గ్లాసు ముక్కలైంది.. సేనానినే గుచ్చుతోంది | Sakshi
Sakshi News home page

గ్లాసు ముక్కలైంది.. సేనానినే గుచ్చుతోంది

Published Tue, Apr 30 2024 8:49 AM

Rebel candidates choosing glass symbol is a set back to Janasena

చాలామంది ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు కేటాయింపు

బెంబేలెత్తుతున్న  కూటమి అభ్యర్థులు

ఏయ్ జగన్. నువ్వెంత.. నీ బతుకెంత అని అరిచి గగ్గోలు పెట్టాడు.. నాకు మోడీ తెలుసు.. అమిత్ షా తెలుసు.. వాళ్ళ ఫోన్ నంబర్ల తెలుసు.. నాకు కేంద్ర నిఘా వర్గాల సమాచారం ఉంది.. ఒక్కటి గుర్తెట్టుకో.. గ్లాసు పగిలేకొద్ది పదునెక్కుతుంది. ఇన్ని కబుర్లు చెప్పాడు.. ఇప్పుడు  చూస్తే చివరకు సేనాని గాజు గ్లాసును కాపాడుకోలేకపోయారు. 

జనసేనా పోటీ చేస్తున్న 21 చోట్ల మాత్రం గాజుగ్లాసు ఆ అభ్యర్థులకు కేటాయించారు. అలా జనసేన పోటీలో లేని చోట్ల మాత్రం ఆ గ్లాసు గుర్తును ఓపెన్ సింబల్‌గా ఉంచేసి స్వాతంత్ర అభ్యర్థులకు ఆ గుర్తు కేటాయించారు. దీంతో ఈ పరిణామం చూస్తుంటే రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్ సభ నియోజకవర్గాల ఈవీఎంల్లోనూ గాజుగ్లాసు ఉంటుందన్నమాట. 

ఇదివరకు జరిగిన పలు ఎన్నికల్లో జనసేన పార్టీ ఉనికి చాటుకోలేకపోవడం, అసలు ఎన్నికల్లో పోటీ చేసి నిబంధనల మేరకు ఓట్లు సాదించకపోవడం వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకున్న ఎన్నికల సంఘం ఇప్పుడు గాజు గ్లాసును ఫ్రీ సింబల్ చేసేసి  అందరికీ పంచేసింది. ఇదిప్పుడు కూటమి అభ్యర్థులపాలిట పెనుముప్పుగా మారింది

అసలు పార్టీని సీరియస్‌గా నడిపే ఉద్దేశ్యం లేని పవన్ కేవలం చంద్రబాబుకు మద్దతుదారుగా ఉండడానికే మొగ్గు చూపి చివరకు పార్టీ ఉనికికి ముప్పు తెచ్చారు. అసలు పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున ఎన్ని చోట్ల, ఎన్ని నియోజకవర్గాల్లో ఒరిజినల్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇంకెన్ని చోట్ల టీడీపీ నుంచి అరువు తెచ్చుకున్న గెస్ట్ అభ్యర్థులు బరిలో ఉన్నారన్నది కూడా పవన్‌కు తెలీనట్లె ఉంది. ప్రజలకు అయితే అసలు ఎక్కడెక్కడ జనసేనా బరిలో ఉందో తెలీదు. అయితే అధికారికంగా మాత్రం కేవలం 21 అసెంబ్లీ, మచిలీపట్నం కాకినాడ రెండు ఎంపీ సీట్లలో జనసేన అధికారికంగా పోటీ చేస్తూ మిగతా చోట్ల టీడీపీ-బిజెపి అభ్యర్థులకు మద్దతు ఇస్తోంది. 

అంటే జానసేన పోటీలో లోని చోట్ల జనసేన నాయకులు, కార్యకర్తలు ఓటర్లు అటు కూటమి అభ్యర్థులకు ఓట్లు వేస్తారు. వేయిస్తారు అన్నమాట. మరి ఇప్పుడు అన్నిచోట్లా స్వాతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం గ్లాసు గుర్తు కేటాయించేయడంతో జనసేనకు, టీడీపీ అభ్యర్థులకు పెద్ద చిక్కొచ్చి పడింది. మా ఊళ్ళో మాకు రావాల్సిన జనసేన ఓట్లు గాజు గ్లాసు గుర్తు  పొందిన ఇండిపెండెంట్ అభ్యర్థికి పోలైతే.. ఆ మేరకు తమకు నష్టం కలుగుతుందని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. 2014లో మంగళగిరి నుంచి వైసిపి తరఫున గెలిచిన ఆళ్ళ రామకృష్ణా రెడ్డి కేవలం 12ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు. ఇంకా 2019లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి కేవలం పాతిక ఓట్ల మెజారిటీతో బొండా ఉమాను ఓడించి మల్లాది విష్ణు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక విశాఖ జిల్లాలో టీడీపీ తరఫున గంటా శ్రీనివాస్ 1944 ఓట్ల మెజారిటీతో గెలిచారు. రాజోలులో జనసేన తరఫున గెలిచిన రాపాక వరప్రసాద్ మెజారిటీ కేవలం 814 ఓట్లు.. అంటే ఇలా తక్కువ మెజారిటీ ఉన్నచోట మూడునాలుగు వేల జనసేన ఓట్లు కానీ గాజు గ్లాసు గుర్తు పొందిన ఇండిపెండెంట్లు పట్టుకుపోతే తమ పరిస్థితి ఏమిటని కూటమి కలవరపడుతోంది. 

ఇప్పటికే రాష్ట్రంలో గాజు గ్లాసు గుర్తు పొందిన కొందరు స్వాతంత్ర అభ్యర్థులు జాబితా ఇదిగో.. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు... జనసేన పోటీ చేయని ప్రాంతాల్లో... గ్లాస్ టంబ్లర్ గుర్తు కేటాయించబడిన అభ్యర్ధులు...

  • విజయనగరం మాజీ ఎమ్మెల్యే, స్వతంత్ర అభ్యర్ధగా నామినేషన్ వేసిన మీసాల గీత
    మైలవరం లో స్వతంత్ర అభ్యర్థి వల్లభనేని నాగ పవన్ కుమార్

  • విజయవాడ సెంట్రల్ లో ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి అభ్యర్థి గొల్లపల్లి ఫణిరాజ్

  • టెక్కలిలో స్వతంత్రం అభ్యర్థి అట్టాడ రాజేష్

  • కాకినాడ జిల్లా: జగ్గంపేట నియోజక వర్గంలో స్వతంత్ర అభ్యర్థి పాఠంశెట్టి సూర్యచంద్ర

  • పెదకూరపాడు లో కుట్ర కోణం: ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కుమారుడు, స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ వేసిన నంబూరు కళ్యాణ్ బాబుకు గ్లాస్ టంబ్లర్ గుర్తును కేటాయింపు

  • గన్నవరంలో స్వతంత్ర అభ్యర్థి వల్లభనేని వంశీమోహన కృష్ణ

  • మంగళగిరిలో నవతరం పార్టీ అభ్యర్ధి రావుసుబ్రహ్మణ్యం కి గాజుగ్లాసు గుర్తు కేటాయించిన రిటర్నింగ్ అధికారి

  • మదనపల్లె లో ఇండిపెండెంట్ గా బరిలో ఉన్న షాజహాన్

  • అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న దళిత బహుజన పార్టీకి చెందిన వడ్లమూరి కృష్ణ స్వరూప్

  • విజయవాడ పార్లమెంట్ అభ్యర్ధి.. నవతరం పార్టీ అభ్యర్ధి కృష్ణ కిషోర్

రాజమండ్రి సిటీ అసెంబ్లీ మరియు పార్లమెంట్ కు పోటీ చేస్తున్న, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) పార్టీ అభ్యర్థి మేడా శ్రీనివాసరావు గాజు గ్లాసు గుర్తు పై కోర్టులో విజయం సాధించిన హైకోర్టు అడ్వకేట్ మెడా శ్రీనివాసరావు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ తరుపున గాజు గ్లాసు గుర్తు తో రాష్ట్రంలో ఇంకా కొంతమంది పోటీలో ఉన్నారు.

:::: సిమ్మాదిరప్పన్న

Advertisement
 
Advertisement