కేంద్రంలోని పెద్దలతో చర్చించిన తర్వాత రాజీనామా నిర్ణయాన్ని ప్రకటిస్తానని రాష్ట్ర మంతి వట్టి వసంత కుమార్ స్పష్టం చేశారు. గురువారం ఏలూరులో ఆయన జేఏసీ నేతలతో సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పదవికి రాజీనామా చేయాలని జేఏసీ నేతలు వట్టిని డిమాండ్ చేశారు. దాంతో మంత్రి వట్టి వసంత కుమార్పై విధంగా స్పందించారు. పశ్చిమగోదావరి జిల్లాలో సమైకాంధ్ర ఉద్యమం రోజురోజూకు ఉగ్రరూపం దాలుస్తుంది.
రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజాప్రతినిధుల వ్యవహారశైలిని ఎండగడుతూ సమైక్యవాదులు నిరసన తెలిపారు. అందులోభాగంగా కేంద్రమంత్రులు మాస్క్లతో మాక్ కోర్టును నిర్వహించారు. పోలీస్ గ్రౌండ్స్లో జరుగుతున్న స్వాతంత్ర్య వేడుకలను ఏలూరు నగరంలోని పలు విద్యాసంస్థలు బహిష్కరించాయి. ప్రైవేట్, మేనేజ్‌మెంట్ స్కూల్ యాజమాన్యాలు చేపట్టిన రిలేదీక్షలు గురువారం 13వ రోజుకు చేరుకున్నాయి. అయితే ఈ నెల 20 నుంచి స్థానిక ఎమ్మెల్యే ఆళ్లనాని ఆమరణ దీక్ష చేయనున్నారు.
జేఏసీ నేతలతో 'వట్టి' మాటలు
Published Thu, Aug 15 2013 2:26 PM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM
Advertisement
Advertisement