Karnataka Assembly polls
-
‘కాంగ్రెస్ దివాలా.. అందుకే మాకు వద్దు అనుకుంటే వారికి ముద్దయ్యారు’
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంతో విమర్శల జోరు పెంచాయి అధికార, ప్రతిపక్షాలు. మంగళవారం బాగల్కోట్లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. కాంగ్రెస్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు. హస్తం పార్టీ దివాలా తీసిందని, ఆ పార్టీకి నాయకులే కరవయ్యారని ఎద్దేవా చేశారు. అందుకే బీజేపీ రెబల్ నాయకులపై ఆధారపడిందని సెటర్లు వేశారు. ఎన్నికలకు ముందు కమలం పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన వారికి టికెట్లు ఇస్తున్నారని, ఆ పార్టీ పరిస్థితికి ఇదే నిదర్శనమని ధ్వజమెత్తారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి సీనియర్లను పక్కనపెట్టింది బీజేపీ. యువ నేతలకు టికెట్లు కేటాయించింది. దీంతో చాలా మంది సీనియర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్, జేడీఎస్‌లో చేరారు. టికెట్లు ఖరారు చేసుకున్నాకే పార్టీ మారారు. ఈనేపథ్యంలోనే అమిత్‌షా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. కాగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను ఒకే విడతలో మే 10న నిర్వహించనున్నారు. 13న కౌంటింగ్, ఫలితాలు ప్రకటిస్తారు. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు 2,613 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ఇటీవల నిర్వహించిన సీఓటర్ సర్వేలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని తెలిపింది. అధికార బీజేపీకి మెజారిటీ రాదని పేర్కొంది. దీంతో కాంగ్రెస్ దృఢ విశ్వాసంతో ముందుకెళ్తోంది. ఈసారి 150 స్థానాలకుపైగా కైవసం చేసుకుంటామని హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు. చదవండి: షిండేకు ఊహించని షాకిచ్చిన బీజేపీ.. సీఎంగా తప్పుకోవాలని హుకుం..? -
కర్ణాటక బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల
బెంగళూరు/ఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 224 అసెంబ్లీ స్థానాలకుగానూ.. 189 మంది అభ్యర్థులతో తొలి జాబితాను మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. తొలి జాబితాలో 52 మంది కొత్త వారికి అవకాశం కల్పించింది. ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై షిగ్గావ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ వెల్లడించారు. "52 out of 189 are fresh candidates," says BJP's National General Secretary, Arun Singh#KarnatakaElections2023 pic.twitter.com/72I0DZdkqs — ANI (@ANI) April 11, 2023 #KarnatakaElections2023 | CM Basavaraj Bommai to contest from Shiggaon constituency: BJP's National General Secretary, Arun Singh pic.twitter.com/3kPMemsQyd — ANI (@ANI) April 11, 2023 -
కర్ణాటకలో పొత్తులపై అమిత్ షా కీలక ప్రకటన
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు వివిధ పార్టీలు పొత్తులపై కసరత్తు చేపట్టాయి. అయితే, అధికార బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోదని కుండబద్దలు కొట్టారు కేంద్రం హోంమంత్రి అమిత్ షా. రాష్ట్రంలో మూడింట రెండొంతులు మెజారిటీ సాధించి అధికారం చేపట్టేందుకు పార్టీ కార్యకర్తలు కష్టపడాలని సూచించారు. జేడీ(ఎస్)కి ఓటేస్తే అది కాంగ్రెస్‌కు వేసినట్లేనని చెప్పారు. 2023లో పార్టీ ఒంటరిగానే బరిలో నిలుస్తుందన్నారు. ‘కర్ణాటకలో ఈసారి త్రిముఖ పోరు ఉంటుందని జర్నలిస్టులు చెబుతున్నారు. కానీ, నేను ఈసారి ముఖాముఖి పోటీనే ఉండబోతుందని అంటున్నా. ఎందుకంటే జేడీఎస్‌కు ఓటేసినా అది కాంగ్రెస్‌కు వేసినట్లే అవుతుంది. బీజేపీ నేతృత్వంలోని దేశభక్తులకా? దేశాన్ని విభజించే కాంగ్రెస్ నేతృత్వంలోని తుక్డే తుక్డే గ్యాంగ్‌కా? ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో ప్రజలే తేల్చుకోవాలి.’అని ప్రజలను కోరారు అమిత్ షా. బీజేపీ తమతో పొత్తు పెట్టుకోబోతోందటూ జేడీఎస్ అసత్య ప్రచారాలు చేస్తోందని విమర్శించారు షా. ఒంటరిగానే పోటీ చేసి ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: భారత్‌లో ఉండాలని లేదా? ‘వాట్సాప్’కి కేంద్రం హెచ్చరిక! -
తెలంగాణలో ముందస్తు మేఘాలు!
సాక్షి, హైదరాబాద్: శాసనసభకు ముందస్తు ఎన్నికలు ఉండవని, నిర్దేశిత సమయంలోనే జరుగుతాయని సీఎం కె.చంద్రశేఖర్‌రావు పలు సందర్భాల్లో చెప్పారు. కానీ.. రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్లు, సొంత జాగాలో నివాసాలు, ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రాష్ట్ర సచివాలయ ప్రారంభం, దళితబంధు లాంటి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి దృష్టి సారించడం, వేల సంఖ్యలో కొలువులు భర్తీ చేయాలని నిర్ణయించడం..‘ముందస్తు’కు సంకేతాలేనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మరోవైపు ‘ఎమ్మెల్యేలకు ఎర’, రాష్ట్ర మంత్రులు లక్ష్యంగా ఐటీ దాడులు లాంటి పరిణామాలూ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వైపు మొగ్గుకు కారణం కావచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ‘ఎమ్మెల్యేలకు ఎర’ వెలుగు చూడటంతో బీజేపీ బాగా ఇరకాటంలో పడిందనే భావన టీఆర్ఎస్ అధిష్టానంలో ఉందని ఆ వర్గాలంటున్నాయి. రాష్ట్ర మంత్రులపై కక్షపూరితంగా జరుగుతున్న ఐటీ దాడులు ఉపకరిస్తాయన్న ఉద్దేశం కూడా ఉండొచ్చ ని చెబుతున్నాయి. సీఎం కేసీఆర్ డిసెంబర్ మొదటి వారం నుంచి జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టనుండటాన్ని ప్రస్తావిస్తున్నాయి. మరోవైపు ముందస్తు ఎన్నికల అంచనాతోనే బీజేపీ, కాంగ్రెస్ వంటి విపక్ష పారీ్టలు కార్యాచరణకు సిద్ధమవుతున్నాయనే చర్చ కూడా జరుగుతుండటం గమనార్హం. అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనాపరమైన అంశాల్లో వేగం పెంచారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో పాటు నిర్దిష్ట గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశిస్తున్నారు. రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్ల మరమ్మతు, ఆ«ధునికీకరణ పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో వచ్చే ఏడాది మార్చిలోగా పనులు పూర్తి చేసేలా కార్యాచరణపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయడం, సొంత జాగాలో ఇంటి నిర్మాణం చేసుకునేందుకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించడంపైనా ఎమ్మెల్యేలు దృష్టి సారించారు. దళితబంధు పథకం లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయడంతో పాటు యూనిట్ల మంజూరును కూడా పూర్తి చేయాలని భావిస్తున్నారు. అభివృద్ధి పనులన్నీ మార్చిలోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. సెక్రటేరియట్‌కు సంక్రాంతి ముహూర్తం? సచివాలయ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకోవడంతో ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ సంక్రాంతిని ముహూర్తంగా ఎంచుకున్నట్లు తెలిసింది. సెక్రటేరియట్‌కు ఎదురుగా నిర్మాణంలో ఉన్న అమరుల స్మారకాన్ని పూర్తి చేసి అదేరోజు ప్రారంభించేలా చూడాలని కూడా సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మరోవైపు 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని కూడా ఎన్టీఆర్ ఘాట్ పక్కనే వచ్చే నెల్లోనే ఆవిష్కరించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు కొలువుల భర్తీకి ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని సీఎం నిర్ణయించారు. తాజాగా శుక్రవారం ఏకంగా 9,168 గ్రూపు–4 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. టీఎస్పీఎస్సీతో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వరుసబెట్టి కలెక్టరేట్ల ప్రారంభోత్సవాలు డిసెంబర్ మొదటి వారం నుంచి జిల్లా కలెక్టరేట్ల భవనాలను వరుసగా ప్రారంభించేలా అధికారులు సీఎం పర్యటన షెడ్యూలు సిద్ధం చేస్తున్నారు. సీఎం జిల్లాల పర్యటన సందర్భంగా భారీ బహిరంగ సభలు కూడా జరుగుతాయని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు డిసెంబర్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, బడ్జెట్‌పై కేంద్రం విధిస్తున్న ఆంక్షలు, తదితరాలపై చర్చించనున్నారు. కేంద్రం కక్షపూరిత వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. అసెంబ్లీ సమావేశాల ఎజెండాపై రెండు రోజులుగా సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు ఈ కసరత్తులో కీలకంగా పనిచేస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గాలపై స్పెషల్ నజర్ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల బాట పట్టారు. ఓ వైపు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే సొంత నియోజకవర్గాన్ని, క్షేత్ర స్థాయిలో సంస్థాగత లోపాలను చక్కదిద్దుకోవడంపై దృష్టి సారించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మండలాల వారీగా పార్టీ కేడర్‌తో ఆతీ్మయ సమ్మేళనాల కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వంద మంది ఓటర్లకు ఒకరు చొప్పున ఇన్చార్జిల కోసం జాబితాల రూపకల్పనపై దృష్టి కేంద్రీకరించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటే..? వచ్చే ఏడాది జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఎదురయ్యే అనుకూల, వ్యతిరేక పరిణామాలతో పాటు ఇతర అంశాలపై సీఎం కేసీఆర్ ఇప్పటికే సంపూర్ణంగా కసరత్తు చేశారని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ పేరు భారత్ రాష్ట్ర సమితిగా మారే అంశంపై డిసెంబర్ మూడో వారంలో ఎన్నికల కమిషన్ నుంచి స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: Hyderabad: జనవరిలో నూతన భవనంలోకి యూఎస్ కాన్సులేట్ -
కాంగ్రెస్ టికెట్ కావాలా? దరఖాస్తు ఫీ రూ.2 లక్షలే.. వారికి 50% డిస్కౌంట్!
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి నుంచే అందుకు సన్నద్ధమవుతోంది కర్ణాటక కాంగ్రెస్. ఎన్నికల పట్ల అభ్యర్థులు సీరియస్‌గా ఉండేందుకోసమంటూ దరఖాస్తు ప్రక్రియను బుధవారం ప్రకటించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కావాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్. ఈ ప్రక్రియ 10 రోజుల పాటు సాగనుందన్నారు. ‘కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయాలనుకుంటున్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. దరఖాస్తు విండో నవంబర్ 5 నుంచి 15వ తేదీ వరకు 10 రోజుల పాటు తెరిచి ఉంటుంది. మా ఆఫీసులో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉన్నాయి. అప్లికేషన్ ఫీజు రూ.5,000. జనరల్ కేటగిరీ దరఖాస్తుదారులు రూ.2 లక్షల డిమాండ్ డ్రాఫ్ట్(డీడీ) ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు 50శాతం డిస్కౌంట్‌తో రూ.1 లక్ష కట్టాలి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. అందులో నేను సైతం ఉంటాను. నేను పోటీ చేయాలనుకుంటే, తప్పకుండా దరఖాస్తు చేసుకోవాల్సిందే.’అని తెలిపారు కేపీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్. ఈ ఫండ్స్‌ను పార్టీ నూతన భవనం నిర్మాణం సహా వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రకటనలు ఇచ్చేందుకు ఉపయోగిస్తామని తెలిపారు. మరోవైపు.. ఎన్నికలకు చాలా సమయం ఉన్నప్పటికీ ఈసారి దరఖాస్తులను ముందస్తుగానే ఆహ్వానిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల పట్ల అశ్రద్ధగా ఉన్నవారిని ఫిల్టర్ చేసేందుకే ఫీజును పెంచినట్లు చెప్పాయి. ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మార్గదర్శకత్వం, కాంగ్రెస్ భావజాలాన్ని నమ్మే వారు ఎవరైనా పార్టీలో చేరొచ్చని తెలిపారు డీకే శివకుమార్. ఆన్లైన్ సభ్యత్వ నమోదు కొనసాగుతోందని చెప్పారు. అలాగే.. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాష్ట్ర నేత మల్లికార్జున ఖర్గే బాధ్యతలు చేపట్టిన క్రమంలో ఆయనకు నవంబర్ 6న సర్వోదయ సమవేశం ద్వారా ఘన స్వాగతం పలకాలని ఏర్పాట్లు చేస్తోంది. ఇదీ చదవండి: ‘ఈ విచారణలేందుకు.. వీలైతే నేరుగా అరెస్ట్ చేయండి’.. జార్ఖండ్ సీఎం సవాల్ -
కర్ణాటక : కాంగ్రెస్‌కు 93–103, బీజేపీకి 83–93
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక అసెంబ్లీకి శనివారం జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని, హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని ‘పీపుల్స్ పల్స్’ తాజాగా నిర్వహించిన ముందస్తు పోలింగ్ సర్వేలో కూడా తేలింది. రాష్ట్ర అసెంబ్లీలో పాలకపక్ష కాంగ్రెస్ పార్టీయే అత్యధిక సీట్లను గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, ఆ తర్వాత స్థానాన్ని భారతీయ జనతా పార్టీ, తతీయ స్థానాన్ని జనతాదళ్ సెక్యులర్ పార్టీ దక్కించుకుంటుందని సర్వేలో వెల్లడైంది. రాజకీయ పరిశోధనా సంస్థ ‘పీపుల్స్ పల్స్’ సిబ్బంది, కన్నడ దిన పత్రిక ‘కోలర్‌వాణి’ సహకారంతో ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 9వ తేదీవరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు తిరిగి, అంటే దాదాపు 3,600 కిలోమీటర్లు ప్రయాణించి ఈ సర్వేను నిర్వహించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని, వివిధ వర్గాల ప్రజల అభిప్రాయలను సేకరించడం, గుణాత్మక ప్రశ్నావళి ద్వారా వారి నుంచి సరైన సమాధానాలు రాబట్టడం ద్వారా ఈ సర్వేను నిర్వహించింది. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పార్టీ ఓట్ల శాతం సీట్లు కాంగ్రెస్ 39.6% 93-103 బీజీపీ 34.2% 83-93 జేడీ(ఎస్) 21.6% 33-43 ఇతరులు 4.6% 2-4 సర్వే ఫలితాల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 93–103 వరకు, బీజేపీకి 83–93 వరకు, జేడీఎస్‌కు 33–43 వరకు, ఇతరులకు రెండు నుంచి నాలుగు సీట్లు వస్తాయి. కాంగ్రెస్ పార్టీకి 39.6 శాతం, బీజేపీకి 34.2. జేడీఎస్‌కు 21.6 శాతం, ఇతరులకు 4.6 శాతం ఓట్లు వస్తాయి. ఏ సర్వేలోనైనా మూడు శాతం అటు ఇటు, ఇటు అటు అయ్యే అవకాశం ఉంటుందని తెల్సిందే. చివరి రెండు రోజుల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం ప్రభావాన్ని, ఆఖరి నిమిషంలో నిర్ణయాన్ని మార్చుకునే ఓటర్ల సంఖ్యను సర్వేలో పరిగణించలేదు. పాలక, ప్రతిపక్ష సభ్యుల్లో ఎవరు విజయం సాధించినా వారి మధ్య ఓట్ల వ్యత్యాసం పెద్ద ఎక్కువగా ఉండదు. 43 అసెంబ్లీ స్థానాల్లో పోటీ నువ్యా, నేనా అన్నట్లుగా ఉంది. వీటిలో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ అభ్యర్థులు ఎవరైనా గెలవచ్చు. ఈ 43 స్థానాల్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయన్న అంశంపైనే ఏ పార్టీ రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న అంశం ఆధారపడి ఉంది. ప్రాంతాల వారిగా ప్రాంతం కాంగ్రెస్ బీజీపీ జేడీ(ఎస్) ఇతరులు దక్షిణ కర్ణాటక 38% 18% 35% 9% మధ్య కర్ణాటక 43% 38% 15% 4% హైదరాబాద్-కర్ణాటక 42% 33% 22% 3% ముంబై-కర్ణాటక 43% 43% 12% 2% కోస్టల్-కర్ణాటక 41% 42% 15% 2% బెంగుళూరు(రూరల్,అర్బన్) 33% 31% 28% 8% రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఏమాత్రం వ్యతిరేకత లేకపోవడం ఈ ఎన్నికల విశేషం. పైగా ఆయన ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు ప్రశంసిస్తున్నారు. పార్టీలకు అతీతంగా స్థానిక ఎమ్మెల్యే పనితీరునుబట్టి కొంత వ్యతిరేకత ప్రజల్లో కనిపించింది. అన్ని రకాల ప్రమాణాల్లో అంటే, అభివద్ధి, ప్రజల సంక్షేమం, సీఎం అభ్యర్థిత్వం పరంగా, స్త్రీలు, పురుషులు, చిన్నా, పెద్ద కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల, ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య పట్ల వారు సంతప్తితో ఉన్నారు. కర్ణాటక కోస్తాలో తప్పించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకే ఆధిక్యత కనిపిస్తోంది. జనాకర్షక సంక్షేమ పథకాలపై అవినీతి మచ్చ లేకపోవడం కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అంశం. ఏ కులం/మతం ఎంత శాతం కులం/మతం కాంగ్రెస్ బీజేపీ జేడీఎస్ ఇతరులు ఎస్సీ 51.0% 22.0% 21.0% 6.0% ఎస్టీ 50.0% 27.0% 18.0% 5.0% ముస్లిం 69.0% 12.0% 15.0% 4.0% ఇతర ఓబీసీలు 42.0% 35.0% 18.0% 5.0% అగ్రవర్ణాలు 21.0% 51.0% 23.0% 5.0% లింగాయత్‌లు 15.0% 65.0% 12.0% 8.0% ఒక్కలింగాస్ 24.0% 20.0% 52.0% 4.0% ఇతరులు 39.0% 35.0% 15.0% 11.0% కాంగ్రెస్ పార్టీకి ఎలాగైనా మట్టి కరిపించాలన్న లక్ష్యంతో ఎన్నికల బరిలోకి దిగిన భారతీయ జనతా పార్టీ ప్రజలపై అంతగా ప్రభావం చూపించలేక పోయిందనే చెప్పవచ్చు. నీతి నిజాయితీలు, ప్రజా సంక్షేమం, సుస్థిరత అంశాల్లో కాంగ్రెస్ కన్నా తాము మెరుగైన వారమని బీజేపీ నిరూపించుకోలేక పోయింది. హిందూత్వ ఎజెండాను ఒక్కదాన్నే నమ్ముకోవడం వల్ల కోస్తా ప్రాంతంలో అది ప్రభావం చూపించనుంది. మోదీ ఫ్యాక్టర్ కూడా ఆశించిన ఫలితం ఇవ్వడం లేదు. ముంబై–కర్ణాటక ప్రాంతం, ముఖ్యంగా బెల్గాం జిల్లా, కోస్తా ప్రాంతాల్లో ఆయన ప్రభావం ఉంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన కేజేపీ ఈసారి విలీనం అవడంతో లింగాయత్‌లను సమీకరించడంలో బీజేపీ విజయం సాధించింది. దళితులు , ఆదివాసీలు, ముస్లింలు, దిగువ ఇతర వెనకబడిన వర్గాల ప్రజల ఓట్లను సమీకరించడంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సంక్షేమ పథాకాలను అట్టడుగు వర్గాల వరకు తీసుకెళ్లడంలో పార్టీ విజయం సాధించడం, పార్టీ మధ్య ముఖ్యమంత్రి మధ్య మంచి సమన్వయం ఉండడం వల్ల ఇది సాధ్యమైంది. ద„ì ణ, మధ్య, హైదరాబాద్–కర్ణాటక ప్రాంతాల్లో జనాభా ప్రాతిపదికన కాంగ్రెస్ మెరుగైన స్థానంలో ఉంది. ఈ ప్రాంతాల్లో దళితులు, ఆదివాసీలు, ముస్లింలు ఎక్కువగా ఉండడమే అందుకు కారణం. లింగాయత్‌లు, మరాఠాలు, జైనులు, బ్రాహ్మణులు, కొంకణ భండారీలు, భంట్లు లాంటి సామాజిక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లేదు. వీరంతా బీజేపీ వైపే మొగ్గుచూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న ‘అహిందా’ (ఒక్కలిగేతర ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు, ముస్లింలు) దక్పథం ఫలించింది. అన్నభాగ్య లాంటి సంక్షేమ పథకాల ద్వారా వీరు కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. ఇక జెడీఎస్ దక్షిణ కర్ణాటకలో, బెంగళూరులోని ఒక్కలిగాలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో బలంగా కనిపించింది. కొన్ని ప్యాకెట్లలో ‘ఇప్పుడు కాకపోతే మరెప్పుడు కాదు’ అన్న విధంగా ఒక్కలిగాలు జేడీఎస్ నాయకుడు కుమారస్వామి తిరిగారు. ముస్లింలను, ఓబీసీలను, కొన్ని చోట్ల దళితులను ఆకర్షించడంలో కూడా ఆయన పార్టీ కొంత విజయం సాధించింది. దక్షిణ కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీలకన్నా ముందుంది. ముంబై–కర్ణాటక, కోస్తా కర్ణాటకలో పార్టీకి బొత్తిగా ఆదరణ లేదు. ఒక్కలిగాలు మినహా మిగతా అన్ని సామాజిక వర్గాల్లో ఎక్కువ మంది ముఖ్యమంత్రిగా సిద్ధ రామయ్యనే రుకుంటున్నారు. యెడ్యూరప్పను మాత్రం ఒక్కలిగాలు సమిష్టంగా కోరుకుంటున్నారు. సహజంగా రైతయిన యెడ్యూరప్ప అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం అందిస్తారని వారు భావిస్తున్నారు. పీపుల్స్ పల్స్–కోలరవాణి సర్వే నివేదికను పీపుల్స్ పల్స్ పీనియర్ ఎగ్జిక్యూటివ్, డాక్టర్ సజ్జన్ కుమార్ (జేఎన్‌యూ నుంచి సీపీఎస్‌లో పీహెచ్డీ) సంకలనం చేశారు. ఓట్ల శాతం–సీట్లు పార్టీ పేరు ఓట్ల శాతం సీట్ల సంఖ్య కాంగ్రెస్ 39.6 93–103 బీజేపీ 34.2 83–93 జేడీఎస్ 21.6 33–43 ఇతరులు 4.6 2–4 -
బాలయ్యకు సాయికుమార్ ఝలక్
సాక్షి, అనంతపురం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదని సినీ నటుడు, ‘డైలాగ్ కింగ్’ సాయికుమార్ అన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. చంద్రబాబు ధర్మదీక్ష సందర్భంగా ప్రధాని మోదీపై బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయన ఈవిధంగా స్పందించారు. మంగళవారం సాయికుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోసం ప్రధాని మోదీ కాళ్లు పట్టుకొని న్యాయం చేయమని అడుగుతానని చెప్పారు. కర్ణాటక శాసనసభా ఎన్నికల్లో చిక్‌బళ్లాపూర్ జిల్లా బాగేపల్లి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా సాయికుమార్ పోటీ చేస్తున్నారు. అయితే ఎన్నికల ప్రచారానికి హీరో బాలకృష్ణను పిలవడం లేదని ఆయన తెలిపారు. కాగా, 2008 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి సాయికుమార్ ఓటమిపాలయ్యారు. ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. -
యెడ్డీ సీఎం కాకుండా అడ్డుకునే వ్యూహం ఇది!
సాక్షి, బెంగళూరు: కర్ణాకట అసెంబ్లీ ఎన్నికల్లో లింగాయత్‌లకు మత మైనారిటీ హోదా అంశం కీలకంగా మారింది. ప్రతిపక్ష బీజేపీని ఇరకాటంలో నెట్టేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఈ అంశాన్ని తెరపైకి తెచ్చింది. లింగాయత్‌లకు మత మైనారిటీ హోదా కల్పిస్తూ.. కేబినెట్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. తద్వారా బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టింది. కర్ణాటకలో లింగాయత్‌ల జనాభా 17శాతం ఉంది. ఎన్నికలను ప్రభావితం చేసే కీలక సామాజికవర్గం కావడంతో కర్ణాటకలో లింగాయత్‌లను ఆకట్టుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు తాపత్రయపడుతున్నాయి. లింగాయత్ సామాజికవర్గానికి చెందిన బలమైన నేతగా పేరొందిన బీఎస్ యడ్యూరప్ప మరోసారి బీజేపీ గూటికి చేరడంతో ఆ వర్గం మరోసారి కమలదళానికి మద్దతుగా నిలుస్తుందని భావించారు. ఈ నేపథ్యంలో లింగాయత్ ఓటు బ్యాంకును చీల్చడానికే సిద్దరామయ్య సర్కారు మత మైనారిటీ హోదా అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇది నిజానికి ఇప్పటి తాజా సమస్య కాదు. లింగాయత్‌లకు ప్రత్యేక మత హోదా కల్పించాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. ఈ నేపథ్యంలో లింగాయత్‌లకు మత మైనారిటీ హోదా అంశంపై బీజేపీ ఎటూ తేల్చుకోలేకపోతుంది. ఈ అంశంపై ఇప్పుడే తమ వైఖరి వెల్లడించబోమని, ఎన్నికల తర్వాతే తమ వైఖరిని స్పష్టం చేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. యడ్యూరప్ప సీఎం కాకుండా అడ్డుకునేందుకే ఈ వ్యూహాన్ని తెరపైకి తెచ్చారని ఆయన విమర్శించారు. ‘ఇది యెడ్డీని సీఎం కాకుండా అడ్డుకునే వ్యూహం. లింగాయత్ ఓట్లను విభజించాలని సిద్దరామయ్య ప్రభుత్వం భావిస్తోంది. ఆ సంగతి లింగాయత్‌లకు తెలుసు. ఎన్నికల తర్వాతే బీజేపీ తమ వైఖరిని స్పష్టం చేస్తుంది’ అని అమిత్ షా శనివారం మీడియాతో తెలిపారు. -
బీజేపీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే జంప్!
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో జంప్ జిలానీల జోరు పెరిగింది. ప్రధాన పార్టీలు ప్రత్యర్థి శిబిరాల నుంచి నేతల వలసపై దృష్టిపెట్టాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే మాలికయ్యా వెంకయ్య గుత్తేదార్ పార్టీకి గుడ్‌బై చెప్పి.. బీజేపీలో చేరారు. మే 12 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇది అధికార కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ కానుంది. వెంకయ్య గుత్తేదార్ అఫ్జల్ పూర్ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఓసారి మంత్రి పదవి నిర్వహించారు. సీనియర్ నేత అయినప్పటికీ తనను సీఎం సిద్దరాయమ్య గుర్తించకపోవడం, మంత్రిమండలిలో తనను తీసుకోకపోవడంతో కాంగ్రెస్ పార్టీపై ఆయన గత కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్నారు. తాను కాంగ్రెస్‌ను వీడటానికి పార్టీ రాష్ట్ర నాయకత్వమే కారణమని ఆయన విమర్శించారు. గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప సమక్షంలో వెంకయ్య గుత్తేదార్.. కాషాయ కండువా కప్పుకున్నారు. తాను పార్టీకి రాజీనామా చేసేముందు ఆయన సీఎంకు ఫోన్లో తన నిర్ణయాన్ని తెలిపారు. యడ్యూరప్ప నాయకత్వంలో పనిచేయాలనే తాను బీజేపీలో చేరినట్టు ఆయన తెలిపారు. -
అది మీ మనస్సులోని మాటే కదా సర్!
కర్ణాటక ఎన్నికల ప్రచారం జోరందుకున్న వేళ.. సాక్షాత్తూ బీజేపీ జాతీయ సారథి అమిత్‌షా.. ప్రతిపక్షాలకు ఒక అస్త్రాన్ని అందించారు. కర్ణాటకలో ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వాల్లో అత్యంత అవినీతి చేసిన సర్కారు యడ్యూరప్పదేనంటూ అమిత్‌షా పేర్కొని..ఆ వెంటనే నాలుక కర్చుకున్నారు. యడ్యూరప్ప కాదు సిద్దరామయ్య.. సిద్దరామయ్య అంటూ నొక్కిచెప్పారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై అవినీతి ఆరోపణలు చేసే క్రమంలో షా ఇలా గజిబిజికి గురై.. యెడ్డీని ఇరికించడంతో ఇప్పుడు ప్రత్యర్థులు ఇదే అస్త్రంగా వాడుకొని విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నాయి. ఏనాడూ నిజాలు మాట్లాడని అమిత్ షా ఎట్టకేలకు నిజాన్ని మాట్లాడారు. థ్యాంక్యూ అమిత్ షా అంటూ కర్ణాటక సీఎం సిద్దరామయ్య ట్వీట్ చేశారు. ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా అమిత్ షాపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కర్ణాటకలో ఎన్నికలు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎట్టకేలకు నిజం వెలుగులోకి వచ్చింది. ఇది మీ మనసులోని మాట కదా అమిత్ షా సర్.. జస్ట్ అడుగుతున్నా’ అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. తమపై సిద్దరామయ్య చేసిన ఆరోపణలను తిప్పి కొట్టే క్రమంలో అమిత్ షా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ మధ్యే ఓ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి దేశంలో పెరిగిపోయిన అవినీతి గురించి మాట్లాడారు. ఇప్పటిదాకా తాను గమనించిన ప్రభుత్వాల్లో యాడ్యూరప్ప ప్రభుత్వమే అత్యంత అవినీతిమయమైందని ఆయన తెలిపారు’ అంటూ చెప్పుకొచ్చారు. దాంతో షా పక్కనే ఉన్న యెడ్డీ కంగుతున్నారు. పక్కన ఉన్న మరో నేత వెంటనే షా చెవిలో సిద్దరామయ్య అని చెప్పడంతో పొరపాటున గమనించి.. యాడ్యురప్ప కాదు.. సిద్ధరామయ్య అని సవరించుకున్నారు. -
కాంగ్రెస్‌దే మళ్లీ అధికారం.. అంత సీన్ లేదు!
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటుందంటూ తాజా సర్వే పేర్కొనడం.. రాజకీయంగా కలకలం రేపుతోంది. మొత్తం 224 ఎమ్మెల్యే స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 127 సీట్లు దక్కించుకోనుందని సీ-ఫోర్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. 2013లోనూ కర్ణాటక ఎన్నికలపై ఈ సంస్థ నిర్వహించిన సర్వే.. ఫలితాలను సరిగ్గా అంచనా వేసింది. అప్పటి ఫలితాలు నిజమైన నేపథ్యంలో తాజా సర్వేపై రాజకీయ నాయకులు భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇది కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా నిర్వహించిన సర్వే కావడంతో ప్రత్యర్థి పార్టీలు ఇది ఫేక్ సర్వే అని కొట్టిపారేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రీ-పోల్ సర్వే ఉత్త బోగస్ అని, మరికొన్ని నెలల్లో కాంగ్రెస్ పార్టీకి అసలు వాస్తవమేమిటో గట్టిగా తెలుస్తుందని బీజేపీ ఎద్దేవా చేసింది. జేడీఎస్ కూడా ఈ సర్వేను కొట్టిపారేసింది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 75 సీట్లకు మించి రావని జేడీఎస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవేగౌడ అన్నారు. -
రాహుల్ వచ్చారు.. సిద్దయ్య పోతారు!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కర్ణాటక ఎన్నికల్లో రాహుల్ ప్రచారం చేస్తుంటడంతో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయమని ఎద్దేవా చేసింది. ‘రాహుల్ వచ్చారు. సిద్దరామయ్య వెళ్లిపోతారు’ అంటూ బీజేపీ కర్ణాటక వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధర్‌రావు అన్నారు. రానున్న ఎన్నికల్లో సిద్దరామయ్య ఓడిపోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ‘గడిచిన ఐదు ఏళ్లలో సీఎం సిద్దరామయ్య ఏమీ చేయలేదు. ఇప్పటివరకు పడుకొని ఉండిపోయిన ఆయన.. ఇప్పుడు నిద్రలేచి.. తన కారునిండా ఇటుకలు పెట్టుకొని రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. ఎక్కడికి వెళితే.. అక్కడ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. సమయం ఉన్నప్పుడు ఏమీ చేయని సిద్దరామయ్య.. ఇప్పుడు నవకర్ణాటకను నిర్మిస్తున్నానని చెప్తూ.. ప్రజలను మోసం చేస్తున్నారు’ అని మురళీధర్‌రావు మండిపడ్డారు. తుముకూరులో నిర్వహించిన బీజేపీ గొల్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ణాకటలో యాదవ సామాజికవర్గం జనాభా 35 లక్షల వరకు ఉండటంతో వారిని ఆకట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. యాదవ సామాజిక వర్గానికి ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ సీట్లు కేటాయిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప హామీ ఇచ్చారు. -
నాకు ఎమ్మెల్యే టికెట్.. నా కూతురికి పదవి..: నటి తల్లి
సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చీఫ్ రమ్యా దివ్యస్పందన తల్లి సొంత పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. మాండ్యా నియోజకవర్గం నుంచి తనకు టికెట్ ఇవ్వాలని, తన కూతురికి పార్టీలో మంచి పదవి ఇవ్వాలని రమ్య తల్లి రంజిత డిమాండ్ చేశారు. ఒకవేళ తనకు టికెట్ ఇవ్వకపోతే.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయడానికి సిద్ధమని ప్రకటించారు. ఎట్టిపరిస్థితుల్లో తాను రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తానని ఆమె స్పష్టం చేశారు. ‘మాండ్యా నుంచి పోటీ చేయాలని భావిస్తున్నాను. ఈసారి టికెట్ నాకు ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్‌ను కోరారు. ఒకవేళ వారు టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను’ అని రంజిత మీడియాతో తెలిపారు. పార్టీ కోసం తన కూతురు రమ్య ఎంతో కృషి చేస్తోందని, ప్రస్తుతం ఏఐసీసీ సోషల్ మీడియా అధిపతిగా ఢిల్లీలో రమ్య సేవలు అందిస్తోందని, కానీ, ఈ పదవి సరిపోదని, మాండ్యా ప్రజలతో అనుసంధానమయ్యేందుకు వీలుగా రాష్ట్ర పదవి కూడా ఆమెకు ఇవ్వాలని, అప్పుడే ఆమె మరింతగా సమర్థంగా పనిచేసేందుకు వీలుంటుందని తెలిపారు. అయితే, తల్లి వ్యాఖ్యలపై స్పందించేందుకు రమ్య నిరాకరించారు. అదేవిధంగా మాండ్యా నుంచి తానే స్వయంగా పోటీచేయాలని రమ్య భావిస్తున్నట్టు కథనాలు రాగా.. వాటిని ఆమె కొట్టిపారేశారు. -
బీజేపీ సేవ్ బెంగళూర్ క్యాంపెయిన్
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ సేవ్ బెంగళూర్ కార్యక్రమాన్ని చేపట్టింది. నగరంలో సీఎం సిద్ధరామయ్య ప్రభావాన్ని తగ్గించేలా కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలతో ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రోజుకు రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టివచ్చేలా సేవ్ బెంగళూర్‌కు రూపకల్పన చేశారు. గత కొద్దిరోజులుగా బెంగళూర్‌లో సుడిగాలి పర్యటనలు చేస్తూ రోడ్లు, ఫ్లైఓవర్లను ప్రారంభిస్తూ హడావిడి చేస్తున్న సీఎం సిద్ధరామయ్యకు కౌంటర్‌గా బీజేపీ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు సంసిద్ధమైంది. బెంగళూర్‌లో నమ్మ మెట్రో, రహదారుల నిర్మాణం, అదనపు బస్సుల ద్వారా ప్రజా రవాణాను మెరుగుపరచడం వంటి అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిందని సీఎం సిద్ధరామయ్య ప్రచారం చేస్తున్న క్రమంలో దీన్ని దీటుగా తిప్పికొట్టేందుకు బీజేపీ సేవ్ బెంగళూర్ పేరిట కార్యాచరణకు దిగింది. కేంద్ర మంత్రులు అనంత్ కుమార్, డీవీ సదానందగౌడ, ప్రకాష్ జవదేకర్ల నేతృత్వంలో బసవనగుడి నియోజకవర్గంలో పాదయాత్రను ప్రారంభించారు. నగరంలోని అన్ని నియోజకవర్గాల్లో యాత్ర సాగేలా బీజేపీ శ్రేణులు సన్నాహాలు చేశాయి. బెంగళూర్ సిటీలో 28 అసెంబ్లీ స్ధానాలుండగా గత వీటిలో 13 స్ధానాల్లో కాంగ్రెస్, 12 స్ధానాల్లో బీజేపీ ప్రాతినిథ్యం వహిస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలోని అత్యధిక నియోజకవర్గాలను దక్కించుకోవాలని బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రతిష్టాత్మకంగా తలపడుతున్నాయి. -
కర్ణాటక ఎన్నికలు : రాహుల్ టెంపుల్ టూర్
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ దేవాలయాల సందర్శన కొనసాగుతోంది. సోమవారం రామ్దుర్గ్లోని గాడ్చి ఆలయాన్ని సందర్శించిన రాహుల్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు. రామ్‌దుర్గ్‌లో ఎన్నికల ర్యాలీలోనూ పాల్గొన్నారు. ఉత్తర కర్ణాటకలో మూడురోజుల పర్యటనలో భాగంగా పలు ప్రచార సభల్లో రాహుల్ ప్రసంగిస్తారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత పదిహేను రోజుల్లో రాహుల్ కర్ణాటక పర్యటన ఇది రెండవది కావడం గమనార్హం. ప్రచార సభల్లో ప్రధానంగా మోదీ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ రాహుల్ తన ప్రసంగాలకు పదును పెడుతున్నారు. మరోవైపు కర్ణాటకలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పర్యాయపదంగా మారిందని బీజేపీ చీఫ్ అమిత్ షా ఆరోపించారు. సిద్ధరామయ్య సర్కార్ అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. -
కర్ణాటకలో మెగా వార్
సాక్షి, బెంగళూర్: గుజరాత్లో హోరాహోరీ పోరు ముగిసిన క్రమంలో వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ముఖాముఖి తలపడనున్నారు. దక్షిణాదిలో పెద్దరాష్ట్రంలో అధికారం నిలుపుకునేందుకు సర్వశక్తులు ఒడ్డేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతుండగా, సౌత్‌లో పాగా వేసేందుకు కర్ణాటకను చేజిక్కించుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఇరు పార్టీలకు కర్ణాటక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారడంతో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు గుజరాత్ వార్‌ను మరిపిస్తాయని భావిస్తున్నారు.గుజరాత్లో ఎన్నికల తేదీలను ప్రకటించకముందే గుజరాత్లో కాంగ్రెస్, బీజేపీలు ప్రచారం ప్రారంభించడాన్ని బట్టి కర్ణాటక పోల్స్‌ను పార్టీలు ఎంత సీరియస్‌గా తీసుకున్నాయన్నది స్పష్టమవుతోంది. బీజేపీ హిందుత్వ కార్డును ప్రయోగిస్తుండగా, సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధే ప్రచారాస్త్రంగా బరిలో దిగింది. గుజరాత్లో బీజేపీకి దీటైన పోటీ ఇవ్వడంతో రాహుల్ విజయ యాత్రకు శ్రీకారం చుట్టామని, కర్ణాటకలో గెలుపొంది విజయాన్ని రాహుల్‌కు బహుమతిగా అందిస్తామని సీఎం సిద్ధరామయ్య చెబుతున్నారు.కర్ణాటకలో మోదీ మ్యాజిక్ పనిచేయదని స్పష్టం చేశారు.ఇక్కడ స్థానిక అంశాలే ప్రధానమని, ఇతర పార్టీల కంటే తామే ఎన్నికల రంగంలో ముందున్నామని చెప్పారు. 224 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 127గా ఉంది. అయితే సిద్ధరామయ్య సర్కార్ అవినీతిని ఎండగడుతూ బీజేపీ ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. గుజరాత్ విజయంతో సమరోత్సాహంతో కదులుతోంది. క్షేత్రస్ధాయిలో బలహీనంగా ఉండటం బీజేపీని కలవరపెడుతోంది. బీఎస్ యడ్యూరప్ప సీఎం అభ్యర్థిత్వాన్ని కూడా నేతలంతా ఆమోదించడం లేదు. సిద్ధరామయ్య సర్కార్‌పై అసంతృప్తి, మోదీ-షా కాంబినేషన్ తమకు కలిసివస్తుందని యడ్యూరప్ప ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాని పక్షంలో జేడీఎస్ కింగ్‌మేకర్ అవుతుంది. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రతిష్ట మసకబారితే, కాంగ్రెస్ కూడా క్షేత్రస్ధాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటోందని జేడీఎస్ రాష్ట్ర చీఫ్ హెచ్డీ కుమారస్వామి అన్నారు. -
ఈవీఎంలైతే ఎన్నికలు బహిష్కరిస్తాం..!
బెంగళూరు : ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం ( ఈవీఎం)లను ఉపయోగిస్తే కర్ణాటకలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలనే యోచనలో ప్రతిపక్షాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రతిపక్ష పార్టీలన్ని ఐక్యంగా ఎలక్షన్ కమిషన్‌పై ఒత్తడి తేవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీ దేశంలో జరిగిన అన్ని ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌తోనే గెలిచిందని ఆరోపించాయి. మోదీ ప్రభుత్వం ఏ బటన్ నొక్కినా బీజేపీకి ఓటు పడేటట్లు ఈవీఎంలను రూపొందించి ఎలక్షన్లలో గెలుస్తుందని విమర్శించారు. ఆమ్ఆద్మీ నేత అరవింద్ కేజ్రీవాల్, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ నేత మాయవతి, తృణమల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ, ఆర్జేడీ నేత లాలు యాదవ్, లెఫ్ట్ పార్టీ నుంచి సీతారం ఏచూరి ఈ మేరకు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ నిర్ణయంపై ఇంకా స్పందించలేదని సమాచారం. ఇక కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్న రాహుల్ గాంధీకి మోదీని ఎదుర్కునేందుకు కర్ణాటక ఎన్నికలు మంచి అవకాశం అని రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల యూపీలో జరిగిన లోకల్‌బాడీ ఎన్నికల్లో ఈవీఎంల ఉపయోగంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. బీజేపీ ఈవీఎంల ట్యాంపరింగ్‌తోనే గెలిచిందని మాయవతి బాహాటంగానే ఆరోపించగా.. మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ట్విట్టర్లో విమర్శించారు. బీజేపీకి ఈవీఎంలు ఉపయోగించని ప్రదేశాల్లో 46 శాతం ఓట్లు పోల్‌కాగా.. బ్యాలెట్ పేపర్ ఉపయోగించిన ప్రదేశాల్లో కేవలం 15 శాతం ఓట్లే నమోదయ్యాయని, బీజేపీ ఈవీఎంల రిగ్గింగ్ పాల్పడిందనడానికి ఇదే నిదర్శనమని ఆయన ట్వీట్ చేశారు. -
జగనన్నకు ఓటేద్దాం చలో చలో...
పలు ప్రాంతాల్లో వైఎస్ఆర్ సీపీ విస్తృత ప్రచారం బెంగళూరులో రెండు లక్షల మంది సీమాంధ్రులు వారిలో 75 శాతం మంది వైఎస్ఆర్ పథకాలతో లబ్ధి టీడీపీ ప్రలోభాలకు లొంగని వైనం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : సీమాంధ్రలో బుధవారం జరుగనున్న ఎన్నికల్లో పాల్గొనడానికి ప్రవాసాంధ్రులు సొంత ఊర్లకు పయనమవుతున్నారు. మంగళవారం రాత్రికల్లా అందరూ స్వగ్రామాలకు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నగరంలో చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం తదితర జిల్లాలకు చెందిన ఓటర్లు రెండు లక్షల మందికి పైగానే ఉన్నారు. ఉపాధి వేటలో వారు బెంగళూరులో స్థిరపడినప్పటికీ, ఎన్నికల సమయంలో స్వగ్రామాలకు వెళ్లి ఓట్లు వేసి రావడం ఆనవాయితీ. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయాల్లో కూడా సీమాంధ్రలోని పలు జిల్లాలకు ముఖ్య నాయకులు స్థానిక అభ్యర్థులు పలుచుకు వచ్చి ప్రచారం చేయిస్తుంటారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నగరంలో విస్తృతంగా ప్రచారం జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ స్మారక ఫౌండేషన్, వైఎస్ఆర్ యువ వేదిక ఆధ్వర్యంలో నగరంలో ప్రవాసాంధ్రులు ఉన్న ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా ప్రచారాన్ని నిర్వహించారు. ప్రవాసాంధ్రుల్లో సుమారు 75 శాతం మంది మహా నేత డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారే. వారంతా జగన్‌కు ఓటు వేయాలని పట్టుదలతో ఉన్నారు. తెలుగు దేశం పార్టీ నాయకులు కొందరు ఎంతగా ప్రలోభ పెట్టినప్పటికీ వారు లొంగలేదు. జగన్‌కు ఓటు వేయాలనే ప్రగాఢ కాంక్షను నెరవేర్చుకోవడానికి అందరూ సొంత ఊర్ల బాట పడుతున్నారు. ప్రచారం సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షుడు భక్తవత్సల రెడ్డి, కార్యదర్శి బత్తుల అరుణా దాస్, యువ వేదిక అధ్యక్షుడు ఎన్పీ. సురేశ్ కుమార్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రసూల్‌లు మహా నేత చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు జగన్ సారథ్యం అవసరాన్ని విడమరిచి చెప్పారు. ప్రచారంలో తమకు ప్రవాసాంధ్రుల నుంచి చక్కటి స్పందన వ్యక్తమైందని, జగన్‌కు ఓటు వేసి వస్తామని ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా చెప్పారని భక్తవత్సల రెడ్డి, సురేశ్ కుమార్ తెలిపారు.