rebel candidates
-
Lok sabha elections 2024: మూడో దశలో మహా ఫైట్
మహారాష్ట్రలో మూడో దశ లోక్‌సభ ఎన్నికల సమరం మహాయుతి, మహా వికాస్ అగాడీ రెండు కూటముల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. పశి్చమ మహారాష్ట్రలో ఏడు స్థానాలు, కొంకణ్, మరాఠ్వాడా నుంచి రెండేసి చొప్పున మొత్తం 11 స్థానాలకు ఈ నెల 7న పోలింగ్ జరగనుంది. బీజేపీ, ఎన్సీపీ, శివసేనతో కూడిన అధికార మహాయుతి కూటమి ఒకవైపు.. కాంగ్రెస్, ఉద్ధవ్ శివసేన, శరద్ పవార్ ఎన్సీపీలతో కూడిన ఎంవీఏ మరోవైపు మోహరించాయి. పలుచోట్ల రెబెల్ అభ్యర్థులూ వాటికి సవాలు విసురుతున్నారు. ఉద్ధవ్, శరద్ వర్గాలకు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి... ఉస్మానాబాద్ మరాఠ్వాడా ప్రాంతంలో ప్రముఖ పట్టణం. దీని పేరును సర్కారు ఇటీవలే దారాశివ్‌గా మార్చింది. సిట్టింగ్ ఎంపీ ఓం ప్రకాశ్ రాజే నింబాల్కర్ శివసేన (ఉద్ధవ్) తరఫున పోటీలో ఉన్నారు. తుల్జాపూర్ బీజేపీ ఎమ్మెల్యే రాణా జగ్జీత్ సిన్హా భార్య అర్చనా పాటిల్‌ను మహాయుతి కూటమి బరిలో దింపింది. ఆమె ఇటీవలే ఎన్సీపీ (అజిత్) పారీ్టలో చేరి లోక్‌సభ టికెట్ సంపాదించారు. అర్చన మామ పదమ్సిన్హా పాటిల్ సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు. అజిత్ పవార్ భార్య సునేత్రకు సోదరుడు కూడా. నింబాల్కర్ కుటుంబంతోనూ వీరికి దగ్గరి బంధుత్వముంది. కానీ వీరి కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. నింబాల్కర్ తండ్రిని చంపించినట్టు పదమ్సిన్హాపై ఆరోపణలున్నాయి! 2019 లోక్‌సభ ఎన్నికల్లో నింబాల్కర్ ఈ స్థానంలో రాణా జగ్జీత్ సిన్హాను ఓడించడం విశేషం. ఈసారి మహిళల ఓట్లు తనను గెలిపిస్తాయని అర్చన నమ్మకం పెట్టుకున్నారు.సాంగ్లి బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ సంజయ్ కాక పాటిల్ మళ్లీ బరిలో ఉన్నారు. విపక్ష మహా వికాస్ అగాడీ తరఫున కాంగ్రెస్ నేత విశాల్ పాటిల్ టికెట్ ఆశించగా పొత్తులో భాగంగా ఈ స్థానం శివసేన (ఉద్ధవ్)కు వెళ్లింది. దాంతో ఆయన రెబెల్‌గా పోటీకి దిగారు. శివసేన (ఉద్ధవ్) నుంచి రెజ్లర్ చంద్రహర్ పాటిల్ బరిలో ఉన్నారు. దాంతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ ఓట్లను విశాల్ చీలుస్తారని, అది బీజేపీకి కలిసొస్తుందని భావిస్తున్నారు.సోలాపూర్ 2014, 2019ల్లో ఇక్కడ వరుసగా బీజేపీయే నెగ్గింది. ఈసారి మాత్రం కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే కుమార్తె ప్రణతీ షిండే బరిలో ఉండటమే అందుకు కారణం. నిజానికి ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ చివరిదాకా ప్రయత్నించి విఫలమైంది. బీజేపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే రామ్ సాత్పుతే రంగంలోకి దిగారు. ప్రణతి కూడా సోలాపూర్ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యేనే కావడం విశేషం! ఆమె తొలిసారి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. ఇక్కడ అభ్యరి్థని మార్చే ఆనవాయితీని ఈసారి కూడా బీజేపీ కొనసాగించింది. 2014లో శరద్ బాన్సోడ్, 2019లో జైసిద్ధేశ్వర్ స్వామి బీజేపీ తరఫున గెలిచారు. ఆ రెండుసార్లూ ఓటమి చవిచూసింది సుశీల్‌కుమార్ షిండేనే! ఈసారి మజ్లిస్ ఇక్కడ అభ్యర్థిని ఉపసంహరించుకోవడం కాంగ్రెస్‌కు కలిసొచ్చే అంశం. సోలాపూర్, మాధా స్థానాల్లో విజయం కోసం చెమటోడ్చాల్సిందేనని బీజేపీ నేతలే అంగీకరిస్తుండటం విశేషం!సతారా మహాయుతి కూటమి తరఫున ఎన్సీపీ (శరద్ పవార్) నేత, కారి్మక నాయకుడు, ఎమ్మెల్సీ శశికాంత్ షిండే బరిలో ఉన్నారు. దాంతో కొల్హాపూర్ మాదిరిగానే ఇక్కడ కూడా బీజేపీ వ్యూహాత్మకంగా ఛత్రపతి శివాజీ వంశీయుడు, రాజ్యసభ ఎంపీ ఉదయన్‌రాజే భొసాలేకు టికెటిచి్చంది. మహాయుతి కూటమి నుంచి ఈ స్థానంలో పోటీ చేయాలని తొలుత ఎన్సీపీ (అజిత్) భావించింది. ఉదయన్‌రాజే భోసాలే పోటీకి ఆసక్తి చూపడంతో ఈ స్థానాన్ని బీజేపీ తీసుకుంది.రత్నగిరి–సింధుదుర్గ్ సిట్టింగ్ ఎంపీ, శివసేన (ఉద్ధవ్) నేత వినాయక్ రౌత్ మళ్లీ బరిలో ఉన్నారు. ఆయనపై కేంద్ర మంత్రి నారాయణ్ రాణేను బీజేపీ పోటీకి దింపింది. శివసేన రెండుగా చీలిన తర్వాత జరుగుతున్న ఎన్నిక కావడంతో రెండుసార్లుగా గెలుస్తూ వస్తున్న రౌత్‌కు ఈసారి విజయం తేలిక కాదంటున్నారు. ఈ నేపథ్యంలో ఉద్దవ్ వర్గానికి చెందిన స్థానిక నేతలు, శ్రేణుల ఐక్యతకు ఈ ఎన్నిక పరీక్షగా మారింది.రాయగఢ్ ఇక్కడ పోటీ ప్రధానంగా సిట్టింగ్ ఎంపీ, ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తత్కారే, శివసేన (ఉద్ధవ్) అభ్యర్థి అనంత్ గీతే మధ్యే ఉంది. 2019 ఎన్నికల్లో అనంత్ గీతేపైనే తత్కారే 30 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. అంతకుముందు రెండు పర్యాయాలు వరుసగా అనంత్ గీతేనే ఇక్కడ గెలిచారు.మాధా బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ రంజిత్ సిన్హా నాయక్ నింబాల్కర్ మళ్లీ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఎన్సీపీ అభ్యర్థి సంజయ్మామ విఠల్‌రావు షిండేపై 86 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. కానీ మళ్లీ నింబాల్కర్‌కు టికెటివ్వడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ జిల్లా కార్యదర్శి ధైర్యశీల్ మోహిత్ పాటిల్ ఇటీవలే శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీలో చేరారు. ఆ పార్టీ నుంచి రంగంలోకి దిగి బీజేపీకి గట్టి సవాలు విసురుతున్నారు. మోహిత్‌కు స్థానికంగా బాగా పట్టుండటంతో ఇక్కడ బీజేపీ ఎదురీదుతోందని చెబుతున్నారు.అజిత్కూ ప్రతిష్టాత్మకమే ఎన్సీపీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు కూడా ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. బాబాయి శరద్ పవార్‌తో విభేదించి పార్టీని చీల్చి తన వర్గానికే అసలు ఎన్సీపీగా అధికారిక గుర్తింపు సాధించుకోవడం తెలిసిందే. రాయగఢ్, ఉస్మానాబాద్తో పాటు బారామతిలో విజయం ఆయనకు సవాలుగా మారింది. బారామతిలో అజిత్ భార్య సునేత్ర బరిలో ఉన్నారు. తన మరదలు, శరద్ పవార్ కూతురైన సిట్టింగ్ ఎంపీ సుప్రియా సులేతో ఆమె తలపడుతుండటం విశేషం.– సాక్షి, నేషనల్ డెస్క్ -
గ్లాసు ముక్కలైంది.. సేనానినే గుచ్చుతోంది
ఏయ్ జగన్. నువ్వెంత.. నీ బతుకెంత అని అరిచి గగ్గోలు పెట్టాడు.. నాకు మోడీ తెలుసు.. అమిత్ షా తెలుసు.. వాళ్ళ ఫోన్ నంబర్ల తెలుసు.. నాకు కేంద్ర నిఘా వర్గాల సమాచారం ఉంది.. ఒక్కటి గుర్తెట్టుకో.. గ్లాసు పగిలేకొద్ది పదునెక్కుతుంది. ఇన్ని కబుర్లు చెప్పాడు.. ఇప్పుడు చూస్తే చివరకు సేనాని గాజు గ్లాసును కాపాడుకోలేకపోయారు. జనసేనా పోటీ చేస్తున్న 21 చోట్ల మాత్రం గాజుగ్లాసు ఆ అభ్యర్థులకు కేటాయించారు. అలా జనసేన పోటీలో లేని చోట్ల మాత్రం ఆ గ్లాసు గుర్తును ఓపెన్ సింబల్‌గా ఉంచేసి స్వాతంత్ర అభ్యర్థులకు ఆ గుర్తు కేటాయించారు. దీంతో ఈ పరిణామం చూస్తుంటే రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్ సభ నియోజకవర్గాల ఈవీఎంల్లోనూ గాజుగ్లాసు ఉంటుందన్నమాట. ఇదివరకు జరిగిన పలు ఎన్నికల్లో జనసేన పార్టీ ఉనికి చాటుకోలేకపోవడం, అసలు ఎన్నికల్లో పోటీ చేసి నిబంధనల మేరకు ఓట్లు సాదించకపోవడం వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకున్న ఎన్నికల సంఘం ఇప్పుడు గాజు గ్లాసును ఫ్రీ సింబల్ చేసేసి అందరికీ పంచేసింది. ఇదిప్పుడు కూటమి అభ్యర్థులపాలిట పెనుముప్పుగా మారిందిఅసలు పార్టీని సీరియస్‌గా నడిపే ఉద్దేశ్యం లేని పవన్ కేవలం చంద్రబాబుకు మద్దతుదారుగా ఉండడానికే మొగ్గు చూపి చివరకు పార్టీ ఉనికికి ముప్పు తెచ్చారు. అసలు పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున ఎన్ని చోట్ల, ఎన్ని నియోజకవర్గాల్లో ఒరిజినల్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇంకెన్ని చోట్ల టీడీపీ నుంచి అరువు తెచ్చుకున్న గెస్ట్ అభ్యర్థులు బరిలో ఉన్నారన్నది కూడా పవన్‌కు తెలీనట్లె ఉంది. ప్రజలకు అయితే అసలు ఎక్కడెక్కడ జనసేనా బరిలో ఉందో తెలీదు. అయితే అధికారికంగా మాత్రం కేవలం 21 అసెంబ్లీ, మచిలీపట్నం కాకినాడ రెండు ఎంపీ సీట్లలో జనసేన అధికారికంగా పోటీ చేస్తూ మిగతా చోట్ల టీడీపీ-బిజెపి అభ్యర్థులకు మద్దతు ఇస్తోంది. అంటే జానసేన పోటీలో లోని చోట్ల జనసేన నాయకులు, కార్యకర్తలు ఓటర్లు అటు కూటమి అభ్యర్థులకు ఓట్లు వేస్తారు. వేయిస్తారు అన్నమాట. మరి ఇప్పుడు అన్నిచోట్లా స్వాతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం గ్లాసు గుర్తు కేటాయించేయడంతో జనసేనకు, టీడీపీ అభ్యర్థులకు పెద్ద చిక్కొచ్చి పడింది. మా ఊళ్ళో మాకు రావాల్సిన జనసేన ఓట్లు గాజు గ్లాసు గుర్తు పొందిన ఇండిపెండెంట్ అభ్యర్థికి పోలైతే.. ఆ మేరకు తమకు నష్టం కలుగుతుందని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. 2014లో మంగళగిరి నుంచి వైసిపి తరఫున గెలిచిన ఆళ్ళ రామకృష్ణా రెడ్డి కేవలం 12ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు. ఇంకా 2019లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి కేవలం పాతిక ఓట్ల మెజారిటీతో బొండా ఉమాను ఓడించి మల్లాది విష్ణు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక విశాఖ జిల్లాలో టీడీపీ తరఫున గంటా శ్రీనివాస్ 1944 ఓట్ల మెజారిటీతో గెలిచారు. రాజోలులో జనసేన తరఫున గెలిచిన రాపాక వరప్రసాద్ మెజారిటీ కేవలం 814 ఓట్లు.. అంటే ఇలా తక్కువ మెజారిటీ ఉన్నచోట మూడునాలుగు వేల జనసేన ఓట్లు కానీ గాజు గ్లాసు గుర్తు పొందిన ఇండిపెండెంట్లు పట్టుకుపోతే తమ పరిస్థితి ఏమిటని కూటమి కలవరపడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో గాజు గ్లాసు గుర్తు పొందిన కొందరు స్వాతంత్ర అభ్యర్థులు జాబితా ఇదిగో.. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు... జనసేన పోటీ చేయని ప్రాంతాల్లో... గ్లాస్ టంబ్లర్ గుర్తు కేటాయించబడిన అభ్యర్ధులు...విజయనగరం మాజీ ఎమ్మెల్యే, స్వతంత్ర అభ్యర్ధగా నామినేషన్ వేసిన మీసాల గీతమైలవరం లో స్వతంత్ర అభ్యర్థి వల్లభనేని నాగ పవన్ కుమార్విజయవాడ సెంట్రల్ లో ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి అభ్యర్థి గొల్లపల్లి ఫణిరాజ్టెక్కలిలో స్వతంత్రం అభ్యర్థి అట్టాడ రాజేష్కాకినాడ జిల్లా: జగ్గంపేట నియోజక వర్గంలో స్వతంత్ర అభ్యర్థి పాఠంశెట్టి సూర్యచంద్రపెదకూరపాడు లో కుట్ర కోణం: ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కుమారుడు, స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ వేసిన నంబూరు కళ్యాణ్ బాబుకు గ్లాస్ టంబ్లర్ గుర్తును కేటాయింపుగన్నవరంలో స్వతంత్ర అభ్యర్థి వల్లభనేని వంశీమోహన కృష్ణమంగళగిరిలో నవతరం పార్టీ అభ్యర్ధి రావుసుబ్రహ్మణ్యం కి గాజుగ్లాసు గుర్తు కేటాయించిన రిటర్నింగ్ అధికారిమదనపల్లె లో ఇండిపెండెంట్ గా బరిలో ఉన్న షాజహాన్అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న దళిత బహుజన పార్టీకి చెందిన వడ్లమూరి కృష్ణ స్వరూప్విజయవాడ పార్లమెంట్ అభ్యర్ధి.. నవతరం పార్టీ అభ్యర్ధి కృష్ణ కిషోర్రాజమండ్రి సిటీ అసెంబ్లీ మరియు పార్లమెంట్ కు పోటీ చేస్తున్న, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) పార్టీ అభ్యర్థి మేడా శ్రీనివాసరావు గాజు గ్లాసు గుర్తు పై కోర్టులో విజయం సాధించిన హైకోర్టు అడ్వకేట్ మెడా శ్రీనివాసరావు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ తరుపున గాజు గ్లాసు గుర్తు తో రాష్ట్రంలో ఇంకా కొంతమంది పోటీలో ఉన్నారు.:::: సిమ్మాదిరప్పన్న -
కూటమికి గుచ్చుకున్న గాజు గ్లాసు!
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో కూటమికి మరో తల నొప్పి మొదలైంది. టీడీపీ, జనసేన పార్టీ రెబల్స్ ఇస్తున్న షాక్‌కు కూటమికి గాజు గ్లాసు గుచ్చుకుంటోంది. గాజు గ్లాసుతో టీడీపీ, జనసేన రెబల్స్ పోటీలోకి దిగుతున్నారు. తాజాగా గాజు గ్లాస్‌ను ఫ్రీ సింబల్‌గా వాడుకోవచ్చని ఈసీ వర్గాలు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈసీపై.. టీడీపీ, బీజేపీ పార్టీల ఒత్తిడి ఫలించదు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు వ్యవహరించింది.దీంతో 21 అసెంబ్లీ చోట్ల జనసేన అభ్యర్థులు గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేస్తుండగా.. ఈసీ ప్రకటనతో మిగిలిన చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ కేటాయించే అవకాశం ఉంది. కాగా, టీడీపీ, జనసేన రెబల్స్.. గాజు గ్లాస్ గుర్తుతోనే కూటమికి ధమ్కీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విజయనగరం టీడీపీ రెబల్ మీసాల గీతకు, జగ్గంపేట జనసేన రెబల్ సూర్యచంద్రకు ఈసీ గాజు గ్లాస్ కేటాయించింది. ఇక.. ఎస్ కోటలో జనసేన రెబల్ కొట్యాడ లోకాభిరామకోటి గాజు గ్లాస్‌తో పోటీకి దిగుతున్నారు. మరోవైపు.. టీడీపీకి పలు నియోజకవర్గాల్లో రెబెల్స్ బెడద తప్పటం లేదు. విజయనగరం, ఉండి, పోలవరం, పెనుగొండ, హిందూపురంలో బరిలో రెబల్ అభ్యర్థులు పోటీకి దిగుతున్నారు. సినీనటుడు బాలకృష్ణపై పరిపూర్ణానంద స్వామి, పరిటాల సునీతపై ప్రొఫెసర్ రాజేష్, అదితి గజపతిపై మీసాల గీత , జ్యోతుల నెహ్రూపై సూర్యచంద్ర, రఘురామకృష్ణంరాజుపై ఉండిలో మాజీ ఎమ్మెల్యే శివ రామరాజు, పోలవరంలో టీడీపీ రెబల్ మొడియం సూర్యచంద్రరావు బరిలో నిలుస్తున్నారు. -
మన పని ఈజీగా అయ్యేలా చేశారు!
మన పని ఈజీగా అయ్యేలా చేశారు! -
Rajasthan Assembly elections 2023: బీజేపీ గుండెల్లో రె‘బెల్స్’
రాజస్తాన్‌లో తిరుగుబాటు నేతలు బీజేపీకి దడ పుట్టిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం చేసిన చరిత్ర వారిది! ఆ ఎన్నికల్లో చివరి క్షణంలో పార్టీ మొండి చేయి చూపడంతో ఆగ్రహించి డజను మంది నేతలు స్వతంత్రులుగా బరిలో దిగారు. తాము ఓడటమే గాక బీజేపీ అభ్యర్థులను కూడా ఓడించి కాంగ్రెస్ నెత్తిన పాలు పోశారు. అదే సమయంలో 2018లో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడి తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేసిన 13 మందిలో ఏకంగా 12 మంది విజయం సాధించడం విశేషం. పైగా ఫలితాలు వెలువడగానే వారంతా కాంగ్రెస్ గూటికే చేరుకున్నారు. అలా నికరంగా ఆ పార్టీకి పెద్దగా నష్టమేమీ జరగలేదు. ఈసారి కూడా రెండు పార్టీల నుంచీ రెబెల్స్ రంగంలో ఉన్న నేపథ్యంలో వారు ఎవరికి చేటు చేస్తారోనన్న చర్చ జరుగుతోంది...! రాజస్తాన్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 830 మంది స్వతంత్రులు పోటీ చేశారు. వారిలో 13 మంది కాంగ్రెస్, 12 మంది బీజేపీ నేతలున్నారు. పార్టీ టికెట్ దక్కకపోవడంతో వారు తిరుగుబావుటా ఎగరేశారు. కాంగ్రెస్ రెబెల్స్‌లో ఏకంగా 12 మంది గెలవడమే గాక ఆ వెంటనే కాంగ్రెస్‌లో చేరారు. ఈసారి వారిలో 10 మందికి సీఎం అశోక్ గహ్లోత్ కాంగ్రెస్ టికెట్లు కూడా ఇప్పించారు. మరోవైపు 12 మంది బీజేపీ రెబల్స్‌లో ఒక్కరు కూడా నెగ్గలేదు. కుల్దీప్ ధన్‌ఖడ్, దేవీసింగ్ షెకావత్, ధన్సింగ్ రావత్, హేమ్‌సింగ్ భడానా వంటి పెద్ద నాయకులు కూడా రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. కాకపోతే ఈ 12 మందీ తమ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులందరినీ ఓడించారు. అలా రెబెల్స్ దెబ్బకు బీజేపీ బాగా నష్టపోయింది. బీజేపీకి 73 సీట్లు రాగా కాంగ్రెస్ 100 స్థానాల్లో నెగ్గడం తెలిసిందే. 2013లో కూడా కాంగ్రెస్ రెబెల్స్‌లో చాలామంది నెగ్గగా బీజేపీ తిరుగుబాటు అభ్యర్థుల్లో అత్యధికులు ఓటమి చవిచూశారు. ఈసారి కూడా రాష్ట్రంలో ఏకంగా 737 మంది స్వతంత్ర అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు. వీరిలో బీజేపీ, కాంగ్రెస్ టికెట్లు ఆశించి భంగపడ్డ వారూ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. మొత్తమ్మీద 18 మంది బీజేపీ రెబెల్స్, 14 మంది కాంగ్రెస్ రెబెల్స్ స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. వీరి ప్రభావం ఆ పారీ్టలపై ఎలా ఉంటుందన్నది ఫలితాల అనంతరమే తేలనుంది. రాష్ట్రంలో నవంబర్ 25న పోలింగ్ జరగనుంది. ఫలితాలు మిగతా 4 రాష్ట్రాలతో పాటు డిసెంబర్ 3న వెల్లడవుతాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘83 ఏళ్లొచ్చాయ్.. ఇక రిటైర్ అవ్వండి’
రెబల్ ఎమ్మెల్యేలతో బుధవారం ర్యాలీ నిర్వహించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్.. ఎన్సీపీ అధినేత, సొంత బాబాయ్ శరద్ పవార్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మీకు 83 ఏళ్ల వయసొచ్చింది.. రిటైర్ అయిపోయి.. కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలంటూ వేదిక నుంచి ఎన్సీపీ సుప్రీంకు చురకలటించారాయన. అలాగే.. గతంలో బీజేపీతో జట్టు కట్టేందుకు శరద్ పవార్ ప్రయత్నించారని, పార్టీ చీఫ్ పదవికి రాజీనామా పేరుతో డ్రామాలు ఆడారంటూ సంచలన వ్యాఖ్యలే చేశారాయన. ఉద్దవ్ థాక్రే వైఖరిపై అసంతృప్తితో ఏక్నాథ్ షిండే బీజేపీతో జట్టు కట్టే సమయంలో.. పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఎమ్మెల్యేలంతా బీజేపీ వైపే మొగ్గు చూపించారు. అంతేకాదు సంతకాల సేకరణ కూడా జరిగింది. మా వైఖరికి మద్దతు ప్రకటించాలని, లేకుంటే నియోజకవర్గాల్లో సమస్యలు వస్తాయని శరద్ పవార్ దృష్టికి తీసుకెళ్లాం. జయంత్ పాటిల్, నేను కలిసి ఈ మేరకు బీజేపీతో చర్చించేందుకు ముందుకు వచ్చాం కూడా. ఆ సమయంలో ఆయన(శరద్ పవార్‌ను ఉద్దేశించి) ఏం చేసినా మీడియా కంట పడకూడదని చెప్పారు. ఏదైనా ఉంటే బీజేపీ వాళ్లతో ఫోన్లో మాట్లాడమని సూచించారు. అప్పటికీ ఏక్నాథ్ షిండే ఇంకా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. ఎందుకు మాట మార్చారో తెలీదు 2019లో సమయంలోనే ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎన్సీపీ ఐదుసార్లు బీజేపీతో భేటీ అయ్యిందని అజిత్ పవార్ అన్నారు. కానీ, ఏం జరిగిందో తెలియదు. హఠాత్తుగా బీజేపీతో పొత్తు లేదని.. శివసేనతో ముందుకు వెళ్తున్నామని నాకు చెప్పారు. కారణం ఏంటో కూడా నాకు తెలియదు. శరద్ పవార్ వెంట ఇప్పుడున్న వాళ్లు.. 2017లో శివసేనను కులపిచ్చి పార్టీ అన్నారు. కానీ, 2019లో వాళ్లతోనే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అలాంటిది ఇప్పుడు నన్నెందుకు విలన్‌ను చేస్తున్నారో అర్థం కావడం లేదు. అయినా మీరంటే నాకు గౌరవం ఉంది అంటూ శరద్ పవార్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు అజిత్ పవార్. #WATCH | Maharashtra Deputy CM Ajit Pawar says, "You portrayed me as a villain in front of everyone. I still have deep respect for him (Sharad Pawar)...But you tell me, IAS officers retire at 60...even in politics - BJP leaders retire at 75. You can see the example of LK Advani… pic.twitter.com/T2XqCzEH89 — ANI (@ANI) July 5, 2023 ఆ డ్రామా ఎందుకు? ఒక ఐఏఎస్ అధికారి 60 ఏళ్లకు రిటైర్ అవుతాడు. ఇతర పార్టీల్లో నేతలకు రిటైర్మెంట్ వయసు ఉంటుంది. బీజేపీనే అందుకు ఉదాహరణగా తీసుకోండి. 75 ఏళ్లు రాగానే అద్వానీ, మురళి మనోహర్ జోషి లాంటి వాళ్లు పక్కకు తప్పుకున్నారు. అప్పుడే కదా కొత్త తరానికి అవకాశం దొరికేది. మరి ఎన్సీపీలో కొత్తవాళ్లకు అవకాశం ఉండదా?. మేం ఏమైనా తప్పు చేసి ఉంటే.. మాకు చెప్పండి సరిదిద్దుకుంటాం. మీ వయసు ఇప్పుడు 83 ఏళ్లు. ఇక రిటైర్ అవ్వారా? మాకు మీ ఆశీస్సులు ఇవ్వరా?.. మేం మీరు ఆయురారోగ్యాలో ఉండాలని ప్రార్థిస్తున్నాం అంటూ బాబాయ్ శరద్ పవార్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన. అంతేకాదు.. తాజాగా శరద్ పవార్ పార్టీ చీఫ్ పదవికి రాజీనామా చేయడం.. వెంటనే వెనక్కి తీసుకున్న వ్యవహారంపైనా అజిత్ పవార్ సెటైర్లు వేశారు. ఆ సమయంలో ఆయన సుప్రియా సూలేను జాతీయ అధ్యక్షురాలిగా ప్రకటించాలనుకున్నారు. అది మాకు అర్థమైంది. దానికి మేం సిద్ధంగా ఉన్నాం కూడా. వెనక్కి తీసుకునే ఉద్దేశమే ఉంటే రాజీనామా చేయడం ఎందుకని నిలదీశారాయన. ఇక తన సోదరి, ఎంపీ సుప్రియా సూలేకు ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అప్పజెప్పడంపైనా అజిత్ పవార్ పరోక్షంగా స్పందించారు. పవర్ఫుల్ ఫ్యామిలీలో పుట్టకపోవడం మా తప్పా? అంటూ వ్యాఖ్యానించారాయన. ఏదో ఒక రోజు సీఎం అవ్వాలని.. ఎన్సీపీ తిరుగుబాటు నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తన మనసులో మాట బయటపెట్టారు. ఏదోఒకరోజు మహారాష్ట్రకు ముఖ్యమంత్రి అవ్వాలన్నదే తన కోరికని.. అది నెరవేర్చుకుని తీరతానని అన్నారాయన. 53 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలలో 40 మందితో పాటు ఎమ్మెల్సీల మద్దతు కూడా తనకు ఉందని అంటున్నారాయన. ఇదిలా ఉంటే.. ఎన్సీపీ సంక్షోభం కేంద్ర ఎన్నికల సంఘాన్ని చేరింది. శరద్ పవార్ తానే ఎన్సీపీని నడిపిస్తానని చెబుతుండగా.. అజితపవార్ నేతృత్వంలోని రెబల్ గ్రూప్ మాత్రం పార్టీ పేరు, గుర్తు కోసం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిచింది. మరోవైపు శరద్ పవార్ వర్గం తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్‌కు లేఖ రాసింది. -
‘కాంగ్రెస్ దివాలా.. అందుకే మాకు వద్దు అనుకుంటే వారికి ముద్దయ్యారు’
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంతో విమర్శల జోరు పెంచాయి అధికార, ప్రతిపక్షాలు. మంగళవారం బాగల్కోట్లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. కాంగ్రెస్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు. హస్తం పార్టీ దివాలా తీసిందని, ఆ పార్టీకి నాయకులే కరవయ్యారని ఎద్దేవా చేశారు. అందుకే బీజేపీ రెబల్ నాయకులపై ఆధారపడిందని సెటర్లు వేశారు. ఎన్నికలకు ముందు కమలం పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన వారికి టికెట్లు ఇస్తున్నారని, ఆ పార్టీ పరిస్థితికి ఇదే నిదర్శనమని ధ్వజమెత్తారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి సీనియర్లను పక్కనపెట్టింది బీజేపీ. యువ నేతలకు టికెట్లు కేటాయించింది. దీంతో చాలా మంది సీనియర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్, జేడీఎస్‌లో చేరారు. టికెట్లు ఖరారు చేసుకున్నాకే పార్టీ మారారు. ఈనేపథ్యంలోనే అమిత్‌షా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. కాగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను ఒకే విడతలో మే 10న నిర్వహించనున్నారు. 13న కౌంటింగ్, ఫలితాలు ప్రకటిస్తారు. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు 2,613 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ఇటీవల నిర్వహించిన సీఓటర్ సర్వేలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని తెలిపింది. అధికార బీజేపీకి మెజారిటీ రాదని పేర్కొంది. దీంతో కాంగ్రెస్ దృఢ విశ్వాసంతో ముందుకెళ్తోంది. ఈసారి 150 స్థానాలకుపైగా కైవసం చేసుకుంటామని హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు. చదవండి: షిండేకు ఊహించని షాకిచ్చిన బీజేపీ.. సీఎంగా తప్పుకోవాలని హుకుం..? -
రెబల్స్ మంత్రులకు షాక్.. సీఎం ఉద్దవ్ ఠాక్రే సంచలన నిర్ణయం!
ముంబై: మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మొదలైన రాజకీయ సంక్షోభం రసవత్తర మలుపులు తిరుగుతోంది. తాజాగా శివసేన చీఫ్, సీఎం ఉద్ధవ్ ఠాక్రే సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. శివసేన రెబల్స్‌పై కొరడా ఝళిపించేందుకు సిద్ధమై.. 9 మంది రెబల్స్ మంత్రులను వారి శాఖల నుంచి తొలగించారు. అందులో ఐదుగురు కేబినెట్, నలుగురు సహాయ మంత్రుల మంత్రిత్వశాఖలను వేరేవారికి అప్పగించారు. రాష్ట్రంలో పరిపాలనా పరంగా ఎలాంటి ఆటంకాలు, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడంతో పాటు ఆయా శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనుల్లో జాప్యం జరగకూడదని ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎంఓ కార్యాలయం ప్రకటించింది. ఎవరి శాఖలు... ఎవరికి.. రెబల్స్ గ్రూపు నాయకత్వం వహిస్తున్న ఏక్నాథ్ షిండే మంత్రిగా ఉన్న పట్టణాభివృద్ధి, పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖలను మంత్రి సుభాష్ దేశాయ్‌కు అప్పగించారు. మరో రెబల్ మంత్రి గులాబ్రావ్ పాటిల్ వద్ద ఉన్న నీటి సరఫరా, పారిశుద్ధ్యం శాఖల బాధ్యతలను మంత్రి అనిల్ పరబ్‌కు అప్పగించారు. అలాగే మంత్రి ఉదయ్ సావంత్ వద్ద ఉన్న ఉన్నత విద్య, సాంకేతిక విద్యా శాఖలను మంత్రి ఆదిత్య ఠాక్రేకు అప్పగించారు. మంత్రి దాదాజీ భూసే వద్ద ఉన్న వ్యవసాయం, మాజీ సైనికుల సంక్షేమ శాఖలు, రెబల్ మంత్రి సందీపన్ భూమారే వద్ద ఉన్న ఉపాధి హామీ, ఉద్యానవన శాఖలను మంత్రి శంకర్ గడఖ్‌కు కేటాయించారు. శంభురాజ్ దేశాయ్ వద్ద ఉన్న మూడు పోర్ట్‌ఫోలియోలను సంజయ్ బన్సోడే, సతేజ్ పాటిల్, విశ్వజిత్ కదమ్‌లకు అప్పగించారు. రాజేంద్ర పాటిల్ మంత్రిగా ఉన్న నాలుగు మంత్రిత్వ శాఖలు విశ్వజీత్ కదమ్, ప్రజక్త్ తాన్పురే, సతేజ్ పాటిల్, అదితి తత్కరేలకు కేటాయించారు. అబ్దుల్ సత్తార్‌తో ఉన్న మూడు పోర్ట్‌ఫోలియోలు ప్రస్తుతం ప్రజక్త్ తాన్పురే, సతేజ్ పాటిల్, అదితి తత్కరే వద్ద ఉన్నాయి. రెబల్ మంత్రి ఓంప్రకాష్ కుడు వద్ద ఉన్న నాలుగు పోర్ట్‌ఫోలియోలను మంత్రులు అదితి తత్కరే, సతేజ్ పాటిల్, సంజయ్ బన్సోడే, దత్తాత్రయ్ భర్నేలకు అప్పగించారు. మరోవైపు ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్‌ఠాక్రేకు ఏక్నాథ్ షిండే ఫోన్ చేశారు. ఈ నేపథ్యంలో ఎంఎన్ఎస్ కీలక నేతలతో రాజ్ ఠాక్రే భేటీ అయ్యారు. చదవండి: Maharashtra Poliical Crisis: శివసేన రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ . -
సీఎం థాక్రేకు రెబల్ ఎమ్మెల్యే షిండే లేఖ.. ఘాటు వ్యాఖ్యలు
మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ప్రభుత్వం, సీఎం ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబాటు చేశారు. ఈ క్రమంలో మరో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్న ఏక్నాథ్ షిండే.. సీఎం ఉద్ధవ్ థాక్రేకు గురువారం మూడు పేజీల లేఖ రాశారు. ఈ లేఖలో షిండే ఘాటుగా స్పందించారు. సీఎం థాక్రేను కలిసే ప్రసక్తేలేదని షిండే.. తేల్చి చెప్పారు. ఉద్ధవ్ ప్రతిపాదనలను సైతం షిండే తిరస్కరించారు. ఎమ్మెల్యేలకు ఉద్ధవ్ థాక్రే అపాయింట్మెంట్ దొరకడం లేదు. ఎమ్మెల్యేలను ఏనాడు సీఎం థాక్రే పట్టించుకోలేదుంటూ విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉండగా.. తమ పార్టీ నేతలను బీజేపీ బంధించింది అంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ही आहे आमदारांची भावना... pic.twitter.com/U6FxBzp1QG — Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) June 23, 2022 ఇది కూడా చదవండి: ప్రజలు చస్తుంటే.. రాజకీయాలు చేస్తున్నారా..?: సీఎంపై ఫైర్ -
బిహార్: తొమ్మిది మందిపై వేటువేసిన బీజీపీ
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. తొమ్మిది మంది తిరుగుబాటుదారులపై కఠిన చర్యలు తీసుకుంది. వీరంతా రానున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులపై పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను తిరుగుబాటుదారులందరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. వీరిలో రాజేంద్ర సింగ్, రామేశ్వర్ చౌరేషియా, ఉషా విద్యార్తి, రవీంద్ర యాదవ్, శ్వేతా సింగ్, ఇందూ కశ్యప్, అనిల్ కుమార్, మృణాల్ శేఖర్, అజయ్ ప్రతాప్ ఉన్నారు. "మీరు ఎన్డీఏ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. ఇది ఎన్డీఏతో పాటు పార్టీ ఇమేజ్‌ని కూడా దెబ్బతీస్తుంది. ఇది పార్టీ సూత్రాలకు విరుద్ధం. అందువల్ల, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు మిమ్మల్ని ఆరేళ్లపాటు సస్పెండ్ చేస్తున్నాం" అని రాష్ట్ర పార్టీ చీఫ్ సంజయ్ జైస్వాల్ వీరికి నోటీసులు జారీ చేశారు. (చదవండి: బిహార్ పోరు రసవత్తరం) ఈ తొమ్మిది మంది ఈ సారి ఎన్డీఏ తరఫున టికెట్ ఆశించారు. కానీ అవకాశం లభించలేదు. దాంతో వారు సొంత అభ్యర్థులపైనే పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రాజేంద్ర సింగ్, ఉషా విద్యార్తి, రామేశ్వర్ చౌరేషియా ఎల్జెపిలో చేరగా, అజయ్ ప్రతాప్ రాష్ట్రీయ లోక్ సమతా పార్టీలో చేరారు. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్), హిందూస్థాన్ అవామ్ మోర్చా (సెక్యులర్), వికాషీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) లతో కలిసి ఎన్డీఏ కూటమిగా బరిలో దిగింది. సీట్ల భాగస్వామ్య ఒప్పందం ప్రకారం, బీజేపీ 115 సీట్లలో, జేడీ(యూ) 110 సీట్లలో, వీఐసీ, హెచ్ఏఎమ్ (ఎస్) వరుసగా 11, 7 సీట్లలో పోటీ చేస్తాయి. ముఖ్యంగా, జేడీ(యూ)తో విభేదాల కారణంగా కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామి అయిన లోక్ జన్‌శక్తి పార్టీ ఈ ఎన్నికలకు ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించింది. (పాశ్వాన్ మృతి: కుమారుడికి కష్టాలు..!) బిహార్‌లో మూడు దశల్లో ఓటింగ్ జరగనుంది. మొదటి దశ పోలింగ్ అక్టోబర్ 28 న, రెండవ దశ నవంబర్ 3 న జరగాల్సి ఉండగా, చివరి దశ నవంబర్ 7 న జరుగుతుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 10 న జరుగుతుంది. -
అజ్ఞాతంలోకి ‘పోటీ’ అభ్యర్థులు..
సాక్షి, గద్వాల: స్థానిక మున్సిపాలిటీలో రెబల్స్‌గా రంగంలోకి దిగిన అభ్యర్థులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వీరిలో తప్పనిసరిగా పోటీలో ఉండేందుకు నిర్ణయించుకున్న వారే ఉన్నారు. శనివారం నామినేషన్ల పరిశీలన ముగిసింది. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని అప్పటి వరకు రెబల్స్ అభ్యర్థులు రహస్య ప్రదేశాల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. గద్వాలలో అధికార టీఆర్ఎస్, బీజేపీలో రెబల్స్ ఎక్కువగా ఉండటం, పోటీ నుంచి ఉపసంహరించుకోవాలని ఒత్తిడి వచ్చే అవకాశం ఉండటంతో వీరు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిసింది. అయిజ, అలంపూర్, వడ్డేపల్లిలో సైతం రెబల్స్ ముఖ్య నాయకులకు అందుబాటులో లేకుండాపోయారు. కార్యకర్తలు మాత్రం హడావుడిగా తిరగడం కనిపిస్తోంది. ఉపసంహరణకు యత్నాలు.. పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా నామినేషన్లు దాఖలు చేసిన పలువురిని ఉపసంహరించేందుకు ముఖ్య నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. నయానో.. భయానో.. ఉపసంహరించుకునేందుకు చర్యలు చేపట్టారు. కొన్ని వార్డుల్లో పార్టీ అభ్యర్థికి పోటీగా ఇద్దరు, ముగ్గురు నామినేషన్లు వేశారు. అయితే అధికారికంగా ప్రకటించిన అభ్యర్థి తమ పోటీదారులను విరమింపజేసేందుకు అన్ని మార్గాలను అనుసరిస్తున్నారు. కొంతమంది ఇప్పటికే మధ్యవర్తుల ద్వారా బేరసారాలు ప్రారంభించారు. గద్వాలలో ఈ పరిస్థితి కొంత ఎక్కువగా కనిపిస్తోంది. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు షాక్
సాక్షి, నల్గొండ: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చిట్యాలలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు షాక్ తగిలింది. సొంత పార్టీ నేతలే లింగయ్య వర్గానికి వ్యతిరేకంగా రెబల్స్‌గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున నకిరేకల్ నుంచి గెలుపొందిన చిరుమర్తి లింగయ్య అనంతర రాజకీయ పరిణామాల్లో టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. అయితే, ఆయన చేతిలో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గీయులు రెబల్స్‌గా గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులతో వేముల వర్గం టీఆర్ఎస్ నేతలు భేటీ అయినట్టు సమాచారం ఎమ్మెల్యే చిరుమర్తి వర్గానికి గట్టి పోటీ ఇచ్చేందుకు ఇటు టీఆర్ఎస్ రెబల్స్, అటు కాంగ్రెస్ నేతలు చేతులు కలిపినట్టు సమాచారం. -
టీడీపీ గుండెల్లో రెబెల్స్
సాక్షి, అమరావతి : పలు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీని రెబల్స్ వణికిస్తున్నారు. పార్టీకోసం పనిచేసిన తమను చంద్రబాబు మోసం చేశారని పలుచోట్ల ఆ పార్టీ నాయకులే తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగారు. చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి పోటీ నుంచి తప్పుకోవాలని, పార్టీ కోసం త్యాగం చేయాలని బతిమిలాడినా ఎవరూ లెక్కచేయలేదు. విజయనగరం జిల్లా గజపతినగరం సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పలనాయుడికి ఇవ్వడంతో ఆయన సోదరుడు, టీడీపీ ముఖ్య నాయకుడు శ్రీనివాసరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసి పార్టీకి రాజీనామా చేసి రెబల్‌గా నామినేషన్ వేశారు. తనను మోసం చేసిన టీడీపీని ఓడిస్తానని శ్రీనివాసరావు ప్రకటించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో పార్టీ సీనియర్ నాయకుడు కంఠంనేని రవిశంకర్ టీడీపీపై తిరుగుబాటు చేసి అక్కడ పార్టీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌ను ఓడించేందుకు రెబల్‌గా బరిలో నిలిచారు. వైఎస్సార్ కడప జిల్లా బద్వేలులో పార్టీ నాయకురాలు విజయజ్యోతి రెబల్‌గా బరిలో నిలిచి.. టీడీపీ తనను మోసం చేసిందని, అవసరానికి వాడుకుని పక్కన పెట్టిందని వాపోతున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్నా పట్టించుకోకుండా వేరే వారికి సీటిచ్చారని, పోటీ నుంచి తప్పుకునేందుకు అంగీకరించలేదు. రాజధాని ప్రాంతమైన తాడికొండలో సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌కు వ్యతిరేకంగా రెబల్‌గా పోటీకి దిగిన సర్వ శ్రీనివాసరావును పోటీ నుంచి తప్పించేందుకు టీడీపీ నాయకులు అన్ని ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో సీనియర్ నేత బొమ్మనచెరువు శ్రీరాములు టీడీపీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో రెబల్‌గా దిగారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో సీటు ఆశించిన కేపీఆర్‌కే ఫణీశ్వరి, చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో మాధవరెడ్డి, విశ్వనాథ్‌రెడ్డి, వైఎస్సార్ కడప జిల్లాలో రాజగోపాల్‌రెడ్డి తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలో నిలిచారు. నంద్యాల సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరి నాలుగు స్థానాల్లో పోటీకి దిగారు. నంద్యాల ఎంపీ స్థానంలో ఎస్పీవై రెడ్డి, నంద్యాల, బనగానపల్లె, శ్రీశైలం స్థానాల్లో ఆయన కుటుంబ సభ్యులు జనసేన తరఫున పోటీలో నిలబడ్డారు. -
జనసేనలో రచ్చ
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జనసేన పార్టీ వివాదాల సుడిలో చిక్కుకుంది. పార్టీలో సీట్లు అమ్ముకున్నారని పోలవరం నియోజకవర్గ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. పోలవరం అసెంబ్లీ జనసేన అభ్యర్థి సిర్రి బాలరాజు ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో రూ.2 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, అటువంటి అవినీతిపరుడైన వ్యక్తికి సీటు ఎలా ఇచ్చారని జనసేన పార్టీ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల కమిటీ ఏపీ, తెలంగాణ వైస్ చైర్మన్ దువ్వెల సృజన నిలదీశారు. జనసేన నేత కరాటం సాయి పోలవరం టికెట్‌ను సిర్రి బాలరాజుకు డబ్బులు చెల్లించి తీసుకువచ్చారని ఆమె చెప్పారు. చాలాకాలంగా పార్టీలో ఉన్న తాను ఆ సీటు కోసం ప్రయత్నించానని, తనను రూ.50 లక్షలు అడిగారని సృజన తెలిపారు. అయితే ఆ తర్వాత కరాటం సాయి బాలరాజుకు సీటు ఇప్పించారన్నారు. జనసేన పార్టీ మేనిఫెస్టోలో అవినీతి లేకుండా రాజకీయం చేస్తామంటూ అవినీతిపరుడికి టికెట్ ఎలా ఇచ్చారని ఆమె ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌కు చెబుదామంటే అవకాశం ఇవ్వలేదన్నారు. కరాటం ఫ్యామిలీ వల్ల పోలవరం స్థానాన్ని కోల్పోవలసి వస్తోందని సృజన మండిపడ్డారు. తణుకులో ఆరని చిచ్చు మరోవైపు తణుకు నియోజవర్గంలోని జనసేన పార్టీలో తలెత్తిన విబేధాలు చల్లారలేదు. పార్టీ టికెట్ ఆశించి భంగపడిన విడివాడ రామచంద్రరావు రెబల్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. శుక్రవారం భీమవరం విచ్చేసిన పవన్‌కల్యాణ్‌ను కలిసిన విడివాడకు ఆయన నుంచి సానుకూలత రాకపోవడంతో పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీతో లోపాయకారీ పొత్తు ఉండడం వల్లే జనసేన తనకు టికెట్ కేటాయించలేదని విడివాడ ఆరోపించారు. తాను పార్టీ ప్రారంభమైన నాటి నుంచి నియోజకవర్గంలో బాధ్యతలు తీసుకున్నానని, ఇప్పుడు టీడీపీ సూచనతోనే వేరే అభ్యర్థిని తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం బరిలో టీడీపీ రెబల్ అభ్యర్థి పోలవరం తెలుగుదేశం పార్టీలో కూడా అసమ్మతులు ఆగడం లేదు. పోలవరం అసెంబ్లీ టీడీపీ రెబల్ అభ్యర్థిగా వంకా కాంచనమాల శుక్రవారం నామినేషన్ వేశారు. వంకా కాంచనమాల టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంకా శ్రీనివాసరావు కుమార్తె. పోలవరం నుంచి టికెట్‌ను ఆశించిన వారిలో కాంచనమాల ఒకరు. అయితే కాంచనమాలకు టికెట్ దక్కకపోవడంతో టీడీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మరోవైపు నరసాపురంలో కొత్తపల్లి సుబ్బారాయుడిని బుజ్జగించేందుకు తెలుగుదేశం అధిష్టానం విశ్వప్రయత్నం చేస్తోంది. గురువారం మంత్రి పితాని సత్యనారాయణ, నరసాపురం ఎంపీ అభ్యర్థి వేటుకూరి శివరామరాజు వెళ్లి కొత్తపల్లికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయితే దీనికి కొత్తపల్లి సుబ్బారాయుడు ససేమిరా అన్నట్లు సమాచారం. చంద్రబాబునాయుడితో మాట్లాడించి బుజ్జగించాలన్న ప్రయత్నం చేస్తున్నారు. చింతలపూడిలో మాజీ మంత్రి పీతల సుజాత వర్గం సహాయ నిరాకరణ చేస్తోంది. రెండురోజుల క్రితం ముఖ్యమంత్రి సమావేశానికి కూడా పీతల సుజాత గైర్హాజరయ్యారు. మంత్రిగా ఉన్నప్పుడు నెంబర్–1 అని ప్రకటించి కొద్ది నెలలకే పదవి నుంచి తప్పించారని, అలాగే నియోజకవర్గాన్ని కూడా అన్ని రంగాల్లో ముందుంచానని పొగడ్తలు కురిపించిన కొద్ది రోజులకే ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన నేతల మాటలు విని తనకు సీటు లేకుండా చేశారని సుజాత ఆగ్రహంగా ఉన్నారు. దీంతో ఆమె వర్గం పూర్తిగా సహాయనిరాకరణ చేస్తోంది. మరోవైపు మాల సామాజిక వర్గం నేతలు కూడా సుజాతను చంద్రబాబు మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
చినబాబు చెంతకు తాడికొండ పంచాయితీ
తాడికొండ నియోజకవర్గంలో రగిలిన అసమ్మతిని చల్లార్చేందుకు నేరుగా చిన్నబాబు లోకేష్ రంగంలోకి దిగారు. వారిని ఎలాగైనా ఒప్పించి ఎమ్మెల్యే శ్రావణ్‌కే మళ్లీ టిక్కెట్ ఇచ్చేందుకు సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన రహస్య సమావేశం ఆలస్యంగా వెలుగు చూసింది. శ్రావణ్‌కు మళ్లీ సీటు ఇవ్వొద్దని, ఒకవేళ సీటు ఇస్తే అందరం మనస్ఫూర్తిగా సహకరించడం కష్టమని తేల్చిచెప్పారని సమాచారం. ముఖ్యమంత్రి దృష్టికి అన్ని సమస్యలను తీసుకెళ్దామని, ఆయన సూచనను అందరం గౌరవిద్దామని లోకేష్ సర్దిచెప్పారని తెలిసింది. సాక్షి,గుంటూరు: రాజధాని నియెజకవర్గంగా ప్రాముఖ్యత చెందిన తాడికొండ నియెజకవర్గం ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌కు మళ్లీ అవకాశం ఇవ్వాలా? వద్దా? అనే విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి తలనొప్పిగా మారింది. ఇప్పటికే పలుమార్లు అసమ్మతి నేతలతో విజయవాడలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబులు సమావేశం నిర్వహించి తుది నివేదికను చంద్రబాబుకు అందజేశారు. అససమ్మతి నేతలను ఎలాగైనా బుజ్జగించి మళ్లీ శ్రావణ్‌కే టికెట్ ఇవ్వాలనే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వేషన్ టికెట్ కావడం కూడా వారికి సవాల్‌గా మారింది. ఇప్పటికే అభ్యర్థులను మార్చాలని ఓ నేత తన అభిప్రాయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లిన విషయం తెలిసిందే. జిల్లాలో ఎక్కడా లేని విధంగా తాడికొండ ఎమ్మెల్యేపై పలుమార్లు అసమ్మతి నేతలు సమావేశాలు నిర్వహించి మళ్లీ ఆయనకే టికెట్ కేటాయిస్తే ఎవరూ సహకరించేది లేదంటూ తీర్మానాలు చేసిన నేపథ్యంలో నేరుగా చినబాబు(లోకేష్) రంగంలోకి దిగారు. ఈ క్రమంలో సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో రహస్య సమావేశం నిర్వహించిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అసమ్మతి నేతలతో భేటీ రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎలాగైనా అసమ్మతి నేతలను బుజ్జగించి పార్టీ ఫిరాయింపులు జరగకుండా చూసేందుకు హడావుడిగా అసమ్మతి నేతలను సోమవారం క్యాంపు కార్యాలయానికి పిలిపించారు. వారిలో అధికంగా ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఉండటం గమనార్హం. అసమ్మతిని తెలియజేసేందుకు ఎమ్మెల్యేపై తిరుగుబావుటా ఎగురవేసిన 500 మంది వెళ్లారు. అయితే అందరితో మాట్లాడడం సాధ్యం కాదంటూ 150 మంది ముఖ్య నాయకులు, క్రియాశీల కార్యకర్తలను మాత్రమే లోపలకు అనుమతించారు. లోపలకు వెళ్లే సమయంలో వారి వద్ద ఉన్న సెల్ఫోన్లను సెక్యూరిటీ సమస్య అంటూ విధుల్లో ఉన్న సిబ్బంది స్వాధీనం చేసుకొని అనుమతించారని తెలిసింది. సంజాయిషీ ఇవ్వాలని చినబాబు ఆదేశం పార్టీ అనుమతి లేకుండా, ఇష్టానుసారంగా అసమ్మతి నేతలు రహస్య సమావేశాలు నిర్వహించడాన్ని చిన్నబాబు తప్పుబట్టారు. అందుకు బాధ్యలైన వారందరి నుంచి ఇకపై అలాంటి సమావేశాలు నిర్వహించకుండా అధిష్టానం దృష్టికి తీసుకువస్తామని తెలియజేస్తూ సంజాయిషీ రాయించుకున్నట్లు సమాచారం. అనంతరం ఒక్కొక్కరూ వారు ఎమ్మెల్యే కారణంగా ఎదుర్కొన సమస్యలు, పార్టీ నాయకులను దూరంగా ఉంచిన సంఘటనలను వివరించారు. గతంలో పదేళ్ల పాటు పార్టీ అభ్యున్నతి కృషి చేయడంతో పాటు శ్రావణ్‌కుమార్‌కు అప్పట్లో టికెట్ ఇవ్వవద్దని విభేదించిన నేతలను పక్కనపెట్టి ఆయన్ని గెలిపిస్తే.. గెలిచిన నెల వ్యవధిలోనే వారిని అక్కున చేర్చుకొని మమ్మల్ని దూరంగా పెట్టాడని పలువురు ధ్వజమెత్తారు. అలాంటి నాయకుడు కోసం మీరు మళ్లీ అవకాశం ఇచ్చినా పనిచేయాలంటూ బాధగా ఉందనీ, మనోభావాలను చంపుకొని కొందరం పనిచేసినా మిగిలిన వారంతా సహకరిస్తారనే నమ్మకం లేదని తేల్చి చెప్పారు. నాయకులు, కార్యకర్తలు చెప్పిన విషయాలన్నీ పరిశీలిస్తామనీ విషయాలను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి ఆయన తీసుకునే నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని చినబాబు స్పష్టం చేశారు. మరో రెండు రోజుల్లో అవసరమైతే మళ్లీ సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటారని వివరించినట్లు సమాచారం. నోటాకైనా వెనుకాడం సమావేశం వివరాలు గ్రామాల్లో తెలియడంతో నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా ఉన్న నాయకులు, కార్యకర్తలు సమాలోచనలో పడ్డారు. మనోభావాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా మళ్లీ శ్రావణ్ కుమార్‌కు అధిస్టానం సీటు కేటాయిస్తే..పార్టీ ఫిరాయింపునకు అవకాశం ఉన్న వారు ఎవరి దారి వారు చూసుకుందామనే నిర్ణయానికి కొందరు వచ్చారు. అతనికి ఓటు వేయలేకపోతే నోటాకు ఓటు వేస్తామనే నిర్ణయానికి వచ్చారు. ఏదిఏమైనా ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌కు టికెట్ కేటాయిస్తే వచ్చే నష్టాన్ని నేతలు ఇప్పటికే అంచనా వేసిన నేపథ్యంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి. -
తిరుగుబాటు నేతలపై కాంగ్రెస్ వేటు
సాక్షి, హైదరాబాద్: పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి ఎన్నికల్లో రెబెల్స్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థులను ఆరేళ్ల పాటు సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సస్పెన్షన్ గురైన నేతల జాబితాను క్రమశిక్షణా సంఘం చైర్మన్ కోదండరెడ్డి శనివారం ప్రకటించారు. కాంగ్రెస్‌తో సహా కూటమి పక్షాలు అధికారికంగా అభ్యర్థులను ప్రకటించిన స్థానాల్లో 19 మంది నేతలు రెబెల్స్‌గా పోటీ చేస్తున్న నేపథ్యంలో వీరిని పార్టీ నుంచి ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసింది. మరోవైపు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ నారాయణపేట నియోజకవర్గానికి చెందిన మరో ఐదుగురిపైనా ఆరేళ్లపాటు బహిష్కరణ వేటు వేసింది. పార్టీ టికెట్ ఆశించి భంగపడిన కొందరు నేతలు ఎన్నికల్లో రెబెల్స్‌గా పోటీలో నిలిచారు. అధిష్టాన పెద్దలు బుజ్జగించటంతో కొందరు వెనక్కి తగ్గగా చివరకు 19 మంది పోటీలో నిలిచారు. ఈ నేపథ్యంలో వీరిని సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా సంఘం నిర్ణయం తీసుకుంది. సస్పెండైన నేతల జాబితా.. ఆయా నియోజకవర్గాల్లో తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన రవి శ్రీనివాస్ (సిర్పూర్), బోడ జనార్దన్ (చెన్నూరు), హరినాయక్ (ఖానాపూర్), అనిల్‌జాదవ్ (బోథ్), నారాయణరావు పటేల్ (ముథోల్), అరుణతార (జుక్కల్), ఆర్.రత్నాకర్ (నిజామాబాద్), గణేశ్ (సికింద్రాబాద్ కంటోన్మెంట్), కె. శివకుమార్‌రెడ్డి (నారాయణపేట), ఇబ్రహీం (మహబూబ్‌నగర్), సురేందర్‌రెడ్డి (మహబూబ్‌నగర్), కేతావత్ బిల్యా నాయక్ (దేవరకొండ) పాల్వాయి శ్రవణ్‌కుమార్‌రెడ్డి (మునుగోడు) డాక్టర్ రవికుమార్ (తుంగతుర్తి), మలావత్ నెహ్రూ నాయక్ (డోర్నకల్) ఊకె అబ్బయ్య (ఇల్లెందు), బానోత్ బాలాజీ నాయక్ (ఇల్లెందు), ఎడవల్లి కృష్ణ (కొత్తగూడెం), రాములు నాయక్ (వైరా)లను ఆరేళ్లు సస్పెండ్ చేయగా.. నారాయణపేట నియోజకవర్గానికి చెందిన చిట్టెం అభినయ్‌రెడ్డి, కావలి నరహరి, సాయిరెడ్డి, నిరంజన్‌రెడ్డి, సౌభాగ్యలక్ష్మిలను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు క్రమశిక్షణా సంఘం బహిష్కరించింది. -
కామారెడ్డిలో ఫలించిన బుజ్జగింపులు!
సాక్షి, కామారెడ్డి: జిల్లాలోని ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్టు దక్కకపోవడంతో పలువురు నేతలు రెబెల్స్‌గా బరిలో నిలిచారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ టికెట్టు కోసం నల్లమడుగు సురేందర్‌తో పాటు సుభాష్‌రెడ్డి, కృష్ణారెడ్డి, మదన్మోహన్రావు, జమునారాథోడ్‌లు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే పార్టీ అధిష్టానం సురేందర్‌కే టికెట్టు కేటాయించింది. దీంతో సుభాష్‌రెడ్డి బీఎస్పీ నుంచి నామినేషన్ దాఖలు చేయగా, కృష్ణారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగాగా నామినేషన్ వేశారు. బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ టికెట్టు కోసం కాసుల బాల్‌రాజు, మల్యాద్రిరెడ్డిలు తీవ్రంగా ప్రయత్నించారు. పార్టీ బాల్‌రాజు వైపే మొగ్గు చూపింది. దీంతో మల్యాద్రిరెడ్డి ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ అనంతరం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తిరుగుబాటు నేతలపై దృష్టి పెట్టింది. వారిని సముదాయించే ప్రయత్నం చేసింది. అయితే తమకు భవిష్యత్తుపై భరోసా ఇవ్వాల్సిందేనంటూ తిరుగుబాటు నేతలు మొండికేశారు. పార్టీ నేతలు మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో సుముదాయించారు. తిరిగి గురువారం కామారెడ్డి పట్టణానికి సమీపంలోని లింగాపూర్ గ్రామంలో రెబెల్స్‌తో శాసనమండలి విపక్ష నేత షబ్బీర్‌అలీ, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి సమావేశమయ్యారు. పార్టీ జాతీయ నాయకులతో ఫోన్లో మాట్లాడించి వారికి నచ్చజెప్పారు. భవిష్యత్‌పై భరోసా కల్పించినట్లు సమాచారం. దీంతో రెబెల్స్‌గా నామినేషన్లు వేసిన సుభాష్‌రెడ్డి, మల్యాద్రిరెడ్డి, కృష్ణారెడ్డిలు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి ఒప్పుకున్నారు. వెనువెంటనే ఎన్నికల రిటర్నింగ్ అధికారుల వద్దకు వెళ్లి తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్‌లో తిరుగుబాట్ల గొడవ సద్దుమణిగింది. తిరుగుబాటు అభ్యర్థులు పోటీ నుంచి వైదొలగడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నిన్నటి వరకు ఉన్న అయోమయం, ఆందోళన తొలగిపోయినట్టయ్యింది. ఊపిరి పీల్చుకున్న అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ టికెట్టు రాలేదన్న కోపంతో తిరుబాటు జెండా ఎగురవేసిన నేతలను అధిష్టానం బుజ్జగించి, నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేయడంతో అభ్యర్థులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఎల్లారెడ్డిలో నల్లమడుగు సురేందర్, బాన్సువాడలో కాసుల బాల్‌రాజులు తిరుగుబాటు నేతలతో చేతులో చేయి వేసి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని ప్రకటించుకున్నారు. ప్రచారంలో అందరూ పాల్గొనేందుకు అంగీకరించారు. దీంతో పార్టీ అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజక వర్గాల్లో తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు వేసి, బుజ్జగింపులతో ఉపసంహరించుకున్న సుభాష్‌రెడ్డి, మల్యాద్రిరెడ్డిలకు బలమైన అనుచరవర్గం ఉంది. అటు అభ్యర్థుల క్యాడర్, ఇటు తిరుగుబాటు అభ్యర్థుల అనుచర వర్గం కలిసి పనిచేస్తే కాంగ్రెస్ పార్టీకి బలం పెరుగుతుందని భావిస్తున్నారు. ఇక ప్రచారానికి.. టికెట్ల కేటాయింపులో జాప్యంతో ఇంతకాలం ప్రచారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు.. ఇక ప్రచారంలోకి దిగనున్నాయి. జిల్లాలోని కామారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు షబ్బీర్‌అలీ, సౌదాగర్ గంగారాంలు ఊరూరా తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతంగా సాగిస్తున్నారు. అయితే బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో అభ్యర్థులెవరో తేలకపోవడంతో మొన్నటివరకూ ప్రచారం నామమాత్రంగానే సాగింది. అభ్యర్థుల ప్రకటన, నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ప్రక్రియలు ముగియడం, తిరుగుబాట్ల సమస్య సమసిపోవడంతో ఇక పూర్తిస్థాయి ప్రచారంపై దృష్టి సారించనున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ఆ పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకులు ప్రచారానికి రానుండడంతో ప్రచార ఉధృతిని పెంచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. -
కాంగ్రెస్ నుంచి నలుగురు రెబల్స్
సాక్షి,ఇల్లెందు: ఇల్లెందులో కాంగ్రెస్ టికెట్ కోసం భారీ సంఖ్యలో పోటీ పడ్డారు. అదే తరహాలో నామినేషన్ దాఖలు చేశారు. ఉపసంహరణ గడువు ముగిసేనాటికి ఒక్కొక్కరు జారుకున్నారు. గురువారం ఉదయం పట్టణంలోని ఒక దేవాలయ ఆవరణలో సమావేశమైన కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు ఏక వాక్య తీర్మానంతో దేవుడి మీద ప్రమాణం చేశారు. ఊకె అబ్బయ్యకు ఆదివాసీ వర్గం నుంచి, బాలాజీరావునాయక్ బంజారా వర్గం నుంచి మద్దతు తెలిపేలా నిర్ణయించారు. అనంతరం అధిష్టానం పిలుపు మేరకు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తూ చీమల వెంకటేశ్వర్లు, భూక్యా దళ్‌సింగ్ నాయక్, గుగులోతు కిషన్‌నాయక్, అంగోతు శివ, రాంజీ, నామోదర్ నాయక్ పోటీ నుంచి విరమించుకున్నారు. ఊకె అబ్బయ్య, మాలోతు మున్నా నాయక్, గుగులోతు రవి, బాలాజీరావులు పోటీలో ఉన్నారు. టీఆర్ఎస్ రెబల్‌గా నామినేషన్ దాఖలు చేసిన దేవీలాల్‌నాయక్.. హైకమాండ్ ఆదేశాలతో బరిలో నుంచి తప్పుకున్నారు. -
దారికొస్తున్నారు..
సాక్షి, నిజామాబాద్: టికెట్ దక్కక తిరుగుబాటు బావుటా ఎగురవేసిన నేతలు దారికొస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీల్లో అసమ్మతి రాగం వినిపించిన నేతలు సర్దుకుపోయేందుకు సిద్ధమవుతున్నారు. అధిష్టానం ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ ముఖ్య నేతలు బుజ్జగించడంతో పోటీ నుంచి తప్పుకునే యోచనలో ఉన్నారు. ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్ స్థానం కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నాలు చేసిన రత్నాకర్‌కు భంగపాటు ఎదురైంది. దీంతో ఆయన సోమవారం చివరి నిమిషంలో నామినేషన్ వేశారు. తిరుగుబాటు అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ అధిష్టానం తీవ్రం గా పరిగణిస్తోంది. జిల్లాలోని ఆ పార్టీ ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకోవాలని రత్నాకర్‌కు షబ్బీర్‌అలీ, మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్ సూచించడంతో ఆయన అందు కు అంగీకరించినట్లు సమాచారం. ఎల్లారెడ్డి అభ్యర్థిత్వం కోసం సురేందర్‌తో పాటు, వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి గట్టి ప్రయత్నాలు చేశారు. పార్టీలో రేవంత్‌రెడ్డి వర్గా నికి చెందిన సుభాష్‌రెడ్డి ఎల్లారెడ్డి స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన విషయం విదితమే. దీంతో సుభా ష్‌రెడ్డితో నామినేషన్‌ను విత్‌డ్రా చేయించేందుకు రేవంత్‌రెడ్డి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు.ఆయన కూడా పోటీ నుంచి తప్పుకునే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే బాన్సువాడ స్థానానికి మల్యాద్రిరెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేసిన ఆయనకు నిరాశ ఎదురైంది. దీంతో ముఖ్య అనుచరులతో సమావేశం నిర్వహించిన మల్యాద్రి నామినేషన్ వేసి, బరిలో ఉంటానని ప్రకటించారు. మల్యాద్రిని పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ కూడా ప్రయత్నించింది. కానీ చివరకు నాయుడు ప్రకాష్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని మల్యాద్రిపై కాంగ్రెస్ ముఖ్య నేతలు ఒత్తిడి తెస్తున్నారు. మాజీ మంత్రి పి సుదర్శన్‌రెడ్డితో పాటు, రేవంత్‌రెడ్డిల ద్వారా సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు మల్యాద్రి అంగీకరించి నామినేషన్‌ను ఉపసంహరించుకునే అవకాశాలున్నట్లు ఆ పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. మరోవైపు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం టికెట్ ఆశించి భంగపడిన అర్కల నర్సారెడ్డి కొంత నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. అలక బూనిన అర్కలను కూడా బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకటీ రెండు రోజుల్లో ఆయన కూడా కాంగ్రెస్ అభ్యర్థి భూపతిరెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొనే అవకాశాలున్నాయి. ధన్‌పాల్‌తో బీజేపీ సంప్రదింపులు.. నిజామాబాద్ అర్బన్ స్థానానికి బీజేపీ టికెట్ ఆశించిన ధన్పాల్ సూర్యనారాయణగుప్తకు నిరాశే ఎదురైన విషయం విదితమే. ఆయన బీజేపీకి రాజీనామా చేసి, శివసేన పార్టీ నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించారు. ఈమేరకు సోమవారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేశారు. ఇదే సమయంలో ధన్పాల్ రాజీనామాను తిరస్కరిస్తున్నామని హైదరాబాద్‌లో బీజేపీ ప్రకటించింది. దీంతో ఆయన కొంత మెత్తబడినట్లు తెలుస్తోంది. ఆయన మాత్రం బరిలోంచి తప్పుకునేది లేదని తేల్చి చెబుతున్నారు. నామినేషన్ల ఉప సంహరణకు ఈనెల 21 వరకు గడువుంది. బుధవారం ఈ తిరుగుబాటు నేతలంతా తమ నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
పాలమూరులో బహుముఖ పోటీ
సాక్షి, మహబూబ్‌నగర్ న్యూటౌన్: మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో అందరూ ఊహించినట్లుగానే పోటీ రసవత్తరంగా మారనుంది. పెద్దసంఖ్యలో నామినేషన్లు, దాఖలుకావడం చూస్తుంటే బహుముఖ పోటీ అనివార్యం కానుంది. ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు స్వతంత్రంగా కొందరు టికెట్లు రాని ఆశావాహులు ఆయా పార్టీల నుంచి రెబల్‌గా బరిలో దిగితుండటంతో మహబూబ్‌నగర్ ఎన్నిక ఆసక్తికరంగా మారుతోంది. జిల్లాలోని 5 నియోజకవర్గాల కంటే అత్యధికంగా మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో 29మంది అభ్యర్థులు, 51సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. పొత్తుల్లో టికెట్లు ఆశించిన వారు ఇతర పార్టీల నుంచి టికెట్లు తెచ్చుకొని నామినేషన్లు దాఖలు చేయగా మరికొందరు స్వతంత్రులుగా బరిలో నిలిచారు. మొదట టీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించడంతో ఆ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్ దాదాపు 60రోజుల నుంచే తన ప్రచారాన్ని కొనసాగించారు. ప్రజాకూటమిలో భాగంగా ఈ సీటును కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జనసమితి, తెలంగాణ ఇంటిపార్టీలు పోటాపోటీగా సీటును ఆశించడంతో సమస్య జఠిలంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు అభ్యర్థులు ఒబేదుల్లా కొత్వాల్, టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సయ్యద్ ఇబ్రహీం, టీడీపీ నుంచి వచ్చి చేరిన ఎన్పీ వెంకటేశ్, వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చి చేరిన ఎం.సురేందర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఆశించారు. టీడీపీ నుంచి ఎట్టిపరిస్థితుల్లో తనకే కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే ఎం.చంద్రశేఖర్(ఎర్ర శేఖర్) పట్టుబట్టారు. ఆ దిశగా ఆయన మొదటి నుంచే జనాల మధ్యకు దూసుకెళ్లారు. తెలంగాణ జనసమితి నుంచి ఆ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి పట్టుబట్టారు. దీంతో ఎవరంతట వారు తమకంటే తమకే ఈ సీటు కావాలంటూ కూటమిలో తీవ్ర ఒత్తిడి చేశారు. అదేవిధంగా తెలంగాణ ఇంటిపార్టీ నుంచి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి చివరిదాకా ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు ప్రజాకూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎం.చంద్రశేఖర్(ఎర్ర శేఖర్)కు కేటాయించారు. ఆశావాహుల్లో అసంతృప్తి దీంతో ఆశావాహుల్లో అసంతృప్తి వెల్లువెత్తింది. కాంగ్రెస్ పార్టీలో సీటు ఆశించిన సురేందర్‌రెడ్డి నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ తరపున, సయ్యద్ ఇబ్ర హీం బహుజన సమాజ్ పార్టీ నుంచి నామినేషన్ వేశారు. యెన్నం శ్రీనివాస్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగితుండగా, ఫ్రెండ్లీ కాంటెస్టింగ్లో భాగం గా తెలంగాణ జనసమితి కూడా రాజేందర్‌రెడ్డికి బీ–ఫాం ఇచ్చింది. దీంతో ఆయన కూడా టీజేఎస్ తరపున సోమవారం నామినేషన్ వేశారు. మొత్తం గా నామినేషన్ల దాఖలు గడువు ముగిసే సమయానికి ఆమ్ఆద్మీ పార్టీ తరపున బాబుల్‌రెడ్డి, టీడీపీ నుంచి భవాని, ప్రజాకూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా యం. చంద్రశేఖర్(ఎర్ర శేఖర్), టీఆర్ఎస్ వి.శ్రీనివాస్‌గౌడ్, బీజేపీ జి.పద్మజారెడ్డి, బీజేపీ రెబల్ అభ్యర్థిగా పడాకుల బాల్‌రాజ్, కాంగ్రెస్ టికెట్ ఆశించి పొత్తులో టీడీపీకి కేటాయించడంతో ఎన్సీపీ టికెట్‌తో ఎం.సురేందర్‌రెడ్డి, ఫ్రెండ్లీ కాం టెస్టింగ్ టీజేఎస్ అభ్యర్థిగా రాజేందర్‌రెడ్డి, బీఎస్పీ అభ్యర్థిగా సయ్యద్ ఇబ్రహీం, కృష్ణయ్య, బీఎల్పీ నుంచి గులాంగౌస్తోపాటు స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డితోపాటు మరో 16 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తంగా మొదటి నుంచి సీట్ల కేటాయింపులో జరిగిన ఉత్కంఠతకు నామినేషన్ల చివరిరోజు వరకు అదే ఉత్కంఠ కొనసాగింది. బహుముఖ పోటీలో పాలమూరు ప్రజలు ఎవరిని ఆదరిస్తారనే విషయం తేలాల్సి ఉంది. పరిశీలన, బుజ్జగింపుల తర్వాత ఎవరెవరు పోరులో ఉంటారనేది తేలాల్సి ఉంది. ఈ నెల 22న ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత పోటీలో ఉండేదెవరు, ఉపసంహరించుకునేదెవరో తేలాల్సి ఉంది. టికెట్లు ఆశించి భంగపడిన వారు ఇతర పార్టీలను ఆశ్రయించి టికెట్లు తెచ్చుకొని నామినేషన్లు వేయడంతో పోటీ అనివార్యంగా కనిపిస్తోంది. -
నియోజకవర్గాల వారీగా ‘కారు’ రెబెల్స్ వీరే..!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితికి తిరుగుబాట్ల బెడద తప్పడంలేదు. టికెట్లు ఆశించి భంగపడిన పలువురు నేతలు రెబెల్స్‌గా రామగుండం, భూపాలపల్లి, వరంగల్ తూర్పు, బెల్లంపల్లి, కోదాడ, మక్తల్, రాజేంద్రనగర్, మహేశ్వరం స్థానాల నుంచి అసెంబ్లీ ఎన్నికలకు బరిలో నిలిచారు. నామినేషన్లు సైతం వేశారు. స్వతంత్రులుగా గెలిచి టీఆర్ఎస్కే మద్దతు తెలుపుతామంటూ పార్టీలోని ద్వితీయశ్రేణి నేతలు, కేడర్‌ను దగ్గర చేసుకుంటున్నారు. తిరుగుబాటు నేతల్లో ముగ్గురు ఆల్ ఇండియా ఫార్వర్డ్‌బ్లాక్ తరఫున సింహం గుర్తుపై పోటీ చేస్తుండగా మరో ఇద్దరు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నుంచి బరిలో దిగారు. మిగిలిన వారు స్వతంత్రులుగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో వారిని పోటీ నుంచి తప్పించేందుకు టీఆర్ఎస్ అధిష్టానం సంప్రదింపులు జరుపుతోంది. నామినేషన్ల ఉపసంహకరణకు గడువు తక్కువగా ఉండటంతో అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు ప్రత్యేకంగా పలువురు నేతలను పంపించింది. రామగుండం నుంచి టీఆర్ఎస్ ముఖ్యనేత కోరుకంటి చందర్ ఈ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్ పార్టీ తరఫున ఆయన నామినేషన్ వేశారు. చందర్ 2009, 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. భూపాలపల్లి నియోజకవర్గంలో టికెట్ ఆశించి భంగపడిన గండ్ర సత్యనారాయణరావు కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచే బరిలో దిగారు. గత ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున ఇదే సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గతేడాది ఆయన టీఆర్ఎస్లో చేరారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తనకు టికెట్ దక్కకపోవడంతో ఎర్రబెల్లి ప్రదీప్‌రావు సైతం ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. 2009లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన కేవలం 3 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థిత్వం దక్కకపోవడంతో మాజీ మంత్రి జి. వినోద్ బెల్లంపల్లి నుంచి బహుజన సమాజ్ పార్టీ తరఫున నామినేషన్ వేశారు. ఆయన గతంలో చెన్నూరు సెగ్మెంట్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో ఇదే స్థానంలో పోటీ చేసి ఓడిపోయారు. కోదాడ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి కె. శశిధర్‌రెడ్డి సైతం తిరుగుబాటు అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. మూడు రోజుల క్రితం టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన బొల్లం మల్లయ్య యాదవ్‌కు టీఆర్ఎస్ అధిష్టానం కోదాడ టికెట్ కేటాయించింది. దీంతో శశిధర్‌రెడ్డి తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో రాజారపు ప్రతాప్ బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రతాప్ 2012 ఉప ఎన్నికలో ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మక్తల్‌లోనూ టీఆర్ఎస్ నేత ఎం. జలంధర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గెలిచాక టీఆర్ఎస్లో చేరుతానంటూ ఆ పార్టీ నేతల సహకారం కోరుతున్నారు. మహేశ్వరంలో టీఆర్ఎస్ ఇన్చార్జి కొత్త మనోహర్‌రెడ్డి నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. రాజేంద్రనగర్‌లో టీఆర్ఎస్ తిరుగుబాటు అభ్యర్థిగా టి.శ్రీనివాస్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం మైలార్‌దేవ్‌పల్లి కార్పొరేటర్‌గా ఉన్నారు. -
మోగిన రె‘బెల్స్’
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రానున్న శానసనభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచే అభ్యర్థుల అంశం తేలకముందే కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. మహాకూటమి సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపిక పూర్తికాముందే రెబెల్స్ తమ వాణి వినిపిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ను ఎట్టి పరిస్థితిలో గద్దె దింపాలనే యోచనతో కాంగ్రెస్ నేతృత్వంలో మహాకూటమి పురుడుపోసుకుంది. కూటమి మిత్రపక్షాలకు ఎన్నికల్లో అవకాశం కల్పించాలనే యోచనతో కొన్ని స్థానాలు కేటాయించాలని భావించింది. అందుకు అనుగుణంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు స్థానాలను మిత్రపక్షమైన టీడీపీకి కేటాయించేందుకు అంగీకరించినట్లు సమాచారం. మహబూబ్‌నగర్, మక్తల్ స్థానాలను టీడీపీకి కేటాయించినట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు మాత్రం మిత్రపక్షాలకు స్థానాలు కేటాయించొద్దంటూ తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్‌కే కేటాయించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. తాజాగా టీపీసీసీ కార్యదర్శి మారేపల్లి సురేందర్‌రెడ్డి ఆదివారం మహబూబ్‌నగర్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశానికి భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. పాత జిల్లా కేంద్రంగా ఉన్న మహబూబ్‌నగర్ అసెంబ్లీ సీటును ఎట్టి పరిస్థితుల్లో పొత్తులో భాగంగా వదులుకోవద్దని కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. ఒకవేళ అధిష్టానం నిర్ణయం విరుద్ధంగా ఉంటే.. సురేందర్‌రెడ్డి బరిలో ఉండాలంటూ కార్యకర్తలు తీర్మానించడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చాలాచోట్ల ఇదే పరిస్థితి ఈసారి కాంగ్రెస్ పార్టీకి సానుకూల పవనాలు ఉన్నాయని సర్వేల్లో తేలిందని పార్టీ అధిష్టానం చెబుతుండగా.. ఎన్నికల బరిలో నిలిచేందుకు పలువురు తీవ్రంగా కృషిచేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి ఒక్కరికి మించి ఆశావహు లు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో మహా కూటమి నుంచి ఉమ్మడి జిల్లాలో రెండు స్థానా లను మిత్రపక్షాలకు కేటాయించాలని భావించారు. ఈ మేరకు జిల్లాలోని మహబూబ్‌నగర్, మక్తల్ స్థానాలను టీడీపీకి కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ శ్రేణుల్లో నిరుత్సాహం అలుముకుంది. పార్టీ టికెట్ దక్కకపోతే రెబల్‌గానైనా బరిలోకి దిగాలని పలువురు భావిస్తున్నారు. అందులో భాగంగా మహబూబ్‌నగర్ స్థానం నుంచి టీపీసీసీ కార్యదర్శి ఎం.సురేందర్‌రెడ్డి బరిలో నిలవడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. అలాగే మక్తల్‌లో కూడా సీటును టీడీపీకి కేటాయిస్తే.. అక్కడి నుంచి జెడ్పీటీసీ సభ్యుడు శ్రీహరి బరిలో నిలవాలని భావిస్తున్నారు. అదే విధంగా జడ్చర్ల, దేవరకద్ర తదితర నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి రెబెల్స్ ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. కార్యకర్తలు, అభిమానుల అభీష్టం మేరకే... గెలిచే సత్తా ఉన్న వారికే కాంగ్రెస్ టికెట్ దక్కుతుందని ఆశిస్తున్నాం.. ఈ విషయమై ఆదివారం సాయంత్రం వరకు వేచి చూశాక పార్టీ నిర్ణయం అందుకు విరుద్ధంగా ఉంటే కార్యకర్తలు, అభిమానుల అభీష్టం మేరకు నడుచుకుంటానని టీపీసీసీ కార్యదర్శి మారేపల్లి సురేందర్‌రెడ్డి వెల్లడించారు. మహబూబ్‌నగర్‌లోని తన నివాసంలో ఆదివారం పార్టీ ముఖ్య కార్యకర్తలు, అభిమానులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను అధిష్టానం దృష్టికి తీసుకురావడానికి ఈ సమావేశం ఏర్పాటుచేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్‌ను వెంటనే ప్రకటించాలని కోరుతూ కళ్లలో నీళ్లు పెట్టుకొని ఢిల్లీలో నేతల చుట్టూ తిరిగానని పేర్కొన్నారు. నియోజకవర్గంలో గెలిచే అభ్యర్థి, అంతర్గత సర్వేల్లో ముందున్న వారికే కాంగ్రెస్ టికెట్ కేటాయించాలని స్క్రీనింగ్ కమిటీ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. అయితే, ఇప్పటి వరకు టికెట్ ప్రక టించకపోవడంతో కార్యకర్తల్లో నైర్యాశం నెలకొందన్నారు. టికెట్ల కేటాయింపుల్లో ఎవరి స్వార్థాన్ని వారు చూసుకుంటున్నారని సురేందర్‌రెడ్డి ఆరోపించారు. అధిష్టానం పెద్దలు.. కార్యకర్తల మనోభావాలను గమనించి పొత్తుగా కాకుండా గెలిచే అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని విన్నవించారు. కార్యకర్తలు, అభిమానులకు ఎల్లప్పుడూ తాను అండగా ఉంటానని అన్నారు. అలాగే నియోజకవర్గంలో కొనసాగుతున్న అరాచాక పాలనను అంతమోందిస్తామని పేర్కొన్నారు -
టికెట్ ఇచ్చిన తర్వాత పార్టీ మారితే...
హైదరాబాద్: టికెట్ ఖరారు చేసిన తర్వాత కూడా నామినేషన్ వేయకుంటే... టికెట్ ఇచ్చిన తర్వాత ఆ అభ్యర్థి మరో పార్టీలోకి మారితే... ఈ భయాలతో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ సతమతమవుతోంది. ఆ కారణంగానే జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థులను ఖరారు చేస్తున్నప్పటికీ అధికారికంగా ప్రకటించడానికి ఆ పార్టీ నాయకత్వం భయపడుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శనివారం జోరుగా నామినేషన్ల దాఖలయ్యాయి. నామినేషన్లకు ఆదివారం చివరి రోజు కావడంతో అన్ని పార్టీల నుంచి పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. అధికార టీఆర్ ఎస్ పార్టీ ఇప్పటికే రెండు విడతలుగా అభ్యర్థులను ప్రకటించగా, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ-బీజేపీలు ఈ విషయంలో వెనకబడ్డాయి. అధికారికంగా అభ్యర్థులను ముందుగా ప్రకటించడం వల్ల ఇబ్బందులు రావొచ్చన్న అనుమానంతో ప్రతిపక్ష పార్టీలు జాబితాలను ప్రకటించడం లేదు. అధికారికంగా అభ్యర్థులను ముందుగానే ప్రకటించడం వల్ల టీఆర్ ఎస్ నుంచి ఒత్తిడి పెరిగి నామినేషన్ వేస్తారో లేదో, అలాంటి వారిని రంగం నుంచి ఉపసంహరించడానికి ఒత్తిడి పెరుగుతుందన్న అనుమానాలతో జాబితాను ప్రకటించలేదని తెలంగాణ పీసీసీ నాయకుడొకరు చెప్పారు. అధికారికంగా జాబితా ప్రకటించనప్పటికీ ఫోన్లలో అందించిన సమాచారం మేరకు దాదాపు మెజారిటీ డివిజన్లలో అభ్యర్థులు నామినేషన్ వేశారని ఆ నేత తెలిపారు. మరో చిక్కు అధికారికంగా ప్రకటించని కారణంగా కొన్ని డివిజన్లలో ఇద్దరిద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. ఇదిప్పుడు కాంగ్రెస్ కు కొత్త సమస్యను తెచ్చి పెడుతోంది. అధికారిక అభ్యర్థిగా ఒకరిని ఖరారు చేసి బి ఫామ్ ఇచ్చిన తర్వాత మరో అభ్యర్థి రెబల్ గా రంగంలో నిలుస్తారన్న ఆందోళన కూడా కాంగ్రెస్ నేతలను వేధిస్తోంది. ఆదివారం సాయంత్రంతో నామినేషన్ల గడువు ముగుస్తుండగా, 21 తేదీ సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. రెబల్ గా రంగంలోకి దిగుతారని అనుమానం ఉన్న అభ్యర్థులతో సంప్రదింపులు జరపడంపై ఇప్పుడు నేతలు సమాలోచనలు చేస్తున్నారు. -
సగం మంది రెబెల్స్‌పైనే టీడీపీ వేటు
సాక్షి, హైదరాబాద్: తిరుగుబాటు అభ్యర్థులపై చర్య తీసుకునే విషయంలో తెలుగుదేశం పార్టీ తన మార్కు హైడ్రామా నడిపింది. రెబెల్స్‌పై వేటు వేసే విషయంలో కూడా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రెండు నాల్కల ధోరణిని పాటించారు. సీమాంధ్రలో 16 నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు రెబెల్స్‌గా బరిలో దిగగా సగం మందిపై మాత్రమే సస్పెన్షన్ వేటు వేశారు. పార్టీని ధిక్కరించి బరిలో నిలిచిన 8 మందిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా ఆ పార్టీ శనివారం ప్రకటించింది. మిగిలిన 8 చోట్ల పోటీలో ఉన్న రెబెల్స్ విషయంలో మాత్రం మౌన ముద్రదాల్చింది. అలాగే బీజేపీకి కేటాయించిన స్థానాల్లో మూడు చోట్ల చంద్రబాబు అధికారికంగా బీ ఫారాలిచ్చి మరీ అభ్యర్థులను నిలిపారు. తాజాగా పార్టీ నుంచి సస్పెండు చేసిన జాబితాలో బీజేపీకి కేటాయించిన చోట తిరుగుబాటు అభ్యర్థులుగా ఉన్న ఇద్దరిని మాత్రమే సస్పెండ్ చేసి మరో అభ్యర్థిని ప్రచారం చేసుకోవాలని చెప్పింది. పొత్తులో భాగంగా బీజేపీకి 13 అసెంబ్లీ నియోజకవర్గాలు కేటాయించినప్పటికీ.. పొత్తు ధర్మాన్ని తుంగలో తొక్కి బీజేపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా మూడు చోట్ల చంద్రబాబు అధికారికంగా అభ్యర్థులను నిలిపారు. దాంతో బీజేపీ నుంచి తీవ్రస్థాయి విమర్శలు వెల్లువెత్తాయి. తమకు కేటాయించిన చోట టీడీపీ అభ్యర్థులను ఉపసంహరించుకోవాలని బీజేపీ కోరినప్పటికీ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు చంద్రబాబు పట్టించుకోలేదు. తీరా నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిన మూడు రోజులకు అదీ ముగ్గురిపైన కాకుండా ఇద్దరిని మాత్రమే తూతూ మంత్రంగా సస్పెండ్ చే యడం పట్ల ఇపుడు బీజేపీ వర్గాలు మండిపడుతున్నాయి. శనివారం నిమ్మక జయరాజ్ (కురుపాం), కుంభా రవిబాబు (అరకు లోయ), సకూరు అనిత (భీమిలి), ఎన్వీఎస్ఎస్ వర్మ (పిఠాపురం), కొట్టు సత్యనారాయణ (తాడేపల్లిగూడెం), టీవీ రామారావు (కొవ్వూరు), ఆర్. జితేంద్రగౌడ్ (గుంతకల్లు), సుధా దుర్గాప్రసాద్ (కడప)లను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు టీడీపీ ప్రకటించింది. ఇందులో గుంతకల్లు, కడప, సంతనూతలపాడు స్థానాలు పొత్తులో భాగంగా బీజేపీకి వదిలినవి కాగా, గుంతకల్లు, కడపల్లో పోటీల్లో ఉన్న ఆర్. జితేంద్రగౌడ్, సుధా దుర్గాప్రసాద్‌లను సస్పెండ్ చేసినా సంతనూతలపాడు నుంచి పోటీలో ఉన్న బీఎన్ విజయకుమార్ జోలికి మాత్రం పోలేదు. అలాగే డాక్టర్ సత్యనారాయణమూర్తి (బాబ్జీ)(పాలకొల్లు), బల్లి దుర్గా ప్రసాదరావు (గూడూరు), అల్తాఫ్ బాషా (పుంగనూరు), కురుపాటి రాజా నరేంద్ర(రాప్తాడు), రాయల సుమలత(చింతలపూడి), చెంచు మాల్యాద్రి (విజయవాడ పశ్చిమ), కెంబూరు రామ్మోహన్రావు (చీపురుపల్లి) తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలో ఉన్నప్పటికీ వారిపై టీడీపీ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. -
టీడీపీలో పొత్తు చిచ్చు.. రెబెల్స్ నామినేషన్లు
తెలుగుదేశం పార్టీలో పొత్తులు చిచ్చు రేపాయి. బీజేపీతో పొత్తు పెట్టుకుని.. వాళ్లకు కూడా పనికిరాని స్థానాలు అంటగట్టిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఇప్పుడు అందుకు తగిన ఫలితం అనుభవించాల్సి వస్తోంది. పలు నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు రెబెల్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి, తర్వాత తెలుగుదేశం పార్టీలోకి మారిన కొట్టు సత్యనారాయణ.. ఆ స్థానాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి ఇవ్వడంతో రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. 1994, 1999 ఎన్నికలలో తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన.. 2004 ఎన్నికల్లో మాత్రం వైఎస్ హవాతో గెలిచారు. తర్వాతి ఎన్నికల్లో మళ్లీ పీఆర్పీ అభ్యర్థి ఈలి నాని చేతిలో ఓడిపోయారు. తాజాగా తెలుగుదేశం పార్టీలోకి వెళ్లి, అక్కడి నుంచి టికెట్ దాదాపు ఖరారు అయ్యిందనిపించుకున్నారు. కానీ చివరకు ఆ స్థానం బీజేపీకి వెళ్లడంతో ఆశాభంగానికి గురై.. టీడీపీ రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలుచేశారు.