విజయవాడ(గుణదల) : కాపుల అభ్యున్నతికి దీక్ష చేపట్టిన కాపు ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభంను రాధారంగా మిత్ర మండలి, విజయవాడ కాపు జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు బుధవారం కిర్లంపూడిలోని ఆయన ఇంటిలో కలిశారు. నగరం నుంచి సుమారు 200 మంది కాపు నాయకులు అక్కడికి వెళ్లి ఆయన ఉద్యమానికి మద్దతు పలికారు. కాపు రిజర్వేషన్ పొందే వరకు పోరాటం సాగాలని, దీనికి పూర్తిస్థాయిలో తమ మద్దతు ఉంటుందని ముడ్రగడకు హామీ ఇచ్చారు.
ముద్రగడను కలిసిన వారిలో కాపు జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ కొప్పుల వెంకట్, రాధారంగా మిత్రమండలి రాష్ర్ట అధ్యక్షుడు చె న్నుపాటి శ్రీనివాస్, కాపు నాయకులు మల్లెమూడి పిచ్చయ్యనాయుడు, అడపా నాగేంద్ర, నరహరిశెట్టి నరసింహారావు, ఆళ్ల చెల్లారావు, చింతల ఆనంద్, రవి కుమార్, విక్రం, నాగు, రాజనాల బాబ్జి, అల్లంపూర్ణ, రామాయణపు శ్రీనివాస్, తిరుమలశెట్టి ఉదయ్, అక్కల గాంధీ, బాడిత శంకర్, ఎన్ గాంధీ, ఎన్ సాంబశివరావు, అడ్వకేట్ ఏడుకొండలు, ఎస్టీ నాయకులు మేడ రమేష్, బీసీ నాయకులు బోను చిన్న శ్రీరాములు, బ్రాహ్మణ సంఘం నాయకులు అరుణ్‌కుమార్, ఎం.వివేక్ తదితరులు ఉన్నారు.
ముద్రగడను కలిసిన కాపు జేఏసీ నాయకులు
Published Thu, Jul 7 2016 12:53 AM | Last Updated on Mon, Sep 4 2017 4:16 AM
Advertisement
Advertisement