తు చర్యలు తీసుకున్నప్పటికీ భూగర్భ గనుల్లో మాత్రం సమ్మె ప్రభావం కన్పించింది. -
మమ్మల్ని గుర్తించండి!
ఉద్యమంలో ముందున్నా రాని అవకాశాలు ఎన్నికలు, నామినేటెడ్‌లో దక్కని ప్రాధాన్యం అసంతృప్తిలో కాకతీయ వర్సిటీ జేఏసీ నేతలు టీఆర్ఎస్ నాయకత్వాన్ని కలిసి విజ్ఞప్తులు ‘‘తెలంగాణ పోరులో విద్యార్థి సంఘాలు ఏకమై ఉద్యమించింది కాకతీయ యూనివర్సిటీలోనే. ఉస్మానియాలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఎన్నో విద్యార్థి సంఘాలు పని చేశాయి. రాజకీయ, ఇతర అవకాశాల విషయంలో మాత్రం మాకు దక్కాల్సిన ప్రాధాన్యత కనిపించడంలేదు.. ప్రత్యక్ష ఎన్నికల్లో అవకాశం ఇవ్వలేదు.. కనీసం నామినేటెడ్ పోస్టుల్లోన్నైనా అవకాశం కల్పించాలని’’ కేయూ జేఏసీ నేతలు పేర్కొంటున్నారు.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కాకతీయ విశ్వవిద్యాలయం(కేయూ) విద్యార్థులు ప్రముఖపాత్ర పోషించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిరాహార దీక్షతో మలుపుతిరిగిన ఉద్యమంతోపాటు అన్ని పోరాటాల్లో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ర్టంలో తమ పాత్ర ఏమిటనేది కేయూ జేఏసీ నేతల్లో మొదలైంది. టీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం టీఆర్ఎస్వీ ముఖ్య నేతల్లో మరీ అధికంగా కనిపిస్తోంది. ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఉస్మానియా విద్యార్థి నాయకులకు అవకాశం ఇవ్వడం బాగానే ఉన్నా.. కేయూ వారికి రాజకీయ అవకాశాలు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉద్య మం, ఉప ఎన్నికలు, రాజకీయ కార్యక్రమాలకు తప్ప తమకు అవకాశాల విషయంలో ప్రాధాన్యత దక్కడంలేదని వీరు అభిప్రాయపడుతున్నారు. అవకాశం ఇవ్వాలి.. కేయూ జేఏసీ అభిప్రాయం ప్రకారమే టీఆర్ఎస్ పార్టీ సాధారణ ఎన్నికల్లో కేయూ విద్యార్థులకు అవకాశం కల్పించలేదు. ఇదే సమయంలో ఉస్మానియా విద్యార్థి నేతల్లో ముగ్గురికి పోటీ చేసే అవకాశం కల్పించింది. మాకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల్లోనైనా అవకాశం కల్పిస్తే ఇక్కడి విద్యార్థుల పోరాటాన్ని గుర్తించినట్లుగా ఉంటుంది. ఉద్యమంలో కీలకంగా ఉన్న వారికి అవకాశం కల్పిస్తేనే.. ఉద్యమాల్లో, టీఆర్ఎస్లో కొత్త తరం వస్తుంది’ అని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై నమ్మకం పెట్టుకున్నట్లు చెబుతున్నారు. ఉద్యమంలో ముందున్న వారిలో ఒక్కొక్కరికీ అవకాశం వస్తోందని.. తమ వంతు వస్తుందని ఆశిస్తున్నారు. ‘హైదరాబాద్ కేంద్రంగా జరిగిన ఉద్యమంలో ఉస్మానియా విద్యార్థులు ముందున్నారు. ఉద్యమంలో పాత్ర ఉన్న ప్రతి ఒక్క వర్గాన్ని కేసీఆర్ గుర్తుపెట్టుకుని ప్రాధాన్యత ఇస్తున్నారు. కేయూ నుంచి ప్రొఫెసర్లకు అవకాశం కల్పించడంతో సీతారాంనాయక్ ఎంపీగా గెలిచారు. రాజకీయ జేఏసీ జిల్లా చైర్మన్ వ్యవహరించిన ప్రొఫెసర్ టి.పాపిరెడ్డికి కీలకమకైన ఉన్నత విద్యామండలి చైర్మన్ పదవి ఇచ్చారు. ఇలా అవకాశం ఇస్తారని పేర్కొంటున్నారు. కేయూ విద్యార్థుల పాత్ర కీలకం తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన కేసీఆర్ నిరహారదీక్ష కార్యక్రమానికి ఊపు తెచ్చింది కాకతీయ విశ్వవిద్యాలయంలోనే. 2009 నవంబరు 29న కేసీఆర్ నిరహార దీక్ష చేస్తున్నట్లు ప్రకటించి అంతముందు కొన్ని వారాలపాటు సన్నాహాక కార్యక్రమాలు నిర్వహించారు. అదే ఏడాది నవంబరు 23న కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు ఐక్యంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమాన్ని ఒక్కటిగా ముందుకు నడిపించేందుకు కేయూ విద్యార్థులంతా ఏకమై 2009 నవంబరు 17న జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమంలో జేఏసీ అవిర్భావం అనేది ఇక్కడే మొదలైందని విద్యార్థి నేతలు చెబుతున్నారు. ఇలా మొదలైన విద్యార్థుల ఉద్యమం.. కేసీఆర్ నిరహార దీక్ష భగ్నంతో ఊపందుకుంది. కేసీఆర్‌ను కరీంనగర్ జిల్లాలోని అల్గునూరు వద్ద అరెస్టు చేసి ఖమ్మం తీసుకువెళ్లే క్రమంలో కేయూ వద్ద విద్యార్థులు చేసిన పోరాటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు ఉద్యమంలోకి వచ్చేందుకు దోహదపడిందని జేఏసీ నేతలు చెబుతుంటారు. ఆ తర్వాత నిర్వహించిన పొలికేక బహిరంగ సభ, జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఉద్యమాల్లో కేయూ విద్యార్థులు ముందున్నారు. ఉద్యమంలో కీలకంగా ఉన్న తమకు ఇప్పుడు కొత్త రాష్ట్రంలో అవకాశాం ఇవ్వాలని కోరుకుంటున్నారు. కేయూ విద్యార్థి నేతలు ఇటీవలే హైదరాబాద్‌కు వెళ్లి టీఆర్ఎస్ కీలక నేతలు టి.హరీశ్‌రావు, కేటీఆర్, ఈటెల, జగదీశ్వర్‌రెడ్డిలకు, ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్యకు తమ కోరికలను విన్నవించారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం వీరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. -
15 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి...
- కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగుల స్పష్టీకరణ - అధికారులకు సమ్మె నోటీసులు అందజేసిన జేఏసీ నాయకులు విజయనగరం మున్సిపాలిటీ: డిమాండ్ల సాధన కోసం కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న సమ్మెలో భాగంగా జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు విజయనగరం జిల్లాలో ఈ నెల 15 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లనున్నారు. ఈ మేరకు జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ బి.గోవిందరావు, కన్వీనర్ జి.సురేష్, రాష్ట్ర కమిటీ సభ్యుడు రామకృష్ణలు కలెక్టర్‌తో పాటు ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ సి.శ్రీనివాసమూర్తికి, విజయనగరం డీఈ ప్రసాద్‌లకు సమ్మె నోటీసులు అందించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ గోవిందరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థల్లో సుమారు 15వేల మంది వరకు కాంట్రాక్ట్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తుండగా.. జిల్లాలో వెయ్యి మంది ఉద్యోగులు ఇదే జీవనాధారంగా పని చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్నా ప్రభుత్వాలు తమ ఇబ్బందులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థలో రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వినియోగదారులకు నిరంతర సేవలందించటంలో కీలక పాత్ర పోషిస్తున్న తమపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించటం సమంజసం కాదన్నారు. కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, దశల వారీగా క్రమబద్ధీకరణ చేయాలన్న డిమాండ్లతో సమ్మెలోకి వెళుతున్నట్లు ప్రకటించారు. ఈ విషయంపై రెగ్యులర్ విద్యుత్ ఉద్యోగుల సంఘాలకు విన్నవించటం జరిగిందని, వారు కూడా మద్దతిచ్చేందుకు హమీ ఇచ్చినట్లు చెప్పారు. ప్రభుత్వం, యాజమాన్యాలు స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించకపోతే 15 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళతామని స్పష్టం చేశారు. -
ఆ నివేదికను రద్దు చేయాల్సిందే
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఆస్తులు, అప్పుల పంపకంపై షీలాబేడీ కమిటీ ఆదేశంతో ఓ ప్రైవేటు చార్టర్డ్ అకౌంట్స్ సంస్థ రూపొందించిన నివేదికపై ఆర్టీసీ తెలంగాణ అధికారులు, కార్మిక సంఘాల జేఏసీ నేతలు మండిపడ్డారు. నివేదికను రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టడంతో శుక్రవారం జరగాల్సిన ఆర్టీసీ పాలకమండలి సమావేశం రద్దయింది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్‌భవన్, తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రి, మియాపూర్‌లోని బస్‌బాడీ వర్క్‌షాపుల విలువను మూల్యాంకనం చేసిన ప్రైవేటు కన్సల్టెన్సీ ఇటీవలే ఆర్టీసీకి నివేదిక అందజేసింది. దానికి అధికార ముద్ర వేసేందుకు శుక్రవారం పాలక మండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీలో నివేదిక ఆమోదింపజేసి షీలాబేడీ కమిటీకి అందజేయాల్సి ఉంది. ఇన్ని రోజులు నివేదికను రహస్యంగా ఉంచిన అధికారులు సమావేశం నేపథ్యంలో గురువారం రాత్రి ఆర్టీసీ బోర్డు సభ్యులకు అందజేశారు. అందులోని వివరాలు చూసిన జేఏసీ అగ్గిమీద గుగ్గిలమైంది. గత మేలో ఆర్టీసీ ఈడీల కమిటీ చేసిన మూల్యాంకనం వివరాలకు ఈ నివేదికలో అంశాలు భిన్నంగా ఉండడం, రూ.1,093 కోట్ల తెలంగాణ ఆర్టీసీ నష్టాలను రూ.1,700 కోట్లుగా చూపడం, నగరంలోని మూడు స్థిరాస్తుల భూముల విలువను కూడా లెక్కించి 58:42 నిష్పత్తి లెక్కన రెండు రాష్ట్రాలకు పంచాలని సూచించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇవి తెలంగాణ ఆర్టీసీకి తీవ్ర నష్టం కలిగిస్తాయన్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు పాలక మండలి సమావేశం ప్రారంభం కావాల్సి ఉండగా అంతకు గంటకు ముందే జేఏసీ నేతలు బస్‌భవన్‌కు చేరుకున్నారు. ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రారావు రాగానే ఆయనకు ఒక వినతి పత్రం అందజేశారు. ప్రైవేటు కన్సల్టెన్సీ నివేదిక కుట్రపూరితంగా తయారైనందున దాన్ని ఎట్టి పరిస్థితిలో ఆమోదించొద్దని, లేకుంటే ఉద్యమిస్తామని ఆయనకు స్పష్టం చేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న బోర్డు సభ్యులు చంద్రవదన్, శివశంకర్‌లకు కూడా ఆ వినతి పత్రాలను అందజేశారు. దీంతో తమకు కొంత సమయం కావాలని ఆర్టీసీ ఎండీ చెప్పారు. అనంతరం మిగతా అధికారులతో తన చాంబర్లో చర్చించారు. ఈ సమయంలో ఆర్టీసీ తెలంగాణ అధికారుల సంఘం అధ్యక్షుడు సురేందర్, టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి, తెలంగాణ ఈయూ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డిలతో పాటు సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ప్రైవేటు కన్సల్టెన్సీ నివేదికను రద్దు చేయాలని, దాన్ని ఆమోదింపచేసేందుకు యత్నించిన ఆర్టీసీ ఫైనాన్షియల్ అడ్వయిజర్‌ను సస్పెండ్ చేయాలంటూ జేఏసీ నేతలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. గంట తర్వాత జేఏసీ నేతలను పిలిచిన ఆర్టీసీ ఎండీ.. ఉన్నది ఉన్నట్లుగా నివేదికను ఆమోదించడం లేదన్నారు. జేఏసీ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే బోర్డు ముందు ఉంచుతామని, అందుకోసం ప్రస్తుత బోర్డు సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర విభజన చట్టంలో సూచించినట్లుగా మాత్రమే నివేదిక తయారు చేయాలని, ఇందుకు మరో సంస్థతో నివేదిక రూపొందించాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. త్వరలో ప్రైవేటు సంస్థ నివేదిక లోపాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తామని వెల్లడించారు. మరో పక్షం రోజుల్లో పాలక మండలి సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. -
‘సీమ’లో రాజధాని ఏర్పాటు చేయాలి
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రజా సంఘాల జేఏసీ నాయకులు సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జేఏసీ నాయకులు అవ్వారు మల్లికార్జున,సంగటి మనోహర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ 1953లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద మనుషుల ఒప్పందం మేరకు కర్నూలులో రాజధానిని, గుంటూరులో హైకోర్టును ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. 1956లో తెలంగాణ ప్రాంతాన్ని కూడా విలీనం చేసుకుని ఆంధ్రప్రదేశ్‌గా ఆవిర్భవించినప్పుడు రాయలసీమలో ఉన్న రాజధానిని హైదరాబాదుకు తరలించారన్నారు. ఆ విధంగా రాయలసీమ వాసులకు అన్యాయం జరిగిందని తెలిపారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన పరిస్థితుల్లో గతంలో లాగానే రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కానీ, అలా కాకుండా కృష్ణా,గుంటూరు జిల్లాల మధ్య రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు సంకేతాలు ఇవ్వడం సరికాదన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో భాగమైన రాయలసీమ వాసులతో కనీసం చర్చించకుండానే కోస్తా నాయకులు రాజధాని విషయంలో ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కూడా రాయలసీమలో పర్యటించపోవడం దారుణమని విమర్శించారు. వెనుకబడిన ‘సీమ’లోనే రాజధాని ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు గంపా తిరుపతి, జేవీ రమణ, బండి ప్రసాద్, ఈ.బాలవీరప్ప, బి.దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యం ఖూనీ
కడప రూరల్, న్యూస్‌లైన్ : భారతదేశ వ్యవస్థకు దిశ, దశలు నిర్దేశించే సాక్షాత్తు పార్లమెంటు నిండు సభలో సీమాంధ్ర ఎంపీలపై దాడి జరగడం దారుణమని సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు ధ్వజమెత్తారు. సీమాంధ్ర ఎంపీలను ఒంటరిగా చేసి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఎంపీలు దౌర్జన్యానికి పాల్పడటం దారుణమన్నారు. ఆ మేరకు ఎంపీలను సస్పెండ్ చేసినందుకు నిరసనగా గురువారం స్థానిక నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా సమైక్యాంధ్ర జేఏసీ జిల్లా కన్వీనర్ సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డి మాట్లాడుతూ గురువారం పార్లమెంటులో కాంగ్రెస్, యూపీఏ, తెలంగాణకు చెందిన ఎంపీలు గుండాల్లా ప్రవర్తించి సీమాంధ్ర ఎంపీలపై దాడులకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. ఈ సంఘటనతో ఈరోజు ప్రజాస్వామ్యం ఖూనీ అయినరోజని, పార్లమెంటు చరిత్రలో బ్లాక్‌డేగా అభివర్ణించారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ బిల్లుకు సంబంధించి సందేహాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ అవేవి పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే స్పీకర్ స్పందించి ఎంపీలపై సస్పెండ్‌ను ఎత్తివేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. మెడికల్, పారా మెడికల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వారణాసి ప్రతాప్‌రెడ్డి, విద్యార్థి జేఏసీ జిల్లా కన్వీనర్ రవిశంకర్‌రెడ్డిలు మాట్లాడుతూ కాంగ్రెస్ చెప్పిందే శాసనం కాదన్నారు. పార్లమెంటులో సీమాంధ్రుల ఎంపీల పట్ల వ్యవహారించిన తీరు దారుణంగా ఉందన్నారు. జగ్జీవన్‌రామ్ కుమార్తె అయిన స్పీకర్ మీరాకుమార్ ఎంపీలపై సస్పెన్షన్‌ను ఎత్తి వేయాలన్నారు. బాధ్యత గల స్పీకర్, సోనియాగాంధీకి కీలుబొమ్మగా మారడం దారుణమన్నారు. ప్రధాని మన్మోహన్సింగ్, స్పీకర్ మీరాకుమార్, సోనియాగాంధీకి వ్యతిరేకంగా చేసిన నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఈ కార్యక్రమంలో నాగార్జునమహిళా డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ బెరైడ్డి రామకృష్ణారెడ్డి, చిన్న సుబ్బయ్య యాదవ్, కళాశాల విద్యార్థినిలు పాల్గొన్నారు. -
సమైక్యవాదుల కన్నెర్ర
వైవీయూ, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా జిల్లాలో నిరసనలు మిన్నంటాయి. ఇప్పటికే ఏపీఎన్జీఓలు సమ్మెబాట పట్టడంతో పలు చోట్ల కార్యాలయాలు మూతపడ్డాయి. కడప నగరంలోని ఎన్జీఓల ఆధ్వర్యంలో ఇర్కాన్సర్కిల్లో రహదారుల దిగ్బంధన కార్యక్రమం చేపట్టారు. దీనికి జిల్లా సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు మద్దతు ప్రకటించి రహదారిపై బైఠాయించి సమైక్య నినాదాలతో హోరెత్తించారు. సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ సింగారెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును రాష్ర్టపతి వ్యతి రేకించకుండా పార్లమెంట్క పంపడం దారుణమన్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తామని హెచ్చరించారు. అలా గే నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో కడప డిపో ఆవరణంలో ధర్నా చేపట్టారు. రీజినల్ జాయింట్ సెక్రటరీ పురుషోత్తం మాట్లాడుతూ అవసరమైతే సమ్మెబాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. రాజంపేటలో తెలంగాణ లాయర్లు జయప్రకాష్నారాయణపై ఏపీభవన్‌లో వ్యవహరించిన తీరుపై రాజంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శరత్‌కుమార్ ఆధ్వర్యంలో మెయిన్‌రోడ్డుపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. బైపాస్‌రోడ్డులో ఎన్జీఓలు రహదారి దిగ్బంధన కార్యక్రమం కొనసాగించారు. ప్రొద్దుటూరులో జేఏసీ కన్వీనర్ మాదాసు మురళీ ఆధ్వర్యంలో పలు పాఠశాలల విద్యార్థులు పుట్టపర్తి సర్కిల్ నుంచి రాజీవ్ సర్కిల్ వరకు భారీర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. బద్వేలు పట్టణంలో నాలుగు రోడ్ల కూడలిలో జేఏసీ ఆధ్వర్యంలో అరవింద్ పాఠశాల విద్యార్థులు మానవహారం నిర్వహిం చారు. జమ్మలమడుగులో సమైక్యాంధ్రకు మద్దతుగా పెద్దముడియం మండలం కాండపాంపల్లె గ్రామస్థులు దీక్షలో బైఠాయించారు. వీరికి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి సంఘీభావం ప్రకటించారు. పులివెందులలో సైతం నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో డిపో ఆవరణంలో సమావేశం నిర్వహిం చి ఉద్యమానికి సంఘీభావంగా తాము సైతం ఉద్యమబాట పట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. నేడు జిల్లా బంద్‌కు పిలుపు.. పార్లమెంట్లో ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెడుతున్నందుకు నిరసనగా గురువారం జిల్లా బంద్‌కు పిలుపునిస్తున్నట్లు వివిధ రాజ కీయ పార్టీలు ప్రకటించాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి కార్యచరణను గురువారం సమావేశంలో ప్రకటించనున్నట్లు లాయర్ల జేఏసీ అధ్యక్షుడు రాజేష్‌కుమార్‌రెడ్డి తెలిపారు. నేడు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జిల్లా బంద్ కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2013ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా గురువారం జిల్లా బంద్ నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండల కేంద్రాలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సమైక్యవాదులు పాల్గొని బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రబుత్వానికి బుద్ధి వచ్చేలా ప్రతి ఒక్కరూ బంద్‌లో పాల్గొనాలని కోరారు. ప్రజల మనోభావాలు పట్టవా..! వైవీయూ: ఆంధ్రుల మనోభావాలకు విలువ ఇవ్వకుండా అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును ఆమోదించడం రాష్ట్రపతికి తగదని ఏపీఎన్జీఓ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు విమర్శించారు. బుధవారం నగర శివారులోని ఇర్కాన్సర్కిల్లో సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధన కార్యక్రమం నిర్వహించారు. వీరికి జిల్లా సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎన్జీఓ నాయకులు గోపాల్‌రెడ్డి, చిన్నయ్య, రమేష్, చంద్రశేఖరరెడ్డి, జేఏసీ నాయకులు అమీర్‌బాబు, పీరయ్య, జోగిరామిరెడ్డి, కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమైక్యమే లక్ష్యం
కడప రూరల్, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు ఎన్జీఓలు చేపట్టిన సమ్మె మంగళవారం నాటికి ఆరు రోజులు పూర్తి చేసుకుంది. జిల్లావ్యాప్తంగా సమైక్యమే లక్ష్యంగా ఎన్జీఓలు ముందుకు సాగుతున్నారు. వివిధ రూపాల్లో ఆందోళనలు చేపడుతున్నారు. ఉద్యోగుల విధుల బహిష్కరణతో యథావిధిగా కార్యాలయాలు మూతపడ్డాయి. ఉద్యమంలో భాగంగా థియేటర్లు, పెట్రోల్ బంక్‌ల బంద్ సంపూర్ణంగా జరిగింది. బుధవారం రహదారుల దిగ్బంధనానికి ఎన్జీఓలు పిలుపునిచ్చారు. కడపలో ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు ఆధ్వర్యంలో థియేటర్లు, పెట్రోల్ బంక్‌ల బంద్‌ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ రాజ్యాంగానికి విరుద్ధంగా విభజన జరుగుతోందని దుయ్యబట్టారు. పార్లమెంట్లో సీమాంధ్ర ఎంపీలు, కేంద్ర మంత్రులు ఏకమై విభజన బిల్లును అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్జీఓ నేతలు నిత్యపూజయ్య, చిన్నయ్య, డీఎంహెచ్ఓ జేఏసీ నాయకులు నాగలక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మైదుకూరులో విద్యార్థులు, ఉపాధ్యాయులు కదం తొక్కారు. ఆరు పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు నగరంలో భారీ ర్యాలీ, మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాలుగురోడ్ల కూడలిలో ఉపాధ్యాయుడు అంకన్న విభజనకు నిరసనగా, సమైక్యాంధ్రకు మద్దతుగా గుండు గీయించుకొని నిరసన వ్యక్తంచేశారు. మైదుకూరు పట్టణం సమైక్యాంధ్ర నినాదాలతో దద్దరిల్లింది. రాజంపేటలో సమైక్య పరిరక్షణ వేదిక, ఎన్జీఓ ఛెర్మైన్ వెంకటరమణ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు లక్ష్మినారాయణ, శరత్‌కుమార్ ఆధ్వర్యంలో ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై విద్యార్థులు ధర్నా చేపట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. -
కాపులను బీసీలో చేర్చేలా సర్కారుపై ఒత్తిడి తెండి
విజయమ్మకు కాపు జేఏసీ నేతల వినతి సాక్షి, హైదరాబాద్: కాపులను బీసీల జాబితాలో చేరుస్తూ 1994లో జారీ అయిన జీవో (నంబర్ 30) నేటికీ అమలు కావట్లేదని..ఈ జీవోను ప్రభుత్వం అమలు చేసేలా ఒత్తిడి తేవాలని తెలగ, బలిజ, కాపు జేఏసీ నేతలు వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు విజ్ఞప్తి చేశారు. జేఏసీ రాష్ట్ర కన్వీనర్ దాసరి రాము నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం విజయమ్మను ఆమె నివాసంలో కలుసుకుని వినతిపత్రం సమర్పించింది. ఈ డిమాండ్‌పై గత ఏడాది ఏప్రిల్ నుంచి తమ సంఘాలన్నీ 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దశల వారీగా ఆందోళనలు చేపడుతున్నాయని ప్రతినిధి బృందం తెలిపింది. ఈ విషయంలో తప్పకుండా కృషి చేస్తామని ఆమె వారికి హామీ ఇచ్చారు. విజయమ్మను కలిసిన వారిలో కాపు సద్భావనా సంఘం(తూ.గో) నాయకుడు వాసిరెడ్డి ఏసుదాస్, బలిజ సేవా సంఘం ఉపాధ్యక్షుడు (కర్నూలు) సింగంశెట్టి సోమశేఖర్, శ్రీనివాస్, స్వరూప్ తదితరులు ఉన్నారు. వైఎస్సార్‌టీఎఫ్ డైరీ ఆవిష్కరణ ఏపీ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ డైరీ (2014)ని పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ మంగళవారం ఆవిష్కరించారు. ఆమె నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ కె.ఓబుళపతి, కమిటీ సభ్యులు కె.జాలిరెడ్డి, పి.రామసుబ్బారావు, అప్పారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు సంబంధించిన 11 సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటూ ఆమెకు వినతిపత్రం అందజేశారు. -
విభజన ప్రక్రియను అడ్డుకుంటాం
ఏఎన్‌యూ, న్యూస్‌లైన్ :స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం జరుగుతున్న రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు విద్యార్థులంతా సిద్ధంగా ఉన్నారని వర్సిటీ వ్యాయామ కళాశాల విద్యార్థులు పేర్కొన్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియను నిరసిస్తూ వర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థులు, సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు బుధవారం వర్సిటీలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి, సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వర్సిటీ ప్రధాన ద్వారం ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. రోడ్డుపైనే వ్యాయామం, ధ్యానం చేసి నిరసన తెలిపారు. అనంతరం రిలే నిరాహారదీక్షలకు దిగారు. దీక్షలను ఏఎన్‌యూ అధ్యాపక జేఏసీ నాయకులు ఆచార్య పి.వరప్రసాదమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం ఒంటెద్దుపోకడలు పోతూ రాష్ట్రాన్ని విభజించేందుకు వేగంగా ముందుకు సాగుతోందన్నారు. కేంద్రం తన వైఖరిని మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. బీజేపీ మాజీ రాష్ట్ర నాయకుడు అనుమోలు గాంధీ మాట్లాడుతూ బీజేసీ, సీపీఐ పార్టీలకు చెందిన జాతీయ నాయకులను నిలదీసి వారి కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడితే ఆ పార్టీలు రాష్ట్ర విభజన విషయంలో నిర్ణయాన్ని మార్చుకుంటాయన్నారు. కార్యక్రమంలో అధ్యాపక జేఏసీ నాయకులు డాక్టర్ పి.జాన్సన్, డాక్టర్ రవికుమార్, విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎం.వెంకటరమణ, ఉద్యోగ జేఏసీ నాయకులు కోడూరి కనకరాజు, ఏఎన్‌యూ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు కె.కిషోర్, నాయకులు బి.ఆశిరత్నం, పి.శ్యాంసన్, తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు కూసం బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దీక్షలను సాయంత్రం వర్సిటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జిమ్మీరాణి విరమింపజేశారు. -
ఉద్యమాన్ని విరమించం
రాయచోటి, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచుతామంటూ పాలకులు ప్రకటించేంతవరకు ఉద్యమాన్ని విరమించే ప్రసక్తేలేదని, ఎలాంటి త్యాగాలకైనా తాము సిద్ధమేనని సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక జెఏసి నేతలు వెంకటేశ్వరరెడ్డి, రామమోహన్, యహియాబాష, మనో హర్రాజు, సి.బి.మనోహర్‌రెడ్డి, బి.వి.రమణలు ప్రకటించారు. బుధవారం స్థానిక ఆర్టీసీ బస్టాండు ఆవరణంలో స్థానిక ఏరియా ఆసుపత్రి ఉద్యోగులు, సిబ్బంది రిలేదీక్షలను చేపట్టారు. వీరికి సంఘీభావం తెల్పిన జేఏసీనేతలు మాట్లాడుతూ సమైక్య రాష్ట్రపరిరక్షణ కోసం ఉపాధ్యాయ, ఉద్యోగులు, ఎన్జిఓలు,ఆర్టీసీ కార్మికులు ఉద్యమిస్తుండడం ఎంతైనా అభినందనీయమన్నారు. రాష్ట్రవిభజనను తీవ్రస్థాయిలో వ్యతిరేకించి అడ్డుకోవాల్సిన అన్నిపార్టీల నేతలు నిమ్మకు నీరెత్తినట్లు మిన్నకుండి పోవడం దారుణమన్నారు. ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన నేతలకు ప్రజాభీష్టం మేరకు తప్పక నడుచుకోవాల్సి వుందన్నారు. పురవీధులలో ర్యాలీ : స్థానిక ఆర్టీసీ బస్టాండులోని రిలేదీక్షల శిబిరం నుండి సమైక్యవాదులు రాష్ట్రవిభజనను నిరసిస్తూ పురవీధులలో నిరసన ర్యాలీ ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కేంద్ర-రాష్ట్రమంత్రులు బొత్ససత్యనారాయణ, రఘువీరారెడ్డి, ఆనం రామనారా యణరెడ్డి, చిరంజీవి, పల్లంరాజు, కోట్ల, పురందేశ్వరి, పనబాక లక్ష్మి తదితరులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వెంటనే మంత్రులంతా రాజీనామాలు ఆమోదించుకుని ఉద్యమంలో పాల్పంచుకోవాలంటూ డిమాండ్ చేశారు. వినూత్న నిరసన... రాష్ట్రవిభజనను అడ్డుకోలేని సీమాంధ్రకు చెందిన అసమర్థ కేంద్ర-రాష్ట్రమంత్రుల చిత్రపటాలపై బుధవారం సమైక్యవాదులు వినూత్నరీతిలో నిరసన తెలిపారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర-రాష్ట్రమంత్రులందరి ఫోటోలను ముద్రి ంచిన బ్యానర్‌ను సమైక్యవాదులు నేతాజి సర్కిల్లో జాతీయర హదారిపై పడేసి టమోటాలు, కోడిగ్రుడ్లు, చెప్పులతో కొట్టి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక జెఏసి నేతలు వెంకటేశ్వరరెడ్డి, రామమో హన్, పుల్లయ్య, ఖాజామియా, మనోహర్‌రాజు, శేఖరనాయక్, తిప్పారెడ్డి, గంగిరెడ్డి, శివారెడ్డితో పాటు పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయులు, ఆర్టీసి జెఏసి సభ్యులు, నేతలు పాల్గొన్నారు. బ్యాంకులను మూసివేత... సమైక్యరాష్ట్ర పరిరక్షణవేదిక రాష్ట్రనేతల పిలుపుమేరకు బుధవారం పట్టణంలో సమైక్యవాదులు రెండవరోజు కూడా కేంద్రప్రభు త్వ కార్యాలయాలు, సంస్థలను మూయించేశారు. పట్టణంలోని ఆంధ్రబ్యాంకు, ఎపిజిబి, హెచ్‌డిఎఫ్‌సి, కార్పొరేషన్ బ్యాంకు, యాక్సిస్బ్యాంకు, సిండికేట్, స్టేట్‌బ్యాంకుల వద్దకెళ్ళి వాటిని మూయించారు. అలాగే పోస్టాపీసు, ఎల్ఐసి కార్యాలయం, ముత్తూట్ ఫైనాన్స్ తదితర సంస్థలను కూడా మూయించేశారు. విఆర్ఓల దీక్షలు : తహశీల్దార్ కార్యాలయం వద్ద సమైక్యాంధ్ర జెఏసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షాశిబిరంలో బుధవారం మండలంలోని పలు గ్రామాల విఆర్ఓలు దీక్షలు చేపట్టారు. వీరికి జెఏసి నేతలు నాగిరెడ్డి,జనార్దన్, శ్రీనివాసరాజు, నాగేశం, ఉపాధ్యాయసంఘం నేతలు వెంకట్రామిరెడ్డి, రెడ్డెన్న,శివారెడ్డి,రాజారమేష్,జాబీర్ల తో పాటు ఉపాధ్యాయులు నరసింహారెడ్డి,శ్రీనివాసులు,రెడ్డెప్పరెడ్డి,సునీర్, నాగయ్య, వెంకట్రామరాజు సంఘీభావం తెలిపారు. కొనసాగిన న్యాయవాదుల దీక్షలు : స్థానిక కోర్డుసముదాయంలో గత 64 రోజులుగా న్యాయవాదులు చేపడుతున్న రిలేదీక్షలను బుధవారం కూడా కొనసాగించా రు. దీక్షలలో న్యాయవాదులు శ్రీనివాసులు, నరసింహారెడ్డి, వి.సి.రెడ్డెప్పరెడ్డి, కోర్టుఉద్యోగి ఖాదర్‌వలీ తదితరులు వున్నారు. వీరికి పలువురు సీనియర్,జూనియర్ న్యాయవాదులు, ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. -
ఆర్టీపీపీలో ఉద్రిక్తత
ఎర్రగుంట్ల, న్యూస్‌లైన్: రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ)లో సమైక్యాంధ్ర ఉద్యమం శనివారం ఉద్రికత్తకు దారితీసింది. తెలంగాణ నోట్‌ను వెంటనే కేంద్రం రద్దు చేసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఆర్టీపీపీలోని విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, కార్మికులు ప్రాజెక్టులోకి గేట్లను తోసుకుంటూ వెళ్లారు. విధులకు ఎవరినీ పోనివ్వకుండా అడ్డుకున్నారు. మొదట మూడవ యూనిట్‌ను నిలిపి వేసి సర్వీసులోకి తీసుకురావద్దని జేఏసీ నాయకులు సీఈ కుమారుబాబును కోరారు. సీఈ వినకపోవడంతో వారందరూ యూనిట్‌లోని యూసీబీ(యూనిట్ కంట్రోల్ బోర్టు)లోకి వెళ్లి జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. వెంటనే సీఈ కుమారుబాబు మూడవ యూనిట్‌ను నిలుపుదల చేస్తామని చెప్పడంతో వారు శాంతించారు. యూనిట్లన్నీ ట్రిప్.. ఆర్టీపీపీలో ఉన్న 1,2,3,4,5 యూనిట్లన్నీ సమైక్యవాదులు ట్రిప్ చేశారు. దీంతో గ్రిడ్‌లో సాంకేతిక లోపం ఏర్పడి 1050 మెగావాట్లు విద్యుత్ ఒక్కసారిగా నిలిచిపోయి తీవ్ర అంతరాయం ఏర్పడింది. సెల్ టవర్ ఎక్కి... ఆర్టీపీపీలో వైఎస్ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకులు గుగ్గల మహేశ్వర్‌రెడ్డి, పులి సుధాకర్‌రెడ్డి, కిరణ్కుమారు, నాయక్ బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఎస్ఐ సంజీవరెడ్డి, ఉద్యోగులు, కార్మికులు టవర్ ఎక్కిన వారిని దించడానికి ప్రయత్నాలు చేశారు. యూనిట్లన్నీ నిలుపుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ఆర్టీపీపీ జేఏసీ నాయకులు అక్కడికి చేరుకుని సమైక్యవాదులను శాంతింప చేసి కిందకు దించారు. -
ఈ సమయంలో వివాదాలొద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ కీలకదశకు చేరుకున్న ప్రస్తుత తరుణంలో వివాదాలు ఉద్యమానికి మంచిది కాదని, భవిష్యత్తులో ఇలాంటివి జరుగకుండా అందరం కలిసి పనిచేద్దామని తెలంగాణ రాజకీయ జేఏసీ, విద్యార్థి జేఏసీ నేతలు నిర్ణయించారు. సకల జనభేరి సందర్భంగా రాజకీయ జేఏసీ కో చైర్మన్ వి.శ్రీనివాస్‌గౌడ్, విద్యార్థి జేఏసీ నేతల మధ్య తలెత్తిన విభేదాలకు ముగింపు పలికారు. టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు నివాసంలో రెండు జేఏసీల నేతలు బుధవారం సమావేశమయ్యారు. రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం, ముఖ్యనేతలు సి.విఠల్, వి.శ్రీనివాస్‌గౌడ్, అద్దంకి దయాకర్, కారెం రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నేతలు బి.వినోద్‌కుమార్, బాల్క సుమన్, ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం, విద్యార్థి జేఏసీ నేతలు పిడమర్తి రవి, మధు తదితరులు చర్చల్లో పాల్గొన్నారు. ‘సకల జనభేరిలో విద్యార్థులను నిర్లక్ష్యం చేశారు. ఐదున్నర గంటలపాటు సభ జరిగితే 10 నిమిషాలైనా విద్యార్థులను మాట్లాడించే సమయంలేదా? పత్తా లేనివారెందరో సకల జనభేరిలో పెత్తనం చేశారు. విద్యార్థి నేతలను పిలిచి మాట్లాడిస్తామని చెప్పి అవమానించారు. దీనికి సమాధానం చెప్పకుండా శ్రీనివాస్‌గౌడ్ ఎలా బెదిరిస్తారు’ అని విద్యార్థి జేఏసీ నేతలు ఈ సందర్భంగా నిలదీశారు. దీనిపై రాజకీయ జేఏసీ నేతలు స్పందిస్తూ ‘‘సకల జనభేరిలో విద్యార్థులను మాట్లాడించకపోవడం బాధాకరమే. సభలోనూ, సభ తర్వాత జరిగిన పరిణామాలు కూడా బాధాకరం. ఇవి జరిగి ఉండాల్సినవి కావు. తెలంగాణ బిల్లు పార్లమెంటులోకి రాబోయే తరుణంలో ఉద్యమ శక్తుల మధ్య విభేదాలు ఎవరికీ మంచిది కాదు. ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేద్దాం. భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టకర పరిణామాలు జరగకుండా సమన్వయం చేసుకుందాం’’ అని ప్రతిపాదించారు. మిగిలిన రాజకీయ జేఏసీ, టీఆర్ఎస్, ప్రజాసంఘాల జేఏసీ నేతలు కూడా విద్యార్థులను సముదాయించారు. దీంతో విద్యార్థులు, శ్రీనివాస్‌గౌడ్ పరస్పరం ఆలింగనం చేసుకుని సమస్యను ఇంతటితో వదిలేద్దామని నిర్ణయించారు. అనంతరం పలువురు నేతలు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులే ఊపిరి అని, భవిష్యత్తులోనూ విద్యార్థుల పోరాటాలు, నిబద్ధత ఉద్యమానికి చాలా అవసరమని కేశవరావు, బి.వినోద్ అన్నారు. భవిష్యత్తులో అన్ని జేఏసీలతో కలసి పనిచేస్తామని, హైదరాబాద్‌లో వైఎస్సార్సీపీ సమైక్య సభను అడ్డుకుంటామని పిడమర్తి రవి చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ సభకు అనుమతిని ఇస్తే ఉద్యోగులంతా సహాయ నిరాకరణకు దిగుతామని శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. హైదరాబాద్‌లో సభను పెడతామంటే యుద్ధం జరిగి తీరుతుందని గజ్జెల కాంతం చెప్పారు. -
సమైక్యమే శ్వాస... ధ్యాస
సాక్షి, అనంతపురం: సమైక్య నినాదం పల్లెల్లోనూ ప్రతిధ్వనిస్తోంది. ఉద్యమకారులు విభిన్న రూపాల్లో నిరసనలు కొనసాగిస్తున్నారు. తెలుగుజాతిని విడదీసే కుట్రల్ని సాగనివ్వబోమంటూ ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, కార్మికులు, కర్షకులు, వైఎస్సార్సీపీ శ్రేణులు చేయిచేయి కలిపి కదం తొక్కుతుండడంతో ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 61వ రోజైన ఆదివారం కూడా సమైక్యవాదులు పెద్దఎత్తున కదంతొక్కారు. అనంతపురం నగరంలో కేంద్రప్రభుత్వ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. జాక్టో ఆధ్వర్యంలో వందలాది మంది ఉపాధ్యాయులు చేతులు కట్టేసుకుని ర్యాలీ చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళలు, పోస్టల్ ఉద్యోగులు ర్యాలీలు చేపట్టారు. ఆర్టీసీ, రెవెన్యూ, హంద్రీ-నీవా ఉద్యోగులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులసంఘాల జేఏసీ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల సిబ్బంది ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఎస్కేయూలో విద్యార్థులు, జేఏసీ నాయకులు గంజి తాగుతూ నిరసన తెలిపారు. ధర్మవరంలో జేఏసీ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. బత్తలపల్లి, ముదిగుబ్బలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. గుంతకల్లులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. జేఏసీ నాయకులు బూట్లు పాలీష్ చేస్తూ.. చెప్పులు విక్రయిస్తూ నిరసన తెలిపారు. గుత్తిలో జేఏసీ నాయకులు భారీ ర్యాలీ చేశారు. పామిడిలో జేఏసీ, సమైక్యాంధ్ర పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని ర్యాలీ నిర్వహించారు. హిందూపురంలో ఏపీఎన్జీఓలు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. చిలమత్తూరు ఎస్సీ కాలనీలో జేఏసీ నాయకులు రచ్చబండ నిర్వహించారు. కదిరి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో తలుపుల మండల ఉపాధ్యాయులు రిలేదీక్షలు చేపట్టారు. టీచర్ రవీంద్రారెడ్డి కోయదొర వేషధారణలో రాళ్లు, గడ్డి, కలబంద విక్రయించి నిరసన తెలిపారు. కళ్యాణదుర్గంలో జేఏసీ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన, మానవహారం చేపట్టారు. మడకశిరలో సమైక్యవాదులు చీపుర్లు పట్టుకుని, రోడ్డు ఊడ్చి నిరసన తెలిపారు. పుట్టపర్తిలో జేఏసీ నాయకులు రాళ్లు మోస్తూ నిరసన తెలిపారు. అలాగే సోమవారం సమైక్య సమరభేరి సదస్సు నిర్వహించనున్నారు. నల్లమాడలో సర్పంచులు, పెనుకొండ, ఉరవకొండలో జేఏసీ నాయకులు, రాయదుర్గంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, పుట్లూరులో సమైక్యవాదులు, కూడేరులో విద్యార్థి జేఏసీ నాయకులు, అమరాపురంలో ఉపాధ్యాయులు ర్యాలీలు చేపట్టారు. జేఏసీ నాయకులు రొద్దంలో పాదయాత్ర, సోమందేపల్లిలో జాతీయ రహదారిపై మాదేచెరువు గ్రామస్తులతో కలిసి రాస్తారోకో, గోరంట్లలో ఆటా పాట కార్యక్రమాలు చేపట్టారు. రాప్తాడులో సమైక్యవాదులు రాస్తారోకో చేసి.. తెలంగాణ నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేయాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పార్టీ శ్రేణులతో సమావేశమై సూచించారు. కణేకల్లులో ఉపాధ్యాయులు ఒంటికాలిపై నడుస్తూ నిరసన తెలిపారు. ఆత్మకూరులో ఏపీఎన్జీఓలు నిర్వహించిన ‘మహాగర్జన’కు సమైక్యవాదులు భారీగా తరలివచ్చారు. శింగనమలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర పోస్టర్లు విడుదల చేశారు. జేఏసీ నాయకులు గడ్డితింటూ నిరసన తెలిపారు. తాడిపత్రిలో జేఏసీ, ఆర్టీసీ కార్మికుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉరవకొండలో పీహెచ్సీ వైద్యులు రిలేదీక్షలు చేపట్టారు. బెళుగుప్పలో జేఏసీ నాయకులు రాష్ట్ర విభజన ఆగేదాకా పోరుబాట ఆపే ప్రసక్తే లేదంటూ ప్రతిజ్ఞ చేశారు -
ఒకటే గమ్యం
సాక్షి, కడప : సమైక్య ఉద్యమం ఉరుమై గర్జిస్తోంది. రెండు నెలలు సమీపిస్తున్నా ఉద్యమకారులు మాత్రం సడలని దీక్షతో ఉద్యమం చేస్తున్నారు. సమైక్య ఉద్యమం జన హృదయాలను కదిలిస్తోంది. అందుకే ఎన్నాళ్లైనా ఉద్యమం నిరాటంకంగా కొనసాగుతోంది. వాడివేడిగా దూసుకుపోతోంది. కడప నగరంలో మంత్రి సి.రామచంద్రయ్య ఇంటిని ప్రైవేటు వృత్తి విద్య కళాశాలల సమాఖ్య ఆధ్వర్యంలో ముట్టడించి టు లెట్ బోర్డును తగిలించి మంత్రి ఫోన్ నెంబ రును రాశారు. రిమ్స్ మెడికల్ కళాశాలలో కౌన్సెలింగ్‌ను జేఏసీ నాయకులు డాక్టర్ ఫరూఖ్, వెంకటశివ, సురేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యం లో అడ్డుకున్నారు. కౌన్సెలింగ్ వాయిదా పడింది. న్యాయవాదులు రోడ్డుపై సమైక్యాం ధ్ర చాకిరేవు నిర్వహించి సోనియాగాంధీ, ఆంటోని, దిగ్విజయ్‌సింగ్, షిండే, ఇతర కేంద్ర మంత్రుల చిత్రపటాలను ఉతికి ఆరేశారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక, ప్రైవేటు వృత్తి విద్య కళాశాలల సమాఖ్య, మున్సిపల్ కార్పొరేషన్, ఇరిగేషన్, వాణిజ్యపన్నులశాఖ, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. జమ్మలమడుగులో ఐదు వేల మందితో ఐదు కిలోమీటర్ల మేర మోటారుబైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకుడు తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, భూపేష్‌రెడ్డి, టీడీపీ నాయకులు గిరిధర్‌రెడ్డి మద్దతు పలికి పాల్గొన్నారు. హిందీ ఉపాధ్యాయులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఎర్రగుంట్ల, ఆర్టీపీపీలో దీక్షలు కొనసాగాయి. ప్రొద్దుటూరులో ఎన్జీఓలు, పెయింటర్స్ అసోసియేషన్, న్యాయవాదులు, వైద్యులు, మున్సిపల్ ఉద్యోగుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. పాండురంగ దేవస్థానం వారు విశ్వసహస్ర పారాయణంతో ర్యాలీ చేస్తూ దీక్షల్లో పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ దీక్షలు కొనసాగాయి. రాజంపేటలో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకుని ర్యాలీ నిర్వహించారు. తహశీల్దార్ కార్యాలయం నుంచి వైఎస్సార్ సర్కిల్ మీదుగా ఆర్డీఓ కార్యాలయంవరకు ప్రదర్శన చేపట్టారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పండోళ్లపల్లెకు చెందిన శేఖర్‌రెడ్డి, నారాయణరెడ్డి నేతృత్వంలో 80మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. బద్వేలులో సోమశిల మునక ప్రాంత వాసులు భారీర్యాలీ నిర్వహించారు. నాలుగురోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి రిలే దీక్షల్లో పాల్గొన్నారు. సోనియా, దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో ఎంపీ పొన్నం ప్రభాకర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు అర్ధనగ్నంగా మోకాళ్లపై నడుస్తూ నిరసన తెలిపారు. పోరుమామిళ్లలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో హమాలీలు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. కలసపాడులో మహాగర్జన సభ విజయవంతమైంది. రాయచోటిలో బలిజ సంఘం ఆధ్వర్యంలో, న్యాయవాదులు రిలే దీక్షలు చేపట్టారు. సమైక్యాంధ్ర శిబిరం వద్ద ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసి సమైక్యాంధ్ర పాటలు పాడించారు. ఆర్టీసీ కార్మికులు గడ్డితింటూ వినూత్న ర్యాలీ చేపట్టారు. గురువారం రాయచోటిలో జరుగుతున్న రణభేరి సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సభకు ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు హాజరు కానున్నారు. మైదుకూరులో రైతు సింహ గర్జన సమైక్య నినాదాలతో హోరెత్తింది. అంకాలమ్మ గుడి నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. వంటా వార్పు చేపట్టారు. రైల్వేకోడూరులో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. జేఏసీ నాయకులు రోడ్డుపైన నిలబడి ఆందోళన చేపట్టారు. కమలాపురం నియోజవర్గంలోని చదిపిరాళ్ల గ్రామం వద్ద డప్పు వాయిద్యాలు వాయిస్తూ రాస్తారోకో చేశారు. కమలాపురంలో సర్పంచులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి విభజన వల్ల కలిగే నష్టాలను వివరించారు. పులివెందులలో ఉపాధ్యాయ జేఏసీ, బ్యాడ్మింటన్ క్రీడాకారులు భారీ ర్యాలీని నిర్వహించి రిలే దీక్షల్లో పాల్గొన్నారు. రోడ్లపైన షటిల్ ఆడి నిరసన తెలిపారు. -
రఘవీరాకు సమైక్య సెగ
మడకశిర, న్యూస్‌లైన్ : రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డికి సమైక్య సెగ బలంగా తాకింది. తల్లి నరసమ్మ మరణం తర్వాత ఆదివారం స్వగృహంలో పూజలు చేయడానికి మండలంలోని నీలకంఠాపురానికి వచ్చిన మంత్రిని సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు, ఉద్యమకారులు నిలదీశారు. మంత్రి ఇంటిని ముట్టడించి.. రాజీనామా కోసం డిమాండ్ చేయడానికి ఉదయమే జేఏసీ నాయకులు, సమైక్యవాదులు మడకశిర నుంచి బయలుదేరారు. వారిని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. అయితే.. వారు రోడ్లపైనే బైఠాయించి మంత్రికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినదించడంతో పోలీసులు వదలిపెట్టక తప్పలేదు. దీంతో వారు నీలకంఠాపురంలోని మంత్రి ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లకుండా పోలీసులు బయట గేటు వద్దే అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే వారు మంత్రి రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఇంటి ఆవరణలోకి దూసుకెళ్లారు. మంత్రిని చుట్టుముట్టారు. అక్కడే బైఠాయించి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు హోరెత్తించారు. ‘ఆగస్ట్ 3న ఇంటిని ముట్టడించినప్పుడు తల్లి పెద్దకర్మ అనంతరం 4వ తేదీన సమైక్యాంధ్రపై మాట్లాడతానని చెప్పారు. తర్వాత ఆ ఊసేలేదు. 54 రోజుల నుంచి ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నా ఎందుకు సమైక్యాంధ్రకు మద్దతుగా మాట్లాడంలేద’ని నిలదీశారు. మంత్రితో పాటు ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యే సుధాకర్ అక్కడే భోజనం వడ్డించడానికి వెళ్లగా ఉద్యమకారులు వారినీ వదలలేదు. ‘భోజనం చేయండి... తర్వాత మాట్లాడతా’నని మంత్రి చెప్పినా వారు వినిపించుకోలేదు. ‘భోజనం వద్దు... సమైక్యాంధ్ర కావాల’ంటూ నినదించారు. ‘రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర విద్యార్థులు, ప్రజలకు అన్యాయం జరగకూడదని మేము జీతాలు వదలుకుని ఉద్యమిస్తున్నాం. మీరు మాత్రం పదవులను ఎందుకు వదలుకోవడం లేద’ని నిలదీశారు. మంత్రి స్పందిస్తూ రాజీనామాలతో సమస్య పరిష్కారం కాదన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా చివరి క్షణం వరకు పోరాడతామన్నారు. ‘మీ ఉద్యమాలు మీరు చేయండి. మా ప్రయత్నం మేము చేస్తాం. కాంగ్రెస్‌తో పాటు అన్ని పార్టీల తప్పిదం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. లేఖలు ఇచ్చిన పార్టీలు పునరాలోచన చేయాలి. సీమాంధ్రలో ఏ జిల్లాలోనూ లేనివిధంగా అనంతపురంలో 30 లక్షల మందికిపైగా ఉద్యమకారులు రోడ్లెక్కుతున్నారు. ఇప్పుడు మనరాష్ట్రం దేశంలోనే అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉంది. విభజన జరిగితే ఢిల్లీలో సీమాంధ్రులను పట్టించుకునేవారు ఉండరు. ఈ ఉద్యమం దేశచరిత్రలో నిలిచిపోతుంద’ని అన్నారు. విభజనకు సంబంధించిన నోటు త్వరలోనే అసెంబ్లీకి వస్తుందని, తీర్మానం వీగిపోవాలంటే సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా పదవుల్లోనే ఉండాలని అభిప్రాయపడ్డారు. బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడితే సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు అడ్డుకుంటారని తెలిపారు. ‘జై సమైక్యాంధ్ర’ అనాలని జేఏసీ నాయకులు ఎంత డిమాండ్ చేసినా, వేడుకున్నా మంత్రి మాత్రం ఆ మాట అనలేదు. దీంతో వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
మమతకు నివాళి
తెలంగాణ కోసం మరో ఊపిరి ఆగిపోయింది. ఈ నెల 16న చిట్యాల మండలం పెద్దకాపర్తిలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న పొట్లపల్లి మమత జిల్లాకేంద్ర ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి శనివారం తుదిశ్వాస విడిచింది. టీజేఏసీ నాయకులు జిల్లా కేంద్రంలో ఆమె మృతదేహం వద్ద నివాళులర్పించారు. - న్యూస్‌లైన్, నల్లగొండ టౌన్/చిట్యాల తెలంగాణ కోసం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పొట్లపల్లి మమత(22) జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. ఆమె మృతదేహాన్ని జేఏసీ నాయకులు స్థానిక గడియారం సెంటర్‌కు తీసుకువచ్చి అక్కడ రాస్తారోకో నిర్వహించారు. అనంతరం మృతదేహంపై పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ జి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జూలై 30 తరువాత తెలంగాణ ప్రకటన ఆచరణరూపం దాల్చకపోవడంతోనే ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని ఆవేదనవ్యక్తం చేశారు. వీటికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎవ్వరు కూడా తెలంగాణ కోసం ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా టీఎన్జీఓ ఆధ్వర్యం లో మమత అంత్యక్రియల నిర్వహణకు రూ.10 వేలను బంధువులకు అందజేశారు. కార్యక్రమంలో పందిరి వెంకటేశ్వరమూర్తి, మామిడాల రమేష్, ఎం.శ్రవణ్‌కుమార్, సీహెచ్ నర్సిం హాచారి, వెంక ట్రాంరెడ్డి, మారం సంతోష్‌రెడ్డి, రేకల బద్రాద్రి, మైనం శ్రీనివాస్,అభిమణ్యుశ్రీనివాస్, ఫరీదుద్దిన్, జానిమియా, పందుల సైదులు, నాగార్జున, సురభి వెంకటేశ్వర్లు, విశ్వం, అయితగోని జనార్దన్, వెకన్న, మహేం ద్రనాథ్, పి.రవి, వెంకటాచారి, వెంకటేశ్, రావి నాయక్ తదితరులు పాల్గొన్నారు. అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు చిట్యాల : తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న ప్రైవేట్ ఉపాధ్యాయురాలు మమత అంత్యక్రియలు చిట్యాల మండలం పెద్దకాపర్తిలో అశ్రునయనాల మధ్య నిర్వహించారు. పలువురు జేఏసీ నాయకులు అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు చెరుకుసుధాకర్, గుంతకండ్ల జగదీశ్వర్‌రెడ్డి, తెలంగాణ జాగృతి నియోజకవర్గ ఇన్చార్జ్ కూనూరు సంజయ్‌దాస్‌గౌడ్, గ్రామ సర్పంచ్ కందిమళ్ల శిశుపాల్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ కందిమళ్ల జైపాల్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు పొట్లపల్లి రవి, గంట్ల రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సైకిల్ యాత్ర బృందానికి ఘనస్వాగతం
సింహాద్రిపురం, న్యూస్‌లైన్ : ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం వారు 111 ప్రదేశముల నుంచి సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రపంచ శాంతి కోసం భగవంతుడి సందేశాన్ని అందించేందుకు శాంతి దూత యువ సైకిల్ యాత్ర శుక్రవారం ఉదయం మండలంలోకి ప్రవేశించింది. బలపనూరు, అంకాలమ్మగూడూరు మీదుగా సింహాద్రిపురానికి చేరుకుంది. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి గీత, వరలక్ష్మిలు మాట్లాడుతూ ఉన్నత విలువలతో కూడిన జీవితాన్ని గడిపేందుకు కావాల్సిన ఆత్మస్థైర్య ధైర్యాలను యోగం ద్వారా పెంపొందించి ఆత్మహత్యలను నివారించవచ్చునన్నారు. ఒత్తిడి నుంచి విముక్తి కలిగించి ఆరోగ్యకరమైన సమాజాన్ని రాజయోగం ద్వారా నివారించవచ్చునన్నారు. ఈ యాత్ర కొండాపురం నుంచి జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేలు, రాజంపేట, కోడూరు మీదుగా బెంగుళూరుకు చేరుకుంటుందన్నారు. అనంతరం బ్రహ్మకుమారిలు స్థానికులచే ప్రతిజ్ఞ చేయించారు. స్థానిక జేఏసీ నాయకులు, గ్రామస్తులు స్వాగతం పలికారు. -
పెట్రోల్ , డీజిల్ రవాణా బంద్
గుంతకల్లు, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పెట్రోలియం ట్యాంకర్ల డ్రైవర్లు, క్లీనర్ల అసోసియేషన్ల జేఏసీ నాయకులు జీ.అబ్దుల్ నజీర్, ఏ.షర్మస్‌వలీ, మహమ్మద్ రఫీ, హనుమేష్, రామాంజి, వలీ డిమాండ్ చేశారు. గురువారం ఆయా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక రైల్వే క్రీడా మైదానం నుంచి పొట్టి శ్రీరాములు సర్కిల్ మీదుగా మస్తానయ్య దర్గా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సర్కిల్లో ఆయిల్ ట్యాంకర్ల యజమానులు, డ్రైవర్లు, క్లీనర్లు మానవహారంగా ఏర్పడ్డారు. వారిని ఉద్దేశించి జేఏసీ నాయకులు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం 50 రోజులుగా సీమాంధ్ర ప్రాంత ప్రజలు పోరాడుతుంటే, కేంద్ర ప్రభుత్వం స్పందించక పోవడం దారుణమన్నారు. తెలుగు ప్రజల మనోభావాలు, ఉద్యమ తీవ్రతను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం కోసం గురువారం నుంచి 48 గంటల పాటు డీజిల్, పెట్రోల్, కిరోసిన్ రవాణాను స్తంభింపజేస్తున్నామన్నారు. సీమాంధ్ర ప్రాంతంలో ఉన్న అన్ని ఐఓసీ, హెచ్పీసీ, బీపీసీ ఆయిల్ డిపోల నుంచి ఒక్క ట్రక్కు కూడా బయటకు వెళ్లకుండా డ్రైవర్లు, క్లీనర్లు, ఆయిల్ ట్యాంకర్ల యజమానులు సంయుక్తంగా ఈ ఆందోళనలో పాల్గొంటున్నారని, దీంతో రాష్ట్ర వ్యాప్తం గా 5 వేల పెట్రోలియం ట్యాంకర్లు ఎక్కడికక్కడ రెండు రోజుల పాటు ఆగిపోనున్నాయని చెపాపరు. ర్యాలీ సందర్భంగా జేఏసీ, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, టీడీపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరాలను సందర్శించి సంఘీభావం ప్రకటించారు. అలాగే తెలుగు జాతిని ఐక్యంగా ఉంచాలని కోరుతూ మహాత్మాగాంధీ, వైఎస్సార్, ఎన్టీఆర్, డాక్టర్ అంబేద్కర్, పొట్టిశ్రీరాములు, భగత్‌సింగ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
ఉద్యమ జోహార్లు
దొరవారిసత్రం, న్యూస్‌లైన్: సమైక్య పోరులో అసువులుబాసిన ఉపాధ్యాయుడు బట్టా శంకరయ్య యాదవ్ (52) భౌతిక కాయానికి ఆయన స్వగ్రామమైన గొల్లపాళెంలో సమైక్యాంధ్ర నినాదాల మధ్య బుధవారం అంతిమయాత్ర నిర్వహించారు. జోరుగా వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా జేఏసీ నాయకులు, ఉపాధ్యాయులు, రెవెన్యూ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పలు ప్రజాసంఘాల నేతలు శంకరయ్య భౌతికకాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అన్నమేడు జిల్లా ప్రజాపరిషత్ పాఠశాల్లో మూడేళ్లుగా ఎన్ఎస్ను బోధిస్తూ సమైక్య ఉద్యమంలో భాగంగా దీక్షలో కూర్చుని మంగళవారం మృతిచెందిన విషయం విదితమే. ప్రేమగా పలకరించే వ్యక్తి శంకరయ్య తమను ఎంతో ప్రేమగా పలకరించేవారని గొల్లపాళెం వాసులు శంకరయ్యయాదవ్ గురించి గుర్తు చేసుకున్నారు. ఉద్యోగ రీత్యా నాయుడుపేటలో పదేళ్లుగా నివాసముంటున్నారు. గ్రామస్తులు, తెలిసిన వారు కనిపిస్తే ఎంతో ఆదరణగా మాట్లాడేవారని, అందరి బాగోగులు తెలుసుకునేవాడని స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. స్వగ్రామానికి వచ్చినప్పుడు వృద్ధులు, పేదలకు ఆర్థిక సాయం చేసేవారని కొనియాడారు. యాదవ్ సంఘం పరంగా ఎంతోమందికి సేవలందించినట్టు పలువురు జ్ఞాపకం చేసుకున్నారు. -
సమైక్యంపై వెనక్కి తగ్గం
సాక్షి, నెల్లూరు : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జిల్లాలో 40వ రోజు ఆదివారం సమైక్యాంధ్ర ఉద్యమం మరింత ఉధృతంగా సాగింది. తిరుపతి ఎంపీ చింతా మోహన్ కనిపించలేదని వెంకటగిరిలో విద్యార్థి జేఏసీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికుల దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా నెల్లూరు నగర, రూరల్ ఎమ్మెల్యేలు ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి, ఆనం వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో వీఆర్ కళాశాలలో ఆదివారం ప్రజా సంఘాలతో చర్చావేదిక నిర్వహించారు. వీఆర్సీ కూడలిలో యూటీఎఫ్ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఉదయగిరిలో ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ రిలే దీక్షలకు తపాలా ఉద్యోగులు మద్దతు ప్రకటించారు. వరికుంటపాడు బస్టాండ్ సెంటర్లో ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగాయి. దుత్తలూరులో ఉపాధ్యాయులు, వింజమూరులో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలు 33వ రోజుకు చేరాయి. గూడూరులో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో టవర్‌క్లాక్ కూడలిలో శాంతిహోమం నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు మోకాళ్లపై కూర్చుని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. జేఏసీ నాయకులు ర్యాలీ నిర్వహించి టవర్‌క్లాక్ సెంటర్లో రాస్తారోకో చేశారు.గూడూరు రూరల్ పరిధిలోని చెన్నూరులో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. కోట క్రాస్‌రోడ్డులో కోట, వాకాడు, చిట్టమూరు మండలాల అర్చకులు ర్యాలీ చేపట్టి శాంతిహోమం నిర్వహించారు. వాకాడులో భవన కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. అశోక్ స్తంభం కూడలిలో భవన కార్మిక సంఘర రాస్తారోకో నిర్వహించి రోడ్డుపై రాతిగోడను కట్టి నిరసన తెలిపారు. పొదలకూరు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. తడలో జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. సూళ్లూరుపేట జేఏసీ ఆధ్వర్యంలో 27వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. మదర్సేవా సంస్థ కేంద్ర మంత్రులకు ఉత్తర క్రియలు చేసే కార్యక్రమాన్ని చేపట్టి ప్రదర్శన నిర్వహించారు. నాయుడుపేటలో సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా నాయుడుపేట జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. -
అమరుడికి అశ్రునివాళి
నార్నూర్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాదేమోనన్న ఆందోళనతో నార్నూర్ మండలం రాజులగూడలో ఆత్మహత్య చేసుకున్న రాథోడ్ సుశాంత్(20)కు కుటుంబ పభ్యులు, గ్రామస్తులు, జేఏసీ నా యకులు, తెలంగాణవాదులు అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. సుశాంత్ శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహ త్య చేసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణను అడ్డుకోవడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కూమార్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని, హైదరాబాద్‌ను యూటీ చేయడానికే సీమాంధ్ర సభకు అనుమతిచ్చారని, హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఏర్పాటుకు తన చావే చివరి చావు కావాలని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు సుశాంత్. శనివారం అతడి సుశాంత్ మృతదే హానికి జేఏసీ నాయకులు, తెలంగాణవాదులు నివాళులర్పించారు. అనంతరం రాజులాగూడ గ్రామంలోని ప్రధాన రోడ్డుపై బైఠాయించారు. బిగ్గరగా తెలంగాణ నినాదాలు చేశారు. శవయాత్ర నిర్వహించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని జేఏసీ నాయకులు భీష్మించుకు కూర్చున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సీఐ అచ్చేశ్వరరావు జోక్యం చేసుకొని జేఏసీ నాయకులకు నచ్చజెప్పారు. ఆత్మహత్యలు కాదు హత్యలే! జేఏసీ నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ కోసం విద్యార్థులు, యువకులు చేసుకుంటున్నవి ఆత్మహత్యలు కాదని, సీమాంధ్ర ముఖ్యమంత్రి కిరణ్‌కూమార్‌రెడ్డి చేస్తున్న హత్యలని విమర్శించారు. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణవాదులు శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామన్నా అనుమతి ఇవ్వని ముఖ్యమంత్రి, సీమాంధ్ర సభకు హైదరాబాద్‌లో ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. బాధితుడి కు టుంబానికి 10 లక్షల ఎక్షగ్రేషియా చెల్లించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇ వ్వాలని డిమాండ్ చేశారు. జేఏసీ నాయకులు ఆడె సురేశ్, రాథోడ్ ఉత్తం, సయ్యద్ ఖాసీం, ఉర్వెత రూప్‌దేవ్, ఉట్నూర్ జేఏసీ కన్వీనర్, మర్సుకొల తిరుపతి, బానోత్ గజానంద్ నా యక్, లంబాడ హక్కుల పొరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రామారావ్, టీఆర్ఎస్ నాయకు లు కాటం రమేశ్, సెడ్మాకి సీతారామ్, కృష్ణా జాదవ్, భిక్కు, స్థానిక నాయకులు షేక్ దస్తగీర్, కొర్రెళ్ల మహేందర్ పాల్గొన్నారు. -
సీమ పాలిటెక్నిక్ అధ్యాపకుల జేఏసీ ఏర్పాటు
వైవీయూ, న్యూస్‌లైన్: రాయలసీమ పాలిటెక్నిక్ అధ్యాపకుల జేఏసీ ఏర్పాటైంది. కడప నగరంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం రాయలసీమకు చెందిన 34 కళాశాలల నుంచి 74 మంది ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జేఏసీ చైర్మన్‌గా కడప పాలిటెక్నిక్ కళాశాల సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి ఎన్. రాఘవరెడ్డిని ఎన్నుకున్నారు. అలాగే అనంతపురం పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ పి. సూర్యనారాయణరెడ్డిని కన్వీనర్‌గా, కడపకు చెందిన ఎం. తిప్పేస్వామిని ట్రెజరర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం కార్యచరణ ప్రణాళికపై చర్చించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాయలసీమ ప్రాంత విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా రెండు మూడు రోజుల్లో రీ షెడ్యూలు వస్తే ఎంసెట్ కౌన్సెలింగ్‌లో పాల్గొంటామని తెలిపారు. అలాగే సెప్టెంబర్ 10వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి నోటీసును త్వరలో ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీమ జిల్లాల పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకులు, లైబ్రేరియన్లు, పీడీలు, ఏఓలు పాల్గొన్నారు. -
మిన్నంటిన ఉద్యమ సెగ
అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : సమైక్య ఉద్యమం రోజురోజుకూ ఉధృతమవుతోంది. ఎత్తిన పిడికిలి దించకుండా.. మడమ తిప్పకుండా జిల్లా ప్రజలు, ఉద్యోగులు ఉద్యమిస్తున్నారు. మంగళవారం కూడా జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు పెద్దఎత్తున కొనసాగాయి. జిల్లా సంయుక్త జేఏసీ సోమవారం నుంచి చేపట్టిన 48 గంటల నిరవధిక బంద్ విజయవంతమైంది. ఎక్కడిక్కడ రహదారులను దిగ్బంధించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, బ్యాంకులు, పెట్రోలు బంకులు, సినిమాహాళ్లు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతబడ్డాయి. ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ‘అనంత’లో మంత్రి శైలజానాథ్‌కు, కళ్యాణదుర్గంలో ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు సమైక్యవాదుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్ర విభజన నిర్ణయంతో మనస్తాపం చెంది ధర్మవరానికి చెందిన ఇంటర్ విద్యార్థి మహేష్ పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. సమైక్యాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్, రాష్ట్ర మంత్రి శైలజానాథ్ 27 రోజుల ఉద్యమం తరువాత తొలిసారిగా అనంతపురంలో సమైక్య ర్యాలీ, సభ నిర్వహించారు. డీసీసీ కార్యాలయం ఎదుట ఏర్పాటుచేసిన ఈ సభకు శింగనమల నియోజకవర్గం నుంచి జనాన్ని తీసుకొచ్చారు. అంతకుమునుపు పోలీసు పహారాలో సమైక్య ర్యాలీ చేశారు. అయితే.. మంత్రికి అడుగడుగునా నిరసన సెగలు తగిలాయి. ప్రభుత్వాసుపత్రి ఎదుట మెడికల్ జేఏసీ, తెలుగుతల్లి విగ్రహం ఎదుట ఆర్అండ్ బీ, ఇరిగేషన్ జేఏసీ, జెడ్పీ ఎదుట పీఆర్ ఉద్యోగ సంఘాల జేఏసీ, ఆ తరువాత మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ నేతలు ‘గో బ్యాక్’ అంటూ నినదించారు. పగటి వేషగాళ్ల మాయమాటలను ఇంకా నమ్మే పరిస్థితి లేదంటూ పీఆర్ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు నోటికి, చెవులకు నల్లరిబ్బను కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కాగా... నగరంలో జాక్టో, న్యాయవాదుల జేఏసీ, బీసీ, ఎస్టీ,ఎస్టీ, మైనార్టీ సంఘాల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. వ్యవసాయ, అనుబంధ శాఖల ఉద్యోగులు ఓవర్‌బ్రిడ్జి వద్ద కాసేపు బైఠాయించారు. అధ్యాపక జేఏసీ నేతలు జాగింగ్ చేస్తూ నిరసన తెలిపారు. సంయుక్త జేఏసీ పిలుపు మేరకు నగరంలో రహదారులన్నీ దిగ్బంధించారు. వైఎస్సార్సీపీ నాయకులు కూడా రహదారుల దిగ్బంధం చేపట్టారు. కళ్యాణదుర్గంలో జేఏసీ నేతల రిలేదీక్షలకు సంఘీభావం తెలపడానికి ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వెళ్లగా.. ‘గో బ్యాక్’ అంటూ నినదించారు. టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ ఇవ్వడం వల్లనే రాష్ట్ర విభజన జరిగిందని మండిపడ్డారు. తాడిపత్రిలో రాజకీయ జేఏసీ, ఉద్యోగ, కార్మిక, కులసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల ఆధ్వర్యంలో ‘జనఘోష’ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగింది. వాకింగ్ సభ్యులు రోడ్డుపైనే యోగాసనాలతో విన్యాసాలు చేశారు. ధర్మవరంలో జేఏసీ నేతల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. గుంతకల్లులో సమైక్యవాదులు గొడుగులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. గుత్తిలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. పామిడిలో వైఎస్సార్సీపీ నేతలు జాతీయ రహదారిని దిగ్బంధించారు. కదిరిలో అధ్యాపకులు రిలేదీక్షలు ప్రారంభించారు. విద్యుత్ ఉద్యోగులు మానవహారం నిర్మించారు. చెప్పుల షాపుల అసోసియేషన్ ఆధ్వర్యంలో 205 జాతీయ రహదారిలో వంటా వార్పు చేపట్టారు. హిందూపురంలో ర్యాలీలు, నిరసనలు హోరెత్తాయి. మడకశిరలో ఉద్యోగ సంఘాల జేఏసీ దీక్షలు కొనసాగుతున్నాయి. 48 గంటల నిరవధిక బంద్ విజయవంతమైంది. రొళ్లలో యాదవసంఘం నేతలు ర్యాలీ చేశారు. అమరాపురంలో ఉపాధ్యాయులు మొహాలకు నల్లగుడ్డ కట్టుకుని ప్రదర్శన నిర్వహించారు. ఓడీ చెరువులో సమైక్యవాదులు సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను తగులబెట్టారు. అమడగూరులో పొదుపు సంఘాల మహిళలు, గోరంట్లలో నాయీ బాహ్మణులు ర్యాలీ నిర్వహించారు. పెనుకొండలో సమైక్యవాదులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రాయదుర్గంలో ఆర్టీసీ ఎన్ఎంయూ నాయకుడు ఎం.నాగరాజు ఆమరణ దీక్షకు దిగారు. ఆమరణ దీక్ష చేస్తున్న వారికి కాపు భారతి సంఘీభావం ప్రకటించారు. ఆత్మకూరులో ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. గార్లదిన్నెలో వాల్మీకులు, కల్లూరులో నాయీ బ్రాహ్మణులు, తాడిపత్రిలో వైఎస్సార్సీపీ, ఎంఐఎం, బీసీ సంక్షేమ సంఘం, ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. -
ఉద్యోగుల గర్జన
సాక్షి, తిరుపతి: ఉద్యమం మహోద్యమంగా మారుతోంది. రోజుకో కార్యక్రమంతో సమైక్యవాదులు వినూత్న తరహాలో నిరసన తెలియజేస్తున్నారు. చిత్తూరులో మంగళవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు సుమారు 5వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. న్యాయశాఖ ఉద్యోగుల మానవహారం నిర్వహించారు. తిరుపతిలో వెటర్నరీ కళాశాలలో ముగ్గులువేసి నిరసన తెలిపారు. టీటీడీ ఉద్యోగుల రిలేదీక్షలు కొనసాగాయి. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం ముందు శాప్స్ ఆధ్వర్యంలో రోడ్డుపై మాక్ స్కూల్ నిర్వహించారు. పుత్తూరులో ప్రభుత్వ వైద్యులు రోగులకు రోడ్డుపైనే వైద్యసేవలందిస్తూ నిరసన తెలిపారు. ఏపీ ఎన్జీవో, ఆర్టీసీ, అంగన్వాడీ, ఏఎన్ఎం, ఉపాధ్యాయ ఉద్యోగులు రిలేదీక్షలు కొనసాగించారు. వీరికి పలువురు మద్దతు పలికారు. విద్యుత్ శాఖ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మౌనప్రదర్శన నిర్వహించారు. పుత్తూరు బాలికల, ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలల విద్యార్థినులు నిరసన ప్రదర్శన చేశారు. మున్సిపల్ ఉద్యోగులు రాత్రి ఆంధ్రప్రదేశ్ చిత్రపటంలా కాగడాల ప్రదర్శన నిర్వహించారు. పలమనేరులో వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగుల ర్యాలీ నిర్వహించి రిలేదీక్ష చేపట్టారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్వహించి మాక్‌డ్రిల్ చేశారు. న్యాయవాదులు చెవిలో పువ్వులు పెట్టుకుని ర్యాలీ చేశారు. బెరైడ్డిపల్లెలో టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం, వంటావార్పు చేపట్టారు. గంగవర ం మండలం పొనబాకులపల్లె వద్ద డ్వాక్రా మహిళలు రిలేదీక్షలు, వంటావార్పు నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు. కుప్పంలో జేఏసీ ఆధ్వర్యంలో నాయీబ్రాహ్మణులు, ఎద్దులబండి సంఘం, ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో ర్యాలీ, వంటావార్పు నిర్వహించారు. ఉద్యోగ సంఘాలు తహశీల్దార్ కార్యాలయం వద్ద దీక్షలు కొనసాగించారు. రామకుప్పం, గుడిపల్లె, శాంతిపురంలో జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగించారు. జాతీయ పతాకంతో నిరసన బి.కొత్తకోటలో మోకాళ్లపై నిరసన తెలిపారు. ములకలచెరువులో 200 మీటర్లు, పుంగనూరులో 100 మీటర్ల జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. శ్రీకాళహస్తిలో అఖిలపక్షం ఆధ్వర్యంలో విద్యార్థులు నిర్వహించిన భారీ ర్యాలీలో మండలి బుద్దప్రసాద్ పాల్గొన్నారు. పౌరాణిక వేషధారణలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. తెలుగుతల్లి వేషధారణలో విద్యార్థులు, వివిధ సంఘాల ఉద్యోగులు సమైక్య ఉద్యమంలో పాల్గొన్నారు. మదనపల్లెలో కాలనీ అసోసియేషన్ల ఆధ్వర్యంలో సుమారు 4వేల మందితో ర్యాలీ నిర్వహించారు. గ్రానైట్ వారి ఆధ్వర్యంలో ర్యాలీ, సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద రెవెన్యూ ఉద్యోగులు నిరవధిక దీక్ష, బీటీ కళాశాల వద్ద అధ్యాపకులు, సిబ్బంది రిలేదీక్షలు చేస్తున్నారు. యాదవ, కురవ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి వంటావార్పు చేశారు. ట్రాన్స్‌కో ఉద్యోగులు చేపట్టిన రిలేదీక్షలు కొనసాగాయి. క్రైస్తవ ఐక్యసంఘం ఆధ్వర్యంలో రిలేదీక్షలకు కూర్చున్నారు. పీలేరులో టీటీడీ బోర్డు సభ్యుడు జీవీ శ్రీనాథరెడ్డి 48 గంటల నిరాహారదీక్షకు కూర్చున్నారు. ఎంజేఆర్ ఇంజనీరింగ్, వివిధ ప్రైవేటు కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. జేఏసీ ఆధ్వర్యంలో సాయంత్రం దాకా వీధినాటకం, రాత్రి ఆర్కేస్ట్రా నిర్వహించి నిరసన తెలిపారు. సత్యవేడులో ఉపాధ్యాయులు భారీ మోటార్‌బైక్ ర్యాలీ నిర్వహించారు. చంద్రగిరిలో ఆటో డ్రైవర్లు రోడ్డుపై కబడ్డీ ఆడి రిలేదీక్షలు చేశారు. పెరుమాళ్లపల్లె బాలాజీ చిల్డ్రన్స్ అకాడమి విద్యార్థులు శ్రీకృష్ణుని వేషధారణలో ‘జె సమైక్యాంధ్ర’ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. పుంగనూరులో వీరసేవ లింగాయతుల ఆధర్యంలో భారీ ర్యాలీ, రుద్రహోమం చేపట్టారు. జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ, రిలే దీక్షలు చేశారు. -
జగన్‌ది కుట్రపూరిత దీక్ష
సాక్షి, హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి కుట్ర, కుతంత్రాలతో చంచల్‌గూడ జైల్లో నిరాహార దీక్ష చేస్తున్నారని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ నేతలు ఆరోపించారు. అందువల్ల జగన్‌ను వేరే ప్రాంత జైలుకు తరలించాల్సిందిగా జైళ్లశాఖ ఐజీ సునీల్‌కుమార్‌ను కలిసి వినతి పత్రం అందించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర నిర్ణయాన్ని అడ్డుకునేందుకు, హైదరాబాద్ తెలంగాణ ప్రజలకు దక్కకుండా చేయడానికే జగన్ దీక్షకు దిగారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర అంశంపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని గతంలో ప్రకటించి ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని చంచల్‌గూడలో జగన్ నిరాహార దీక్ష చేయడంవల్ల ఆయన ఆరోగ్యంపై అపోహలు తలెత్తే అవకాశం ఉంటుందని, దీంతో రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు ప్రజలు తరలివస్తారని అనుమానం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లో అంతర్గతంగా ఇప్పటికే కొన్ని ఘర్షణలున్నాయని, జగన్ దీక్ష కారణంగా సమస్యలు మరింత జటిలం అవుతాయని చెప్పారు. జైళ్లశాఖ అధికారులు స్పందించకుంటే హైకోర్టు పిల్ వేస్తామన్నారు. మరో జైలుకు మార్చండి : తెలంగాణ అడ్వకేట్ జేఏసీ జగన్‌ను రాష్ట్రంలోని మరో జైలుకు మార్చాలని కోరుతూ తెలంగాణ న్యాయవాదుల జేఏసీ సీబీఐ ప్రత్యేక కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జేఏసీ ప్రతినిధులు శ్రీరంగారావు, తిరుపతివర్మలు ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావుకు వినతిపత్రం సమర్పించారు. -
తెలుగు వారి ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు
పీలేరు, న్యూస్‌లైన్: పదవుల కోసం పాకులాడుతున్న సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని పీలేరు జేఏసీ నేతలు ధ్వజమెత్తారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా శనివారం పీలేరు అంబేద్కర్ సర్కిల్ నుంచి సమైక్యాంధ్ర ఉద్యమంలో మేము సైతమంటూ వికలాంగులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హైవే కూడలి అయిన క్రాస్ రోడ్డులో పలువురు జేఏసీ నేతలు ఉద్యమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంపై కనీస అవగాహన లేని సోనియాగాంధీ తన రాజకీయ స్వలాభం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. ఈ ప్రాంతం ఆరు కోట్ల సీమాంధ్రుల జీవితాలతో చెలగాటమాడితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేస్తే సీమాంధ్రలో పనిచేస్తున్న ఉద్యోగులకు నెల జీతం కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తంచేశారు. పూర్తి స్థాయిలో వ్యవసాయ రంగం కుంటుపడుతుందని, తద్వారా లక్షలాది మంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే మరో పదేళ్ల పాటు సీమాంధ్రలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ పూర్తిగా స్తంభించిపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుతం ఎంబీఏ, ఎంసీఏ, ఇంజనీరింగ్, ఇతర ఉన్నత చదువులు చదువుతున్న నిరుద్యోగ యువతీ యువకుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రామికంగా ఎంతో పురోభివృద్ధి సాధించిన హైదరాబాద్‌ను వదులుకుంటే ఈ ప్రాంత నిరుద్యోగుల జీవితాలు అంధకారంగా మారుతాయన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. ఆందోళన కార్యక్రమంలో జేఏసీ నాయకుల తోపాటు ఆదర్శ వికలాంగుల సంక్షేమ సంఘం, ఆటో యూనియన్ నేతలు, ఆర్టీసీ కార్మికులు, వివిధ కుల సంఘాలు, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, పీలేరు సర్పంచ్ ఏఎస్. హుమయూన్, మహిళా సంఘాలు, వ్యాపారులు, విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. -
ఉద్యమ స్ఫూర్తి
సాక్షి, కర్నూలు: వర్షంలోనూ సమైక్య నినాదాలు హోరెత్తాయి. సమైక్యవాదులు స్వాతంత్య్ర సంబరాల్లో పాల్పంచుకుంటూనే.. ఉద్యమంలోనూ భాగస్వాములయ్యారు. రాష్ట్ర విభజనపై ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఉద్యోగులు.. విద్యార్థులు.. అన్ని వర్గాల ప్రజలు ఉద్యమాన్ని ఉరకలెత్తిస్తున్నారు. రహదారులను దిగ్బంధిస్తూ.. వంటావార్పు చేపడుతూ కలిసి రాని ప్రజాప్రతినిధుల తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరు కాకపోవడంతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. కర్నూలు నగరంలో సమైక్యాంధ్రకు మద్దతుగా న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు గురువారం కూడా కొనసాగాయి. ఆదోనిలో ఉద్యోగులు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటూనే.. ఉద్యమ ఆందోళనలను చేపట్టారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షా శిబిరం వద్ద జేఏసీ నాయకులు మువ్వన్నెల జెండా.. ఆ తర్వాత సమైక్యాంద్ర జెండా ఎగురవేశారు. జాతీయ గీతాలాపన పూర్వయ్యాక సమైక్యాంద్ర జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. విద్యార్థి సంఘాల జేఏసీ ఆద్వర్యంలో విద్యార్థులు పట్టణంలో పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించి సోనియా, కేసీఆర్ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. ఆళ్లగడ్డ పట్టణంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయి. ఆలూరు మండల కేంద్రంలో రాష్ట్రాన్ని సమైక్యాంగానే ఉంచాలని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు రిలే నిరాహారదీక్ష చేపట్టగా మాజీ సైనికోద్యోగులు మద్దతు పలికారు. ఆత్మకూరులో జ్యువెలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. వైఎస్ఆర్సీపీ శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, జేఏసీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. వెలుగోడులోని పొట్టిశ్రీరాములు సెంటర్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సమైక్యాంధ్రకు మద్దతుగా రాస్తారోకో నిర్వహించారు. పట్టణ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. బనగానపల్లెలో రజక సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష, ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో మోటర్‌బైక్‌ల ర్యాలీ చేపట్టారు. పత్తికొండలో జేఏసీ ఆధ్వర్యంలో ఏపీఎస్ఆర్టిసీ కార్మికులు, క్రీడాకారులు ఆర్అండ్బీ అతిథిగృహం నుంచి అంబేద్కర్ సర్కిల్ మీదగా నాలుగు స్తంభాల వరకు ర్యాలీ నిర్వహించారు. తుగ్గలి మండల పరిధిలోని జొన్నగిరి గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు జేఏసీకి మద్దతుగా 10 మంది దీక్ష చెపట్టారు. గాంధీ వేషధారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దేవనకొండలో జేఏసీ ఉద్యమాలకు మద్దతుగా ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు మౌన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మానవహారంగా ఏర్పడి రెండు గంటల పాటు రాస్తారోకో చేశారు. ఎమ్మిగనూరులో ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పట్టణంలో ర్యాలీ చేపట్టారు. విభజనను నిరసిస్తూ ఎల్ఐసీ ఏజెంట్లు వర్షంలోనూ కార్యాలయం నుండి శివ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు తొమ్మిదవ రోజుకు చేరుకున్నాయి. సి.బెళగల్లో వస్త్ర దుకాణం, టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. గూడూరులో తాపీ వర్కర్లు సమైక్యాంధ్రకు మద్దతుగా జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. కోడుమూరులోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి జూనియర్ కళాశాల లెక్చరర్లు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. -
జేఏసీ నేతలతో 'వట్టి' మాటలు
కేంద్రంలోని పెద్దలతో చర్చించిన తర్వాత రాజీనామా నిర్ణయాన్ని ప్రకటిస్తానని రాష్ట్ర మంతి వట్టి వసంత కుమార్ స్పష్టం చేశారు. గురువారం ఏలూరులో ఆయన జేఏసీ నేతలతో సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పదవికి రాజీనామా చేయాలని జేఏసీ నేతలు వట్టిని డిమాండ్ చేశారు. దాంతో మంత్రి వట్టి వసంత కుమార్‌పై విధంగా స్పందించారు. పశ్చిమగోదావరి జిల్లాలో సమైకాంధ్ర ఉద్యమం రోజురోజూకు ఉగ్రరూపం దాలుస్తుంది. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజాప్రతినిధుల వ్యవహారశైలిని ఎండగడుతూ సమైక్యవాదులు నిరసన తెలిపారు. అందులోభాగంగా కేంద్రమంత్రులు మాస్క్‌లతో మాక్ కోర్టును నిర్వహించారు. పోలీస్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న స్వాతంత్ర్య వేడుకలను ఏలూరు నగరంలోని పలు విద్యాసంస్థలు బహిష్కరించాయి. ప్రైవేట్, మేనేజ్మెంట్ స్కూల్ యాజమాన్యాలు చేపట్టిన రిలేదీక్షలు గురువారం 13వ రోజుకు చేరుకున్నాయి. అయితే ఈ నెల 20 నుంచి స్థానిక ఎమ్మెల్యే ఆళ్లనాని ఆమరణ దీక్ష చేయనున్నారు. -
ఆగని జోరు
సాక్షి, కడప: సమైక్యాంధ్ర సాధన కోసం ఉద్యమం చేపట్టిన జిల్లా ప్రజానీకం లక్ష్యసాధన కోసం అలుపెరగకుండా పోరాడుతోంది. శుక్రవారంతో ఉద్యమం పదోరోజుకు చేరింది. ఓ వైపు రంజాన్ పర్వదినం, మరో వైపు తొలి శ్రావణ శుక్రవారం అయినప్పటికీ ఆందోళన కార్యక్రమాలను మాత్రం ఆపలేదు. శుక్రవారం ప్రజలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా కడప నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా జేఏసీ నేతలు బంద్ సడలించారు. దీంతో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. శుక్రవారం 50 శాతం సర్వీసులు నడిచాయి. దీంతో దూరప్రాంత ప్రయాణీకులకు కాస్త ఊరట లభించింది. కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షుడు నిత్యానందరెడ్డి చేస్తున్న ఆమరణనిరాహారదీక్ష ఐదోరోజుకు చేరింది. దీక్షా శిబిరాన్ని జేఏసీ నేతలు సీహెచ్ చంద్రశేఖరరెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డి, వైసీపీ నేత దుగ్గాయపల్లి మల్లికార్జునరెడ్డి, ఉత్తమ్‌రెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. రాష్ట్ర విభజన ప్రకటన వెనక్కి తీసుకునే వరకూ ఉద్యమాన్ని కొనసాగించాలని సీహెచ్ పిలుపునిచ్చారు. న్యాయవాదులు, ఉపాధ్యాయుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఉపాధ్యాయులు సమైక్యాంధ్ర పాటలు పాడి నిరసన తెలిపారు. ‘1942 ఆగష్టు 9 బ్రిటీష్- క్విట్ ఇండియా ఉద్యమం...2013 ఆగష్టు 9 ఇటాలియన్- క్విట్ ఇండియా ఉద్యమం’ అనే స్లోగన్‌తో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆకట్టుకున్నాయి. రిమ్స్‌లో వైద్యులు, జూడాలు, వైద్యసిబ్బంది చేస్తున్న రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ప్రైవేటు వైద్యులు కూడా కలెక్టరేట్ వద్దకు వచ్చి సంఘీభావంగా దీక్షలో పాల్గొన్నారు. సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన, ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి కాంగ్రెస్‌పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలకతీతంగా ఉద్యమంలో పాల్గొనేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రొద్దుటూరులో వివేకానందక్లాత్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పుట్టపర్తి సర్కిల్లో బైఠాయించి సమైక్య నినాదాలు చేశారు. సీఎం కిరణ్, బొత్స, కేసీఆర్ పోస్టర్లను చెప్పులతో కొడుతూ ఆందోళన చేపట్టారు. డప్పులు, డ్రమ్ములతో శివాలయం వీధిని హోరెత్తించారు. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రభుత్వ పాఠశాలల ఆధ్వర్యంలో సాగిస్తున్న రిలేదీక్షలలో రాజుపాళెం మండలానికి చెందిన 20మంది ఉపాధ్యాయులు కూర్చున్నారు. వీరికి సంఘీభావంగా 10మంది మార్కెట్‌యార్డు సిబ్బంది కూడా దీక్ష చేపట్టారు. న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. దీక్షలు కొనసాగిస్తున్నారు. పులివెందులలో బలిజసంఘం, జర్నలిస్టుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాయలం ఎదుట రిలేదీక్షలకు కూర్చున్నారు. దీక్షాశిబిరాన్ని 20 సూత్రాల కమిటీ చైర్మన్ తులసిరెడ్డి, రాంగోపాల్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నేత దేవిరెడ్డి శంకర్‌రెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. చిన్నపిల్లలు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. భరతమాతతో పాటు పలు వేషధారణలు వేసి నిరసన తెలిపారు. రాయచోటిలో జేఏసీ రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షాశిబిరాన్ని ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమర్నాథరెడ్డి సందర్శించారు. న్యాయవాదుల దీక్షలు ఐదోరోజుకు చేరాయి. ఆర్టీసీ కార్మికుల దీక్ష కూడా కొనసాగుతోంది. జమ్మలమడుగులో సమతాదళిత సంఘం ఆధ్వర్యంలో 12మంది రిలేదీక్షలకు కూర్చున్నారు. ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు, నోటికి నల్లరిబ్బన్ ధరించి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఆర్టీపీపీ ఉద్యోగులు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేపట్టారు. కోడూరులో విద్యార్థులు రిలేదీక్షలకు కూర్చున్నారు. ఉపాధ్యాయల జేఏసీ దీక్షలు నాలుగోరోజుకు చేరాయి. రైల్వేకోడూరులో రంజాన్ పండుగ ఉన్నా ముస్లీంలు భారీ ర్యాలీ నిర్వహించి సమైక్యవాణి వినిపించారు. -
విభజనతో అన్నీ సమస్యలే
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన వల్ల రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలకు జరగనున్న అన్యాయాలను వివరిస్తూ శుక్రవారం ఉపాధ్యాయ జేఏసీ నాయకులు సమగ్ర నోటును విడుదల చేశారు. విద్య, ఉద్యోగ, విద్యుత్, సాగునీరు, ఆస్తులు, ఆదాయాలు వంటి అంశాల్లో సీమాంధ్ర ఎలా నష్టపోనుందో అందులో వివరించారు. తెలంగాణా ఆస్తులు, ఆదాయాలు పొందడం ద్వారా ఎలా లబ్ధి పొందనున్నదో అందులో పేర్కొన్నారు. స్టేట్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర కౌన్సిలర్ పి.సుదర్శన్‌రెడ్డి ఈ నోటును రూపొందించారు. ఇందులోని వివరాలను పరిశీలిస్తే... రాష్ట్ర జనాభా 8.46కోట్లు ఉండగా, అందులో 60శాతం రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతంలోనూ, 40శాతం తెలంగాణాలో ఉన్నారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రవాణా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, గనులు, అటవీ, ల్యాండ్ రెవెన్యూ ద్వారా మొత్తం 69146.5 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరింది. ఇందులో ఆంధ్ర ప్రాంతం నుంచి 24శాతం, రాయలసీమ నుంచి 6శాతం, తెలంగాణా నుంచి 20శాతం ఉండగా, కేవలం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి 50శాతం ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. 2013-14 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ చివరి నాటికిలెక్కలు తీస్తే రాష్ట్ర మొత్తం అప్పు 1.79లక్షల కోట్ల రూపాయలు ఉంది. ఇందులో సీమాంధ్ర అప్పు 1.05లక్షల కోట్లు కాగా, తెలంగాణా అప్పు 74వేల కోట్ల రూపాయలు మాత్రమే. అంటే రాష్ట్ర ఆదాయం 70వేల కోట్ల రూపాయలు ఉండగా అప్పు 1.79లక్షల కోట్ల రూపాయలు ఉంది. హైదరాబాద్‌తో కలిపి తెలంగాణా వాటాగా వచ్చే ఆదాయం 49వేల కోట్ల రూపాయలు కాగా, అప్పు 74వేల కోట్ల రూపాయలు, ఇక సీమాంధ్ర ఆదాయం 21వేల కోట్ల రూపాయలు కాగా, అప్పు లక్షా 5 కోట్ల రూపాయలు. తెలంగాణాకు ఆస్తిలో అప్పు 34శాతం కాగా, సీమాంధ్రకు ఆస్తిలో అప్పు 80శాతంగా ఉంది. అంటే సీమాంధ్రలో ఒక్కొక్కరి తలమీద 21,212 రూపాయలు అప్పు ఉన్నట్లు తెలుస్తోంది. మద్రాసు, నైజాంల నుంచి విడివడి ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగాక కేంద్రానికి పడ్డ అప్పును చెల్లించడానికి 1975వ సంవత్సరం వరకు పట్టింది. ఇప్పటి పరిస్థితుల్లో సీమాంధ్రులు తమ అప్పులు తీర్చాలంటే కనీసం వంద సంవత్సరాలు పట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, మానవ సంక్షోభాలు సంభవిస్తే మూడు తరాల్లో కూడా అప్పు తీరే అవకాశం ఉండదు. విద్యాపరంగా చూస్తే ఆర్టికల్ 371-డి ద్వారా తెలంగాణా ప్రాంత పరిధిలోని చాలా ప్రాంతాలు హైదరాబాద్ కిందికి వస్తున్నాయి. దీంతో అక్కడి విద్యార్థులు ప్రభుత్వ విద్యాసంస్థల ద్వారా విద్య అందడం వల్ల ఆర్థిక వెసలుబాటుకు వీలుంటుంది. కానీ సీమాంధ్రలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఎయిడెడ్ విధానం వల్ల ఇక్కడి విద్యార్థులు ఆర్థిక భారాన్ని మోయాల్సివుంటుంది. ఉద్యోగ విషయానికొస్తే జోనల్ నియామకాలు చేపట్టారు. 610 జీఓ ద్వారా తెలంగాణా ప్రాంతంలో ఉద్యోగాల్లో ఏర్పడిన అసమానతలను తొలగించారు. విద్య,ఉద్యోగ పరంగా ఏవైనా సమస్యలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి అవకాశముంటుంది. రాష్ట్రంలో అన్ని రకాల బ్యాంకులు 9,640 ఉన్నాయి. ఎస్బీహెచ్, ఆంధ్రా బ్యాంక్ జాతీయ ప్రధాన కార్యాలయాలతోపాటు రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం కూడా హైదరాబాద్‌లోనే ఉంది. కానీ సీమాంధ్రలో మాత్రం ఒక్క జాతీయ బ్యాంక్ కార్యాలయం కూడా లేదు. జెన్కో ఆస్తులు సీమాంధ్రలో 6,800కోట్ల రూపాయలు (35శాతం) ఉండగా తెలంగాణా ప్రాంతంలో 12,500 కోట్లు (65శాతం) ఉన్నాయి. అప్పు సీమాంధ్రలో 4,538 కోట్ల రూపాయలు (40శాతం) ఉండగా, తెలంగాణాలో 6,800 కోట్లు (60శాతం) ఉన్నాయి. జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టుల కోసం తెలంగాణాలో 99,871 కోట్ల రూపాయలకు అనుమతులు మంజూరు చేయగా, 2013 మార్చి వరకు ఖర్చు చేసిన వ్యయం 34,253 కోట్ల రూపాయలు, కోస్తాంధ్రలో 44,600కోట్ల రూపాయలు కేటాయించగా ఖర్చుచేసింది 19,098 కోట్ల రూపాయలు. రాయలసీమలో 24,688 కోట్ల రూపాయలకు అనుమతి ఇవ్వగా ఖర్చు చేసింది రూ.18,002కోట్లు 60శాతం జనాభా ఉన్న సీమాంధ్రలో ప్రాజెక్టుల కోసం కేటాయించింది 40శాతం కాగా, 40శాతం జనాభా ఉన్న తెలంగాణాలో 60శాతం కేటాయింపులు జరగడం గమనార్హం. తొమ్మిది జిల్లాలు కలిగిన తెలంగాణాలో 16 ఎత్తిపోతల పథకాలు ఉండగా, 13 జిల్లాలతో కూడిన సీమాంధ్రలో 15 మాత్రమే ఉన్నాయి. ఇక వందశాతం ఐటీ పరిశ్రమ హైదరాబాద్‌లోనే ఉంది. ఇలా ఏ అంశాన్ని పరిశీలించినా సీమాంధ్ర కంటే తెలంగాణా ఎంతో ముందంజలో ఉంది. తాము వెనుకబడ్డామంటూ ఆ ప్రాంత నాయకులు చేస్తున్న వాదనల్లో నిజం లేదని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి. -
మంత్రుల వైఖరి స్పష్టం చేయాలి
నంద్యాల, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన విషయంలో జిల్లాకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రుల తీరు ప్రజలను అయోమయానికి గురి చేస్తోందని.. ఇప్పటికైనా వారు తమ వైఖరి స్పష్టం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి అన్నారు. పట్టణంలోని చెరుకు ఫ్యాక్టరీ ఆవరణలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర సహాయ మంత్రి కోట్ల, రాష్ట్ర మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డిలు తలో వాదం వినిపిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. రాయలసీమ హక్కుల పరిరక్షణ సమితి నాయకుడినని చెప్పుకుంటున్న టీజీ కొద్దిసేపు గ్రేటర్ రాయలసీమ, ఆ తర్వాత రాయల తెలంగాణ, మరోసారి మహబూబ్‌నగర్‌తో కూడిన రాయలసీమ అంటూ విభిన్న ప్రతిపాదనలతో సమైక్యవాదుల మనోభావాలను దెబ్బతియడం తగదన్నారు. కోట్ల విషయానికొస్తే తన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని సోనియా ఇంటి ముందు తాకట్టు పెట్టారని విమర్శించారు. ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టే బదులు పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తే ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారన్నారు. అంతేతప్ప నీచ రాజకీయాలకు పాల్పడితే ఎన్నటికీ క్షమించరని గుర్తుంచుకోవాలన్నారు. కేంద్ర మంత్రి చిరంజీవి రాష్ట్ర విభజనకు సానుకూలంగా స్పందించి సీమాంధ్ర ప్రజల మనోభావాలపై దెబ్బ కొట్టాడన్నారు. వెన్నుపోటు రాజకీయాలతో సీల్డ్‌కవర్ పదవులు పొందేకన్నా.. ప్రజాభిమానంతో ఏ చిన్న పదవిలో కొనసాగినా గౌరవప్రదంగా ఉంటుందన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు మౌనంగా ఉండటం ద్వారా రెండు ప్రాంతాల్లో లబ్ధి పొందాలనే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోందని.. అయితే ఆయన రాజకీయ భవిష్యత్తు రెంటికీ చెడ్డ రేవడిలా తయారు కాక తప్పదన్నారు. సీమాంధ్రలో చాలా మంది ఎమ్మెల్యేలకు తమ రాజీనామాలను స్పీకర్ ఫార్మెట్లో పంపాలని తెలియకపోవడం శోచనీయమన్నారు. వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులంతా స్పీకర్ ఫార్మెట్లో రాజీనామాలు చేసి ప్రజల్లో ధైర్యంగా తలెత్తుకు తిరుగుతున్న విషయాన్ని గమనించాలని కాంగ్రెస్, టీడీపీ నాయకులకు సూచించారు. జేఏసీ నేతలు స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా చేయని నాయకుల మెడలు వంచాలని భూమా కోరారు. -
7న జిల్లా బంద్
కడప రూరల్, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర సాధన కోసం చేపడుతున్న ఉద్యమాలలో భాగంగా ఈ నెల 7వ తేదీన జిల్లా బంద్ చేపడుతున్నట్లు జేఏసీ నాయకులు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్.రామచంద్రారెడ్డి, ఎస్.గోవర్థన్‌రెడ్డి, నిత్యానందరెడ్డి,ఎస్.రమణయ్య తెలిపారు. ఆదివారం కడప నగరంలో జరిగిన సమావేశంలో ఉద్యమ కార్యాచ రణను వెల్లడించారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, వంటావార్పు కార్యక్రమాలు ఉంటాయన్నారు. 6వ తేదీన మహిళలతో ర్యాలీలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమాలలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జేఏసీ నాయకులు హరిప్రసాద్, రవిశంకర్‌రెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, అమర్నాధ్రెడ్డి, ఇలియాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేస్తాం:గంటా