ముద్రగడ ఇంటిపై జరిగిన దాడిపై ప్రభుత్వం స్పందించాలి | The government must respond to the incident on the Mudragada house | Sakshi
Sakshi News home page

ముద్రగడ ఇంటిపై జరిగిన దాడిపై ప్రభుత్వం స్పందించాలి

Published Thu, Feb 6 2025 5:50 AM | Last Updated on Thu, Feb 6 2025 5:50 AM

The government must respond to the incident on the Mudragada house

వైఎస్సార్‌సీపీ నేతలు, మాజీ మంత్రుల డిమాండ్‌ 

కిర్లంపూడి: మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటిపై జనసేన కార్యకర్త చేసిన దాడికి సంబంధించి ప్రభు­త్వం తక్షణమే స్పందించాలని పలువురు నేతలు డిమాండ్‌ చేశా­రు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్సీ తోట త్రిమూ ర్తులు, గుంటూరు మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు, మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేశ్, దూలం నాగేశ్వరరావు, మిర్చి యా­ర్డ్‌ మాజీ చైర్మన్‌ నిమ్మకాయల రాజనారాయణ తది­త­రులు బుధవారం కాకినాడ జిల్లా, కిర్లంపూడి­లోని ముద్రగడ నివాసానికి చేరుకున్నారు.

ఆయ­న­కు, పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి ముద్రగడ గిరి బాబుకు సంఘీభావం తెలిపారు.  వారు విలేకర్లతో మాట్లాడుతూ, ముద్రగడ ఇంటి మీదకు ఒక వ్యక్తి అర్ధరాత్రి వచ్చి పార్టీ కార్యకర్తను అంటూ బీభత్సం సృష్టించడాన్ని తీవ్రంగా ఖండించారు. కాపు ఉద్య­మాన్ని నడిపి, అనేక ఒడిదుడుకులు ఎదు­ర్కొన్న ముద్రగడపై జరి­గింది చిన్న దాడి అని అనుకోవడం లేద­న్నా­రు. 70 ఏళ్ల పైబడిన ఆయన అనేక అవమానాలు తట్టుకుని నిలబడ్డారని, ఆయన ఇంటిపై జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. 

ఇలాంటి అరాచక ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ మౌనవ్రతం వీడి ఖండించాలని డిమాండ్‌ చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తి గంజాయి తాగాడా.. మత్తు పదార్థాలు తీసుకున్నాడా అనేది తర్వాత విషయమన్నారు. తాను జనసేన మనిషేనని, ఆ పార్టీ జెండా మోశానని చెప్పిన వ్యక్తి అర్ధరాత్రి ముద్రగడ ఇంటి పైకి వచ్చి రచ్చ చేయడమే కాకుండా.. మళ్లీ ఉదయం వచ్చి ఇదంతా తానే చేశానని చెప్పడాన్ని చూస్తే.. కూటమి ప్రభుత్వ పాలనలో లా అండ్‌ ఆర్డర్‌ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునన్నారు.  

నిందితుడి ఫోన్‌ డేటా ఇప్పటి వరకూ ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు.  చంద్రబాబు, పవన్‌  బాధ్యత తీసుకుని వివరణ ఇవ్వాలన్నారు.  దాడులపై విచారణ జరిపేలా పోలీసులను ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement