'చైతన్యరాజు నామినేషన్ తిరస్కరించండి' | Vatti Vasanth Kumar Complaint Against MLC Chaitanya Raju | Sakshi

'చైతన్యరాజు నామినేషన్ తిరస్కరించండి'

Published Thu, Jan 30 2014 5:01 PM | Last Updated on Sat, Sep 2 2017 3:11 AM

'చైతన్యరాజు నామినేషన్ తిరస్కరించండి'

'చైతన్యరాజు నామినేషన్ తిరస్కరించండి'

పెద్దల సభకు కాంగ్రెస్ పార్టీ నుంచి తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్సీ చైతన్యరాజు బరి నుంచి తప్పుకునేలా అధిష్టానం ఒత్తిడి పెంచుతోంది.

హైదరాబాద్: పెద్దల సభకు కాంగ్రెస్ పార్టీ నుంచి తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్సీ చైతన్యరాజు బరి నుంచి తప్పుకునేలా అధిష్టానం ఒత్తిడి పెంచుతోంది. చైతన్యరాజు నామినేషన్ తిరస్కరించాలని రిటర్నింగ్‌ అధికారికి మంత్రి వట్టి వసంత్‌కుమార్‌ ఫిర్యాదు చేశారు. చైతన్యరాజుపై నాన్‌బెయిలబుల్‌ కేసులు ఉన్నందున ఆయనను పోటీకి అనర్హుడి ప్రకటించాలని కోరారు. తనపై ఉన్న కేసుల గురించి అఫిడవిట్లో చైతన్యరాజు పేర్కొనలేదని మంత్రి తెలిపారు.

చైతన్యరాజుతో పాటు ఆదాల ప్రభాకరరెడ్డి.. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వీరద్దరి నామినేషన్లు సక్రమంగానే ఉన్నాయని రిటర్నింగ్ అధికారి ధ్రీవీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement