vatti vasanth kumar
-
‘వట్టి వసంతకుమార్ నాకు మంచి మిత్రుడు’
ఏలూరు: మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ అకాల మరణం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్. వట్టి వసంత కుమార్ మరణ వార్త తెలుసుకున్న అనంతరం పూళ్ల గ్రామానికి వెళ్లిన సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘ వట్టి వసంతకుమార్ నాకు మంచి మిత్రుడు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. దివంగత మహానేత వైఎస్సార్‌తో అత్యంత సన్నిహిత ఉన్న వ్యక్తి వట్టి వసంత కుమార్. వితౌట్ అపాయింట్ లేకుండా వైఎస్సార్‌ను కలిసే వ్యక్తుల్లో ఉండవల్లి తరువాత వట్టి వసంత కుమార్ ఒకరు. రాజకీయంలో నా ఎదుగుదలకు ఎంతో సహకరించారు వట్టి వసంత కుమార్’ అని తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నిజాయితీ, నిబద్ధత కలిగిన వ్యక్తి వట్టి వసంత కుమార్ వట్టి వసంత కుమార్ మరణం రాష్ట్రానికి తీరని లోటన్నారు మాజీ మంత్రి రఘువీరారెడ్డి. నిజాయితీ నిబద్ధత కలిగిన వ్యక్తి వట్టి వసంత కుమార్ అని, నాకు అన్నతో సమానమని, నవ్వుతూ నవ్విస్తూ ఉండేవారన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రంగం అభివృద్ధికి వట్టి ఎంతో కృషి చేశారన్నారు. ఆక్వా రంగంలో ట్యాక్స్ మినహాయింపునకు వసంత కుమార్ చేసిన కృషి మరవలేనిదన్నారు రఘువీరా. ఉభయ గోదావరి జిల్లాలో మంచి నాయకుడు వట్టి వసంత కుమార్ వైఎస్సార్‌కు మంచి స్నేహితుడు వట్టి వసంత కుమార్ అని మంత్రి దాడిశెటట్టి రాజా పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో మంచి నాయకుడు వట్టి వసంత కుమార్ అని, ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నానని దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో వసంతకుమార్ అంత్యక్రియలు ఏలూరు ఎంఎం పురంలో వట్టి వసంతకుమార్ అంతిమ యాత్రలో మంత్రి దాడిశెట్టి రాజా, ఎంపీ సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే వాసుబాబు, కాంగ్రెస్ నేతలు, సినీ నిర్మాత అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో వట్టి వసంతకుమార్ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ కన్నుమూత -
వట్టి వసంతకుమార్ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
తాడేపల్లి: మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వసంత్ కుమార్ ఆదివారం తెల్లవారు జామున వైజాగ్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పూళ్ళ గ్రామం. ఆది నుంచి వసంత్‌కుమార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. 2004, 2009లో ఉంగుటూరు నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో వైఎస్ కేబినెట్లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత రోశయ్య కేబినెట్లోనూ అదే శాఖా మంత్రిగా పని చేశారు. ఇక కిరణ్‌కుమార్ రెడ్డి కేబినెట్లో పర్యాటక శాఖ మంత్రి విధులు నిర్వర్తించారు. 2018లో టీడీపీ-కాంగ్రెస్ కలయిక తర్వాత ఆయన పార్టీకి దూరమయ్యారు. 2014 నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న వసంత్‌కుమార్ విశాఖలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. చదవండి: లోకేష్ యాత్రలో టీడీపీ కార్యకర్తల షాక్ -
తుపాకీతో బెదిరింపులకు దిగిన వట్టి
తనకు సంబంధం లేని భూ వివాదంలో తలదూర్చడమే కాకుండా.. తుపాకీతో బెదిరింపులకు పాల్పడిన మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ కేసులో ఇరుక్కున్నారు. దీనిపై దర్యాప్తు ముమ్మరం చేస్తున్నామని డీసీపీ–1 రంగారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. శివకుమార్ అనే వ్యక్తి సాగర్‌నగర్‌లోని తన స్థలంలో కూలీలను పెట్టి క్లీన్ చేయిస్తుండగా.. కొణతాల రామ్మోహన్ అనే వ్యక్తి వచ్చి అది తన స్థలమని బెదిరించి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకొని అక్కడికి వచ్చిన శివకుమార్‌తోపాటు కూలీలను పక్కనే ఉంటున్న మాజీమంత్రి వట్టి వసంత్‌కుమార్ వచ్చి అడ్డుకున్నారు. ఆ స్థలం తన స్నేహితుడిదని, అందులోంచి వెళ్లకపోతే కాల్చేస్తానని తుపాకీ బెదిరించారు. దీనిపై శివకుమార్ ఫిర్యాదు చేయడంతో డీసీపీ–1 రంగారెడ్డి ఆదేశాల మేరకు ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: ఎండాడలోని ఇస్కాన్ ఆలయం దగ్గర ఓ ప్రైవేట్ స్థల వివాదంలో మాజీ మంత్రి వట్టి వసంతకుమార్, కొణతాల రామ్మోహన్‌పై ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వసంతకుమార్, రామ్మోహన్‌లపై బి.శివకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నామని, మాజీ మంత్రి బెదిరిం చడం వాస్తవమని తెలితే అరెస్ట్ చేస్తామని నగర డీసీపీ–1 రంగారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. పోలీసులు, బాధితులు చెప్పిన వివరాలివి. 40 ఏళ్ల కిందట సర్వే నంబర్ 108/1లో వ్యాపారవేత్త చెరుకూరి వెంకటరాజు నుంచి 75 సెంట్ల స్థలాన్ని ప్రముఖ సినీ డైరెక్టర్ తల్లి కోడూరు రాజనందిని, సత్యనారాయణ ప్రసాద్, బలుసు రామారావులు చెరో 25 సెంట్ల చొప్పున కొనుగోలు చేశారు. అక్కడకు నాలుగేళ్ల తర్వాత చెరుకూరి వెంకటరాజు అనే వ్యక్తి రాజనందిని కొనుగోలు చేసిన భూమికి లేఅవుట్ పేరుతో నకిలీ డాక్యుమెంట్ సృష్టించి రహస్యంగా సంపుటూరి వెంకట రమణారెడ్డి అనే వ్యక్తికి అమ్మేశాడు. ఇది తెలిసిన ఆమె భీమిలి మున్సిఫ్ కోర్టులో కేసు వేశారు. కోర్టు ఆమెకు అనుకూలంగా డిక్రీ ఇచ్చింది. ఈ క్రమంలో రాజనందిని చెందిన స్థలాన్ని 2006లో సత్యనారాయణ ప్రసాద్ కొనుగోలు చేసి తన కుమారుడు శివకుమార్(బాధితుడు), కుమార్తె నగినా పేర్ల మీద చెరో 505 గజాలు చొప్పున 1010 గజాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించాడు. మిగతా భూమిని రోడ్డు కోసం వదిలేశాడు. అదే సమయంలో ఇదే భూమిని తనకు విక్రయించారని కొణతాల రామ్మోహన్ అనే వ్యక్తి బలుసు శివకుమార్‌పై కోర్టులో కేసు వేశాడు. దీనికి కోర్టు ‘స్టేటస్ కో’ఆర్డర్ జారీ చేసింది. అప్పటి నుంచి ఆ భూమికి ‘కేర్ టేకర్’గా ఒమ్మి కొండలరావును నియమించుకున్నారు. వివాదానికి కారణమైన స్థలం ఇదే మాజీ మంత్రి బెదిరింపు ఈ భూమిలో కలుపు మొక్కలు తొలగించడానికి బలుసు శివకుమార్ ఈ నెల15వ తేదీన కూలీలను పెట్టి పనులు చేయిస్తున్నాడు. ఆ క్షణంలో అక్కడకు చేరుకున్న కొణతాల రామ్మెహన్ కూలీలను బెదిరించి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని కూలీలు శివకుమార్‌కు సమాచారం ఇచ్చారు. ఆ సమయంలో తన స్నేహితుడు భూమి బాధ్యతను తనకు అప్పగించారని తుపాకీ పట్టుకుని మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ కూలీ లను బెదిరించారు. తక్షణమే పనులు నిలిపివేయాలని హెచ్చరించారు. అయినా కూలీలు అతని మాటలను పెడచెవిన పెట్టారు. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న శివకుమార్ ఇదేంటని ప్రశ్నించారు. ఈ క్రమంలో తనతో పాటు కూలీలను కూడా మాజీ మంత్రి చంపేస్తానని బెదిరించాడని శివకుమార్ తెలిపారు. దీంతో కూలీలు పరుగులు తీశారు. ‘తాను కేవలం ప్రశ్నించాను, ప్రాణరక్షణ కోసం తుపాకీని వెంట తీసుకువెళుతుంటాను. ఈ సంఘటన అకస్మాత్తుగా జరిగిందే తప్ప దీని వెనుక మరే ఉద్దేశం లేదు’ అని మాజీ మంత్రి తన వర్గీయుల వద్ద చెప్పినట్టు సమాచారం. కాగా.. ఈ విషయంపై శివకుమార్ డీసీపీ–1 రంగారెడ్డికి సోమవారం ఫిర్యాదు చేశారు. దీంతో అదే రోజు రాత్రి డీసీపీ ఆరిలోవ పోలీసులకు కేసు అప్పగించారు. ఆరిలోవ సీఐ కిశోర్‌కుమార్ మంగళవారం దీనిపై కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, బాధితుడిని మాజీ మంత్రి బెదిరించడం వాస్తవమని తెలితే అరెస్ట్ చేస్తామని డీసీపీ తెలిపారు. హతమార్చాలనే తుపాకీతో బెదిరించారు ఆదివారం ఉదయం పది గంటలకు ఫోన్ వచ్చింది. మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ తమను బెదిరిస్తున్నారని కూలీలు చెప్పారు. నేను వెంటనే అక్కడకు చేరుకున్నాను. ఆయన కూలీలతో పాటు నాపై కూడా రివాల్వర్ తిప్పుతూ.. ఈ భూమి మీది కాదు. మీ భూమి వేరే చోట ఉంది. వెళ్లండని గట్టిగా అరుస్తూ దూర్భషలాడారు. నా సంగతి నీకు తెలియదు.. మీ నాన్నని అడుగు.. చెబుతాడు. చెప్పినట్టు వినకపోతే నీ అంతు చూస్తా అని అన్నారు. నన్ను హతమార్చాలనే బెదిరించారు. – బలుసు శివకుమార్, బాధితుడు -
పర్యావరణ అనుమతులు అవసరమా? కాదా?
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో నదుల అనుసంధానంపై నివేదిక ఇవ్వాలని కేంద్ర పర్యావరణ శాఖకు జాతీయ హరిత ట్రెబ్యునల్(ఎన్జీటీ) అదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా పట్టిసీమ, పురుషోత్త పట్నం, చింతలపూడి, గోదావరి-పెన్నా అనుసంధాన ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు అవసరమా? కాదా? అనే విషయంపై కూడా వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఎన్జీటీ కోరింది. వారం రోజుల్లో నిర్ణయం తీసుకొని నివేదిక ఇవ్వాలని కేంద్ర పర్యావరణ, ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను పిబ్రవరి 22కు వాయిదా వేసింది. ఏపీలో నదుల అనుసంధానం పేరిట అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారంటూ ఎన్జీటీలో మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్, త్రినాథ్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. గోదావరి డెల్టాకు నష్టం జరుగుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా నదులు అనుసంధానం చేస్తున్నారని పిటీషనర్లు తమ వాదన వినిపించారు. పిటీషనర్ల వాదనలు విన్న ఎన్జీటీ కేంద్ర పర్యావరణ శాఖ, ఏపీ కాలుష్య నియంత్రణ మండలిలో కూడా వీటిపై పిర్యాదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. -
టీడీపీ ఎఫెక్ట్; కాంగ్రెస్‌కు వరుస దెబ్బలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు దేశం పార్టీతో దోస్తీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. తమ పార్టీని దుమ్మెత్తిపోసిన టీడీపీతో చేతులు కలపడాన్ని సీనియర్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. సాక్షాత్తు సోనియా గాంధీని ‘ఇటలీ దెయ్యం’ అంటూ నోరుపారేసుకున్న చంద్రబాబుతో రాహుల్ గాంధీ జట్టు కట్టడాన్ని కాంగ్రెస్‌లో చాలా మంది నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సోనియాను అవినీతి అనకొండ అంటూ దుయ్యబట్టిన చంద్రబాబుతో స్నేహం మంచిది కాదని వాదిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే ‘చేయి’ చాశారని చెబుతున్నారు. రాజీనామాల పరంపర టీడీపీతో చేతులు కలపడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నాయకులు పార్టీని వీడుతున్నారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వట్టి వసంతకుమార్ గురువారం రాజీనామా ప్రకటించారు. నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై పోరాటాలు చేశామని.. అలాంటి నాయకుడితో కలిసి పనిచేయడం ఇష్టంలేకే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు ఆయన తెలిపారు. మరో సీనియర్ నేత మాజీ మంత్రి సి రామచంద్రయ్య తాజాగా కాంగ్రెస్ పార్టీని వీడారు. ఈ విషయాన్ని మీడియా ద్వారా ఆయన ప్రకటించారు. మరికొంత మంది సీనియర్ నాయకులు కూడా కాంగ్రెస్‌ను వీడే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ముందే తెలిసి వెళ్లిపోయారు! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ నాదండ్ల మనోహర్ ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. టీడీపీతో కాంగ్రెస్ కలుస్తుందన్న విషయం ముందే తెలుసుకుని ఆయన వెళ్లిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. దశాబ్దాలుగా తమ పార్టీకి బద్ధ శత్రువుగా ఉన్న ‘సైకిల్’ పార్టీతో జట్టు కట్టడాన్ని ఆత్మహత్యాసదృశ్యంగా కాంగ్రెస్ నేతలు వర్ణిస్తున్నారు. (మాజీ మంత్రి వట్టి కాంగ్రెస్‌కు గుడ్‌బై) తొందరపడొద్దు: రఘువీరా సీనియర్ నాయకులు పార్టీని వీడుతుండటంతో పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి స్పందించారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని, కాంగ్రెస్ మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. పార్టీలో భిన్న అభిప్రాయాలు సహజమన్నారు. పొత్తులపై నిర్ణయాధికారాన్ని తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కట్టబెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాహుల్ గాంధీ నిర్ణయమే తమకు శిరోధార్యమని స్పష్టం చేశారు. -
రాహుల్‌తో బాబు భేటీ.. ఏపీలో కాంగ్రెస్‌కు షాక్
సాక్షి,అమరావతి: బద్ధ శత్రువులైన కాంగ్రెస్, టీడీపీ.. ఒకతాటికి రావడంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరు పార్టీల అధ్యక్షులు రాహుల్, చంద్రబాబు ఢిల్లీలో భేటీ కావడం.. ఆ రెండు పార్టీల్లో ప్రకంపనలు రేపుతోంది. టీడీపీ- కాంగ్రెస్ అపవిత్ర పొత్తుపై ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తితో చేతులు కలుపడమంటే పార్టీ దెబ్బతీయడమేనని కొందరు కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిణామాల పట్ల కలత చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ తాజాగా పార్టీకి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకంగా టీడీపీతో కాంగ్రెస్ కలవడాన్ని నిరసిస్తూ ఆయన రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. శుక్రవారం తన రాజీనామా పత్రాన్ని కాంగ్రెస్ అధిష్టానానికి పంపనున్నట్టు ఆయన వెల్లడించారు. -
చంద్రబాబు ఒక అవకాశవాది
-
చింతమనేనికి చుక్కెదురు
సాక్షి, ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు జిల్లా కోర్టులో చుక్కెదురైంది. భీమడోలు కోర్టు తనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షను కొట్టివేయాలని ఏలూరులోని జిల్లా కోర్టులో చింతమనేని వేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది. రెండేళ్ల శిక్షపై అప్పీల్ పిటిషన్ మాత్రం న్యాయస్థానం స్వీకరించింది. భీమడోలు కోర్టు విధి౦చిన శిక్షను రద్దు లేదా తొలగి౦చాలనే అభ్యర్థనను అ౦గీకరి౦చబోమని కోర్టు స్పష్టం చేసింది. కింది కోర్టు తీర్పుపైన స్టే ఇవ్వడానికి నిరాకరించింది. జిల్లా కోర్టులోనూ ఊరట లభించకపోవడంతో హైకోర్టు తలుపుతట్టేందుకు చింతమనేని సిద్ధమవుతున్నారు. 2011లో అప్పటి మంత్రి వట్టి వసంతకుమార్‌పై దౌర్జన్యం చేసిన కేసులో మూడు సెక్షన్ల కింద అభియోగాలు రుజువైనందున భీమడోలు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి కె. దీప దైవకృప రెండేళ్ల జైలుశిక్ష, రూ.2500 జరిమానా విధిస్తూ ఫిబ్రవరి 14న తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో నెల రోజులపాటు సాధారణ జైలుశిక్ష విధించారు. అనంతరం తీర్పును తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ చింతమనేని ప్రభాకర్‌కు బెయిల్ మంజూరు చేశారు. దీంతో ఆయన జిల్లా కోర్టును ఆశ్రయించారు. -
వసంతకుమార్ సతీమణి మృతికి కాంగ్రెస్ సంతాపం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ సతీమణి ఉమాదేవి(63) మృతి పట్ల ఏపీసీసీ అధ్యక్షులు రఘవీరారెడ్డి సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం ఉదయం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆమె మృతి పట్ల వారి కుటుండ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. -
'సుజనా చప్పట్లు కొట్టడం సరికాదు'
విజయవాడ : రాజ్యసభలో ప్రత్యేక హోదా బిల్లును టీడీపీ సమాధి చేసిందని మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ ఆరోపించారు. ఓటింగ్ రాకుండా బీజేపీ - టీడీపీ కుమ్మక్కయ్యాయని విమర్శించారు. శనివారం విజయవాడలో వట్టి వసంతకుమార్ విలేకర్లతో మాట్లాడుతూ.... బిల్లును రాజ్యసభ నుంచి లోక్‌సభకు పంపేటప్పుడు కేంద్రమంత్రి సుజనా చౌదరి చప్పట్లు కొట్టడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ, టీడీపీలను తరిమికొట్టండి అనే నినాదంతో ఆగస్టు 9వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నట్లు వట్టి వసంతకుమార్ వెల్లడించారు. -
ముద్రగడను హౌస్ అరెస్ట్ చేస్తారా?
కాకినాడ: ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహారదీక్ష నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు ఆంక్షలు విధించడాన్ని మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ తప్పుబట్టారు. పోలీసుల తీరుపై అసనహనం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన 'సాక్షి'తో మాట్లాడుతూ.. ముద్రగడకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న కాపు నాయకులను అడ్డుకోవడం సరికాదని అన్నారు. కిర్లంపూడిలో ముద్రగడ ఇంటి చుట్టూ భారీగా పోలీసులను మొహరించడం చూస్తుంటే ఆయనను హౌస్ అరెస్ట్ చేస్తారేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు. దీనిపై పోలీసులు వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బయటి ప్రాంతాల నుంచి ఎవరూ తూర్పు గోదావరి జిల్లాకు రావద్దని పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. ముద్రగడ దంపతుల ఆమరణదీక్ష నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. జిల్లా అంతటా పోలీసు బలగాలను మోహరించారు. జిల్లా కేంద్రం కాకినాడ సహా కిర్లంపూడి, జగ్గంపేట, పిఠాపురం, తుని, అమలాపురం తదితర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో బలగాలను దించారు. -
'కాపులపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు'
కాకినాడ : కులాల మధ్య చిచ్చు పెట్టే అలవాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకే ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలు సి.రామచంద్రయ్య, వట్టి వసంత్‌కుమార్ ఆరోపించారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా తునిలో జరుగుతున్న కాపు ఐక్య గర్జన సదస్సుకు సి. రామచంద్రయ్య, వట్టి వసంత్‌కుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కాపులపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. గతంలో ఏర్పాటు చేసిన పుట్టుస్వామి కమిషన్ ఉండగా మరో కమిషన్ ఎందుకు అని చంద్రబాబును ప్రశ్నించారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయవచ్చని వారు అభిప్రాయపడ్డారు. కాపులను బీసీల్లో చేర్చేంతవరకు పార్టీలకతీతంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని సి. రామచంద్రయ్య, వట్టి వసంత్‌కుమార్ చెప్పారు. -
పీహెచ్డీ అందుకోనున్న పనబాక, వట్టి
విశాఖ : ఈనెల 29న ఆంధ్ర విశ్వవిద్యాలయం 82వ స్నాతకోత్సవం జరగనుంది. ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి మోడీ శాస్త్రీయ సలహాదారు, ఆచార్య రాఘవన్ హాజరు కానున్నారు.ఆయనను గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్ ప్రదానం చేయనుంది. కాగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, వట్టి వసంత్ కుమార్, ఐఏఎస్ అధికారి శ్రీనివాస్ శ్రీనరేష్, జివిఎమ్‌సి చీఫ్ ఇంజినీర్ జయరాంరెడ్డి తదితరులు పీహెచ్డీ అందుకోనున్నారు. -
వట్టి వసంతకుమార్ కు డాక్టరేట్
విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయం 82వ స్నాతకోత్సవం ఈ నెల 29న జరగనుంది. చాన్సలర్ హోదాలో హాజరుకానున్నగవర్నర్ నరసింహాన్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ముఖ్య అతిధిగా కేంద్ర శాస్త్రసాంకేతిక సలహాదారు ఎస్వీ రాఘవన్ పాల్గొననున్నారు. ఈ ఏడాది డాక్టరేట్స్ అందుకోనున్నవారిలో మాజీ కాంగ్రెస్ మంత్రులు వట్టి వసంతకుమార్, పనబాక లక్ష్మీ ఉన్నారు. ఎస్వీ రాఘవన్‌ను డాక్టర్ ఆఫ్ సైన్స్‌తో ఏయూ సత్కరించనుంది. -
ప్రభుత్వం ఆ విషయం మరిచిపోయిందా?
విజయవాడ: వ్యవసాయ రుణమాఫీ హామీ నుంచి చంద్రబాబు నాయుడు తప్పుకోరాదని రాష్ట్ర మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ కోరారు. జూన్ 30లోగా రైతులు వ్యవసాయ రుణాలు చెల్లిస్తే అన్ని రాయితీలు రైతులకు వర్తిస్తాయని తెలిపారు. కాలం గడిచాక ఇప్పుడు రీషెడ్యూలు చేస్తామంటున్నారని, ఓవర్ డ్యూ రుణాలు రీషెడ్యూల్ కిందకు రావన్న విషయం రాష్ట్ర ప్రభుత్వం మరిచిపోయిందా అని ఆయన ప్రశ్నించారు. రైతు రుణమాఫీ -సాగునీటి కొరతపై శుక్రవారం విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమవేశంలో ఆయన పాల్గొన్నారు. రైతు సంఘాల నాయకులు, వివిధ పార్టీల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. -
ఆనాటి మాటకే కట్టుబడి ఉన్నా..
భీమడోలు/ఉంగుటూరు, న్యూస్‌లైన్ : వచ్చే సాధారణ ఎన్నికల్లో తాను పోటీ చేయనని, ఈ విషయూన్ని 2009లో రెండోసారి ఉంగుటూరు నుంచి గెలిచినప్పుడే చెప్పానని తాజా మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ అన్నారు. తన నిర్ణయంపై అప్పట్లో పత్రికల్లో వచ్చిన వార్తను చూసి నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అడిగితే.. ఆయనకు కారణాలు కూడా అప్పుడే చెప్పానని వసంత్ పేర్కొన్నారు. సోమవారం భీమడోలు మండలం పూళ్ల సొసైటీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఉంగుటూరు నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. సభకు పార్టీ భీమడోలు మండలాధ్యక్షుడు ఆల్తి సాంబ శివరావు అధ్యక్షత వహించగా వసంత్ కుమార్ మాట్లాడారు. తనను రెండుసార్లు ఉంగుటూరు ఎమ్మెల్యేగా గెలి పించినందుకు నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. మారిన పరిస్థితులకు భయపడో.. గెలుపుపై అనుమానం వచ్చో.. పోటీ చేయటానికి వెనుకాడడం లేదని, ఆనాడు ప్రకటించిన నిర్ణయూనికే క ట్టుబడి ఉన్నానన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారని, నాకు 60 సంవత్సరాలు దాటాయన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ ఎవరిని నిల బెట్టిన ఆ అభ్యర్థిని గెలిపిస్తానన్నారు. పార్టీలో క్రియాశీలక రాజకీయాల్లో ఉంటానన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడే ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేద్దామని అనుకున్నానని, అరుుతే కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ గురించి సంప్రదింపులు జరపడంతో పార్టీలో ఉండిపోయానన్నారు. పార్టీని వీడే ప్రసక్తి లేదన్నారు. పోటీ చేయాలన్న కార్యకర్తలు వసంత్ కుమార్ ప్రకటనతో కార్యకర్తలు, నాయకులు నిరుత్సాహం చెందారు. పోటీ చేయాలని కార్యకర్తలు ముక్తకంఠంతో కోరారు. నియోజకవర్గంలోని చుట్టుపక్కల మండలాల నుంచి పెద్ద సంఖ్య కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. డీసీసీబీ అధ్యక్షుడు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యాల వెంకటరత్నం, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కనకదుర్గ, అఖిల భారత చేనేత కేంద్ర డెరైక్టర్ దొంతంశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు. -
'చైతన్యరాజు నామినేషన్ తిరస్కరించండి'
హైదరాబాద్: పెద్దల సభకు కాంగ్రెస్ పార్టీ నుంచి తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్సీ చైతన్యరాజు బరి నుంచి తప్పుకునేలా అధిష్టానం ఒత్తిడి పెంచుతోంది. చైతన్యరాజు నామినేషన్ తిరస్కరించాలని రిటర్నింగ్ అధికారికి మంత్రి వట్టి వసంత్‌కుమార్ ఫిర్యాదు చేశారు. చైతన్యరాజుపై నాన్‌బెయిలబుల్ కేసులు ఉన్నందున ఆయనను పోటీకి అనర్హుడి ప్రకటించాలని కోరారు. తనపై ఉన్న కేసుల గురించి అఫిడవిట్లో చైతన్యరాజు పేర్కొనలేదని మంత్రి తెలిపారు. చైతన్యరాజుతో పాటు ఆదాల ప్రభాకరరెడ్డి.. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వీరద్దరి నామినేషన్లు సక్రమంగానే ఉన్నాయని రిటర్నింగ్ అధికారి ధ్రీవీకరించారు. -
మేము తప్పు చేస్తే దిద్దుకుంటాం: వట్టి
హైదరాబాద్: రాష్ట్ర విజభన జరిగితే కోస్తాంధ్ర 50 ఏళ్లు వెనక్కి పోతుందని మంత్రి వట్టి వసంతకుమార్ అన్నారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టినట్టినట్లు కనబడుతుందన్నారు. సమాఖ్య స్ఫూర్తిపై కేంద్రానికి గౌరవం ఉన్నట్టు లేదన్నారు. శాసనసభ తీర్మానం లేకుండా రాష్ట్ర విభజన చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. విభజనపై కేంద్రం అత్యుత్సాహం ఎందుకు కనబరుస్తుందో అర్థం కావడం లేదన్నారు. ఏళ్ల తరబడి విదర్భ డిమాండ్ ఉన్నా పట్టించుకోలేదని తెలిపారు. తాము, తమ పూర్వీకులు తప్పు చేసినట్టు నిరూపిస్తే సరిదిద్దుకుంటామన్నారు. హైదరాబాద్‌తో సమానమైన రాజధానికి నిర్మాణానికి నిధులెవరిస్తారని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రాంతాన్ని బలవంతంగా తెలంగాణలో కలిపారనడం సబబు కాదన్నారు. ఈ బిల్లును చూస్తే కొత్త రాష్ట్రం ఎలా బతికి బట్టకడుతుందో అర్థం కావడం లేదన్నారు. తమపై దోపిడీ ఆరోపణలు తప్పని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందని తెలిపారు. తీర్మానం తప్పనిసరి అని సర్కారియా కమిషన్ కూడా చెప్పిందన్నారు. శాసనసభ తీర్మానాన్ని కేంద్రం పొందలేదు కాబట్టి బిల్లును వ్యతిరేకిస్తున్నామని వట్టి వసంతకుమార్ చెప్పారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సరైన ప్రాతిపదిక, విధానం అవలంభించాలని సూచించారు. -
టీ బిల్లుపై చర్చ షురూ
వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళన మధ్య ప్రారంభించిన మంత్రి వట్టి వసంతకుమార్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానంటూ మొదలు 2 నిమిషాలకే సభను వాయిదా వేసిన స్పీకర్ సాక్షి, హైదరాబాద్: తీవ్ర గందరగోళం, వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యుల ‘సమైక్య’ ఆందోళన మధ్య ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013పై పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్ బుధవారం శాసనసభలో చర్చ ప్రారంభించారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలను పక్కనపెట్టి, సంప్రదాయాల స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని, ఆంధ్రా, రాయలసీమ, ప్రజలపై బలవంతంగా రుద్దుతున్న విభజన బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని అన్నారు. ఈ విధమైన విభజన భారత సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకమని వ్యాఖ్యానించారు. నదీ జలాలు, సాంకేతిక విద్య, విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన సమాచారం బిల్లులో లేదని విమర్శించారు. విభజన బిల్లు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మంత్రి పేర్కొన్నారు. అరుుతే ఇలా చర్చ ప్రారంభమైన రెండు నిమిషాలకే స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను అర్ధాంతరంగా గురువారానికి వాయిదా వేశారు. ఉదయం సభ ప్రారంభం కాగానే సమైక్యాంధ్ర, జై తెలంగాణ నినాదాలతో మార్మోగింది. వైఎస్సార్సీపీ, టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరించినట్లు స్పీకర్ ప్రకటించారు. అంతకుముందే వైఎస్సార్సీపీ సభ్యులు సమైక్య తీర్మానం చేయాలని పట్టుబడుతూ పోడియంలోకి వెళ్లి నినాదాలు ప్రారంభించారు. టీడీపీ సీమాంధ్ర సభ్యులు కూడా ఇదే పద్దతిని అనుసరించడంతో సభ వాయిదా పడింది. ఉదయం 11 గంటల సమయంలో సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ ఎలాంటి మార్పు లేకపోవడంతో మరోసారి సభను స్పీకర్ వాయిదా వేశారు. మూడోసారి మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో సభ ప్రారంభమైనప్పుడు కూడా వైఎస్సార్సీపీ సభ్యులు పోడియం వద్దకు వెళ్లి ఆందోళన కొనసాగించారు. టీడీపీ సీమాంధ్ర సభ్యులు కూడా పోడియంలోకి వెళ్లారు. అధికారపక్ష సీమాంధ్ర సభ్యులు తమతమ స్థానాల్లోనే సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. గందరగోళం మధ్యే ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కల్పించుకుని.. ‘రాష్ట్రపతి పంపించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013పై చర్చ జరగాలి. ఆయా ప్రాంతాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆయా ప్రాంతాల నాయకులు మాట్లాడాలి. అరుుతే చర్చకు బిల్లుకు సంబంధించిన సంపూర్ణ సమాచారం కావాలని ప్రధాన ప్రతిపక్షం మిమ్మల్ని కోరింది. వారు కోరిన అంశాలను మీరు ప్రభుత్వానికి పంపించారు. ప్రతిపక్షం అడిగిన ఆర్థికాంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వద్దనున్న సమాచారాన్ని ఒకటి రెండురోజుల్లో సభ్యులకు ఇస్తాం. చర్చకు టీడీపీ, వైఎస్సార్సీపీ సభ్యులు సహకరించాలి..’ అని కోరారు. దీంతో అప్పటివరకు పోడియంలో నినాదాలు చేస్తున్న టీడీపీ సభ్యులు తమ తమ స్థానాల్లోకి వెళ్లిపోయారు. ఈ దశలో వైఎస్సార్సీపీ సభ్యులు తమ చేతుల్లో ఉన్న కాగితాలను చింపి గాల్లోకి విసిరేశారు. వారు గట్టిగా నినాదాలు చేస్తున్న సమయంలోనే స్పీకర్ మనోహర్ మంత్రిని చర్చ ప్రారంభించాల్సిందిగా కోరారు. -
అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై మొదలైన చర్చ
-
అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై మొదలైన చర్చ
హైదరాబాద్ : శాసనసభలో తెలంగాణ బిల్లుపై చర్చ మొదలైంది. అసెంబ్లీలో సమైక్య తీర్మానం ప్రవేశపెట్టాలన్న వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల ఆందోళనను పట్టించుకోకుండానే ప్రభుత్వం విభజన బిల్లుపై చర్చను ప్రారంభించింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల తీవ్ర నిరసనల మధ్యే సాంస్కృతిక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్ ముందుగా విభజన బిల్లుపై చర్చను ప్రారంభించారు. సభ్యుల నినాదాల మధ్య దాదాపు రెండు నిమిషాలు పాటు వసంతకుమార్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతుండగానే స్పీకర్ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అప్రజాస్వామ్య పద్ధతిలో, రాజ్యాంగ వ్యతిరేకంగా చేపట్టిన రాష్ట్ర విభజనను తాను వ్యతిరేకిస్తున్నట్టు వసంతకుమార్ అన్నారు. అంతకు ముందు సభ ప్రారంభంకాగానే ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడారు. చర్చకు సహకరించాలని సభ్యులకు విజ్ఞప్తి చేశారు. సభ్యుల కోరిన ఏ సమాచారామైన ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఆ వెంటనే సభ్యుల్ని తమ తమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ విజ్ఞప్తి చేయడంతో..... సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలంతా వెనక్కి తగ్గారు. వారివారి స్థానాల్లో కూర్చున్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు సభ జరిగినంత సేపు స్పీకర్ పోడియం ముందు నిల్చోని తమ నిరసన తెలిపారు. దాంతో సభను స్పీకర్ గురువారానికి వాయిదా వేశారు. -
నేటి నుంచి రాష్ట్రస్థాయి యువజనోత్సవాలు
మాదాపూర్, న్యూస్‌లైన్: సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ నృత్యాలు, వినూత్న కార్యక్రమాల సమాహారంగా రాష్ర్ట స్థాయి యువజనోత్సవాలు శనివారం నుంచి మాదాపూర్‌లోని శిల్పారామంలో కనువిందు చేయనున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలను రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖామంత్రి వట్టి వసంతకుమార్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 23 జిల్లాల్లో నిర్వహించిన ఉత్సవాల్లో ప్రతిభ కనబర్చిన కళాకారులను రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలకు ఎంపిక చేశారు. ఆయా ప్రదర్శనల్లో ఎంపికయిన వారిని పంజాబ్ లూథియానాలో జనవరి 12న జరిగే జాతీయ స్థాయి యువజనోత్సవాలకు పంపిస్తారు. శిల్పారామంలో జానపద సంగీతం, జానపద నృత్యాలు, శాస్త్రీయ సంగీతం (కర్నాటక, హిందుస్తానీ), శాస్త్రీయ వాయిద్యాలు (తబలా, వీణా, మృదంగం, హార్మోనియం, సితారా, వేణువు), శాస్త్రీయ నృత్యాలు (కూచిపూడి, భరతనాట్యం, మణిపూరి, కథక్, ఒడిస్సీ) తదితరాల్ని నిర్వహించనున్నారు. మిమిక్రీ, వెంట్రిలాక్విజమ్, మ్యాజిక్, ఏకపాత్రాభిన యం, ఫ్యాన్సీడ్రెస్, క్విజ్, వ్యాసరచన, పెయింటింగ్, వక్తృత్వం, గీతం, నృత్యం, సామూహిక చర్చ, మార్షల్ ఆర్ట్స్ తదితర ప్రత్యేక ప్రదర్శన, కార్యక్రమాలు కూడా అలరించనున్నాయి. అదేవిధంగా మోహన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్రదానం, అవయవదానంపై అవగాహన కల్పించడానికి ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 29న లఘు చిత్రాన్ని ప్రదర్శిస్తారు. 30న జరిగే ముగింపు వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి ముఖ్యఅతిథిగా విచ్చేస్తారని యువజన సర్వీసుల శాఖ నిర్దేశకుడు కర్రి రాజభౌమ హరినారాయణ చక్రవర్తి తెలిపారు. -
ప్రశ్నల పేరిట ‘వట్టి’ కోర్కెల చిట్టా!
డిమాండ్లు తీరిస్తే విభజనకు ఓకేనని జీవోఎం ముందు అంగీకారం తమ వాదనను కోర్కెల చిట్టా అనుకోవచ్చని మీడియాతో వసంత్‌కుమార్ వ్యాఖ్య సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కేంద్ర మంత్రుల బృందం(జీవోఎం) ముందు బలంగా వాదనలు వినిపించామని మంత్రి వట్టి వసంత్‌కుమార్ మంగళవారం చెప్పిన మాటలన్నీ నీటిమూటలేనని తేలింది. పీసీసీ తరఫున ప్రత్యేక నివేదికతో జీవోఎం ముందు హాజరైన వట్టి సీమాంధ్ర సమస్యలకు ఎలాంటి పరిష్కారం చూపుతారని ప్రశ్నిస్తూనే... డిమాండ్ల చిట్టాను జీవోఎం ముందుంచారు. మంగళవారంనాటి జీవోఎం భేటీ వివరాలను, అక్కడ ప్రస్తావించిన అంశాలను ఆయన బుధవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. తమ ప్రాంతానికి అవసరమయ్యే అన్ని ప్రతిపాదనలను ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నలరూపంలో జీవోఎం ముందుంచినట్టు చెప్పారు. వీటినే ప్రశ్నలుకానీ, కోర్కెల చిట్టాకానీ.. ఏదైనా అనుకోవచ్చని, వాటికి పరిష్కారం చూపితే విభజనకు తాను అంగీకరిస్తానని తెలిపారు. పీసీసీ ఆదేశించిన మేరకే నివేదికను జీవోఎం ముందుంచానన్నారు. ‘‘విభజనతో అనేక సమస్యలున్నాయి. ఒక సమస్యను పరిష్కరిస్తే మరిన్ని ఉత్పన్నమయ్యే అవకాశముంది. వీటన్నింటికీ కేంద్రమే పరిష్కారం చెప్పాలి. విభజనతో సీమాంధ్రకు జరిగే నష్టాన్ని చెబుతూనే.. విభజన జరిగితే ఏవిధంగా సాయమందిస్తారో చెప్పాలని కోరా’’ అని తెలిపారు. వట్టి తెలిపిన ప్రకారం ప్రశ్నలరూపంలోని డిమాండ్ల చిట్టా ఇదీ... హైదరాబాద్‌లో కేంద్ర అధీనంలోని బీహెచ్ఈఎల్, బీడీఎల్, డీఆర్డీవో.. తదితర ప్రభుత్వరంగ సంస్థలున్నాయి. విభజన జరిగితే ఇలాంటివి సీమాంధ్రలో పెట్టగలరా? 1990 నుంచి పెట్టుబడుల ఉపసంహరణ విధానాన్ని కేంద్రం అనుసరిస్తోంది. దీంతో అన్ని ప్రభుత్వరంగ సంస్థల్ని ప్రైవేటుకు అప్పగిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉన్న తరహాలో కొత్తగా ప్రభుత్వరంగ సంస్థలను సీమాంధ్రలో ఏర్పాటు చేయడం సాధ్యమేనా? సాధ్యం కాకుంటే, సీమాంధ్రలో పారిశ్రామిక వృద్ధికి తీసుకునే చర్యలేమిటి? 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎగుమతుల ద్వారా రాష్ట్రానికి రూ.55 వేల కోట్ల ఆదాయమొస్తే.. అందులో రూ.51 వేల కోట్ల ఎగుమతులు హైదరాబాద్ నుంచే జరిగాయి. ఇందులో 60 శాతం ఐటీ ఎగుమతులు సీమాంధ్ర నుంచి జరిగేలా హామీ ఇవ్వగలరా? వ్యవసాయ రంగానికే పరిమితమైన సీమాంధ్ర జిల్లాలను పారిశ్రామికంగా, వ్యాపారపరంగా అభివృద్ధి చేసేందుకు మీ వద్ద ఉన్న విధానం, ప్రణాళికేంటీ? హైదరాబాద్ నుంచి వస్తున్న ఆదాయంలో 60 శాతం సీమాంధ్రకిచ్చేలా తెలంగాణ వారిని ఒప్పించగలరా? ఓ రాష్ట్రంలో ఆదాయాన్ని మరో రాష్ట్రానికి పంచే అవకాశం రాజ్యాంగంలో లేదు. యూటీ చేస్తే తప్ప ఉమ్మడి రాజధానిలో అది సాధ్యంకాదు. యూటీ చేసేందుకు మీరు సిద్ధమేనా? కొత్త రాజధాని నిర్మాణం, ఐటీ పార్కులు, ఐటీ హబ్స్, వైద్యం, విద్య రంగాల అభివృద్ధికి నిధులు, స్థలాలిస్తారా? ఇందుకు పన్నురాయితీలను 30 ఏళ్లపాటు కొనసాగిస్తారా? హైదరాబాద్‌లో విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, సీమాంధ్రుల భద్రత, ఆస్తుల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ హెచ్ఎండీఏ పరిధిని శాశ్వత యూటీ చేస్తారా? హైదరాబాద్ స్టేట్, ఆంధ్ర.. విలీనానికి ముందున్న సరి హద్దులను కొనసాగించగలరా? నదీజలాలను కింది రాష్ట్రాలకు వదలడంలో ఎగువ రాష్ట్రాలు స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నాయి. ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు తీర్పులను గౌరవించట్లేదు. మరి నదీజలాల సమస్యను ఎలా పరిష్కరిస్తారు? -
జీవోఎం ముందు 'వట్టి' కోర్కెల చిట్టా
హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం (యూటీ) చేయాలని రాష్ట్ర మంత్రి వట్టి వసంతకుమార్ మంత్రుల బృందానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన మంత్రుల బృందం (జీవోఎం) ఎదుట తన కోర్కెల చిట్టా విప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వెనకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని జీవోఎంను కోరారు. హైదరాబాద్ శాంతిభద్రతలు కేంద్రం చేతిలో ఉంచాలని, హైదరాబాద్ రెవెన్యూ ఆదాయంలో 60 శాతం తమకు ఇప్పిస్తారని జీవోఎంపై ప్రశ్నల వర్షం కురిపించారు.1956కు ముందు ఉన్న రాష్ట్రాన్ని తమకు ఇవ్వగలుగుతార అని జీవోఎంను ప్రశ్నించారు.తమ పార్టీ ఆదేశాల మేరకే నివేదికలిచ్చామని వట్టి ఈ సందర్బంగా గుర్తు చేశారు. తాను సంధించిన ప్రశ్నలను పరిష్కరించి ఆ తర్వాత విభజనపై ముందుకు వెళ్లాలని వట్టి వసంతకుమార్ జీవోఎంకు సూచించారు. -
విభజన రాజికీయంతో వేడెక్కిన హస్తిన
-
వేడెక్కిన హస్తిన
* తుది అంకానికి విభజన చర్చలు * అధికారులతో జీవోఎం భేటీ నేడు.. హైదరాబాద్, నదీజలాలు, ఉద్యోగులపై చర్చ * ఈ చర్చల ఆధారంగానే ముసాయిదా బిల్లుకు తుదిరూపం * రేపు, ఎల్లుండి రాష్ట్రానికి చెందిన పార్టీలతో సమావేశం * 18వ తేదీన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులతో భేటీలు * 21 నాటికి టీ-బిల్లు ముసాయిదాను కేబినెట్‌కు సమర్పించే అవకాశం * జీవోఎంతో భేటీకి కాంగ్రెస్ నుంచి దామోదర, వట్టి పేర్లు ఖరారు * దానం నాగేందర్, ముఖేశ్గౌడ్లు ఢిల్లీ రావాలంటూ దిగ్విజయ్ పిలుపు * పోటాపోటీగా హస్తిన యాత్రకు రెండు ప్రాంతాల కాంగ్రెస్ నేతలు * హైదరాబాద్ ‘యూటీ’ డిమాండ్‌తో నేడు ప్రధాని వద్దకు సీమాంధ్ర కేంద్రమంత్రులు * రెండు రోజుల్లో సోనియాను కలిసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల కసరత్తు దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్ర విభజన రాజకీయం వేడెక్కుతోంది. విభజన అంశంపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) చర్చల్లో సోమవారం నుంచి తుది అంకం మొదలుకానుంది. కేంద్ర అధికారులతో జీవోఎం చివరి భేటీ నిర్వహించనుంది. మంగళ, బుధవారాల్లో రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో వేర్వేరుగా భేటీ కానుంది. నాలుగు రోజుల తర్వాత ఈ నెల 18వ తేదీన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులతో సమావేశమై చర్చించనుంది. మొత్తం మీద రాబోయే వారం, పది రోజుల్లో రాష్ట్ర విభజన కసరత్తును ఓ కొలిక్కి తీసుకొచ్చి 21వ తేదీకల్లా ముసాయిదా బిల్లును కేంద్ర కేబినెట్‌కు సమర్పిస్తుందని ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రెండు ప్రాంతాల నుంచీ కాంగ్రెస్ నేతలు హస్తిన యాత్రకు సిద్ధమవుతున్నారు. నేటి భేటీ ప్రాతిపదికగా బిల్లుకు తుదిరూపం జీవోఎం సోమవారం నిర్వహిస్తున్న సమావేశంలో కేంద్ర ప్రభుత్వంలోని తొమ్మిది కీలక శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులు పాల్గొంటున్నారు. విభజన ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాలు, ఆస్తులు, అప్పుల పంపిణీ, హైదరాబాద్‌లో నివసిస్తున్న ఇతర ప్రాం తాల వారి హక్కులు, జన వనరులు, విద్యుత్ కేటాయిం పులు, ఉమ్మడి రాజధానిగా ఉండే హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణ, హైదరాబాద్ ఆదాయం ఇరు రాష్ట్రాలకు పంపిణీ.. తదితర అంశాలపై ఆయా మంత్రిత్వ శాఖల కార్యదర్శులు శాఖల వారీగా జీవోఎంకు ఇప్పటికే నివేదికలు సమర్పించారు. వివిధ అంశాలపై తమకున్న తాజా సమాచారాన్ని జీవోఎం సభ్యులతో సోమవారం నాటి భేటీలో వివరించటంతో పాటు.. వివిధ సమస్యలకు పరిష్కారాలను సూచించనున్నారు. అలాగే, వివిధ వర్గాలు, పార్టీల నుంచి వ్యక్తమయిన అభ్యంతరాలు, అనుమానాలపై కూడా కార్యదర్శులు వివరణ ఇచ్చే అవకాశం ఉంది. జీఓఎంకు అందిన 18 వేల వినతులను శాఖల వారీగా క్రోడీకరించే బాధ్యతను ఇప్పటికే కార్యదర్శులకు అప్పగించిన విషయం విదితమే. ఆయా వినతుల్లో పేర్కొన్న అంశాలను కూడా క్రోడీకరించిన వివిధ శాఖల కార్యదర్శులు సమగ్ర నివేదికలను జీవోఎం ముందు ఉంచే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ భేటీలో చర్చల ఆధారంగానే తెలంగాణ ఏర్పాటుపై ఇప్పటికే సిద్ధమైన ముసాయిదా బిల్లుకు తుదిరూపం కల్పించే అవకాశాలున్నాయి. రేపు, ఎల్లుండి పార్టీల ప్రతినిధులతో భేటీలు... అలాగే.. ఈ నెల 12, 13 తేదీల్లో (మంగళ, బుధవారాల్లో) రాష్ట్రానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జీఓఎం ‘అఖిలపక్ష’ సమావేశం నిర్వహించనుంది. రెండు రోజుల పాటు విడతల వారీగా జరిగే ఈ చర్చలకు రావాలని రాష్ట్రంలోని 8 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు కేంద్ర హోంశాఖ ఇప్పటికే ఆహ్వానాలు పంపించిన విషయం తెలిసిందే. జీవోఎంను వ్యతిరేకించని ఐదు పార్టీలు-కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం, సీపీఐకి మంగళవారం జీఓఎం 20 నిమిషాల చొప్పున సమయం కేటాయించింది. ఇక విభజనను గట్టిగా వ్యతిరేకించిన వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎంతో పాటు రెండుకళ్ల సిద్ధాంతంతో నడుస్తున్న టీడీపీకి బుధవారం హోంశాఖ సమయం కేటాయించింది. వచ్చిన పార్టీల నాయకులతో జీఓఎం క్లుప్తంగా విభజనపై చర్చిస్తుందని, ఎవరైనా రాకపోతే రాలేదని రికార్డుల్లో రాసుకుంటుందని హోంశాఖ వర్గాలు తెలిపాయి. పార్టీలతో జరిపే చర్చల్లో అంతకుమించి పెద్దగా ఏమీ ఉండదని, విభజనకు సంబంధించిన ప్రక్రియ తెరవెనుక చకచకా సాగిపోతోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. రాజకీయ పార్టీల నుంచి వచ్చే సలహాలు, సూచనలను కూడా బిల్లులో పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది చూడాల్సి ఉంది. అలాగే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేంద్ర మంత్రులతో ఈ నెల 18న జీఓఎం సమావేశం కానుంది. వారి సలహాలు, సూచనలను పరిశీలించిన తర్వాత ముసాయిదా బిల్లుకు తుదిరూపమిచ్చి ఈ నెల 21న జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. సీమాంధ్ర, తెలంగాణ నేతల పోటాపోటీ విభజనకు అభ్యంతరం లేదని చెప్తూ విభజన నేపధ్యంలో తలెత్తే ఇబ్బందులను పరిష్కరించాలంటున్న సీమాంధ్ర కేంద్రమంత్రులు జీఓఎంకు ఇప్పటికే ఒక నివేదికను అందజేశారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధితో కూడిన హైదరాబాద్‌ను ఢిల్లీ తరహాలో కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే ప్రధాన ప్రతిపాదనతో పాటు.. విభజన సరిహద్దులు, సీమాంధ్రలో భద్రాచలం డివిజన్ విలీనం, నదీ జలాల సమస్య పరిష్కారం వంటి అంశాలను అందులో ప్రస్తావించారు. ఇవే అంశాలపై ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ను కలిసి వివరించేందుకు సోమవారం ఉదయం 11.50 గంటలకు అపాయిట్మెంట్ కూడా తీసుకున్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ప్రతిపాదించిన అంశాలను పరిశీలించేందుకు కేంద్రం సిద్ధమవుతున్న తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా మరింత అప్రమత్తమయ్యారు. సీడబ్ల్యూసీ తీర్మానం మేరకు హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే తమకు సమ్మతమని వారు స్పష్టం చేస్తున్నారు. సీమాంధ్ర నేతల ఒత్తిడికి తలొగ్గితే తెలంగాణలో మళ్లీ ఉద్యమం పెచ్చరిల్లే ప్రమాదముందని, అదే జరిగితే తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్‌కు ఫలితం దక్కే అవకాశాల్లేవని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకటి, రెండు రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సమావేశం కావాలని భావిస్తున్నారు. అనంతరం ఈ నెల 13 లేదా 14న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసి హైదరాబాద్‌పై ఎలాంటి ఆంక్షలు పెట్టవద్దని, సీడబ్ల్యూసీ తీర్మానాన్ని యధాతథంగా అమలు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేసేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ తరఫున డిప్యూటీ సీఎం, మంత్రి వట్టి విభజన దిశగా వడివడిగా అడుగులు పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలంతా హస్తిన యాత్రకు సిద్ధమవుతున్నారు. అఖిలపక్ష భేటీకి పార్టీ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం నుంచి పిలుపు వస్తే తప్ప ఢిల్లీ వెళ్లరాదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భావిస్తున్నట్లు చెప్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గత మూడు రోజులుగా హస్తినలోనే మకాం వేసి కేంద్ర పెద్దలను కలుస్తున్నారు. జీఓఎం ముందు పార్టీ తరఫున ఎవరు హాజరుకావాలన్న విషయంలో హైకమాండ్ పెద్దలతో సంప్రదింపులు జరిపారు. విభజనపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నందున సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని యధాయథంగా వినిపించేందుకు పీసీసీ అధ్యక్షుడిని ఒక్కరినే పంపితే సరిపోతుందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. చివరకు హైకమాండ్ పెద్దలతో సంప్రదింపుల అనంతరం పార్టీ తరఫున ఇద్దరు ప్రతినిధులను జీఓఎం ముందుకు పంపాలని నిర్ణయించారు. ఆ మేరకు తెలంగాణ నుంచి ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, కోస్తా నుంచి మంత్రి వట్టి వసంతకుమార్ పేర్లను ఖరారు చేశారు. దానం, ముఖేశ్‌లకు దిగ్విజయ్ పిలుపు రాష్ట్ర విభజన విషయంలో హైదరాబాద్ అంశం అత్యంత కీలకంగా మారిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన మంత్రులు దానం నాగేందర్, ముఖేష్గౌడ్లకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ ఇరువురు మంత్రులకు ఫోన్ చేసి ఢిల్లీ రావాలని ఆదేశించడంతో వారు ఆదివారం హుటాహుటిన బయల్దేరి వెళ్లారు. హైదరాబాద్‌ను ఢిల్లీ తరహాలో కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని సీమాంధ్ర కేంద్ర మంత్రులు గట్టిగా ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో వీరిని హైకమాండ్ పెద్దలు పిలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదే అంశంపై వారి అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు హైదరాబాద్‌లో నివసిస్తున్న సీమాంధ్రల రక్షణ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించనున్నట్లు తెలిసింది. -
జేఏసీ నేతలతో 'వట్టి' మాటలు
కేంద్రంలోని పెద్దలతో చర్చించిన తర్వాత రాజీనామా నిర్ణయాన్ని ప్రకటిస్తానని రాష్ట్ర మంతి వట్టి వసంత కుమార్ స్పష్టం చేశారు. గురువారం ఏలూరులో ఆయన జేఏసీ నేతలతో సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పదవికి రాజీనామా చేయాలని జేఏసీ నేతలు వట్టిని డిమాండ్ చేశారు. దాంతో మంత్రి వట్టి వసంత కుమార్‌పై విధంగా స్పందించారు. పశ్చిమగోదావరి జిల్లాలో సమైకాంధ్ర ఉద్యమం రోజురోజూకు ఉగ్రరూపం దాలుస్తుంది. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజాప్రతినిధుల వ్యవహారశైలిని ఎండగడుతూ సమైక్యవాదులు నిరసన తెలిపారు. అందులోభాగంగా కేంద్రమంత్రులు మాస్క్‌లతో మాక్ కోర్టును నిర్వహించారు. పోలీస్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న స్వాతంత్ర్య వేడుకలను ఏలూరు నగరంలోని పలు విద్యాసంస్థలు బహిష్కరించాయి. ప్రైవేట్, మేనేజ్మెంట్ స్కూల్ యాజమాన్యాలు చేపట్టిన రిలేదీక్షలు గురువారం 13వ రోజుకు చేరుకున్నాయి. అయితే ఈ నెల 20 నుంచి స్థానిక ఎమ్మెల్యే ఆళ్లనాని ఆమరణ దీక్ష చేయనున్నారు. -
తెలంగాణ తీర్మానాన్ని అడ్డుకుంటాం: మంత్రి వట్టి
కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ప్రక్రియను నిలిపివేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతుందన్న నమ్మకం తమకుందని వట్టి వసంతకుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని గణపవరంలో ఆయన విలేకర్ల సమావేశంలో ప్రసంగించారు. ఎవరూ రాజీనామాలు చేయొద్దని ఆయన సీమాంధ్రలోని ప్రజాప్రతినిధులకు సూచించారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని వ్యతిరేకిద్దామని సీమాంధ్ర ప్రాంతంలోని 159 మంది ఎమ్మెల్యేలకు వట్టి వసంతకుమార్ పిలుపునిచ్చారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే పార్లమెంట్లో బిల్లు పెట్టే నైతిక హక్కు ఉండదు ఆయన స్పష్టం చేశారు. మెజార్టీ ప్రజాప్రతినిధుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుంటే కోర్టుకు వెళ్లే అవకావం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీల కతీతంగా సమైక్యాంధ్ర కోసం పోరాటం చేద్దామని సీమాంధ్రలోని అన్ని పార్టీల నాయకులకు సూచించారు. నాతో సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులందరు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణలో తెలంగాణ తీర్మానాన్ని ఓడించిన మరుక్షణమే తామంతా తమ పదవులకు రాజీనామాలు చేస్తామని వట్టి వసంతకుమార్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసినా మేమంతా విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తామన్నారు. అధిష్టానం నిర్ణయం కంటే ప్రజల నిర్ణయమే మాకు ముఖ్యం మంత్రి వట్టి వసంతకుమార్ పేర్కొన్నారు. -
మీడియాతో వట్టి వసంత్‌కుమార్