బీసీ-ఎఫ్‌కు దరఖాస్తు చేసుకోండి: ముద్రగడ | Mudragada Padmanabham Urges Kapus To Get BC F Certificates | Sakshi
Sakshi News home page

బీసీ-ఎఫ్‌కు దరఖాస్తు చేసుకోండి

Published Fri, Mar 23 2018 4:52 PM | Last Updated on Fri, Mar 23 2018 6:45 PM

Mudragada Padmanabham Urges Kapus To Get BC F Certificates - Sakshi

కాపు రిజర్వేషన్‌ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన వారందరూ బీసీ-ఎఫ్‌ సర్టిఫికేట్లకు దరఖాస్తు చేసుకోవాలని ముద్రగడ పద్మనాభం బుధవారం కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో, బయట సభల్లో కాపులను బీసీ-ఎఫ్‌ కేటగిరీ కింద చేర్చినట్లు చెబుతున్నారని అన్నారు. ఈ మేరకు కాపులను ఉద్దేశించి ఓ ప్రకటన విడుదల చేశారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల వారు తహసీల్దారు కార్యాలయాలకు వెళ్లి బీసీ-ఎఫ్‌ కుల ధ్రువీకరణ పత్రానికి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement