
వట్టి వసంత్ కుమార్(పాత చిత్రం)
సాక్షి,అమరావతి: బద్ధ శత్రువులైన కాంగ్రెస్, టీడీపీ.. ఒకతాటికి రావడంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరు పార్టీల అధ్యక్షులు రాహుల్, చంద్రబాబు ఢిల్లీలో భేటీ కావడం.. ఆ రెండు పార్టీల్లో ప్రకంపనలు రేపుతోంది. టీడీపీ- కాంగ్రెస్ అపవిత్ర పొత్తుపై ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తితో చేతులు కలుపడమంటే పార్టీ దెబ్బతీయడమేనని కొందరు కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిణామాల పట్ల కలత చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ తాజాగా పార్టీకి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకంగా టీడీపీతో కాంగ్రెస్ కలవడాన్ని నిరసిస్తూ ఆయన రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. శుక్రవారం తన రాజీనామా పత్రాన్ని కాంగ్రెస్ అధిష్టానానికి పంపనున్నట్టు ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment