
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంతో విమర్శల జోరు పెంచాయి అధికార, ప్రతిపక్షాలు. మంగళవారం బాగల్‌కోట్‌లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. కాంగ్రెస్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు. హస్తం పార్టీ దివాలా తీసిందని, ఆ పార్టీకి నాయకులే కరవయ్యారని ఎద్దేవా చేశారు. అందుకే బీజేపీ రెబల్ నాయకులపై ఆధారపడిందని సెటర్లు వేశారు. ఎన్నికలకు ముందు కమలం పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన వారికి టికెట్లు ఇస్తున్నారని, ఆ పార్టీ పరిస్థితికి ఇదే నిదర్శనమని ధ్వజమెత్తారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి సీనియర్లను పక్కనపెట్టింది బీజేపీ. యువ నేతలకు టికెట్లు కేటాయించింది. దీంతో చాలా మంది సీనియర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్, జేడీఎస్‌లో చేరారు. టికెట్లు ఖరారు చేసుకున్నాకే పార్టీ మారారు. ఈనేపథ్యంలోనే అమిత్‌షా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.
కాగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను ఒకే విడతలో మే 10న నిర్వహించనున్నారు. 13న కౌంటింగ్, ఫలితాలు ప్రకటిస్తారు. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు 2,613 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ఇటీవల నిర్వహించిన సీఓటర్ సర్వేలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని తెలిపింది. అధికార బీజేపీకి మెజారిటీ రాదని పేర్కొంది. దీంతో కాంగ్రెస్ దృఢ విశ్వాసంతో ముందుకెళ్తోంది. ఈసారి 150 స్థానాలకుపైగా కైవసం చేసుకుంటామని హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు.
చదవండి: షిండేకు ఊహించని షాకిచ్చిన బీజేపీ.. సీఎంగా తప్పుకోవాలని హుకుం..?
Comments
Please login to add a commentAdd a comment